Jump to content

వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 3

వికీపీడియా నుండి

పాత చర్చ 2 | పాత చర్చ 3 | పాత చర్చ 4

ఇది పాత ప్రతిపాదనలను భద్రపరచిన పేజీ. దయచేసి దీనిని మార్చవద్దు. మీరు ఏమైనా ప్రతిపాదించాలంటే ఇక్కడ చేయండి.

పోర్టల్

[మార్చు]

ప్రదీప్ గారు, మన తెవికీలో పోర్టల్ నేమ్‌స్పేస్ లేదా లేకపోతే మరేదైనా పేరుతో ఉందా? లేకపోతే మీరు తయారు చేయగలరా? వర్తమాన ఘటనలకు ఒక పోర్టల్ తయారుచేద్దామని ఇంగ్లీషు నుండి కాపీ చేసి ప్రయత్నం చేసాను. కానీ ఉపయోగంలేకపోయింది. మీరు కొంచెం చూడండి. δευ దేవా 15:32, 13 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీలో పోర్టల్ నేంస్పేసు ఇప్పటిదాకా లేదు. ఓకేసారి దీనికి తెలుగు అనువాదము కూడా సూచిస్తే ఆ నేంస్పేసు సృష్టించమని ప్రోగ్రామర్లని అభ్యర్ధించవచ్చు. నా తరఫునుండి పందిరి, వేదిక --వైజాసత్య 18:24, 13 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
పోర్టల్ నేమ్‌స్పేస్ అనేది కస్టమ్ నేమ్‌స్పేస్ అని, సాఫ్ట్వేర్‌తో రాదని నాకు తరవాత అర్థమయ్యింది. మీరు ఈ ఆంగ్లవికీ లింకు చూస్తే అర్థమవుతుంది. పోర్టల్‌కు తెలుగులో వేదిక అని ఎక్కడో చూసినట్టు గుర్తు నాకు, అదే పేరును వాడవచ్చునేమో! δευ దేవా 18:31, 13 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నా అభిప్రాయం ప్రకారం విభాగము అంటే బాగుంటుంది, అర్థం ప్రకారం ప్రవేశమార్గం, ప్రధానదారి సరిగా అనిపించదు.ఆంగ్లంలో ఉన్నట్టు పోర్టల్ అని పెట్టినా పర్వాలేదు.C.Chandra Kanth Rao 18:40, 13 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
విభాగాలు బాగానే ఉంది కానీ తెలుగులో విభాగము అనేది section, division మొదలైన చాలావాటికి విభాగాన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా వికీలో పేజీలోని విభాగాలు (sections)తో సందిగ్ధత ఏర్పడుతుందని నా అభిప్రాయం. అదికాక పోర్టల్లు ఒక సబ్జెక్టు చెందిన వికీవ్యాసాలు ప్రదర్శించటానికి, వాటిని నిర్వహించడానికి ఒక వేదికలాగా ఉపయోగపడతాయని నాకనిపించింది. --వైజాసత్య 16:54, 22 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మనం ఆంధ్రప్రదేశ్, భారతదేశం లాంటి అంశాలపై కూడా పోర్టల్ ప్రారంభిస్తే బాగుంటుంది. భారతీయ భాషలతో సంబంధం లేని నెదర్లాండ్స్, ఎస్పెరాంటో, ఫ్రాంకోయిస్, ఎస్పానోల్, డ్యూష్ లాంటి భాషా వికీలు భారతదేశంపై పోర్టల్ ప్రారంభిస్తే భారతీయ భాషలలో ప్రథమస్థానంలో ఉండి పోర్టల్ ప్రారంభించుటలో వెనుకపడుట సమంజసం కాదు. ముందుగా ఆంధ్రప్రదేశ్ పోర్టల్ ప్రారంభిద్దాం. తెవికిలో ఇప్పటికే 38 వర్గాలలో వేలకొలది వ్యాసాలున్నాయి. కాబట్టి పోర్టల్‌ ప్రారంభించుటకు ఎలాంటి సమస్య లేదు. దీని వలన తెవికి అందంగానే కాకుండా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.C.Chandra Kanth Rao 17:54, 22 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంత్ గారు! పోర్టల్ ప్రారంభించడం సులువైన పనిలాగానే ఉన్నా దాన్ని నిర్వహించడం అంత సులువు కాదేమోనని నా అభిప్రాయం. కనీసం ఒక ఐదుగురు సభ్యులైనా భాధ్యతగా ఒక పోర్టల్‌ను నిర్వహించడానికి ముందుకు వస్తే మనం పోర్టల్ ప్రారంభించడం ద్వారా ఉపయోగకరంగా ఆ విషయాలను తీర్చి దిద్దవచ్చు, లేకపోతే అవి నిరాశాజనకంగా మారి వెక్కిరిస్తూ ఉంటాయి. కావున నేను క్రింద రెండు పోర్టల్లు ప్రారంభిద్దామని ప్రతిపాదిస్తూ సభ్యుల చొరవ తెలుసుకునేందుకు ఓటింగు నిర్వహిస్తున్నాను. తమవంతు కృషి చేస్తామని ముందుకు వచ్చే సభ్యులు తమ పేర్లను ఆ పోర్టల్ పేరు క్రింద జతచేస్తే ఓటు వేసినట్టే! (ఇతర సభ్యులు చొరవతీసుకోకపోతే ఉన్న సభ్యులపై భారం పెరిగిపోతుంది.) ఈ ఓటింగ్ ముగియు తేదీ 15 ఫిబ్రవరి 2008. δευ దేవా 12:01, 23 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
దేవా గారు చెప్పేది నిజమే. నిర్వహణ సమస్య ఎలాగూ ఉంటుంది. అయినప్పటికీ అధిక నిర్వహణ భారం పడకుండా తరుచుగా మారే అంశాలను ప్రారంభంలో చేర్చనట్లయుతే వారం, పది రోజులకోసారి మార్పులు చేసిననూ సరిపోతుందని నా అభిప్రాయం. ఆంగ్ల వికీ పోర్టల్స్‌లో కూడా రోజూ మార్పులు జరగడం లేవు. ఈ విషయంలో సీనియర్ సభ్యుల అభిప్రాయాలు కూడా అవసరం--C.Chandra Kanth Rao 18:01, 23 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
పోర్టలు తయారుచెయ్యటం కంటే..నిర్వహణే కష్టం. ఏవైనా మొదలుపెట్టినప్పుడే బ్రహ్మాండంగా ఉండవు. కొన్నిరోజులు మొదట్లో పేలవంగా ఉన్నా ఫర్వాలేదు. మెల్లిగా అవే అభివృద్ధి చెందుతాయి. చంద్రకాంతరావుగారన్నట్టు మొదట్లో కొద్దిగా స్టాటిక్ కంటెంట్ (తరచూ మారని విషయాల)తో ప్రారంభిస్తే బాగానే ఉంటుంది. --వైజాసత్య 17:34, 26 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  • పోర్టల్:ఆంధ్రప్రదేశ్
  1. సి.చంద్ర కాంత రావు
  2. దేవా
  3. వైజాసత్య
  • పోర్టల్:భారతదేశం
  1. సి.చంద్ర కాంత రావు
  2. దేవా
  3. వైజాసత్య

ఓటింగ్ ముగిసింది. మూడు ఓట్లు మాత్రమే వచ్చినప్పటికీ, సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ రెండు వేదికలను ప్రారంభిస్తున్నాము. δευ దేవా 11:46, 18 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

పోర్టల్‌కు తెలుగు పదం

[మార్చు]

పోర్టల్‌కు తెలుగు నామంకోసం క్రింద ప్రతిపాదనలు గాని, ఉన్న ప్రతిపాదనలకు మద్దతుగానీ ప్రకటించవచ్చు. ఒక సభ్యులు ఎన్నైనా ఓట్లు గానీ ప్రతిపాదనలుగానీ చేయవచ్చును. ఈ ఓటింగ్ ముగియు తేదీ 01 ఫిబ్రవరి 2008. δευ దేవా 12:01, 23 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

విభాగం

[మార్చు]

వేదిక

[మార్చు]
  • ప్రతిపాదన: దేవా
  • మద్దతు
    1. దేవా
    2. సి.చంద్ర కాంత రావు
    3. మాకినేని ప్రదీపు - కారణం: ఒక పోర్టల్ పేజీలో ఒక అంశానికి సంభందించి, వికీపీడియలో అప్పటికే ఉన్న వివిధ వ్యాసాలను ప్రదర్శిస్తాం. ఆ అంశానికి సంభందించిన వ్యాసాలన్నిటికీ ఈ పేజీ ఒక కేంద్ర బిందువుగా ఉంటుంది. ఈ రకంగా చూస్తే పోర్టల్ అనే conceptకు వేదిక సరయిన పేరు అని నాకు అనిపిస్తుంది. అలాగే పొర్టలు పేజీలను ఇక్కడ entry points దృష్టిలో కాకుండా access points/exhibition అనే దృష్టిలో చూడాలి అని అనిపిస్తుంది, అందుకనే నాకు పోర్టల్‌కు వేదిక సరయిన పేరుగా అనిపించింది.
    4. చదువరి
    5. వైజాసత్య (పైన ప్రదీపు చెప్పిన కారణమే)
  • అసమ్మతి
    1. వీవెన్ (వేదిక అన్న దాన్ని platform, forum లకు సమానార్థకంగా వాడుతున్నాం.)

పోర్టల్

[మార్చు]

గుమ్మం[1]

[మార్చు]

వాకిలి [2]

[మార్చు]

ద్వారం

[మార్చు]

ద్వారం అనేదే సరి అయిన పదము - వెంకట రాము

  • అసమ్మతి:

ద్వారం అనేదే సరి అయిన పదము ఎందుకనగా పోర్టల్ అనేది ఆ విభాగంలో ప్రవేశించటమే.

మాళిగ

[మార్చు]
  • అసమ్మతి:

పీఠం

[మార్చు]

లోగిలి

[మార్చు]
  • అసమ్మతి:

ఈ ఓటింగ్ ముగిసిన సమయానికి ఒక్క వేదికకు మాత్రమే 5 ఓట్లు వచ్చాయి. అందువలన Portalను వేదికగా మార్చుతున్నాను. δευ దేవా 05:59, 10 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


User నేముస్పేసుకు తెలుగు పేరు

[మార్చు]

దీనిని ఒకప్పుడు "సభ్యుడు" అని తెలుగులోకి మార్చుకుని వాడుకుంటూ వచ్చాము. తరువాత కొన్ని రోజులకు పులింగం, స్త్రీలింగం రెండూ కాకుండా మధ్యస్తంగా ఉంటుందని "సభ్యులు" అనే బహువచనంలోకి మార్పించి వాడుతున్నాము. అయితే ప్రస్తుతం అంతర్జాలంలో Userకు "వాడుకరి" అనే పదాన్ని వాడుతున్నారు, ఇది కూడా పులింగం, స్త్రీలింగం రెండిటికీ సరిపోయేటట్లుగానే అనిపిస్తుంది. ప్రస్తుతం బేటావికీలో నేంస్పేసులను కూడా మార్చుకునే సదుపాయాన్ని ఏర్పాటుచేసారు. కింద User నేంస్పేసుకు ఏ పదాన్ని వాడాలో అభిప్రాయాలు తెలిపితే అలా మార్చి కమిట్ చేయమని చెప్పవచ్చు. ఇక్కడ ఈ ప్రతిపాదనలను మార్చి 1 వరకూ చేయవచ్చు. కొత్త ప్రతిపాదనలు చేయాలని అనుకుంటే ఆ పదాలు స్త్రీలింగంగా మరియూ పులింగంగా వాడగలిగేటట్లు చూడండి.

సభ్యులు

[మార్చు]
సమ్మతి
  • చదువరి: యూజరనే నేమ్‌స్పేసే సరైనదిగా అనిపించదు నాకు. మెంబరని ఉండాలని అనుకుంటాను. అదే ఒక వాడుకరికి శాశ్వత గుర్తింపు. ఐపీఅడ్రసు ఎప్పటికప్పుడు మారిపోయేదే కదా (స్టాటిక్ ఐపీ విషయంలో కూడా ఓ స్టాటికైపీ ఒకరికే శాశ్వతంగా ఉంటుందని కూడా చెప్పలేం).. వారికి శాశ్వత పేజీ అనేది కుదరదు కద! పైగా ఐపీఅడ్రసుతో చర్చించడానికి ఇష్టపడేదెవరు!? ఆ నేమ్‌స్పేసు లాగినైన వాడుకరులకే -అంటే సభ్యులకే. అంచేత సభ్యులు పేరే నచ్చింది నాకు.
  • చంద్ర కాంత రావు
అసమ్మతి

వాడుకరి

[మార్చు]
సమ్మతి
అసమ్మతి

వినియొగదారుడు

[మార్చు]

ఆందరికి నా నమఃసుమాంజలి,

నా పేరు ప్రకాష్, ముందుగా మీ అందరిని అబినందిస్తునాను,మన తెలుగు కు ప్రాచుర్యం కల్పిస్తునందుకు.నేను కుడా ఇందులొ చేరాలనుకుంటునాను.నేను ఏలా చెరలొ తెలియచెయగలరు .


ఇట్లు తెలుగు అభిమాని ప్రకాష్

Adding NTR jr. in Telugu actors.

[మార్చు]

తెలుగు సినిమా నటుల జాబితా లో నందమూరి తారక రామారావు గారి మనవడు నందమూరి తారక రామారావును చేర్చాలి.

villages list

[మార్చు]

జిల్లాలోని గ్రామాల పేర్లు వ్రాసి నప్పుడు, మండల ప్రధాన గ్రామము కూడ ఒక గ్రామము గా హైలైట్ అవ్వటము లేదు ఎందు వలన? లింకు లేనందు వలన ఆ గ్రామము వివరములు పొందు పరచటం కుదరటం లేదు.

రమేష్ బాబు

ముంబై ముచ్చట్లు:

[మార్చు]

బొద్దు అక్షరాలు

ముంబై నగరం..దేశ ఆర్ధిక రాజధాని.. ఇది చాలా అందమైన నగరం. ప్రతి రొజు ఉదయం 4 గం. లకు నిద్రలేస్తుంది. అప్పటినుంచి మొదలైన హడవిడి రాత్రి 2 గం లకు కాని సద్దుమనగదు. బిజి..బిజి..బిజి కొన్ని కోట్లమంది ప్రజలు ఆఫిస్ లకి ఫ్యాక్టరి ఇతర పనులకి వెళ్ళే బిజిలొ ఉంటారు. ప్రధాన ప్రయన సౌకర్యం లోకల్ ట్రైన్. ప్రజలు సగం సమయం,డబ్బు ప్రయాణానినికి ఖర్చు చేస్తారంటె అతిశయోక్తి కాదు. ఏది ఏమైనా ముంబై చాల అందమైన అతిపెద్ద నగరం. మరిన్ని విషెషలథొ మల్లి కలుద్దం.

మీ కె.కె.(కృష్ణ కిరీటి)

తప్పులు కనపడితే ఎవరికి ఛెప్పాలి?

[మార్చు]

తప్పులు కనపడితే ఎవరికి ఛెప్పాలి?

కొత్త సభ్యుల ఉత్సాహం కొరకు

[మార్చు]

ఒక్క ఈనాడు వ్యాసంతో మన తెవికీ దశ తిరుగుతోంది. లెక్కకు మించి తెవికీలో చేరుతున్న సభ్యులే ఇందుకు సాక్ష్యం. అయితే కొత్త సభ్యులు వారి ఆనందాన్ని వ్యక్తపరచడం కోసం ఒక్కొకరు ఒక్కో పేజీ ప్రారంభిస్తున్నారు. మనం కొత్త సభ్యుల ఆనందాన్ని పంచుకోవడానికి ఒక కొత్త పేజీ ప్రారంభించి. దాని రెఫెరెన్సును స్వాగతం లో చేరిస్తే ఎలా ఉంటుంది? రవిచంద్ర 13:04, 5 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి ఆలోచన..వెంటనే అమలుపరచండి. మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు] లాగా ఒక లైను స్వాగత సందేశంలో చేర్చండి --వైజాసత్య 13:18, 5 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే ఐపి అడ్రసుల నుంచి మార్పులు చేస్తున్న సభ్యులకు సలహా ఇవ్వడానికి ఒక మూస తయారు చేస్తే బావుంటుందనుకుంటున్నాను.-- రవిచంద్ర 13:22, 5 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వార్తల కోసం

[మార్చు]

తెలుగులో వికీపీడియా నచ్చింది వార్తల కోసం షార్ట్ కట్లు ఉంటే బాగుంటుంది రామ కృష్ణ జవ్వాజి

వికీ లో వెతకడం

[మార్చు]

అందరికీ నమస్కారం. తెవికి లో వెతకడం సరిగ్గా పని చేయడం లేదేమో అని నా అనుమానం.. ఉదాహరణ కి అమలాపురం గురించి వెతికితే, మహాత్మా గాంధి, పుష్పకవిమానం లాంటివి వస్తున్నాయి.... అలాగే హైదరాబాదు గురుంచి వెతికితే, సంబంధం లేనివి వచ్చాయి..

ఇది నా మంట నక్క ('firefox') లో సమస్యా, లేకపోతే వెతకడానికి వాడిన టూల్ తో సమస్యా? అది 'Mediawiki' తో వచ్చే టూలేనా? అసలు మనం గురుజి, లేక 'webkhoj' లాంటి వాటికి 'plugin' పేట్టుకుంటే సరిపోతుందేమో? ధన్యవాదాలు, ఫణి

ఫణి గారూ, మీరు చెప్పింది నిజం. తెవికీలో వెతకడంలో లోపం ఉంది. (సమస్య మీ మంటనక్కది కాదు.) దీన్ని సరిచెయ్యడంపై పని జరుగుతున్నట్లుంది. మీరు సూచించిన గురూజీ ప్లగిన్ లేదు గానీ ఇతర మార్గాలున్నాయి. మీరు వెతుకు కొట్టిన తరువాత, ఫలితాల పేజీలో పైన మళ్ళీ వెతుకు పెట్టె వస్తుంది కదా.. అక్కడ వెతికేందుకు వివిధ వికల్పాలు ఉంటాయి.. గూగుల్, యాహూ,.. ఇలాగ. వాటిలో ఒకదాన్ని ఎంచుకుని మళ్ళీ వెతకమంటే, అప్పుడు మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ విషయమై ఇదే రచ్చబండలో సాంకేతికం ఉపపేజీలో జరిగిన చర్చ చూడండి. మీరిచ్చిన సూచనలు చూస్తూంటే మీరు నెట్టుకు పాతకాపేనని తెలుస్తోంది. తెవికీలో సభ్యునిగా చేరి, మరింత చురుగ్గా రాయాలని కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 02:45, 6 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాలలో పంచాయితీ ఉన్నవి, లేనివి

[మార్చు]

గ్రామాలలో పంచాయితీ ఉన్నవి, లేనివి విభజించి మూసలు చేర్చితే బావుమ్టుందనుకొంటాను. అలాగే మండలపరిదిలోని గ్రామాలలా పంచయితీ పరిధిలోని గ్రామాలను చేర్చి మూసలు రూపొందిస్తే ఎలాఉమ్టుంది (.విశ్వనాధ్. 06:53, 7 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా చర్చ:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ మండలాలు#గ్రామాలు, వికీపీడియా చర్చ:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు#ఎన్నెన్ని వూళ్ళు? ఈ రెండు చర్చలు చూడండి. ఏవి పంచాయితీలు, ఏవి పంచాయితీ గ్రామాలు కావు. మరియు అన్నిగ్రామాల పూర్తి జాబితా లేకపోవటం వంటి సమస్యలున్నాయి. పైగా ప్రస్తుతం లభ్యమౌతున్న జనాభాలెక్కలు పంచాయితీల వారిగానే ఉన్నవి. ఒక్కొక్క గ్రామానికి వేరుగా ఈ గణాంకాలు ఉన్నవో లేవో తెలీదు కానీ..మనకు మాత్రం లభ్యమవ్వట్లేదు. ఇవి అధిగమించినా పూర్తి గ్రామాలు లక్షపైనే ఉంటాయని అంచనా. అంత పెద్ద ప్రాజెక్టు చేపట్టాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాలి. పైగా ఇంకా ప్రస్తుతమున్న అన్ని గ్రామాలకు గణాంకాలు చేర్చేపని ఇంకా పూర్తి కూడా కాలేదు. --వైజాసత్య 21:59, 7 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Thirumalagiri mandal in Nalgonda dist.

[మార్చు]

తిరుమలగిరి మన్దలము ను మామూలుగా తొ0డా తిరుమలగిరి (తిరుమలగిరి (టి)) అని పిలుస్థారు. ఇది అయొమయ స్తితిని తొలగిన్ఛును

అయ్యా తెలుగు భాషకొసం మీరు చెస్తున్న క్రుషి అభినందనీయం. కానీ కొత్త సభ్యుల కొసం మరికొంత వివరంగా సమాచారం అందించి ఉంటె బవుండెదని నా అభిప్రాయం.

sports in India

[మార్చు]

భారతదేశం క్రీడలు : ఈ విషయం లొ మనం చాలా వెనుకబడి ఊన్నాము. మన కన్న చాలా చిన్న దేశాలు బాగా స్రద్దచుపుతున్నాయి. మన దేశం లొ రాజకియ నాయకుల పాత్ర/జొక్యం ఉంటుంది. ఈ పద్దతి మారాలి. మనం కూడా మారాలి. కొనీ క్రీడలకి మనం కూడ విలువని ఈవం. ఈ పద్దతి మారాలి. మన జాతీయ క్రీడ అయిన హాకి ని మనం మరచి పొయాము.

విక్షనరీ వర్గాలు

[మార్చు]

విక్షనరీ లోని పదాలను సాంఘిక శాస్త్రము, జీవ శాస్త్రము, వృక్ష శాస్త్రము, గణిత శాస్త్రము, భూగోళ శాస్త్రము, ఆర్థిక శాస్త్రము, వాణిజ్య శాస్త్రము మొదలైన శాస్త్రీయ వర్గీకరణ చేస్తే వికీపీడియా విద్యకు సంభందించి మంచి సమాచారాన్ని అందించినట్లవుతుంది కదా! - రవిచంద్ర 12:39, 18 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అవును అలాగయితే కావలసిన సబ్జెక్ట్ గురిమ్చిన వర్గంలో వెతుక్కోవడం సులభమవుతుంది. ఆయా విభాగాలలోని పదాలను వెతికేవారికి వెంటనే అర్దాలు దొరకుతాయి.విశ్వనాధ్. 13:16, 18 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు కవితలు

[మార్చు]

తెలుగు వికెపెడియా లొ తెలుగు కవితలు,వ్యాసాలు వ్రాయవఛా?

కూడదు. వికీపీడియాలో విజ్ఞావ సర్సస్వానికి తగిన వ్యాసాలు వ్రాయవచ్చును. ఒకమారు వికీపీడియా:ఏది వికీపీడియా కాదు మరియు వికీపీడియా:తెవికీ చూడండి. ఒకవేళ మీ కవితలు, రచనలు ప్రచురించాలంటే అందుకు సరైన వేదిక ఏదైనా బ్లాగు ప్రారంభించడం. --కాసుబాబు 07:49, 7 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

భగవద్గీత

[మార్చు]

భగవద్గీత తెలుగు లొ రాస్తీ అమ్దరికి ఉపయొగమ్ ఉన్తున్ది

భగవద్గీత గురించిన వ్యాసం ఇప్పటికే ఉంది. దయచేసి ఇక్కడ చూడండి. ఈ వ్యాసాన్ని మీరు ఇంకా మెరుగు పరచ వచ్చును. లేదా సంబంధించిన విషయాలపై క్రొత్త వ్యాసాలు వ్రాయ వచ్చును. భగవద్గీత పూర్తి పాఠం మరియు తెలుగు అనువాదం వికీసోర్స్ లో ఉన్నాయి. ఇది పూర్తి సంస్కృత పాఠం మరియు ఇది తెలుగు అనువాదం --కాసుబాబు 07:54, 7 మార్చి 2008 (UTC)-[ప్రత్యుత్తరం]


అవినీతి - చర్చ

[మార్చు]

నిర్వచనము  : నిభందనలకు వ్యతిరేకము గా స్వలాభము కొరకు చేసె లేక చేయుంచుకొనే విదానం.