Jump to content

బి.ఆర్. అంబేద్కర్ రాజగృహం

వికీపీడియా నుండి
(బి.ఆర్. అంబేడ్కర్ రాజగృహం నుండి దారిమార్పు చెందింది)
బి.ఆర్. అంబేద్కర్ రాజగృహం
బి.ఆర్. అంబేద్కర్ రాజగృహం
ప్రదేశంహిందూ కాలనీ, దాదర్, ముంబై, మహారాష్ట్ర
రూపకర్తబి.ఆర్. అంబేద్కర్
రకంస్మారక భవనం
నిర్మాణం ప్రారంభం1931
పూర్తయిన సంవత్సరం1933
అంకితం చేయబడినదిబి.ఆర్. అంబేద్కర్

బి.ఆర్. అంబేద్కర్ రాజగృహం అనేది బి.ఆర్. అంబేద్కర్ స్మారక చిహ్నం, ఇల్లు. ముంబై నగరం, దాదర్‌లోని హిందూ కాలనీలో ఉన్న ఈ భవనానికి పురాతన బౌద్ధ రాజ్యాన్ని సూచిస్తూ రాజగృహ (ప్రస్తుతం రాజగిరి) అని పేరు పెట్టారు. మూడు అంతస్తుల భవనంలోని కింది అంతస్తులో స్మారక చిహ్నంగా హెరిటేజ్ మ్యూజియం కూడా ఉంది.

భారతీయులకు, ముఖ్యంగా బౌద్ధులకు, దళితులకు పవిత్ర స్థలమిది. 15-20 సంవత్సరాలపాటు అంబేద్కర్ ఈ రాజగృహంలో నివసించారు.[1][2] డిసెంబరు 6న శివాజీ పార్క్‌లోని చైత్య భూమికి వెళ్ళేముందు లక్షలాదిమంది ప్రజలు ఈ గృహాన్ని సందర్శిస్తారు. అంబేద్కర్ రాజగృహంలో ఉన్న సమయంలో 50,000 కంటే ఎక్కువ పుస్తకాలను సేకరించారు, ఇది ఆయన మరణించే సమయంలో ప్రపంచంలోని అతిపెద్ద వ్యక్తిగత గ్రంథాలయాల్లో ఒకటిగా నిలిచింది.[3][4] చట్టపరమైన, సాంకేతిక సమస్యల కారణంగా భవనాన్ని జాతీయ స్మారక చిహ్నంగా పేర్కొనే ప్రణాళికలు ఆపివేయబడ్డాయి, అయితే 2013లో ఈ భవనం వారసత్వ స్మారక చిహ్నంగా మారింది.[5][6]

చరిత్ర

[మార్చు]
బాబాసాహెబ్ అంబేద్కర్ తన కుటుంబ సభ్యులతో కలిసి దాదర్ (బాంబే) హిందూ కాలనీలోని తన నివాసమైన రాజగృహలో ఉన్నప్పటి ఫోటో. ఎడమ నుండి - యశ్వంత్ (కొడుకు), బాబాసాహెబ్ అంబేద్కర్, శ్రీమతి. రమాబాయి (భార్య), శ్రీమతి. లక్ష్మీబాయి (అతని అన్నయ్య భార్య, ఆనంద్), ముకుంద్ (మేనల్లుడు), డాక్టర్ అంబేద్కర్ కుక్క, టోబీ. 1934 ఫిబ్రవరి

బాబాసాహెబ్ అంబేద్కర్ కడు పేదరికంలో జన్మించాడు. అయితే, 1930 నాటికి, అతను ప్రసిద్ధ న్యాయవాదిగా మారడంతో అతని ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది.

అంబేద్కర్ న్యాయ కార్యాలయం పరేల్‌లోని దామోదర్ హాల్ దగ్గర ఉండేది. పాయ్‌బాదేవి వద్ద ఉన్న అంబేద్కర్ ఇల్లు అతని పుస్తక సేకరణకు సరిపోదు కాబట్టి తనకూ, తన కుటుంబానికి కొత్త ఇంటిని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు.

గ్రంథాలయంతో కూడిన కొత్త ఇంటిని నిర్మించాలని అంబేద్కర్ నిర్ణయించుకున్నాడు. కొత్త నిర్మాణంలో, రాజగృహం కింది అంతస్తులో మూడు గదులతో కూడిన రెండు బ్లాకులు నిర్మించబడ్డాయి. ఆ రెండు బ్లాకుల్లో అతని కుటుంబం నివసించింది. ఇంటి మొదటి అంతస్తులో, అతను తన గ్రంథాలయాన్ని, కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకున్నాడు.[5][7]

అంబేద్కర్ కు 1930లో 99వ, 129వ వీధుల్లో రెండు ప్లాట్లు ఉండేవి. ముంబైలోని హిందూ కాలనీ అయిన దాదర్‌లో 55 చదరపు గజాల స్థలం కూడా ఉంది.[8] ఐదవ లేన్‌లోని 129వ వీధిలో, అతను తన కుటుంబానికి ఇల్లు నిర్మించాలని నిర్ణయించుకున్నాడు, అతను మూడవ లేన్‌లోని 99వ ప్లాట్‌లో అద్దె భవనాన్ని నిర్మించాడు. అందుకోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రుణం పొందాడు. ఐస్కార్ ఇంటి నిర్మాణాన్ని పర్యవేక్షించాడు. 1931 జనవరిలో, ప్లాట్ నంబర్ 129లో భవనం నిర్మాణం ప్రారంభమై, 1933లో పూర్తయింది. 1932లో 99వ ప్లాట్‌లో మరో భవనం నిర్మాణం ప్రారంభమైంది. నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ భవనానికి చార్ మినార్ అని పేరు పెట్టారు. "రాజగృహం" అనే పేరు బౌద్ధ సంస్కృతి, హిందూ సంస్కృతికి సంబంధించినది, అయితే "చార్ మినార్" అనే పేరు ముస్లిం సంస్కృతికి సంబంధించింది.

1933లో అంబేద్కర్ తన కుటుంబంతో సహా రాజగృహంకి వెళ్ళాడు. అంబేద్కర్, అతని భార్య రమాబాయి, కుమారుడు యశ్వంత్, లక్ష్మీబాయి (అతని సోదరుని భార్య), ముకుంద్ (అతని మేనల్లుడు) తదితరులు అక్కడ నివసించేవారు.

1941 మే 9న పుస్తకాల కొనుగోలు, బకాయి ఉన్న రుణాలను తీర్చడానికి చార్ మినార్ భవనాన్ని విక్రయించాడు. అయినప్పటికీ, అతను రాజగృహం ఇంటిని శాశ్వత స్వాధీనంగా ఉంచుకున్నాడు.[9]

విధ్వంసం

[మార్చు]

2020 జూలై 7న సాయంత్రం, రాజగృహాన్ని ఒక వ్యక్తి ధ్వంసం చేశాడు. ఆ వ్యక్తి రాజగృహం ఆవరణలోకి ప్రవేశించి పూల కుండీలు, మొక్కలు, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసి కిటికీపై రాళ్ళ రువ్వి, తర్వాత వెళ్ళిపోయాడు. ముంబై పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఆ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని అంబేద్కర్ కుటుంబ సభ్యులు పోలీసులకు అందజేశారు.[10][11] అదే రోజు, రాజగృహాన్ని ధ్వంసం చేసినందుకు మాతుంగ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.[12][13] ఈ కేసులో ఒకరిని అరెస్టు చేసి తదుపరి విచారణ జరిపారు. మరుసటి రోజు, 2020 జూలై 8న, రాజగృహాన్ని శాశ్వత పోలీసు రక్షణలో ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.[12][13][14] 2020 జూలై 22న, రాజగృహంపై దాడిలో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని విశాల్ అశోక్ మోర్ అలియాస్ విఠల్ కన్యగా గుర్తించారు.[15]

మూలాలు

[మార్చు]
  1. "Five must visit places to rediscover the life of Dr Babasaheb Ambedkar | India News". Retrieved 2023-04-14.
  2. "बाबासाहेबांच्या 'राजगृहा'च्या आसपास फेरीवाल्यांचा डेरा". Loksatta. 10 October 2015. Retrieved 2023-04-14.
  3. Geetha, V. (29 October 2017). "Unpacking a Library: Babasaheb Ambedkar and His World of Books". The Wire. Retrieved 2023-04-14.
  4. "Through his vast library, Ambedkar still stays close to his followers - Indian Express". archive.indianexpress.com. Retrieved 2023-04-14.
  5. 5.0 5.1 Gaikwad, Dr. Dnyanraj Kashinath (2016). Mahamanav Dr. Bhimrao Ramji Ambedkar. Riya Publication. p. 186.
  6. "डॉ. बाबासाहेब अांबेडकरांच्या 'राजगृह'ने घेतला मोकळा श्वास". divyamarathi. Retrieved 2023-04-14.[permanent dead link]
  7. Rashid, Omar (8 September 2015). "The house Ambedkar built in Mumbai gets scant notice". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-04-14.
  8. Ghadyalpatil, Abhiram (25 July 2016). "Do the Ambedkar monuments in Mumbai do justice to the man?". Mint (in ఇంగ్లీష్). Retrieved 2023-04-14.
  9. Gaikwad, Dr. Dnyanraj Kashinath (2016). Mahamanav Dr. Bhimrao Ramji Ambedkar. Riya Publication. p. 187.
  10. "Mumbai: One detained in connection with attack on Ambedkar's house | english.lokmat.com". Lokmat English. 8 July 2020.
  11. "Ambedkar's Mumbai residence attacked by unidentified persons". The New Indian Express.
  12. 12.0 12.1 "मुंबई: डॉ बीआर आंबेडकर के घर 'राजगृह' परिसर में तोड़फोड़, उद्धव सरकार ने आवास के बाहर दी सुरक्षा, एक हिरासत में". www.abplive.com. 8 July 2020.
  13. 13.0 13.1 "'राजगृह'वर आता कायमस्वरूपी असणार पोलिसांचा पहारा; ठाकरे सरकारचा महत्वाचा निर्णय". Lokmat. 8 July 2020.
  14. "राजगृहाला २४ तास संरक्षण देण्याचा राज्य मंत्रिमंडळाचा निर्णय". zeenews.india.com.
  15. "Rajgruha vandalised: 20-year-old man 'caught on CCTV damaging flower pots & hurling stones' arrested". 23 July 2020.

బయటి లింకులు

[మార్చు]