పార్టికల్ యాక్సెలరేటర్
స్వరూపం
పార్టికల్ యాక్సెలరేటర్ అంటే విద్యుదయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి విద్యుదావేశం కలిగిన కణాలకు అత్యంత వేగాన్ని, శక్తిని సమకూర్చి ముందుకు నడిపించే యంత్రాలు. ఈ క్రమంలో వాటిని నిర్దేశిత పుంజంగా ఉంచటానికి ప్రయత్నిస్తారు.[1][2] వీటిలో పెద్దగా ఉండే వాటిని కణ భౌతికశాస్త్రంలో ప్రాథమిక పరిశోధన కోసం ఉపయోగిస్తారు. యాక్సిలరేటర్‌లు సంక్షేపణ పదార్థ భౌతికశాస్త్రం (కండెన్స్‌డ్ మ్యాటర్ ఫిజిక్స్) అధ్యయనంలో సింక్రోట్రోన్ లైట్ సోర్స్ లాగా వాడతారు. ఇంకా ఆంకాలజీ లో పార్టికల్ థెరపీ, మెడికల్ డయాగ్నస్టిక్స్ కోసం రేడియో ఐసోటోప్ ఉత్పత్తి, అయాన్ ఇంప్లాంటేషన్ తో సహా అనేక రకాల అప్లికేషన్లలో చిన్న పార్టికల్ యాక్సిలరేటర్లను ఉపయోగిస్తారు. అర్ధవాహకాలు, యాక్సిలరేటర్ మాస్ స్పెక్ట్రోమీటర్లు రేడియోకార్బన్ వంటి అరుదైన ఐసోటోపుల కొలతల కోసం కూడా వీటిని ఉపయోగిస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ Chao, Alexander W; Chou, Weiren (2008). Reviews of Accelerator Science and Technology: Volume 1 (in ఇంగ్లీష్). Singapore: World Scientific. Bibcode:2008rast.book.....C. doi:10.1142/7037. ISBN 978-981-283-520-8.
- ↑ Livingston, M. S.; Blewett, J. (1969). Particle Accelerators. New York: McGraw-Hill. ISBN 978-1-114-44384-6.