భాభా అణు పరిశోధనా కేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాబా అణుపరిశోధనా కేంద్రం
भाभा परमाणु अनुसन्धान केंद्र
151px
సంస్థ చిహ్నం
సంకేతాక్షరంBARC
ఆశయంAtoms in the service of the Nation
స్థాపనజనవరి 3, 1954 (1954-01-03)[1]
చట్టబద్ధతపనిచేస్తున్నది
సంస్థ రకంఅణు పరిశోధన
ప్రధాన కార్యాలయాలుట్రాంబే, ముంబై
కార్యస్థానం
డైరెక్టరుకె.ఎన్. వ్యాస్
Parent organisationభారత అణుపరిశోధనా విభాగం
బడ్జెట్INR13.61 billion (US$) (2008–09)
జాలగూడుbarc.gov.in
మారుపేరుఅటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్ మెంట్

బాబా అణు పరిశోధనా కేంద్రం భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఒక అణుపరిశోధనా సంస్థ. ఇది ముంబైకి సమీపంలోని ట్రాంబే అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ అణు శాస్త్రంలో విస్తృత పరిశోధనలు చేయడానికి కావలసిన అధునాతన పరికరాలు, వ్యవస్థ అందుబాటులో ఉన్నాయి.

అణుశక్తిని ప్రధానంగా మానవాళి మేలు కొరకు ఉపయోగించడానికి ఈ సంస్థ ప్రయోగాలు చేస్తుంది. ముఖ్యంగా అణుశక్తిని ఉపయోగించి విద్యుత్ ను ఉత్పత్తి చేయడం పై ఎక్కువ దృష్టి సారిస్తుంది.

చరిత్ర[మార్చు]

భారత ప్రభుత్వం జనవరి 3, 1954 న అణు పరిశోధన కోసం అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్ మెంట్, ట్రాంబే అనే సంస్థను స్థాపించింది. దీని ముఖ్య ఉద్దేశం వివిధ సంస్థల్లో అణు రియాక్టర్లు మరియు వాటి సాంకేతిక పరిజ్ఞానం పైన పనిచేస్తున్న శాస్త్రవేత్తల కృషినంతటినీ ఒకే తాటిపైకి తీసుకురావడం. ఇందులా భాగంగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) లో ఈ రంగంలో పనిచేస్తున్న వారినందరినీ ఈ సంస్థకి మార్చింది. తద్వారా TIFR కేవలం స్వచ్ఛమైన సైన్సు పరిశోధనలు చేసుకునేలా వీలు కల్పించింది. 1966 లో భారతదేశ అణు పితామహుడిగా పేరుగాంచిన హోమీ భాభా మరణించిన తరువాత ఆయన జ్ఞాపకార్థం ఈ సంస్థను భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్గా మార్చింది.

మూలాలు[మార్చు]

  1. "Heritage". Bhabha Atomic Research Centre. మూలం నుండి 2012-02-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2012-02-10. Cite web requires |website= (help)