Jump to content

ఏక (సూపర్ కంప్యూటరు)

వికీపీడియా నుండి

 

ఏక (EKA -ఎంబెడ్డెడ్ కర్మాకర్ అల్గోరిథం కు సంక్షిప్త రూపం), సూపర్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్‌ను పెంచడం కోసం డాక్టర్ నరేంద్ర కర్మాకర్ స్థాపించిన కంప్యూటేషనల్ రీసెర్చ్ లాబొరేటరీస్ నిర్మించిన సూపర్ కంప్యూటరు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో తాను రూపొందించిన ఆర్కిటెక్చరుపై ఆధారపడి, తన విద్యార్థులు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ల బృందంతో 6 సంవత్సరాల పాటు కృషి చేసి ఈ సూపర్ కంప్యూటరును రూపొందించాడు.

CRL లో టాటా సన్స్ పెట్టుబడి పెట్టాక, అది టాటా సన్స్‌కు అనుబంధ సంస్థగా మారింది. ప్రారంభ సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి అవసరమైన హార్డ్‌వేర్ ప్లాట్‌ఫారమును హ్యూలెట్-ప్యాకర్డ్ సాంకేతిక సహాయంతో నిర్మించారు.

రూపకల్పన

[మార్చు]

కొత్త సాఫ్ట్‌వేర్ రూపకల్పనను ప్రారంభించడానికి, గతంలో నిరూపితమైన హార్డ్‌వేర్ ప్లాట్‌ఫారమ్ అవసరం. ఇందుకోసం ఇంటెల్ క్వాడ్‌కోర్ జియాన్ ప్రాసెసర్‌ల ఆధారంగా 14,352 కోర్‌లను ఉపయోగించారు. ప్రాథమిక ఇంటర్‌కనెక్ట్ Infiband 4x DDR. EKA దాదాపు 4,000 చ.అ. విస్తీర్ణంలో ఉంది. [1] ఇది హ్యూలెట్ పాకార్డ్, మెల్లనాక్స్, వోల్టేర్ లిమిటెడ్ నుండి వివిధ భాగాలను ఉపయోగించి నిర్మించారు. దీన్ని 6 వారాల లోపే నిర్మించారు. [2]

ర్యాంకింగ్ చరిత్ర

[మార్చు]

ఆవిష్కరించబడిన సమయంలో, ఇది ప్రపంచంలో నాల్గవ వేగవంతమైన సూపర్ కంప్యూటరు, ఆసియాలో అత్యంత వేగవంతమైనది. [3]

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • SAGA-220, ఇస్రో నిర్మించిన 220-TeraFLOPS సూపర్ కంప్యూటర్
  • పరమ్ సూపర్ కంప్యూటర్లు

మూలాలు

[మార్చు]
  1. "Top500: EKA(Supercomputer)". 14 November 2007.
  2. "Supercomputer another feather in Tatas` cap". 14 November 2007. Retrieved 24 April 2017.
  3. "Top500: EKA(Supercomputer)". 14 November 2007.