Jump to content

దుర్భాక రాజశేఖర శతావధాని

వికీపీడియా నుండి
దుర్భాక రాజశేఖర శతావధాని
జననంకాళహస్తయ్య
నవంబర్ 18, 1888
వైఎస్ఆర్ జిల్లాజమ్మలమడుగు గ్రామం
మరణంఏప్రిల్ 30, 1957
ఇతర పేర్లురాజశేఖర శతావధాని
వృత్తిరాజకీయాలు
ప్రసిద్ధిప్రముఖ కవి, అవధాని
పదవి పేరుమునిసిపల్ కౌన్సిలర్, తాలూకా బోర్డు ఉపాధ్యక్షుడు
భార్య / భర్తలక్ష్మమ్మ
పిల్లలుకుమారుడు కామేశ్వరయ్య, కుమార్తె కామేశ్వరీదేవి
తండ్రిదుర్భాక వెంకటరామయ్య
తల్లిసుబ్బమ్మ

దుర్భాక రాజశేఖర శతావధాని (నవంబర్ 18, 1888 - ఏప్రిల్ 30, 1957) [1] వైఎస్ఆర్ జిల్లా అవధానులలో మొదట చెప్పుకోదగిన వాడు. లలిత సాహిత్య నిర్మాత. పండితుడు. ప్రొద్దుటూరు నివాసి. వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగులో 1888లో జన్మించాడు. గడియారం వేంకట శేషశాస్త్రితో కలిసి "వేంకట - రాజశేఖర కవులు" అనే జంటపేరుతో 1920-1928 మధ్యకాలంలో అనేక శతావధానాలు నిర్వహించాడు.

విద్యాభ్యాసము

[మార్చు]
  • 1904-1907ల మధ్య కందాళ దాసాచార్యులు, జనమంచి శేషాద్రిశర్మ ల వద్ద సంస్కృతాంధ్రాలు, నాటకాలంకార శాస్త్రాలు చదివాడు.
  • 1907లో కడప ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడైనాడు.
  • మద్రాసు క్రైస్తవ కళాశాలలో ఎఫ్.ఎ.చదువుతూ మధ్యలో ఆపివేశాడు.

ఉద్యోగాలు

[మార్చు]
  • 1908 నుండి ప్రొద్దుటూరు లోని జిల్లా మునసబు కోర్టులో గుమాస్తాగా పనిచేసి గాంధీ ఉద్యమ ప్రభావంతో 1921లో ఉద్యోగం మానివేశాడు.
  • ప్రొద్దుటూరు మునిసిపల్ కౌన్సిలర్‌గా పనిచేశాడు. 1928లో వైస్ ఛైర్మన్‌గా ఉన్నాడు.
  • 1927- 1932ల మధ్య ప్రొద్దుటూరు తాలూకా బోర్డు ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు.
  • మద్రాసు సెనేట్ సభ్యుడిగా, వేదపాఠశాల కార్యదర్శిగా సేవలను అందించాడు.

రచనలు

[మార్చు]
  • రాణాప్రతాపసింహచరిత్ర[2]
  • అమరసింహచరిత్ర
  • వీరమతీ చరిత్రము
  • చండనృపాల చరిత్రము
  • పుష్పావతి
  • సీతాకల్యాణము (నాటకము)
  • సీతాపహరణము (నాటకము)
  • వృద్ధిమూల సంవాదము (నాటకము)
  • పద్మావతీ పరిణయము (నాటకము)
  • విలయమాధుర్యము
  • స్వయంవరము
  • అనఘుడు
  • గోదానము
  • శరన్నవరాత్రులు
  • అవధానసారము
  • రాణీసంయుక్త (హరికథ)
  • తారాబాయి (నవల)
  • టాడ్ చరిత్రము
  • రాజసింహ
  • ది హీరోయిన్ ఆఫ్ హిందూస్తాన్ (ఆంగ్లంలో)
  • కామేశ్వరీ స్తోత్రమాలా (సంస్కృతంలో)

బిరుదులు

[మార్చు]

కవిసార్వభౌమ, కావ్యకళానిధి, కళాసింహ, అవధానిపంచానన, వరచారిత్ర కవిత్వభారతి, కవిబ్రహ్మర్షి మూర్ధన్య అన్నవి వీరి బిరుదులు.

మూలాలు

[మార్చు]
  1. రాయలసీమ రచయితల చరిత్ర - కల్లూరు అహోబలరావు,శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల,హిందూపురం
  2. [1] డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో