వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 6

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 5 | పాత చర్చ 6 | పాత చర్చ 7

Common telugu words for English words[మార్చు]

ప్రతిపాదన:


వికీపీడియాలో ఒక సమస్య తెలుగు వాడుక పదములు. నా ప్రతిపాదన ఏమిటంటే, మనము ఒక డిక్షనరీ లాగా చేసిపెడితే అది చాలా ఉపయోగపడుతుంది.

అలాగుననే ఇది తెలుగు భాష అభివ్రుద్దికి కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు,

Internet: అంతర్జాలము

ఇలాంటి పదాల కోసమే విక్షనరీ ఉన్నది. రవిచంద్ర (చర్చ) 05:17, 26 ఏప్రిల్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

ఈయన/ఆయన[మార్చు]

ఒకే వ్యాసంలో ఒకరిని గూర్చి వ్రాస్తున్నప్పుడు ఈయన అంటేనో వీరు అంటేనో బాగుంటుంది. కొన్ని సార్లు ఈయన, కొన్ని సార్లు ఆయన అంటూ వ్రాస్తే అర్థాలు మారిపోతాయి. నా ప్రతిపాదన - ఈయన/ఆయన అని సంబోధించే బదులు *వీరు* అని వ్రాస్తే అర్థవంతంగా గౌరవంగానూ ఉంటుంది. కాదూ కూడదూ అంటే పలానీ వారిపై వ్యాసంలో, ఆ పలానీ వార్ని సూచించేప్పుడు *ఈయన* అనే అనాలి. దానికి బదులు *ఆయన* అనటం తప్పు.

ఉదాహరణకు - ఎమ్మెస్ రామారావు 1921 మార్చి 7 న గుంటూరు జిల్లా అమృతలూరు మండలానికి చెందిన మోపర్రు గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు మోపర్తి రంగయ్య మరియు మంగమ్మ సీతారామ భక్తులు. చిన్నతనం నుండే ఆయన పాటలు పాడుతుండేవారు.

పై సందర్భమ్లో ఆయన అంటే ఎవరూ?

సరైన ఉటంకింపు - ఎమ్మెస్ రామారావు 1921 మార్చి 7 న గుంటూరు జిల్లా అమృతలూరు మండలానికి చెందిన మోపర్రు గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు మోపర్తి రంగయ్య మరియు మంగమ్మ సీతారామ భక్తులు. చిన్నతనం నుండే ఈయన పాటలు పాడుతుండేవారు.

image, picture, video, audio వంటి వ్యాసాలు తెవికీ లో పెట్టాలి[మార్చు]

ఆయా వ్యాసాలు రాయాలాంటే, నాకు తగిన పదాలు దొరకటం లేదు! ఇమేజ్ ని బొమ్మ అనాలా? మరి డాల్ ని బొమ్మ అని ఒక వ్యాసం వుంది. పిక్చర్ కు, వీడియో కు ఆడియోకు సరయిన పదాలు తెలియజేస్తే ఆయా వ్యాసాలు నేను రాస్తాను, అలాగే వీటి పై ఆధార పడిన దస్త్ర సంప్రకారాలపై(ఫైలు ఫార్మాట్ల పై) వ్యాసాలు రాసేందుకు కొంత వెసులుబాటు కలుగుతుంది. రహ్మానుద్దీన్ 19:16, 18 ఆగష్టు 2011 (UTC)

వుంటే వుండనివ్వండి. అయోమయ వివరణ పేజీలో లింకులు వాడుకోవచ్చుకదా. పదం తట్టకపోతే ఇంగ్లీషునే తెలుగులో రాయండి. తర్వాత మార్చవచ్చు. పిక్చర్ కి చిత్రం, వీడియో కి చలన దృశ్యము , ఆడియోకి శ్రవణ లేక ధ్వని అని వాడవచ్చు.-- అర్జున 06:42, 20 ఆగష్టు 2011 (UTC)

Image - బొమ్మ

Picture - చిత్రం, చిత్రపటం

Audio - శ్రవణం

Video - చలనచిత్రం

ఏకవచన ప్రయోగం[మార్చు]

తమ జీవితకాలమంతా కళాసాధనకోసం, సామాజిక సేవకోసం వెచ్చించిన ఎందరో కళాకారుల, ప్రజా నాయకుల జీవిత విశేషాల గురించి, వారి ఆశయ సాధన గురించి, తెలుసుకునే అవకాశం ఉన్న వికిపీడియా వ్యాసాల్లో వారిని గౌరవ వాచకాలతో ప్రస్తావించక పోవడం వికిపీడియా ఎడిటోరియల్ పాలిసీకి విరుధ్ధమైన విషయం. వారు సజీవులైనా, అమరులైనా, అటువంటి సాధకులను ఏకవచన ప్రయోగాల్తో ప్రస్తావించడం ఎబ్బెట్టుగాను, అసభ్యంగాను ఉండండమే కాకుండా, Biographies of living persons (BLPs) must be written conservatively అన్న వికిపీడియా ఎడిటోరియల్ స్ఫూర్తికి విరుధ్ధం. (http://en.wikipedia.org/wiki/Wikipedia:Biographies_of_living_persons). సంప్రదాయ విధానం రచనల్లో ఉండాలన్నది వికిపీడియా ఉద్దేశమైతే ఏకవచన ప్రయోగం దానికి విరుధ్ధం. ఈ వైరుధ్ధ్యం తమిళ, హిందీ వికిపీడియాల్లో చూడం. (http://ta.wikipedia.org/wiki/%E0%AE%B5%E0%AE%BE%E0%AE%B2%E0%AE%BF_%28%E0%AE%95%E0%AE%B5%E0%AE%BF%E0%AE%9E%E0%AE%B0%E0%AF%8D%29). http://hi.wikipedia.org/wiki/%E0%A4%85%E0%A4%AE%E0%A4%BF%E0%A4%A4%E0%A4%BE%E0%A4%AD_%E0%A4%AC%E0%A4%9A%E0%A5%8D%E0%A4%9A%E0%A4%A8 మన తాతలను, తండ్రులను ఏకవచనంతో సంబోధించడం, ముఖ్యంగా ఇతరులు సంబోధించడం మనం ఆమోదించం. అది మన సంస్కృతి కాదు. ఏ విషయాన్ని ఎలా చెప్పాలన్నది రచయిత యొక్క ప్రాధమిక హక్కని నా ఉద్దేశం. అది రచయిత శైలికి సంబంధించినది. అందులో ఎడిటర్ల, అడ్మినిస్ట్రేటర్ల జోక్యం ఆమోదించలేం. అచ్చుతప్పులు, పబ్లిక్ పాలిసీ విరుధ్ధమైన విషయాలు, ఎడిటోరియల్ పాలిసీ విషయాల వరకే వారి ప్రమేయం. మా నాన్నగారు, పట్రాయని సంగీతరావుగారు, తాతగారు, పట్రాయని సీతారామశాస్త్రిగారి గురించి మీదైన శైలిలో సంస్కరించి పెట్టిన పోస్టులు మాకు ఆమోదం గావు. అందువల్లవాటిని నేను తీసేసాను. పి.వి.గోపాలకృష్ణ

ఏకవచనం ప్రయోగం అనేది తెవికీ నియమం. దీనికి ఇతర వికీపీడియా నియమాలతో పోల్చరాదు. గొప్పవారైనా, చిన్నవారైనా, దేశాధినేతలైనా, మామూలువారైనా అంతా సమానులే. తెవికీలో చేర్చిన వ్యాసాలను ఎవరైనా మార్పులు చేర్పులు చేయవచ్చు. నియమాల ప్రకారమే మార్పులు చేసిననూ అభ్యంతరం పెట్టడం భావ్యం కాదు. రచయిత ఏది చేసిననూ ఇక్కడి నియమాల ప్రకారమే చేయాల్సి ఉంటుంది లేదా ఎవరైనా దాన్ని సరిదిద్దుతారు. మళ్ళీ మళ్ళీ వ్యాసాలలో సమాచారం మొత్తం చెరిపివేయడం మాత్రం తెవికీ నియమాలకు విరుద్ధం. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:54, 13 అక్టోబర్ 2011 (UTC)


నిర్వాహక, అధికారి హోదాకి అభ్యర్థనలు[మార్చు]

చూడండి వికీపీడియా:నిర్వాహక_హోదా_కొరకు_విజ్ఞప్తి మరియు పాల్గొనండి. --అర్జున 02:03, 28 డిసెంబర్ 2011 (UTC)