పిప్లాంట్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Piplantri
village
Piplantri is located in Rajasthan
Piplantri
Piplantri
Location in Rajasthan, India
Piplantri is located in India
Piplantri
Piplantri
Piplantri (India)
నిర్దేశాంకాలు: 25°06′40″N 73°47′20″E / 25.11111°N 73.78889°E / 25.11111; 73.78889Coordinates: 25°06′40″N 73°47′20″E / 25.11111°N 73.78889°E / 25.11111; 73.78889
Country India
StateRajasthan
DistrictRajsamand district
Languages
 • OfficialHindi
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
313324
ISO 3166 కోడ్RJ-IN
జాలస్థలిwww.piplantri.com

గుర్తించదగినది[మార్చు]

పిప్లాంట్రి గ్రామస్తులు ఒకఆడపిల్ల పుట్టిన ప్రతిసారీ 111 చెట్లనునాటతారు.ఈ చెట్లుమనుగడ సాగించేలా సమాజం నిర్ధారిస్తుంది.బాలికలు పెరిగేకొద్దీ ఈచెట్లు ఫలవంతమవుతాయి.భారతదేశంలో బాలికలపై భారీ లోటుఉంది.ఎందుకంటే సమాజంలో మగపిల్లలపై మక్కువ ఉంది.వరకట్న పద్ధతులవల్ల బాలికలను ఆర్థికభారంగా భావిస్తారు. సంవత్సరాలుగా,ఇక్కడి ప్రజలు గ్రామ పరిధిలోని బీడు మైదానాలలో 300,000 చెట్లను నాటగలిగారు-వీటిలో వేప, షీషామ్,మామిడి,ఆమ్లా మొదలగు చెట్లు ఉన్నాయి.

ఆర్థికభద్రతను నిర్ధారించడానికి, ఒక ఆడపిల్ల పుట్టిన తరువాత,గ్రామస్తులు సమిష్టిగా రూ.21 వేలు ఇచ్చి, తల్లిదండ్రులనుండి రూ.10,000 తీసుకొని బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలోఉంచుతారు.ఆమెకు 18 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే ఆడబ్బును ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంది. ఆడ పిల్లలకు సరైన విద్య లభిస్తుందని నిర్ధారించుకోవడానికి,గ్రామస్తులు,తల్లిదండ్రులను అఫిడవిట్ (లీగల్ కాంట్రాక్ట్) పై సంతకం చేయుంచుకునే పద్దతి ఉంటుంది.ఇది వివాహానికి చట్టబద్దమైన వయస్సు వచ్చేలోపు ఆమెను వివాహం చేసుకోకుండా పరిమితం చేస్తుంది.

మొదటగా శ్యామ్ సుందర్ పాలివాల్ మాజీ సర్పంచ్ (గ్రామ అధిపతి) కొన్నేళ్ల క్రితం మరణించిన తన కుమార్తె కిరణ్ జ్ఞాపకార్థం ఈ ప్రయత్నాన్ని ప్రారంభించాడు.[1]

2006 లో ప్రారంభమైన చొరవ పిప్లాంట్రి గ్రామాన్ని ఒయాసిస్‌గా మార్చింది.ఆడపిల్లల పుట్టుక ఇప్పుడు స్వాగతించబడింది.గ్రామ పరిధి వేప,మామిడి, ఆమ్లా,షీషమ్ చెట్లతోనిండి ఉంది.వాటివలన గ్రామంలో భూగర్భ నీటిమట్టం పెరగాటనికి,వన్యప్రాణుల సంరక్షణకు దారితీస్తుంది.[2]

ఈ చొరవ గ్రామ ఆర్థికవ్యవస్థ బలపడటానికి కూడా సహాయపడింది.చెట్ల నుండి చెదపురుగులను దూరంగా ఉంచడానికి,వీటిలో చాలా ఫలాలను కలిగి ఉంటాయి.గ్రామం వాటి చుట్టూ 2.5 మిలియన్లకు పైగా కలబంద మొక్కలను నాటారు.క్రమంగా,అలోవెరాను వివిధ రకాలుగా ప్రాసెస్ చేసి విక్రయించవచ్చని గ్రామస్తులు గ్రహించారు.ఆ ఆలోచనలతో గ్రామ సంఘం ఇప్పుడు కలబంద ఆధారిత రసం, జెల్ వంటి ఉత్పత్తులను ఉత్పత్తి చేసి,విక్రయిస్తుంది.[3]

మూలాలు[మార్చు]

  1. "Celebrating girl child: Here's what India can learn from a Rajasthani village, Piplantri". www.firstpost.com. Firstpost. Retrieved 26 March 2015.
  2. "Piplantri villagers plant 111 trees to celebrate a girl child's birth". ibnlive.in.com. Cable News Network LP, LLLP. A Time Warner Company. Archived from the original on 2015-03-27. Retrieved 26 March 2015.
  3. "Indian Village Plants Future for Young Girls". time.com. Time Inc. Retrieved 26 March 2015.

వెలుపలి లంకెలు[మార్చు]