వాడుకరి చర్చ:Ranjithsutari

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Ranjithsutari గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png అర్జున 06:10, 19 జూన్ 2010 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
మౌలిక పరిశోధనలు ఎందుకు నిషిద్ధం?

వికీపీడియా మూడు ముఖ్య విధానాలలో - వికీపీడియా:తటస్థ దృక్కోణం మరియు వికీపీడియా:నిర్ధారింప తగినది సరే. అర్ధం చేసుకోవచ్చును. కాని మౌలిక పరిశోధనలు ఎందుకు నిషిద్ధం? వాటిపై అభ్యంతరం ఎందుకుండాలి?

వికీపీడియా విషయ విధానాలు మూడూ కూడా తటస్థ దృక్కోణంకు అవుసరార్ధమే రూపొందించబడ్డాయి. ఇందుకు Wikipedia:Core content policies లో ఇచ్చిన వివరణను గమనించండి. - Soon it became evident that editors who rejected a majority view would often marshal sources to argue that a minority view was superior to a majority view—or would even add sources in order to promote the editor's own view. Therefore, the No Original Research (NOR) policy was established in 2003 to address problematic uses of sources. The original motivation for NOR was to prevent editors from introducing fringe views in science, especially physics — or from excluding verifiable views that, in the judgement of editors, were incorrect. It soon became clear that the policy should apply to any editor trying to introduce his or her own views into an article (and thus a way to distinguish Wikipedia from Everything).

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా[మార్చు]

తెలుగు అంకెలు ఈ వికీపీడియా లో ఎందుకు ఉండకుడదు? దయచేసి మీరు మార్చిన క్రమ సంక్య ను ఆంగ్ల అంకెల స్థానములో తెలుగు అంకెలు మాత్రమే చేర్చాలి. అభినందనలతో--Ranjithsutari 10:21, 19 ఆగష్టు 2010 (UTC)

తెలుగు వికీపీడియాలో ఆంగ్ల అంకెలు ఎందుకని మంచి సందేహం వెలిబుచ్చారు. తెవికీలో ఆంగ్ల అంకెలే కాకుండా ఆంగ్ల పదాలు కూడా చాలా ఉన్నాయి. తెవికీ ముఖ్యలక్ష్యం లేదా ఉద్దేశ్యం తెలుగుభాషలో వ్యాసాలు రచించి తెలుగు ప్రజలకు వాటిని అందుబాటులో ఉంచడం మాత్రమే. దీనికై వాడుకలో ఉన్న తెలుగు పదాలను, అంకెలను మాత్రమే తెవికీ ఉపయోగిస్తుంది. మీరు చెప్పినట్లు ఆంగ్ల అంకెలను కాకుండా తెలుగు అంకెలను మాత్రమే ఉపయోగిస్తే వాటిని ఎంతమంది తెలుగు వ్యక్తులు అర్థంచేసుకుంటారన్నది సందేహాస్పదమే. తెలుగు ప్రజానీకం అందరికీ అందుబాటులో ఉండడమే కాకుండా అందరూ అర్థంచేసుకోవడానికి, సద్వినియోగం చేసుకోవడానికి తయారవుతున్న తెలుగు విజ్ఞానసర్వస్వములో సాధ్యమైనంతవరకు అందరికీ అర్థమయ్యే భాషను మరియు శైలిని ఉపయోగిస్తూ, వాడుకలో ఉన్న పదాలను, అంకెలను మాత్రమే వాడవలసి ఉంటుంది. అంతేకాకుండా తెలుగు పుస్తకాలు, తెలుగు ప్రసార మాధ్యమాలు (టెలివిజన్, వార్తాపత్రికలలో) తదితర చోట్ల తెలుగు అంకెలను కాకుండా ఆంగ్ల అంకెలను మాత్రమే వాడుచున్నారనే విషయం మీకు తెలుసు. కాబట్టి తెవికీ కూడా వాటి ప్రకారమే ముందుకుపోవల్సి ఉంటుంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే తెవికీ తెలుగు సమాజంలో మార్పులు తేవడానికి కాకుండా వాడుకలో ఉన్న శైలినే ఉపయోగిస్తూ తెలుగు సమాజానికి అందుబాటులో ఉండడం. ఇదివరకు ఆర్టీసి వారు బస్సులపై అంకెలు కూడా తెలుగులో ఉండాలని హటాత్తుగా నిర్ణయించి, అమలుపరిచి విమర్శలకు గురయ్యారు. బస్సు అంటే గుర్తుకొచ్చింది, ఇది కూడా ఆంగ్లపదమే. ఇలాంటివి తెలుగులో చాలా ఉన్నాయి, వాడుకలో మనం ఆ పదాలనే ఉపయోగిస్తున్నాము కాబట్టి తెవికీలో అలానే రాస్తున్నాం. రైలుకు, బల్బుకు అచ్చ తెలుగు పదం రాస్తే వాటిని ఎందరు అర్థం చేసుకుంటారన్నది మీకు చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఉన్న పద్దతిలో మార్పు వచ్చి, క్రమక్రమంగా తెలుగు ప్రజలు కూడా తెలుగు అంకెలు ఉపయోగిస్తున్నప్పుడు తెవికీ కూడా తప్పకుండా తెలుగు అంకెలను వాడుతుంది. ఆ మార్పు వస్తుందని కోరుకుందాం. కాని ఆ మార్పు మొదట తెలుగు సమాజంలో రావాలి, అంతేకాని తెవికీలో కాదు. మరో విషయం మీరు తెలుగు అంకెలు టైపు చేశారు కదా, అసలు తెవికీ ఎడిట్ పేజీలో ఆ సదుపాయమే లేదు. ఎందుకనే విషయం ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. సి. చంద్ర కాంత రావు - చర్చ 12:19, 19 ఆగష్టు 2010 (UTC)
మీ వాదన చూస్తువుంటే, నాకు చాల నవువస్తుంది( అంటే ఫాన్నీగా అనిపిస్తుంది). మిమల్ని సమర్ధించాలి ( అంటే సపోర్ట్ చేయాలి) అనిపించినా మిమల్ని వ్యతిరేకించక(అంటే ఆపోజ్ చేయక) తపటము లేదు. Well ఏది ఏమైనపటికి(అంటే whatever) ఇకడ తెలుగు వికీపీడియాను ఆర్టీసి లేదా ప్రసార మాధ్యమాల(టెలివిజన్, వార్తపత్రికల)తో పోల్చకుండా తెవికి లాంటి ఇతర ప్రాజెక్టులు అంటే హిందీ, ఉరుదు, గుజరాతి, కన్నడ వంటి వికీపీడియా సిస్టర్ ప్రాజెక్టులతో పోల్చుకుంటే అసలు సమస్య ఏంటో అర్ధమవుతుంది.
మాధ్యమాలు(వార్తాపత్రికలు) అంటే గురుతుకు వచ్చింది ఒకసారి వార్తాపత్రికవారు వై.ఎస్.అర (ఆపటి ముఖ్యమంత్రిని)ని తెలుగు బాషపై మీ అభిప్రాయము చెపమంటే "I love my teలుగు బాషా" అని ఆనాడు. తన మత్రుబాషను ప్రేమిస్తున్నాను అని తెలుగులో చేపలేక పోయాడు అని అదే వార్తపత్రికవారు విమర్శించారు.
అందరికీ అర్థమయ్యే భాషను మరియు శైలిని ఉపయోగిస్తూ, వాడుకలో ఉన్న పదాలను, అంకెలను మాత్రమే వాడవలసి ఉంటుంది అంటే మరి పైన పేరుకోన వికీపీడియా సిస్టర్ ప్రాజెక్టులలో కూడా ఎందుకు ఈ పదతి పాటించడములేదు. మీరు చేపినటు "ప్రస్తుతం ఉన్న పద్దతిలో మార్పు వచ్చి, క్రమక్రమంగా తెలుగు ప్రజలు కూడా తెలుగు అంకెలు ఉపయోగిస్తున్నప్పుడు తెవికీ కూడా తప్పకుండా తెలుగు అంకెలను వాడుతుంది" అన్నారు కానీ వికీపీడీయా ఒక వ్యక్తిగత ఆలోచన లేదా అభిప్రాయం కాదు, లేదా వికీపీడియా భవిష్యత్తు చూసే మాయాదర్పణం కాదు. కాబటి దయచేసి మిగతా వికీపీడియా సిస్టర్ ప్రాజెక్టులతో సమానముగా మత్రుబాష లోని తెలుగు అంకెలను మాత్రమే వాడవలెను. అభినందనలతో--Ranjithsutari 18:04, 19 ఆగష్టు 2010 (UTC)
మీకు ఇతర వికీపీడీయాలలో పనిచేసిన అనుభవం ఉండవచ్చు కాని తెవికీ గురించి తెలుసుకోవాల్సిన అవరం ఉంది. నేను చెప్పినది నా వాదన అనుకుంటున్నారు అంతేకాకుండా నా వ్యక్తిగత ఆలోచన లేదా అభిప్రాయం అని అనుకొని పొరపడుతున్నారు. అది కానేకాదు నేను చెప్పినది తెవికీ అభిప్రాయమే. నేను భవిష్యత్తును చూసి జోస్యం చెప్పే అవసరం నాకు లేదు. భవిష్యత్తులో అలా జరిగినప్పుడు మాత్రమే తెవికీలో అలాంటి మార్పు వస్తుందని సూచనప్రాయంగా చెప్పాను, అది సరైనదే. ఏ వ్యవస్థ అయినా సరే సమాజంలో జరిగే మార్పులకు అనుగుణంగా మారవలసిందే. అంతేకాని తెవికీనే మొదట మార్పులకు వత్తిడి చేయదు. ఇతర సోదర వికీపీడియాలతో తెవికీని పోల్చే అవసరం లేదు అక్కడి నియమాలు అక్కడ వర్తిస్తే, మన నియమాలు మాకు వర్తిస్తాయి. వారు అలా చేస్తున్నారని మేము కూడా అలానే చేయాలని అనుకోవడం బాగుండదు, ఆ అవసరం కూడా లేదు. నేను ప్రసార మాధ్యమాలను, ఆర్టీసిని ఉటంకించడం సరైనదే (అది తెలుగు అంకెలకు సంబంధించిన విషయమే మరి). ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఆర్టీసి వారే బస్సుపై తెలుగు అంకెలను వెనక్కి తీసుకున్నప్పుడు తెలుగు అంకలపై తెలుగు ప్రజలకు ఎంత అవగాహన ఉందో ఊహించవచ్చు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. అంతకు ముందునుంచే తెవికీ ఇదే అభిప్రాయంపై ఉంది. వార్తాపత్రికలలో ఎప్పుడో ఒకప్పుడు, ఎవరిపైనే చేసిన విమర్శలు మాకు అవసరం లేదు. ప్రసార మాధ్యామాల సాధారణ భాష గుంచి మాత్రమే చెప్పాను. . సి. చంద్ర కాంత రావు - చర్చ 18:37, 19 ఆగష్టు 2010 (UTC)
తెలుగు ప్రజానీకం కోసం తయారవుతున్న తెవికీని తెలుగు సమాజం, తెలుగు ప్రసార మాధ్యమాలు, తెలుగు ప్రాంతపు సంఘటనలతోనే పోల్చుకోవాలి కాని కన్నడ, గుజరాతీ, హిందీ, ఉర్దూ వికీల గురించి పోల్చడమెందుకు? (అవి సోదర వికీ ప్రాజెక్టులయినా సరే) అక్కడి పద్దతులు కొన్ని నచ్చితే తీసుకోవచ్చు అంతేకాని తెలుగు అంకెలకు సంబంధించి ఇది వర్తించదు. కర్ణాటకలో, గుజరాత్‌లో ఆయా భాషల అంకెల వినియోగం ప్రజలలో ఉండవచ్చునేమో ! ఆ ప్రాంతానికి సంబంధించి అది సరైనప్పుడు ఈ ప్రాంతానికి కూడా ఆ పద్దతే సరైనదని అనుకోలేము. ఆయా భాషలలో వారి అంకెల వినియోగం లేకున్ననూ వారెందుకు ఉపయోగిస్తున్నారనేది అక్కడే తేల్చుకోవాలి. తెలుగు భాషలో అంకెల వినియోగం ఎందుకు లేదన్నది తెవికీకి సంబంధం లేని ప్రశ్న. తెలుగు ప్రజలందరూ వాటినే ఉపయోగించాలని తెవికీ బలవంతం చేయదు. ఉన్న పరిస్థితులను అనుగుణంగా తెవికీ నడుచుకుంటుంది, మార్పులకు అనుగుణంగా తెవికీ కూడా మారుతుంది. సి. చంద్ర కాంత రావు - చర్చ 19:45, 19 ఆగష్టు 2010 (UTC)
చంద్రకాంతరావు గారి స్పందనకు ఏకీభవిస్తున్నాను. ప్రపంచమే ఒక గ్రామముగా మారుతున్నప్పుడు, ఒకేవిధమైన అంకెలు చాలావరకు సొలభ్యంగా వుంటాయి. కన్నడ సంఖ్యలు వాడే మోటారు వాహనం ప్రమాదంలో చిక్కుకుందనుకోండి, మీకు ఆ అంకెలు తెలియకపోతే, కనీస విలువైన సమాచారాన్ని తెలియచేయటంలో కష్టాన్ని గమనించండి --అర్జున 04:28, 20 ఆగష్టు 2010 (UTC)
  • చాలా మంది తెలుగు ప్రజలకు తెలుగు సంఖ్యలు ఉన్నట్టు కూడా తెలియదు. తెవికీ ఉద్ధేశం తెలుగు అభివృద్ధి. మరి మనం కూడా తెలుగు సంఖ్యలను వాడక పోతే ఇక భవిష్యత్తు తరాలకు అసలు అవి ఉన్నట్టు కూడా తెలియదు. మనం వాడితే వాటి గురించి తెలుసుకోవాలనే కుతూహలం, ఆతృత మిగిలిన వారికి కలుగుతుంది. నాకు కూడా తెలుగు సంఖ్యలు రావు. కానీ పది సంఖ్యలను గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే సరైన లంకెలను జతచేసి వాడుకరులకు సులభంగా తెలుసుకునేట్టు తోడ్పడితే బాగుంటుంది. అంతర్జాలంలో తెలుగు వాడుకరులు తక్కువ. వాడేవారు తెలుగు మీద అభిమానంతో వాడుతారు. అలాంటి అభిమానులకు పది సంఖ్యలను నేర్చుకోవడం కష్టమేమీ కాదు. ఎలాగూ ఆంగ్ల సంవత్సరాలు, నెలలు వాడుతున్నాం, కనీసం ఆ సంఖ్యలన్నా తెలుగులో ఉంటే బాగుంటుంది. మొదట్లో తెలుగు టైపింగు చాలా కష్టం అనిపించింది. తెలుగు మీద అభిమానంతో రెండు రోజుల్లో బాగా పట్టు వచ్చింది. తెలుగు టైపింగు నేర్చుకోవడం కంటే తెలుగు సంఖ్యలను నేర్చుకోవండం పెద్ద కష్టమేమీ కాదు. ఇదేదో కొత్తగా ఉందే అని అందరికీ కుతూహలం కలిగి వాటి గురించి తప్పక తెలుసుకుంటారు. పాత రోత అని కొత్త సంఖ్యలకు వారు ఆకర్షితులౌతారు. ఒకే విధమైన సంఖ్యలు సౌలభ్యంగా ఉంటాయన్నది నిజమే. మరి ఆ లెక్కన ఒకే భాష మరింత సౌలభ్యంగా ఉంటుంది. అందరం చక్కగా ఆంగ్ల భాష నేర్చుకుందాం. తెవికీ లో మనం తెలుగు పదాలు ఉన్నంతవరకూ వాటినే వాడతాం, లేనప్పుడు అరువు తెచ్చుకుంటాం. మరి సంఖ్యలకు కూడా అదే నియమం ఉండాలి కదా. ఇంటర్నెట్ అంటే అందరికీ అర్ధం అయ్యే పదం, కానీ మనం అంతర్జాలం అంటున్నాం. అలాగే చాలా పదాలు ఉన్నాయి. మనం అంతర్జాలం అని వాడినపుడు , చదివేవాడికి దాని అర్ధం ఏంటో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగి తెలుసుకుంటాడు. కానీ మనం ఇంటర్నెట్ అని వాడితే తెలుగు భాషలో ఒక పదాన్ని తగ్గించిన వాళ్ళమౌతాం.
ఒక పనిచేద్దాం. ఇక్కడ ఓటింగ్ పద్దతి కన్నా ఇంకోలా పరిష్కరిద్దాం. తెలుగు సంఖ్యలు వాడడం వల్ల ఉపయోగాలు మరియు ఆంగ్ల సంఖ్యల వల్ల ఉపయోగాలు అని రెండు గ్రూపులు రాసి తర్వాత ఏది సబబు అనిపిస్తే అది వాడదాం. అలా కాకుండా డైరెక్టుగా ఓటింగ్ పెట్టడం వల్ల అందరూ ఆంగ్ల సంఖ్యల పట్ల మొగ్గు చూపుతారు. ముందు రెండు గ్రూపులను పరిశీలించి తర్వాత వాడుకరులను ఓట్ చెయ్యమంటే సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. లేకపోతే అందరూ నాకు ఇది అర్ధం అవుతుంది కనుక నేను దీనికి ఓట్ వేస్తా అని వేస్తారు. --శశికాంత్ 06:05, 20 ఆగష్టు 2010 (UTC)
అయ్యా! మీ మాతృభాషా అభిమానానికి, వెలుబుచ్చిన సందేహానికి జేజేలు. తెలుగు వికీపీడియాలో కూడా తెలుగు అంకెలు వాడే రోజూ వస్తుందని ఆశిద్దాం. ఇహపోతే, తెలుగు అంకెలు ఎందుకు వాడట్లేదంటే ప్రస్తుతపు తెలుగు అచ్చులో (పత్రికలు, పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు ఇతరత్రా తెలుగు సాహిత్యంలో) వాటిని వాడట్లేదు. వికీపీడియా వాటిని ప్రతిఫలిస్తుందే కానీ, మార్గనిర్దేశం చెయ్యదు. ఎందుకు చెయ్యకూడదు? అని మీరు అడగనూ వచ్చు. అది కూడా సమంజసమైన ప్రశ్నే. వికీపీడియా ఏ వాదాన్ని తలకెత్తుకోదు (అభ్యుదయవాదం, భాషా, సంఘసంస్కరణా వాదం, సాంప్రదాయవాదం). అలా చేస్తే మొదటికే మోసమొచ్చే ప్రమాదముంది. ఇంకా వికీపీడీయా ఏదికాదో తెలుసుకోవటానికి WP:NOT చదవండి. మీరు ఉదహరించిన భారతీయ వికీల్లో ఆయా భాషాల అంకెలు వాడుతున్నారంటే వాళ్ళ సాహిత్యంలో ఇంకా స్థానిక అంకెలే వాడుతూండవచ్చు లేకపోతే కాస్త భాషాసంస్కరణను నెత్తికెత్తుకొని ఉండవచ్చు. (భాషా సంస్కరణేం ఖర్మ కొన్ని భారతీయ వికీలు సంఘ సంస్కరణను కూడా నెత్తికెత్తుకొనటం నేను చూశాను) మన ఖర్మానికి మన భాషలో స్థానిక అంకెలు వాడుకలో లేవు. భాషా సంస్కరణను నెత్తికెత్తుకొనే ఉద్దేశం తెవికీ సమాజానికి లేదు. --వైజాసత్య 06:29, 20 ఆగష్టు 2010 (UTC)
వైజాసత్య, మీరు వికీపీడియా ఏ వాదాన్ని తలకెత్తుకోదు( అభ్యుదయవాదం, భాషా, సంఘసంస్కరణా వాదం, సాంప్రదాయవాదం) అంటూనే తెలుగు అంకెలు వాడే రోజూ వస్తుందని ఆశిద్దాం అంటునారు, మీ ఆశాభావం ఎలావునపటికి తెలుగు అంకెలు వాడే సమయం ఇపుడే ఎందుకు కాకూడదు? "భాషా సంస్కరణేం ఖర్మ కొన్ని భారతీయ వికీలు సంఘ సంస్కరణను కూడా నెత్తికెత్తుకొనటం నేను చూశాను" అని అనారు ఈలాంటి సందర్బం ఏదైనా వుంటే దయచేసి చేపగలరు(along with citations and links if any), ఎందుకంటే బహుశా తెలుగు వికీపీడియాలో తెలుగు అంకెలను వాడుటకు అలాంటి సంస్కరణ మొదలుపెటక తపదేమో? ఎందుకంటే నేను కూడా తెవికీ సమాజానికి చెందినవాడినే.
చంద్ర కాంత, మీరు తెవికీ ని ఇతర సోదర వికి ప్రాజెక్టులతో పోల్చలేనపుడు మరి తెలుగు అచ్చులతో(పత్రికలు, పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు ఇతరత్రా తెలుగు సాహిత్యంలతో) లేదా అర.టి.సిలతో పోల్చటం తగదు. మన సరళి ఎవరికీ ఇబంది కలగకుంట వుంటే చాలేమో, కానీ అందుకొరకు తెలుగు పదాలకు మరియు అంకెలకు ప్రత్యంన్యయంగా ఇతర భాషలోని పదాలను ఆశ్రయించుట సభబుకాదు. మీకు తెలుసో లేదో మనము ఇలాగే కొనసాగిస్తే చాలా ఈబండులకు గురి అవుతాము, వాడుకలోవున సరళి/ శైలి అని మనము పటుకు కూర్చుంటే మొదటికే మోసంవస్తుంది.--Ranjithsutari 09:48, 20 ఆగష్టు 2010 (UTC)
రంజిత్ గారూ, ఎప్పటికైనా వికీలో తెలుగు అంకెలు వాడే రోజు వస్తుందని వ్యక్తం చేసింది, సమాజంలో తిరిగి తెలుగు అంకెలకు ప్రాముఖ్యత పెరిగి, విరివిగా వాడబడితే, అప్పుడు తెలుగు వికీలో కూడా వాడవచ్చు అనే వ్యక్తిగత ఆశావాహం తప్ప మరేమి కాదు. నా వ్యక్తిగత అభిప్రాయానికి, వికీ పద్ధతికి ఏమి సంబంధం లేదు. వికీలో భాషా సంస్కరణ మొదలెడితే అది అంకెలతో ఆగదు. అప్పుడు వికీ నవ్వులపాలై, నిరుపయోగమౌతుంది అంతకు తప్ప ఒరిగేదేమీ లేదు. నేను అన్న "మొదటికి మోసం" వికీ మూల ఉద్దేశ్యం చెడుతుందని. మీరంటున్న "మొదటికి మోసం" భాష గుల్లైపోతుందని. మీ అవేదనను నేను అర్ధం చేసుకోగలను. వికీ శక్తివంతమైన మాధ్యమమే కానీ భాషను సంస్కరించేంత సత్తా లేదు. వికీలో ఒక పదం కానీ పద్ధతి కానీ, అంకెలు కానీ వాడినంత మాత్రాన అవి భాషలో భాగమై పోతాయని, భాషను ఉద్ధరిస్తాయని అనుకోవటం మృగతృష్ణే. ఉదాహరణకి : మీకు బణువు అన్న పదం తెలుసా? తెలీకపోతే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అమెరికాలో ఒక తెలుగు ఆచార్యులవారు దీన్ని సృష్టించారు. 60 లలో ఆయన వ్రాసిన కొన్ని సైన్సు పుస్తకాలలో కూడా ఉపయోగించారు. ఆయన దాన్ని ప్రచారం చెయ్యటానికి ఇక్కడా ఒక వ్యాసం సృష్టించారు. అది ఇంకో వందేళ్ళైనా, వికీలో ఉన్నా ఎవరికీ తెలియదు, ఎవరూ దాన్ని ఉపయోగించరు. ఎందుకంటే అది వాడుకలో నాని వచ్చిన పదం కాదు. పాఠ్యపుస్తకాల్లో చేర్చి లక్షలాదిమంది విద్యార్ధులకు నేర్పినది కాదు. అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ దీని వళ్ళ వికీ ఎలా నవ్వులు పాలౌతుందని మీరు అడగవచ్చు. ఇంకొన్నాళ్ళకు నా లాంటి ఎల్లయ్య ఒకరు వచ్చి, నేను బణువుకే మరో పదం చెణువు అని సృష్టించాను, నా బ్లాగులో కూడా వాడాను అని చెణువు అన్న పేరుతో వ్యాసం సృష్టిస్తారు. ఇలా పరస్పర విరుద్ధమైన, హాస్యాస్పద పదాలతో వికీ ఒక కలగూరగంపై ప్రామాణికత కోల్పోతుంది. అందుకనీ ఇక్కడి నుండి నరుక్కు రావటం వళ్ళ పెద్ద ప్రయోజనం లేదు. తెలుగు అంకెలు కానీ, తెలుగు పదాలు కానీ ప్రాచుర్యం పొందాలంటే వాడుక పెంచడానికి ప్రయత్నించండి. పాఠ్యపుస్తకాల్లో చేర్చటానికి, పిల్లలికి నేర్పటానికి ఉద్యమించండి. మీ రోజువారీ పనుల్లో ఉపయోగించండి. అప్పుడు వికీలో సమస్తం అంకెలు మార్చటం ఒక చిటికెలో పని. మీ అభిప్రాయానికి ఇక్కడ స్థానం లేదని కాదు. రంజిత్ గారు చెప్పారని ఈ రోజు మారిస్తే, రేప్పొద్దున ఇంకో సభ్యుడు వచ్చి, ఆంగ్ల అంకెలకు మార్చండి అన్నప్పుడు నిరాకరించడానికి హేతువేమీ ఉండదు.
భారతీయ వికీల్లో సంఘ సంస్కరణా ధోరణులకు ఉదాహరణ అడిగారు - నాకు ఇప్పుడు అది వెతికి పట్టుకునే ఓపిక లేదు కానీ స్థూలంగా విషమేమిటంటే, తమిళ వికీలో అనుకుంటా కొన్నేళ్ళ క్రితం, వ్యక్తుల గురించి వ్యాసాలు వ్రాస్తున్నప్పుడు కుల ప్రస్తావన అనవసరం, కులాని ప్రస్తావిస్తే వాటికి ఇంకా నవ సమాజంలో ఆమోదముద్ర వేస్తున్నట్టే, కాబట్టి ఇక్కడ కులాల ప్రస్తావన కూడదు అని కొందరు అభ్యుదయవాద సభ్యులు ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత దాని గురించే ఏంచేశారో తెలీదు కానీ అదన్నమాట. అంతెందుకు ఇక్కడా అప్పుడప్పుడు అలాంటి సభ్యులు తారసపడతారు. మన వ్యక్తిగత ఆశలు, ఆశయాలు, ఉద్దేశాలకు (మంచివైనా) వికీ వేదిక కాదు, కాకూడదు. --వైజాసత్య 17:41, 20 ఆగష్టు 2010 (UTC)
  • చర్చ పొడుగిస్తున్నందుకు తప్పుగా అనుకోకండి. తెలుగు అంకెలు వాడుకలో లేవని ఎవరు చెప్పారు. అంతర్జాలంలో వాడుకలో ఉన్నాయి. పుస్తకాలలో వాడుకలో ఉన్నాయి. కాకబోతే విరివిగా ఉపయోగించట్లేదు. అంతే గాని అసలు వాడుకలో లేవన్నది అవాస్తవం. కావాలంటే ఈ లంకెని చూడండి. 70 వేల లంకెలలో తెలుగు సంఖ్య ౧ ఉన్నది. http://www.google.co.in/#hl=te&q=%E0%B1%A7+&aq=f&aqi=&aql=&oq=&gs_rfai=&fp=b7a9349d932124f4 ఇక పుస్తకాల విషయానికి వస్తే నా దగ్గర రామాయణము , భగవద్గీత, పంచాంగ పుస్తకాలలో వీటిని వాడారు. తెలుగు పద్యాలు ఉన్న మరో పుస్తకంలో కూడా చూశాను. కనుక ఇది భాషా సంస్కరణ కిందకు రాదు. ఉద్యమం కిందకు రాదు. ఎవరికి నచ్చిన సంఖ్యలను వారిని వాడుకోనివ్వండి. నిషేధించాల్సిన అవసరం ఎందుకు ? అసలు వీటి మీద ఏ సంస్ధ కూడా నిషేధం విధించలేదు. కేవలం ఒక్క లంకె కాదు, 70 వేలు. అంతే కాదు, మిగిలిన సంఖ్యలకు కూడా అంతే ఫలితాలు వచ్చాయి చూడండి. కాని అంతర్జాలం అన్న పదానికి కేవలం 14,900కు పైగా ఫలితాలు వచ్చాయి.http://www.google.co.in/#hl=te&q=%E0%B0%85%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B2%E0%B0%82&aq=1&aqi=g10&aql=&oq=%E0%B0%85%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B2&gs_rfai=&fp=b7a9349d932124f4 మరి అది వాడుతున్నప్పుడు దానికి రెట్టింపు ఫలితాలు వచ్చిన సంఖ్యలను ఎందుకు వాడకూడదు. అంతర్జాలం పదానికన్న తెలుగు సంఖ్యలు రెట్టింపు ఉపయోగంలో ఉన్నాయి. మరో విషయం, ఈ సంఖ్యలను మేము కనిపెట్టలేదు. బణవుతో పోలిక తప్పు.

http://www.google.co.in/#hl=te&q=%E0%B1%A8&aq=&aqi=g10&aql=&oq=%E0%B1%A8&gs_rfai=&fp=b7a9349d932124f4 89,900కు పైగా ఫలితాలు
http://www.google.co.in/#hl=te&q=%E0%B1%A9+&aq=&aqi=g2&aql=&oq=%E0%B1%A9+&gs_rfai=&fp=b7a9349d932124f4 91,700కు పైగా ఫలితాలు
http://www.google.co.in/#hl=te&q=%E0%B1%AA&aq=f&aqi=g10&aql=&oq=&gs_rfai=&fp=b7a9349d932124f4 1,030,000కు పైగా ఫలితాలు
http://www.google.co.in/#hl=te&q=%E0%B1%AB&aq=f&aqi=g6&aql=&oq=&gs_rfai=&fp=b7a9349d932124f4 59,100కు పైగా ఫలితాలు
http://www.google.co.in/#hl=te&q=%E0%B1%AC&aq=f&aqi=g3&aql=&oq=&gs_rfai=&fp=b7a9349d932124f4 57,200కు పైగా ఫలితాలు
http://www.google.co.in/#hl=te&q=%E0%B1%AD&aq=f&aqi=g2&aql=&oq=&gs_rfai=&fp=b7a9349d932124f4 52,400కు పైగా ఫలితాలు
http://www.google.co.in/#hl=te&q=%E0%B1%AE&aq=f&aqi=g2&aql=&oq=&gs_rfai=&fp=b7a9349d932124f4 55,600కు పైగా ఫలితాలు
http://www.google.co.in/#hl=te&q=%E0%B1%AF&aq=f&aqi=g9&aql=&oq=&gs_rfai=&fp=b7a9349d932124f4 58,400కు పైగా ఫలితాలు
--శశికాంత్ 03:25, 21 ఆగష్టు 2010 (UTC)

ఫర్లేదు, సద్భావంతో జరిగే చర్చలన్నీ మంచివే. అసలే కనుమరుగయ్యాయని ఎవరూ అనలేదు. వాడుక అంటే ఇవ్వాళ్టి వ్రాతలో పెద్దగా ఉపయోగించట్లేదనే ఉద్దేశంతోనే చంద్రకాంతరావు గారైనా, నేనైనా చెప్పింది. నేను చదువుకున్నప్పుడు పెద్దబాలశిక్షలో తప్ప మరే పాఠ్యపుస్తకంలోనూ తెలుగు అక్షరాలు కనిపించిన గుర్తు లేదు. కానీ హిందీ పాఠ్యపుస్తకాల్లో హిందీ అంకెలు ఉండేవి. వాడుక అంటే ఉదాహరణకు మీరు సాధారణ జీవితంలోఒక వ్యాసమో, ఒక ఉత్తరమో వ్రాస్తున్నారనుకోండి తెలుగు అంకెలు ఉపయోగిస్తున్నారా? పోనీ ఏదైనా తాజా కబుర్లలో అంకెలు తెలుగు కనిపించాయా లేదే? అలాంటి వాడుకే చర్చలోప్రస్తావించింది. మీరు అంతర్జాలంలో తెలుగు అంకెలకు ఇన్ని ఫలితాలు వచ్చాయని అన్నారు. మరి ఆంగ్ల అంకెలు ఉపయోగించిన తెలుగు పేజీలతో పోల్చుకుంటే ఇవి ఎంత శాతం ఉంటాయంటారు. అంకెలను బణువుతో పోల్చలేదు, భాషా సంస్కరణ తలకెత్తుకొని ఆ దిశగా పయనిస్తే, ఎలాంటి చోటికి చేరతామో ఉదాహరణతో చూపించానంతే. పనిగట్టుకొని తెలుగు అంకెలను ఏమీ నిషేధించలేదు. ఇక్కడా కొన్ని వ్యాసాల్లో అక్కడక్కడా తెలుగు అంకెలున్నాయి. ఎవరికి నచ్చిన సంఖ్యలు వారు వాడుకోవటాన్ని ఎందుకు ప్రోత్సహించడం లేదంటే ఇది ఒక విజ్ఞాన సర్వస్వం, దీనికి కొన్ని భాషా, శైలి ప్రామాణికతలు ఉంటాయి. పుస్తకంలో ఒక పేజీలో ఆంగ్ల అంకెలు, మరో పేజీలో తెలుగు అంకెలు ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చినట్టు వాడితే ఎందుకు బాగుండదో, ఇక్కడా అంతే. మీకు ఉదాహరణ రూపకంగా నిరూపించాలంటే ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్రాస్తే ఇలా ఉంటుంది. దీంతో మళ్లీ భాషా ప్రామాణికత మీద చర్చ లేస్తుందేమో :-)
బణువును, అంకెలను పోల్చలేనట్టే, అంతర్జాలం అన్న పదాన్ని, అంకెలను పోల్చలేము. వ్యక్తిగతంగా అంతర్జాలం అని వికీలో వాడటం ఇంకా premature అని నా భావన. మీ పద్ధతిలో అంకెలకు మరిన్ని ఫలితాలు రావటానికి కొన్ని కారణాలు లేకపోలేదు. అంతర్జాలం బదులు ఇంటర్నెట్టు అన్న పదం తీసుకున్నా అంకెలతో ఓడిపోతాయని నా అభిప్రాయం. ఎందుకంటే, ఇంటర్నెట్టు అన్న ఒక్క పదం కంటే అంకెలను (తెలుగైనా, ఇంగ్లీషైనా) విరివిగా ఉపయోగిస్తారు కాబట్టి (usage bias). రెండవ కారణం ఈ తెలుగు అంకెలను కొన్ని వందల ఏళ్ల సాహిత్యంలో వాడారు. ఆ సాహిత్యం అంతర్జాలలో ఎక్కడున్నా శోధనా ఫలితాల్లో వస్తుంది. కానీ అంతర్జాలం అన్న పదం కొత్తది. దానికి అంకెలంత చరిత్ర లేదు. మూడవ కారణం అంకెలు శోధిస్తున్నప్పుడు variant forms, conjugates శోధనలో మిస్సయ్యే అవకాశం లేదు. అదే అంతర్జాలం అన్న పదానికి చాలా variant forms, conjugates ఉన్నాయి అవన్నీ శోధలలో దొరికి ఉండకపోవచ్చు. నాలుగవ కారణం అంకెలు ఒక విషయసందర్భం లేకుండా ఎక్కడైనా ఉండొచ్చు. కానీ అంతర్జాలం అన్న పదం అసందర్భంగా రామకోటిలాగా ఎక్కడైనా వ్రాస్తారని నేననుకోను. :-) వైజాసత్య 06:41, 21 ఆగష్టు 2010 (UTC)
శశికాంత్, మీరు తెవికిలో తెలుగు అంకెలను వాడుటకు సమర్దిస్తునందుకు మీకు దన్యవాదములు, మీరు చేపినటుగా "ఎవరికి నచ్చిన సంఖ్యలను వారిని వాడుకోనివ్వండి" అనే దానికి నాకు ఎలాంటి అబ్యంతరము లేదు.
వైజాసత్య, మీరు ఈకడ తపు-ఒప్పు, మంచి-చెడు లాంటివి మాట్లాడే టపుడు దయచేసి దానికి సంబంధిత వికీ policies ను చేపగలిగితే చాల బాగుంటుంది, వీలుఅయితే దానికి సంబంధిత link చూపించగలరు. నేను తెలుగు అంకెలను చేర్చుటకు ఉద్యమము చేయమని ఉచిత సలహా ఇచారు దీనికి కూడా వికి policies ను చేపగలిగితే బాగుండేది, లేని పక్షాన మీ వాదన మరియు మీ బావోద్వేగాలను మీవరకే పరిమితం చేసుకుంటే బాగుంటుంది. ఎల్లయాలు-ప్లుల్లయాలు అన్ని వికి ప్రోజేక్టులోను ఉనారు కానీ ఎవనికి లేని సమస్య తెవికికే వస్తుంది అంటే, నేను నమను. ఈకడ నేను తెవికీని కేవలం వికి సోదర ప్రోజేక్టులతోనే పోల్చగలను, ఎందు కంటే లక్షలు-కోట్ల మంది తెలుగు వారితో కానీ వారి విజ్ఞానము-పరిజ్ఞ్యనముతో పోలుచుట సాధ్యము కాదు, ఎందుకంటే వారిలో ఎందరు తెవికి లేదా అంతర్జాలం(Internet) వాడుతారు, కనీసం కంప్యూటర్ ఎందరు వాడుతారు బహుశా ఈ link చుస్తే అర్తమవుతుంది.
బనువు, చేనువు, అంతర్జాలం లాంటి పదాలు ఎ ఏలయ్యయో-పుల్లయో చేర్చితే తెవికిలోని వ్యాసాల సంఖ్యా ఒకటి పెరుగుతుంది కని నవులపాలు కనేకాదు అది అవాస్తవము. ఇంతకూ ముందు మీరు చూపించిన ఉదాహరణ మీరు మార్పులు చేసిన తరువాత ఈలావుంది, దీనిలో గమనించదగ మార్పులు ఏమీలేవు కాకపోతే ఆంగ్లములో వున C.M ను తెలుగు అక్షరాలతో సి.ఎం. గా దిదుబాటుచేసారు, చాల బాగుంది కాకపోతే అలాగే అ ఆంగ్లములో వున అంకెలను కూడా తెలుగు అంకెలతో దిదుబాతుచేస్తే ఇంకా చాల చాల బాగుంటుంది. పర్వాలేదు ఇపుడు నేను దిదుబాటు చేశ్యను దీనిని మీరు చేసినటే ఆంగ్ల అంకెల స్తానంలో తెలుగు అంకెలు చేర్చాను. నా దృష్టిలో ఇది భాషా సంస్కరణం లేదా ఉద్యమం అతకనా కాదు. దయచేసి ఈ విషయాని మీరు అర్తంచేసుకో గలరు అని ప్రార్థన. ఇంతకూ (usage bias) అనేది తెవికి గని వికి policy కాదు, కాబటి దానిగురించి చర్చించి ఉపయోగం లేదు.--Ranjithsutari 11:11, 22 ఆగష్టు 2010 (UTC)
ఈ చర్చ కొనసాగింపు రచబండలో చూడవచు.

నియోజకవర్గాల వ్యాసాలు[మార్చు]

అన్ని నియోజకవర్గాల వ్యాసాలలో ఒకే సమాచారం (లింకు) చేర్చడానికి చేతితో కాకుండా బాటు ద్వారా తేలికగా చేయవచ్చు. వైజాసత్య గారికి తెలిపితే ఈ పని సులువుగా చేయగలరు. అంతేకాకుండా మీరు చేరుస్తున్న లింకు (వ్యాసంపేరు) కూడా మార్చాల్సి ఉంది. మీరు ఈ విధంగా చేస్తే మీ శ్రమ వృధా కావచ్చు. ఈ పనిని వెంటనే ఆపగలరు. సి. చంద్ర కాంత రావు - చర్చ 15:31, 31 ఆగష్టు 2010 (UTC)

నియోజకవర్గాల వ్యాసాలో మరియు శాసనసభ్యుల వ్యాసాలో లింకు ని bot ద్వారా చేర్చుటకు నాకు ఎలాంటి అబ్యంతరము లేదు, కానీ అపటివరకు నా పని కొనసకించాలి అనుకుంటునాను. మీరు వ్యాసం పేరు పై అభ్యంతరం చెపారు, కానీ అది స్పస్టముగా చేపగలరు, ఎందుకంటే నాకు ఈ వ్యాసం పేరు పై ఎలాంటి సమస్య కరపదుట లేదు, పేరు మార్చే ముందు చేర్చ అవసరము.--Ranjithsutari 15:49, 31 ఆగష్టు 2010 (UTC)
వ్యాసం పేరు మార్పుకు కారణం, కొత్త పేరు ఆ వ్యాసపు చర్చా పేజీలో వ్రాశాను. మీరు లింకులను చేర్చే పని ఆపి సమాచారం చేర్చే పని కొనసాగిస్తే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు - చర్చ 16:04, 31 ఆగష్టు 2010 (UTC)
నేను అ ప్రతిపాదనను చూసాను, వేరే ఈతర సబ్యులు అభిప్రాయం కొరకు ఎదురు చూస్తునాను. నా దృష్టిలో వ్యాసములో ఎలాంటి అక్షరాని లేదా ఎలాంటి చిహానాని చేర్చినా అది సమాచారమే, అది లింకు చేర్చే పని కూడా. దినికి భిన్నంగా మీరు అనుకుంటే నా పనిని ఆపటము ఎందుకు?--Ranjithsutari 16:57, 31 ఆగష్టు 2010 (UTC)
బాటు ద్వారా సునాయాసంగా చేసే పనికి మానవశ్రమ ఎందుకు? అవసరమైతే సమాచారం చేర్చి వ్యాసాల నాణ్యతకు దోహదపడాలి ! తెవికీ ఒక సమాజము లాంటిది. ఇతర సభ్యుల సూచనలు, సలహాలు పాటించకపోతే ఏకపక్షంగానే వ్యవహరించినట్లవుతుంది. నా సూచన నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఇదివరకు ఎందరో, ఎందరికో ఇచ్చిన సూచన. ఇది అందరూ పాటించినదే అంతేకాని ఉచిత సలహా కాదు. సి. చంద్ర కాంత రావు - చర్చ 18:16, 31 ఆగష్టు 2010 (UTC)
అసెంబ్లీ పేరుతో ఉన్న నియోజకవర్గాల వ్యాసాలను శాసనసభ పేరుకు ఎందుకు తరలించారు. ఎవరి ప్రమేయం లేకుండా ఎకపక్షంగా తరలించడానికి ఏమి అధికారం. ఇదే విషయంపై ఇదివరకు చర్చ జరిగింది. చర్చా పేజీలో వ్రాయకుండా తరలించడమెందుకు? సి. చంద్ర కాంత రావు - చర్చ 18:23, 31 ఆగష్టు 2010 (UTC)
ఇంతకు ముందు చర్చ వివరాలు నాకు తెలియవు కాని, ఇంగ్లీషు పదాలని వాడుకలోవున్న తెలుగు పదాలతో మార్చటము నేను ఇష్టపడతాను. మార్పులు విస్తృతి ఎక్కువగావున్నప్పుడు చర్చించి చేయటం మంచిది. ఇక లింకులు చేర్చటము మంచిదే. ఈ విషయము గురించి ఆసక్తి గల వారు ఎక్కువగా వుంటే (చంద్రకాంతరావు గారు కూడ ఈ విషయమై నిర్వాహకునిగా మాత్రమే కాక, విషయాన్ని చేర్చటంలో ఆసక్తి వుందని అనుకుంటున్నాను) ప్రాజెక్టు గా చేపట్టటం మంచిది. మనందరి ఉద్దేశ్యము వికీపీడియాని నలుగురికి ఉపయోగపడేటట్లు చేయడము కాపట్టి కాస్త పట్టు విడుపు ధోరణితో సహకరించమని మనవి.--అర్జున 05:02, 1 సెప్టెంబర్ 2010 (UTC)
ఇతర సభ్యుల సూచనలు, సలహాలను నేను ఎల్లప్పుడు ఆహ్వానిస్తాను. మీరు ఇచ్చె సూచనలు, సలహాలను సూటిగా మరియు స్పష్టంగా చెప్పితే బాగుంటుంది, కానీ అదే వికి పాలసీ అని నన్ను ఇబ్భందిపెట్టవదు. చాలా కష్టముగా వుండే పనిని తప్ప ఇతర మార్పులు-చేర్పులకు బాటు సహాయము నాకు అవసరం లేదు.--Ranjithsutari 13:22, 1 సెప్టెంబర్ 2010 (UTC)
మీరు ఎ అధికారంతో మార్పులు-చేర్పులు చేస్తునారో, నేను కూడా అదే అధికారంతో మార్పులు-చేర్పులు చేస్తునాన్ను.--Ranjithsutari 14:32, 1 సెప్టెంబర్ 2010 (UTC)
Ranjithsutari గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. సూటిగా చెప్పటానికి మీకర్ధం కానిది పెద్దగా లేదు. తెవికీలో విస్తృత మార్పులు చేయాలనుకున్నప్పుడు ఇకముందు చర్చించి చేయండి. అలాగే తెలుగు అంకెలు వాడటం మాని, మీరు ఇప్పటికే అమలులోవున్న తెవికీ పద్ధతులను (అంతార్జతీయ రూపాలైన భారత అంకెలు) పాటించండి. మీరు ఏదైనా మార్పులు ప్రతిపాదించదలచితే సంప్రదింపు (రచ్చబండ) విధానాలను వాడి సహకరించండి. సంప్రదింపులద్వారా పరిష్కరించుకోలేనిది, ఏకాభిప్రాయం సాధించలేని విషయాలు వికీపీడియాలో లేవని నా నమ్మకం--అర్జున 14:26, 1 సెప్టెంబర్ 2010 (UTC)
Arjun గారు, మీ స్పందనకు ధన్యవాదాలు, మొత్తం ౨౯౪(294) నియోజకవర్గాల వ్యాసాలు వుంట్టే, నేను కేవలం ౩౮(38) వ్యాసాల పేరులను, మిగతా నియోజకవర్గాల వ్యాసాలో ఉన్నట్టే, అసెంబ్లీ స్థానంలో శాసనసభ అని మార్చాను. ఇంతలో Chandra Kanth గారికి మొత్తం నియోజకవర్గాల వ్యాసాల పేరులతో లేని సమస్య నేను చేసిన్న ౩౮(38) మార్పులతోనే వచ్చింది. ఎందుకు?
తెలుగు అంకెల విషయములో నేను మీతో విబెదిస్తునాను, కేవలం అంతర్జతీయ రూపాలైన భారత అంకెలనే వాడాలి అంటే. మరి అలాంటపుడు అంతర్జతీయ రూపమైన భారత ఆంగ్ల బాషను వాడితే సరిపోతుంది, తెవికీ అవసరమే వుండ్డక పొవచు. తెలుగు అంకెల కొరకు రచ్చబండలో చర్చ కొనసాగుతుంది, దయచేసి ఈ అంశము అక్కడే చేర్చించగలరు.--Ranjithsutari 17:36, 1 సెప్టెంబర్ 2010 (UTC)
మీరు సూటిగా చెప్పమన్నారని చెప్పాను. తెలుగు అంకెల విషయంలో పాల్గొన్న అందరి అభిప్రాయాలు చర్చా పేజీల్లో ఇప్పటికే వున్నాయి. చర్చ కొనసాగించటానికి కొత్త ఆలోచనలు, దృక్పధాలు లేవు.--అర్జున 03:08, 2 సెప్టెంబర్ 2010 (UTC)

విద్య, ఉపాధికి తోడ్పాటు[మార్చు]

మీరు విద్య, ఉపాధి వ్యాసాల మెరుగుదలకు తోడ్పడుతున్నందులకు ధన్యవాదాలు. -- అర్జున 12:31, 22 సెప్టెంబర్ 2010 (UTC)

మీ అభిమతమునకు నేను కృతజ్ఞ్యుడిని.--Ranjithsutari 12:42, 22 సెప్టెంబర్ 2010 (UTC)