వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/పాత చర్చ 1
1, 2, 3 |
Namespace and Name Cleanup
[మార్చు]- I cleaned up the long due Namespace mess (partly created by me). From now on until further notice donot create pages with namespaces in telugu. (Ex. Donot create [[వికిపీడియా:పాలసీ]]. Create only [[వికీపీడియా:పాలసీ]] ).
- All the pages about wikipedia and related to wikipedia should have Wikipedia namespace in front of them. Otherwise they will be treated as articles. Articles donot need to have any namespaces.
- If we want, we can contact a developer and have our namespaces for all articles changed at once into Telugu by having him run a script (In ta: they did that, though they faced some problems with links not working). Let me know what you think. Personally I am thinking of waiting for a while for our team to take up some shape before we attempt something like that.
- So far we are doing pretty good with only indian language ahead of us is mr: with 1303.
--వైఙాసత్య 20:06, 26 August 2005 (UTC)
వర్గాలకు సంబంధించి..
[మార్చు]వ్యాసాలను వర్గాలలోకి చేర్చేటపుడు కింది విషయం గుర్తుంచుకోవాలి:
వ్యాసాన్ని సంబంధిత వర్గ కుటుంబం లోని అతి చిన్న వర్గంలోకి చేర్చాలి. ఒక ఉదాహరణ:
ఆంధ్ర ప్రదేశ్ వర్గంలో కింది ఉప వర్గాలు ఉన్నాయి.
- ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు
- ఆంధ్ర ప్రదేశ్ జలవనరులు
- ఆంధ్ర ప్రదేశ్ పట్టణాలు, నగరాలు
- ఆంధ్ర ప్రదేశ్ తీర పట్టణాలు
కింది వ్యాసాలను ఏయే వర్గాలలోకి చేర్చాలో పరిశీలిద్దాం.
తెలంగాణ, తూర్పు గోదావరి, గుంటూరు, కొండపల్లి
తెలంగాణ: ఆంధ్ర ప్రదేశ్ వర్గం లోకి మాత్రమే వస్తుంది.
తూర్పు గోదావరి: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు వర్గంలోకి వస్తుంది. దీని మాతృ వర్గమైన ఆంధ్ర ప్రదేశ్ వర్గంలో దానిని చేర్చరాదు.
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు, ఆంధ్ర ప్రదేశ్ పట్టణాలు, నగరాలు వర్గాలలోకి వస్తుంది. ఈ రెండూ వేరు వేరు (క్షితిజ సమాంతర - horizontal) వర్గాలు, ఏ ఒక్కటీ రెండో దానిలోని భాగం కాదు. కాని ఈ రెండూ కూడా పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ వర్గం లోకి (లంబ - vertical) వస్తాయి. అందుచేత ఈ ఉప వర్గాల లోకి వచ్చే వ్యాసాన్ని ఆంధ్ర ప్రదేశ్ వర్గంలోకి చేర్చనవసరం లేదు.
కొండపల్లి: ఇది ఆంధ్ర ప్రదేశ్ పట్టణాలు, నగరాలు వర్గం లోకి వస్తుంది.
పై పద్ధతిలో ఏదైనా లోపముంటే, సరిదిద్దండి. --చదువరి 10:41, 14 సెప్టెంబర్ 2005 (UTC)
- This is cool.
- but some articles are both district and their head quarters. eg.. Khammam, adilabad, mahabubabad etc..
- we can put them in both the categories. Isn't it? 207.46.50.70 10:54, 14 సెప్టెంబర్ 2005 (UTC)
- పైన చూపినట్లు - గుంటూరు లాగానే అవి కూడా రెండు వర్గాల కీ చెందుతాయి.--చదువరి 11:50, 14 సెప్టెంబర్ 2005 (UTC)
- If I Understand it right Chaduvari means to say that ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు, and ఆంధ్ర ప్రదేశ్ పట్టణాలు, నగరాలు are not under each other as they are with ఆంధ్ర ప్రదేశ్. They are independent parallel sets with some overlap. Good job chaduvari. I realise we are starting to make some telugu wiki specific decisions and seperate wikipedia page for telugu specific policies would be good. --వైఙాసత్య 12:13, 14 సెప్టెంబర్ 2005 (UTC)
పేర్లు రాసే విధానం
[మార్చు]వ్యక్తులు, సంస్థలు, ఊళ్ళు మొదలైన వాటి పేర్లు రాసేటపుడు తెలుగు వికీపీడియాలో ఒక విధానాన్ని రూపొందించ వలసిన అవసరం ఉంది. ఉదాహరణకు - నందమూరి తారక రామారావు ను పొడి అక్షరాల్లో రాసేటపుడు ఎలా రాయాలి?
ఎన్.టి.రామారావు / ఎన్ టి రామారావు / ఎన్. టి. రామారావు - వీటిలో ఎలా రాయలి.
అలాగే తెలుగు వారి పేర్లకు చివర సాధారణంగా రావు, రెడ్డి, మాదిగ, రాజు, శర్మ, శాస్త్రి, నాయుడు మొదలైనవి వస్తాయి. వాటిని ఎలా రాయాలి?
రామారావు / రామా రావు రాజశేఖరరెడ్డి / రాజశేఖర రెడ్డి
వీటికి సంబంధించి ఒక విధానం అవసరం. లేకపోతే దారిమార్పు పేజీలు పెరిగిపోతాయి.__చదువరి 11:26, 9 అక్టోబర్ 2005 (UTC)
గౌరవ వాచకాలు
[మార్చు]గౌరవ వాచకాలు వాడే విషయమై వికీపీడియా విధానాన్ని స్థిరపరచుకోవలసిన అవసరం ఉంది. గారు అనే మాట వాడవలసిన అవసరం లేదేమోనని నా ఉద్దేశ్యం. అన్నారు, చేసారు, చెప్పారు మొదలైన మాటలు కాకుండా, అన్నాడు, చేసాడు, చెప్పాడు అని రాయాలని నా ఉద్దేశ్యం. ఒక ఉదాహరణ చూద్దాం:
- శ్రీకృష్ణదేవరాయలు గారు తెనాలి రామకృష్ణతో ఇలా అన్నారు: "రామకృష్ణా! ఈ సమస్యను నేనే ఇచ్చాననుకుని పూరించండి"
- శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణతో ఇలా అన్నాడు: "రామకృష్ణా! ఈ సమస్యను నేనే ఇచ్చాననుకుని పూరించండి"
పై వాటిలో రెండో వాక్యమే వినేందుకు ఇంపుగా అనిపిస్తూంది. అయితే, ఇటీవలి కాలానికి చెందిన వ్యక్తుల గురించి, సమకాలీన వ్యక్తుల గురించి ఇలా రాసేటపుడు, ఇది కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. నేను ఎక్కువగా ఈ రెండవ పద్ధతినే అనుసరించాను.
అయితే ఈ విషయమై సముదాయానికి ఒక విధానం ఉండవలసిన అవసరం ఉంది. ఈ విషయమై సభ్యుల అభిప్రాయాలు తెలియజేయగలరు.__చదువరి 16:11, 12 అక్టోబర్ 2005 (UTC)
- గౌరవ వాచకాలు విగ్ఞాన సర్వస్వానికి తగవు. పేరు తర్వాత గారు, పేరు ముందు శ్రీ సాధారణంగా ఉపయోగించ వద్దు. ఈ పాలసీకి కొన్ని మినహాయింపులు ఇవ్వొచ్చు.
- సభ్య పేజీలలొ గౌరవ సూచకాలు వాడుకొనవచ్చు.
- శ్రీకృష్ణదేవరాయలు లో శ్రీ దాదాపు పేరు లాగానే కలసి పోయినది (కానీ నిజానికి పేరులో భాగము కాదు). కనుక ఇటువంటి ప్రత్యేక సందర్భములలో మినహాయించవచ్చు.
- అన్ని మినహాయింపుల పై చర్చ జరిగిన తర్వాతనే వాటిని మినహాయింపులలో చేర్చ వలెను.
- వ్యక్తులకు బహు వచన ప్రయోగము కూడా విగ్ఞాన సర్వస్వ శైలికి తగదు.
- మనము వికిపీడియా విజ్ఞాన సర్వస్వము అన్ని విషయమును గుర్తుంచుకుంటే ఇటువంటి చాలా విషయములను తేలికగా తీర్చవచ్చు.
--వైఙాసత్య 18:00, 12 అక్టోబర్ 2005 (UTC)
ఇంగ్లీషులో వ్యాసాలు
[మార్చు]అనువాదాల జాబితా పెరిగిపోతున్నది. వేరే వికీపీడియాలోని ఏదైనా వ్యాసం తెలుగులోనూ ఉంటే బాగుంటుందని భావిస్తే అనువాదం చేసాకే సమర్పిస్తే బాగుంటుంది. లేదా, ఆ వ్యాసపు బయటి లింకును మాత్రమే ఇస్తూ వికీపీడియా:వ్యాస అనువాద విజ్ఞప్తులు పేజీలో పెట్టండి. తెలుగు వికీపీడియాలో వ్యాసాలు తెలుగులోనే రాయాలనే ప్రాధమిక అంశాన్ని విస్మరించవద్దు. __చదువరి 10:43, 23 అక్టోబర్ 2005 (UTC)
గ్రామాలు పట్టణాల పేజీలు
[మార్చు]గ్రామాలు పట్టణాలకు సంబంధించిన పేజీలలో వివరాలు ఇలా ఉండాలి:
- ప్రస్తుతపు పేరు, ఇతర/పూర్వపు పేర్లు, ఊరి చరిత్ర
- ఎక్కడ ఉన్నది: సరిహద్దులు, జిల్లా కేంద్రం నుండి దూరం, దగ్గరలోని ప్రముఖ పట్టణాలనుండి దూరాలు.
- పరిపాలనా వివరాలు: పురపాలక, నియోజకవర్గ వివరాలు, రెవెన్యూ డివిజను మొదలైనవి
- జనాభా వివరాలు: (2001 అధికారిక జనగణన లెక్కలు మాత్రమే రాయాలి)
- ఊరికి చెందిన ప్రముఖ వ్యక్తులు
- ప్రజల ప్రధాన వ్యాసంగం, పరిశ్రమల వివరాలు మొదలైనవి.
- వార్తల్లో ఈ ఊరు: ఇటీవలి కాలంలో ఈ ఊరికి సంబంధించిన వార్తలు (తరచుగా మారే విభాగం) __చదువరి 01:25, 11 నవంబర్ 2005 (UTC)
మాండలిక భాష
[మార్చు]Talk:సురవరం ప్రతాపరెడ్డి నుండి వైజాసత్య గారూ!వ్యాసములో తెలంగాణ మాండలికమును గురించి-ఇప్పటి తెలంగాణ కవులు కాని,రచయితలు కాని చాలా మంది తెలంగాణ భాషలోనే రచనలు చేస్తున్నారు.పత్రికలలో కూడా తెలిదేవర భానుమూర్తి వంటివారు తెలంగాణలో రాస్తున్నారు. రెండు జిల్లాలలో మట్లాడే భాష ప్రామాణిక భాష ఎలా అయింది, మిగిలినవి మాండలికాలు ఎలా అయినవి అనేది మనము మొదట అర్థం చేసుకోవాల్సి ఉంది.భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు,కృష్ణా జిల్లాల వాళ్ళు వివిధ కారణాలవల్ల ఆర్థికంగా,తద్వారా రాజకీయంగా బలపడినందువలన ప్రచారసాధనాలు కూడా సహజంగానే వారి చేతిలోకి వెళ్లినయి.ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పెద్ద పత్రికలన్నీ కూడా దాదాపు అలాంటివే.తెలంగాణ లో ప్రస్తుతం పుట్టుకొస్తున్న చిన్న చిన్న పత్రికలలో తెలంగాణ భాష విస్తృతంగా ఉపయోగించబడుతుంది.ఏది ప్రామాణికం,ఏది కాదు అని రుజువు చేయడానికి కాదు ఆ పత్రికలు చేసే ప్రయత్నం.ఎవరి భాషపై వారికున్న గౌరవం,మమకారం వలన ఎవరి భాషని వాళ్ళు నూన్యతాభావం లేకుండా వాడుకునే స్వాతంత్ర్యం ఉండాలని చేసే కృషి.పత్రికలు/పుస్తకాలలో వాడే భాష వాటిలో తప్ప నేను ఎప్పుడూ విని ఎరుగను.పుస్తకాలలో చదివి మాత్రమే దాని వాడుక నాకు తెలుసు.వికిపీడియా వంటి మంచి వేదిక మీద అన్ని మాండలికాలనూ అందరికీ పరిచయం చేసి ఒకరి మాండలికం పట్ల మరొకరికి అవగాహన,గౌరవం పెంచే అవకాశం ఉందని నా అభిప్రాయం. నేను రాసిన దానిలో మాండలికము వలన ఎవరికైనా అర్థం కాని పదాలను ఉపయోగించినట్లు అనుకోవడం లేదు.నేను రాసింది ఈ వెబ్సైట్ ప్రమాణాలకు వ్యతిరేకంగా ఉంటే అది మార్చడానికి ఏ అభ్యంతరమూ లేదు.ధన్యవాదాలు. -చైతన్య
- మీ భావాలు నాకు చాలా నచ్చాయి. తెలుగు వికిపీడియాలో ఇంకా భాషా ప్రదమైన ప్రమాణాల గురించి చర్చించలేదు. ఇటువంటి ప్రమాణాలు రూపొందించుటలో మీవంటి సభ్యుల అవసరం ఎంతైనా ఉంది. దీని గురిచి మరింతగా రచ్చబండలో చర్చించుదాము. --వైఙాసత్య 00:09, 17 నవంబర్ 2005 (UTC)
- ఎక్కడ మాట్లాడేదైనా, తెలుగు తెలుగే! భాష మీద మరో భాష ప్రభావం ఎంత బలంగా ఉంటుందో తెలుగును చూస్తే తెలుస్తుంది. తెలంగాణాలో ఉర్దూ ప్రభావం, కోస్తా ప్రాంతంలో ఇంగ్లీషు ప్రభావం ఇలాగ ప్రాంతాలను బట్టి భాషలో మార్పులు చోటు చేసుకున్నాయి. పలికే తీరులో తేడాలున్నంత మాత్రాన తెలంగాణా యాస, లేదా గుంటూరు యాస ఏకంగా మరో భాష అయిపోవు.
- భాష విషయమై వికీపీడియాలో ఇంకా నిర్దుష్ట ప్రమాణాలు లేవు. మనం ప్రస్తుతం ఈ ప్రమాణాలను నిర్దేశించుకోవలసిన అవసరం ఉంది. అయితే, వ్యాసం మొత్తం ఏదో ఒక్క మాండలికంలో ఉంటేనే బాగుంటుంది. సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాన్నే తీసుకుంటే - రెండు విధాలైన క్రియా ప్రయోగం ఈ వ్యాసంలో ఉంది. ఇలా కొంతభాగం ఒక రకంగాను, కొంత భాగం మరో రకం గాను ఉంటే చదివేందుకు ఇబ్బంది. కాబట్టి, వ్యాసాల్లో ఒకే మాండలికాన్ని పాటించాలనేది నా నిశ్చితాభిప్రాయం.
- ఇకపోతే ఏ మాండలికాన్ని వాడాలనే ప్రశ్నకు వస్తే- చదివేందుకు, రాసేందుకు మనమందరం అలవాటు పడింది పాఠ్య పుస్తకాలు, పత్రికల భాషలోనే. కాబట్టి సహజంగానే అది వాడాలని నా ఉద్దేశ్యం. చర్చ పేజీలకు దీని విషయమై మినహాయింపు ఇవ్వచ్చు. ఈ పేజీల్లో ఎవరికిష్టమైన మాండలికంలో వారు రాసుకోవచ్చు. __చదువరి 06:56, 17 నవంబర్ 2005 (UTC)
బొమ్మల వినియోగం
[మార్చు]ఈమధ్య నేను బొమ్మ:Rodinia.jpgని అప్‌లోడు చేసాను. దానికి అవసరమైన అనుమతిని సంబంధితుల వద్దనుండి ఈమెయిల్ ద్వారా తీసుకున్నాను. కానీ, ఇటువంటి అనుమతి మాత్రమే పొందిన బొమ్మలు వాడకూడదని ఎన్వికి లో ఒక నిబంధన ఉన్నట్లు ఈరోజు చూసాను. 2005 మార్చి 19 నుండి ఈ నిబంధన అమలు లోకి వచ్చింది. దీనికి సంబంధించిన లింకులు ఇక్కడ ఇస్తున్నాను.
మరి ఈ విధానం tewikiకి కూడా వర్తిస్తుందా? అయితే, ఈ బొమ్మను తొలగించాలా? __చదువరి 10:11, 21 నవంబర్ 2005 (UTC)
- ఈ విధానము తెలుగుకు కూడా వర్తిస్తుంది కాని ఎప్పటినుంచి అమలులోకి తెస్తామో అది మనము నిర్ణయించాల్సిన విషయము. మనము బొమ్మల విషయాలలో కొంచెము జాగ్రత్తగా ఉండటము ఎందుకైనా మంచిది. కానీ Rodinia బొమ్మ తొలగించవలసిన అవసరము రాకపోవచ్చు. అనుమతిని అనగా ఎటువంటి అనుమతో కొంచెం వివరముగా రాస్తే దాని గురించి నిర్ణయము తీసుకొనవచ్చు. సంబంధితులను మీరు GFDL కింద విడుదల చేయమని కోరవచ్చు అప్పుడు ఈ గొడవేమి ఉండదు. దీనికి సంబందించిన పద్దతిని నాకు ఆంగ్లవికిలో ఒక నిర్వాహకుడు రాశాడు. దానిని ఇక్కడ అతికిస్తున్నా. --వైఙాసత్య 15:37, 21 నవంబర్ 2005 (UTC)
What do someone has to do to license an Image under GFDL?
[మార్చు]I have requested a photographer for permission to use his Image in wikipedia. He is willing to license it under GFDL. But he asked me what does he need to do (procedure) to license the Image under GFDL. --User:వైఙాసత్య 16:47, 2 November 2005 (UTC)
- He should send you an email explicitly saying that he releases it under the GNU Free Documentation License for use on Wikipedia and for use by others under wikipedia's GFDL license. You should quote that email on the image page of the picture when you upload it, and be sure the image is tagged with {{GFDL}}. Then forward a copy of the email to PR (at) wikimedia (dot) org, the wikimedia foundation's permissions and releases department, along with a note indicating the file name of the image that the licencse applies to.
- Please be sure that the photographer understands that anyone may use or modify his picture, including for commercial purposes, without paying any fee to him, provided that his copyright is acknowledged and that the picture is made available for furhter re-use under the same terms. As a practical matter, this almost surely means that the photo involved will have no future commercial value for him. (He may wish to release only a version with limited resolution, for example.)
- Note, you might want ot upload to commons rather than to the english wikipedia. that will make sure the image is availabe to wikipedia projects in other languages.
- Also be sure that the image page lists the photographer and carreis a proper copyright notice like "Copyright 2004 by John Photoguy, and released under the GFDL". If the photographer has a web site, you could put a link to the site on the image page. DES (talk) 17:48, 2 November 2005 (UTC)
ఏకవచన ప్రయోగం
[మార్చు]సావిత్రి వ్యాసంలో అంతటా ఏకవచనం ఉపయోగించదం అంత సముచితంగా లేదు.దీనిని మార్చే విషయంలో మీకు ఎమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి Kiranc 06:16, 3 జనవరి 2006 (UTC)
- ఎకవచన ప్రయోగమే విగ్నాన సర్వస్వానికి సబబని నిర్ణయించడమైనది. ఈ విషయము గురించి వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) లో చర్చించవచ్చు --వైఙాసత్య 06:27, 3 జనవరి 2006 (UTC)
- నేను కూడ పాలసిలు చూసాను. కాని ఇటీవలి వ్యక్తుల విషయంలో అది అంత బాగోదు. ఉదాహరణకి "ఆమె నేటికి ఆరాధింపబడుతూంది" అనే కన్నా "ఆమె నేటికి ఆరాధింపబడుతున్నారు" అంటే బాగుంటుంది. Kiranc 09:12, 3 జనవరి 2006 (UTC)
- మీరన్నది నిజమేగానీ, ఏకవచనప్రయోగంలో తప్పులేదు. పైగా అన్ని సందర్భాల్లోనూ ఒకే విధానముంటే బాగుంటుంది. కాబట్టి ప్రస్తుతమున్న పద్ధతినే కొనసాగించాలని నా అభిప్రాయం. __చదువరి(చర్చ, రచనలు) 09:25, 3 జనవరి 2006 (UTC)
- అవునండి అందరికీ ఏకవచనమువ్ ఆడటమే మంచిది
- లేకపోతే చాలా సమస్యలు రావచ్చు
- ఉదాహ్రణకు
- వై యస్ కి బహువచనము వాడలేదని ఒకరు
- చంద్రబాబుకు వాడలేదని ఒకరు మనని ఇరగతీస్తారు :)
- Chavakiran 06:28, 4 జనవరి 2006 (UTC)
సభ్యులకో వర్గం
[మార్చు]వికీపీడియన్లు తమ పేర్లు ఒక పేజీలో రాసుకునే బదులు ఒక వర్గం సృష్టించి అందరూ తమ సభ్యుని పేజీని దానికి చేరిస్తే సరిపోతుంది గదా అని జయ ప్రకాశ్, ఇక్కడో చక్కని సూచన చేసారు. పేజీ వర్గానికి ప్రత్యామ్నాయం కాకున్నా, వర్గం ఉండాలని భావించి, వికీపీడియనులు అనే వర్గాన్ని సృష్టించాను. సభ్యులు తమ సభ్యుని పేజీలను ఆ వర్గానికి చేర్చగలరు. __ చదువరి(చర్చ, రచనలు) 17:31, 6 జనవరి 2006 (UTC)
మౌలిక సందేహం
[మార్చు]Wikipedia ను తెలుగులో రాసేటపుడు, వికిపీడియా అనికాక వికీపీడియా అని నేను రాస్తున్నాను. ఇంగ్లీషు పదంలో రాసేటపుడు లేకున్నా, పలికేటపుడు కి కు దీర్ఘం (కి తరువాత కాస్త విరామం) ఉంటుంది. సాధారణంగా తెలుగు అనువాదాల్లో ఉచ్ఛారణ పరంగా అనువదించడం కద్దు. నా రచనల్లో స్పెల్లింగు ప్రకారం కాక ఉచ్ఛారణ ప్రకారం రాస్తూ వచ్చాను. అయితే ప్రామాణికమైన పదాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంది. ఎప్పుడో అడగాల్సిన మౌలికమైన ప్రశ్న, 2200 వ్యాసాల వయసులో ఇప్పుడు లేవదీసాను, సారీ. __చదువరి(చర్చ, రచనలు) 17:45, 6 జనవరి 2006 (UTC)
- ఉచ్చరణకు అనుగునంగా అయితేనే బాగుంటుంది. ఎందుకంటే ఇంగ్లీషులో ఒక పదం స్పెల్లింగుకూ దాని ఉచ్చరణకూ తేడా ఉంటుంది. కొన్ని సార్లు అసలు సంభందం ఉండదు. ఉదాహరణకు ఇంగ్లీషు పదము rendezvousని పలికేటప్పుడు మాత్రం "రేండెవూ" అని పలుకుతారు, "రెండెజ్‌వస్" అని పలుకరు. తెలుగులో మాత్రం మనము ఏది రాస్తామో అదే పలుకుతాము. కాబట్టి నాఉద్దేశం ప్రకారం ఉచ్చరణకు అనుగునంగా అనువాధిస్తే బాగుంటుందని అనుకుంటునాను. కాబట్టి నా వోటు వికీపీడియా కే. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 18:02, 6 జనవరి 2006 (UTC)
కులపేజీలకు ఒక విధానం
[మార్చు]కులాల గురించిన సమాచారం విజ్ఞాన సర్వస్వానికి సంబంధించిందే ననడంలో ఏ సందేహమూ లేదు. వాస్తవ కుల చరిత్రను నిర్మోహంగా రాస్తే అది చక్కటి విజ్ఞాన వ్యాసం అవుతుంది. కానీ ఈ కులాల వ్యాసాల్లో దుశ్చర్యలు జరగకుండా కాపాడ్డం ఒక సవాలే! కుల దురభిమానులు ఈ వ్యాసాలను, వాటి చర్చా పేజీలను దురుపయోగపరచే అవకాశం ఎంతైనా ఉంది. ఎన్వికీలో అలా జరిగింది కూడా! ప్రస్తుతానికి మనమీ వ్యాసాలకు దూరంగా ఉంటే మంచిదేమోనని నా అభిప్రాయంగా ఉంది. సభ్యులు తమ అభిప్రాయాలు రాయగలరు. __చదువరి (చర్చ, రచనలు) 16:21, 6 అక్టోబర్ 2006 (UTC)
- ఆంగ్ల వికి పెద్ద బందలదొడ్డి. అక్కడ పనిచేసి నా నెత్తి బొప్పికట్టింది. ఆ జ్ఞాపకాలు ఇంకా బాగా గుర్తున్నాయి. పిల్లి మెడకి ఎప్పుడో ఒకసారి గంట కట్టాల్సిందే. కానీ ప్రస్తావన వచ్చింది కాబట్టి మొదలు పెట్టచ్చు అని అనిపిస్తుంది కానీ నేను సందిగ్ధతలో ఉన్నాను. మిగిలిన సభ్యులేమంటారు? కాకపోతే తెలుగు వికిలో రాసే వాళ్లు దాదాపు అందరూ అందరికీ తెలుసు కాబట్టి అంత గొడవుండదనుకుంటా. ఒక వేళ మొదలు పెట్టాలనుకుంటే ఆంగ్ల వికిలో కులాల వ్యాసాల మీద పనిచేసిన అనుభవముతో కొన్ని సూచనలు
- లాగిన్ అయిన సభ్యులు మాత్రమే ఈ పేజీలకు మార్పులు చేసేలా పెట్టాలి
- ఎటువంటి పరిస్థితులలోను నా కులము ఫలానా అని రాసే వాళ్లు ఎక్కడా (చర్చా పేజీలతో సహా) చెప్పకూడదు.
- తటస్థ దృక్కోణము మీద ఈ పేజీలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
- దాదాపు రాసిన ప్రతి విషయానికి మూలలను తప్పకుండా సూచించాలి
--వైఙాసత్య 16:45, 6 అక్టోబర్ 2006 (UTC)
ప్రస్తుత పరిస్థితుల్లో కుల చరిత్ర రాసే వాళ్ళు బహు అరుదు. అందుకు ప్రస్తుతానికి మనమీ వ్యాసాలకు దూరంగా ఉంటే మంచిదేమోనని నా అభిప్రాయం కూడా.___ Varmadatla 00:46, 7 అక్టోబర్ 2006 (UTC)
- ఈ వ్యాసాలకు దూరంగా ఉండటము అనేది "స్వేచ్చావిజ్ఙానసర్వస్వము" నకు సంకెళ్ళు వేసినట్లు అనిపిస్తుంది. అంతే గాకుండా సినిమాలలాగానే కులవ్యవస్థ ప్రధానమైన సాంస్కృతిక లక్షణం. కనుక "తటస్థ దృక్కోణము మీద ఈ పేజీలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి" అన్న మాటకు మనం విలువ ఇవ్వడం మంచిది. ఇందుకు అనుగుణంగా ఒక మూసను తయారుచేసి ఆ పేజీలలో ఉంచడం ఉచితం అనిపిస్తున్నది.
- కాసుబాబు 11:51, 7 అక్టోబర్ 2006 (UTC)
- కాసుబాబు గారు చెప్పినట్లుగా విజ్ఞాన సర్వస్వంలో వీటిని, ఇంటి పేర్లపై వ్యాసాలను నిషేధించడం అంత మంచిది కాదు. జాతులు, తెగలు, కులాలు, మతాలు మనం ఊహించలేనంత లోతుగా పాతుకుపోయాయి. ఇంటి పేరులతో నున్న గొప్పవారి వంశ చరిత్ర, కొందరు రాజుల చరిత్రకు దీనికి చాలా గొప్ప స్థానం ఉన్నది. ఉదా: కురు వంశం. పూసపాటి, నందమూరి వారి వంశ చరిత్రలు కూడా ఇలాంటివి. అయితే కొత్తకాలంకు సంబంధించినవి. వాటిని కొద్ది మూలాల సహాయంతో విస్తరించవచ్చునని నా అభిప్రాయం.Rajasekhar1961 07:53, 16 ఏప్రిల్ 2008 (UTC)
కొత్తవారికి సహాయం
[మార్చు]కొత్త సభ్యులు తమ తమ చర్చా పేజీలలో {{సహాయం కావాలి}} అనే మూసను చేర్చుకుంటే ఆ చర్చా పేజీలు, CAT:HELPME అనే వర్గంలోకి చేరతాయి. ఇంతవరకూ బాగానే ఉంది, కానీ ఫలా సభ్యుడు ఇలా సహాయం అభ్యర్ధించాడని మనం తెలుసు కోవడం కోసం మాటికి ముందు ఈ వర్గాన్ని చూడాల్సి వస్తుంది. ఇది ఆచరణ యోగ్యమైనది కాదు. ఆంగ్ల వికీపీడియాలో ఇందుకోసం ఒక బాటును తయారు చేసారు, ఆ బాటు, ఈ వర్గాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది, ఏవయినా కొత్త పేజీలు ఈ వర్గంలోకి వచ్చి చేరితే, సహాయపడగలిగే వాళ్ళందరికీ ఒక మెయిలుని పంపిస్తుంది. ఇలాంటి బాటును తయారు చేయగలిగినా అది ఎప్పటికీ నడుస్తూనే ఉండాలి, ఇది ఇంకో సమస్య. సభ్యులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు అని తెలుసు కోవడానికి ఇంకేమయినా మంచి మంచి ఆలోచనలు ఉన్నాయా. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 11:50, 9 జూలై 2007 (UTC)
వ్యాసాల పేర్లు ఏకవచనంతోనే ఉండాలి
[మార్చు]వికీపీడియా నామకరణ పద్ధతుల ప్రకారం వ్యాసాల పేర్లు ఏకవచనంలో ఉండాలి. —వీవెన్ 09:08, 20 సెప్టెంబర్ 2007 (UTC)
- వీవెను గారు మీరు చెప్పింది సరిగానే ఉన్నది కాని క్షీరదాలు అని వాడుకలొ పిలుస్తాము కాని క్షీరదము అని పిలవం కదా..పిలవడానికి అనువుగా ఉండేటట్లు వ్యాసము పేరు ఏర్పాటు--మాటలబాబు 09:27, 20 సెప్టెంబర్ 2007 (UTC) చేసుకొంటే నయం అని నాఅభిప్రాయం. మీరు చెప్పినట్లు కొన్ని విషయాల లొ ఏకవచన ప్రయోగమే వ్యాసానికి ఉచితం అవుతుంది. ఉదాహరణకు ఆపిల్ కాయ అక్కడ ఆపిల్ కాయలు ఉచితం కాదు.--మాటలబాబు 09:31, 20 సెప్టెంబర్ 2007 (UTC)
- ఆవు అని వ్యాసానికి పేరు పెట్టడం ఉచితం కాని ఆవులు అని పెట్టడం ఉచితంకాదు.కాని దీనికి క్షీరదాలు అని ఉంచడం ఉచితం అని అనిపిస్తోంది. పక్షి కంటే పక్షులు ఉచితం ఎందువలన అంటే వ్యాసము గుంపు గురించి ఒక ఫలానా పక్షి గురించి కాదు .--మాటలబాబు 09:31, 20 సెప్టెంబర్ 2007 (UTC)
- ఆలోచించదగ్గ విషయమే!! ఒక సాంప్రదాయంగా పాటించాము కానీ దాని వెనుక తర్కాన్ని నిశితంగా పరిశీలించలేదు. చదివి అర్ధం చేసుకుంటున్నా..తర్వాత వ్యాఖ్యానిస్తా --వైజాసత్య 09:51, 20 సెప్టెంబర్ 2007 (UTC)
వ్యాసానికి మామల్ అని పేరు బాగానే పేట్టారు కాని వ్యాసాన్ని ప్రారంభించింది మాత్రం మామల్స్ అని . నా వాదన ఇప్పటికి కూడా గుంపు గురించి చెప్పేడప్పుడు బహువచన ప్రయోగమే ఉచితం.--మాటలబాబు 10:18, 20 సెప్టెంబర్ 2007 (UTC)
- ఆంగ్లవికీలో ఉన్న పాలసీకి వాళ్ళిచ్చిన తర్కం అంత పటిష్టంగా లేదు. ఈ తర్కం మనకు అంతగా పనిచేయదేమో అని కూడా అనిపించింది. (ఆంగ్ల భాషకు, తెలుగుకు ఉన్న తేడాల వళ్ళ). కానీ ఒక పద్దతిగా వీలైనచోట్లల్లా ఏకవచనంతో వ్యాసాలు ప్రారంభిస్తే బాగుంటుంది. ఒక విషయానికి ఏకవచనము సరిపోదనుకున్నప్పుడు బహువచనంతో తప్పకుండా వ్యాసాలు సృష్టించవచ్చు. ఒక బహువచనం పేరుతో వ్యాసం సృష్టించినప్పుడు వెంటనే ఏకవచనంతో దారిమార్పు సృష్టించాలని నా మనవి. దారిమార్పులు సృష్టించినంతవరకూ మనం దీన్ని కఠినమైన నియమంగా పాటించక్కర్లేదనుకుంటా --వైజాసత్య 10:28, 20 సెప్టెంబర్ 2007 (UTC)
- రాజశేఖర్ గారు ఎక్కడిక్కడ ఏకవచన పేజిలకు బహువచన పేజిలు సృష్టించారు.ఈ విషయాన్ని ముందే గ్రహించినట్లున్నారు--మాటలబాబు 10:36, 20 సెప్టెంబర్ 2007 (UTC)
- ఊపితిత్తులు అని పిలుస్తాము కాని ఊపిరితిత్తి అని పిలవం కదా!! ఆంగ్లములొ పిలుస్తారామో నాకు తెలియదు. రోగి పరిక్ష చేశాక లంగ్స్ బాగున్నాయి అని అంటారు కాని లంగ్ బాగుంది అనరు కదా
వ్యాసానికి పేరు ఏకవచనంలోనే ఉండాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం--Dvratnam 10:59, 20 సెప్టెంబర్ 2007 (UTC)
వర్గాలు, ఉపవర్గాలు
[మార్చు]ఒక వ్యాసం ఒక వర్గంలోని ఉపవర్గంలో ఉంటే ఆ వ్యాసం వర్గంలో ఉండాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి మశూచిని తీసుకోండి.
- వర్గం - వ్యాధులు - ఇక్కడ అవసరం లేదు.
- ఉపవర్గం - అంటు వ్యాధులు - ఇక్కడ కూడా అవసరం లేదు
- ఉప ఉప వర్గం - వైరల్ వ్యాధులు - ఇక్కడ ఉండాలి
- ఉప ఉప వర్గం - చిన్నపిల్లలకు వచ్చే వ్యాధులు - ఇక్కడ ఉండాలి.
- ఉపవర్గం - అంటు వ్యాధులు - ఇక్కడ కూడా అవసరం లేదు
ఈ సవరణను సభ్యులు గమనించ తగినవిధంగా స్పందించాలని మనవి. --Dvratnam 11:07, 20 సెప్టెంబర్ 2007 (UTC)
- రత్నం గారు మీరు చెప్పింది చాలా సరి. మంచి సూచన చేశారు.నేను ఉపవర్గాలుగా ఉంచక పోవడానికి కారణం ఆ వ్యాసము మనలని తప్పించుకొని తప్పి పోతుందేమో అని . అన్ని ఒకసారి ఒక వర్గం లొ చేరితే తరువాత వర్గీకరించడం తేలిక అవుతుంది లేదా ఒక ప్రాజెక్టు నడిపితే వ్యాసాలు తప్పి పోకుండా ఉంటాయి.
--మాటలబాబు 11:17, 20 సెప్టెంబర్ 2007 (UTC)
- నేనూ రత్నంగారిలాగానే వర్గీకరణ చేస్తున్నాను. రాజశేఖర్ గారు పెద్ద పెద్ద వర్గాలలో పెట్టేందుకే మొగ్గుచూపారు. సరే, వ్యాసాలు చేరుతున్న కొద్దీ వర్గీకరణ చేయవచ్చనుకున్నాను --వైజాసత్య 12:25, 20 సెప్టెంబర్ 2007 (UTC)
- నేను కూడా ఇప్పటికి పెద్ద వర్గాలపై మొగ్గు చూపుతున్నాను.అన్ని ఒక వర్గం క్రింద ఉంటే ఒకరోజు కూర్చొని(చర్చ జరిపి) అందరు ఆలోచించి వర్గీకరించవచ్చు --మాటలబాబు 12:39, 20 సెప్టెంబర్ 2007 (UTC)
బొమ్మల తొలగింపు
[మార్చు]Abbu అనే సభ్యుడు ఎక్కించిన బొమ్మలలో చాలా వాటికి ఎటువంటి వివరాలు తెలుపలేదు. పైగా అలా ఎక్కించిన బొమ్మలలో చాలామట్టుకు కాపీహక్కులను ఉల్లంగించేవే ఉన్నాయని నా అనుమానం. అంతేకాదు, వాటిలో కొన్ని ఫొటోలు జీవించి ఉన్న ప్రముఖులవి, ఇటువంటి బొమ్మలు FairUse క్రింద కూడా ఉపయోగించటానికి అనర్హమైనవి (ఇది చూడండి). ఒక్క బొమ్మకు కూడా నిర్ధారించుకోగలిగే మూలాలను కూడా పేర్కొనలేదు. అంతేకాదు, వివరాలు తెలుపమని కొన్ని రోజుల క్రితం కోరినా ఇప్పటి వరకూ ఎటువంటి స్పందనా లేదు, ఇంకో ఐదు రోజులలో వివరాలు తెలుపకపోతే ఆ బొమ్మలన్నిటినీ తొలగిద్దామని అనుకుంటున్నాను. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలుపగలరు. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 08:54, 4 అక్టోబర్ 2007 (UTC)
- బొమ్మ:SNRZPH-gopalapuram.jpg- ఈ బొమ్మ తప్ప మిగిలినవన్నీ తుడిచెయ్యవచ్చు. ఇది ఆ సభ్యుడే సొంతగా తీసిన ఫోటోలాగా ఉంది. --వైజాసత్య 10:21, 4 అక్టోబర్ 2007 (UTC)
వెబ్ సైటులకు సంబంధించిన వ్యాసాలపై విధాన నిర్ణయం
[మార్చు]వికీపీడియాలో వివిధ వెబ్ సైట్లకు సంబంధించిన వ్యాసాలు రాసే విషయమై ఒక విధానాన్ని నిర్ణయించుకోవాలి. విజ్ఞాన సర్వస్వంలో అవెంత వరకు ఇముడుతాయో మనం పరిశీలించాలి. ఒకవేళ పెట్టినా, అవి వ్యాపార ప్రకటనల ధోరణిలో కాకుండా సమాచారయుక్తంగా ఉండేటట్లు చూడాలి. కడపకు సంబంధించిన సైటు ఒకదానికి ఒక సభ్యుడు పేజీ తయారుచేసారు. _చదువరి (చర్చ • రచనలు) 09:50, 21 జనవరి 2008 (UTC)
- వెబ్ సైట్లు కూడా విజ్ఞానసర్వస్వములో సముచిత స్థానముండదగినవే. ఉదాహారణకి ఐడిల్ బ్రెయిన్, ఇండియా వన్ వంటి వెబ్సైట్లు మన దైనందిన జీవితంలో భాగమైపోయాయి కదా. అదే సైట్లో ఉంటుందో కానీ జీవీ రివ్యూలు/రేటింగు గురించి జనాలు తెగమాట్లాడుతుంటారు. అయితే వేటికి ఇక్కడ పేజీలు ఉండాలి, వేటికి ఉండకూడదని నిర్ణయించటం కొంచెం కష్టమైనపనే. వీటికి నోటబిలిటీ (?) సూత్రాలు మనమే నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు 1) ఆ సైటు గురించి దానిలోని సమాచారం గురించి ఏదైనా పత్రికలోగానీ, ఇతర ప్రముఖ వెబ్ సైట్లలో కనీసం ఓ రెండు-మూడు సార్లు వచ్చి ఉండాలి 2)ఆ సైటు వాళ్ళే దాని గురించి వ్రాయకూడదు 3)గూగూల్లో ఆ సైటు గురించి శోధిస్తే ఒక నిర్ధిష్ట సంఖ్యను మించి పేజీలు రావాలి. ఒకసారి ఎన్వికీలో ఎలాంటి నియమాలు పెట్టారో కూడా చూడాలి --వైజాసత్య 16:48, 22 జనవరి 2008 (UTC)
- వెబ్‌సైట్లకు సంబంధించి విధాన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిచో వెబ్‌సైట్లపై కుప్పలు తెప్పలుగా వ్యాసాలు తయారయ్యే ప్రమాదం ఉంది. ఈనాడు ప్రతి వ్యాపారసంస్థకు వెబ్‌సైట్ మామూలైపోయింది. వెబ్‌సైట్ వ్యాసాల వల్ల వారి వ్యాపార ధోరణులు వికీలోనూ వ్యాపిస్తాయి. దీన్ని ముందుగానే నిరోధించాలి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాదరణ కల వెబ్‌సైట్లు, అట్లే భారతీయులకు, తెలుగువారికి అత్యధికంగా ఉపయోగపడే వ్యాపారేతర వెబ్‌సైట్ల పేర్లపై చర్చించి వాటికి మినహా ఇతర సైట్లను చేర్చకుండా నిరోధించాలి. వైజాసత్యగారు తెలిపిన సూత్రాలు బాగున్నాయి. అలాంటి మరికొన్ని సూత్రాలు రూపొందించుకోవాలి. కాని ఆ సైటు వాళ్ళే వాటి గురించి వ్రాయరాదనే విషయాన్ని పసిగట్టడం కష్టం, వారే సభ్యత్వం పుచ్చుకొని రాస్తే మనమే చేయలేం.--C.Chandra Kanth Rao 18:11, 22 జనవరి 2008 (UTC)