రొద్దం హనుమంతరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రొద్దం హనుమంతరావు
Roddam Hanumantharao.jpg
జననంఫిబ్రవరి 23, 1906
మరణం1986
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, న్యాయవాది
తల్లిదండ్రులువెంకోబరావు

రొద్దం హనుమంతరావు (ఫిబ్రవరి 23, 1906 - 1986) ప్రముఖ రంగస్థల నటుడు, న్యాయవాది, శ్రీకృష్ణదేవరాయ నాట్యమండలి స్థాపకుడు.[1]

జననం[మార్చు]

హనుమంతరావు 1906, ఫిబ్రవరి 23న అనంతపురం జిల్లా, పెనుగొండ లో జన్మించాడు. ఈయన తండ్రి పేరు వెంకోబరావు. ఈయన పినతండ్రి రొద్దం రంగారావు, సోదరుడు రొద్దం రాజారావులు ప్రముఖ నటులు. ఈయన కుమారుడు రొద్దం ప్రభాకరరావు ఐ.పి.ఎస్. అధికారి. వారు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో పనిచేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా రిటైర్ అయ్యారు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

హనుమంతరావు తన 13వ ఏట అనంతపురం కళశాలలో విజయనగర పతనం నాటకంలోని విరుమలాంబగా నటించి రంగస్థలంపై అడుగుపెట్టాడు. పెనుగొండలో శ్రీకృష్ణదేవరాయ నాట్యమండలి, అనంతపురంలో అలిత కళాపోషణ సమితిని స్థాపించాడు. బళ్ళారి రాఘవ, స్థానం నరసింహరావు, ఈలపాట రఘురామయ్య తదితర ప్రముఖ నటులతో కలిసి నటించాడు.

నటించిన నాటకాలు - పాత్రలు[మార్చు]

మరణం[మార్చు]

హనుమంతరావు 1986లో హైదరాబాద్లో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.685.