Jump to content

అమరసింహచరిత్ర

వికీపీడియా నుండి

అమరసింహ చరిత్ర దుర్భాక రాజశేఖర శతావధానిచే రచించబడిన చారిత్రక కావ్యము. దీనిని తన 62వ యేట రచించాడు. 2000 పద్యాలకు పైగా ఉన్న ఈ మహాకావ్యంలో 11 ఆశ్వాసాలు ఉన్నాయి. కథాసందర్భముననుసరించి ఈ ఆశ్వాసాలకు ఈ క్రింది విధంగా పేర్లు పెట్టాడు.

  1. సంబోధనము
  2. సంప్రార్థనము
  3. సన్నాహము
  4. సంస్థాపనము
  5. సంబంధము
  6. సంవర్తనము
  7. సంత్యాగము
  8. సంయోగము
  9. సంభావనము
  10. సంఘర్షణము
  11. సంధ్య

కథాసంగ్రహము

[మార్చు]

జగదేకవీరుడై రాజపుత్రులలో ప్రశస్తి గాంచిన రాణాప్రతాపసింహుని కుమారుడు రాణా అమరసింహుడు. అతని చరిత్రయే ఈ ప్రబంధకావ్యము. దీనిలో ఈ క్రింది ఘట్టాలు ఉన్నాయి.

రాణా అమరసింహుని కామినీలోలత్వము, రాజకార్యవిముఖత, సలుంబా కృష్ణభూపతి ఉపదేశము, తన అకృత్యమునకు అమరసింహుడు పశ్చాత్తాప పడుట, కృష్ణభూపతి హృదయపరివర్తనము, మేవాడు రాజ్యాధిపతి అమరసింహునిపై సమరానికి ప్రయత్నించే తురుష్క ప్రభువు జహంగీరు మౌఢ్యము, వంగదేశాధిపతికి మానసింహుని హితబోధ, తన మాటవినని జహంగీరుపై మానసింహుడి కోపము, జహంగీరు పాదుషా యవన సైన్యాధ్యక్షులైన అబ్దుల్లాఖాన్, మహాబత్‌ఖాన్‌లకు బలపరాక్రమాలను నూరిపోసి రణరంగానికి పంపుట, వారు కేశసింహునిచేతను, కృష్ణసింహుని చేతను పరాజితులై ఢిల్లీకి పారిపోవుట, జహంగీరు పాధుషా చిత్తోడు పురమునకు సాగరసింహుని పట్టాభిషిక్తుని గావించే రాజకీయ కుటిలనీతి, సలుంబాకృష్ణుని తీర్థయాత్ర, యవనసైనికులు అమరసింహుని బంధించుట, బలసింహుడు మొదలైన వీరులు తమ ప్రభువును విడిపించుట, దూడాసింహుని సాహసోద్రేకాలు, సాగరసింహుడు సూర్యవంశస్థులైన చక్రవర్తుల ఘనతను పొగడుట మొదలైనవి.

మూలాలు

[మార్చు]