Jump to content

సుస్థిర జీవనం

వికీపీడియా నుండి

సుస్థిర జీవనం ఒక జీవనశైలికి నిర్వచనం.[1] ఈ జీవన విధానంలో భూమిలో దొరికే సహజ వనరులను, ఒక వ్యక్తికి సంబంధించిన వనరులను ఆ వ్యక్తి లేదా సమాజం తక్కువలో తక్కువ ఉపయోగించాలి. ఈ విధానాన్ని తరచుగా భూమితో మమేకమై బ్రతకడం అనీ, లేదా సున్నా ప్రభావ జీవితం అని పిలుస్తారు. రవాణా, శక్తి వినియోగం, ఆహారం పద్ధతులను మార్చడం ద్వారా ఈ జీవన విధానాన్ని పాటించే వారు తరచూ వారి పర్యావరణ పాదముద్రను (వారి కార్బన్ పాదముద్రతో సహా) తగ్గించడానికి ప్రయత్నిస్తారు. [2] ఈ విధానాన్ని పాటించేవారు తమ జీవితాలను సుస్థిరతకు అనుగుణంగా, సహజంగా సమతుల్యతతో, భూమి యొక్క సహజ పర్యావరణంతో మానవాళి యొక్క సహజీవన సంబంధాన్ని గౌరవించే విధంగా మసలాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. [3] పర్యావరణ జీవనాన్ని పాటించడం, సాధారణ తత్వశాస్త్ర స్థిరమైన అభివృద్ధి మొత్తం సూత్రాలను దగ్గరగా అనుసరిస్తాయి. [4]

ప్రముఖ పర్యావరణవేత్త, వరల్డ్ వాచ్ ఇన్స్టిట్యూట్, ఎర్త్ పాలసీ ఇన్స్టిట్యూట్ సంస్థల వ్యవస్థాపకుడు లెస్టర్ ఆర్. బ్రౌన్, ఇరవైఒకటవ శతాబ్దంలో సుస్థిరమైన జీవనాన్ని "వైవిధ్యభరితమైన రవాణా వ్యవస్థ కలిగిన పునరుత్పాదక ఇంధన ఆధారిత, పునర్వినియోగం రీసైకిల్ ముఖ్యంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు మారడం" అని వర్ణించారు. ప్రఖ్యాత అమెరికన్ రచయిత, పర్యావరణవేత్త, యథాతథ పర్యావరణవాద ప్రముఖ విమర్శకుడు డెరిక్ జెన్సన్ (" పర్యావరణ ఉద్యమ కవి-తత్వవేత్త") " పారిశ్రామిక నాగరికత సుస్థిరం కాదు, ఎప్పటికీ సుస్థిరం కాలేదు" అని వాదించారు. ఈ వాదన వలన వచ్చే సహజమైన తీర్మానం ఏమిటంటే, సుస్థిరమైన జీవనం, పారిశ్రామికీకరణ పరస్పర విభేదాలు అని. అందువల్ల, ఈ సుస్థిర జీవన నియమాలను పాటించాలనుకునేవారు పారిశ్రామిక పునాదిపై నిలుచున్న నేటి సమాజంలో జీవిస్తూ, ప్రత్యామ్నాయ నిబంధనలతో, సాంకేతికాలతో, నడవడికలతో పలు సవాళ్ళతో కూడిన విపరీత ధోరణిలో బ్రతుకుతారు.

లివింగ్ విలేజెస్ లాంటి వాస్తవిక ప్రకృతి గ్రామాలను నెలకొల్పిన బిల్డర్ల ప్రకారం, ప్రత్యామ్నాయ సాంకేతిక పరిజ్ఞానాలకు మారడం విజయవంతమవుతుందని, ఫలితంగా నిర్మించిన ఇలాంటి సహజ గ్రామాలు స్థానిక సంస్కృతికి ఆకర్షణీయంగా ఉంటే, ఆ సందర్భంలో కొన్ని తరాల పాటు అవసరమయ్యే విధంగా వీటిని నిర్వహించుకోవచ్చని. అలా జరిగితే ప్రతి ఒక్కరూ ఈ సుస్థిర జీవనాన్ని స్వీకరించి పాటించవచ్చని వారన్నారు.

నిర్వచనం

[మార్చు]
స్థిరత్వం యొక్క మూడు స్తంభాలు. [5]
సుస్థిరత్వాన్ని తెలిపే అంశాల వృత్తాలు (అంచనా - మెల్బోర్న్ 2011)

సుస్థిర జీవితం అనేది ప్రాథమికంగా జీవనశైలి ఎంపికలు, నిర్ణయాలతో ముడిపడి ఉంతుంది. ప్రకృతిని, ప్రపంచం యొక్క సుస్థిరతను ఈ జీవితం కోరుకుంటుంది. భవిష్యత్ తరాల కోసం మన జీవనశైలితో రాజీ పడకుండా - ప్రస్తుత పర్యావరణ, సామాజిక, ఆర్థిక - ఈ మూడు అవసరాలను తీర్చడం ద్వారా స్థిరమైన జీవనానికి సంబంధించిన ఒక భావనగా అర్థం అవుతుంది. [6] మరొక విస్తృత భావనలో సుస్థిర జీవనం అంటే ఆర్థికశాస్త్రం, జీవావరణ శాస్త్రం, రాజకీయాలు, సంస్కృతి - ఈ నాలుగు అంశాలను కలుపుకొని స్థిరంగా జీవించడం. [7]

సుస్థిర రూపకల్పన, సుస్థిర అభివృద్ధి స్థిరమైన జీవనానికి కీలకమైన అంశాలు. సుస్థిర జీవన ప్రణాళిక తగిన సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధిని కలిగి ఉంటుంది, ఇది స్థిరమైన జీవన విధానాలకు ప్రధానమైనది. [8] మౌలిక సదుపాయాలలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడమే సుస్థిర అభివృద్ధి. ఈ పద్ధతికి కొన్ని ఉదాహరణలు: సుస్థిర భవననిర్మాణం, సుస్థిర వ్యవసాయం . [9]

చరిత్ర

[మార్చు]
  • 1954 హెలెన్, స్కాట్ నిరింగ్ రాసిన లివింగ్ ది గుడ్ లైఫ్ ప్రచురణ ఆధునిక స్థిరమైన జీవన ఉద్యమానికి నాంది పలికింది . ఈ ప్రచురణ 1960 దశకం చివరలో, 1970 దశకం ప్రారంభంలో " తిరిగి భూమికి(మరల సేద్యానికి) ఉద్యమానికి " మార్గం సుగమం చేసింది. [10]
  • 1962 రాచెల్ కార్సన్ రాసిన సైలెంట్ స్ప్రింగ్ ప్రచురణ సుస్థిరత ఉద్యమానికి మరో ప్రధాన మైలురాయిగా నిలిచింది.
  • 1972 డోనెల్లా మెడోస్ అంతర్జాతీయ బెస్ట్ సెల్లర్ ది లిమిట్స్ టు గ్రోత్ రాశారు, ఇది జనాభా, ఆర్థిక శాస్త్రం, పర్యావరణంలో దీర్ఘకాలిక ప్రపంచ పోకడలను అధ్యయనం చేసింది. ఇది మిలియన్ల కాపీలు అమ్ముడై 28 భాషలలోకి అనువదించబడింది.
  • 1973 ఇ.ఎఫ్. షూమేకర్ తన స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పుస్తకంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సముచితంగా ఉపయోగించడం ద్వారా స్థిరమైన జీవనానికి మారడంపై వ్యాసాల సేకరణను ప్రచురించారు.
  • 1992-2002 ఐక్యరాజ్యసమితి వరుస సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశాలు భూమిలోని సహజ వనరులను పరిరక్షించి, సమాజాలలో స్థిరత్వాన్ని పెంచడంపై దృష్టి పెట్టాయి. 1992, 1972, 2002 లలో ఎర్త్ సమ్మిట్(శిఖరాగ్ర సమావేశాలు) సమావేశాలు జరిగాయి. [11]
  • 2007 ఐక్యరాజ్యసమితి "సుస్థిర వినియోగం, ఉత్పత్తి, వాతావరణ, స్నేహపూర్వక గృహ వినియోగ పద్ధతులను ప్రోత్సహించడం" వ్యాసాన్ని ప్రచురించింది, ఇది వివిధ సముదాయాలలో, గృహాలలో స్థిరమైన జీవనశైలిని ప్రోత్సహించింది. [12]

ఇల్లు

[మార్చు]

ప్రపంచ స్థాయిలో విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాలాలో 25% మనుషులు నివసించే ఇళ్ళ నుండి వెలువడుతున్నాయి. మరో 26% ఇళ్ళ కోసం వినియోగిస్తున్న భూభాగం నుండి వెలువడుతోంది. [13]

స్థిరమైన నిర్మాణ సామగ్రి

[మార్చు]
  • మట్టి ఇటుకలు
  • వెదురు
  • సెల్యులోజ్ తో తయారు చేసిన భవన నిర్మాణ సామగ్రి
  • ఉపమృత్తిక
  • ప్లాస్టిక్, కలప వ్యర్థం నుండి రూపొందించిన చెక్క
  • కుచించిన మట్టి
  • దుంగలను కలిపి రూపొందించిన చెక్క
  • జీలుగుబెండు
  • జనపనార
  • వేడిని, ఒత్తిడిని తట్టుకోగల సిమెంట్ ఇటుకలు
  • సున్నపురాయి
  • లినోలియం (జిగురు, అవిసె నూనె, చెక్కపొట్టు మొ|| పదార్థాలను మేళవించి తయారు చేసే భవన నిర్మాణ సామగ్రి)
  • ఎంపిక చేసిన చెట్ల నుండి సేకరించిన దుంగలు
  • సహజ రబ్బరు
  • సహజ నారలు (కొబ్బరి పీచు, ఉన్ని, జ్యూట్ మొ|| నవి)
  • సేంద్రియ పద్ధతిలో పండించిన పత్తి నుండి రూపొందించిన పదార్థం
  • కాగితపు వ్యర్థాలను పునరుపయోగించి తయారు చేసిన గుజ్జు
  • తాపీ (సున్నపురాయి, మట్టి, బెల్లం, గుడ్డుసొనల మిశ్రమం)
  • వ్యర్థాలను పునరుపయోగించి సేకరించిన రాయి
  • వ్యర్థాలను పునరుపయోగించి సేకరించిన ఇటుకలు
  • వ్యర్థాలను పునరుపయోగించి సేకరించిన ఇనుము, ఇతర లోహాలు
  • వ్యర్థాలను పునరుపయోగించి సేకరించిన సిమెంట్
  • వ్యర్థాలను పునరుపయోగించి సేకరించిన కాగితం
  • సోయా ఆధారిత జిగురు
  • సోయా ఆధారిత భవన నిర్మాణ సామగ్రి
  • గడ్డి కసవు
  • కలప

విద్యుత్తు

[మార్చు]
గ్రామీణ మంగోలియాలో సౌర ఫలకాల వ్యవస్థాపన

ఇంధనం కోసం దహనం చేయగల సేంద్రియ పదార్థాల జాబితా

[మార్చు]
  • చెరుకు పిప్పి
  • బయోగ్యాస్
  • సహజ ఎరువు
  • పొలంలో కోత తరువాత మిగిలిన వ్యర్థం
  • వట్టిగడ్డి
  • అప్పటికే వాడేసిన వంటనూనె
  • కలప

ప్రకృతిలో సహజంగా మీథేన్ వాయువును జీర్ణక్రియ ద్వారా జంతువులు తయారు చేస్తాయి. ఇదే పద్ధతిని వాడి బయోమాస్ ఉత్పత్తిని చేస్తున్నారు. మురుగునీటిని క్రమీకరించి అందులో నుండి మీథేన్ వాయువును తయారు చేసి, ఆ మీథేన్ వాయువును దహించి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఈ మీథేన్ వాయువు సహజంగా బంజర చిత్తడి భూభాగాల్లో, మరుగు ప్రదేశాల్లో, దొరుకుతుంది, మీథేన్ ను వాతావరణంలో కలవకుండా అరికడితే, అది భూ ఉపరితల ఉష్ణోగ్రతను పెంచకుండా ఆపవచ్చు. బయోమాస్ ఇంధన ఉత్పత్తికి వాడే ఈ పద్ధతి సాధారణంగా పెద్ద ఎత్తున మాత్రమే జరుగుతున్నప్పటికీ, ఇది చిన్న స్థాయిలో కూడా చేయవచ్చు. [14]

ఆహారం

[మార్చు]

పారిశ్రామిక వ్యవసాయం యొక్క పర్యావరణ ప్రభావాలు

[మార్చు]

సాంప్రదాయ ఆహార పంపిణీ, సుదూర రవాణా

[మార్చు]

స్థానిక, కాలానుగుణ ఆహారాలు

[మార్చు]

మాంసం వినియోగాన్ని తగ్గించడం

[మార్చు]

సేంద్రీయ వ్యవసాయం

[మార్చు]

పట్టణ తోటపని

[మార్చు]

ఆహార సంరక్షణ, నిల్వ

[మార్చు]

రవాణా

[మార్చు]

నీరు

[మార్చు]

వ్యర్థం

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Jegou F., Scholl G., Seyrig A. (2013) That aims to reduce ones dependency upon society. Sustainable Street 2030, CORPUS toolkit for collaborative scenario building
  2. Winter, Mick (2007). Sustainable Living: For Home, Neighborhood and Community. Westsong Publishing. ISBN 978-0-9659000-5-8.
  3. The Center for Ecological Living and Learning (CELL)
  4. Lynn R. Kahle; Eda Gurel-Atay, Eds (2014). Communicating Sustainability for the Green Economy. New York: M.E. Sharpe. ISBN 978-0-7656-3680-5.
  5. Adams, W.M. (2006). "The Future of Sustainability: Re-thinking Environment and Development in the Twenty-first Century." Archived 2011-07-18 at the Wayback Machine Report of the IUCN Renowned Thinkers Meeting, 29–31 January 2006. Retrieved on: 25 July 2009.
  6. U.S. Environmental Protection Agency "What is sustainability?" Retrieved on: 20 August 2007.
  7. "Checking browser". Archived from the original on 2017-07-02. Retrieved 2020-03-13.
  8. Fritsch, Al; Paul Gallimore (2007). Healing Appalachia: Sustainable Living Through Appropriate Technology. University Press of Kentucky. p. 2. ISBN 978-0-8131-2431-5. Unknown retrieval date, revised: 25 July 2009
  9. Wheeler, Stephen Maxwell; Timothy Beatley (2004). The Sustainable Urban Development Reader. Routledge. ISBN 978-0-415-31187-8.
  10. Nearing, Scott; Helen Nearing (1953). Living the Good Life.
  11. National Sustainable Development Strategies United Nations Department of Economic and Social Affairs April 2008.
  12. Sustainable Consumption and Production: Promoting Climate-Friendly Household Consumption Patterns United Nations Department of Economic and Social Affairs 30 April 2007.
  13. Ivanova, Diana; Stadler, Konstantin; Steen-Olsen, Kjartan; Wood, Richard; Vita, Gibran; Tukker, Arnold; Hertwich, Edgar G. (2015-12-01). "Environmental Impact Assessment of Household Consumption". Journal of Industrial Ecology (in ఇంగ్లీష్). 20 (3): 526–536. doi:10.1111/jiec.12371. ISSN 1530-9290.
  14. McDilda, Diane Gow. The Everything Green Living Book: Easy Ways to Conserve Energy, Protect Your Family's Health, and Help save the Environment. Avon, MA: Adams Media, 2007. Print.

బాహ్య లింకులు

[మార్చు]
  • INHERIT ప్రాజెక్ట్, హారిజోన్ 2020 ప్రాజెక్ట్, పర్యావరణాన్ని పరిరక్షించే, ఆరోగ్య, ఆరోగ్య ఈక్విటీని ప్రోత్సహించే జీవన విధానాలు, కదిలే, వినియోగించే మార్గాలను గుర్తించడానికి.