మూస చర్చ:ఈ వారం వ్యాసం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇక నుండి వారానికో వ్యాసం చప్పున మెదటి పేజిలొ ప్రదర్శించబోతున్నాం.ఆ జాబితానే ఇది. చొరవ తీసుకొని మార్పులు చేర్పులు చేయండి.

ఇది మూస దీనికి మార్పులు చేయవద్దు --వైజాసత్య 15:14, 10 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ మూస వల్ల వచ్చే వర్గ వ్యాసాల జాబితా చేయాలంటే, వ్యాసాన్ని వుట్టిగా మార్చి (ఏ మార్పులు లేకుండా) కొన్నాళ్లు వేచిచూడాలి. వివరాలకు en:Help:Category#Categories and templates చూడండి

పరిమితి[మార్చు]

సంవత్సరం చివరి వారం లేక మొదటి వారం లో ISO వారం సంఖ్య గుణించడానికి సంవత్సరం పై మాత్రమే ఆధారపడడం వలన, ఒక సంవత్సరం చివరివారం తరువాతి సంవత్సరం మొదటి వారం ఒకటే అవుతాయి. --అర్జున (చర్చ) 07:28, 24 డిసెంబర్ 2013 (UTC)

మూస తాజా[మార్చు]

మూసలో దోషం తొలగించడానికి (2021 లో గతించిన వారాల పేజీలలో సంవత్సరం, వారం చూపుటలేదు) ISOవారం వాడేటట్లు మెరుగు చేశాను. మూస వాడేటప్పుడు వారం ను రెండు అక్షరాలతో అవసరమైతే సున్న చేర్చి వాడండి.User:K.Venkataramana గారు గమనించండి. ఇప్పటికే వారాలకు కేటాయించిన వ్యాసాల చర్చాపేజీలలో అవసరమైతే మార్పులు చేశాను.--అర్జున (చర్చ) 06:43, 23 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసాలను ప్రత్యేకంగా వ్యాస రూపులో గుర్తించడం[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ వారం వ్యాసాల సంఖ్య 700 దరిదాపులో వున్నాయి. మొత్తం వ్యాసాలు 70000 అనుకుంటే ఇవి 1 శాతం అన్నమాట. ఉన్న వ్యాసాలలో ఇవి కొంతవరకు మేలయినవి కావున, వీటిని చూపించేటప్పుడు విశేష వ్యాసాలకు కాంస్య తార లాగా (గోదావరి వ్యాసంలో కుడివైపు పైన చూడండి), ఒక ప్రత్యేక గుర్తు (ఆకుపచ్చ నక్షత్రంతో) గుర్తించాలని ప్రతిపాదిస్తున్నాను. దీనికొరకు{{ప్రదర్శన వ్యాసం}} అనే మూస {{విశేషవ్యాసం}} లాగా తయారు చేసి ఆ వ్యాసాలలో చేర్చటం మంచిది. అప్పుడు ఇటీవల మార్పులలో ఈ వ్యాసాలకు సంబంధించిన మార్పులకు ప్రత్యేక లింకు ఏర్పాటు చేసి, తద్వారా, ఆసక్తి గల సభ్యులు వీటిపై దృష్టి పెట్టేలా చేసి వాటి నాణ్యతను అభివృద్ధి చేసే అవకాశం కల్పించవచ్చు. (ప్రస్తుత విశేష వ్యాసాలలో మార్పులకు లింకు). సంబంధించిన చర్చ చూడండి. స్పందించండి. అర్జున (చర్చ) 21:35, 26 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Arjunaraoc: గారూ, 70 వేల వ్యాసాల్లో 7 వేలు అన్నది చాలా పెద్ద సంఖ్య. అంటే పది శాతం. ఆంగ్ల వికీపీడియాలోనే మంచి వ్యాసం ప్రాతిపదిక చూస్తే 62 లక్షల వ్యాసాలకు గాను 33 వేల మంచి వ్యాసాలే ఉన్నాయి. అంటే 187 వ్యాసాలకు 1 వ్యాసం. ఆ ప్రకారం చూసినా, మనకున్న 70,882 వ్యాసాల్లో 379 ఉన్నతమైన నాణ్యతతో ఉన్న వ్యాసాలు ఉంటే మనం కృతార్థులం. ఇది ఇలా ఉంచండి, ఇంతకీ మీరు ప్రతిపాదిస్తున్న పద్ధతిలో మూకుమ్మడిగా ఈ వ్యాసాలకు ఆ గుర్తింపు ఇచ్చేస్తామా? లేకుంటే మళ్ళీ ఆ గౌరవానికి ప్రాతిపదికలు పెట్టుకుని సమీక్ష జరుపుతామా? --పవన్ సంతోష్ (చర్చ) 02:35, 27 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Pavan santhosh.s: గారికి, ఆంగ్ల వ్యాస గణాంకాలు తెలిపినందులకు ధన్యవాదాలు. ప్రతిపాదిత మూస పేరులో తెలిపినట్లు ఈ వ్యాసాలకు మూకుమ్మడిగా గుర్తింపు ఇవ్వటమే నా ఆలోచన. అర్జున (చర్చ) 22:44, 27 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
"ప్రత్యేక:ఇటీవలిమార్పులు లో ఇతర సమీక్ష ఉపకరణాల సౌలభ్యం తెవికీలో చేర్చాను" అని ఇదంతా ప్రారంభించారు కదా. ఈ వ్యవహారం ఏమిటసలు? ఈ వ్యాసాల్లో మార్పుచేర్పులు జరిగితే ఇటీవలి మార్పుల్లో బొద్దుగా కనిపిస్తుందా? ఇదొక వడపోతా? --పవన్ సంతోష్ (చర్చ) 02:46, 27 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Pavan santhosh.s: గారికి, దీనివలన ఈ వ్యాసాల మార్పులు బొద్దుగా కనిపించవు, ప్రత్యేకమైన లింకు ద్వారా వడపోత మాత్రమే. ఒక వికీపీడియన్ వారానికొకసారి కొన్ని గంటలు సమయం మెరుగైన వ్యాసాల నాణ్యతను అభివృద్ధి చేయడానికి లేక నిర్వహించడానికి ధ్యాస పెట్టాలనుకుంటే, ఈ వ్యాసాలన్నీ ఆ వ్యక్తి వీక్షణ జాబితాలో వుంటే తప్ప ఆ పని చేయలేరు. ఎందుకంటే ఇటీవలి మార్పులులో ఇటీవలి 500 మార్పులు గత 30 రోజుల వ్యవధివరకు చూసే అవకాశమున్నా, ఒకటి, రెండు రోజులలోనే ఈ పరిమితి చేరవచ్చు. AWB వాడుక వుంటే కొద్ది గంటలలోనే ఈ పరిమితి చేరవచ్చు. కావున ఈ వ్యాసాలలో జరిగిన మార్పులు కనబడకుండా వుండే అవకాశం ఎక్కువ. ఈ ప్రత్యేక లింకు, ఆ వ్యాసాలలో జరిగే మార్పులపై ధ్యాస పెట్టటానికి ఉపయోగం. --అర్జున (చర్చ) 22:54, 27 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఇలా ఇటీవలి మార్పుల్లో ప్రత్యేక లింకు ఏర్పాటుచేయడం వల్ల ప్రయోజనకరం అనుకుంటే అలా చేద్దాం. కానీ, దీని కోసం ప్రత్యేకమైన నక్షత్రం పెట్టవద్దని నా సూచన. అలానే ప్రదర్శిత వ్యాసాలు అని వేరే పేరు కూడా అనవసరం. అసలంటూ ఈవారం వ్యాసాలు అన్న పేరు ఉంది కాబట్టి, ఆ పేరిట ఒక వర్గంతో ఈ పనిచేయగలిగితే బావుంటుంది. వర్గం వల్ల పని కాదనుకుంటే ఒక చిన్న మూస పేజీలో ఇది ఈవారం వ్యాసంగా ప్రదర్శితమైందన్నది కింద వచ్చేలా చేర్చి (నిజానికి ఇలాంటి మూస ఇప్పటికే చర్చ పేజీల్లో ఉండడం కద్దు, వాటి ద్వారా పని జరిగించడం అసాధ్యమా?) పనిచేయించుకోవడం మధ్యమం. ఇందుకైనా రచ్చబండలో ప్రత్యేకంగా ఒక చర్చ పెట్టి, వ్యాసం పేజీలో ఇలా ఉండడం ఎంతవరకూ ఆమోదనీయమని నిర్ణయించుకునే ముందుకు పోదాం. నా అభిప్రాయంలో ఇప్పటికే ఈవారం వ్యాసాలను సూచిస్తూ చాలా ఫ్రేమ్‌వర్క్ ఉంది. అదే వాడి చేయడం మంచిది. నాణ్యతా కొలబద్దలో ఈవారం వ్యాసాలన్నీ ఎక్కడెక్కడో ఉన్నప్పుడు అందుకోసం ప్రత్యేకమైన నక్షత్రం చేర్చడం, అది కూడా ఇటీవలి మార్పుల్లో ఒక ప్రత్యేక లింకుతో వడపోయడం కోసం ఆ నక్షత్రం చేర్చడం, సరికాదు. --పవన్ సంతోష్ (చర్చ) 06:57, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Pavan santhosh.s గారు, ఇప్పటికే వున్న ఫ్రేమ్ వర్క్ తో చేయటం నాకు తెలిసినంతవరకు కుదరదు. {{ఈ వారం వ్యాసం}} మూస ద్వారా గాని, దాని వలన వచ్చే వర్గాల ద్వారా కాని కుదరదు. చర్చలు {{సహాయం కావాలి}} మూసతో ఏ చర్చా పేజీలోనైనా చేయవచ్చు. రచ్చబండలో చేయడం వలన ప్రత్యేక ఉపయోగం ఉందనిపించుటలేదు. వికీపీడియాలో కొంతవరకైనా మెరుగైన వ్యాసాలను వ్యాసరూపులో గుర్తించడం దీని ముఖ్యోద్ధేశం కావున {{ప్రదర్శన వ్యాసం}} తప్పదు అని నాకు అనిపిస్తుంది. దానివలన సమస్యలేమైనా వుంటే తెలపండి, లేక ఆ ఉద్దేశ్యం నేరవేరడానికి పరిష్కారం తెలపండి. అర్జున (చర్చ) 23:49, 31 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc: గారూ, "వికీపీడియాలో కొంతవరకైనా మెరుగైన వ్యాసాలను వ్యాసరూపులో గుర్తించడం దీని ముఖ్యోద్ధేశం" అంటున్నారు. ఇవి మెరుగైనవో కావో తెలియదు మనకు. అందుకు సమీక్ష మార్గం. కాబట్టి, కొత్తగా ఒక నక్షత్రం ఇవ్వడానికి నేను వ్యతిరేకిని. "ఇప్పటికే వున్న ఫ్రేమ్ వర్క్ తో చేయటం నాకు తెలిసినంతవరకు కుదరదు." అంటే వ్యాసంలో ఒక మూస ఉంటే తప్పించి సాధ్యం కాదని మీరంటున్నారా? అలాగైతే ఆ మూస పేరులో "ఈవారం వ్యాసం" అన్న పదబంధాన్ని ఉండనిచ్చి, నక్షత్రం రూపంలో కాకుండా వ్యాసంలో ఉండేలా ఒకటేదైనా తయారుచేసుకుందాం. మీరు ఆశిస్తున్న ప్రత్యేకమైన లింకు ద్వారా వడపోత సాధించడానికి నేను సూచించే మార్గం. ఇది కొన్ని వందల వ్యాసాల్లో మార్పుచేర్పులు జరిగే ఒక ప్రతిపాదన. మీరొక కొత్త మూసను వందల పేజీల్లో చేర్చాలని కోరుతున్నారు. అంతేనా? అవి నాణ్యమైనవని సూచించే నక్షత్రం ఇవ్వడం కూడా మీ ప్రతిపాదనలో ఉంది. ఇదేమీ చిన్న సంగతి కాదు. కాబట్టి, విస్తృతమైన సముదాయానికి తెలియపరిచి వారి నుంచి వచ్చిన ఏకాభిప్రాయం ద్వారా చేయడం మాత్రమే ఇందుకు మార్గం. --పవన్ సంతోష్ (చర్చ) 04:47, 1 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఇతర సభ్యులకు అర్థం కావడానికి సమస్య ఏమిటన్నది వివరిస్తున్నాను:

  • అర్జున గారు, ఈవారం వ్యాసాలకు ప్రదర్శిత వ్యాసం అని ఒక మూస పెట్టి, వ్యాసంలో కుడిచేతివైపున ఒక పచ్చ నక్షత్రం వచ్చేలా గౌరవం కల్పిస్తానంటున్నారు. ఎందుకు అంటే రెండు కారణాలుగా 1) వికీపీడియాలో కొంతవరకైనా మెరుగైన వ్యాసాలను వ్యాసరూపులో గుర్తించడం దీని ముఖ్యోద్ధేశం 2) ఇటీవల మార్పులలో ఈ వ్యాసాలకు సంబంధించిన మార్పులకు ప్రత్యేక లింకు ఏర్పాటు చేసి, తద్వారా, ఆసక్తి గల సభ్యులు వీటిపై దృష్టి పెట్టేలా చేసి వాటి నాణ్యతను అభివృద్ధి చేసే అవకాశం కల్పించవచ్చు.
  • మొదటి ఉద్దేశం పట్ల నేను పూర్తి వ్యతిరేకిని. ఎందుకంటే - అసలు వీటి నాణ్యత ఏమిటన్నది మనకు తెలియదు. వీటిని ఎంపిక చేయడానికి ఉన్న కొలమానాలు ఏమిటి? ఒకటి - కనీసం 5 బైట్లు ఉండాలి. రెండు - గతంలో ప్రదర్శింపబడి ఉండకూడదు. మూడు - అనువదించాల్సిన భాగాలు ఉండకూడదు. నాలుగు - కనీసం ఒక బొమ్మ ఉండాలి. ఈ నాలుగిటిలో నాణ్యత గురించి కానీ, వ్యాసం విలువ గురించి కానీ ఏమీ లేదు కదా. అలాంటప్పుడు ఏ వ్యాసం నాణ్యత ఏదో కనీసం మదింపు కూడా లేకుండా ఇలాంటి గౌరవం లేక ప్రత్యేకత కల్పించకూడదు.
  • ఇటీవలి మార్పుల్లో ఈ వ్యాసాల్లో మార్పులకు ప్రత్యేక లింకు ఏర్పాటుచేయడంపై నేనేమీ వ్యతిరేకం కాదు. కానీ, ఒక మూస/వర్గం వ్యాసంలో చేరిస్తే పని అయ్యేప్పుడు దానికి నక్షత్రాలూ అవీ చేర్చనక్కరలేదు.
  • వందలాది వ్యాసాల నాణ్యత గురించి పాఠకుడికి తెలియజేసేలా జరుగుతున్న ఈ ప్రతిపాదన గురించి రచ్చబండలో కనీసం నోటిఫై చేయకపోవడం సరికాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అలానే, ఈవారం వ్యాసాల విషయమై సంవత్సరాలుగా పనిచేసిన సభ్యులు ఉన్నారు. వారి అభిప్రాయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి, ఇలాంటి పలువురికి నోటిఫై చేయాలన్నా, వారు పాల్గొనాలన్నా రచ్చబండలో తెలియజేయడం తప్పనిసరి.
  • ఇక చివరిగా ఇది ఈవారం వ్యాసం మూస చర్చా పేజీ. ఈ మూసలోని విషయాన్ని, మూసని గురించిన విషయాలు ఇందులో చర్చించడం ఒప్పుతుంది కానీ వందలాది వ్యాసాల పేజీల్లో నాణ్యతకు గుర్తుగా నక్షత్రం గుర్తులు పెట్టాలా వద్దా మొదలైన విషయాలపై ఇంత విస్తృతమైన చర్చ జరగడం సరికాదు. కాబట్టి, వెంటనే సరైన చోటికి చర్చను తీసుకుపోవాల్సి ఉంది.

ఇదీ నా అభిప్రాయం. --పవన్ సంతోష్ (చర్చ) 12:38, 1 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Pavan santhosh.s గారికి, మీ సూచన మేరకు రచ్చబండలో వ్యాఖ్య చేర్చాను. ఈ వారం వ్యాసం మూస వాడిన పేజీలకు సంబంధించిన చర్చ అయినందున చర్చ ఇక్కడ జరగటమే మేలనిపించి ఇక్కడ ప్రారంభించాను. ఈ మూస వాడుకలో ఇప్పటికే కాంస్య నక్షత్రం లాంటివి కూడా వాడారు. వికీపీడియా చర్చ:ఈ వారపు వ్యాసం జాబితా అనే పేజీ కొంతవరకు అనువైనదే, ఇప్పటికే కొంత చర్చ జరిగివున్నది కావున చర్చ ఇక్కడే కొనసాగించమని కోరుతున్నాను. చర్చ పూర్తయి నిర్ణయం వెలువడిన తరువాత ఆ పేజీలో వ్యాఖ్య చేరుస్తాను. అర్జున (చర్చ) 00:09, 2 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వారం వ్యాసం ప్రతిపాదన సూచనలు మీ వ్యాఖ్యలో తెలిపారు. ఈ వారం వ్యాసం ఉద్దేశ్యం నాణ్యమైన వ్యాసాలను మొదటి పేజీలో ప్రదర్శించడం అయినప్పుడు, దీనిని నిర్వహించినవారు, తోడ్పడిన వారు, దీనికై ప్రతిపాదించిన వ్యాసాలను శక్తిమేరకు అభివృద్ధి పరచి ఈ వారం వ్యాసంగా ప్రదర్శించారు. తెవికీలో ఇంతకుమించి నాణ్యమైన వ్యాసాలను తయారుచేసే పని విస్తృతంగా జరగలేదు కావున ప్రస్తుతానికి వీటిని గుర్తించటం మంచిది. ఆకుపచ్చ నక్షత్రం కాకపోతే, పసుపుపచ్చ నక్షత్రం. మనం మూస వాడినప్పుడు అది వాడామని ఆ వ్యాసం చూస్తే తెలియాలి. దానికొరకు వర్గాలలో ప్రత్యేక వర్గం చేర్చడం, ప్రత్యేక ప్రకటన లేక చిహ్నం ద్వారా తెలుపుతాము. వర్గాల వలన గుర్తించటానికి ఇతర వర్గాలతో కొంత గందరగోళం అయ్యే అవకాశముంది, కొన్ని నిర్వహణ వర్గాలు అందరి వాడుకరులకు కనబడవు, కావున అందరికి కనిపించే చిహ్నం వుండడమే మంచిది. అర్జున (చర్చ) 00:23, 2 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియాలో విశేషవ్యాసానికి తగినప్రామాణికతలు ఏమీ సముదాయంలో నిర్థారించకుండా లేదా నిర్ణయంలేకుండా ఏదేని వ్యాసానికి విశేషవ్యాసం సింబల్ గా ఆకుపచ్చ నక్షత్రం కాకపోతే, పసుపుపచ్చ నక్షత్రం , లేదా ఇంకొక ఎదేని సింబల్ ఎలా వాడతారు.? అంటే ఎవరికి నచ్చిన వ్యాసానికి వారు ఈ సింబల్స్ వాడుకోవచ్చు అని అర్థం చేసుకోవచ్చా అనే సందేహాలు నాకు ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 07:09, 2 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారు, అభ్యర్దన మేరకు, మీరు ఇక్కడ చర్చలో పాల్గొంటున్నందులకు ధన్యవాదాలు. మీ వ్యాఖ్యను పరిశీలిస్తే, మీరు ఇప్పటివరకు జరిగిన చర్చను సరిగా అర్ధం చేసుకోలేదనిపిస్తున్నది. ఎందుకంటే ప్రతిపాదించుతున్న మూస పేరు {{ప్రదర్శన వ్యాసం}}, {{విశేషవ్యాసం}} కాదు. పేరులోనే వున్నట్లు, దీని అర్హత ఈ వారం వ్యాసంగా మొదటిపుటలో ప్రదర్శించడమే. దీనికి {{విశేషవ్యాసం}} నాణ్యతకు చాలా తేడా వుండవచ్చు. కాని ఇప్పటివరకు ఏవైనా కొంత మెరుగైన వ్యాసాలను గుర్తించామంటే, ఈ శీర్షిక నిర్వహణవలనే. ఇక పైన చెప్పినట్లు ఒక చిహ్నం వుంటేనే ఏ ఏ వ్యాసాలు ఈ అర్హత పొందాయో తెలుస్తుంది, నిర్వహణకు సౌలభ్యంగా వుంటుంది. ఇంకేమైనా సందేహాలుంటే అడగండి. అర్జున (చర్చ) 00:12, 4 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నా అభిప్రాయం సరిగా అర్జున్ గారు అర్థం చేసుకోలేకపోయారని నేను అనుకుంటున్నాను. యర్రా రామారావు (చర్చ) 03:16, 4 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు, @Pavan santhosh.s, @ప్రభాకర్ గౌడ్ నోముల గారలు, సహ సభ్యులకు, ప్రతిపాదించిన మూస సృష్టించి, గత రెండు వారాల వ్యాసాలలో ప్రయోగాత్మకంగా చేర్చాను. అలాగే ప్రత్యేక:ఇటీవలిమార్పులు లో కూడా విశేషవ్యాసాలకు బదులుగా వీటికి లింకు చేర్చాను. వీటిని గమనించి ఏమైనా సూచనలు, సందేహాలు తెలియచేయండి. అర్జున (చర్చ) 01:01, 7 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు, ప్రతిపాదించినది బాగానేవుంది. ఇలా చేయటంవలన సుమారు 700 ఈ వారం వ్యాసం పేజీలపై ఆసక్తి కలవారు, వాటిలో జరిగే మార్పులను గమనించటం సులభమవుతుంది. ప్రదర్శన వ్యాసం మూస ద్వారా చేర్చబడే నక్షత్రం ద్వారా నిర్వహణ సౌలభ్యంగా వుంటుంది. వీటిని గమనించే వారు ఎక్కువైతే వాటిలో కొన్నిటిని విశేష వ్యాసంగా మెరుగు చేయటానికి వీలవుతుంది. ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 18:26, 5 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  • చర్చలో అత్యధికులు ఈ ప్రతిపాదనను సూత్రప్రాయంగా వ్యతిరేకించినందువల్ల ప్రయోగం ఇప్పుడు అనవసరం, బేసబబు. కాబట్టి, మొదటి పేరుబరిలో ఉన్న పేజీలో చేర్చిన తారను @Arjunaraoc: గారి మార్పును తిప్పికొట్టి తొలగించాల్సి వచ్చింది. ఈ విషయంపై రచ్చబండలో వివరణ చేర్చాను. ఏమైనా రాయాలంటే అక్కడ రాయవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 18:21, 7 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
    @Pavan santhosh.s గారు, చర్చలో పాల్గొంటున్న కొంతమంది చర్చను అర్ధంచేసుకోలేకపోతున్నందున, వివరణకొరకు ప్రతిపాదిత మార్పులు ప్రయోగాత్మకంగా చేశాను, అలా సవరణ సారాంశంలో వ్రాశాను. వాటిని గమనించి కూడా, మీరు ఆ మార్పులను రద్దు చేయటం, చర్చ సామరస్యపూర్వకంగా, అర్ధవంతంగా జరగటానికి సహకరించదు కావున మీ మార్పులు రద్దు చేయవలసినదిగా కోరుతున్నాను. మీరు అటువంటి మార్పులు చర్చ నిర్ణయం వెలువడిన తరువాత అవసరమైతే చేయవచ్చు. అలాగే రచ్చబండలోని చర్చగురించి తెలిపిన వ్యాఖ్యలో, చర్చను ఈ పేజీలో కొనసాగించమని అభ్యర్ధన చేసినా, కొంతమంది సభ్యులు, మీరు ఆ అభ్యర్ధనను మన్నించక, రచ్చబండలోనే చర్చకు సంబంధమైన వ్యాఖ్యలు చేయటం చర్చను గందరగోళం చేయటానికి ప్రయత్నించటమే అని నా భావన. రచ్చబండలో వ్యాఖ్యలు చేసిన సభ్యులు, ఇతరులు, వారి అభిప్రాయాలను, స్పందనలను ఇదే పేజీలో చేర్చి చర్చను సామరస్యపూర్వకంగా కొనసాగించటానికి సహకరించమని మరల కోరుతున్నాను. అర్జున (చర్చ) 23:34, 7 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి అభిప్రాయం[మార్చు]

ప్రయోగాత్మకంగా అంటూ అర్జున గారు చేసిన పని సమర్ధనీయం కాదు. అది ఎప్పుడు సమర్ధనీయమయ్యేదంటే.. ఈ చర్చలో అలా చెయ్యాలని నిర్ణయం వచ్చి ఉంటే, అలా చేస్తే తప్పు లేదు. కనీసం అలా ప్రయోగం చేస్తానని ఈ చర్చలో చెప్పి, వాడుకరుల నుండి వ్యతిరేకత రాకుండా ఉంటే, అలా చేసి ఉండవచ్చు. అదేమీ లేకుండా ఏకపక్షంగా అలా చెయ్యడం తొందరపాటు చర్య. అర్జున గారు తొందరపడి చేసిన ఈ పొరపాటును పవన్ సంతోష్ గారు సరిదిద్దారు. అందులో తప్పేమీ లేదు, అది సమర్ధనీయమే. ఆ అభిప్రాయాన్ని నేను రచ్చబండలో రాసాను కూడా. దాన్ని మళ్ళీ వెనక్కి తిప్పరాదు.

  1. ఒక పక్క ఆయన ప్రతిపాదించిన పనికి వ్యతిరేకత వస్తూ ఉంటే అర్జున గారు తాను అనుకున్న పని చెయ్యడానికే ముందుకు పోయారు.
  2. రామారావు గారు అభ్యంతరం చెబితే, ఆయనకు విషయం అర్థం కాలేదని తేల్చేసారు.
  3. రచ్చబండలో నలుగురు వాడుకరులు స్పష్టంగా చెప్పిన అభిప్రాయాలు ఇక్కడ చెప్పలేదు కాబట్టి చర్చ గందరగోళమౌతోందని అంటున్నారు (ఈ సమస్య విస్తృతమైనదనీ, ఇది రచ్చబండలో చెయ్యాలనీ ముగ్గురు సభ్యులు ఈ చర్చలో చెప్పినా కూడా ఆయన తన పట్టుదలనే కొనసాగిస్తున్నారు. అంత పట్టుదల ఎందుకో మరి!)

ఆయన చేసిన ఈ పనులేవీ సామరస్య పూర్వకంగా లేవు. ఇలాంటి ధోరణి ఫలవంతమైన చర్చలకు దారితీయదు. కానీ చర్చ ముందుకు సాగాలి, అడంగుకు చేరాలి, నిర్ణయం వెలువడాలి, ఒకరి పట్టుదల కోసం ప్రతిష్ఠంభన ఏర్పడ కూడదు. అంచేత, ఇక్కడే రాసి తీరాలన్న అర్జున గారి పట్టుదలకు తలొగ్గి, రచ్చబండలో రాసిన నా అభిప్రాయాన్ని మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను:

  1. ఈ వారం వ్యాసాలను ఇటీవలి మార్పులులో చూపించదలచుకుంటే "ఈ వారం వ్యాసాలు" అనే పేరు తోనే చూపించాలి. విశేష వ్యాసం అనో, ప్రదర్శన వ్యాసం అనో మరేదైనా పేరునో పెట్టరాదు.
  2. ఈ వారం వ్యాసం అనే వర్గం ఈసరికే ఉంది కాబట్టి, ఆ వర్గాన్ని వాడుకునే ఈ పని చెయ్యాలి.
  3. అంతేగానీ వర్గం కావాలని చెబుతూ ఆయా పేజీల్లో కొత్తగా "తారక"ను చేర్చరాదు. ఎందుకంటే అది అవసరం లేదు. తారక లేకుండా పేజీని వర్గంలో చేర్చడం సాద్యమే. అది ఆయనకూ తెలుసు. చిటికెలో ఆ పని చెయ్యగల సామర్థ్యం అయనకు ఉంది. కానీ తారక కావాల్సిందే అనడం ఎందుకో నాకు అర్థం కాకుండా ఉంది.
  4. తారక అల్లాటప్పాగా అలా పెట్టేసుకునేది కాదు. విశేష వ్యాసాలు, ప్రదర్శన వ్యాసాలు, మొదలైన వాటికి నాణ్యతా ప్రమాణాలు ఏర్పరచుకోవాలి, వాటిని బట్టి వ్యాసాలకు నాణ్యతా గణన జరగాలి, అప్పుడే తారకలను పెట్టడం జరగాలి. (నాణ్యతా పమాణాలను నిర్దేశించుకోవడం వికీకి కొత్తేమీ కాదు - మంచి వ్యాసం ప్రమాణాలను చూడవచ్చు.)
  5. ఈ చర్చలో నిర్ణయం వచ్చేవరకు అర్జున గారు ఇప్పుడు చేసినట్లుగా తొందరపడి ఏ పనీ చెయ్యరాదు.
  6. ఈ చర్చలో నిర్ణయం ప్రకటింఛే నిర్వాహకులు, రచ్చబండలో వెల్లడైన అభిప్రాయాలను కూడా పరిగణన లోకి తీసుకోవాలని కోరుతున్నాను.

పరిశీలించవలసినది. __09:18, 8 ఏప్రిల్ 2021 (UTC)

చదువరి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. మీ స్పందనలలో చర్చవిషయానికి సంబంధించిన ప్రధానాంశాలపై ఇప్పటికే పైన చాలావరకు స్పందించాను. అయినా మరింత అవగాహన కొరకు చర్చలో ఉపవిభాగాలుగా చేర్చి స్పందిస్తున్నాను. సభ్యులందరు ఆ ఉపవిభాగాలలో స్పందించి చర్చను అర్ధవంతం చేయడంలో సహకరించమని మనవి. --అర్జున (చర్చ) 23:17, 8 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

{{ఈ వారం వ్యాసం}} వాడాలి[మార్చు]

తొలిగా @Pavan santhosh.s: ఆ పై @Chaduvari: గారు {{ఈ వారం వ్యాసం}} మూస ద్వారా ఏర్పడే వర్గాలను వాడమని సలహా ఇచ్చారు. ఆ మూస వాడితే వచ్చే వర్గానికి ఉదాహరణ వర్గం:ఈ వారం వ్యాసాల చర్చలు - Y2012 అలా ఇప్పటికే ఈ శీర్షిక నిర్వహించిన ప్రతి ఒక సంవత్సరానికి ఒక వర్గం వస్తుంది. ఆ వర్గాలన్నీ వర్గం:ఈ వారం వ్యాసాల చర్చలు - సంవత్సరం వారీగా అనే పై స్థాయి వర్గంలో చేరతాయి. ఇవి చర్చాపేజీల వర్గాలు. వీటిని వాడి మార్పులు చూపటానికి ప్రయత్నం లింకు ఫలించలేదు. సంవత్సరం వారీగా వుండే వర్గం వాడిన, ఆయా వ్యాసాల చర్చాపేజీలలో మార్పులు చూపుతుంది, వ్యాసపేజీలలో మార్పులు చూపదు. కావున ఈ పద్ధతి పనిచేయదు. దీనిని వాడి పనిచేసే లింకు ఏదైనా వుంటే తెలపండి. --అర్జున (చర్చ) 23:28, 8 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Arjunaraoc గారూ, మీ విఫల యత్నం గురించి ఒక సంగతి.. ఫలితం లేదని తెలుస్తూనే ఉంది. కానీ ఎలా ప్రయత్నించారో చెబితే (మీరు అవలంబించిన లాజిక్ చెప్పండి).. దాన్నిబట్టి వేరే రకంగా ఎలా చెయ్యొచ్చో ఆలోచించొచ్చు. __ చదువరి (చర్చరచనలు) 05:51, 9 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, నేను {{ఈవారం వ్యాసం}} వాడి తెలిపిన ప్రయత్నం లింకు చూస్తే అవలంబించిన లాజిక్ (ప్రత్యేక:చివరిమార్పులలింకులు ద్వారా సంబంధిత వర్గం వాడడం) అర్ధమవుతుంది. వేరే మూస వాడి ఎలా చేయాలో (ప్రత్యేక:ఇటీవలిమార్పులు ద్వారా సంబంధిత వర్గం వాడడం) తెలిపాను. దానికి సంబంధించి మీరు తొలగింపు హెచ్చరికలు పెట్టగా, పవన్ గారు ఏకంగా నా మార్పులు రద్దు చేశారు. నాకు అంతకన్నా ఏమీ తెలియదండి. దయచేసి మీరే పరిహారం ఎలా చేయాలో తెలపండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 23:48, 9 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc: గారూ, పదే పదే నేను చేసినదేదో తప్పు అన్నట్టు మాట్లాడవద్దు. బాధ్యత కలిగిన నిర్వాహకులెవరైనా నేను చేసినదే చేస్తారు. నేను మీ చర్య రద్దు చేయడం తప్పు అని మీకు అనిపిస్తే నిర్వాహకుల నోటీసుబోర్డు ద్వారా తోటి నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్ళండి. నాకేమీ అభ్యంతరం లేదు. అంతే తప్పించి ఇలా అక్కడొక మాట ఇక్కడొక మాట వేస్తూ పోవద్దు. మొదటి పేరుబరిలో ప్రయోగం చేయకూడదని అధికారిగా బాధ్యతలు, హోదా ఉన్న మీకు తెలియదని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఈ స్పందన రాసినంతమాత్రాన ఇక్కడే మళ్ళీ దానిపై చర్చ ప్రారంభించవద్దు. ఇక్కడ మీరొకటి అని, నేనొకటి అని చినికి చినికి గాలివాన చేసుకునే ఉద్దేశం నాకు లేదు. మీకు ఆ చర్య మీద ఏ అభ్యంతరం ఉన్నా నిర్వాహకుల నోటీసుబోర్డులోనే రాయండి. --పవన్ సంతోష్ (చర్చ) 02:40, 10 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
కింద పవన్ గారు రాసిన పరిష్కారాలు అర్జున గారి సమస్యను తీర్చేస్తున్నాయి. ఆ రెండొ పద్ధతి పాటించడానికి ఇక ఆయనకు అభ్యంతరమేమీ ఉండకూడదు. __చదువరి (చర్చరచనలు) 01:31, 11 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, వేరే మూస {{ప్రదర్శన వ్యాసం}} చేర్చడంపై మీకు అభ్యంతరం లేదని తెలిపినందులకు ధన్యవాదాలు. అర్జున (చర్చ) 22:54, 11 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చలో నేను వెలిబుచ్చిన అభిప్రాయాలను అర్థం చేసుకోవడంలో @Arjunaraoc గారికి సమస్య ఏదైనా ఉందేమోననిపిస్తోంది. ఇతర వాడుకరులు గమనించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 04:24, 12 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, మీరు చేసిన వ్యాఖ్యలను బట్టి నేను అర్ధం చేసుకొన్న విషయం తెలిపాను. ఆ మూసలో ఏమి వుండాలి అనేది ఇతర విభాగాలలో చర్చకు వున్నది. అక్కడ చర్చలు కొనసాగుతాయి. వేరే మూస వాడకంలేకుండా ఎలా చేయాలో మీకు ఇతర ఆలోచనలుంటే తెలపండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 23:19, 12 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఇటీవలి మార్పులలో "ఈవారం వ్యాసాలు" అనే వాడాలి[మార్చు]

ఇప్పటికే {{ఈవారం వ్యాసం}} చర్చాపేజీలలో వాడటానికి ఉద్దేశించినది కావున ప్రధానపేరుబరిలో వాడటంలో గందరగోళం వుండకుండా చేయుటకు {{ప్రదర్శన వ్యాసం}} మూస వాడాను. అయితే ఇటీవలిమార్పులు లో లింకులో కనబడే పాఠ్యం "ప్రదర్శన వ్యాసాలు" కు బదులు "ఈ వారం వ్యాసాలు" అని మార్చుటకు నాకేమి అభ్యంతరంలేదు. --అర్జున (చర్చ) 23:34, 8 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగే సంబంధిత వివరణలలో కూడా "ఈ వారం వ్యాసాలు" అని వాడటానికి కూడా నాకేమి అభ్యంతరంలేదు.--అర్జున (చర్చ) 23:49, 9 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాఖ్యకు ప్రతిస్పందనలు లేనందున, "ప్రదర్శన వ్యాసాలు" అనే పదం వాడడంపై అభ్యంతరాలు లేవని భావిస్తున్నాను.--అర్జున (చర్చ) 22:56, 11 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసం రూపంలో తారక అవసరంలేదు[మార్చు]

తారక చేర్చిన వ్యాసం ఎలా కనబడుతుందో ఒక ఉదాహరణ రూపం చూడండి. దానిలో తారకపై మౌజ్ చేర్చినపుడు వివరం చూడండి. దానిని నొక్కి వివరం చూడండి.

తొలిగా @Pavan santhosh.s: ఆ పై @Chaduvari: గారు తారక అవసరంలేదు అని తెలిపారు. నేను ఇప్పటికే తారక ఎందుకవసరమో పవన్ సంతోష్ గారి వ్యాఖ్యకు స్పందనలోతెలిపాను. దానికి స్పందనలు రానందున, అది మరల ఇక్కడ చేరుస్తున్నాను.

"ఈ వారం వ్యాసం ప్రతిపాదన సూచనలు మీ వ్యాఖ్యలో తెలిపారు. ఈ వారం వ్యాసం ఉద్దేశ్యం నాణ్యమైన వ్యాసాలను మొదటి పేజీలో ప్రదర్శించడం అయినప్పుడు, దీనిని నిర్వహించినవారు, తోడ్పడిన వారు, దీనికై ప్రతిపాదించిన వ్యాసాలను శక్తిమేరకు అభివృద్ధి పరచి ఈ వారం వ్యాసంగా ప్రదర్శించారు. తెవికీలో ఇంతకుమించి నాణ్యమైన వ్యాసాలను తయారుచేసే పని విస్తృతంగా జరగలేదు కావున ప్రస్తుతానికి వీటిని గుర్తించటం మంచిది. ఆకుపచ్చ నక్షత్రం కాకపోతే, పసుపుపచ్చ నక్షత్రం. మనం మూస వాడినప్పుడు అది వాడామని ఆ వ్యాసం చూస్తే తెలియాలి. దానికొరకు వర్గాలలో ప్రత్యేక వర్గం చేర్చడం, ప్రత్యేక ప్రకటన లేక చిహ్నం ద్వారా తెలుపుతాము. వర్గాల వలన గుర్తించటానికి ఇతర వర్గాలతో కొంత గందరగోళం అయ్యే అవకాశముంది, కొన్ని నిర్వహణ వర్గాలు అందరి వాడుకరులకు కనబడవు, కావున అందరికి కనిపించే చిహ్నం వుండడమే మంచిది."

తారక వలన వాడుకరులకు తప్పు అర్ధం స్పురిస్తుంటే తారక అవసరంలేదనటంలో అర్ధం వుంది. తారక కు వుండే లింకు ద్వారా ఆ తారకకు సంబంధించిన వివరం అనగా అది ఈ వారం వ్యాసంగా మొదటిపేజీలో ప్రచురించుటకు ఎంపికయ్యిందన్న వివరం తెలుపుతుంది, తప్పు అర్ధం ఇవ్వటంలేదు. మెరుగైన నాణ్యత వ్యాసాలు అభివృద్ధి చెందాలంటే తెవికీ సముదాయం తొలిగా ఈ వారం వ్యాసాల నాణ్యతపై సహకరించాలి, వాటిలో జరిగే మార్పులను గమనించే అవకాశం వుండాలి. ఈ ప్రతిపాదన ద్వారా సుమారు 1 శాతం వ్యాసాలను వికీపీడియా పాఠకుల, సభ్యుల దృష్టికి తెస్తున్నది. కావున తారక వద్దంటే మరి ఏ విధంగా ఆ లక్ష్యాన్ని, నిర్వహణ సౌలభ్యాన్ని చేరవచ్చో సభ్యులు తెలపండి --అర్జున (చర్చ) 23:47, 8 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అసలు తారకలు వద్దు సార్ అని మొత్తుకుంటూంటే ఫలానా రంగు వేద్దామా అని చర్చిస్తారేంటి అర్జున గారూ!
" వర్గాల వలన గుర్తించటానికి ఇతర వర్గాలతో కొంత గందరగోళం అయ్యే అవకాశముంది, కొన్ని నిర్వహణ వర్గాలు అందరి వాడుకరులకు కనబడవు, కావున అందరికి కనిపించే చిహ్నం వుండడమే మంచిది."" అని అర్జున గారు అన్నారు. ఇటీవలి మార్పులులో కనబడాలంటే తారక ఉండాలి అని మొదట అన్నారు. దాని కోసం తారక పెట్టాల్సిన అవసరం లేదు అని తేల్చేసాక, ఇప్పుడు వర్గాలు వాడుకరులకు కనబడవు అని అంటున్నారు. వాడుకరులకు ఎందుకు కనబడవు? అర్జున గారికి ఈ విషయంలో ఏదైనా సందేహం ఉంటే నేను ఆయనకు నివృత్తి చేస్తాను. ఆయన దీని గురించి వర్రీ అవనక్కర్లేదు, తారక పెట్టాలని ఆలోచించనక్కర్లేదు. ఇకపోతే గందరగోళం అని అన్నారు.. గందరగోళం ఎందుకుంటుంది? అర్జున గారు లేనిపోని భయాందోళనలు చెందుతున్నారంతే. వర్గాలు గందరగోళాన్ని తగ్గిస్తాయి. అవి గందరగోళం కలిగించేవైతే, ఇక వర్గాలెందుకు?
"వాటిలో జరిగే మార్పులను గమనించే అవకాశం వుండాలి." - అందుకేగా మీరు ఇటీవలి మార్పుల్లో చేరుస్తున్నది. చేర్చండి. అది నొక్కితే ఈ వారం వ్యాసాల్లో జరిగిన మార్పుచేర్పులన్నీ తెలిస్తాయిగా. వాటిని మీరు సభ్యులదృష్టికి తెస్తున్నారుగా. దానికి తారకల అవసరం లేదు.
ఈ వారం వ్యాసాలను ఇటీవలి మర్పులు లో పెట్టేందుకు తారకలు అక్కర్లేదు. వాడుకరులకు, పాఠకులకూ ఈ వారం వ్యాసాల గురించి తెలవాలంటే తారకలు అక్కర్లేదు. అర్జున గారు చెప్పిన కారణాలు సరైనవి కాదు.
ఈ వారం వ్యాసాల నాణ్యత ఎలా ఉంటుందో, ఆ శీర్షికను అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్న వెంకటరమణ గారే స్వయంగా చెప్పారు. ఇక మళ్ళీ చెప్పనక్కర్లేదు. కానీ అర్జున గారి కోసం మళ్ళీ మరొక్కసారి...
ఈ వారం వ్యాసాల్లో అనేక దోషాలుంటాయి. ఏవో ప్రమాణాలను బట్టి ఎంచినవి కావవి. కేవలం ఒక వ్యక్తి ఎంచి చూపించినవి. ఈ వారం వ్యాసాల నాణ్యత ఎలా ఉంటుందో చెప్పేందుకు నాలుగు ఉదాహరణలు చూడండి:
  1. అర్జున గారు ఎంతో శ్రమకోర్చి తీర్చిదిద్దిన రిషి వ్యాలీ పాఠశాల వ్యాసంలో ఏమాత్రం నాణ్యత ఉందో ఈ కూర్పు చూస్తే తెలుస్తుంది. ఈ కూర్పును ఎందుకు చూడమంటున్నానంటే, దీన్నే ఈ వారం వ్యాసానికి ప్రతిపాదించారు కాబట్టి. ఆ తరువాత ఈ కూర్పులో కొన్ని వందల తప్పులను అర్జున గారు నేనూ సవరించాం. మరి ఈ వారం వ్యాసంగా ఏ లెక్కన ప్రతిపాదించారు?
  2. ఆంధ్రప్రదేశ్ వ్యాసం చూడండి.. అదొక పెద్ద కథ. అర్జున గారు దాన్ని ఈ వారం వ్యాసంగా ప్రతిపాదించాక, ఆ వ్యాసంలో బోలెడు మార్పులు జరిగాయి. దానిలో చెయ్యాల్సిన సవరణలపై జరిపిన చర్చే కొన్ని గంటలుంటుంది. తరువాత దానికి నేను ఈ వారం వ్యాసపు సంవత్సరం, వారం కూడా కేటాయించాను. ఇప్పుడు మళ్ళీ ఎవరైనా ఆ వ్యాసాన్ని చూస్తే కొన్ని పదుల సంఖ్యలో దోషాలు కనిపిస్తాయి - అది గ్యారంటీ!
  3. ఇప్పుడు అర్జున గారు పరీక్షార్థం తారక పెట్టాను చూడండి అంటూ ఉదహరించిన బాలాంత్రపు రజనీకాంతరావు పేజీయే చూడండి.. మొన్నీమధ్య దాన్ని ఈ వారం వ్యాసంగా ప్రచురించాం. అందులోఒక విభాగం పేరు "వాద్య బృంద". ఏంటి దానర్థం? ఆ విభాగంలో దాని గురించి అసలేమీ రాయలేదు. ఒక జాబితా ఉంది అంతే. ఆ పేరు కరక్టో కాదో, సగమే రాసి పూర్తిగా రాయడం మర్చిపోయారో తెలీదు. ఇంకోటి.. " దీనిని వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు వారు 1954 ప్రచురించాడు." అనే వాక్యం ఉంది అందులో. ఇది ఈ వారం వ్యాసం లోని వాక్యమా? సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాను.. ఆ పేజీలో కొన్ని దిద్దుబాట్లు చేసి, వారాన్ని కేటాయించి, ఈ వారం వ్యాసంగా ప్రదర్శించింది నేనే. ఆ తప్పులు నా కళ్ళముందుగానే, నా వేళ్ళగుండానే మొదటి పేజీ లోకి పోయాయి.
  4. అర్జున గారు తారక పెట్టిన మరొక వ్యాసం - జలవనరులు చూడండి. అందులో ప్రవేశికలో రెండో పేరా లోని మొదటి వాక్యం ఇది: భూమిపై ఉన్న నోటిలో 97% ఉప్పు నీరే. భూమి నోట్లో ఉన్నది ఉప్పు నీరంట. ఇదేమైనా కవిత్వమా, భూమి "నోట్లో" అని రాయడానికి? "నీటిలో" అని రాయాలి గదా! విజ్ఞాన సర్వస్వ వ్యాసంలో ఈ తప్పులేంటి? దీని మొహాన బొట్టు పెట్టడమేంటి?
ఈ రకపు పేజీలకా మనం తారకలిచ్చుకునేది? నాణ్యత ఉందో లేదో చూసుకోనక్కర్లేదా? మనం చేసే పని ఎలా ఉన్నా.. కనీసం మన ఆలోచనలను, మన ప్రమాణాలను ఉన్నతంగా ఉంచుకోవద్దూ..?
"ఇంతకుమించి నాణ్యమైన వ్యాసాలను తయారుచేసే పని విస్తృతంగా జరగలేదు కావున ప్రస్తుతానికి వీటిని గుర్తించటం మంచిది" :- నాణ్యత లేకపోతేనేమిలే.., ముందు తారకలు మాత్రం పెట్టేద్దాం అనేది సరైన ఆలోచనా ధోరణి కాదిది.
పై వ్యాసాల్లంటివి, అంతకంటే అధ్వాన్నంగా ఉన్న వ్యాసాలూ ఈ వారం వ్యాసంగా మొదటిపేజీ కెక్కాయి. అంతమాత్రాన అవి నాణ్యత ఉన్నవై పోవు. అర్జున గారికి ఈ సంగతి అర్థమయ్యేలా చెప్పడానికి కొన్ని రోజులుగా రెండు పేజీల్లో, కొంతమందిమి ప్రయత్నిస్తూ ఉన్నాం. అయినా అర్జున గారు తారక పెట్టాల్సిందే అంటున్నారు.
తారక అనేది నాణ్యతకు సంబంధించి ఒక హోదా. ఆ హోదా రావాలంటే వ్యాసాన్ని కొలవాలి. అలా కొలవాల్సింది సబ్జెక్టివ్‌గా కాదు, ఆబ్జెక్టివ్‌గా కొలవాలి. అలా కొలవాలంటే ముందు ప్రమాణాలుండాలి. మనకు నాణ్యతా ప్రమాణాలే లేవు, ఇక వ్యాసాలను కొలిచేదెక్కడ!? అంచేత ముందు ప్రమాణాలను నెలకొల్పుకోవాలి. మనందరం మన సమయాన్ని ఖర్చు పెట్టాల్సింది దానికోసం.
అర్జున గారు గమనించారో లేదో.. ఇప్పుడిప్పుడే నమోదైన కొత్త వాళ్ళు కూడా మనకు సుద్దులు చెబుతున్నారు.. ఇన్నిన్ని తప్పులున్నై, సవరించరా అంటూ! వాళ్ళు చెప్పేదానిలో పల్లదనపు మాటలేమైనా ఉంటే వాటిని పక్కన పెట్టినా, తప్పులున్నయ్యన్న సంగతిని మాత్రం చాపకిందకి తోసెయ్యలేం. (ఆ కొత్తవాళ్ళ రాతల్లో ఉన్న తప్పులు కూడా అందుకు సాక్ష్యమే).
కాబట్టి, ఈ వారం వ్యాసాలకు తారకలిచ్చే ఆలోచన మాని, వాటి నాణ్యత పెంచే పని చేపట్టాలి. అర్జున గారు పెద్దలు, నిర్మాణాత్మకమైన పనులు చెయ్యాలి, నాలాంటి వాళ్ల చేత చేయించాలి. అంతేగానీ, తేలిగ్గా చేసెయ్యొచ్చు గదా అని నాణ్యత లేని పనులు, నాసిరకం పనులూ చేపట్టకూడదు. నమస్కారం. __ చదువరి (చర్చరచనలు) 05:46, 9 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
తారక రంగును సాధారణ పసుపుగా ప్రతిపాదించినా ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్ధం కావటంలేదు. బంగారు వెండి, కాంశ్యం రంగులైతే, వాటి స్థాయి గురించి పాఠకులు ఎక్కువ ఊహించుకొని నిరాశకు గురయ్యే అవకాశంవుంది. తారక చేర్చినచో ఆ వ్యాసాల పైన ప్రత్యేక దృష్టి పెట్టి మెరుగుపరచే వారికి అవకాశం కల్పించినందున వికీలో వ్యాసనాణ్యత అభివృద్ధి చెందుతుందని అన్నీ ఒకే కట్టలో కట్టకుండ ఉదాహరణ: స్వచ్ఛభారత్, హరితహారం లాంటి కార్యక్రమాలా లక్ష్యాలలో 99% నెరవేరవు అనుకున్న ఒకటి అర అయినా కొంత అభివృద్ధి చెందుతుంది అని నా నమ్మకం. దీనివలన ఈవారంవ్యాసాలలో సంవత్సరానికి 10 శాతం అభివృద్ధి చెందినా మంచిదే కదా. ధన్యవాదాలు.__ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 16:59, 13 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఎటువంటి ప్రమాణికతలు పాటించకుండా, నాణ్యతా ప్రమాణాల కలిగిన వ్యాసం అని నిర్థారించకుండా తారకలు తగిలించే అర్జున గారి ప్రయత్నాలు తారక అనే పదం విలువకు అర్థం లేకుండా చేస్తున్నట్లు ఉంది.చురుకైన వాడుకరులు ఎవ్యరూ తారకలు చూసి నాణ్యమైన వ్యాసాలను తయారుచేసే పనిని పెట్టుకోరు.ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా చురుకైన వాడుకరులు ఇటీవల మార్పులు పరిశీలిస్తూ జరుగుచున్న వ్యాసాలమీదనే దృష్టిపెడుతుంటారు. తారకలు పెట్టే ఆలోచనను నేను త్రీవంగా వ్యతిరేకిస్తున్నాను.తారకలు పెట్టాలనే చిత్తశుద్ధి ఉన్నవారు,ముందుగా అవి ఎలా ఉంటే తారకలు పెట్టే అర్హత ఉంటుందో ప్రమాణికతలు లేదా కొలమానాలు అనేవి ఉన్నట్లయితే వాటిప్రకారం నిర్థారించి, వాటిని సముదాయంలో చర్చకు పెట్టటానికి ముందుకురండి,అవేమీ లేకుండా తారకలు పెట్టి, వికీపీడియా వ్యాసాలను అపహాస్యం చేయటానికి, దయఉంచి అవకాశం కలిగించవద్దు. యర్రా రామారావు (చర్చ) 06:54, 9 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి, యర్రా రామారావు గార్ల స్పందనలకు ధన్యవాదాలు. మీ వ్యాఖ్యలను బట్టి నేను అర్ధం చేసుకున్నదేమంటే, మీరు నాణ్యత విషయంలో సర్వోత్కృష్ణత(perfection)భావాలు కలవారు. వికీపీడియాలో పనిచేసేవారిలో అత్యధికంగా వుండే నాలాంటి వారు నాణ్యత విషయంలో సాధారణ భావాలు (అనగా తీవ్రదోషాలు లేకపోతే వ్యాసం బాగుంది) అనుకొనే భావాలు కలవారు. అయితే నాలాంటి వారు వివిధ కారణాల వలన సంబంధిత చర్చలలో ఎక్కువగా పాల్గొనకపోవడంతో, మీ భావాలకు అధిక ప్రాధాన్యత కలుగుతున్నది. నేను ఈ వారం వ్యాసం నిర్వహణను సంవత్సరంపైగా చేశాను. అంతకు ముందు ప్రదర్శించిన, ఆ తరువాత ప్రదర్శించిన వ్యాసాలను గమనించాను, కొన్ని సార్లు వాటి నాణ్యతను పెంపొందించే చర్యలు చేశాను. వికీపీడియాలో వ్యాసాలు నిరంతరం మార్పులకు లోనవుతాయి. సర్వోత్కృష్ణ నాణ్యత అనేది లక్ష్యమే గాని, సాధించగలిగేది కాదు. ఈ వారం వ్యాసాల నాణ్యత విషయంలో నాకు తృప్తి వుంది, గౌరవం వుంది. అందుకనే నేను ఇంకా వికీపీడియా అభివృద్ధి చేయడం కొనసాగిస్తున్నాను. వికీలాంటి సముదాయాలకు అన్వయించే en:linus law (Given enough eye balls, all bugs are shallow) (దోషాలున్నప్పుడు వాటిని అందరికి కనబడేటట్లు చేస్తేనే వాటిని తొలగించడం వీలవుతుంది) ప్రకారం, ఈ వ్యాసాలకు తారక ద్వారా వికీపీడియన్లు ధ్యాస పెట్టెటందుకు , నిర్వహణ సౌలభ్యానికి వీలవుతుంది. తారక గురించి ఎంత వివరణ ఇచ్చినా, మీకు సర్వోత్కృష్ణత వ్యాసం అనే భావమే మీకు కలుగుతుంటే, వేరే చిహ్నం (ఉదాహరణకు గులాబీ పువ్వు) వాడడంపై అభ్యంతరాలేమైనా వుంటే తెలపండి. --అర్జున (చర్చ) 23:16, 11 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ, మీకు నా భావాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఏదో ఉన్నట్లు తోస్తోంది. మీకు వాటిని మళ్ళీ మళ్ళీ చెప్పినా ప్రయోజనమేమీ ఉండకపోవచ్చుననిపిస్తోంది. అంచేత ఇక నా అభిప్రాయాన్ని చర్విత చర్వణం చెయ్యను.__ చదువరి (చర్చరచనలు) 04:28, 12 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక సామరస్యపూర్వకమైన పరిష్కారం[మార్చు]

ఈ విషయంపై అత్యధిక సంఖ్యాకులు రచ్చబండలోనే చర్చిస్తున్నారు, పైపెచ్చు ఈ మూస చర్చలో చర్చించేంత చిన్న సంగతి కాదిది. ఐనా, @Arjunaraoc: గారు ఇక్కడే చర్చించాలని ఎందుకో పట్టుబడుతున్నందున నా అభిప్రాయం ఇక్కడే రాస్తున్నాను. చర్చ చాలా దూరం వచ్చింది, ఒక సామరస్యపూర్వకమైన పరిష్కారం ఇప్పుడు అవసరం అని ఇది ప్రతిపాదిస్తున్నాను.

  • ఈ విషయంపై అభిప్రాయాలు వ్యక్తం చేసినవారిలో అత్యధికులు వ్యతిరేకిస్తున్నదీ, అర్జున గారు ఉండాలని పట్టుబడుతున్నదీ - ఆ నాణ్యతను సూచించే ఒక తారక. అది వద్దని వ్యతిరేకిస్తున్నవారి అభ్యంతరం (నాతో సహా) స్థూలంగా ఏమిటంటే - ఈవారం వ్యాసాలు అన్నవి కనీస నాణ్యత స్థాయిలో లేవనీ, అందులో ఒక తారక పెట్టేంత నాణ్యతతో అయితే లేనేలేవని. అవి లేవన్న విషయాన్ని తెలియజేయడానికి పైన @Chaduvari: గారు కొన్ని వ్యాసాలను తీసుకుని వాటిలో లోటుపాట్లు చూపించారు, ఇక ఎన్నాళ్ళ నుంచో వీటిపై పనిచేస్తున్న @K.Venkataramana: గారూ అనుభవపూర్వకంగా అదే విషయం చెప్తున్నారు.
  • ఒకవేళ ఈ తారక ప్రదర్శించాల్సిందేనని అర్జున గారు ఇప్పటికీ నమ్ముతుంటే ఈ కింద సూచించిన పనిచేయమని అర్జున గారికి సూచిస్తున్నాను: ఒక 7 సంవత్సరాలు తీసుకుని, ఆ ఏడేళ్ళలో ఏడాదికి పది ఈవారం వ్యాసాలను ఎంచుకుని, మొత్తంగా ఒక 70 ఈవారం వ్యాసాలను శాంపిల్‌గా తీయండి. (700లో 10 శాతం 70 కనుక) ఆ 70 వ్యాసాలు కనీసం మంచి వ్యాసం ప్రమాణాలకు అయినా అనుగుణంగా ఉన్నాయో లేదో సమీక్షించి ఆయా చర్చా పేజీల్లో అప్‌డేట్ చేయండి. ఆ 70 వ్యాసాలు కనీసం మంచి వ్యాసం ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిరూపణ అయితే ఈవారం వ్యాసాలకు ఈ తారక (లేదా ఏదోక కొత్త తారక) ఇవ్వవచ్చునని నిర్ణయించవచ్చు. ఈ పనిలో సహాయపడేందుకు కావాలంటే ఈ ప్రతిపాదనను సమర్థించిన సభ్యుల సహకారం అర్జున గారు తీసుకోవచ్చు.
  • ఈ పని చేయలేనని ఆయన భావిస్తున్నట్టైతే, ఒక వర్గాన్ని ఈవారం వ్యాసాలు అన్నిటిలోనూ చేర్చేయవచ్చు (చర్చ పేజీలో కాదు వ్యాసం పేజీలోనే), ఆ చేర్చిన వర్గాన్ని ఉపయోగించి వ్యాసాన్ని //ఇటీవల మార్పులలో ఈ వ్యాసాలకు సంబంధించిన మార్పులకు ప్రత్యేక లింకు ఏర్పాటు// చేసుకోవచ్చు. ఈ వర్గం వ్యాసం పేజీలోనే పెట్టుకుంటున్నాం కాబట్టి ఏ సమస్యా లేకుండా అర్జున గారు చేసిన పని నెరవేరుతుంది. ఆ వర్గాన్ని hide కూడా చేయడం ఉత్తమం.

పాఠకులకు (అంటే కేవలం చదివేవాళ్ళు) తెలిసేలా వ్యాసం కనిపించాలంటే నాణ్యంగా ఉందని కనీసం పది శాతం వ్యాసాల మీదైనా సమీక్ష చేసుకోవాలి. వాడుకరులకు (అంటే మనలా మార్పుచేర్పులు చేసేవాళ్ళు) వ్యాసంలో మార్పులు తెలిసేలా చేయాలంటే ఇంత హంగామా అక్కరలేదు. సింపుల్‌గా వ్యాసంలో ఒక వర్గం చేస్తే చాలు. ఈవారం వ్యాసాల్లో తారక చేర్చడానికి ఈ వ్యాసాలు మొదలుపెట్టి, అభివృద్ధి చెందిన వాడుకరుల్లో కూడా ఎక్కువమంది ఇష్టపడతారని అనుకోను. ఎందుకంటే నేను ప్రారంభించిన/ప్రధానంగా అభివృద్ధి చేసినవి 15 వ్యాసాలు గత రెండు సంవత్సరాల్లోనే ఈవారం వ్యాసానికి ఎక్కినాయి. నేను ప్రధానంగా కంట్రిబ్యూట్ చేసిన ఈ వ్యాసాల్లోకి తారక పెట్టడం నేనేమీ ఘనతగా భావించకపోగా గట్టిగా వ్యతిరేకిస్తున్నాను. అది నాణ్యత మీద నాకున్న కమిట్మెంట్. గ్రహించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 12:52, 9 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ పరిష్కారాలు బాగున్నై పవన్ సంతోష్ గారు. మొదటి దాన్ని ఎంచుకుని పని చేస్తే, వ్యాసాల్లో నాణ్యతను పెంచే విషయంలో తెవికీలో నాయకత్వం తీసుకున్నట్లే. రెండవ పరిష్కారం తీసుకుంటే నాణ్యత పట్ల కనీసం చులకన భావమైతే లేనట్లే. అర్జున గారు మొదటి పరిష్కారాన్ని ఎంచుకుని, వాడుకరులకు మార్గదర్శకంగా ఉండాలని నా ఆశ. లేదా రెండో దాన్ని ఎంచుకుని తోటి వాడుకరుల అభిప్రాయాలకు విలువ నివ్వాలని కోరుకుంటున్నాను.
ఇక, ఈ అంశంపై వాడుకరులు తమ అభిప్రాయాలు చెప్పడం ముగిసినట్లేనని అనిపిస్తోంది. పవన్ గారు ఈ సామరస్య పరిష్కారం చెప్పి రెండు రోజులైనా దీనిపై ఎవరూ మాట్టాళ్ళేదు. చర్చలో పాల్గొన్న వాళ్ళందరూ కురిసిన మబ్బుల్లా కనిపిస్తున్నారు. నిర్ణయం చెప్పే సమయం వచ్చినట్లే అనిపిస్తోంది. పాల్గొనని నిర్వహకులు పరిశీలించవలసినది. __చదువరి (చర్చరచనలు) 01:43, 11 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్, చదువరి గార్లకు, పవన్ ప్రతిపాదించిన మొదటి ప్రతిపాదన, నేను తలపెట్టిన పనికి అవసరమైన శ్రమతో పోలికలేకపోవడంతోను, నాకు మంచివ్యాసం ప్రమాణాలకు అనుగుణంగా వ్యాసాలను రూపొందించే నైపుణ్యాలు లేకపోవడంతోను నేను చేపట్టలేకపోతున్నాను. మీరు కనుక ఆ పని చేపట్టి, వారానికో, పక్షానికో ఒక వ్యాసం మంచి వ్యాసంగా తీర్చే ప్రాజెక్టు చేపట్టితే నా ప్రతిపాదన విరమించటానికి నాకు అభ్యంతరంలేదు. అటువంటి ప్రాజెక్టులో నేను సభ్యునిగా చేరి పాల్గొంటాను.--అర్జున (చర్చ) 22:38, 14 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్, చదువరి గార్లకు, పవన్ రెండవ ప్రతిపాదనన పాక్షికంగా నాకు సమ్మతమే. వర్గం:ప్రదర్శన వ్యాసాలు ను దాచివుంచిన వర్గంగా మార్పు చేశాను. తారక లేక ఇతర చిహ్నం అవసరం గురించి ఇతర ఉపవిభాగాల్లో చర్చించాను. ఈ చర్చలపై తుదినిర్ణయం పాటించడానికి నాకు అభ్యంతరాలు లేవు.--అర్జున (చర్చ) 22:38, 14 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయ అభ్యర్ధన[మార్చు]

14 ఏప్రిల్ 2021 నాడు నేను చేర్చిన చివరి వాదనకు ప్రతివాదనలు వారంగడచినా లేనందున, ఈ విషయమై వాద ప్రతివాదనలు పూర్తయినట్లు భావిస్తున్నాను. వాడుకరి:రవిచంద్ర గారిని నిర్ణయం ప్రకటించవలసిందిగా కోరుతున్నాను.--అర్జున (చర్చ) 00:13, 22 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చా సారాంశం[మార్చు]

చర్చను ముగించడానికి ముందు నేను ముఖ్యమైన అంశాలను క్రోడీకరిస్తాను. చర్చలో పాల్గొన్నవారు ఒకసారి పరిశీలించి కింద నేను చేర్చిన విభాగంలో మీ అభిప్రాయాలు రాయండి. ఏదీ నా దృష్టి దాటిపోలేదు అని మీరు ధృవీకరించిన తర్వాత చర్చకు ముగింపు తెస్తాను. నేను అర్థం చేసుకున్న ప్రకారం, ఈ చర్చ లక్ష్యం, ఈ వారం వ్యాసాలను ప్రత్యేకంగా గుర్తించడం. ఈ వారం వ్యాసాలను ప్రత్యేకంగా ఎందుకు గుర్తించాలి? ప్రస్తుతం తెవికీలో సుదీర్ఘ కాలం పాటు, క్రమం తప్పకుండా మన దగ్గర ఉన్న వ్యాసాలనుంచే మెరుగైన వాటిని ఏరి, ఈ వారం వ్యాసంగా ప్రదర్శించుకుంటున్నాం కాబట్టి నాణ్యమైన (సాపేక్షంగా తీసుకుంటే) వ్యాసాలను గుర్తించడానికి మనం దీర్ఘకాలంగా చేస్తున్న పని ఇది. అలాంటి వ్యాసాలను అభివృద్ధి చేసే ఆసక్తి ఉన్న సభ్యులకు,

  • ఇటీవలి మార్పుల్లో ఆ వ్యాసాలలో జరిగే మార్పులు పరిశీలించడం కోసం
  • ఒక వ్యాసం చూడగానే, అది ఈ వారం వ్యాసంగా ప్రదర్శితమైందా లేదా అని సులభంగా తెలుసుకోవడం కోసం
  • ఈ వారం వ్యాసాలన్నటినీ ఒకేసారి సులభంగా చేరుకోవడం కోసం

ఒక సౌలభ్యం కావాలి. ఈ వారం వ్యాసం కోసం వాడుతున్న మూసల ద్వారా పని జరగదు కాబట్టి మరో కొత్త మూస ద్వారా తారకను చేర్చడం అందుకు మేలైన పద్ధతి అని అర్జున గారు అంటున్నారు.

ప్రస్తుతం ఈ వారం వ్యాసాలకు మనం చర్చా పేజీలో {{ఈ వారం వ్యాసం|సంవత్సరం=<>| వారం=<>}} అనే ఒక మూస చేర్చుకుంటున్నాం. ఇలా చేయడం వల్ల ఆ వ్యాసం చర్చా పేజీ [[వర్గం: ఈ వారం వ్యాసాల చర్చలు - YXXXX]], [[వర్గం: ఈ వారం వ్యాసాల చర్చలు - WXX]] అనే వర్గాల్లో చేరిపోతుంది. దీంతో వ్యాసాల చర్చా పేజీల నుంచి అది ఈ వారం వ్యాసమా కాదా? అవునయితే దాన్ని ఏ సంవత్సరంలో, ఏ వారంలో ప్రదర్శించారు? అదే సంవత్సరంలో ఈ వారం వ్యాసంగా ప్రదర్శితమైన ఇతర వ్యాసాలు ఏవి? అనేది ఆయా వర్గాల పేజీల మీద నొక్కి వెళితే తెలుస్తుంది. ఈ పద్ధతి వికీ మీద కొద్దో గొప్పో అవగాహన ఉన్న సభ్యులకు సులభమే. కానీ సాధారణ సభ్యులకు అంత సులభం కాకపోవచ్చు. ఎందుకంటే వ్యాసం చర్చా పేజీకి వస్తే గానీ ఈ సమాచారం తెలియదు. కాబట్టి వ్యాస చర్చా పేజీలో కాకుండా వ్యాసం లోనే ఉంచగలిగే మూస అయితే బాగుంటుందని అర్జున గారు ప్రతిపాదిస్తూ అందుకోసం ఆయన {{ప్రదర్శన వ్యాసం}} అనే ఒక మూసను కూడా తయారు చేశారు. ఈ మూస చేరిస్తే ఆ వ్యాసం [[వర్గం: ప్రదర్శన వ్యాసాలు]] అనే వర్గంలో చేరుతుంది; అలాగే వ్యాసం పైన కుడి వైపు మూలగా ఒక నక్షత్రం గుర్తు కనిపిస్తుంది. ఆ నక్షత్రం మీద నొక్కితే ఆ వ్యాసం ఎందుకు అలా గుర్తించబడిందో ఎవరికైనా సులభంగా తెలుస్తుందని అర్జున గారి ఉద్దేశ్యం.

చర్చలో చాలా భాగం ఈ తారక (ఏ రంగైనా కానీయండి) ఉంచాలా వద్దా అనే విషయం మీదనే కేంద్రీకృతమైంది. అర్జున గారి ప్రతిపాదనకు ప్రభాకర్ గౌడ్ గారు సమ్మతించగా చర్చలో పాల్గొన్న మిగతా వారంతా (చదువరి గారు, పవన్ సంతోష్ గారు, యర్రా రామారావు గారు, వెంకటరమణ గారు) ఇందుకు తమ వ్యతిరేకతను తెలియజేశారు. వ్యతిరేకించిన అందరి అభిప్రాయలకు ప్రధాన కారణం, తారకను చేర్చడం అన్నది సాంప్రదాయికంగా ఉన్నతమైన నాణ్యతా ప్రమాణాలకు లోబడిన వ్యాసాలకు మాత్రమేననీ, ఈ వారం వ్యాసాల కోసం సభ్యుల ప్రతిపాదనలనుంచి కేవలం మెరుగైన వాటిని మాత్రమే తీసుకుంటున్నాము కానీ నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదనే విషయం. తారకను చేర్చినా దాని మీద సభ్యులు నొక్కినప్పుడు అది ఎందుకు చేర్చబడిందో వివరంగా తెలియజేస్తాము కాబట్టి మనం నాణ్యతను గురించి సభ్యులకు తప్పుడు సంకేతాలను పంపడం లేదని అర్జున గారి అభిప్రాయం. ఈ చర్చలో ఇంకా తేలనది, ఏకాభిప్రాయం రానిది తారక విషయంలోనే, ఒకవేళ తారక కాకపోతే ఇంకో సులభమైన మార్గం ఏమిటనేది.

ప్రదర్శన వ్యాసం మూస ద్వారా తారకను చేర్చడానికి వ్యతిరేకత ఉన్నందున, కేవలం [[వర్గం: ప్రదర్శన వ్యాసాలు]] ఒకటే చేరిస్తే చాలునని పవన్ సంతోష్ గారు అభిప్రాయపడగా, అది వ్యాసం మిగతా వర్గాలలో కలిసిపోయి, అడుగున పడిపోతుందని పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని అర్జున గారు భావించారు. తారక కాకపోతే ఇంకేదైనా గుర్తు (గులాబీ) చేర్చవచ్చని కూడా అర్జున గారు ప్రతిపాదించారు.

చర్చా ప్రతిపాదనలో అభ్యంతరం లేని, కొలిక్కి వచ్చిన కొన్ని విషయాలు ఇవి.

  • ఈ వారం వ్యాసాలను వ్యాసరూపులో గుర్తించడం. మూస ద్వారా వ్యాసంలోనే ఒక దాచి ఉంచిన వర్గాన్నయితే చేర్చవచ్చు. వర్గం పేరు ఏది ఉండాలో (ప్రదర్శిత వ్యాసమా, ఈ వారం వ్యాసమా?) ఇంకా నిర్ణయానికి రాలేదు.
  • పైన చేర్చిన వర్గాన్ని ఉపయోగించుకుని ఇటీవలి మార్పుల పేజీలో ఈ వారం వ్యాసాలలో జరిగిన మార్పులు మాత్రమే సూచించే ఒక వడపోత (ఫిల్టర్) సృష్టించడం. 2021-06-09T00:53:18‎ రవిచంద్ర

సారాంశంపై సభ్యుల స్పందనలు[మార్చు]

@రవిచంద్ర: గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. సారాంశం చాలవరకు బాగానే వుంది. రెండు అంశాలకు స్పందించదలచాను.

మీ స్పందనకు ధన్యవాదాలు అర్జున గారూ, ఈ అంశాలు కూడా పరిగణనలోకి తీసుకుని సారాంశంలో చేరుస్తాను. రవిచంద్ర (చర్చ) 05:08, 9 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి స్పందన[మార్చు]

నిర్ణయం చెప్పేవారి సౌలభ్యం కోసం: అసలు నేను పొద్దున దీన్ని చూసినపుడు ఏమీ రాయదలచలేదు. చెప్పాల్సినదంతా చెప్పేసాం గదా అని అనుకున్నాను. కానీ రాయడం మంచిది అని ఇప్పుడు అనిపించింది. అందుకే రాస్తున్నాను.

ఈ చర్చకు కారణమైనది వ్యాసాలను "ఇటీవలి మార్పులు" లో కనబడేలా పెట్టాలనుకోవడం. అయితే-

  • మౌలికమైన ప్రశ్న: అసలు ఈ వారం వ్యాసాలను "ఇటీవలి మార్పులు" లో కనబడేలా పెట్టాలనుకున్నది ఎందుకు?
  • దానికి సమాధానం: ఆ వ్యాసాల్లో ఇటీవల ఏమేం మార్పులు జరిగాయో చూసేందుకు! అంతే తప్ప ఈ విశేషానికి మరో ప్రయోజనమే లేదు. మరి తారకలు పూలూ ఎందుకు? అవసరం లేదు. అవేమీ లేకుండానే నేరుగా చేసెయ్యొచ్చు. చిటికెలో చేసెయ్యొచ్చు. మరి తారకలేల?

ఆ ప్రశ్నతో చర్చ పక్క దారులు పట్టేసింది - తారక లేకపోతే, పాఠకులకు ఎలా తెలుస్తందని అన్నారు. అనామక వాడుకరులకు ఎలా తెలుస్తుంది అని ఇప్పుడు అంటున్నారు. "ఇటీవలి మార్పులు" లో కనబడాలి అనే అసలు అంశం పక్కకు పోయింది.

చర్చ ఎందుకిలా పక్కదారి పట్టింది? ఎందుకంటే.. మనకు ఏం కావాలనే దాని గురించి అయోమయం ఉన్నందున. లేదా అవతలి వాళ్లను అయోమయం లోకి నెట్టేసేందుకు. లేదా మనం అనుకున్నదే జరగాలన్న మొండి పట్టుదల మనకు తెలియకుండానే అంతర్లీనంగా ఉన్నందువలన కావచ్చు. చూడండి.. ఇప్పుడు కొత్తగా అనామక వాడుకరుల అంశం తెరమీదకు వచ్చింది! ఏమిటీ పట్టుదల?

మరొక్కసారి నా అభిప్రాయాలను అందరి దృష్టికీ తెస్తున్నాను..

  1. మనకు కావాల్సింది నాణ్యమైన వ్యాసాలు గానీ, ఉన్నవాటినే నాణ్యమైన వ్యాసాలని అనుకోవడం కాదు. ముందు చెయ్యాల్సింది నాన్యతకు ప్రమాణాలను నిశ్చయించుకోవడం.
  2. ఈ వారం వ్యాసాల్లో నాణ్యత లేదు - అసలు ప్రమాణాలే నెలకొల్పుకోలేదు మనం. ముందు ఆ పని చెయ్యాలి
  3. వ్యాసంలో చుక్క గుర్తో, పువ్వు గుర్తో, మరేదైన గుర్తో పెట్టరాదు. ఇటీవలి మార్పులు లో చేర్చాలంటే దీని అవసరమే లేదు.
  4. వ్యాసాన్ని (చర్చ పేజీని కాదు) ఒక వర్గం లోకి చేరిస్తే చాలు - దాన్ని ఇటీవలి మార్పులు లోకి చేర్చవచ్చు. చుక్కలూ పూలూ అక్కర్లేదు.
  5. ఈ వర్గాన్ని దాచి ఉంచుదామని అన్నది కేవల సౌలభ్యం కోసం మాత్రమే. వద్దనుకుంటే కనబడేలానే ఉంచవచ్చు.
  6. ఇటీవలి మార్పులు లో దీని పేరు "ఈ వారం వ్యాసం" అనే ఉండాలి - ప్రదర్శన వ్యాసమనో ప్రదర్శిత వాసమనో, విశేష వ్యాసమనో, మరోటో ఉండరాదు.
  7. ఇప్పుడు కొత్తగా అనామక వాడుకరుల అంశం తెరమీదకు వచ్చింది. పాఠకులకైనా, అనామకులకైనా, ఇతర వాడుకరులకైనా ఎలా తెలుస్తుందా..? వ్యాసం ఒక వర్గంలో ఉంటుంది కదా! వ్యాసపు చర్చ కూడా ఒక వర్గంలో ఉంటుంది కదా. ఇంకేం కావాలి తెలియాలంటే?

ఈ వారం వ్యాసాలను ఇటీవలి మార్పుల్లో చూపించాలంటే అది 5 నిమిషాల లోపు పని- తారకలు అక్కర్లేదు, పూలూ అక్కర్లేదు. ప్రదర్శనలు, ప్రదర్శితాలు, విశేషాలు అంటూ కొత్త పదాలను కాయించనక్కర్లేదు. చర్చ పక్కదారి పట్టక పోయి ఉంటే ఇంత చర్చ కూడా అవసరముండేది కాదు. ఐదే నిమిషాల్లో మొత్తం 700 పైచిలుకు వ్యాసాలనూ ఈ అంశంలో పొందుపరచవచ్చు. ఎవరమైనా చెయ్యగలమీ పని. కానీ చెయ్యలేదు. ఎందుకంటే.., మనకు పని ముఖ్యం కానట్టుగాను, పట్టుదలే ముఖ్యమన్నట్టుగానూ తోస్తోంది నాకు.

అన్ని వర్గాల వారినీ సంతృప్తి పరచడం లాంటి రాజకీయ నిర్ణయం కాకుండా, కేవలం ఇక్కడ, ఇదే విషయమై రచ్చబండ లోనూ వెలువడ్డ అభిప్రాయాలను పరిశీలన లోకి తీసుకుని, విజ్ఞతతో చేసే నిర్ణయం కోసం ఎదురు చూస్తాను. __చదువరి (చర్చరచనలు) 07:06, 9 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పైన నేను రాసిన చివరి పేరా, రవిచంద్ర గారి విచక్షణ, వివేచనలపై నాకేదో సందేహం ఉందన్నట్టుగా అర్థాన్నిస్తోందని నాకు అనిపించింది. అలాంతి సందేహాలేమి నాకు లేవని వివరిస్తున్నాను. అంచేత ఆ పేరాను సవరించాను.__చదువరి (చర్చరచనలు) 11:53, 9 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారూ, మరొక్క సంగతిని దృష్టిలో ఉంచుకోవాల్సినది ఏంటంటే.. ఇటీవలి మార్పులులో చూపించదలచినది ఈ వారం వ్యాసాలను. మరి దానికి "ఈ వారం వ్యాసాలు" అనే పేరే పెట్టకుండా ప్రదర్శన వ్యాసాలు అని పెట్టడమేంటి? మొదటిపేజీలో ఉన్న శీర్షిక పేరే "ఈ వారం వ్యాసం" అని ఉండగా ఆ శీర్షిక నుండి ఉద్భవించిన డెరివేటివ్ విశేషానికి ఆ పేరు నప్పదా!? __చదువరి (చర్చరచనలు) 01:56, 11 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ చర్చలో గమనించవలసిన మరొక ముఖ్యమైన సంగతి ఏంటంటే.. చర్చ జరుగుతూ ఉండగానే ఇటీవలి మార్పులు పేజీలో మార్పులు చేసెయ్యడం- ఏ మార్పులు వద్దని ఇతరులు చర్చలో చెప్పారో అవే మార్పులను చేసెయ్యడం. ఆనక అది పరీక్ష కోసమనో ఇతరులకు అర్థం అయ్యేందుకో చేసానని సమర్ధించుకోవడం. పైగా ఆ మార్పును కూడా చాలా ఎక్కువగా చూసే "ఇటీవలి మార్పులు" పేజీలో చేసారు! అలా వాడుకరులు అభ్యంతరం చెప్పాకనైనా @Arjunaraoc గారు తాను చేసిన ఆ పనిని వెనక్కి తీసుకోవాల్సింది. అది చెయ్యలేదు. చెయ్యక పోగా..
ఇవ్వాళ ఆ పేజీలో మళ్ళీ మార్పులు చేసి, దానికి ప్రదర్శన వ్యాసాలు (నడుస్తున్న చర్చ) అని ఒక బోర్డు కూడా తగిలించారు. ఈ మొత్తం వ్యవహారాన్నంతటినీ ఒక జోగ్గా, ఇటీవలి మార్పులు పేజీని ఒక ప్రయోగశాలగా విజయవంతంగా మార్చేసారు. చాలా దురదృష్టకరం. నిర్ణయం ప్రకటించేవారు దీని గురించి కూడా ప్రస్తావిస్తారని భావిస్తున్నాను__ చదువరి (చర్చరచనలు) 12:40, 11 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ, ఈ చర్చ ప్రారంభించి 20 రోజులు అవుతుంది. వీలు చూసుకుని వారం, పది రోజులలో ఒక నిర్ణయం ప్రకటించగలరు. ఈమధ్య తెవికీలో చురుకుగానే మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ విషయం కూడా ఒకసారి గుర్తు చేద్దామని ఈ చర్చ పెట్టాను. ధన్యవాదాలు సార్. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 07:12, 29 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయం[మార్చు]

ఈ వారం వ్యాసాలను అభివృద్ధి చేయడం కొరకు అర్జున గారి ప్రతిపాదనలు ఈ కింది విధంగా అమలు చేయాలి.

  • ఈ వారం వ్యాసాలను ఇటీవలి మార్పుల్లో చూపించడానికి వీలుగా వాటికోసం ఒక వర్గం/మూస సృష్టించుకోవాలి. ఈ వర్గం పేరు ఈ వారం వ్యాసాలు అని ఉండాలి. ఎందుకంటే చర్చలో మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు ఈ వారం వ్యాసాలకు నాణ్యతా ప్రమాణాలు సరిపోవు కనుక వాటిని ప్రదర్శిత వ్యాసాలనో, మరొకటో కాక అదే పేరుతో పిలిస్తే బాగుంటుంది. మూస సాయంతో ప్రస్తుతానికి వాటిని సూచించడానికి వ్యాస పైభాగంలో గుర్తులు ఏమీ చేర్చకూడదు.
  • ఇటీవలి మార్పుల్లో ఈ వారం వ్యాసాల్లో జరిగిన మార్పులు మాత్రమే కనిపించేందుకు పైన సృష్టించిన వర్గం సాయంతో ఒక వడపోత సృష్టించాలి.

భవిష్యత్తులో మనం వ్యాసాల కోసం వివిధ స్థాయిల్లో నాణ్యతా ప్రమాణాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు, వాటిని అనుసరించి వ్యాసాలను అభివృద్ధి చేసినపుడు అర్జున గారు చెప్పిన ప్రదర్శిత వ్యాసాలు, విశేష వ్యాసాల కోసం వివిధ రకాల తారకలను చేర్చవచ్చు. - రవిచంద్ర (చర్చ) 07:22, 6 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@రవిచంద్ర గారు, నిర్ణయాన్ని ప్రకటించినందులకు ధన్యవాదాలు. నిర్ణయం అమలుకు చేయవలసిన చర్యలవలన నిర్వహణకు, వాడుకరులకు పూర్తి సౌలభ్యంలేదని నేను భావిస్తున్నాను. ఈ నిర్ణయం అమలుకు చేబట్టవలసిన చర్యలలో ఒకటి (కొత్త వర్గాన్ని దాచకుండా వుంచడం) వికీపీడియా పద్ధతులకు వ్యతిరేకం కనుక ఒక నిర్వాహకునిగా నేను చేయలేనని తెలుపుటకు విచారిస్తున్నాను. చర్చలో పాల్గొన్న సభ్యులందరికి ధన్యవాదాలు. అర్జున (చర్చ) 23:18, 7 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, మీ అసంతృప్తి నాకు అర్థం అయింది. కానీ సముదాయం అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం ప్రకటించాను. నాణ్యమైన వ్యాసాలు రూపొందించడం కోసం మీతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అప్పుడు మీ అసలు ఉద్దేశ్యం నెరవేరవచ్చు. ధన్యవాదాలు. - రవిచంద్ర (చర్చ) 05:21, 8 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@రవిచంద్ర గారూ ధన్యవాదాలు.
ఈ చర్చపై చేసిన నిర్ణయం మేరకు, కింది మార్పులు చేసాను.
1. ప్రదర్శన వ్యాసాలు అనే పేరు స్థానంలో "ఈ వారం వ్యాసాలు" అనే పేరు పెట్టాను.
2. "ఈ వారం వ్యాసాలు" అనే దాచిన వర్గాన్ని సృష్టించాను. ఈ వర్గం పాఠకులకు కనిపించదు.
3. ఈ వారం వ్యాసాలను ఈ వారం వ్యాసాలు అనే వర్గం లోకి ప్రస్తుతం AWB చేరుస్తోంది. చాలావరకు ఐపోయింది.
ఇక.., ఇటీవలి మార్పులులో ఈ వారం వ్యాసాల్లో ఇటీవల జరిగిన మార్పులను చూడవచ్చు. __ చదువరి (చర్చరచనలు) 01:57, 8 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు చదువరి గారూ. - రవిచంద్ర (చర్చ) 05:22, 8 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]