Jump to content

అశోకచక్రం

వికీపీడియా నుండి
భారత జాతీయపతాకంలో గల 'అశోకచక్రం', దాని వివరాలు.

అశోకచక్రం (ఆంగ్లం : Ashoka Chakra), ధర్మచక్రం ఇందులో 24 ఆకులు (స్పోక్స్) గలవు. ఈ చక్రం గురించి, మౌర్య సామ్రాజ్యంలో అనేక కథనాలున్నవి. అశోక చక్రవర్తి (273 - 232 క్రీ.పూ.) పరిపాలనా కాలంలో తన రాజధానియగు సారనాథ్ లోని అశోక స్తంభం యందు ఉపయోగించాడు. నవీన కాలంలో ఈ అశోకచక్రం, మన జాతీయ పతాకంలో చోటుచేసుకున్నది. దీనిని 1947 జూలై 22 న, పొందుపరచారు. ఈ అశోకచక్రం, తెల్లని బ్యాక్-గ్రౌండ్ లో 'నీలి ఊదా' రంగులో గలదు.

ప్రఖ్యాత 'సాండ్-స్టోన్' (ఇసుకరాయి) లో చెక్కబడిన 'నాలుగు సింహాల' చిహ్నం. సారనాథ్ సంగ్రహాలయంలో గలదు. ఇది అశోక స్తంభం పైభాగాన గలదు. దీని నిర్మాణ క్రీ.పూ. 250లో జరిగింది. భారత ప్రభుత్వము, దీనిని తన అధికారిక చిహ్నంగా గుర్తించింది.

అర్థం

ఇవీ చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]