చర్చ:వందన శివ
Appearance
వందన శివ పేజీని 2020 ఏప్రిల్ వ్యాసాల అభివృద్ధి ఉద్యమం లో భాగంగా విస్తరించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
రాసిన పుస్తకాల జాబితాను తొలగించడంపై అభిప్రాయం
[మార్చు]ఈ దిద్దుబాటులో అర్జున గారు, వందనా శివ గారు రాసిన పుస్తకాల వివరాలను తొలగించారు. ప్రచురణల వివరాలంటే.., ఆమె చేసిన కృషిని వివరించేవి. రాసిన పుస్తకాలు ఫలానా అని కూడా చూపించకపోవడమంటే, ఆ వ్యక్తి చేసిన కృషిని చెప్పకపోవడమే అవుతుంది. అది సరికాదు. ఆ జాబితాను ఉంచాలి. (తొలగింపుకు చూపిన కారణం - "ఆంగ్ల ప్రచురణలు కావున తెవికీ చదువరలకు ఉపయోగం తక్కువ, ఆసక్తిగలవారు ఆంగ్ల వికీవ్యాసంలో మరింత సలభంగా తెలుసుకోగలుగుతారు" - ఆశ్చర్యం కలిగించింది.) __చదువరి (చర్చ • రచనలు) 07:53, 1 మార్చి 2021 (UTC)
- చదువరి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. వ్యాసంలోని ప్రవేశికలోనే ఆమె వ్రాసిన పుస్తకాల లింకు వుంది. ఆ లింకు పనిచేయకపోతే నేను ఆర్కైవ్ తో ఈ రోజు సవరించాను. మీరు వ్యాసం పరిశీలినగా చూస్తే ప్రచురణలు విభాగం గూగుల్ ట్రాన్స్లేట్ అనువాదానికి నకలు అని తెలుస్తుంది. (గూగుల్ ట్రాన్స్లేట్ లింకు) . దీనిలో ఆంగ్ల పుస్తక వివరాలను తెలుగు లిపిలో రాశారు. ఆంగ్ల పాఠ్యాన్ని తెలుగు లిపిలో చదవడం కంటే ఆంగ్ల పాఠ్యాన్ని ఆంగ్ల లిపిలో చదవడం సులభమని మీకు తెలియనిది కాదు. ఈ ఆంగ్లభాషవివరాలు ఆంగ్ల లిపిలో అలానే వుంచితే తెలుగు వికీలో ఎక్కువ ఆంగ్ల లిపి అని తొలగించుతాము కదా. తెలుగు లిపిలో వున్నాయని వుంచడం ఏమాత్ర ఉపయోగమో నాకు అర్ధం కావడంలేదు. అనువాద వ్యాసాలు తెలుగు పాఠకుల దృక్కోణంలో చూస్తే ఏ భాగాలు ఉపయోగం, ఏ భాగాలు ఉపయోగం కాదో అర్ధమవుతుంది. ఉపయోగం లేని భాగాలు తొలగించటం లేక కుదించడం చేయడం మంచిది. కావున విభాగం వుండాలి అని మీరు భావిస్తే బాగా పేరుపొందిన రెండు మూడు పుస్తకాలు చేర్చండి. --అర్జున (చర్చ) 00:42, 3 మార్చి 2021 (UTC)
- వాడుకరి:K.Venkataramana గారు, వ్యాసం తొలిగా అనువాదంచేసిన వారిగా, మీ అభిప్రాయం తెలియచేయండి. --అర్జున (చర్చ) 01:03, 3 మార్చి 2021 (UTC)
- అర్జున గారూ ఆమె చేసిన కృషిని వివరించే పుస్తకాల జాబితాను ఉంచాలి. అవి ఆమె రాసిన ఆంగ్ల పుస్తకాల జాబితాను తెలుగు లిపిలో రాయవచ్చని నా అభిప్రాయం. ఉదాహరణకు ఆంగ్ల వికీపీడియాలో రామభద్రాచార్య వ్యాసంలో అతను రాసిన సంస్కృత శ్లోకాలను చేర్చుతూ, వాటి లిపిని ఆంగ్లంలో రాసారు చూడండి. తరువాత దాని అనువాదాన్ని ఆంగ్లంలో చేర్చారు. కనుక ఆమె రాసిన ఆంగ్ల పుస్తకాల జాబితాను తెలుగు లిపిలో రాయడంతో ఆమె కృషికి గుర్తింపునిచ్చినవారమౌతామని నా అభిప్రాయం.-- K.Venkataramana -- ☎ 15:28, 3 మార్చి 2021 (UTC)
- User:K.Venkataramana గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. మీ స్పందనలో నేను తెలిపిన వాదనపై అభ్యంతరాలు తెలియచేస్తే బాగుండేది. మీ వాదనలో వాడిన ఉదాహరణ వ్యాసం ప్రకారం చూస్తే ఇతర భాషలో సమాచారం, దానికి ఆంగ్లలిప్యంతరీకరణ, దానికి ఆంగ్లంలో అర్ధం రాశారు. మీరు అలాగే, ఈ వ్యాసంలో ఆంగ్ల లిపి మూలం, తెలుగు లిప్యంతరీకరణం, తెలుగులో ఆ పుస్తకం గురించిన కనీసం మూడు వాక్యాల సారాంశం రాయండి. అలా చేస్తే నాకేమి అభ్యంతరము లేదు.--అర్జున (చర్చ) 04:08, 5 మార్చి 2021 (UTC)
- అర్జున గారూ ఆమె చేసిన కృషిని వివరించే పుస్తకాల జాబితాను ఉంచాలి. అవి ఆమె రాసిన ఆంగ్ల పుస్తకాల జాబితాను తెలుగు లిపిలో రాయవచ్చని నా అభిప్రాయం. ఉదాహరణకు ఆంగ్ల వికీపీడియాలో రామభద్రాచార్య వ్యాసంలో అతను రాసిన సంస్కృత శ్లోకాలను చేర్చుతూ, వాటి లిపిని ఆంగ్లంలో రాసారు చూడండి. తరువాత దాని అనువాదాన్ని ఆంగ్లంలో చేర్చారు. కనుక ఆమె రాసిన ఆంగ్ల పుస్తకాల జాబితాను తెలుగు లిపిలో రాయడంతో ఆమె కృషికి గుర్తింపునిచ్చినవారమౌతామని నా అభిప్రాయం.-- K.Venkataramana -- ☎ 15:28, 3 మార్చి 2021 (UTC)
ఆంగ్ల వికీ వ్యాసం లో అదనపు సమాచారం
[మార్చు]ఆంగ్ల వికీ వ్యాసం లో ఇంకా అనువదించవలసిన అదనపు సమాచారం వున్నది. --అర్జున (చర్చ) 06:57, 3 మార్చి 2021 (UTC)