కలుగోడు అశ్వత్థరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కలుగోడు అశ్వత్థరావు
జననంకలుగోడు అశ్వత్థరావు
(1901-07-25)1901 జూలై 25
India కలుగోడు గ్రామం, గుమ్మగట్ట మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం1972 జూలై 19
వృత్తికరణము
ప్రసిద్ధిప్రముఖ తెలుగు,కన్నడ కవి
మతంహిందూ
తండ్రికలుగోడు వెంకోబరావు
తల్లిలక్ష్మమ్మ

బడగనాడు శాఖకు చెందిన మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో వెంకోబరావు, లక్ష్మమ్మ దంపతులకు కలుగోడు అశ్వత్థరావు (జూలై 25, 1901 - జూలై 19, 1972) [1] 1901 వ సంవత్సరం జూలై 25 వ తేదీన జన్మించాడు. కేవలం నాలుగవ తరగతి వరకే చదివిన ఇతడు సహజంగా అబ్బిన విద్యతోపాటు స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు.అనంతపురం జిల్లా, గుమ్మఘట్ట మండలం లోని కలుగోడు లోను, కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా తళుకు గ్రామంలోను కరణముగా పనిచేశాడు. ఈ రెండు గ్రామాలలోను ఇతనికి చాలినన్ని భూములున్నాయి. ఇతని జీవితం హాయిగా గడచింది.ఇంటికి వచ్చిన అతిథులను గొప్పగా సత్కరించేవాడు.తన గ్రంథాలను ప్రచురించుకోవటానికి స్వంతంగా రాయదుర్గంలో కవిరాజ ముద్రాక్షరశాలను నెలకొల్పాడు. తన చివరి దశలో దీనిని రాయల పరిషత్తుకు ఉచితంగా ఇచ్చివేశాడు.

రచనలు

[మార్చు]
  1. సర్వజ్ఞునివచనములు - కన్నడభాష నుండి తెలుగులోనికి అనువాదం
  2. ವೇಮನ ರತ್ನಗಳು - వేమన పద్యాలను కన్నడ భాషలోనికి అనువాదం
  3. అనుభవామృత సారము - మహాలింగ రంగ కన్నడలో వ్రాసిన అనుభవామృత అనే అద్వైత వేదాంత గ్రంథానికి తెలుగు అనువాదం
  4. సోమేశ్వర శతకము - పాల్కురికి సోమనాథుని కన్నడ శతకానికి తెలుగు అనువాదం
  5. హరిభక్తసారము - కనకదాసు కన్నడరచనకు తెలుగు సేత
  6. ಭಾಗವತ ಗೀತಿಗಳು - పోతనభారతంలోని గజేంద్రమోక్షము, రుక్మిణీకళ్యాణము, ప్రహ్లాదచరిత్ర, వామనచరిత్ర ఘట్టాల కన్నడానువాదము
  7. ಶೃಂಗಾರ ವರೂಧಿನಿ - మనుచరిత్ర కన్నడానువాదము
  8. ಕಂದಪದ್ಯ ರಾಮಾಯಣ - స్వతంత్ర కన్నడ రచన
  9. ಶ್ರೀಕೃಷ್ಣಲೀಲೆ (ಬೈಲು ನಾಟಕ) - స్వతంత్ర కన్నడ వీధి నాటకము
  10. ಸುಭದ್ರಾಪರಿಣಯ ನಾಟಕ - స్వతంత్ర కన్నడ రచన
  11. గధాయుద్ధము - రన్న కవిచే రచింపబడిన ಸಾಹಸ ಭೀಮ ವಿಜಯ అనే కన్నడ కావ్యానువాదము
  12. దండకరామాయణము
  13. అశ్వత్థ భారతము (ఆది చతుష్కము మాత్రము)
  14. అశ్వత్థేశ త్రిశతి (కందములు)
  15. మూడు శతకములు
  16. మయూరధ్వజము (నాటకము)
  17. యువతీ వివాహభాగ్యోదయము (నాటకము)
  18. అక్కమహాదేవి వచనములు
  19. బ్రాహ్మణుడు
  20. గురుదక్షిణ

రచనల నుండి ఉదాహరణలు

[మార్చు]
  • దండకరామాయణం నుండి మచ్చుకు కొంతభాగము:- కైకేయి: "హా నాథా! మత్ప్రేమనాథా! ధరానేత్రునేతా!ప్రతాపాధినాథున్ నిన్ను భర్తగా బొందియున్ నే నథా కృతిన్ గుందెదన్ మోహనాంగా! మదీ యేప్సితార్థంబు దీర్పంగ నేనుంటినం చంటివే? అంత భాగ్యంబు నాకున్నదే? సత్యమున్ బల్కుదే? బాళి నీ వంతగా నాయెడన్ జుల్కుదే? పల్కవే!" యన్న భూనాథు "డో మానిని! నా యెడన్ నీకు సందేహ మిట్లుండ నే హేతువో? నాతిరో! మున్ను కన్నావటే నా యుదాసీన భావంబు నీపట్ల?నీకై చితిన్ దూకగా వచ్చినన్ దూకెదన్ గోర్కె నేదీర్తు, నీడేర్తు నో కామినీ! కోరుమం"చన్న, నా జాణ వేలేచి, ముద్దారగా గౌగిటన్ గ్రుచ్చి, యా వృధ్దు మాయా విమోహంబులన్ గుప్పి, తీపౌ చమత్కారపున్ భాషణల్ సెప్పి, యిట్లాడు.....

బిరుదములు,పురస్కారములు

[మార్చు]
  • కవిరాజ
  • 1967 మే 6వ తేదీ హిందూపురంలో రాయలకళాపరిషత్ సత్కరించి కవిసవ్యసాచి బిరుదును ప్రదానం చేసింది.[2]
  • ఉభయభాషాభాస్కర

మూలాలు

[మార్చు]
  1. రాయలసీమ రచయితల చరిత్ర - రెండవసంపుటి - కల్లూరు అహోబలరావు
  2. సీమసాహితీ స్వరం శ్రీసాధన పత్రిక - డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి పుట 240