Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా

వికీపీడియా నుండి

వికీపీడియాలో ఉన్న మంచి మంచి వ్యాసాలను ఏరి వాటిని అందరికీ ప్రదర్శించటమే ఈ వారం వ్యాసం లక్ష్యం.

ఈ వారపు వ్యాసం

2025 06వ వారం

ట్రావన్‌కోర్

ట్రావన్‌కోర్ రాజ్యం సుమారు 1729 నుండి 1949 వరకు విలసిల్లిన రాజ్యం. తొలుత పద్మనాభపురం, ఆ తరువాత తిరువనంతపురం రాజధానిగా ట్రావన్‌కోర్ రాజకుటుంబం ఈ రాజ్యాన్ని పాలించింది. ట్రావన్‌కోర్ అత్యున్నత దశలో ఉన్నపుడు, ఆధునిక కేరళలోని దక్షిణ భాగం లోని ఇడుక్కి, కొట్టాయం, అలప్పుళా, పతనంతిట్ట, కొల్లం, తిరువనంతపురం జిల్లాలు, ఎర్నాకులం జిల్లాలోని ప్రధాన భాగాలు, త్రిసూర్ జిల్లాలోని పుతేన్‌చిర గ్రామం, ఆధునిక దక్షిణ తమిళనాడుకు చెందిన కన్యాకుమారి జిల్లా, తెన్‌కాశి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, పొరుగున ఉన్న కొచ్చిన్ రాజ్యంలోని ఇరింజలకుడ కూడల్మాణిక్యం దేవాలయానికి చెందిన తాచుడయ కైమల్ ఎన్‌క్లేవ్‌లు ఈ రాజ్యంలో భాగంగా ఉండేవి. అయితే కొల్లాం నగరంలోని తంగస్సేరి ప్రాంతం, తిరువనంతపురంలోని అట్టింగల్ సమీపంలోని అంచుతెంగు బ్రిటిషు భారతదేశంలో భాగం. ఉత్తరాన మద్రాసు ప్రెసిడెన్సీ మలబార్ జిల్లా, తూర్పున మద్రాసు ప్రెసిడెన్సీలో పాండ్య నాడు ప్రాంతానికి చెందిన మదురై, తిరునల్వేలి జిల్లాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం ఈ రాజ్యానికి సరిహద్దులుగా ఉండేవి. ట్రావన్‌కోర్ రాజ్యాన్ని పద్మనాభపురం, త్రివేండ్రం, క్విలాన్, కొట్టాయం, దేవికులం అనే ఐదు విభాగాలుగా విభజించారు. వీటిలో పద్మనాభపురం, దేవికులం ప్రధానంగా తమిళం మాట్లాడే ప్రాంతం. మలయాళం మాట్లాడే ప్రజలు కొద్దిసంఖ్యలో ఉండేవారు. త్రివేండ్రం, కొల్లం, కొట్టాయం విభాగాలు ప్రధానంగా మలయాళం మాట్లాడే ప్రాంతాలు. తమిళం మాట్లాడే వారు కొద్ది సంఖ్యలో ఉండేవారు
(ఇంకా…)




ప్రతిపాదించడం

క్రింద ఇవ్వబడిన సూచనలు గమనించి, మీరు ప్రతిపాదించ దలచుకొన్న వ్యాస చర్చాపేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} అన్న మూసను ఉంచండి. ఏదైనా వ్యాసాన్ని ఈ వారం వ్యాసంగా మొదటిపేజీలో ప్రదర్శించాలంటే, దానికి కింది అర్హతలుండాలి

  • వ్యాసం కనీసం ఐదు కిలోబైట్లకు మించి ఉండాలి. 10 కిలోబైట్లకు మించి ఉంటే ఇంకా మంచిది.
  • వ్యాసం గతంలో ఎపుడైనా విశేష వ్యాసముగాగానీ, ఈ వారం వ్యాసంగా కానీ ప్రదర్శింపబడి ఉండరాదు (ఇదివరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శించబడినా, ఆ తరువాత కాలములో వ్యాసపు నాణ్యత గణనీయంగా పెరిగి ఉన్నా, లేదా విశేష వ్యాసం స్థాయికి చేరుకొని ఉన్నా, ఈ నియమానికి వెసులుబాటు ఇవ్వవచ్చు).
  • వ్యాసంలో అనువదించవలసిన భాగాలు ఉండరాదు. ఒకవేళ కొన్ని చిన్న చిన్న అనువాదాలు చేయవలసి ఉండీ పరిగణనలో చేర్చినా, మొత్తం వ్యాసం అనువదించే వరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శింపబడదు. సాధారణంగా అనువాదం చేయవలసిన భాగాలున్న వ్యాసాలను జాబితాలో చేర్చకండి.
  • వ్యాసంలో కనీసం ఒక సంబంధిత బొమ్మ అయినా ఉండాలి.

తెలుగు వికీపీడియా రాశి, వాసి పెరిగే కొలది సభ్యులు చర్చించి అదనపు నియమాలను ప్రకటించవచ్చు.


వ్యాసం వార నిర్ణయం

పండగలు, చారిత్రాత్మక రోజులు, ప్రస్తుత ఘటనలకు సంబంధించిన విషయాలను బట్టి వారం వ్యాసాన్ని నిర్ణయించండి. /2024 ISO కేలండర్ వారం సంఖ్య, /2025 ISO కేలండర్ వారం సంఖ్య లను చూడండి. వారం వ్యాసం ప్రపంచ ప్రామాణిక కాలం (UTC/GMT) ప్రకారం మారుతుందని (అంటే భారతదేశంలో సోమవారం ఉదయం 05:30 గంటలకు) గమనించండి. వారం వ్యాసం పేరు, వారంతో ప్రత్యేక సంబంధము వివరాలు వున్నప్పుడు రాయండి. ఎంపికకు వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలు వర్గాన్ని చూడండి. యాంత్రిక అనువాద వ్యాసాలుగా గుర్తించినవాటి నాణ్యత పెంపొందించటంలో (ఎరుపు లింకులు తొలగించటం, స్థానికత దగ్గరైన వివరాలు చేర్చటం లాంటివి) ప్రత్యేక శ్రద్ద కావాలని గమనించండి

నిశ్చయమైన వ్యాసం చర్చా పేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} ను చెరిపేసి {{ఈ వారం వ్యాసం|సంవత్సరం=????|వారం=??}} అన్న మూసను ఉంచండి.

వ్యాస పరిచయ రూపం సృష్టించడం

"ఈ వారం వ్యాసం" పరిచయ రూపంలో దీనిలో స్వేచ్ఛానకలుహక్కుల బొమ్మలు మాత్రమే వాడాలి.

2025 జాబితా

2025 సంవత్సరానికి గాను వీలయినంతవరకు ఈ జాబితా ప్రకారం "ఈ వారం వ్యాసం" పరిచయ రూపాన్ని (వ్యాస ప్రవేశికలో మొదటి కొన్ని పేరాలు)(కనీసం వారం రోజుల ముందుగా) తయారు చేయాలి. క్రింద నున్న పట్టికలో సంబంధిత వారం అంకెను నొక్కితే "ఈ వారం వ్యాసం - ఫలాని వారం" అనే ఖాళీ పేజీ {{ఈ వారపు వ్యాసం/preload}} కోడ్ తో తెరుచుకొంటుంది. ఎంపిక చేసిన వ్యాసం పేరు, వ్యాసం బొమ్మ పేరు, వ్యాసం పరిచయంనుండి కొంతభాగం ఆ పేజీలో చేర్చాలి. ఆ వ్యాసపు పేరుని క్రింది పట్టికలో లింకుగా పేర్కొనాలి.

ఈ వ్యాసాలు ప్రదర్శనకు ముందు కొంత మెరుగు పరచవలసిన అవుసరం ఉందని గమనించగలరు. పరిచయం, అక్షర దోషాలు, అంతర్వికీ లింకులు, కాపీ హక్కులు, తటస్థత వంటి విషయాలను తప్పక పరిశీలించండి.

ఇవి కూడా చూడండి

సంవత్సరం వారీగా సాధారణ జాబితా, కంప్యూటర్ ద్వారా విశ్లేషణకు ఉపయోగం

వ్యాసాల చర్చాపేజీల వర్గాలు

ప్రదర్శిత సంవత్సరం వారీగా

ప్రదర్శిత వారం వారీగా

వ్యాస పరిచయపేజీలు

వ్యాస పరిగణనలు

ఇతరాలు