పి.వెంకటరెడ్డి
పి.వెంకటరెడ్డి తెలుగు కథా రచయిత.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన కడప జిల్లా, ప్రొద్దుటూరు తాలూకా, పర్లపాడు గ్రామంలో బాలిరెడ్డి, రామాంబ దంపతులకు జూలై 1 1922లో జన్మించారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగోతరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. వీరి గ్రామస్థులు, గురువు అయిన జీరెడ్డి చెన్నారెడ్డి కవితాభ్యసనమునకు మార్గదర్శనము చేసిరి. ఆయన తెలుగు భాషలో విధ్వాన్ పరీక్షలో ఉత్తీర్ణులైనారు. ఆయనకు "శారదా పుత్ర" అనే బిరుదము ఉంది. వీరికి గోవిందరెద్డి, వెంకట రెడ్డి అనే సోదరులు, ఇద్దరు సోదరీమణులున్నారు. ఆయన తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆంధ్ర శాఖలో పనిచేసిరి.
సాహిత్య ప్రవేశం
[మార్చు]ఆయన స్వగ్రామంలో కవిరత్న బిరుదాంకితులైన కశిరెడ్డి వెంకటరెడ్డి "బాల రామాయణము" రచించిరి. దానిని ఆదర్శంగా తీసుకొని వెంకటరెడ్డి "శ్రీమాన్ నిర్వచన వెంకట రామాయణం" పేరుతో మూడువేల పద్యములతో "రామాయణము" వ్రాసిరి. అది అముద్రితము.[1]
రచనలు
[మార్చు]- బకాసుర వథ
- గాంధీస్తుతి గీతములు
- వీరభద్రస్వామి పద్యరత్నమాల
- శ్రీమాన్ నిర్వచన వెంకట రామాయణం
- పారిజాతాపహరన నాటకం
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 రాయలసీమ రచయితల చరిత్ర - కల్లూరు అహోబలరావు,శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల,హిందూపురం