Jump to content

అనుపమ్ (సూపర్ కంప్యూటరు)

వికీపీడియా నుండి

భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) తమ అంతర్గత వినియోగాల కోసం రూపొందించి, అభివృద్ధి చేసిన సూపర్ కంప్యూటర్ల శ్రేణి, అనుపమ్. ఇది ప్రధానంగా మాలిక్యులర్ డైనమిక్ సిమ్యులేషన్స్, రియాక్టర్ ఫిజిక్స్, థియరిటికల్ ఫిజిక్స్, కంప్యూటేషనల్ కెమిస్ట్రీ, కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్, ఫైనెట్ ఎలిమెంట్ అనాలిసిస్ వంటి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు [1]

ఈ శ్రేణిలో అత్యంత తాజాది అనుపమ్-అగణ్య. [2] [3]

పరిచయం

[మార్చు]

బార్క్, భౌతిక శాస్త్రాలు, రసాయన శాస్త్రాలు, జీవ శాస్త్రాలు, ఇంజనీరింగ్‌లో విస్తృత శ్రేణి విభాగాలను కవర్ చేస్తూ ఇంటర్-డిసిప్లినరీ, మల్టీ-డిసిప్లినరీ పరిశొధన, అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహిస్తుంది. BARC నైపుణ్యాలు శాస్త్ర సాంకేతికాల్లోని మొత్తం స్పెక్ట్రమ్‌ను కవర్ చేస్తాయి. [4]

BARC 1991లో అనుపమ్ ప్రాజెక్ట్ కింద సూపర్ కంప్యూటర్‌ల అభివృద్ధిని ప్రారంభించి, ఇప్పటి వరకు 20కి పైగా వివిధ కంప్యూటర్ సిస్టమ్‌లను అభివృద్ధి చేసింది. అన్ని అనుపమ్ సిస్టమ్‌లు సమాంతర ప్రాసెసింగ్‌ను అంతర్లీన తత్వశాస్త్రంగా, MIMD (మల్టిపుల్ ఇన్‌స్ట్రక్షన్ మల్టిపుల్ డేటా) ను కోర్ ఆర్కిటెక్చర్‌గానూ ఉపయోగిస్తాయి. BARC, ఒక మల్టీడిసిప్లినరీ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అయినందున, అందులో అణు శాస్త్రం, సాంకేతికత యొక్క వివిధ అంశాలలో పని చేసే శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఆ విధంగా వారు అనేక విభిన్న రకాల గణనలు చేస్తూంటారు.

అభివృద్ధి చేసే సమయాన్ని తగ్గించడం కోసం, వాణిజ్యపరంగా మార్కెట్లో లభించే భాగాలతోనే ఈ సమాంతర కంప్యూటర్‌లను నిర్మించారు. సిస్టమ్ ఇంటిగ్రేషన్, సిస్టమ్ ఇంజనీరింగ్, సిస్టమ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, సిస్టమ్ ఫైన్ ట్యూనింగ్ రంగాలలో BARC కృషి ప్రధానంగా ఉంది.

1991లో 34 మెగాఫ్లాప్‌ల నిరంతర పనితీరుతో చిన్న నాలుగు-ప్రాసెసర్ సిస్టమ్‌తో ఈ శ్రేణి ప్రారంభమైంది. వినియోగదారుల నుండి పెరుగుతున్న డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని, గణన శక్తిని పెంచుతూ, కొత్త వ్యవస్థలను నిర్మిస్తూ పోయారు. సూపర్‌కంప్యూటర్‌ల శ్రేణిలో సరికొత్తది 2010-11లో అభివృద్ధి చేసిన 4608 కోర్ అనుపమ్-ఆద్య. దీనికి స్టాండర్డ్ హై పెర్ఫార్మెన్స్ లిన్‌ప్యాక్ (HPL) బెంచ్‌మార్క్‌లో 47 టెరాఫ్లాప్స్ నిరంతర పనితీరు ఉంది. ఈ సిస్టమ్ ఉత్పత్తి లోకి వెళ్ళి, వినియోగదారులకు పంపిణీ అయింది. [5]

2001లో నిర్మించిన అనుపమ్ పెంటియంతో BARC, దేశంలోని ఇతర సంస్థలు నిర్మించిన అత్యంత వేగవంతమైన కంప్యూటర్ కంటే 20-25 రెట్లు వేగంగా పనిచేసే సూపర్ కంప్యూటర్‌ను అభివృద్ధి చేసి కొత్త మైలురాయిని సాధించింది. [6]

అనుపమ్ వ్యవస్థలు

[మార్చు]
సర్. నం. పేరు ప్రాసెసింగ్ పవర్ సంవత్సరం ప్రాసెసర్ల సంఖ్య సంస్థాపన
1 అనుపమ్-అగణ్య 270 T ఫ్లాప్స్ 2016- 6440 కోర్లు + 20 9984 కోర్ GPU ట్రాంబే
2 అనుపమ్-అగ్ర 150 T ఫ్లాప్స్ 2012- 8160 కోర్లు + 80 512 కోర్ GPU ట్రాంబే
3 అనుపమ్-ఆద్య 47 T ఫ్లాప్స్ 2010- 4608 కోర్లు @ 3.0 GHz ట్రాంబే
4 అనుపమ్-అజేయ 9.036 T ఫ్లాప్స్ 1152 కోర్లు ట్రాంబే
5 అనుపమ్-అమేయ 1.73 T ఫ్లాప్స్ 512 కోర్లు ట్రాంబే
6 అనుపం-అరుణ 365 G ఫ్లాప్స్ 128 కోర్లు
7 అనుపమ్-జెనాన్ 202 G ఫ్లాప్స్ 2003-04 128 కోర్లు @ 2.4 GHz [7]
8 అనుపం-PIV 43 G ఫ్లాప్స్ 2002-03 64 కోర్లు @ 1.7 GHz
9 అనుపం-పెంటియం 15 G ఫ్లాప్స్ 2001–02 84 కోర్లు @ 600 MHz
10 అనుపం-పెంటియం 16 కోర్లు
11 అనుపమ్-ఆల్ఫా 1 G ఫ్లాప్స్ 1997-98 న్యూ ఢిల్లీలోని మౌసం భవన్‌లోని NCMRWFలో CRAY XMP216 భర్తీ చేయబడింది
12 అనుపమ్-అశ్వ 64
13 అనుపమ్ 860/4 30 M ఫ్లాప్స్ 1991 4 కోర్లు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Nuclear India". Department of Atomic Energy, Government of India. July–August 2001. Archived from the original on 2015-01-19. Retrieved 2022-12-09.
  2. Basu (Jan 26, 2014). 65 th Republic Day of India - BARC (PDF). Bhabha Atomic Research Centre. Retrieved 19 August 2015.
  3. "70th Independence Day Celebration - Address by Director, BARC" (PDF). BARC. 15 August 2016.
  4. (April 1, 2008). "THE EVOLUTION OF ANUPAM SUPERCOMPUTERS". Archived 2017-08-29 at the Wayback Machine "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-29. Retrieved 2022-12-09.
  5. . "ANUPAM-Adhya Supercomputer". Archived 2019-08-19 at the Wayback Machine "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-08-19. Retrieved 2022-12-09.
  6. "BARC develops supercomputer". The Hindu. 2001-07-05. Archived from the original on January 18, 2015. Retrieved July 5, 2001.
  7. "Barc makes high-speed ANUPAM supercomputer". The Times of India. Retrieved 9 July 2003.