పూతలపట్టు శ్రీరాములురెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూతలపట్టు శ్రీరాములురెడ్డి
జననంపూతలపట్టు శ్రీరాములురెడ్డి
ఏప్రిల్ 5, 1892
చిత్తూరుజిల్లా, పూతలపట్టు గ్రామం
మరణంనవంబర్ 8, 1971
ప్రసిద్ధికవి, అనువాదకుడు
మతంహిందూ
పిల్లలునలుగురు కుమార్తెలు
తండ్రిపెద్దబుచ్చిరెడ్డి
తల్లిలక్ష్మమ్మ

ఆంధ్ర కంబర్‌గా ప్రసిద్ధి చెందిన పూతలపట్టు శ్రీరాములురెడ్డి (ఏప్రిల్ 5, 1892 - నవంబర్ 8, 1971) [1] ప్రముఖ తెలుగు కవి, అనువాదకులు.

జీవిత సంగ్రహం

[మార్చు]

ఈయన 1892 ఏప్రిల్ 5లో లక్ష్మమ్మ, పెద్దబుచ్చిరెడ్డి దంపతులకు చిత్తూరు జిల్లా పూతలపట్టు గ్రామంలో జన్మించాడు. ఇతడు ప్రాథమిక విద్య పాఠశాలలో చదువుకొన్నాడు. తరువాత స్వయంకృషితో ఆంధ్ర, తమిళ, సంస్కృత సాహిత్యాలు చదువుకున్నాడు. ఇతని తండ్రి హరికథలను చెప్పేవాడు.

మద్రాసు విశ్వవిద్యాలయం నిర్వహించిన విద్వత్ పరీక్షలోఉత్తీర్ణులై తెలుగు పండితులుగా ఉద్యోగ జీవితాన్ని ప్ర్రారంభించాడు.[2] విద్యాబోధన చేస్తూ రచనా వ్యాసంగాన్ని సాగించాడు. బమ్మెర పోతన వలెనే భక్తిరస ప్రధానమైన రచనలపై మొగ్గుచూపాడు. తమిళంలో ప్రసిద్ధిచెందిన కంబ రామాయణం, తిరుక్కురళ్, శాండియార్, శిలప్పదిగారం, మణిమేఖల కావ్యాలు తెలుగులోకి అనువాదం చేసి కవిపండితుల మెప్పు పొందాడు. ఇవికాక కుమార సంభవం కావ్యాన్ని తెలుగుసేతను గావించాడు. తెలుగు సందేశం, నీతి నిధి, సుభాషిత భండారం, చిత్తూరు మండల ప్రశస్తి మొదలైన ఇరవై పద్యకావ్యాలు రచించారు. వీరు 8 వరకు గద్య రచనలు కూడా చేశారు. వానిలో సుజ్ఞాన బోధిని, సురాభాండేశ్వరం, విశ్వామిత్ర చరిత్రం, బాల వినోదిని గ్రంథాలు ప్రముఖమైనవి. వీటిలో సంతృప్తిచెందక, ఆంధ్ర భాషా లక్షణ లక్షణం, తెలుగు లక్షణం (3 భాగాలు) నిర్మాణ కలనం (3 భాగాలు), విద్యార్థి కోశం వంటి లక్షణ గ్రంథాలను కూడా రచించి లాక్షణికులుగా ప్రసిద్ధిపొందాడు.

ఇతడు 1971 నవంబర్ 8 తేదీన మాణించాడు.

వేలాదిమంది శిష్యులు, మిత్రులు, బంధువులు, అభిమానులు కలసి ఇతని సేవలకు గుర్తింపుగా వీరి కాంస్యవిగ్రహాన్ని పూతలపట్టు ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఆవిష్కరించారు.

బిరుదులు

[మార్చు]
 1. విద్వత్కవికులతిలక
 2. సాహిత్య రత్నాకర
 3. కవితాతపస్వి
 4. అభినవ పోతనామాత్య
 5. మహాకవి
 6. ఆంధ్ర కంబర్

సత్కారాలు, పదవులు

[మార్చు]
 • పూతలపట్టు గ్రామ ప్రజలచే పల్లకీ ఊరేగింపు
 • ఆంధ్ర నలంద గుడివాడ వారిచే బంగారు పతకం
 • తమిళనాడు కారక్కుడిలో జరిగిన కంబకవి వార్షికోత్సవంలో కనకాభిషేకం
 • ఆంధ్ర కళాపరిషత్ అధ్యక్షుడు 1953లో
 • సెనేట్ సభ్యుడు - శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి.
 • సభ్యుడు - ఆంధ్ర సాహిత్య అకాడెమీ, హైదరాబాదు
 • రాష్ట్రపతిచే మంజూరైన గౌరవ వేతనం మరణించేదాకా.

రచనలు

[మార్చు]
 1. కంబరామాయణం[3] (2 సంపుటాలు) (తమిళం నుండి అనువాదం)
 2. నాలడియారు (తమిళం నుండి అనువాదం)
 3. పెరియ పురాణము (తమిళం నుండి అనువాదం)
 4. శిలప్పదికారము (అందియకత) (తమిళం నుండి అనువాదం)
 5. మణిమేఖల (తమిళం నుండి అనువాదం)
 6. సూక్తిసుధ
 7. తెనుగు సందేశము
 8. త్రివర్గము
 9. నీతిగుచ్చము
 10. కుమారసంభవము (సంస్కృతం నుండి అనువాదం)
 11. ప్రశ్నోత్తర రత్నావళి (సంస్కృతం నుండి అనువాదం)
 12. సురాభాండేశ్వరము (1953) [4] ఇది చిత్తూరు జిల్లా వాయల్పాడు తాలూకాలో కలకడ గ్రామంలో వెలసిన సురాభాండేశ్వరుడు గురించిన స్థలపురాణం.
 13. భక్తిమాల (పెద్దపురాణము)
 14. మధురకవితా సంహిత
 15. త్రికటుకము
 16. అభిదాన దర్పణము

మూలాలు

[మార్చు]
 1. రాయలసీమ రచయితల చరిత్ర రెండవ సంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
 2. శ్రీరాములురెడ్డి, పూతలపట్టు, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీలు: 869-70.
 3. [https://archive.org/details/in.ernet.dli.2015.372207 డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో
 4. భారత డిజిటల్ లైబ్రరీలో సురాభాండేశ్వరము పుస్తక ప్రతి.