రావినూతల శ్రీరాములు
రావినూతల శ్రీరాములు బహు గ్రంథకర్త, ప్రముఖ వ్యాసరచయిత. శ్యామప్రియ ఇతని కలం పేరు. ఇతడు వృత్తిరీత్యా సబ్-రిజిస్ట్రారుగా సేవలందించి పదవీవిరమణ పొందినాడు. ఇతడు 1936, అక్టోబరు 12న ప్రకాశం జిల్లా, మామిడిపాడు గ్రామంలో జన్మించాడు. తల్లి అనసూయమ్మ, తండ్రి సత్యనారాయణరెడ్డి, ఈయన బి.ఎ.,.ఎల్.ఎల్.బీ. పట్టభధ్రుడు. సబ్ రిజిస్ట్రార్ గా చేస్తూ, 1993 ఆగస్టు 30 న స్వచ్చందంగా పడవీవిరమనచేశాడు. పడికిపీగా దేశభక్తి రచనలు, 12 సాహిత్య సంబంధ రచ్చను వెలువరించారు. పరిశోధించి నూరుమంది దేశభక్తుల, సాహితీపరుల జీవితాల్ని పుస్తకాలుగా తెచ్చారు. తూముకుంట భీమ్ సేన్ రావు సప్తతి, పప్పూరు రామాచార్యులు 85 వ జయంతి సంచిక, మద్దూరి అన్నపూర్ణఅయ్య శతజయంతి సంచికల్కు సంపాదకులుగా పనిచేశారు. స్వీయ జీవిత వహసరిత్రను అంతర్మథనం పేరుతో 2017 లో ప్రచురించారు. నిండు జీవితం జీవినచ్చి 2023, జులై 1 న వీరు మరణించారు.[1]
రచనలు
[మార్చు]- మహాత్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య జీవితచరిత్ర[2]
- పేదలపెన్నిది (గుత్తి కేశవపిళ్ళై జీవితగాథ)
- ప్రజలమనిషి ప్రకాశం
- ఆంధ్రకేసరి ప్రకాశం
- ధ్రువతార (పొట్టిశ్రీరాములు జీవితగాథ)[3]
- అరుణగిరి యోగులు
- దాక్షిణాత్య భక్తులు
- దక్షిణాది భక్తపారిజాతాలు
- సుందరకాండము (నవరత్నమాల)
- అచల రమణుడు
- బ్రహ్మర్షి దైవరాత
- మహాతపస్వి కావ్యకంఠ గణపతిముని
- బి.వి.నరసింహస్వామి
- ప్రతిభాశాలి (పప్పూరు రామాచార్యులు జీవితకథ)
- కల్లూరి మనీషి
- ధన్యజీవి
- చీమకుర్తి శేషగిరిరావు
- బాపూజీ రామమంత్రము
- పప్పూరి రామాచార్యుల ఆముక్తమాల్యద
- జవహర్‌లాల్ నెహ్రూ జీవితకథ, సూక్తులు
- మహామనిషి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ సంక్షిప్త జీవితపరిచయం
- జాతీయ పతాకం - గీతం
- గ్రేట్ సెయింట్స్ ఆఫ్ సౌత్ ఇండియా
- అంతర్మథనం స్వీయచరిత్ర, ఏంఎస్.కొ ప్రచురణ, 2017.
అవార్డులు
[మార్చు]- 1977లో జాతీయ అవార్డు
- 1997లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారం
- 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం
- 2016లో సద్గురు శివానందమూర్తి గారి సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి ప్రతిభా పురస్కారం
మూలాలు
[మార్చు]- ↑ ABN (2023-07-12). "అసమాన వ్యక్తిత్వాల చరిత్రకారుడు". Andhrajyothy Telugu News. Retrieved 2026-01-29.
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో మహాత్యాగి పుస్తకప్రతి
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో ధ్రువతార పుస్తకప్రతి