Jump to content

అశోక స్తంభం

వికీపీడియా నుండి
వైశాలి లోని అశోకుని స్తంభం.

అశోక స్తంభాలు (Pillars of Ashoka) ఉత్తరభారతదేశంలో తరచూ కానవచ్చే స్తంభాలు. వీటిని మౌర్య చక్రవర్తి అశోకుడు సా.శ.పూ. మూడవ శతాబ్దంలో స్థాపించాడు.

చరిత్ర

[మార్చు]

చాలా స్తంభాలలో అశోకుని శాసనాలు, గౌతమబుద్ధుని ఉపదేశాలు కానవస్తాయి. ఇందులో సారనాథ్ లోని నాలుగు సింహాల స్తంభం ముఖ్యమైనది. ఈ స్తంభం నేటికినీ సారనాథ్ సంగ్రహాలయంలో భద్రపరచబడింది.

ప్రసిద్ధ 'అశోకుని సింహ రాజధాని', సారనాథ్ సంగ్రహాలయంలో భద్రపరచబడింది.

సారనాథ్ స్తంభం పై భాగాన ఈ అశోకుని సింహ రాజధాని, గలదు. ఈ స్తంభంలో అశోకుని శాసనాలు ఉన్నాయి. ఈ స్తంభంలో, కలువ పువ్వు (క్రిందివైపుకు తిరిగివున్నది), అశోకచక్రం, నాలుగు జంతుబొమ్మలు ఏనుగు, ఎద్దు, గుర్రం, సింహం గలవు.

ఏక సింహ రాజధాని

[మార్చు]
వైశాలి లోని, ఏక సింహ రాజధాని యొక్క ముఖదృశ్యం.

ఈ ఏకసింహ రాజధాని వైశాలిలో గలదు.

సా.శ.పూ. 238 కి చెందిన ఆరవ స్తంభానికి చెందిన భాగం, ఇందులో అశోకుని శాసనాలు, బ్రాహ్మీ లిపిలో వ్రాయబడినవి. బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరచబడింది. థాయిలాండ్లో చియాంగ్‌మాయి వద్ద గల 'వాట్ ఉ మాంగ్' లో గల అశోక స్తంభం.

మూలాలు

[మార్చు]

    ఇవీ చూడండి

    [మార్చు]

    బయటి లింకులు

    [మార్చు]