టేకుమళ్ల కామేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టేకుమళ్ళ కామేశ్వరరావు
జననం22-03-1907
వృత్తిరచయిత
జీవిత భాగస్వామిహనుమాయమ్మ(ద్వితీయ కళత్రము)
తల్లిదండ్రులు
  • టేకుమళ్ల అచ్యుతరావు (తండ్రి)
  • విశాలాక్షి (తల్లి)

టేకుమళ్ల కామేశ్వరరావు కవి, విమర్శకుడు.జానపద వాజ్మయం లోనూ, బాల వాజ్మయం లోనూ ఎక్కువగా కృషి చేశాడు. పాత పాటలు జోల పాటలు సేకరించి ప్రచురించాడు. వ్యవహారిక భాషకు కూడా కొన్ని నియమాలు అవసరమనే అభిప్రాయమున్న వ్యవహారిక భాషవాది.

జీవిత విశేషాలు

[మార్చు]

తండ్రి టేకుమళ్ల అచ్యుతరావు వాజ్మయ విమర్శకుడు, బహుగ్రంథకర్త. ఇతడికి చిన్నప్పటి నుండే కవిత్వం వ్రాయడం అభ్యాసమైనది. బళ్లారిలో చదివాడు. 1927లో వివాహం జరిగింది. 1933లో ఉపాధ్యాయుడుగా ఉద్యోగం ప్రారంభించి స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా రాయలసీమ,ఉత్తర సర్కారు జిల్లాలలో పనిచేశాడు.1935లో భార్యావియోగం కలుగగా అదే సంవత్సరం రెండవ వివాహమైనది.

ఈయన రాసిన రోజా కథ చదివిన గిడుగు రామ్మూర్తి పంతులు గారు దేశ భాషలో ఎంతో కృషి చేసాను ఎందుకు? ఇటువంటి కథ ఒక్కటి రాసివుంటే ఎంత బాగుండేది అని మెచ్చుకున్నారు.

రచనలు

[మార్చు]
  1. రోజా (కథా సంపుటము)
  2. జానకి ప్రేమ (కథా సంపుటము)
  3. వెలుగు
  4. పాలపిట్ట
  5. మిణుగురు పురుగు (గేయాలు)
  6. కోపదారి మొగుడు (నాటకం)
  7. సాహిత్య చిత్రములు(కథల సంపుటి) [1]
  8. పాత పాటలు
  9. సాంప్రదాయ విజ్ఞానం
  10. నా వాజ్మయ మిత్రులు
  11. Further life of the Soul
  12. కలువలు (ఖండకావ్యము)
  13. వాడుక భాషారచన - కొన్ని నియమములు
  14. పూర్వాంధ్రకవులు
  15. తెలంగాణా రాజుల చరిత్ర
  16. ప్రకాశవిమర్శీయము (నాటకం)
  17. జానపదగేయ వాజ్మయ చరిత్ర

మూలాలు

[మార్చు]
  1. [1] డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో