కప్పగల్లు సంజీవమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కప్పగల్లు సంజీవమూర్తి
జననంకప్పగల్లు సంజీవమూర్తి
(1894-02-07)1894 ఫిబ్రవరి 7
India కప్పగల్లు గ్రామం, బళ్ళారి, కర్ణాటక రాష్ట్రం
మరణం1962 జూన్ 13
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధికవిభూషణ
మతంహిందూ (బ్రాహ్మణ)
తండ్రికరణము భీమరావు
తల్లిమల్లమ్మ

జీవిత విశేషాలు[మార్చు]

కప్పగల్లు సంజీవమూర్తి[1] (ఫిబ్రవరి 7, 1894 - జూన్ 13, 1962) ఉపాధ్యాయుడు, రచయిత.

జననం[మార్చు]

1894 వ సంవత్సరము ఫిబ్రవరి 7 వ తేదీ బళ్లారి జిల్లా కప్పగల్లు గ్రామంలో భీమరావు మల్లమ్మ దంపతులకు జన్మించాడు. హిందూ మధ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందిన సంజీవమూర్తి గౌతమ గోత్రజుడు. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడు. ఇతడు మద్రాసులో ఎస్.ఎస్.ఎల్.సి చదివి ఉత్తీర్ణుడైనాడు. బళ్ళారి మునిసిపల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశాడు.

మరణం[మార్చు]

1962, జూన్ 13 వ తేదీన మరణించాడు.

రచనలు[మార్చు]

 1. మేఘ ప్రతి సందేశము (1937)
 2. మయూరధ్వజ చరిత్రము
 3. శ్రీ వరసిద్ధి వినాయక స్తవము (1958)
 4. వంశము
 5. గీతాసుధాసారము
 6. నవ్యగాథాలహరి
 7. ఒక శరద్రాత్రి అది
 8. వేణువు
 9. అహల్య (ద్విపద)
 10. ద్రౌపదీ మానసంసరక్షణ
 11. కీ.శే. కోలాచలం శ్రీనివాసరావు గారి జీవితము (గద్యం)
 12. కీ.శే. ధర్మవరం రామకృష్ణమాచార్యుల జీవిత సంగ్రహము (గద్య పద్యములు)(1956)
 13. బళ్ళారి మునిసిపల్ ఉన్నత పాఠశాల చరిత్ర (గేయము) (1954)
 14. భరతనారి ధన్య
 15. సుమకరండము
 16. విజయాభిమన్యు (నాటకం)
 17. మయూరధ్వజము (నాటకం)
 18. శివాజి (నాటకం)
 19. గయోపాఖ్యానము (నాటకం)
 20. వేనుడు (నాటకం)
 21. రుక్మిణీ కల్యాణము
 22. కృష్ణరాయబారము
 23. ಭಕ್ತ ಸುಧನ್ವ‌ (కన్నడ నాటకం)
 24. ಗೀತಾಸುಧಾಸಾರ‌ (కన్నడ)

బిరుదము[మార్చు]

 • కవిభూషణ

మూలాలు[మార్చు]

 1. రాయలసీమ రచయితల చరిత్ర మొదటి సంపుటి - కల్లూరు అహోబలరావు - శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల - హిందూపురం -1975 - పేజీలు 30-35