Jump to content

వందన శివ

వికీపీడియా నుండి
వందన శివ
2014లో వందన శివ
జననం (1952-11-05) 1952 నవంబరు 5 (వయసు 72)
డెహ్రాడూన్, ఉత్తర ప్రదేశ్ (ప్రస్తుతం ఉత్తరాఖండ్ ), భారతదేశం
జాతీయతభారతీయులు
విద్యాసంస్థపంజాబ్ విశ్వవిద్యాలయం, చండీఘర్
గూఎల్ఫ్ విశ్వవిద్యాలయం
వెస్టర్న్ ఓంటారియో విశ్వవిద్యాలయం
వృత్తితత్వవేత్త, పర్యావరణ ఉద్యమకారిణి, రచయిత్రి, వక్త, సామాజిక ఉద్యమకారిణి
పురస్కారాలురైట్ లైవ్లీ హుడ్ పురస్కారం (1993)
సిడ్నీ పీస్ ప్రైజ్ (2010)
మిరోదీ పురస్కారం (2016)
ఫుకుయోకా ఆసియన్ కల్చర్ ప్రైజ్ (2012)
వీడియో ప్రకటన (2014)

వందన శివ (జననం 1952 నవంబరు 5) భారతీయ పండితురాలు, పర్యావరణ కార్యకర్త, ఆహార సార్వభౌమత్వ సమర్థకురాలు, ప్రపంచీకరణ వ్యతిరేకి, రచయిత్రి.[2] ఆమె ఇరవైకి పైగా పుస్తకాలను రచించింది.[3] ప్రపంచీకరణపై అంతర్జాతీయ సభలో (జెర్రీ మాండర్, రాల్ఫ్ నాడర్, జెరెమీ రిఫ్కిన్‌లు సహసభ్యులుగా గల ఇంటర్నేషనల్ ఫోరం ఆన్ గ్లోబలైజేషన్) ఒక నాయకురాలిగా ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి.[4] రాంచర్ ప్రైమ్ రాసిన వేద ఎకాలజీ పుస్తకం కొరకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక సాంప్రదాయ పద్ధతులకు అనుకూలంగా వాదించింది. 1993 లో సరియైన జీవనోపాధి (రైట్ లైవ్లీహుడ్) పురస్కారాన్ని అందుకుంది. ఈ అవార్డు స్వీడిష్-జర్మన్ పరోపకారి జాకోబ్ వాన్ యుక్స్‌కుల్ స్థాపించాడు. దీనిని "ప్రత్యామ్నాయ నోబెల్ బహుమతి"గా పరిగణిస్తారు.[5][6]

ప్రారంభ జీవితం, విద్య

[మార్చు]
2007[permanent dead link]లో జర్మనీలోని కొలోన్‌లో వందన శివ

వందన శివ డెహ్రాడూన్‌లో జన్మించింది. ఆమె తండ్రి అటవీ సంరక్షణకారుడు, తల్లి ప్రకృతి ప్రేమికురాలైన రైతు. ఆమె నైనిటాల్ లోని సెయింట్ మేరీస్ కాన్వెంట్ హై స్కూల్ లో, డెహ్రాడూన్ లోని "కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ"లో చదువుకుంది.[7]

శివ, చండీగఢ్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రం అభ్యసించింది. 1972లో బి.యస్సీ పట్టభద్రురాలైంది.[8]

భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో కొంతకాలం పనిచేసిన తరువాత, ఆమె 1977 లో గ్వెల్ఫ్ విశ్వవిద్యాలయంలో విజ్ఞానశాస్త్రంలో ఉన్నత విద్యకై కెనడా వెళ్లి అక్కడ "కాంతి ఆవర్తన భావనలో మార్పులు" అనే పేరుతో ఒక పరిశోధనా పత్రాన్ని రాసింది.[8][9] 1978 లో, వెస్ట్రన్ అంటారియో విశ్వవిద్యాలయంలో ఆమె భౌతిక తత్వశాస్త్రంపై దృష్టి సారించి, పి.హెచ్‌.డి పూర్తి చేసింది.[10] క్వాంటమ్ శాస్త్రంలో బెల్ సిద్ధాంతం యొక్క పరిధికి వెలుపల గణిత, తాత్విక అంతర్భావాలను ఆమె తన సిద్ధాంత వ్యాసంలో చర్చించింది.[11] తరువాత ఆమె బెంగళూరులోనిఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లోను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లోనూ శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ విధానాలపై వివిధ శాఖలతో కూడిన పరిశోధనలను కొనసాగించింది.[7]

కెరీర్ విశేషాలు

[మార్చు]

వందన శివ వ్యవసాయం, ఆహార రంగాలలో పురోగతి గురించి విస్తృతంగా రచనలు చేసింది, ఉపన్యాసాలిచ్చింది. మేధో సంపత్తి హక్కులు, జీవ వైవిధ్యం, జీవ సాంకేతికం, జీవ నీతి, జన్యు ఇంజనీరింగ్ వంటి రంగాలలో ఆమె పోరాటాలు చేసింది. జన్యు ఇంజనీరింగ్ ద్వారా వ్యవసాయ అభివృద్ధికి వ్యతిరేకంగా వివిధ దేశాలలోని హరిత ఉద్యమ సంస్థలకు ఆమె సహాయం చేసింది.

1982 లో, ఆమె రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఎకాలజీను జీవన వనరుల వైవిధ్యం, సమగ్రత కోసం, స్థానిక విత్తనం, సేంద్రీయ వ్యవసాయం, నిజాయితీ గల వాణిజ్యాన్ని ప్రోత్సహించటం కొరకు స్థాపించింది. ఈ సంస్థద్వారా పని 1991 లో నవధాన్య సంస్థను సృష్టించడానికి దారితీసింది.[12][13] వ్యవసాయానికి అవసరమైన విత్తనాలను అందించడానికి భారతదేశం అంతటా 40 కి పైగా ప్రాంతీయ విత్తన బ్యాంకులను స్థాపించింది. 2004 లో శివ యునైటెడ్ కింగ్‌డం లోని షూమేకర్ కాలేజీ సహకారంతో డూన్ వ్యాలీలో సుస్థిర జీవనం కోసం "బీజా విద్యాపీఠ్" అనబడే అంతర్జాతీయ కళాశాలను ప్రారంభించింది.[14]

మేధో సంపత్తి హక్కులు, జీవవైవిధ్య రంగంలో వేప, బాస్మతి, గోధుమల జీవ దొంగలింపుని సవాలు చేసింది. ఈ విషయమై ప్రభుత్వం నియమించిన నిపుణుల సమూహాలలో కలసి పనిచేసింది.

ఆమె మొదటి పుస్తకం, స్టేయింగ్ అలైవ్ (1988), మూడవ ప్రపంచ మహిళల అవగాహనలను మార్చడానికి సహాయపడింది. 1990 లో, "భారతదేశంలో ఎక్కువ మంది రైతులు మహిళలు(Most farmers in India are women)" అనే పేరుతో మహిళలు, వ్యవసాయంపై ఐక్యరాజ్య సమితి ఆహార,వ్యవసాయ సంస్థ (FAO) కోసం ఒక నివేదిక రాసింది. ఆమె ఖాట్మండులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మౌంటైన్ డెవలప్మెంట్ (ICIMOD) లో లింగ విభాగాన్ని (జెండర్ యూనిట్) స్థాపించింది. ఆమె మహిళా పర్యావరణ & అభివృద్ధి సంస్థ (WEDO) వ్యవస్థాపక బోర్డు సభ్యురాలు.[15][16]

భారతీయ సామాజిక-పర్యావరణ ఆందోళనలు, అంతరదృష్టికి సంబంధించి 2010 లో సిడ్నీ శాంతి బహుమతి పొందిన సందర్భంగా ఆమె చేసిన ఉపన్యాసం ఆధారంగా "మేకింగ్ పీస్ విత్ ది ఎర్త్" అనే పుస్తకాన్ని శివ ప్రచురించింది. ఈ పుస్తకం జీవవైవిధ్యం, సమాజాలు, ప్రకృతి మధ్య సంబంధాన్ని చర్చిస్తుంది.[17] ఈ పుస్తక సమీక్షలో డేవిడ్ రైట్ " సహజ జీవవైవిధ్యత నాశనాన్ని సాంప్రదాయ సముదాయాలను విచ్ఛిన్నంచేయడమని, అన్ని దేశాలలో 'స్థానికతకు' ఒక చిహ్నంగా, గ్రామం మారుతుంది". అని రాసాడు.[17][18]

ప్రపంచీకరణపై అంతర్జాతీయ సభ (ఇంటర్నేషనల్ ఫోరం ఆన్ గ్లోబలైజేషన్), మహిళల పర్యావరణం, అభివృద్ధి సంస్థ (ఉమెన్స్ ఎన్విరాన్మెంట్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్), మూడవ ప్రపంచ నెట్‌వర్క్ లాంటి సంస్థలతోపాటు ప్రపంచవ్యాప్తంగా, ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వేతర సంస్థలలో కూడా శివ సలహాదారుగా పనిచేసింది. ఇటలీలోని టుస్కానీ రీజియన్ ఏర్పాటు చేసిన ఆహార భవిష్యత్తుపై కమిషన్‌కు శివ అధ్యక్షత వహించింది. ఆమె స్పెయిన్ మాజీ ప్రధాని జపాటెరోకు సలహాలనిచ్చే విజ్ఞానమండలిలో సభ్యురాలుగా పనిచేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థకి వ్యతిరేకంగా భారత ప్రజల ఉద్యమ సారథ్య మండలిలో ఆమె సభ్యురాలు. ఆమె వరల్డ్ ఫ్యూచర్ కౌన్సిల్ కౌన్సిలర్ గా కూడా తన సేవలనందించింది. సేంద్రియ వ్యవసాయంపై భారత ప్రభుత్వ కమిటీలలో ఆమె పనిచేస్తుంది. ఆమె 2007 లో స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ విజన్స్ ప్రాజెక్టులో పాల్గొంది.[19]

2021లో, ఆమె శ్రీలంక ప్రభుత్వానికి అకర్బన ఎరువులు, పురుగుమందులను నిషేధించాలని సూచిస్తూ,[20][21] ఆమె ఇలా చెప్పింది: "ఈ నిర్ణయం ఖచ్చితంగా రైతులు మరింత సంపన్నులు కావడానికి సహాయపడుతుంది. సేంద్రీయ ఎరువుల వాడకం వలన భూమి సంతానోత్పత్తిని నిలుపుకుంటూ పోషకాలతో కూడిన వ్యవసాయ ఉత్పత్తులను అందించగలుగుతుంది."[22] దిగుమతి చేసుకున్న ఎరువులపై విదేశీ మారక ద్రవ్య బిల్లులను ఆదా చేయడమే ప్రధాన ఉద్దేశంగా[23] రాత్రికి రాత్రే ఆ విధానాన్ని అమలు చేయడంంతో, అనేక రంగాలలో వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా తగ్గి సంక్షోభం ఏర్పడింది. ముఖ్యంగా తేయాకు పరిశ్రమ బాగా దెబ్బతింది.[24][25][26] వరి దిగుబడులు మూడో వంతు తగ్గాయి.[22] ఏడు నెలల తర్వాత ప్రభుత్వం ఈ నిషేధాన్ని రద్దు చేసింది.[21]

క్రియాశీలత్వం

[మార్చు]

ఉత్పాదకత, పోషణ, రైతు ఆదాయాలు పెంచడానికి వ్యవసాయంలో జీవవైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి ఆమె కృషి చేసింది. ఈ కృషికి గాను ఆమెను 2003 లో టైమ్ పత్రిక పర్యావరణ వీరవనిత ('ఎన్విరాన్మెంటల్ హీరో') గా గుర్తించింది.[27] 1984 లో పంజాబ్‌లో హింస, యూనియన్ కార్బైడ్ పురుగుమందుల తయారీ కర్మాగారం నుండి గ్యాస్ లీక్ కావడం వల్ల జరిగిన భోపాల్ విపత్తు లపై ఆమె ఉద్యమించింది. తరువాత ఆమె ఉద్యమం వ్యవసాయ రంగంలో ప్రారంభమైంది. యుఎన్ విశ్వవిద్యాలయం కోసం ఆమె చేసిన అధ్యయనాలు ది వయొలెన్స్ ఆఫ్ ది గ్రీన్ రివల్యూషన్ పుస్తకాన్ని ప్రచురించడానికి దారితీశాయి.[28][29]

హరిత విప్లవం కొరకు విత్తనాలు, రసాయనల బంధం సారవంతమైన మట్టిని క్షీణింపజేసి, జీవన పర్యావరణ వ్యవస్థలను నాశనం చేసిందని, 1400 కి పైగా పురుగుమందులు ఆహార వ్యవస్థలోకి ప్రవేశించే అవకాశం ఏర్పడిందని డేవిడ్ బార్సామియన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వాదించింది.[30][31]

విత్తన స్వేచ్ఛ

[మార్చు]

విత్తన స్వేచ్ఛ లేదా విత్తనాలపై వ్యాపారసంస్థల మేధోసంపత్తి హక్కులను (పేటెంట్లు) తిరస్కరించడం అనే ఆలోచనకు ఆమె మద్దతునిచ్చింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) 1994 వ్యాపార సంబంధిత మేధో సంపత్తి హక్కుల (TRIPS) ఒప్పందం అమలుకు వ్యతిరేకంగా ఆమె ప్రచారం చేసింది. ఈ ఒప్పందం కొత్త జీవ రూపాలపై పేటెంట్ల పరిధిని విస్తృతం చేస్తుంది. ఈ ఒప్పందం వ్యాపార సంస్థలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని, కొత్త జీవ రూపాలపై మరింత పేటెంట్లకు తలుపులు తెరిచిందని ఆమె విమర్శించింది.[32] ఆమె జీవ పేటెంట్‌ను జీవ దొంగలింపు ('బయోపైరసీ') అని పిలిచింది. బాస్మతి వంటి అనేక దేశీయ మొక్కల పేటెంట్లకు వ్యతిరేకంగా పోరాడింది.[33] ఆమె అమెరికా వ్యవసాయ శాఖ, డబ్ల్యూ.ఆర్.గ్రేస్ సంస్థ చేత వేప బయో పైరసీకి వ్యతిరేకంగా యూరోపియన్ పేటెంట్ కార్యాలయంలో 10 సంవత్సరాల పోరాటంలో గెలిచింది.[34] 1998 లో, ఆమె సంస్థ నవధాన్య, అమెరికాకు చెందిన రైస్‌టెక్ సంస్థ చే బాస్మతి బియ్యం బయోపైరసీకి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించింది. 2001 లో, తీవ్ర ప్రచారం తరువాత, పేటెంట్‌పై తన దావాలను రైస్‌టెక్ కోల్పోయింది.

గోల్డెన్ రైస్

[మార్చు]

విటమిన్ ఎ పూర్వగామి అయిన బీటా కెరోటిన్‌ను తయారుచేసే జన్యుపరంగా రూపొందించిన బియ్యం జాతి గోల్డెన్ రైస్‌ను ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలో చేరే వయస్సు కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో మూడవ వంతు పిల్లలు అనుభవిస్తున్న విటమిన్ ఎ లోపాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.[35] విటమిన్ ఎ లోపం అంధత్వానికి గొప్ప కారణమని, ప్రపంచ పాఠశాలలో చేరేవయస్సుకంటె తక్కువ వయస్సుగల పిల్లలమరణాలలో 28% మరణాలకు కారణమని, గోల్డెన్‌ రైస్ ఇతర బియ్యం వలె చౌకగా ఉంటుందని, దీనివలన పిల్లలలో అంధత్వాన్ని నిర్మూలించవచ్చని అడ్రియన్ డుబాక్ చెప్పాడు.[36] దీనికి బదులుగా అదే ఫలితాల కోసం బెంగాల్ లో మహిళలు 150 ఆకుకూరలు పెంచి తింటారని శివ పేర్కొంది.[37] అయితే పర్యావరణ సలహాదారు పాట్రిక్ మూర్ ఈ 250 మిలియన్ల మంది పిల్లలలో ఎక్కువ మంది రోజుకు ఒక గిన్నె బియ్యం మాత్రమే తింటారని అన్నాడు[38]
ఆమె "గోల్డెన్ రైస్ బూటకము" అని పిలుపునిచ్చింది. ఆ వివరణలో ఆమె గోల్డెన్ రైస్ ప్రయోజనకరమైన దానికంటే ఎక్కువ హానికరం అని పేర్కొంది: "దురదృష్టవశాత్తు, విటమిన్ ఎ బియ్యం ఒక బూటకపుది, జన్యు ఇంజనీరింగ్‌కు మరింత వివాదం తెస్తుంది. పరీక్షించని, నిరూపించబడని, అనవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడంలో విజ్ఞానానికి బదులు ప్రజాసంబంధాల కార్యాచరణ ఉంది. దీనివలన ఆకలి, పోషకాహార లోపం నిర్మూలించడానికి కాక పెంచడానికిఈ పద్ధతి ఉపయోగపడుతుంది. " [39] వెస్లెర్, మ్యూనిచ్ విశ్వవిద్యాలయం, జిల్బెర్మాన్ బర్కిలీ విశ్వవిద్యాలయం అనే ఇద్దరు ఆర్థికవేత్తలు భారతదేశంలో గోల్డెన్ రైస్ లేకపోవడం వలన గత 10 సంవత్సరాలలో 14 లక్షల మానవ సంవత్సరాలకు పైగా నష్టం జరిగిందని 2013 నివేదికలో లెక్కించారు.[40]

జన్యుమార్పిడి విత్తనాల వలన భారతదేశంలో ఆత్మహత్యలు

[మార్చు]

"భారతదేశంలో జన్యుమార్పిడి విత్తనాలు(Genetically modified or GM) ధరలు పెరగడం వల్ల చాలా మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు" అని శివ అన్నది. విత్తన గుత్తాధిపత్యాల సృష్టి, ప్రత్యామ్నాయాల నాశనం, హక్కులకు అధిక కప్పం (Royalty), ఏకవర్ణ సంస్కృతుల వలన పెరుగుతున్న దుర్బలత్వాలు రైతుల అప్పులు, ఆత్మహత్యలు, వ్యవసాయ బాధలకు కారణాలవుతున్నాయి. భారత ప్రభుత్వం నుండి వచ్చిన సమాచారం ప్రకారం, ఉత్పాదకాల కొనుగోలు కారణంగా దాదాపు 75 శాతం గ్రామీణ ప్రాంతాలలో అప్పులకు కారణమవుతున్నారు. జన్యు మార్పిడి సంస్థల లాభాలు పెరిగేకొద్దీ రైతుల అప్పు పెరుగుతుందని శివ పేర్కొంది. అలా జన్యుమార్పిడి విత్తనాలు రైతుల ఆత్మహత్యకు కారణభూతమవుతాయి.

అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (IFPRI)) రెండుసార్లు పరిశోధనలను, ప్రభుత్వ డేటాను విశ్లేషించి రైతు ఆత్మహత్యలు పెరగడానకి ఎటువంటి ఆధారాలు లేవని తేల్చింది.[41][42] దీనికి బదులుగా, విశ్లేషణ జన్యుమార్పిడి ప్రత్తికి మాత్రమే పరిమితమై, విత్తన గుత్తాధిపత్యాల సమస్యను విస్మరించారని, ఆత్మహత్య గణాంకాలు నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డుల ప్రభుత్వ గణాంకాల నుండి తీసుకున్నందున, నిజమైన గణాంకాలు వాడలేదని తెలిపింది.[43]

భారతీయ వ్యవసాయం నవీన సరళీకరణను సవాలు చేయడం ద్వారా, శివ మోన్సాంటో, కార్గిల్ వంటి బహుళజాతి సంస్థలను వ్యతిరేకించింది. ఆమె రాసిన పుస్తకం "కార్గిల్ అండ్ ద కార్పొరేట్ హైజాక్ అఫ్ ఇండియాస్ ఫుడ్ అగ్రికల్చర్"లో ఆమె అమెరికా, భారత ప్రభుత్వాల చర్యలను పరిశీలించారు. విధాన మార్పుల ఫలితంగా రెండవ అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారు స్థితిగలిగి, భారతదేశ ఆహార అవసరాలను తీర్చగల భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద గోధుమ దిగుమతిదారుగా మార్చడానికి దారితీసిందని తెలిపారు.

ప్రభుత్వ, పరిశ్రమలలో ఆహార-విధాన వికేంద్రీకరణ పద్ధతులను కూడా ఆమె వివరించింది. భారతీయ రైతులు భారీగా బయో టెక్నాలజీలను అవలంబించిన చోట ఆహార భద్రత, పోషక అవసరాలను సాధించకుండా ఆహార విధాన కేంద్రీకరణ పెద్ద బహుళజాతి సంస్థలకు అసమానంగా ప్రయోజనం చేకూర్చిందని చెప్పారు. ప్రపంచీకరణతో, వ్యవసాయ యోగ్యమైన భూమి ఆహారేతర పంటలకు వాడబడుతున్నది; అలా లాభాలుండే మార్కెట్లకు ఎగుమతి జరిగి, ఆహారం దిగుమతి చేసుకోవలసివస్తున్నది.[44]

ప్రచురణలు

[మార్చు]
  • 1981, సోషల్ ఎకనామిక్ అండ్ సోషల్ ఫారెస్ట్రీ ఎకలాజికల్ ఇంపాక్ట్ ఇన్ కోలార్, వందన శివ, HC శరత్చంద్ర, J. బయోపధ్యాయ్, మేనేజ్మెంట్ బెంగుళూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్
  • 1986, చిప్కో : అటవీ సంక్షోభానికి భారతదేశ నాగరిక ప్రతిస్పందన, జె. బందోపాధ్యాయ, వందన శివ, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్. పబ్. INTACH ద్వారా
  • 1987, ది చిప్కో మూవ్మెంట్ ఎగైనెస్ట్ లైమ్స్టోన్ క్వారీయింగ్ ఇన్ డూన్ వ్యాలీ, జె. బందోపాధ్యాయ, వందన శివ, లోకాయన్ బులెటిన్, 5: 3, 1987, పేజీలు.   19–25 ఆన్‌లైన్ Archived 2016-04-18 at the Wayback Machine
  • 1988, స్టేయింగ్ అలైవ్: ఉమెన్, ఎకాలజీ అండ్ సర్వైవల్ ఇన్ ఇండియా, జెడ్ ప్రెస్, న్యూఢిల్లీ,
  • 1989, ది హింస ఆఫ్ ది గ్రీన్ రివల్యూషన్ : పంజాబ్‌లో పర్యావరణ క్షీణత, రాజకీయ సంఘర్షణ, నటరాజ్ పబ్లిషర్స్, న్యూఢిల్లీ, హెచ్‌బి, పిబి
  • 1991, ఎకాలజీ అండ్ ది పాలిటిక్స్ ఆఫ్ సర్వైవల్: కాన్ఫ్లిక్ట్స్ ఓవర్ నేచురల్ రిసోర్సెస్ ఇన్ ఇండియా, సేజ్ పబ్లికేషన్స్, థౌజండ్ ఓక్స్, కాలిఫోర్నియా,
  • 1992, బయోడైవర్శిటీ: సోషల్ అండ్ ఎకోలాజికల్ పెర్స్పెక్టివ్స్ (ఎడిటర్); జెడ్ ప్రెస్, యునైటెడ్ కింగ్‌డమ్
  • 1993, ఉమెన్, ఎకాలజీ అండ్ హెల్త్: రీబిల్డింగ్ కనెక్షన్లు (ఎడిటర్), డాగ్ హమ్మర్స్క్‌జోల్డ్ ఫౌండేషన్ అండ్ కాళి ఫర్ ఉమెన్, న్యూఢిల్లీ
  • 1993, మోనోకల్చర్స్ ఆఫ్ ది మైండ్: బయోడైవర్శిటీ, బయోటెక్నాలజీ అండ్ అగ్రికల్చర్, జెడ్ ప్రెస్, న్యూఢిల్లీ
  • 1993, ఎకోఫెమినిజం, మరియా మిస్, వందన శివ, ఫెర్న్‌వుడ్ పబ్లికేషన్స్, హాలిఫాక్స్, నోవా స్కోటియా, కెనడా,
  • 1994, క్లోజ్ టు హోమ్: ఉమెన్ రీకనెక్ట్ ఎకాలజీ, హెల్త్ అండ్ డెవలప్‌మెంట్ వరల్డ్‌వైడ్, ఎర్త్‌స్కాన్, లండన్,
  • 1995, బయోపాలిటిక్స్ (ఇంగున్ మోసర్‌తో), జెడ్ బుక్స్, యునైటెడ్ కింగ్‌డమ్
  • 1997, బయోపిరసీ: ది ప్లండర్ ఆఫ్ నేచర్ అండ్ నాలెడ్జ్, సౌత్ ఎండ్ ప్రెస్, కేంబ్రిడ్జ్ మసాచుసెట్స్, I.
  • 2000, స్టోలెన్ హార్వెస్ట్: ది హైజాకింగ్ ఆఫ్ ది గ్లోబల్ ఫుడ్ సప్లై, సౌత్ ఎండ్ ప్రెస్, కేంబ్రిడ్జ్ మసాచుసెట్స్,
  • 2000, టుమారోస్ బయోడైవర్శిటీ, థేమ్స్ అండ్ హడ్సన్, లండన్,
  • 2001, పేటెంట్లు, మిత్స్ అండ్ రియాలిటీ, పెంగ్విన్ ఇండియా
  • 2002, వాటర్ వార్స్; ప్రైవేటీకరణ, కాలుష్యం, లాభం, సౌత్ ఎండ్ ప్రెస్, కేంబ్రిడ్జ్ మసాచుసెట్స్
  • 2005, ఇండియా డివైడెడ్, సెవెన్ స్టోరీస్ ప్రెస్,
  • 2005, గ్లోబలైజేషన్స్ న్యూ వార్స్: సీడ్, వాటర్ అండ్ లైఫ్ ఫారమ్స్, ఉమెన్ అన్‌లిమిటెడ్, న్యూఢిల్లీ,
  • 2005, ఎర్త్ డెమోక్రసీ; జస్టిస్, సస్టైనబిలిటీ అండ్ పీస్, సౌత్ ఎండ్ ప్రెస్,
  • 2007, మానిఫెస్టోస్ ఆన్ ది ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ అండ్ సీడ్, ఎడిటర్, సౌత్ ఎండ్ ప్రెస్
  • 2007, డెమోక్రటైజింగ్ బయాలజీ: రీఇన్వెంటింగ్ బయాలజీ ఫ్రమ్ ఎ ఫెమినిస్ట్, ఎకోలాజికల్ అండ్ థర్డ్ వరల్డ్ పెర్స్పెక్టివ్, రచయిత, పారాడిగ్మ్ పబ్లిషర్స్
  • 2007, కార్గిల్ అండ్ ది కార్పొరేట్ హైజాక్ ఆఫ్ ఇండియాస్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్, నవదన్య / RFSTE, న్యూఢిల్లీ
  • 2008, సాయిల్ నాట్ ఆయిల్, సౌత్ ఎండ్ ప్రెస్
  • 2010, స్టేయింగ్ అలైవ్, సౌత్ ఎండ్ ప్రెస్
  • 2011, బయోపిరసీ: ది ప్లండర్ ఆఫ్ నేచర్ & నాలెడ్జ్, నటరాజ్ పబ్లిషర్స్,
  • 2011, మోనోకల్చర్స్ ఆఫ్ ది మైండ్: పెర్స్పెక్టివ్స్ ఆన్ బయోడైవర్శిటీ, నటరాజ్ పబ్లిషర్స్,
  • 2013, మేకింగ్ పీస్ విత్ ది ఎర్త్ ప్లూటో ప్రెస్
  • 2019, Vandana Shiva (2019). "Foreword". In Extinction Rebellion (ed.). This Is Not a Drill: An Extinction Rebellion Handbook. Penguin Books. pp. 5–8. ISBN 9780141991443.

మూలాలు

[మార్చు]
  1. "Sustaining Life". Saving Species. 23 December 2011. BBC Radio 4. http://www.bbc.co.uk/programmes/b018ft1c. Retrieved 18 January 2014. 
  2. Who's Who of Women and the Environment – Vandana Shiva. United Nations Environment Programme (UNEP). Last visited 2012.
  3. "Vandana Shiva's Publications". Archived from the original on 2020-05-04. Retrieved 24 February 2011.
  4. Chattergee, D.K. (2011). Encyclopedia of Global Justice, A-I Vol. 1. ISBN 9781402091599. Retrieved 22 October 2014.
  5. "2019 Right Livelihood Award Laureates Announced". The Right Livelihood Award (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 13 మార్చి 2020. Retrieved 4 March 2020.
  6. Kim, Allen. "Greta Thunberg wins 'alternative Nobel' for environmental work". CNN. Retrieved 4 March 2020.
  7. 7.0 7.1 Joy Palmer, David Cooper, Peter Blaze Corcoran: Fifty Key Thinkers on the Environment. Routledge, 2002, ISBN 9781134756247, p. 313
  8. 8.0 8.1 Benjamin F. Shearer, Barbara S. Shearer: Notable Women in the Physical Sciences: A Biographical Dictionary. Greenwood Press, 1997, p. 364
  9. Vandana Shiva (1977). Changes in the concept of periodicity of light (M.A. Thesis (microfiche)). Canadian Theses Division, National Library, Ottawa. Archived from the original on 2020-03-21. Retrieved 22 September 2012.
  10. "Vandana Shiva's Crusade Against Genetically Modified Crops - The New Yorker". 25 August 2014. Retrieved 20 January 2015.
  11. "Hidden variables and locality in quantum theory / by Vandana Shiva". 18 July 2008. Retrieved 22 September 2012.[permanent dead link]
  12. "Navdanya Indian agricultural project". Encyclopædia Britannica. Retrieved 29 October 2015.
  13. "ఆహార, జ్ఞాన స్వరాజ్యాన్ని నిర్మిద్దాం". ఆంధ్రజ్యోతి. 2014-08-08. Archived from the original on 2021-03-03. Retrieved 2021-03-03.
  14. "Vandana Shiva". Schumacher College (in ఇంగ్లీష్). 25 July 2014. Archived from the original on 13 ఏప్రిల్ 2019. Retrieved 10 April 2018.
  15. "About Dr Vandana Shiva - University of Portsmouth". Archived from the original on 2019-05-25. Retrieved 2020-04-01.
  16. "BIOGRAPHY of Vandana Shiva" (PDF). Archived from the original (PDF) on 2018-06-29. Retrieved 2020-04-01.
  17. 17.0 17.1 Wright, David (December 2014). "Making Peace With the Earth". Australian Journal of Environmental Education. 30 (2): 274–275. doi:10.1017/aee.2015.4.
  18. Shiva, Vandana (2014). Making Peace with the Earth: Beyond Resource, Land and Food Wars. North Melbourne: Spinifex Press. pp. 274–275. ISBN 9781742198385.
  19. "Vandana Shiva: Environmental Activist". Manthan Samvaad. n.d. Archived from the original on 23 సెప్టెంబరు 2014. Retrieved 3 June 2014.
  20. "Sri Lanka's shift towards organic farming". Navdanya international (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-06-16. Retrieved 2021-09-05.
  21. 21.0 21.1 Verma, Monica (11 April 2022). "How Environmental Wokeness Cost Sri Lanka Its Food Security". News18 (in ఇంగ్లీష్). Retrieved 25 May 2022.
  22. 22.0 22.1 Ravi Shanker, Kapoor (9 April 2022). "Sri Lankan crisis: When green fanatics get taken seriously". The Sunday Guardian Live. Retrieved 25 May 2022.
  23. "Is organic farming responsible for Sri Lanka's economic crisis?" (in అమెరికన్ ఇంగ్లీష్). Down To Earth. 2022-04-15. Retrieved 2022-04-15.
  24. "Organic food revolution in Sri Lanka threatens its tea industry". Aljazeera (in ఇంగ్లీష్). Agence France-Presse. September 1, 2021. Retrieved 2021-09-05.
  25. "Sri Lanka Going Organic: Rethink the strategy; Agriculturists Write to President" (in అమెరికన్ ఇంగ్లీష్). The Sri Lankan Scientist. 2021-06-08. Retrieved 2021-09-05.
  26. Perumal, Prashanth (6 September 2021). "Explained - What caused the Sri Lankan economic crisis?". The Hindu. Retrieved 6 September 2021.
  27. "Dr. Vandana Shiva". EcoWatch. 2011-11-29.
  28. Fight Droughts with Science: Better crops could ease India's monsoon worries, HENRY I. MILLER, Stanford University's Hoover Institution, The Wall Street Journal, 12 August 2009.
  29. "The Father Of The 'Green Revolution'". University of Minnesota. 25 February 2008.
  30. "India Together: Monocultures of the mind: Write the editors - 01 April 2003". Indiatogether.org. Retrieved 20 January 2015.
  31. "To Spray or Not to Spray: Pesticides, Banana Exports, and Food Safety". Elibrary.worldbank.org\accessdate=20 January 2015.
  32. "Interview with Vandana Shiva - The Role of Patents in the Rise of Globalization / Global Eyes / In Motion Magazine". Inmotionmagazine.com.
  33. Schell, Eileen (January 2012). The Megarhetorics of Global Development. University of Pittsburgh Press. p. 170. ISBN 9780822961727. Archived from the original on 2015-09-17. Retrieved 2020-04-01.
  34. "BBC NEWS - Science/Nature - India wins landmark patent battle". News.bbc.co.uk. 9 March 2005. Retrieved 20 January 2015.
  35. "Global prevalence of vitamin A deficiency in populations at risk 1995–2005 - WHO Global Database on Vitamin A Deficiency" (PDF). Geneva: World Health Organization. 2009. Retrieved 2021-03-03.
  36. Adrian Dubock (2013-11-04). "No, Zac Goldsmith, golden rice is not 'evil GM'. It saves people's lives". The Guardian..
  37. "Can Biotechnology Help Fight World Hunger?, CONGRESSIONAL HUNGER CENTER BIOTECH BRIEFING". Washington D.C. 2012.
  38. "By opposing Golden Rice, Greenpeace defies its own values – and harms children". The Globe and Mail. 2013-10-15.
  39. "THE "GOLDEN RICE" HOAX -When Public Relations replaces Science". Online.sfsu.edu. 29 June 2000. Retrieved 26 August 2013.
  40. Wesseler, J.; Zilberman, D. (2014). "The economic power of the Golden Rice opposition". Environment and Development Economics. 19 (1): 1. doi:10.1017/S1355770X1300065X.
  41. "Bt Cotton and farmer suicides in India: Reviewing the evidence". International Food Policy Research Institute (IFPRI). 2008. |Abstract, page 27 and Figure 11.
  42. Jon Entine; Cami Ryan (29 January 2014). "Vandana Shiva, Anti-GMO Celebrity: 'Eco Goddess' Or Dangerous Fabulist?". Forbes.
  43. "Seed Monopolies, GMOs And Farmers Suicides In India By Dr Vandana Shiva". Countercurrents.org. Retrieved 20 January 2015.
  44. Vandana, Shiva (2007). Cargill and the Corporate Hijack of Indias Food & Agriculture. New Delhi: Navdanya/RFSTE.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వందన_శివ&oldid=4357937" నుండి వెలికితీశారు