Jump to content

చైత్యభూమి

అక్షాంశ రేఖాంశాలు: 19°01′30″N 72°50′02″E / 19.02500°N 72.83389°E / 19.02500; 72.83389
వికీపీడియా నుండి
చైత్యభూమి
చైత్యభూమి స్తూపం
అక్షాంశ,రేఖాంశాలు19°01′30″N 72°50′02″E / 19.02500°N 72.83389°E / 19.02500; 72.83389
ప్రదేశందాదర్, ముంబై, మహారాష్ట్ర
రకంస్తూపం
ప్రారంభ తేదీ1971 డిసెంబరు 5
అంకితం చేయబడినదిబి.ఆర్. అంబేద్కర్

చైత్యభూమి అనేది (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ మహాపరినిర్వాన్ మెమోరియల్ ) ఒక బౌద్ధ చైత్యం, భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్ దహన స్థలం. ముంబైలోని దాదర్ చౌపటీ (బీచ్) పక్కనే ఉన్న ఈ స్థలం, ప్రతి సంవత్సరం అంబేద్కర్ వర్ధంతి (మహాపరినిర్వాన్ దివస్) డిసెంబరు 6న లక్షలాది మంది అంబేద్కర్ అనుచరులకు ఈ చైత్యభూమి పూజనీయమైన పుణ్యక్షేత్రంగా నిలుస్తోంది.[1][2][3]

మహారాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రులు, అనేకమంది ఇతర రాజకీయ నాయకులు ప్రతి సంవత్సరం డిసెంబరు 6న చైత్యభూమిలో అంబేద్కర్‌కు నివాళులర్పిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా పర్యటించి, నివాళులు అర్పించాడు.[4] అంబేద్కర్ స్మారక చిహ్నంగా ఉన్న ఈ చైత్యభూమి, మహారాష్ట్ర ప్రభుత్వంచే ఏ-క్లాస్ పర్యాటకం, పుణ్యక్షేత్రంగా గ్రేడ్ చేయబడింది.[5]

నిర్మాణ వివరాలు

[మార్చు]
చైత్యభూమి స్థూపం లోపల బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్కర్

నిర్మాణం చతురస్రాకారంలో చిన్న గోపురంతో నేల, మెజ్జనైన్ అంతస్తులుగా ఈ నిర్మాణం విభజించబడింది. చతురస్రాకార ఆకృతిలో సుమారు 1.5 మీటర్ల ఎత్తులో వృత్తాకారంలో ఒక గోడ ఉంటుంది. వృత్తాకార ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం, గౌతమ బుద్ధుని విగ్రహం ఏర్పాటుచేయబడ్డాయి. ఈ వృత్తాకార గోడకు రెండు ప్రవేశాలు ఉన్నాయి, మార్బుల్ ఫ్లోరింగ్‌తో అమర్చబడి ఉంటుంది. మెజ్జనైన్ అంతస్తులో భిక్షువుల విశ్రాంతి స్థలంతోపాటు స్థూపం కూడా ఉంది. చైత్యభూమి ప్రధాన ప్రవేశద్వారం సాంచి స్థూపం గేటు ప్రతిరూపం అయితే లోపల అశోక స్తంభం ప్రతిరూపం తయారు చేయబడింది.

చైత్యభూమిని 1971 డిసెంబరు 5న బిఆర్ అంబేద్కర్ కోడలు మీరాబాయి యశ్వంత్ అంబేద్కర్ ప్రారంభించింది. ఈ ప్రాంతంలో అంబేద్కర్ శేషాలను కూడా ప్రతిష్ఠించారు. 2012లో, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్మారక చిహ్నం నిర్మించడానికి ఇందూ మిల్స్ భూమిని మహారాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించడానికి అనుమతినిచ్చింది.[6]

మహాపరినిర్వాన్ దిన్

[మార్చు]
చైత్యభూమి ద్వారం, అశోక స్తంభం
భారతదేశ 2013 పోస్టల్ స్టాంపుపై అంబేద్కర్, చైత్యభూమి

అంబేద్కర్ వర్ధంతి (డిసెంబరు 6) మహాపరినిర్వాన్ దిన్ గా పాటిస్తున్నారు. ఈ రోజున అంబేద్కర్ కు నివాళులు అర్పించేందుకు భారతదేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు చైత్యభూమికి తరలివస్తారు.[7]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "59th death anniversary of B R Ambedkar: A day when all roads in the city led to Chaityabhoomi". 7 December 2015.
  2. "Chaitya Bhoomi: India's most visited death memorial". 2 December 2014.
  3. "Thousands in city, all roads lead to Chaitya Bhoomi". 6 December 2014.
  4. "Glimpses from PM Modi's visit to Chaitya Bhoomi". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-04-14.
  5. "BR Ambedkar Chaitya Bhoomi gets 'A' class pilgrimage status". Zee News (in ఇంగ్లీష్). 2 December 2016. Retrieved 2023-04-14.
  6. PTI (5 December 2012). "Ambedkar memorial: Centre okays transfer of Indu Mill land". The Hindu. Retrieved 2023-04-14.
  7. Srivastava, Amit (5 December 2013). "Navi Mumbai: Declare public holiday in schools and colleges on Friday". Daily News and Analysis. Retrieved 2023-04-14.

బయటి లింకులు

[మార్చు]