Jump to content

వికీపీడియా చర్చ:వికీపీడియనులు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
(వికీపీడియా చర్చ:Wikipedians నుండి దారిమార్పు చెందింది)

telugu name for wikipedians

[మార్చు]

Any updates?

[మార్చు]

వర్గము

[మార్చు]

వికిజ్ఞుడు అనే పదం అర్ధవంతం -వేదపండిత

నా పేరు

[మార్చు]

నా పేరు సభ్యత్వ పేజిలో పెట్టలేదు ఫరవాలేదా...చిట్టా లో పేరు పెట్టుకోవడమ్ కష్టంగా ఉంది,.--మాటలబాబు 10:24, 10 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

హమ్మయ్య ఇప్పుడు అందరూ చిట్టాలో పేరు చేర్చగలిగే విధంగా సరళీకరించా..ఒక పీడా పోయింది --వైజాసత్య 15:11, 6 సెప్టెంబర్ 2007 (UTC)

పేర్లు నమోదు చేసేటప్పుడు అక్షర క్రమంలో రాస్తే క్రమబద్ధంగా ఉంటుంది మరియు చదవటానికి కూడా సులువుగా ఉంటుంది. ఉదాహరణకు 'స' తో మొదలయ్యే పేర్లను ఆంగ్ల క్రమంలో పేర్చాను. మీ అభిప్రాయాలు తెలియచేయండి - Neeru.satya2005 20:16, 25 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు సత్యాగారూ! ఈ పేజీ ఉపోద్ఘాతం కూడా తిరగరాయాలి. ప్రయత్నించ గలరా (ఇప్పుడు 500 పైనే సభ్యులున్నారు గదా?). ఈ పేజీలో తమ పేరు వ్రాయడం స్వచ్ఛందం. కనుక ఈ లిస్టు సమగ్రం అయ్యే అవకాశం లేదు. అందువలన పేజీయే అనవుసరమని ఇంతకుముందు కూడా కొందరన్నారు. ఈ పేజీని ఉపయోగకరంగా ఉండేలా తిరిగి డిజైన్ చేయాలి. మీకు ఏమైనా ఐడియాలు ఉన్నాయా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:28, 25 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియను అనేది ఇంగ్లీష్ పదం కాబట్టి మన తెలుగుతనం కనిపించేలాగున ఉంటే ...

[మార్చు]

suggest here

  • "వికివేత్త" నాకు నచ్చింది. "వికీయుడు" "వికీయులు" ఎలా ఉంది?
  • వికిజీవి (వైఙాసత్య)
"వికీజీవి" పేరు బాగుంది. ఈ పేరు వాడదామా సత్యా?
  • పర్వాలేదు, కానీ జీవి అనేది అంత positive పదము కాదు.

వాడొక జీవిరా అనేది కొద్దిగా వ్యంగంగా, negative టచ్‌ తో వాడతారు.

నా అభిప్రాయము అయితే "వికీపీడియను" is OK.

లేదా వికీ లేకుండా ఏదన్నా పదము వాడితే ఎలా వుంటుంది? వికివేత్త, వికిజ్ఞుడు, వికి మనిషి, వికివాలా, వికిబొయ్‌, -- అవునూ వికీవాలా ఎలా వుంది?

  • నాకు ఈ జాబితా లో వికివేత్త మరియు వికివాలా నచ్చాయి. కాని ఇంకా కొన్ని అభిప్రాయములు సేకరిద్దాము. --వైఙాసత్య 14:53, 19 August 2005 (UTC)


Any updates over this?

We can also do that vikivaala and vikivEtta as two #birudulu# to those who contributed 1000, 10,000 edits respectively.

And keep vikipIDiyanu for the current task.

afterall vaalaa came from hindi (or urdu, or arabik0

vEtta (came from sanskrit)

pIDiyanu (never mind one english edition :) )

  • I concur , also వికిజ్ఞుడు seems to be good. - జయ ప్రకాశ్ 16:43, 2 డిసెంబర్‌ 2005 (UTC)


అన్నిటికంటే వికీజీవి బాగుంది. ఈ పేరునే వాడితే బాగుంటుంది.__చదువరి 09:31, 19 సెప్టెంబర్ 2005 (UTC)


వికీపీడియను అనేది ఇంగ్లీష్ పదం కాబట్టి మన తెలుగుతనం కనిపించేలాగున ఉంటే బాగుంటుంది. అదీకాక ఫెమినిస్ట్ల నుండి అబ్యంతరాలు రాకుండా ( ఇప్పటికే మాన్ పవర్, మానేజిమెంట్ లాంటి పదాల మీద గుర్రుగా ఉన్నారు కాబట్టి ) "వికివేత్త" లాగ మద్యస్తంగా ఉంటే బావుంటుందని అనిపిస్తుంది. నాకు తోచిన కొన్ని పేర్లు:

  • వికియిత (రచయిత లాగ అన్నమాట ?!)
  • వికియా (వికీపీడియా లోని మొదటి రెండు అక్షరాలు చివరి ఒక అక్షరం కలిపా ;))
  • వికీలు (వకీలు లాగ వుందిఅంటారా :| చాల మంది కలిపి రాస్తుంటాము కావున బహువచనములో వుంటుందని ఓ తింగరి ఆలోచన)
  • వికీవి (నో కామెంట్ తోచింది అంతే)
  • వికర్త (????)

ఇంకా ఎక్కువ రాస్తే తంతామంటార, ప్రస్తుతానికి ఇంతే.సెలవు వాసు. bojja 07:58, 5 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]


    • వికీవేత్త, వికీవేత్తలు చాలా బాగుంటాయి. విజ్ఞానవేత్తల మాదిరిగా అర్ధం వస్తుంది. వాలా అయితే హిందీ పదం లాగా ఉంది. బోయ్,గర్ల్ వంటివి లైంగిక భేదాలు వస్తాయి. మనిషి అనేది అందరూ మనుషులమే కదా.Rajasekhar1961 11:04, 5 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]


  • వివేకి
ఆలోచన ఏమో కాని పేర్లు మాత్రం అదిరాయ్. భలే పేర్లు సాధించారు.--విశ్వనాధ్. 14:33, 5 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
'వివేక'వంతమయిన ఆలోచన...మరిన్ని సంధించండి.వాసు. bojja 08:40, 6 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఎంత ఆలోచించినా ఇంతకంటే మంచి పేర్లు నాకు తట్టడం లేదు. అయినా ప్రయత్నిస్తాను. నేను సైతం. ఇదే పేజీలో ఉన్న పాత చర్చను కూడా సమయ క్రమంలో ఇదే సెక్షన్‌కు కాపీ చేస్తున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:46, 6 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
వికివేత్త బాగుంటుందేమో!!Kumarrao 09:40, 6 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వికిపీడియాంధ్రులు

[మార్చు]

నా ఉద్దేశ్యంలో తెలుగు భాష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలలో ప్రధమ భాష అయి ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ప్రజలను ఆంధ్రులు అని అంటారు. మన రాష్ట్రంలోని వ్యక్తులు ఏ ఇతర దేశంలో ఉన్నా వారిని ప్రవాసాంధ్రులు అంటారు. అలాగే వికిపీడియా లో వ్యాసాలను చక్కగా తయారుచేయుటకు భాషానైపుణ్యం అవసరమని నా అభిప్రాయం. దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయల వారు అన్నారు. వికిపీడియాలో తెలుగులో వ్యాసాలు వ్రాసేవారు ఎక్కువగా మన రాష్ట్రం వారే ఉన్నారు అని నా అబిప్రాయం. అందువలన తెలుగులో వాడుకరులను "వికిపీడియాంధ్రులు" అనిన బాగుండునని నా అభిప్రాయం.(Kvr.lohith (చర్చ) 13:24, 21 నవంబర్ 2012 (UTC))

అసలు వికీపీడియా అంటేనే ఆంగ్లము. ఇంక "వికిపీడియాంధ్రులు" అని ఉఛ్ఛరించటము ఆంత సబబు కాదని నా అభిప్రాయము. కొత్త పదాలు ప్రతిపాదనకు నా సహకారము కూడా ఉంటుంది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 16:00, 21 నవంబర్ 2012 (UTC)

అచ్చ తెలుగు చదవగలమా?

[మార్చు]

అన్నింటినీ తెలుగు చెయ్యాలన్న ఆలోచన మంచిదే గానీ, అన్నింటినీ తెలుగు చేస్తే అసలు చదవగలమా? - అన్నదే సమస్య! శ్రీ కృష్ణ దేవరాయలవారు తెలుగు భాష ఉన్నతికి విశేషంగా కృషిచేసారన్న మాట నిజం! అయితే- అప్పటి తెలుగును ఇప్పటి తరంలో ఎంతమంది చదవగలరు? చదివినా ఎంతమందికి అర్ధమవుతుంది? కాలంతోబాటు భాషా మారింది. ఈ మారిన భాషలోకి అనివార్యంగా ఇంగ్లీషు చొచ్చుకువచ్చి ఇంచక్కా సెటిలైపోయింది! రైలు అంటే అర్ధమవుతుంది గానీ, ధూమ శకటము అంటే అర్ధం కాదు కదా....?! అంతా తెలుగే చెయ్యాలనుకుంటే అసలు 'వికీపీడియా' అనేదే ఇంగ్లీషు కదా? దీన్నీ తెలుగులోకి మార్చాలన్న ప్రతిపాదన రాకుండా వుంటుందా? --- అందుకే- సమాచార సత్వర వ్యాప్తిని పరిగణనలోకి తీసుకుంటూ.... మరీ కృతకం కాని 'సంకర తెలుగు'ను చూసీ చూడనట్లుగా వదిలేస్తే మంచిదేమో...! Malladi kameswara rao (చర్చ) 03:21, 22 నవంబర్ 2012 (UTC)

ఇదివరకు ఇలాంటి చర్చ చాలా సార్లు జరిగింది. ఉదా:కు చూడండి-- సి. చంద్ర కాంత రావు- చర్చ 19:41, 22 నవంబర్ 2012 (UTC)