వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడ్డదారి:
WP:VPR
రచ్చబండ
వార్తలు | పాలసీలు | ప్రతిపాదనలు | సాంకేతికము | ఆలోచనలు | పత్రికా సంబంధాలు | ఇతరత్రా..

సేకరించిన పుస్తక సమీక్షలకు సరైన స్థానం వికీసోర్స్[మార్చు]

ఏ భాషా సాహిత్యంలో ఐనా పుస్తక పరిచయాలు/సమీక్షలు, దాదాపుగా ఆయా పుస్తకాలను ఔపోసన పట్టి, ఆ పుస్తకాల సారాంశాన్ని పాఠకులకు అందించి, అందులోని మంచి చెడులగురించి వివరిస్తాయి. పూర్తి పుస్తకం చదవటానికి చాలినంత వ్యవధి లేని పాఠకుడు, ఈ పరిచయాల ద్వారా తను చదవలసిన పుస్తకాలను ఎంచుకుంటాడు.

Wikisource లో ఆసక్తికరమైన, విజ్ఞానపరమైన, కాపీరైట్ హక్కుల సమస్యలు లేనివి ఇంకా హక్కుదారుల అనుమతితో పుస్తకాలు ఉంచే వీలుంది. పుస్తక ప్రియులకు పుస్తకాలెంత ముఖ్యమో, పుస్తక పరిచయాలు అంతే అవసరం. పుస్తక పరిచయం వ్రాయటానికి సమీక్షకుడు ఎంతో శ్రమించి సమీక్షిస్తాడు. వీటికి వికిసోర్స్ లో స్థానం కల్పించవలసిన అవసరం ఉన్నది. ఆంగ్ల వికీ లో ఉన్న నియమాలను స్థానిక భాషల వికీ కు వర్తింపచేయనవసరం లేదని ముంబాయి WikiConference India 2011 సభలో వికీ వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్ ఉద్ఘాటించాడు. ఏక వ్యక్తి వ్రాసిన పుస్తక సమీక్షలు, రచయితల అనుమతితో, వికీసోర్స్ లో ఉంచాలని ప్రతిపాదిస్తున్నాను. పలువురి అభిప్రాయాలు వ్యక్తమయే వ్యాసాలను ఎప్పటివలే వికీపీడియా లో ఉంచాలి. cbrao 10:23, 23 జనవరి 2012 (UTC)

ఈ విషయం మీరు వికీసోర్స్ రచ్చబండలో రాసి అక్కడే చర్చించండి. --అర్జున 11:55, 24 జనవరి 2012 (UTC)
పుస్తకాల ప్రాజెక్టులోనున్న సుమారు 168 పైగా వ్యాసాలు అన్నీ ఇతరుల సమీక్షలే కదా. అవి మాత్రం వికీపీడియాలో ఉంచి కొన్నింటిని వికిసోర్స్ లో ఉంచితే సగటు రచయితకు అర్ధం కావడం కష్టం. ఇప్పుడున్న వ్యాసాల్ని అలాగే వుంచి కొన్ని ప్రత్యేకమైన ఏకవ్యక్తి వ్రాసిన పుస్తక సమీక్షలు మాత్రం రచయిత అనుమతితో వికీసోర్సులో ఉంచడం సబబుగానే ఉన్నది. రచయితతో అనుమతికి సంబంధించిన అనుమతి లాగ్ చర్చా పేజీలో ఉంచడం ఎంతైనా మంచిది. లేకపోతే కాపీహక్కుల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.Rajasekhar1961 10:26, 25 జనవరి 2012 (UTC)
ఈ చర్చను అదనపు సమాచారం తో వికీసోర్స్ లో ఉంచటమైనది. cbrao 13:47, 25 జనవరి 2012 (UTC)


గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి[మార్చు]

గూగుల్ అనువాద వ్యాసాలు శుద్ది కొరకై తమిళ వికీ వారితో సంప్రదించాను. వారు ఎర్రలింకుల తొలగింపు కొరకు బాటు చేశారు. మన వికీలో కూడా దానిద్వారా సహాయం చేస్తామన్నారు. ఇది చేయకలిగి వాటిలో బాగున్న వాటిని శుద్దిచేసే ప్రాజెక్టు చేపట్టితే సమగ్రవ్యాసాలు చాలా తయారవుతాయి. ఈ రోజు వ్యాసం నడపడానికి కూడా వీలవవచ్చు. అభ్యంతరాలేవైనా వుంటే ఒక వారం రోజులలోతెలపండి, అలాగే దీనిని సమన్వయ చేయటానికి బాధ్యతతీసుకునేవారెవరైనా ముందుకొస్తే బాగుంటుంది--అర్జున 14:51, 9 ఫిబ్రవరి 2012 (UTC)

వికీపీడియా:సంప్రదింపుల కేంద్రం పేరు మార్పు[మార్చు]

వికీపీడియా:సంప్రదింపుల కేంద్రం స్పష్టత ఇవ్వటం లేదు.వికీపీడియా:సహాయ కేంద్రం తో పోలిక వుంది. దీనిని వికీపీడియా: పరిశోధన సంప్రదింపుల కేంద్రంగా మార్చాలని ప్రతిపాదిస్తున్నాను. పాత దానికి వున్నలింకులు దీనికి మార్చి, పాతది తొలగించటం మంచిది. అభ్యంతరాలుంటే వారం రోజులలో స్పందించండి--అర్జున 02:23, 10 ఫిబ్రవరి 2012 (UTC)

సంప్రదింపులకు సహాయంనకు తేడా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పేర్లకు మార్పులు చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:03, 17 ఫిబ్రవరి 2012 (UTC)
ఇంగ్లీషులోని రిఫరెన్స్ డెస్క్ కు సరియైన అనువాదం పరిశోధనల సంప్రదింపు కేంద్రం అని నా ఆలోచన. ఇటీవల తెవికీ మొదటిపేజీని మార్చినతరువాత సంప్రదింపు పేజీ చేర్చబడింది. అది సాధారణ సంప్రదింపులకొరకు. అందుకని దీనిని మరింత అర్థవంతమైన పేరుకు మార్చటాన్ని మరల పరిశీలించండి.--అర్జున 16:14, 20 ఫిబ్రవరి 2012 (UTC)

విక్షనరీ లింకులు[మార్చు]

విక్షనరీ లింకులు వికీపీడియా పేజీలనుండి అంత వుపయోగంగా వుండవు (ఉదాహరణ). వీలైతే వికీసోర్స్. వికీబుక్స్, కామన్స్ లాంటి వ్యాసాని కన్న ఎక్కువ సమాచారము ఇవ్వగల వి మాత్రమే చేర్చుట మంచిది.--అర్జున 07:15, 23 ఫిబ్రవరి 2012 (UTC)

వికీపేజీలనుండి పుస్తకాల తయారీకి కలెక్షన్ పొడిగింపు స్థాపన ప్రతిపాదన[మార్చు]

వికీపీడియాలో చాలా సమాచారము చేరింది. అయితే దీనిని వాడుకోటానికి ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్లో సౌలభ్యాలు పెంచాలి. దీని సమాచారం నుండి పుస్తకాలు తయారు చేస్తే ఆఫ్లైన్ లో వాడుకోవచ్చు. ప్రస్తుతానికి నేరుగా తెలుగులో పుస్తకం చేయలేకపోయనా, ఈ కలెక్షన్ పొడిగింత (Collection Extension)వుంటే సమాచారాన్ని లిబ్రెఆఫీస్ దస్త్రతీరుతో దిగుమతి చేసుకోవచ్చు. ఈపొడిగింత ఇప్పటికే తెలుగు వికీబుక్స్లో స్థాపించబడివుంది. దానినుపయోగించి ఉబుంటు వాడుకరి దర్శిని అనే పుస్తకాన్ని చేయటం జరిగింది. వికీపీడియాలో దీన్ని ప్రవేశపెట్టటానికి అభ్యంతరాలేవైనా వుంటే ఒక వారం రోజులు లో (అనగా 27 మే 2012లోగా) తెలియచేయండి. దీనికోసమై బగ్ నివేదించబడింది. బగ్లో స్పందన ప్రకారం ఈ చర్చ లేక అభిప్రాయసేకరణ జరుపుతున్నాను--అర్జున (చర్చ) 11:19, 20 మే 2012 (UTC)

ఇది ఉపయోగకరమైనది కనుక ఈ విధానాన్ని వికీపీడియాలో ప్రవేశపెట్టవచ్చని అభిప్రాయపడుతున్నాను.--t.sujatha (చర్చ) 16:49, 23 మే 2012 (UTC)
సుజాత గారు మీ సానుకూల స్పందనకు ధన్యావాదాలు. ఈ పొడిగింత ప్రవేశపెట్టటానికి తదుపరి చర్యలు తీసుకుంటాను. (Translation for the understanding of bugzilla staff: Thanks Sujatha for your supporting response. I will take the next steps for implementation).--అర్జున (చర్చ) 03:30, 28 మే 2012 (UTC)
తెలుగు వికీపీడియాలో మంచి వ్యాసాలు తక్కువ. అయినా భవిష్యత్తులో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి తెలుగు వికీపీడియాలో ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టడం మంచిది.Rajasekhar1961 (చర్చ) 05:46, 28 మే 2012 (UTC)
Thanks Rajasekhar for your support. --అర్జున (చర్చ) 09:16, 28 మే 2012 (UTC)
పొడిగింత స్థాపించబడింది. దీనిని పరీక్షించటానికి మీకు కావలసిన వర్గానికి లేక వ్యాసానికి వెళ్లి పక్క పట్టీలో అడుగునవున్న ముద్రించండి/ఎగుమతి చేయండి ఎంచుకొని ఆతరువాత ఓ పుస్తకాన్ని సృష్టించండి ఎంచుకొని అప్పుడు మీ తెరపై పుస్తక కూర్పరి ప్రత్యేక పేజీ కనబడుతుంది. దానిలో పుస్తకం సృష్టికర్తను ప్రారంభించు ఎంచుకుంటే ఆతరువాత మీరు కావలసిన వ్యాసాలను వర్గాలను పుస్తకంలో చేర్చవచ్చు. దానిని పీడియా ప్రెస్ ద్వారా మునుజూపు చూడవచ్చు. భౌతిక పుస్తకం రూపంలో డబ్బు చెల్లించి పొందవచ్చు(ప్రస్తుతానికి ముఖపత్ర పేజీ తప్ప, మిగతా పేజీలలో తెలుగు రూపం సరిగావుంది). దానిని పిడిఎఫ్(.pdf) (ఇది సరిగా లేదు), స్వేచ్ఛా పత్రతీరు (.odt) మరియు ఇతర తీరులలో మీ కంప్యూటర్ లోకి ఉచితంగా తెచ్చుకొని, మీరు ఇతరులతో పంచుకోవచ్చు, నెట్ సంపర్కంలేకున్నా చదువుకోవచ్చు. స్వేచ్ఛా పత్రతీరుని లిబ్రెఆఫీస్ లో తెరచి (బొమ్మలు మానవీయంగా చేర్చాలి) సరిగా కనబడే పిడిఎఫ్ ఫైల్ చేయవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల పుస్తకం తయారు చేస్తే 328 పేజీల పుస్తకం తయారవటం నాకే అశ్చర్య మనిపించింది. మీరు ప్రయత్నించండి.--అర్జున (చర్చ) 03:51, 3 జూన్ 2012 (UTC)
ఈ పుస్తకం రూపొందించడంలో అర్జునరావుగారు చేసిన కృషి అబినందనీయం.--t.sujatha (చర్చ) 13:26, 3 జూన్ 2012 (UTC)
Wikipedia Contributors అనే వాడుకరి పేరుతో తెలుగు వికీపీడియా వ్యాసాలతో కూర్చిన రామాయణం, మహాభారతం పుస్తకాలను ఆర్కీవ్.ఆర్గ్ లో చేర్చారు. చూడండి రామాయణం మరియు మహాభారతం

ఇంగ్లీషు వికీ నుండి మూసలు దిగుమతి చేసికొనుట[మార్చు]

ఇంగ్లీషులో ప్రాంతాలకు కొత్త మూసలు (ఉదా:Infobox Settlement) ఇంతకు ముందలవాడే (IndianJurisdiction లో చాలా దోషాలు వున్నందున) బదులు తయారయ్యాయి. వాటిని తెలుగు వికీలో సులువుగా తెచ్చుకోవాలంటే Special:Import అధికారి నిర్వాహక ఆ పై హోదాగలవారికి పనిచేయాలి. ప్రస్తుతము అది పనిచేయుటలేదు. దానికి మీడియావికీ అమరిక మార్చాలి. దానికి సముదాయ అంగీకారం కావాలి కాబట్టి వికీపీడియన్లస్పందన క్రింది వరుసలలో వారం రోజులలో (అనగా 28 ఆగష్టు లోపల) కోరడమైనది.--అర్జున (చర్చ) 11:46, 21 ఆగష్టు 2012 (UTC)

మద్దతు
 1. --అర్జున (చర్చ) 11:46, 21 ఆగష్టు 2012 (UTC)
 2. రాజశేఖర్Rajasekhar1961 (చర్చ) 15:13, 21 ఆగష్టు 2012 (UTC)
 3. (దీని పైవరుసలో వికీ సంతకం)
తటస్థం
 1. (దీని పైవరుసలో వికీ సంతకం)
వ్యతిరేఖం
 1. (దీని పైవరుసలో వికీ సంతకం)
తీర్మానం 2-0 ఆధిక్యతతో ఆమోదించబడింది.--అర్జున (చర్చ) 11:10, 8 నవంబర్ 2012 (UTC)
వికీ అమరికలలో మార్పులు కలిగినతర్వాత అధికారులందరికి నిర్వాహక ఆ పై హోదాగలవారికి ఈహక్కు వున్నట్లుగా తెలియవచ్చింది. --అర్జున (చర్చ) 05:00, 15 జనవరి 2013 (UTC)

లోగో ప్రతిపాదన[మార్చు]

పాత చర్చ

మిత్రులంతా వివరించిన విధంగా తెవికీ లోగో. రహ్మానుద్దీన్ (చర్చ) 18:25, 11 అక్టోబర్ 2013 (UTC)

రామరాజ ఖతి
బాగానే వుంది. --అర్జున (చర్చ) 05:18, 12 అక్టోబర్ 2013 (UTC)
తదుపరి చర్య ఏమిటి? బగ్జిల్లా లో బగ్ రెయిజ్ చేసి ఈ బొమ్మను ప్రతిపాదించాలా? రహ్మానుద్దీన్ (చర్చ) 06:43, 15 అక్టోబర్ 2013 (UTC)
వికీసోర్స్ లోగో బగ్ చెప్పినట్లు కామన్స్ కి అప్లోడ్ చేసి అక్కడి నిర్వాహకుడికి అభ్యర్ధన చేర్చాలనుకుంటాను. వాడుకరి:Veevenలేక వాడుకరి:రవిచంద్ర కు అనుభవం వుండవచ్చు.--అర్జున (చర్చ) 09:35, 15 అక్టోబర్ 2013 (UTC)

కొత్త ఫైల్ అప్లోడ్ విజర్డ్ తెలుగులో వాడుట[మార్చు]

YesY సహాయం అందించబడింది
--> వికీపీడియా:File Upload Wizard ను తెలుగులో వాడటానికి ప్రయత్నం ఇటీవలే ప్రారంభించాను. దాదాపు ఐదేళ్లపైన మారని మన దస్త్రపు ఎక్కింపుని తాజాచేసుకోవలసిన అ‌వసరముంది. దీనిద్వారా నకలుహక్కులపై విజ్ఞానాన్ని పెంచుటకు, అవసరమైన మూసలు ఫైల్ ఎక్కింపుతోపాటు చేర్చుటకు తద్వారా అనవసర నిర్వహణ పనులు లేకుండా చేయుటకు వీలున్నది. ఇది తెలుగు వికీలో ప్రవేశపెట్టినా ఇంకా నడపడంలో అనుమతి సంపాదించవలసి వున్నందున, దీని వివరాల కొరకు Wikipedia:File_Upload_Wizard/doc చూడండి . ఆంగ్ల వికీలో ప్రయత్నించి చివరిదాకా పరీక్షించండి కాని భద్రపరచవద్దు . దీని ద్వారా ఆంగ్ల వికీలో ఎక్కించిన దస్త్రం వివరాలుఉదాహరణ చూడవచ్చు. రచ్చబండలో ప్రతిపాదించిన సముచిత వినియోగానికి సంబంధించిన తెవికీ నిర్ణయం ఏ విధంగా ఖరారైనా ఇది జరగవలసిన పనే కాబట్టి ప్రతిపాదన సభ్యుల ఒక వారం లోగా (4 నవంబర్ 2013 లోగా) స్పందించమని మనవి.

మద్దతు
 1. రహ్మానుద్దీన్ (చర్చ) 07:52, 28 అక్టోబర్ 2013 (UTC). అయితే, ప్రతి సభ్యుడూ కామన్స్ లో దస్త్రాలను జోడించాలని విజ్ఞప్తి చేయటం కూడా చేయాలి.
 2. విశ్వనాధ్ (చర్చ)।..బావుంది.ఇలా అయితే భవిష్యత్తులో బొమ్మల హక్కుల ఇబ్బందులు రావు.
 3. మంచి ప్రయత్నం. ముందుకు వెళ్ళండి.--Rajasekhar1961 (చర్చ) 07:00, 31 అక్టోబర్ 2013 (UTC)Mediawiki:Common.js --అర్జున (చర్చ) 07:37, 6 నవంబర్ 2013 (UTC)
 4. పాలగిరి (చర్చ) 08:27, 31 అక్టోబర్ 2013 (UTC)
 5. ఇదివరకున్న అప్లోడ్ విజర్డ్ కంటే ఇది మరి క్షుణ్ణంగా ఉంది. --వైజాసత్య (చర్చ) 08:04, 4 నవంబర్ 2013 (UTC)
 6. < ఈవరుసపై # తో మీ సంతకం చేయండి>
వ్యతిరేఖం
 1. < ఈవరుసపై # తో మీ సంతకం చేయండి>
తటస్థం
 1. < ఈవరుసపై # తో మీ సంతకం చేయండి>
దీనిలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ప్రతిపాదన 5-0 ఆధిక్యతతో ఆమోదించబడింది. (Resolution for using the new File Upload Wizard is approved with 5-0 majority)--అర్జున (చర్చ) 03:50, 5 నవంబర్ 2013 (UTC)
నేను ఈ ఫైల్ కి వికీమీడియా సంస్థనుండి ప్రత్యేక అనుమతులు కావాలని పొరబడ్డాను. నివేదించిన బగ్ కి వారు చేయగలిగిందేమి లేదని తెలిపారు. తెవికీలో ఈవిజర్డ్ పనిచేయకపోవటానికి మన తెవికీలో common.cs పాతదైనదని గ్రహించాను. ఆంగ్ల వికీలోని en:Mediawiki:Common.js ని నా వాడుకరి పేజీ యొక్క ఉపపేజీలోకి నకలు చేసి నిష్క్రమించి మరల ప్రవేశించినతరువాత విజర్డ్ పనిచేయటం గమనించాను. మధ్యమధ్యలో పరీక్షకోసం వున్న కోడ్ నుండి సందేశ పెట్టెలు వస్తున్నాయి. వాటిని స్పందిస్తే ఫైళ్లు కోరిన మూసలు మరియు వివరాలతో ప్రవేశపెట్టబడుతున్నాయి. సహ సభ్యులు కూడా అలాగే కామన్స్.జెఎస్ ఫైలుని వారి వాడుకరిపేజీలో ఉపపేజీగా నకలు చేసి స్వల్ప మార్పులు చేయటంతో పనిచేసింది. సహసభ్యులు కూడా పరీక్షించి దోషాలు విజర్డ్ చర్చా పేజీలో తెలపవలసినది. --అర్జున (చర్చ) 07:37, 6 నవంబర్ 2013 (UTC)

అర్జునకు ఇంపోర్ట్అప్లోడ్ హక్కు కొరకు[మార్చు]

ఇటీవల బొమ్మల నకలు హక్కులపరిశీలనలోభాగంగా తాజా మూసలు చాలా ఆంగ్లవికీనుండి దిగుమతి చేయవలసి వస్తున్నది. వీటిని ఒకటి తర్వాత ఒకటి దిగుమతి చేయడంచాలాసమయం పడుతున్నది. 'importupload' హక్కు పొందితే వీటిని సులభంగా చేయవచ్చు. మన తెవికీలో ఇప్పటివరకు ఎవరికీలేనందున దీనికొరకు స్టివార్డ్ లను అనుమతి కోరుదామనుకుంటున్నాను. మీ స్పందనను వారం రోజులలో (4 నవంబర్ 2013 లోగా) తెలియచేయండి

మద్దతు
 1. --K.Venkataramana (talk) 09:45, 28 అక్టోబర్ 2013 (UTC)
 2. పాలగిరి (చర్చ) 04:46, 31 అక్టోబర్ 2013 (UTC)
 3. --Rajasekhar1961 (చర్చ) 05:59, 31 అక్టోబర్ 2013 (UTC)
 4. మీరు నకలుహక్కుల విషయంలో ఇంకా కఠినంగా ఉంటారని ఆశిస్తూ, రహ్మానుద్దీన్ (చర్చ) 07:23, 31 అక్టోబర్ 2013 (UTC)
 5. ఆంగ్లవికీలో చాలా కఠిన నియమాలుంటాయి. అక్కడి నుంచి మూసల దిగుమతికి అభ్యంతరం లేదు కాని బొమ్మల తొలగింపు విషయంలో మాత్రం ఆలోచించాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 07:59, 31 అక్టోబర్ 2013 (UTC)
 6. తెవికీ మెరుగునకు ఒక్కరైనా తప్పక హక్కు కలిగి ఉండాలి...విశ్వనాధ్ (చర్చ) 08:57, 31 అక్టోబర్ 2013 (UTC)
 7. అర్జునరావుగారి ప్రతిపాదనకు నేను మద్దతతు తెలుపుతున్నాను.--t.sujatha (చర్చ) 11:38, 31 అక్టోబర్ 2013 (UTC)
 8. --వైజాసత్య (చర్చ) 05:24, 4 నవంబర్ 2013 (UTC)
 9. <పై వరుసలో # తర్వాత మీసంతకం చేయండి>
వ్యతిరేఖం
 1. <పై వరుసలో # తర్వాత మీసంతకం చేయండి>
తటస్థం
 1. <పై వరుసలో # తర్వాత మీసంతకం చేయండి>
 • దీనిలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ప్రతిపాదన 8-0 ఆధిక్యతతో ఆమోదించబడింది. (Resolution for providing importupload right to User:Arjunaraoc is approved with 8-0 majority)--అర్జున (చర్చ) 03:52, 5 నవంబర్ 2013 (UTC)
తదుపరి చర్యలు

స్టివార్డులు ఈ హక్కుని తిరస్కరించి import వాడుకోమన్నారు. నేను కావలసిన మూసలన్నీ నా ఆంగ్ల వాడుకరిపేజీయొక్క ఉపపేజీలో పెట్టి దానిని దిగుమతి చేసుకుంటే చాలావరకు మూసలు దిగుమతి అయ్యాయి. నిర్వాహకులెవరైనా ప్రయత్నించదలిస్తే ఉపయోగంగా వుంటుందని తెలియచేస్తున్నాను.

 • స్టివార్డు తో సంప్రదించి మూడు నెలలపాటు ఈ హక్కుని పొందగలిగాను. పాలగిరి గారి వ్యాసానికి కావలసిన en:Category:Chembox Template అన్నీ దిగుమతి చేయటం ద్వారా పరీక్షించాను. ఎవరైనా ఎక్కువ మూసలను దిగుమతి చేయాలనుకుంటే నన్ను సంప్రదించండి. --అర్జున (చర్చ) 13:56, 17 నవంబర్ 2013 (UTC)

డైనమిక్ పేజ్ లిస్ట్ ఎక్స్టెన్షన్ స్థాపన[మార్చు]

డైనమిక్ పేజ్ లిస్ట్ ఎక్స్టెన్షన్ స్థాపన వలన సహాయంకోరుతున్న పేజీలను రచ్చబండలోని సహకారం స్థితి పెట్టెలోనే చూపించడానికి వీలవుతుంది. ఇంకా ప్రాజెక్టులలో ఇతరత్రా కూడా వుపయోగముంటుంది. కనుక దీనిని స్థాపనకు సభ్యుల స్పందన వారంలోగా (6 డిసెంబర్ 2013 లోగా)తెలియచేయండి. --అర్జున (చర్చ) 06:15, 29 నవంబర్ 2013 (UTC)

మద్దతు
 1. < ఈవరుసపై # తో మీ సంతకం చేయండి>
వ్యతిరేఖం
 1. < ఈవరుసపై # తో మీ సంతకం చేయండి>
తటస్థం
 1. < ఈవరుసపై # తో మీ సంతకం చేయండి>
Categorytree ఎక్స్టెన్షన్ సరిపోయినందున పై ప్రతిపాదన విరమించడమైనది.--అర్జున (చర్చ) 06:27, 29 నవంబర్ 2013 (UTC)

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు చిహ్నం[మార్చు]

తెలుగు వికీ మిత్రులారా తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు చిహ్నం నేను తయారు చేసిన చిహ్నం చూసి మీ అభిప్రాయాలను తెలుపండి

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు చిహ్నం

--Sureshsuthari (చర్చ) 10:47, 13 డిసెంబర్ 2013 (UTC)సురేష్ సుతారి

Sureshsuthari గారి వ్యాఖ్యకు, దశాబ్ది ఉత్సవాల కార్యనిర్వాహక వర్గ సభ్యులు విశ్వనాధ్.బి.కె ,ప్రణయ్ రాజ్ వంగరి ,కశ్యప్ రహ్మానుద్దీన్ మరియు విష్ణు త్వరలో స్పందించితే బాగుంటుంది. --అర్జున (చర్చ) 05:13, 2 జనవరి 2014 (UTC)
దయచేసి మీరు చేసిన లోగోలను teluguwiki@googlegroups.com వద్ద లోడ్ చేసి అక్కడ సలహాలు సంప్రదింపులు జరపండి. మీరు చేసినవి నచ్చితే ఇక్కడ అప్‌లోడ్ చేద్దాం..కృతజ్నతలు...విశ్వనాధ్ (చర్చ) 08:00, 2 జనవరి 2014 (UTC)
 • విశ్వనాధ్ గారికి, మన క్రియాశీలక సభ్యులు వికీలో నే ఎక్కువమంది వున్నప్పుడు,చర్చలు సాధ్యమైనంతవరకు వికీలోనే చేయటం మంచిదని నా అభిప్రాయం. --అర్జున (చర్చ) 03:17, 3 జనవరి 2014 (UTC)
 • కాని అవసరం లేని ఫొటోలను అప్లోడ్ చేయడం అనవసరం కదా. తరువాత బావున్నట్టుంటే తప్పక వికీలో అప్లోడ్ చేసి దానిని గురించి చర్చలు జరుపవచ్చును..విశ్వనాధ్ (చర్చ) 07:12, 3 జనవరి 2014 (UTC)
విశ్వనాధ్ గారికి, ప్రక్రియకు అవసరమైన ఫోటోలు వికీలో ఎక్కించడంవలన దోషమేమిలేదు. ముందు ముందు ఇటువంటి ప్రక్రియలకు ఉదాహరణగా వుపయోగపడతాయి. పెద్దగా క్రియాశీలంగా లేని మెయిలింగ్ లిస్టులో చర్చలవలన ఉపయోగంలేదు.--అర్జున (చర్చ) 06:13, 12 జనవరి 2014 (UTC)

భాషలో దోషాల మూకుమ్మడి సవరణ[మార్చు]

వ్యాసాల భాషలో దొర్లే తప్పులను సరిచేసుకోవాల్సి ఉంది. బాటొకదాన్ని తయారుచేసి నడిపితే బాగుంటుందని నాకనిపిస్తోంది. కొన్ని పదాలు కొన్ని సందర్భాల్లో తప్పైనా మరి కొన్ని సందర్భాల్లో ఒప్పు కావచ్చు. ప్రస్తుతానికి అలాంటివాటిని వదిలేసి, ఏ సందర్భంలోనైనా తప్పే అయ్యే పదాల విషయంలో బాటును నడపొచ్చు. నాకు తోచినవి కింద రాస్తున్నాను. ఇలాంటి మరిన్ని పదాలను చేర్చుకంటూ ఏ నెలకో రెణ్ణెల్లకో ఓ సారి బాటు నడిపి కొత్తగా చేరే తప్పులను, శైలికి విరుద్ధంగా ఉన్నవాటినీ సవరించుకుంటూ ఉండొచ్చు. ఇలాంటి బాటులు ఈసరికే రాసి నడుపుతూ ఉండి ఉంటే, ఈ ప్రతిపాదన ఓ బాటు కాలం లేటైనట్టే.


సవరణల పట్టిక
తప్పు/శైలికి విరుద్ధం ఒప్పు/శైలికి అనుగుణం
ఆశక్తి, ఆశక్తులు ఆసక్తి, ఆసక్తులు
భాద్యత బాధ్యత
భందము, భంధము, బందము బంధం
అనుభందము, అనుభంధము, అనుబందము అనుబంధం
శాఖాహారం శాకాహారం
సమైఖ్య సమైక్య
"కారణములను" (శైలి) కారణాలను
డబుల్ స్పేసు సింగిల్ స్పేసు
వ్యాకరణ చిహ్నాల ముందు ఖాళీ పెట్టడం, చిహ్నం తరువాత పెట్టకపోవడం (శైలి) చిహ్నానికి ముందు ఖాళీ ఉండకూడదు, తరువాత ఉండాలి


--చదువరి (చర్చరచనలు) 13:43, 1 జనవరి 2014 (UTC)

ఈ విషయమై ఈ పాటికే కృషి జరిగిందని ఇప్పుడే చూసాను. వికీపీడియా:భాషాదోషాల_పట్టిక, సాధారణ_పదదోషాలు_-_తప్పొప్పుల_పట్టిక పేజీల్లో తప్పొప్పుల జాబితా కూడా చూసాను. నాకు తోచిన పదాలను అక్కడే చేరుస్తాను. --చదువరి (చర్చరచనలు) 13:56, 1 జనవరి 2014 (UTC)
చదువరి గారూ, చక్కని ఆలోచన. కొంత పరిమిత కృషి జరిగింది కానీ, ఒక పద్ధతి ప్రకారం జరగలేదు. జయంత్ కుమార్ అనే సభ్యుడు ఒక పట్టిక ప్రారంభించాడు కానీ వాటిని బాటుచే ఇంకా దిద్దించలేదు. ఇక నుండి మీరు బాటుచే సవరించాలనుకున్నవి వికీపీడియా:సాధారణ పదదోషాలు - తప్పొప్పుల పట్టిక లోని పట్టికలో చేర్చండి. నేను వాటిని అనుసంధానించి అచ్చుతప్పులు దిద్దటానికి ఒక స్క్రిప్టు వ్రాస్తాను. --వైజాసత్య (చర్చ) 05:01, 2 జనవరి 2014 (UTC)
భాషాదోషాల పట్టిక మరియు సాధారణ పదదోషాలు-తప్పొప్పుల పట్టిక రెండింటినీ కలిపి ఒకే జాబితా తయారుచేస్తే బాగుంటుందేమో. రహ్మానుద్దీన్ ఇలాంటి జాబితా ఆధారంగా ఒక బాట్ ను కొంతకాలం నడిపించారు. ఇలా సమగ్రమైన పదదోషాల జాబితా తయారుచేసి; బాట్ ను నడిపి తెవికీ వ్యాసాలలోని తప్పుల్ని సవరిస్తే వ్యాసాల నాణ్యత మెరుగుపడుతుంది. చాలా బాగా ప్రణాలిక తయారుచేసి నడిపిస్తే ఫలితాలు బాగుంటాయి.Rajasekhar1961 (చర్చ) 06:27, 2 జనవరి 2014 (UTC)

తెలుగు అంకెలు, హిందూ అంకెలు రెండూ చూపించవచ్చు..[మార్చు]

తెలుగు అంకెలు, హిందూ అంకెలు (అరబిక్ అంకెలు?) వాడే విషయాన్ని గతంలో మనం చర్చించాం. అయితే రెండూ వాడొచ్చని హిందీ వికీపీడియాలో గమనించాను. అక్కడ పేజీ పైభాగంలో ఏ అంకెలు కావాలో ఎంచుకునే సౌలభ్యం సందర్శకులకు ఉంది. దీన్ని మనమూ పెట్టుకోవచ్చేమో వికీ సాంకేతికులు పరిశీలించగలరు. --చదువరి (చర్చరచనలు) 16:57, 6 ఫిబ్రవరి 2014 (UTC)

నా అభిరుచులు లో, ఉపకరణాల ట్యాబ్ లో, ఇంటర్ఫేసు సంబంధిత విభాగంలో "అంకెల పరివర్తన, అంకెలను తెలుగు, అరబ్బీ అంకెల మధ్య మార్చటానికి ఒక ఉపకరణం" అన్న ఎంపికను ఎంచుకుంటే మెకు అలా పని చేస్తుంది. --రహ్మానుద్దీన్ (చర్చ) 05:49, 8 మే 2014 (UTC)

సాహిత్యం ప్రాజెక్టు గురించి[మార్చు]

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా చర్చించి తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే పనిలో భాగంగా సాహిత్యం ప్రాజెక్టును ప్రారంభించాను. దీనికి సంబంధించిన వివరాలు ఆ ప్రాజెక్టు పేజీలోనే పొందుపరిచాను. కొంత కొంతగా అభివృద్ధి చేయాలి కనుక తేలికైన సోపానాలను ప్రారంభించాను. సాహిత్య ప్రాజెక్టులో సాహిత్య వ్యాసాలను అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఉన్నవారు సభ్యత్వం స్వీకరించాలని మనవి.
ఈ ప్రాజెక్టులో భాగంగా జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీతలైన ఇతర భాషా రచయితల గురించి కూడా వ్యాసాలు తయారు చేస్తున్నాము. కనుక సోదర భారతీయ భాషలు వచ్చిన అహ్మద్ నిసార్ గారు, పాలగిరి గారు తదితరులు, ఆంగ్ల భాష నుంచి తెలుగులో చక్కని అనువాదాలు చేయగలిగిన వికీసభ్యులు పాలుపంచుకుంటే మరింత వేగంగా ముందుకుపోవచ్చు. అలాగే సాహిత్యం పట్ల ప్రత్యేక ఆసక్తి ఉన్న పలువురు వికీ సభ్యులు కూడా చేరితే బాగుంటుందని నా ఉద్దేశం. ప్రాజెక్టు లంకె ఇది.--పవన్ సంతోష్ (చర్చ) 05:55, 20 ఫిబ్రవరి 2014 (UTC)

Pavan santhosh గారు కన్నడ భాషా జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల కన్నడ వ్యాసాలను తెలుగులోకి అనువదించగలను.Palagiri (చర్చ) 06:53, 20 ఫిబ్రవరి 2014 (UTC) 06:53, 20 ఫిబ్రవరి 2014 (UTC)
పాలగిరి గారూ కృతజ్ఞతలు. మీరు ఆ ప్రయత్నం చేయండి. నా వద్ద కూడా తెలుగులో కన్నడ సాహిత్యవేత్తల గురించి కొంత సమాచారం ఉంది కనుక మీ కృషికి ఉడతా భక్తిగా నేను ఏదోకటి జోడించగలను.--పవన్ సంతోష్ (చర్చ) 07:37, 20 ఫిబ్రవరి 2014 (UTC)

సీఐఎస్-ఏ2కే వారి తెలుగు భాష కు సంబంధించిన ముసాయిదా కార్యప్రణాళికపై చర్చ[మార్చు]

సీఐఎస్-ఏ2కే వారి తెలుగు భాష కు సంబంధించిన ముసాయిదా కార్యప్రణాళిక పై చర్చ చేయవలసి ఉంది. ఇందులోని అంశాలను ఒక్కొక్కటిగా చర్చించి, సహసభ్యులు వారి సూచనలు సలహాలు తెలుపగలరు. ఇందుకు సంబంధిత చర్చా పేజీ వద్ద తెలుపగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:36, 26 మే 2014 (UTC)

కార్టూనిస్టు పామర్తి శంకర్‌ గురించి పేజీ[మార్చు]

‘సాక్షి’ ప్రధాన కార్టూనిస్టు పామర్తి శంకర్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. పోర్చుగల్‌కు చెందిన వరల్డ్ ప్రెస్ కార్టూన్ సంస్థ ఏటా ప్రపంచ స్థాయిలో ఉత్తమ ఎడిటోరియల్ కార్టూన్లు, క్యారికేచర్లకు ప్రకటించే గ్రాండ్ ప్రి అవార్డు ఈ ఏడాది ఆయన్ను వరించింది. 2014 సంవత్సరానికి దాదాపు 64 దేశాల నుంచి పోటీకి వచ్చిన ఎంట్రీల్లో శంకర్ గీసిన హక్కుల పోరాటయోధుడు నెల్సన్ మండేలా క్యారికేచర్ ఉత్తమ ఎంట్రీగా ఎంపికైంది.

ఈ సందర్భంగా వారి గురించి కార్టునిస్టులలో వారి పేరును చేర్చితే బావుంటుంది అనుకుంటున్నాను.

నల్గొండ జిల్లా నాగిరెడ్డిపల్లికి చెందిన శంకర్ ఎనిమిదేళ్లుగా ‘సాక్షి’ దినపత్రికలో కార్టూనిస్టుగా పనిచేస్తున్నారు. ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శంకర్‌కు గతంలో నాలుగుసార్లు అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు వచ్చాయి. బ్రెజిల్, ఇరాన్, చైనా దేశాల్లో నిర్వహించిన పోటీల్లో ఈ అవార్డులను కైవసం చేసుకున్నారు. ఆయన వేసిన వాటిలో దలైలామా, బ్రూస్‌లీ, మదర్ థెరిసా, ఆంగ్‌సాన్ సూకీ, ఒబామా తదితర ప్రముఖుల క్యారికేచర్లకు అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కాయి.

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మరణించినప్పుడు శంకర్ గీసిన ఈ క్యారికేచర్ 2013 డిసెంబర్ 6న ప్రచురితమైంది. గ్రాండ్ ప్రి అవార్డు ఆసియాకు చెందిన వారికి దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. కార్టూనిస్టులోకం దీన్ని ఆస్కార్, నోబెల్ ప్రైజుగా పరిగణిస్తుంటుంది. ఈ అవార్డు కింద 10 వేల యూరోల నగదు లభిస్తుంది. పోర్చుగల్‌లో ఏటా నవంబర్‌లో నిర్వహించే అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సందర్భంగా ఈ అవార్డును బహూకరిస్తారు.

కట్టా శ్రీనివాస్ గారూ ఫేస్‌బుక్‌లో మనం చర్చించినట్టుగా వారి పేజీని తయారుచేసి అభివృద్ధి చేద్దాము. ప్రణయ్ తో పాటుగా మరికొందరు ఈ విషయమై మనకు సహకరిస్తే మరింత బావుంటుంది. సమయోచితమైన ప్రతిపాదనకు ధన్యవాదాలు. కార్టూన్ నోబెల్ గా పరిగణించే అవార్డ్ ఆసియాలోనే తొలిసారిగా మనవారికి లభించడం చాలా చాలా గొప్ప విషయం. ఐతే మీకున్న వీలును అనుసరించి తెలుగు వికీపీడియన్లు ఆయన వ్యాసాన్ని అభివృద్ధి చేసి, తద్వారా అభినందనలు క్రియారూపకంగా తెలిపారన్న విషయాన్ని మీరు ప్రెస్ వారికి తెలియజేయగలిగితే (కుదిరితేనే సుమా) తెవికీకి కూడా మంచి ప్రచారం లభించినట్టు అవుతుంది.--పవన్ సంతోష్ (చర్చ) 06:34, 17 అక్టోబరు 2014 (UTC)
పామర్తి శంకర్ గురించి మీరు మంచి వ్యాసాన్ని తెవికీలో తయారుచేయవచ్చును. సరైన మూలాలను చేర్చడం మరచిపోవద్దు. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:36, 17 అక్టోబరు 2014 (UTC)

Dynamic Page List పొడిగింత స్థాపన[మార్చు]

YesY సహాయం అందించబడింది

వర్గాలపేజీల ప్రదర్శన మరిన్ని వివరాల ఆధారంగా చేయగలిగే డైనమిక్ పేజీ లిస్ట్ పొడిగింత (Dynamic page list) తెలుగు లో స్థాపించితే ఉదాహరణకు సహాయం చేయబడిన పేజీలను కాలానుగుణంగా ప్రదర్శించే వీలుంది. మరిన్ని వివరాలకు మెటాలో DPL సహాయ పేజీ చూడండి . ఈ స్థాపన ప్రతిపాదనపై మీ అభిప్రాయాలను వారం రోజులలో (2015-06-27లోపల) తెలపండి. --అర్జున (చర్చ) 07:19, 20 జూన్ 2015 (UTC)

సమ్మతి
 1. JVRKPRASAD (చర్చ) 07:42, 20 జూన్ 2015 (UTC)
 2. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 01:53, 25 జూన్ 2015 (UTC)
 3. <పై వరుసలో # తరువాత, అవసరమైతే మీ వ్యాఖ్య మరియు వికీ సంతకం చేయండి>
వ్యతిరేకం
 1. <పై వరుసలో # తరువాత, అవసరమైతే మీ వ్యాఖ్య మరియు వికీ సంతకం చేయండి>
తటస్థం
 1. <పై వరుసలో # తరువాత, అవసరమైతే మీ వ్యాఖ్య మరియు వికీ సంతకం చేయండి>
JVRKPRASAD ,కె.వెంకటరమణ ల స్పందనలకు ధన్యవాదాలు. ఈ ప్రతిపాదన సర్వసమ్మతితో ఆమోదించబడింది. The proposal to install Dynamic page list extension is approved unanimously. --అర్జున (చర్చ) 04:02, 29 జూన్ 2015 (UTC)
https://phabricator.wikimedia.org/T104163 బగ్ నమోదు చేయబడింది. --అర్జున (చర్చ) 04:06, 29 జూన్ 2015 (UTC)

మొదటి పేజి కి ఈ వారపు బొమ్మా ప్రతిపాదన[మార్చు]

ఆంగ్ల వికి లాగానే తెవికి కి ఈ వారపు బొమ్మా అనె భాగాన్ని చేరిస్తే ఎల ఉంటుంది?. తెవికి లొ మరుగున్న పడ్డ బొమ్మలకు గుర్తింపు మరియు కొత్త బొమ్మలను చేర్చడానికి వాడుకరులు ఉత్సాహం చుపుతారని నా అభిప్రాయం. ధన్యవాదాలు. KingDiggi (చర్చ) 04:32, 7 నవంబర్ 2016 (UTC)

వికిపిడియా లో చేర్చ బడిన విషయాలు దిద్దుబాట్లు[మార్చు]

అయ్యా,

     రచయతగా అనుభవము,రెఫరెన్సు కలిగి వెలువరించిన విషయాలను కొందరు తమ స్వార్థ అభిప్రాయముల' కొరకు సoపాదకియము చేయుట ఇబ్బందికరముగాను,అవగావాహనలేని వారి అభిప్రాయములు చొప్పించటము అనైతికముగాను ఉంది.ఒక కులము,సామాజిక స్థితిగతులను మార్పు చేసేందుకు మరొకరికి అనగా వేరొక సామాజిక స్థితి గలవారు చేయుట,మార్చుట సరి అయినది కాదు.ఈ విషయము గురించి శ్రీ ప్రనయ్ గారితో చర్చించాను.దీనిపైన చర్య తీసికొవలసినదిగా కోరుతున్నాను.

డా.చిప్పగిరి జ్ఞానేశ్వర్. 2016-12-25T12:00:26‎ డా.చిప్పగిరి జ్ఞానేశ్వర్

User:డా.చిప్పగిరి జ్ఞానేశ్వర్ గారికి, సంబంధిత వ్యాస చర్చా పేజీలో చర్చించండి. అందరూ పాల్గొనటంకొరకు {{సహాయం కావాలి}} మూస చేర్చండి. --అర్జున (చర్చ) 11:37, 28 నవంబర్ 2019 (UTC)

ధ్రువీకరించిణ అంశాలను తొలగించరాదు[మార్చు]

అయ్యా, వికీపీడియాలో ధ్రువీకరిoచి తెలుపబడిన అంశాలను తొలగించరాదు.ఈ విషయములో అతిక్రమిoచు రచయతలను block list లో పెట్టoడి.డా.చిప్పగిరి జ్ఞానేశ్వర్, 2016-12-29T06:51:48‎ డా.చిప్పగిరి జ్ఞానేశ్వర్

:User:డా.చిప్పగిరి జ్ఞానేశ్వర్  గారికి, సంబంధిత వ్యాస చర్చా పేజీలో చర్చించండి. అందరూ పాల్గొనటంకొరకు {{సహాయం కావాలి}} మూస చేర్చండి. --అర్జున (చర్చ) 11:37, 28 నవంబర్ 2019 (UTC)

ప్రతిపాదన: తదుపరి తెవికీ సమావేశానికి కో-లివ్ కాన్ఫరెన్స్ హాల్ వినియోగం[మార్చు]

అందరికీ వందనాలు!

ఇటీవలె నేను హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో నూతనంగా ప్రారంభించబడ్డ కో-లివ్ అనే ఒక హాస్టల్ లో చేరాను. ఇందులో అనేక సదుపాయాలతో బాటుగా ప్రొజెక్టర్ / స్క్రీన్ / స్పీకర్లు అమర్చబడిన ఒక కాన్ఫరెన్స్ రూం కలదు. అది చూడగానే ఠక్కున నా మదిలో మెదిలించి తెవికీ సమావేశాలే! దీనికి సంబంధించి టూకీగా కొందరి అభిప్రాయాలను అడగగా, రచ్చబండ లో ఒక పోస్టు వేసి, వీలైనంత త్వరగా ఇక్కడ తెవికీ సమావేశాలు నిర్వహించవలసిందిగా సూచన వచ్చింది. దీనిపై మీరు నన్ను నేరుగా సంప్రదించవచ్చును. నా టెలిగ్రాం ఐడి: t.me/sasisaphr

ఇదే వేదిక యొక్క చిరునామా: https://www.google.com/maps/place/Colive+Garnet/@17.4474757,78.3606525,17z/data=!4m8!1m2!2m1!1sCoLive++Gachibowli!3m4!1s0x0:0xc470fca2aec23a75!8m2!3d17.4480727!4d78.3647744 ధన్యావాదాలు - శశి 2019-11-25T14:10:59‎ Veera.sj

శశి గారు. మనకు ఉచితంగా అందుబాట్లో ఉండాలి కద. ఉచితంగా వారు వాడుకోనిస్తారా?.B.K.Viswanadh (చర్చ) 05:32, 27 నవంబర్ 2019 (UTC)
B.K.Viswanadh గారు, ఈ వసతి గృహం లో నేను నివసిస్తున్నాను. కావున నేను దీనిని వాడుకొనవచ్చును. నా అతిథులని కూడా ఆహ్వానించుకొనవచ్చును.. ఇవన్నీ నాకు ఉచితమే. సందేహమే వలదు. ఇందులో ఉన్న పార్టీ ఏరియాకు పలు మార్లు బయట నుండి స్నేహితులను ఆహ్వానించాను. ఎటువంటి సమస్యా లేదు. కావున ఈ సౌకర్యాన్ని నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు వినియోగించుకొనమని మనవి. అసలే నాకు మెంటల్ గా? ఎప్పుడు మనసు మార్చుకొంటానో తెలియదు! ఈ వసతి గృహం నుండి మారానంటే, ఈ సౌకర్యం వేరే వసతి గృహాల్లో ఉండకపోవచ్చును. - శశి (చర్చ) 11:38, 2 డిసెంబరు 2019 (UTC)