Jump to content

సహాయం:ఇటీవలి మార్పులు

వికీపీడియా నుండి

వికీపీడియాలో ఇటీవల జరిగిన దిద్దుబాట్లను ఇటీవలి మార్పులు పేజీలో చూడవచ్చు. ఇతర సభ్యులు చేస్తున్న దిద్దుబాట్లను చూసేందుకు, తప్పులను గమనించేందుకు, దుశ్చర్యలపై ఓ కన్నేసి ఉంచేందుకు ఈ పేజీ ఉపయోగపడుతుంది. పేజీకి ఎడమ వైపున ఉండే పరస్పరక్రియ లో ఇటీవలి మార్పులు పేజీకి లింకు ఉంటుంది. [[ప్రత్యేక:Recentchanges]] అని రాసి ఈ పేజీకి లింకు ఇవ్వవచ్చును కూడా

అభిరుచులు

[మార్చు]

ఇటీవలి మార్పులు ఎలా కనబడాలనే విషయాన్ని తమ అభిరుచికి అనుగుణంగా పెట్టుకునే వీలు లాగిన్ అయిన సభ్యులకు ఉంది. వివరాలకు లాగిన్ అవడం ఎలా, అభిరుచులను సెట్ చేసుకోవడం ఎలా చూడండి. కింది వికల్పాలలో మార్పులు చేసి, ఇటీవలి మార్పులు కనబడే విధాన్ని మార్చుకోవచ్చు:

  • ఇటీవలి మార్పుల సంఖ్య. ఇటీవలి మార్పులు పేజీలో డిఫాల్టుగా కనిపించే మార్పుల సంఖ్యను ఎంచుకోవచ్చు. ఒకసారి ఆ పేజీలోకెళ్ళాక, ఆ సంఖ్యను మార్చుకునే లింకులు కూడా ఉన్నాయి.
  • ఇటీవలి మార్పులు లో చిన్న మార్పులను దాచు - చిన్న మార్పులు కనబడవు;

"ఇటీవలి మార్పులు" పేజీ పై భాగం

[మార్చు]

Special:Recentchanges పేజీ పైభాగాన ఇతర సమీక్షా ఉపకరణాలు అనే విభాగంలో కనిపించేది మీడియావికీ:Recentchangestext పేజీలో ఉన్న టెక్స్టు. ఈ టెక్స్టును మార్చుకునే వీలు ఉంది.

ఫలానా సమయం నుండి జరిగిన మార్పులను చూడడం

[మార్చు]

మీరు 09:44, 2 జూన్ 2007 కు ఇటీవలి మార్పులు పేజీని తెరిచారనుకుందాం. పేజీలో "09:44, 2 జూన్ 2007 వద్ద మొదలు పెట్టి కొత్త మార్పులు చూపించు" అనే లింకు కనిపిస్తుంది. ఈ లింకును నొక్కితే పై సమయం తరువాత జరిగిన మార్పులను మాత్రమే చూపిస్తూ ఇటీవలి మార్పులు పేజీ వస్తుంది. లేదా, కింది url కు వెళ్తే సరిపోతుంది:

http://te.wikipedia.org/w/index.php?title=ప్రత్యేక:Recentchanges&from=20070602041452

(ఫార్మాటు: yyyymmddhhmmss, UTC సమయం).

పై url ను అడ్రసుబారులోకి కాపీ చేసి తేదీ, సమయాలను మార్చుకోవచ్చు కూడా.

"ఇటీవలి మార్పులు లో కనిపించే శీర్షికల సంఖ్య" అభిరుచులలో పెట్టుకున్నట్టుగానే ఉంటుంది.

ఈ అంశాన్ని "లాగిన్ అయిన సభ్యులను దాచు" తో కలిపి వాడలేరు, URL ను మార్చితే తప్ప.