వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2016)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2016 సంవత్సరంలో "ఈ వారం వ్యాసం" శీర్షికలో ప్రదర్శించిన వ్యాసాలు

ప్రస్తుత ప్రతిపాదనలు, జాబితా కోసం వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.


1వ వారం
మిస్సమ్మ (1955 సినిమా)
మిస్సమ్మ 1955లో విడుదలైన తెలుగు చిత్రం. ఇది ఒక అద్భుతమైన పూర్తినిడివి హాస్య చిత్రం. ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని అతి పెద్ద హీరోలుగా పేరు గాంచిన నందమూరి తారక రామారావు మరియు అక్కినేని నాగేశ్వరరావు నటించారు. ఘన విజయము సాదించిన ఈ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించినది మాత్రము మహానటి సావిత్రి. ఎస్వీ రంగారావు, జమున, రేలంగి వెంకటరామయ్య, ఋష్యేంద్రమణి, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, బాలక్రిష్ణ, దొరైస్వామి తదితరులు నటించారు. గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా ఒక చిన్న పాత్రలో మీకు కనిపిస్తారు. సావిత్రికి ఈ సినిమాతో చక్కని అభినేత్రిగా మంచి పేరు వచ్చింది. ఆమె ఇక చిత్ర పరిశ్రమలో తిరిగి చూడ లేదు. మిస్సమ్మ చిత్రము యొతిష్ బెనర్జీ అనే బెంగాలి రచయిత యొక్క "మన్మొయీ గర్ల్స్ స్కూల్" అనే హాస్య రచన ఆధారంగా చక్రపాణి మరియు పింగళి నాగేంద్రరావులు రచించగా ఎల్వీ ప్రసాదు దర్శకత్వంలో రూపొందిచబడినది. సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, రేలంగి, అల్లు రామలింగయ్య మొదలైన వారి నటనతో సినిమా పూర్తి వినోదాత్మకంగా రూపొందింది. ఈ సినిమాకు పింగళి నాగేంద్రరావు రచించిన మాటలు, పాటలు తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నదగ్గ వాటిలో కొన్ని. ఆయన సాహిత్యమూ, ఎ.ఎం.రాజా, పి.లీల, పి.సుశీల గార్ల గాత్రమాధుర్యమూ కలిసి మిస్సమ్మ సినిమా పాటలను అజరామరం చేసాయి. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాటలు ఈనాటికీ తెలుగు వారిని అలరిస్తూ ఉన్నాయి. పి.లీల పాడిన కరుణించు మేరిమాత అనేపాట హృదయాలను తాకుతుంది.
(ఇంకా…)
2వ వారం
యల్లాప్రగడ సుబ్బారావు
యల్లాప్రగడ సుబ్బారావు (జనవరి 12, 1895 - ఆగష్టు 9, 1948) భారత దేశమునకు చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. లెడర్లీ ప్రయోగశాలలో వైద్యబృందం నాయకులుగా ఫోలిక్ ఆమ్లం యొక్క నిజస్వరూపాన్ని కనుగొన్నాడు. అందులోని బంగారు వన్నె భస్మం స్ప్రూ వ్యాధి, మక్రోసైటిక్ అనీమియా అను రక్తహీనత వల్ల కలిగే వ్యాధి నిర్మూలనకు అసమానమైన, అద్భుతమైన మందుగా నిర్ణయింపబడింది. క్షయరోగ నివారణియగు బసోనికోటి నికాసిడ్, హైడ్రాక్సైడ్ మందులను కనుగొన్నారు. బోదకాలు, టైఫాయిడ్, పాండురోగం మున్నగు వ్యాధులకు పూర్తిగా నిర్మూలింపగల మందులను కనుగొన్నాడు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బస్తీలో 1895 , జనవరి 12 న జన్మించారు. తండ్రి పేరు జగన్నాథం. ఎలిమెంటరీ, ఉన్నత పాఠశాల చదువులు పుర్తి చేసేటప్పటికి తండ్రి చిరు ఉద్యోగిగానే రిటైర్ అయ్యాడు. ఇక, ఈయనను చదివించడానికి తండ్రి వెనుకంజ వేయగా తల్లి పట్టుబట్టి ఈయనను రాజమండ్రి కి పంపించి మెట్రిక్యులేషన్ పరీక్ష చదివించారు. ఫెయిలయ్యారు. ఇంతలో తండ్రి మరణించాడు. తల్లి పట్టుదలతో మద్రాసు కు పంపదల్చగా చేత చిల్లిగవ్వ లేదు. పుస్తెలు అమ్మి కొడుకు చదువుకు ఇచ్చింది. మద్రాసు హిందూ ఉన్నత పాఠశాల లో చేరి, చదువులో ముందడుగు వేశాడు.
(ఇంకా…)
3వ వారం
థార్ ఎడారి
థార్ ఏడారి భారత దేశానికి వాయువ్య దిశలో భారత పాకిస్తాన్ సరిహద్దులలో ఉన్నది. ఈ ఎడారిని గ్రేట్ ఇండియన్ డెసర్ట్ అని పిలుస్తారు. ఈ ఎడారి ప్రధానంగా రాజస్థాన్ రాష్ట్రములో, కొంత భాగము హర్యానా, పంజాబ్, గుజరాత్ రాష్ట్రములో, కొద్ది భాగము పాకిస్తాన్ దేశములోని పంజాబ్ రాష్ట్రములో విస్తరించి ఉన్నది. పాకిస్తాన్లో విస్తరించి ఉన్న ఎడారిని ఖలిస్తాన్ ఎడారి అని పిలుస్తారు. థార్ ఎడారి భౌగోళిక సరిహద్దులు వాయువ్యాన సట్లెజ్ నది, తూర్పున ఆరావళీ పర్వత శ్రేణులు, దక్షిణాన రాణ్ ఆఫ్ కచ్ సాల్ట్ మార్ష్ (ఉప్పుకయ్య), పశ్చిమాన సింధూ నది. ఉత్తరాన థార్ ఎడారికి, విశాలమైన ముళ్ళపొదల భూములకు ఉన్న సరిహద్దు ఖచ్చితంగా నిర్వచించబడలేదు. అందువళ్ళ ఏ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకున్నారో, తీసుకోలేదో అన్న విషయముపై థార్ ఎడారి పరిమాణము యొక్క అచంనాలు గణనీయంగా మారుతుంటాయి. వర్డల్ వైడ్ ఫండ్ వారి నిర్వచనం ప్రకారం, ఎడారి ప్రాంతం 92,200 చదరపు మైళ్ళు (238,700 చ.కి.మీ). ఇతర ఆధారాల ప్రకారం 805 కి.మీ పొడవు (500 మైళ్ళు) 485 కి.మీ (300 మైళ్ళు) వెడల్పుతో 446,000 చదరపు కి.మీల వైశాల్యములో ఉన్నది. భారత దేశ భూభాగములో ఉన్న ఈ ఎడారి 61% రాజస్థాన్ లో 20% గుజరాత్ లో 9% పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో విస్తరించి ఉన్నది.
(ఇంకా…)
4వ వారం
అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా
అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అనే ఈ రకము కాన్సర్ ఎముక మజ్జలోని లాసికాణువు లేదా లింఫొసైట్లలలో జన్యు మార్పు సంభవించి, అవి నియంత్రణ లేకుండా విభజిస్తూ ఉండటం వళ్ల ఏర్పడుతుంది. ఇది చాలా తొందరగా వ్యాప్తి చెందడము వలన దీనిని అక్యూట్ అని పిలుస్తారు. ఇది చాలా వరకు పదేళ్ల లోపు చిన్న పిల్లలోనే కనిపిస్తుంది కావున దీనిని బాల్య కాన్సర్ (చైల్డ్-హుడ్ కాన్సర్) అని అంటారు. పెద్దలలో ఈ రకము చాలా అరుదుగా వస్తుంది, ఈ కాన్సర్ బారిన పడే పెద్దల సరాసరి వయస్సు 60 సంవత్సరాలు. కానీ ఇది అన్ని వయస్సుల వారికి రావొచ్చును. అయితే చిన్న పిల్లలలో ఈ వ్యాధిని చాలావరుకు నయం చెయవచ్చును, కానీ పెద్దల్లో 40%-45% మంది మాత్రమే ఈ జబ్బునుండి విముక్తి పొందుతారు. రక్త పరీక్ష చెయడము ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. కానీ అది ఏ రకానికి చెందినదో తెలుసుకోవడానికి మరిన్ని పరీక్షలు చెయ్యాలి. ఈ పరీక్షలకు నమూనాను ఎముక మజ్జ నుండి సేకరించాలి, దీనిని ఎముక మజ్జ జీవాణుపరీక్ష (బోన్ మేరో బయాప్సీ) అని అంటారు. వెన్నెముక నుండి కేంద్రనాడీమండల ద్రవ్యాన్ని, స్పైనల్ టాప్ లేదా లంబార్ పంక్చర్ అనే పద్ధతి ద్వారా వెలుపలకు తీసి కేంద్రనాడీమండలానికి జబ్బు వ్యాపించిందా అని పరిశోధన చెయ్యలి. సుమారు 10% మందికి రోగాన్ని కనుక్కునే సమయానికి కాన్సర్ కేంద్రనాడీమండలానికి వ్యాపించి వుంటుంది.
(ఇంకా…)
5వ వారం
అలీసియా కీస్
అలీసియా ఆగెల్లో కుక్ (జ. జనవరి 25, 1981), ఒక అమెరికన్ రికార్డింగ్ కళాకారిణి, సంగీత విద్వాంసురాలు మటియు నటీమణి. ఆమె "అలీసియా కీస్" నామంతో ప్రఖ్యాతి చెందింది. ఆమె న్యూయార్క్ నగరంలోని మన్హట్టన్ యొక్క హెల్'స్ కిచెన్ ప్రాంతంలో తన ఒంటరి తల్లి వద్ద పెరిగింది. ఏడు సంవత్సరముల వయస్సులో, కీస్ పియానో పైన శాస్త్రీయ సంగీతమును వాయించటం ప్రారంభించింది. ఆమె ప్రొఫెషనల్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ స్కూల్ కు హాజరై 16 సంవత్సరముల వయస్సులో ఉత్తమ విద్యార్ధినిగా పట్టా పుచ్చుకుంది. తరువాత ఆమె కొలంబియా యూనివర్సిటీలో చేరింది కానీ తన సంగీత వృత్తిలో వృద్ధి చెందటానికి అక్కడ విద్యను కొనసాగించలేదు. కీస్ తన మొదటి ఆల్బంను J రికార్డ్స్ ద్వారా విడుదల చేసింది, మొట్టమొదట ఆమెకు కొలంబియా మరియు అరిస్టా రికార్డ్స్ తో రికార్డు లావాదేవీలు ఉన్నాయి. స్ ప్రారంభ ఆల్బం, సాంగ్స్ ఇన్ ఎ మైనర్ , ప్రపంచవ్యాప్తంగా 12 మిలియన్ల కన్నా ఎక్కువ ప్రతులు అమ్ముడై, వాణిజ్యపరంగా విజయవంతమైంది. 2001 సంవత్సరానికి ఆమె ఎక్కువ గిరాకీ (బెస్ట్ సెల్లింగ్) ఉన్న నూతన కళాకారిణి మరియు ఎక్కువ గిరాకీ (బెస్ట్ సెల్లింగ్) ఉన్న R&B కళాకారిణి అయింది. ఈ ఆల్బం 2002 లో కీస్ కు ఐదు గ్రామీ పురస్కారములను తెచ్చిపెట్టింది, వాటిలో ఉత్తమ నూతన కళాకారిణి మరియు "ఫాలిన్'" కొరకు ఆ సంవత్సరపు పాట పురస్కారములు ఉన్నాయి.
(ఇంకా…)
6వ వారం

శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి

శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం శ్రీకాకుళం జిల్లా లో శ్రీకాకుళం మండలంలో అరసవల్లి అనే గ్రామంలో ఉంది. శ్రీకాకుళం పట్టణానికి సుమారు ఒక కిలోమీటరు దూరంలో గల ఈ గ్రామం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానము ద్వారా బహుళ ప్రసిద్ది చెంది ఉన్నది. ఇది మన దేశంలో గల సూర్యదేవాలయాలలో ప్రాచీనమైనది. పద్మ పురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కస్యప మహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు ఆధారాలున్నాయి. ఈ దేవాలయ నిర్మాణం కోసం ద్వాపరయుగం నాటి ఆధారాలు లభిస్తాయి. ఉషోదయ కిరణాలతో సమస్త జీవ కోటినీ నవ చైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్యభగవానుడికి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం అరసవల్లి. ఆ ఆలయంలో భాస్కరుణ్ణి పూజించిన వారు అన్ని కష్టాలూ తొలగి హర్షంతో వెళతారని కాబట్టి ఒకప్పుడు ఈ ఊరిని హర్షవల్లి అనే వారనీ అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి. మహాభాస్కర క్షేత్రంగా పిలుస్తున్న ఆ ఆలయానికి యెంతో ఘనమైన చరిత్ర ఉందని స్ధల పురాణం చెబుతోంది. ఆలయం తొలత దేవేంద్రునిచే నిర్మితమైందని పురాణ ప్రవచనం. చరిత్ర పుటలను తిరగేస్తే అరసవల్లిలోని శ్రీ సూర్యదేవాల యాన్ని కళింగ రాజ్య పాలకులు తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన దేవేంద్ర వర్మ క్రీస్తు శకం 545లో నిర్మించి నట్టు తెలుస్తోంది. ఆ తరువాత ఆయన వారసుడు ఒకటో దేవేంద్రవర్మ క్రీస్తు శకం 648లో సూర్యగ్రహణ సమయా న ఆదిత్య విష్ణుశర్మ, భానుశర్మలనే బ్రాహ్మణులకు అరస వల్లితో పాటు మరికొన్ని గ్రామాలను దానం ఇచ్చినట్టు ఆలయ పరిసరాల్లోని శాసనాలు స్పష్టం చేస్తున్నాయి.

(ఫిబ్రవరి 14 2016-రథసప్తమి సందర్భంగా...)

(ఇంకా…)

7వ వారం
దస్త్రం:Telangana CM TRS.jpg

కల్వకుంట్ల చంద్రశేఖరరావు

కల్వకుంట్ల చంద్రశేఖర రావు (జ: 17 ఫిబ్రవరి, 1954) నూతనంగా యేర్పడిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడైన చంద్రశేఖరరావు 15వ లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ లోకసభ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహించాడు. 2004 నుండి 2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. 15వ లోక్‌సభలో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి విజయం సాధించాడు. ఇతడు మొదట తెలుగుదేశం పార్టీలో సభ్యుడు. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం సాధన ధ్యేయంగా ఆ పార్టీ నుండి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించాడు. 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెసుతో కలిసి పోటీచేసి 5 లోక్‌సభ స్థానాలను దక్కించుకున్నాడు. అయితే తరువాత కాలంలో యు.పి.ఏ నుండి వైదొలగాడు. ఇతడు ఎం.ఏ (సాహిత్యం) ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తిచేశాడు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లానందలి చింతమడక గ్రామంలో 17 ఫిబ్రవరి, 1954 న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నందలి ఎం.ఎ(తెలుగు సాహిత్యం) పూర్తి చేశారు. ఆయన ఏప్రిల్ 23 1969 న శ్రీమతి శోభ ను వివాహమాడారు. వారికి ఒక కుమారుడు ఒక కుమార్తె. ఆయన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, కుమార్తె. కల్వకుంట్ల కవిత లు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనకోసం అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. కుమారుడు కె.తారకరామారావు శాసన సభ్యులుగానూ, కుమార్తె కవిత పార్లమెంటు సభ్యురాలుగా యున్నారు.

(ఇంకా…)

8వ వారం

వేమూరి గగ్గయ్య

వేమూరి గగ్గయ్య (ఆగష్టు 15, 1895 - డిసెంబర్ 30, 1955) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా నటుడు. దుష్టపాత్రలు ధరించేవాళ్లకు ప్రేక్షకాదరణా, ప్రేక్షకారాధనా వుండవన్న అభిప్రాయాన్ని అబద్ధం చేసిన వేమూరి గగ్గయ్య నాటి చిత్రాల మహోజ్జ్వలతార! రౌద్రపాత్రధారణకు మార్గదర్శి. ఈయన 15 ఆగష్టు 1895 తేదీన గుంటూరు జిల్లా వేమూరు లో జన్మించారు. సినిమాలలో రాక ముందు ప్రసిద్ధి చెందిన రంగస్థల నటుడైన గగ్గయ్య క్రూర పాత్రలకు పెట్టింది పేరు. సినిమా నటుడైన తర్వాత, ప్రేక్షకజనం విడిగా గగ్గయ్యని చూడాలని ఉబలాటపడేవారు, వెంటపడేవారు. అంతకు ముందు సినిమాలు చూసి వచ్చినవాళ్లు ఊరికే పేరు చెప్పుకుని ఊరుకునేవారు గాని గగ్గయ్యతో ఊరుకోలేదు. ఒక విధంగా తారారాధన గగ్గయ్యతోనే మొదలైందని చెప్పవచ్చు. ఆయన చిన్నతనంలో సంగీత సాధనతో మొదలైన కళాభిమానం - నటనవైపు తిరిగింది. తానుగా నటనను అభ్యసించి, ధాటిగా పెద్దశ్రుతితో పద్యాలు ఆలపించడంలో దిట్ట అనిపించుకుని సురభివారి నాటకాల్లో పాత్రలు ధరించడంతో నటజీవితం ఆరంభించారు గగ్గయ్య. నాటకాలతో ఊళ్లూ, దేశాలూ తిరిగారు. ఒక్క రంగూన్‌లోనే పదిమాసాలపాటు వుండి నాటకాలు ప్రదర్శించారుట. తర్వాత తెనాలి వచ్చి ఫస్టుకంపెనీ అనే నాటక సంస్థలో చేరి, పాత్రధారణ చేశారు. మైలవరం కంపెనీ మహానందరెడ్డి బృందం గగ్గయ్యగారి నటనాశక్తిని బాగా వినియోగించుకున్నాయి. నాటకాల్లో నటిస్తున్నా సాధన మానలేదు.

(ఇంకా…)

9వ వారం

లినొలిక్ ఆమ్లం

లినొలిక్ ఆమ్లం అనునది నూనెలలో, కొవ్వులలో గ్లిసరైడు/గ్లిజరాయిడ్ రూపంలో లభించు ఒక అసంతృప్త కొవ్వు ఆమ్లం. కొవ్వు ఆమ్లాలను మోనోకార్బోక్సిల్ ఆమ్లమని అని కూడా ఆంటారు. ఎందుకనగా కొవ్వుఆమ్లం యొక్క ఉదజని-కర్బన శృంఖలం/గొలుసులో ఒక చివర మిథైల్ (CH3) ఉండగా, రెండో చివర ఒక కార్బోక్సిల్ ( -C(=O)OH లేదా -COOH) సమూహం మాత్రమే వుండటం వలన మోనో కార్బోక్సిల్ ఆమ్లాలని అంటారు. లొనొలిక్ ఆమ్లం ఒక ఆవశ్యక కొవ్వు ఆమ్లం. లినొలిక్ అనుపదం గ్రీకు పదమైన లినొన్ నుండి పుట్టినది. లినొన్ అనగా జనుము మరియు ఒలిక్ అనగా నూనెలకు కు సంబంధించిన లేదా వాటినుండి ఏర్పడినదని అర్థం. లినొలిక్ ఆమ్లాన్ని 1923 లో ఆవశ్యక మైన పోషక పదార్థంగా గురించి, దానిని విటమిన్ 'ఎఫ్'గా వర్గీకరించారు. తిరిగి 1930 లో దీనిని నూనెలు, కొవ్వుఆమ్లాలలో చేర్చి ముఖ్యమైన మూడు ఆవశ్యక కొవ్వుఆమ్లాలలో ఒకటిగా గుర్తించారు. మిగిలిన రెండు లినొలెనిక్ అమ్లం మరియు అరచిడిక్ ఆమ్లం. లినొలెనిక్ కొవ్వుఆమ్లాన్ని ఒమేగా-3 కొవ్వుఆమ్లమని కూడా పిలుస్తారు. ఈ ఆమ్లం జీవసంశ్లేషణ ద్వారా దేహవ్యవస్థలో ప్రోస్టగ్లాండినులను ఏర్పరచుతుంది మరియు కణపొరల నిర్మాణంలో భాగం వహిస్తుంది. ఇది స్టియరిక్ ఆమ్లం, జీవ ఇంథనం, సబ్బులు మరియు క్రీములు తయారుచేయుటకు ఉపయోగపడుతుంది. జీవ ఇంధనం తయారు చేయవచ్చును.

(ఇంకా…)

10వ వారం

సునీతా కృష్ణన్

సునీతా కృష్ణన్ ఒక ప్రముఖ సంఘసేవకురాలు. ప్రజ్వల అనే సేవాసంస్థ స్థాపించి అందులో ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యభిచార వృత్తిలో కూరుకుపోయిన ఆడపిల్లలను రక్షించి వారిని తిరిగి మంచి జీవితాల్ని ప్రసాదించడం ఈ సంస్థ యొక్క ప్రధానోద్దేశ్యం. 2016 లో ఆమెను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆమె కథ అందించి ఆమె భర్త రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో రూపొందిన నా బంగారు తల్లి అనే సినిమాకి నాలుగు జాతీయ సినిమా పురస్కారాలు లభించాయి. సునీత బెంగుళూరులో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు కేరళ నుంచి వచ్చి బెంగుళూరులో స్థిరపడ్డ రాజు కృష్ణన్, నళిని కృష్ణన్. ఆమె తండ్రి సర్వే ఆఫ్ ఇండియా అనే ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసేవాడు. భారతదేశానికంతా మ్యాపులు గీయడం ఈ సంస్థ కర్తవ్యం. ఆయన ఉద్యోగరీత్యా ఆమె దేశంలో పలు ప్రాంతాలు చూడగలిగింది. ఆమె 8 సంవత్సరాల వయసులోనే మొదటి సారిగా మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు నాట్యం నేర్పడంతో సమాజ సేవ వైపు ఆకర్షితురాలైంది. పన్నెండేళ్ళ వయసొచ్చేసరికి మురికివాడల్లో పాఠశాలలు ప్రారంభించింది. పదిహేనేళ్ళ వయసులో దళితుల పక్షాన ఒక ఉద్యమంలో పాల్గొనడంతో ఆమెను ఎనిమిది మంది దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. ఆ సంఘటనే ఆమెను ప్రస్తుతం చేస్తున్న సేవకు పురిగొల్పింది.
( మార్చి 8 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా)

(ఇంకా…)

11వ వారం

క్షీరారామం

క్షీరారామం ఆంధ్రప్రదేశ్‌లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో ఒకటి. శ్రీరాముడు సీతమ్మ వార్ల స్వహస్తాలతో ప్రతిష్టితమైన ప్రసిద్ధ క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం ఇక్కడే ఉంది. ఇక్కడి మందిరాన్ని చాళుక్యుల కాలంలో, 10 - 11 శతాబ్దులలో, నిర్మించారు. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. దీనికి కొద్ది దూరంలో ఒక చెరువు ఉన్నది గోపుర నిర్మాణసమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తరువాత దాని చుట్టూ మట్టినిపోస్తూ దానిపై రాకపోకలతో రెండవ అంతస్తు నిర్మాణం చేసేవారట ఆవిధంగా మట్టి తీయగా ఏర్పడినదే. ఈ చెరువు (ప్రస్తుతం దీనిని రామగుండం అని పిలుస్తున్నారు). ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తయిన, మరియు చోళ రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇది ఒకటి.పంచారామ క్షేత్రాలలో ఒకటైన క్షీరారామం పార్వతీ సమేతుడై 'శ్రీ రామలింగేశ్వరుడు' వెలసిన పరమ పావనమైన పుణ్య క్షేత్రం. ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్టించబడిన ఈ పుణ్య క్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఆదిశంకరాచార్యులవారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ చక్రం ప్రతిష్ఠించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ క్షేత్రాన్ని క్షీరపురి పాలకొలను, ఉపమన్యుపురం, అనే పేర్లతో కూడా పిలుస్తూ వుంటారు. శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని 'కొప్పు రామలింగేశ్వరుడు' అని కూడా పిలుస్తారు.

(ఇంకా…)

12వ వారం

చౌమహల్లా పాలస్

చౌమహల్లా పాలస్ హైదరాబాదు రాష్ట్రం లోని నిజాం యొక్క నివాసము. ఆసఫ్ జాహి వంశపు పరిపాలనా రాజధాని హైదరాబాదు యందు నిజాం యొక్క నివాస స్థలం. ఈ భవనం బర్కత్ అలీ ఖాన్ ముకర్రం జాహ్ యొక్క ఆస్తిగా పరిగణింప బడుచున్నది.పర్షియన్ భాషలో "చహర్" అనగా నాలుగు, అరబీ భాషలో "మహాలత్" అనగా సౌధాలు (బహువచనం), అలా దీనికి చౌమహల్లా అనే పేరు పెట్టబడినది. ఉన్నత స్థాయి ప్రభుత్వ మరియు రాజరిక కార్యక్రమాలన్నీ ఈ పేలస్ లోనే జరిగేవి. ఈసౌధానికి, యునెస్కో వారిచే సాంస్కృతిక వారసత్వ ప్రదేశ అవార్డును మార్చి 15, 2010 న ప్రదానం చేయబడినది. సలాబత్ జంగ్ దీని నిర్మాణాన్ని 1750 లో ప్రారంభించాడు మరియు ఆసఫ్ జాహ్ 5, ఐదవ నిజాం దీనిని 1857 మరియు 1869 మధ్యలో పూర్తి చేసాడు. ఈ నిర్మాణాన్ని టెహ్రాన్ లోని షాహే ఇరాన్ సౌధం యొక్క నమూనాగా భావిస్తారు. ఈ సౌధం తన విలక్షణమైన నిర్మాణానికి ప్రసిద్ధి. 18వ శతాబ్దంలో ప్రారంభింపబడిన దీని నిర్మాణం పూర్తి గావడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. ఈ కాలంలో నూతన ఒరవడులకు చవిచూసింది. ఈ సౌధంలో రెండు ప్రాంగణాలు వున్నాయి, దక్షిణ ప్రాంగణం మరియు ఉత్తర ప్రాంగణం. వీటిలో సుందర సౌధాలున్నాయి. ఒక ఖిల్వత్ (మహాదర్బారు) మరియు నీటి ఫౌంటెన్ మరియు ఉద్యానవనాలు కలవు.


(ఇంకా…)

13వ వారం

మెండలియెవ్

డిమిట్రి ఇవనోవిఛ్ మెండలియెవ్ (1834 - 1907) రష్యాకు చెందిన రసాయన శాస్త్రవేత్త. మెండలియెవ్ 1834 ఫిబ్రవరి 8న రష్యాలో "వెర్నీ అరెంజ్యాని" అనే గ్రామంలో జన్మించాడు. అధ్యాపక వృత్తిని స్వీకరించి అనేక పరిశోధనలు చేశాడు. ఈ దశలోనే మెండలియెవ్ ప్రిన్సిపిల్స్ ఆఫ్ కెమిస్ట్రీ (1868-1870) అనే రెండు భాగాల పాఠ్య పుస్తకాన్ని వ్రాశాడు. అందులో మూలకాలను వాటి రసాయన గుణాల క్రమంలో వర్గీకరించడానికి ప్రయత్నించాడు. అలా చేసే సమయంలో అతనికి కొన్ని సంఖ్యల తరువాత అవే రసాయన గుణాలు ఆ మూలకాలలో పునరావృతమవుతున్నాయని గమనించాడు. అతని ఆవర్తన పట్టిక తయారీకి అదే నాంది. శాస్త్రజ్ఞునిగా ప్రసిద్ధి చెంది అనేక సత్కారాలు పొదాడు. 1907లో రష్యాలో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో మరణించాడు. అతని స్మృత్యర్ధం 101 పరమాణు సంఖ్య ఉన్న మూలకానికి మెండెలీవియం అని పేరు పెట్టారు. ఇంత పని చేసి రసాయన శాస్త్రం మీద తనదైన ముద్ర వేసిన మెండలియెవ్ కి నోబెల్ బహుమానం ఇవ్వలేదు. కాని మెండలియెవ్ పేరు తెలియని విద్యార్థులు ఉండరేమో! మెండలియెవ్ మార్చి 6, 1869 న రష్యన్ కెమికల్ సొసైటీలో "ద డెపెండెన్స్ బిట్వీన్ ద ప్రోపర్టీస్ ఆఫ్ ద ఆటమిక్ వైట్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్" అనే ఉపన్యాసాన్ని సమర్పించారు. ఇందులో మూలకాలు ద్రవ్యరాశి మరియు "సంయోజకత" అనే గుణాలలో ఒక క్రమ పద్ధతిని ప్రదర్శిస్తున్నాయని చర్చించారు.

(మార్చి 6 1869- మెట్టమొదటిసారిగా ఆవర్తన పట్టికను వెలువరించారు.)

(ఇంకా…)

14వ వారం

ఆనందీబాయి జోషి

ఆనందీ గోపాల్ జోషిలేదా ఆనందీబాయి జోషి (మార్చి 31, 1865 - ఫిబ్రవరి 26, 1887) పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. ఈ గుర్తింపు పొందిన మొదటి హిందూ మహిళ కూడా ఈమే. అమెరికాలో అడుగుపెట్టిన తొలి హిందూ మహిళ కూడా ఈమేనని భావించబడుతున్నది. ఆనందీబాయి పూణే (మహారాష్ట్ర) లోని సనాతన సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈమెకు తల్లితండ్రులు యమున అని పేరు పెట్టారు. 9 సంవత్సరాల వయసులో దాదాపు ఇరవై సంవత్సరాలు పెద్దయిన గోపాల్ రావు జోషిని వివాహం చేసుకుంది. వివాహం తరువాత, ఆమె భర్త ఆమెకు ఆనందీబాయి అని పేరు పెట్టారు. గోపాల్ రావు, కళ్యాణ్ లో తపాలా గుమాస్తాగా పనిచేసేవారు. తరువాత, అతను అలీభాగ్, చివరకు కలకత్తా బదిలీ అయ్యారు. గోపాల్ రావు సామాజిక భావాలు కలిగిన వ్యక్తి. అతను మహిళల విద్యకు మద్దతు పలికారు. విద్య అనేది ఆనాటి బ్రహ్మణుల కుటుంబాలలో సర్వసాధారణంగా ఉండేది. లోఖితవాదీ' యొక్క షట్ పత్రే తో ప్రభావితుడై, సంస్కృతం కంటే ఆంగ్ల భాష నేర్చుకోవడం ముఖ్యమని భావించారు. విద్య పట్ల ఆనందీబాయికి ఉన్న ఆసక్తి గమనించి, ఆంగ్లం నేర్చుకోవడానికి సహాయం చేశారు. 14 సంవత్సరాల వయస్సులో, ఆనందీబాయి ఒక బాలుడికి జన్మనిచ్చింది. అవసరమైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోవడంతో బాలుడు పది రోజుల్లో చనిపోయాడు. ఈ సంఘటన ఆనందీబాయి జీవితంలో ఒక మలుపును తీసుకొచ్చింది. తను వైద్యురాలు కావడానికి ప్రేరణనిచ్చింది.

(ఇంకా…)

15వ వారం

గోలియత్ పక్షి భక్షిణి సాలీడు

గోలియత్ పక్షి భక్షిణి అనే జీవి ఒక రకమైన సాలీడు. ఇది "టారంటులా" కుటుంబానికి, "థెరస్పోసిడె" వర్గానికి చెందినది. ఇది ప్రపంచంలో రెండవ అతి పెద్ద సాలీడు. మొదటి స్థానంలో గలది "రాకాసి వేట సాలీడు". ఇది బరువు లో అతి పెద్ద సాలీడు కావచ్చు. దీనిని "గోలియత్ పక్షి భక్షిణి సాలీడు" అని కూడా పిలుస్తారు. దీనిని 18 వ శతాబ్దంలో "మారియా సైబిలా మెరియన్" అనే వ్యక్తి హమ్మింగ్ బర్డ్ ను తినుచుండగా పరిశీలించి దీనిని "థెరఫోసైడ్స్" "పక్షి భక్షిణి" అని పిలిచాడు. ఇవి ఎక్కువగా అమెరికా అడవుల్లో ఉండే ఈ రాకాసి సాలీళ్ళు. దీని ఒంటి నిండా వెండ్రుకలు ఉంటాయి. ఇవి వాటిని ఎదుటి జీవి పైకి బాణాల్లాగా విసరగలదు. ఆ వెండ్రుకలు గుచ్చుకుంటే ఏ జీవైనా విలవిల్లాడాల్సిందే. ఇది ఎనిమిది కాళ్లనూ విప్పిందంటే 12 అంగుళాల స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఇది అన్ని సాలీళ్లలాగా గూడు కట్టదు. బొరియల్లో జీవించే దీనికి ఎనిమిది కాళ్లతో పాటు ఎనిమిది కళ్లుంటాయి. రెండు కోరలు కూడా ఉంటాయి. ఒక్కొక్కటీ అంగుళం పొడవుంటే ఈ కోరల్లో విషం ఉంటుంది. వీటితో గుచ్చిందంటే ఇక ఆ జీవి కదల్లేదు. ఇవి పాములు, పక్షులు, కప్పలు, తొండల్లాంటి జీవులపై అమాంతం దూకి కోరలతో కాటేస్తాయి. ఆ విషం వల్ల వాటి శరీరంలో కండరాలన్నీ మెత్తగా అయిపోతాయి. అప్పుడు ఆ సారాన్ని ఇది పీల్చేస్తుందన్నమాట. దీనికి ఇంకో విద్య కూడా ఉంది. వెంట్రుకలతో ఉన్న కాళ్లను ఒకదానికి ఒకటి రుద్దిందంటే 'హిస్స్‌స్‌స్‌...' అనే శబ్దం వస్తుంది.

(ఇంకా…)

16వ వారం

రైలు

రైలు అనగా ఒకదాని వెనుక ఒకటి తగిలించబడిన బోగీలతో పట్టాల మీద ప్రయాణిస్తూ, ప్రయాణీకులను లేదా సరుకులను ఒకచోటు నుంచి మరొక చోటకి చేరవేసే ఒక రవాణా సాధనం. దీనిని గ్రాంథిక భాషలో ధూమశకటం అని కూడా అంటారు. ఈ రైళ్ళు పోయే మార్గమును రైలు మార్గము అందురు. మొట్టమొదట ఆవిరి యంత్రాన్ని స్కాట్లాండు దేశానికి చెందిన జేమ్స్ వాట్ అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తూ "గ్లాస్ గో" విశ్వవిద్యాలయంలో 1776 లో కనుగొన్నాడు. దీన్ని ఆధారంగా చేసుకొని అనేక మంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా రైలు ఇంజను, రైలు మార్గములు రూపొందించబడినవి. మొదట్లో దీనిని వస్తువులను చేరవేయడానికి మాత్రమే వాడేవారు. ఆ తర్వాత ప్రయాణీకులను చేరవేయడానికి కూడా ఉపయోగించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి రవాణా సాధనంగా ఇది బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా "బుల్లెట్ రైళ్లు" బాగా వాడుకలో ఉన్నాయి. ఇవి గంటకు 400 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. నునుపైన రాళ్ళను గానీ, కొత్త దూలాలను గానీ సమాంతర పట్టాల లాగ పరిచినపుడు లేదా రోడ్డు తలాన్ని గట్టి పరచినపుడు స్లెడ్జిలూ, బండ్లూ వాటిపై సులభంగా చలించగలవని మానవుడు చాలాకాలం క్రితమే కనుగొన్నాడు. ప్రాచీన గ్రీసు దేశంలో 5,6 అంగుళాల లోతు, 2,3 అంగుళాల వెడల్పు గల గాడీలను 3-5 అడుగుల ఎడం ఉండేటట్లు ఏర్పరచి, మత సంబంధమైన ఉత్సవాల్లో అలంకరించిన బండ్లను ఊరేగించారు.

(ఇంకా…)

17వ వారం

కలివికోడి

కలివికోడి అత్యంత అరుదైన, అంతరించిపోతున్న జీవుల జాబితా లోని పక్షి. 1848 లో జెర్డాన్ ఈ పక్షిని కనుగొన్నాడు. ఇంగ్లీషులో దీన్ని జెర్డాన్స్ కోర్సర్ అని అంటారు. దీని శాస్త్రీయ నామం - రినోప్టిలస్ బైటర్క్వేటస్. భారత ప్రభుత్వపు "అటవీ జంతు సంరక్షణ చట్టం 1972" కింద ఈ పక్షి సంరక్షించబడింది. కలివి పొదలు ముడ్లతో వుండే చిన్న చిన్న గుల్మాలు, వాటి మధ్యలో ఈ కోడిలాంటి పక్షి ఎక్కువగా కనిపిస్తుంది. పరిగెత్తడమే కానీ ఎగరటం సరిగా రాని ఈ కోడిని పొదల్లో తప్పవిడిగా రక్షణ వుండదు. అందుకే అక్కడి పొదల్లో ఎక్కువగా చూడటంతో కలివి కోడి అనిపిలిచారట. దీనివల్ల ఐతన్నలాంటి వారికి ఉద్యోగం వచ్చింది. ప్రకటనల్లో దీన్ని పట్టుకుంటే నజరానాలు అనటంతో కలివిని కలిమి కోడి చేసుకుని పిలుచుకున్నారు. గోదావరి, పెన్నా నదీలోయలలో కనిపించే పక్షి ఇది. దీన్ని స్థానికంగా జత పట్టీల చిటానా అనికూడా పిలుస్తారు. 1900 నుంచి కనుమరుగైన ఈ నిశాచర పక్షి, 1986 జనవరి తొలి వారంలో మళ్ళీ కనిపించింది. దురదృష్టవశాత్తు ఈ పక్షి మృతి చెందిన కారణంగా బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ వారు తొలిసారిగా ఈ పక్షిని మ్యూజియంలో ఉంచారు. అప్పటినుండి, ఈ పక్షి వైఎస్ఆర్ జిల్లా రెడ్డిపల్లి ప్రాంతంలోని చిట్టడవుల్లో కనిపిస్తూనే ఉంది. ఈ ప్రాంతాన్ని లంకమల్లేశ్వర అభయారణ్యం పేరిట కలివికోడి నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది.

(ఇంకా…)

18వ వారం

భోజనం

భోజనం ప్రతి మనిషికీ ఒక ప్రాథమిక అవసరం. ఇది మనం నిర్ధిష్టమైన సమయంలో తీసుకునే ఆహారం.భోజనం సామాన్యంగా ఇంటిలో గాని, హోటల్లలో గాని తీసుకుంటారు. సాధారణంగా భోజనం మధ్యాహ్నం మరియు రాత్రి సమయాలలో తీసుకుంటారు. విందు భోజనాలు మాత్రం పుట్టినరోజు, వివాహం మరియు శలవు దినాలలో తింటాము. ఇందుకోసం అతిథుల్ని, స్నేహితుల్ని పిలిచి పండుగ మాదిరి చేసుకుంటాము.భోజనం ఫలహారం కంటె భిన్నంగా ఉంటుంది. ఇది పరిమాణంలో ఎక్కువగాను వైవిధ్యంగా కడుపు నింపేదిగా ఉంటుంది. వన భోజనాలు అందరు కలిసి బాహ్య ప్రదేశాలలో సామూహికంగా అక్కడే తయారుచేసుకునే విందు భోజనం. దీనికోసం ఉద్యానవనాలు, సముద్ర తీరప్రాంతాలు మొదలైన ప్రకృతి సిద్ధమైన ప్రదేశాలు అనుకూలమైనవి. మనం తినే ఆహారం ఎంత వర్ణరంజితంగా.. రంగురంగులుగా.. ఎంత వైవిధ్య భరితంగా ఉంటే అంత ప్రయోజనకరమని పోషకాహార నిపుణులంతా చెబుతున్నారు. రకరకాల రంగు రంగుల కూరగాయలు, పండ్లతో కూడిన భోజనం కంటికీ, ఒంటికీ కూడా విందు చేస్తుంది. ఈ రంగురంగుల వృక్ష సంబంధ ఆహారంలో- కీలక పోషకాలైన కెరొటినాయిడ్లు, బయోఫ్లావనాయిడ్ల వంటివి ఉంటాయి. టమోటా, పుచ్చకాయ, ద్రాక్ష, అంజీరా వంటి ఎర్రటి పండ్లలో ఉండే లైకోపేన్.. కణాల్లో ఒత్తిడిని తగ్గించే 'యాంటీ ఆక్సిడెంట్'గా పనిచేస్తుంది, రోగనిరోధక శక్తి పెరిగేందుకూ దోహదపడుతుంది.

(ఇంకా…)

19వ వారం
ఊరగాయ
ఊరగాయ దక్షిణ భారతదేశ ఆహార పదార్థం. దీనిని ఆవకాయ అని కూడా అంటారు.అనేక రకాల కాయల నుండి ఈ ఊరగాయలు తయారుచేస్తారు. ఈ ఊరగాయను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. తెలుగువారికి ఆవకాయ గురించి ఉపోద్ఘాతం అవసరంలేదు. వారికి ఇంటింటా సుపరిచితమైన వంట. అమెరికా వెళ్ళే తెలుగువారు చాలామంది తప్పక తీసుకువెళ్ళే పదార్ధం. తింటున్న అన్నానికి వేరువేరు రుచులు కలపడానికి నంజుకునే వంటకాన్ని "ఊరగాయ" అంటారు. ఉదాహరణకు, కొత్తగా తోడుపెట్టిన తియ్యటి పెరుగన్నం తినేటప్పుడు దబ్బకాయ ఊరగాయ నంజుకుంటే పులుపు, కారం, ఉప్పు, కొద్దిగా దబ్బతొక్క చేదు కలిసి జిహ్వకు ఎంతో సుఖం కలిగిస్తుంది. పచ్చడి, పికిలు. ప్రాచీన గ్రంధాలలో ఊరుగాయ అని కూడా ఉంటుంది. పుల్ల పచ్చి మామిడి ముక్కలతో చేసే ఆవకాయ, మాగాయ, లేక దాని కోరుతో చేసే మామిడికోరు ఊరగాయ; నిమ్మ, దబ్బ, ఉసిరి, గోంగూర, చింతకాయ, పండుమిరప, ఉల్లి, వెల్లుల్లి ఊరగాయలూ తరతరాల నుంచీ తెలుగువాళ్ళు వాడుతున్నారు. ఈ మధ్య టమోటా, దోస, కారట్టు, కాలిఫ్లవరు ఊరగాయల్లాంటివి గూడా వాడడం మొదలుపెట్టారు. మామిడికాయలను తడిబట్టతో తుడిచి , ముక్కలు చేసి అందులో జీడి తీసేయాలి. ఒక గిన్నెలో కారంపొడి, ఉప్పు, జీలకర్ర , మెంతిపొడి, పసుపు వేసి ఉండలు లేకుండా బాగా కలియబెట్టాలి.
(ఇంకా…)
20వ వారం

శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానం

శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానం శ్రీకాకుళం నుండి 15 కి.మీ. దూరానగల శ్రీకూర్మం గ్రామంలో ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. భారతదేశంలో ఈ మాదిరిగా కల కూర్మావతారం మందిరం ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. చిత్రంగా ఇక్కడి స్వామి పడమటి ముఖముగా ఉంటారు. మరొక విశేషం ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు గలవు. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. దీనితో పాటు శ్రీరామానుజాచార్యుల, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యుల, కోదండరామస్వామి వారల ఆలయాలు గలవు. శ్రీకాకుళం , గార మండలం లో ఉన్న ఆలయం 2 వ శతాబ్దానికి ముందు నిర్మించినట్లు చాలా మంది నమ్ముతారు. నిజానికి ఆలయము నిర్మించిన వారు ఇప్పటికీ తెలియదు. అయితే, ఈ ఆలయం చోళ మరియు కళింగ రాజా రాజవంశం సమయంలో అభివృద్ధి చేశారు.7 వ శతాబ్దం నుండి ఈ ఆలయం ప్రాముఖ్యత తెలుసునని ఉంది. తరువాత ఈ ప్రాంతాన్నిపాలించిన వివిధ రాజవంశాలు వివిధ దశలలో అభివృద్ధి చేశారు. ఎక్కువగా కళింగ, ఆంధ్ర, చోళుల రాజవంశం పాలనలో చేశారు. దేవాలయ మొత్తం నిర్మాణంలో గాంధర్వ శిల్ప సంపాద అని పిలవబడే స్తంభాలు ఈ రాజవంశాల పేరు మరియు కీర్తిని చాటి చెప్తాయి. గంగరాజ రాజవంశం యొక్క వారసుడు అనంగభీముడు ఆలయం చుట్టూ నేల మరియు పైభాగాన్ని నిర్మించారు.

(మే 21 2016-"కూర్మజయంతి" సందర్భంగా...)

(ఇంకా…)

21వ వారం

తమలపాకు

తమలపాకు లేదా నాగవల్లి భారతదేశంలో విరివిగా ఉపయోగించే తాంబూలంలో ముఖ్యమైన భాగం. ఈ ఎగబ్రాకే మొక్కను తేమగల వేడి ప్రదేశాలలో పెంచుతారు. ఇది పైపరేసికుటుంబానికి చెందినది. బీటిల్, అనే పదం తమిళ పదమైన వెట్టిల నుండి వచ్చినది. ఈ పదం పోర్చుగీసు ద్వారా వచ్చినది. దీనిని పానా ఆకులు అని ఉత్తర భారతదేశంలో పిలుస్తారు. తమలపాకు దక్షిణ మరియు అగ్నేయ ఆసియాలోనూ, పాకిస్తాన్ నుండి న్యూగినియా వరకూ విస్తృతంగా పండిస్తారు. తమలపాకు సంవత్సర వర్షపాతం 750-1500 మి.మీ. కలిగి, 10-40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గలిగిన ప్రాంతాలు అనువైనవి. నీరు ఇంకే సారవంతమైన లేటరైట్ మరియు ఎర్ర గరప నేలలు వీటి సాగుకు అనువైనవి.ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఆధిక దిగుబడిని ఇచ్చే కపూరి రకాలను పండిస్తున్నారు. ఆంధ్ర దేశంలో తుని తమలపాకు సుప్రసిద్ధం. తునికి సమీపంలో ఉన్న సత్యవరం లో ఎన్నో తమలపాకు తోటలు ఉండేవి. ఈ సత్యవరం ఆకులు చిన్నగా, లేతగా (కవటాకులు) మృదువుగా, కొద్దిగా కారంగా ఉండి ఎంతో ప్రాముఖ్యం పొందాయి. కాకినాడ నూర్జహాన్ కిళ్లీలో తుని తమలపాకు లేకపోతే అది నూర్జహాన్ కిళ్లీ కానేకాదు. విజయనగరం ఆకులు కొంచెం పెద్దగా, దళసరిగా, మృదుత్వం తక్కువ కలిగి ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతన మతం హైందవ మతం. హిందూ సంస్కృతి ఏదో రూపంలో ప్రకృతిని పూజించటం. ఆరాధించటానికి ప్రాధాన్యతనిచ్చింది.

(ఇంకా…)

22వ వారం

సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను

సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను ప్రధాన నగరాలతో అనుసంధానించ బడిన ఒక రైల్వే స్టేషను మరియు హైదరాబాదు అర్బన్ ఏరియాలో ఒక కమ్యూటర్ రైల్ హబ్. ఇది హైదరాబాదు నగరంలో ఉన్నది. ఇది భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధి కింద వస్తుంది. 1874 సం.లో హైదరాబాదు రాష్ట్రం యొక్క నిజాం, బ్రిటిష్ కాలంలో నిర్మించిన, ఈ స్టేషన్ 1916 లో కాచిగూడ రైల్వే స్టేషను ప్రారంభమయ్యే వరకు., నిజాం రైల్వే యొక్క ప్రధాన రైల్వే స్టేషనుగా ఉంది. తరువాత దాని ఆపరేషన్ నిజాం రైల్వే జాతీయం చేసినప్పుడు, 1951 సం.లో భారతీయ రైల్వేలు చేపట్టాయి. ప్రధాన మంటపం మరియు సముదాయం (సమూహం) అసఫ్ జహిల తరహా నిర్మాణాన్ని ప్రభావితం చెస్తుంది. స్టేషను భవనం ఒక కోటను పోలి ఉండి మరియు హైదరాబాదు, సికింద్రాబాద్ జంట నగరాల్లో పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా భాసిల్లుతోంది. ఈ స్టేషను భారతదేశం యొక్క అన్ని భూ భాగాలకు రైలు ద్వారా అనుసంధానించబడింది. 190 పైగా రైలు బండ్లు (ట్రైన్లు) దేశవ్యాప్తంగా తమ గమ్యస్థానాలకు రోజువారీ లక్ష మందికి పైగా ప్రయాణీకులను చేరవేస్తూ, స్టేషను వద్దకు, లేదా స్టేషను నుండి బయలుదేరుతాయి. ఇటీవలి సంవత్సరాలలో, రైల్వే సముదాయంలో నిలువు విస్తరణ పై దృష్టి తో, ఒక ప్రపంచ స్థాయి స్టేషను లోకి అప్‌గ్రేడ్‌నకు ప్రతిపాదించింది.

(ఇంకా…)

23వ వారం

సల్ఫ్యూరిక్ ఆమ్లం

సల్ఫ్యూరిక్ ఆమ్లం ఒక బలమైన శక్తి వంతమైన ఖనిజ ఆమ్లం. సల్ఫ్యూరిక్ ఆమ్లం పదార్థాలను క్షయింపచేసే గుణం కల్గిన ఆమ్లం. సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క సంకేత అణుఫార్ములా H2SO4.సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క అణుభారం 98.079 గ్రాములు/మోల్. ఇది కొద్దిగా ఘాటైన వాసన కల్గి ఉన్నది. సల్ఫ్యూరిక్ ఆమ్లం రంగులేకుండా లేదా పసుపు రంగులో ఉండును. మరియు చిక్కనైన ద్రావణం. సల్ఫ్యూరిక్ ఆమ్లం అన్ని గాఢతలలో నీటిలోకరుగును. చారిత్రక పరంగా సల్ఫ్యూరిక్ ఆమ్లంను ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అని పిలిచేవారు. ఆమ్ల గాఢతను బట్టి సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క గుణాలు, ధర్మాలు మారును. సల్ఫ్యూరిక్ ఆమ్లంకు లోహాలను, జీవకణాలను హరించు గుణం, రాళ్ళను కూడా కరగించు లక్షణం ఆమ్లంకున్న బలమైన ఆమ్లగుణం వలన కల్గుతున్నది. అధిక గాఢత కల్గిన ఆమ్లాన్ని తాకడం వలన లేదా మీదపడటం వలన చాలా నష్టం కల్గును, తీవ్రగాయాలు ఏర్పడును. ఆమ్లం జలవిశ్లేషణ ద్వారా రసాయన గాయాలు ఏర్పరచగా, పదార్థాల నిర్జలీ కరణ వలన ఏర్పడు ఉష్ణం వలన రెండవస్థాయిలో తాపగాయాలు/కాల్పుబొబ్బలు ఏర్పడును. కళ్ళలో పడిన శాశ్విత అంధత్వం కల్గును. కడుపులోకి వెళ్ళిన లోపలి అవయవాలు నయంకాని విధంగా పాడైపో వును. అందు వలన ఈ అమ్లంను వాడునపుడు తగిన జాగ్రతలు తీసుకోన వలెను.

(ఇంకా…)

24వ వారం

ఆలప్పుళా

ఆలప్పుళా మధ్య కేరళ లోని ఒక ముఖ్య పట్టణం. ఇదే పేరుతో గల జిల్లాకు జిల్లా కేంద్రం. అల్లెప్పి అని కూడా ఈ పట్టణానికి పేరు ఉంది. ఇది కేరళలో పూర్తి స్థాయిలో ప్రణాళికా బద్ధంగా రూపొందించబడిన పట్టణం. ఇక్కడి లైట్ హౌస్ కూడా ఎంతో ప్రత్యేకమయినది. 2001 జనాభా లెక్కల ప్రకారం ఇది కేరళలో ఆరవ అతిపెద్ద పట్టణం, దీని జనాభా లక్షా డెబ్బైఏడు వేల ఇరవై తొమ్మిది. ఈ పట్టణంలో అందమయిన కాలువలు, ఉప్పుటేఱు, సముద్ర తీర ప్రాంతం, బీచ్, మరియు ఉప్పునీటి సరస్సులు ఉన్నాయి. లార్డ్ కర్జన్ ఈ ప్రాంతాన్ని వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ అని కొనియాడాడు. మలయాళం ఇక్కడి ముఖ్య భాష. హిందీ, ఆంగ్లం మరియు అరవం కూడా విస్తృతంగా మాట్లాడబడతాయి. ఆలెప్పీ భారతదేశంలోని పర్యాటక కేంద్రాల్లో ముఖ్యమయినది. ఇక్కడి ఉప్పుటేరులు ఒక రమణీయ అనుభూతిని కలిగిస్తాయి, ఇవే ఇక్కడి ముఖ్య ఆకర్షణ. హౌస్ బోట్ మరో ఆకర్షణ. కేరళ ఉత్తరాన కుమరకోం మరియు కొచ్చిన్ ను దక్షిణాన ఉన్న క్విలాన్ కి కలిపే కయ్య కు ఆలెప్పీ కేంద్రంగా ఉంది. ప్రతీ సంవత్సరం జరిగే నెహ్రూ ట్రాఫీ బోట్ రేస్ కు ఆలప్పుళా లోని పున్నమాడ చెరువు వేదికవుతుంది. ఈ పడవల పందెం ప్రతీ సంవత్సరం ఆగస్టు రెండో శనివారం జరుగుతుంది. డిసెంబర్ లో పది రోజులపాటూ జరిగే ములక్కల్ చిరప్ కూడా మరో ప్రత్యేక ఆకర్షణ. ఆలెప్పీలో కొబ్బరిపీచు ఉత్పాదనలు ముఖ్యమయిన పరిశ్రమ. కాయిర్ ఇండస్ట్రీ ఆక్ట్, 1955ను అనుసరించి కేంద్ర ప్రభుత్వం కాయిర్ బోర్డ్ ను ఇక్కడ స్థాపించింది. కలవూరులో మరొక కాయిర్ రీసెర్చ్ సంస్థానం ఉంది.

(ఇంకా…)

25వ వారం

ఈము

ఈము (ఆంగ్లం Emu) ఒకరకమైన ఎగురలేని పక్షులు. ఇవి డ్రోమియస్ ప్రజాతికి చెందినవి. ఇది ఆస్ట్రేలియా దేశపు జాతీయ పక్షి. ఇవి ఇసుక తిన్నెలపై లేదా అడవులలో జీవిస్తుంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద పక్షి. ఇవి ఏక సంయోగిక పక్షులు. ఈము పక్షులకు చిన్న తల, పొడుగాటి మెడ, శరీరంపై దట్టంగా ఈకలు ఉంటాయి. ఇవి పొడుగాటి కాళ్ళతో 6 అడుగుల ఎత్తు, 45-50 కి.గ్రా. బరువుంటాయి. ఇవి 25-30 సంవత్సరాలు జీవిస్తాయి మరియు శాకాహారులు. ఇవి చాలా వేగంగా పరుగెత్తగలవు. వీటిని మాంసం, నూనె మరియు చర్మం కోసం మనదేశంలో కూడా పెంచుతున్నారు. ఈము పక్షులు రేటైట్ జాతికి చెందినవి. వీటి మాంసం, గుడ్లు, నూనె, చర్మం, ఈకలు అన్నీ కూడ ఆర్థిక పరమైన విలువ కలిగినవి. ఈ పక్షులు, వివిధ రకాల వాతావరణ శీతోష్ణస్థితులకు త్వరగా అలవాటు పడతాయి. ఎమూ, ఆస్ట్రిచ్ రెండు పక్షులనూ భారతదేశంలో పరిచయం చేసినా, ఎమూ పక్షుల పెంపకానికే ఎక్కువ ప్రాముఖ్యత లభించింది. రేటైట్ జాతికి చెందిన పక్షులకు రెక్కలు పూర్తిగా వృద్ధి చెందవు ఎమూతో పాటు ఆస్ట్రిచ్ (ఉష్ట్ర పక్షి), రియా (అమెరికన్ జాతికి చెందిన ఉష్ట్ర పక్షి) కసోవరి, కివీ పక్షులు, ఈ జాతికి చెందినవి. ప్రపంచంలో చాలచోట్ల, ఎమూ మరియు ఆస్ట్రిచ్ లను వ్యాపారపరంగా, వాటి మాంసం, నూనె, చర్మం మరియు ఈకల కోసం పెంచుతున్నారు. వీటికి, ఆర్థిక పరమైన విలువ చాల ఉంది. ఈ పక్షుల శరీర నిర్మాణం, శారీరక ధర్మాలు, సమశీతోష్ణ మండలి, ఉష్ణమండల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి.

(ఇంకా…)

26వ వారం

ఐరావతేశ్వర దేవాలయం

ఐరావతేశ్వర దేవాలయం ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం పట్టణంలో నెలకొంది. ఇది ద్రావిడ నిర్మాణ శైలి కలిగిన ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ దేవాలయాన్ని 12 వ శతాబ్దంలో రాజరాజ చోళుడు II నిర్మించాడు. ఇది యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తంజావూరులోని బృహదీశ్వర ఆలయం మరియు చోళపురం లోని గంగైకొండ చోళీశ్వర దేవాలయాలతోపాటు గుర్తించబడినది. ఈ దేవాలయాలు చోళుళ నిర్మాణ శైలికి తార్కాణాలు. ఐరావతేశ్వర దేవాలయం ప్రసిద్ధ శివాలయం. ఈ దేవాలయంలోమూలవిరాట్టు మహాశివుడు. ఈ దేవాలయం లోని ప్రధాన దైవాన్ని దేవతల రాజైన ఇంద్రుని యొక్క ఐరావతం పూజించినట్లు పురాన గాథ. పురాణాల ప్రకారం ఐరావతం దాని వాస్తవ రంగు తెలుపును దుర్వాస మహాముని శాపం వల్ల కోల్పోయి ఈ దేవాలయం లో శివుని అర్చించి అచట గల కోనేరులోని నీటిలో స్నానమాచరించినపుడు దాని పూర్వపు రంగును పొందినది. ఈ ఇతిహాసం దేవాలయం లోని అంతర్గత మందిరంలో ఇంద్రుడు ఐరావతంతో కూర్చుని ఉండే చిత్రం ద్వారా తెలుస్తుంది. ఈ గాథ కారణంగా ఈ దేవాలయాన్ని ఐరావతేశ్వరాలయం అని పిలుస్తారు. పురాణాల ప్రకారం నరకాధిపతి యముడు కూడా శివుణ్ణి ఇచట అర్చించినట్లు తెలుస్తుంది. యముడు ఒక మహర్షి శాపం మూలంగా తన శరీరమంతా మంటలతో మండుతున్నట్లు అనిపించి ఆ బాధను పోగొట్టుకొనడానికి ఈ దేవాలయంలో అర్చించినట్లు తెలుస్తుంది.


(ఇంకా…)

27వ వారం

వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం, బలిజిపేట

శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం విజయనగరం జిల్లా, బలిజిపేట లోని ఒక ప్రాచీన దేవాలయం. ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి వారు చిరకాలంగా భక్తుల కోర్కెలను తీర్చుతూ కొలువైయున్నారు.ఈ దేవస్థానం 1869 సంవత్సరంలో బరిగెడ రామస్వామి గారి సుపుత్రులు బరిగెడ చిన్న నరసయ్య గారిచే శుక్ల నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున ప్రతిష్టించబడినది. ప్రతి సంవత్సరం ఈ రోజున ఇక్కడ స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుంది. ఆనాడు చిన్న నరసయ్యగారు ప్రధాన దేవతామూర్తులైన వేంకటేశ్వర స్వామి, ఆండాళ్ మరియు జగన్నాధ స్వామి, బలభద్రుడు మరియు సుభద్ర దేవుల విగ్రహాల ప్రతిష్ట చేశారు.1927 లో వీరి మనుమడైన బరిగెడ నరసయ్య గారు కాశీయాత్ర చేసి గరుడాళ్వార్ విగ్రహ ప్రతిష్ట చేశారు. ఆనాడే ధ్వజ స్తంభాన్ని కూడా రంగూన్ నుండి తెప్పించి స్థాపించారు.1956 లో బరిగెడ నరసయ్య గారి ధర్మపత్ని రావింజమ్మ గారు దేవాలయానికి మొదటిసారిగా విద్యుత్తు కనెక్షన్ ఇప్పించారు. తర్వాత చిన్నవీధిలోని ఒక ముత్తైదువ దానమిచ్చిన ధనసహాయంతో నుయ్యిని తవ్వించి పూలతోటను వేయించారు.1969 లో నరసయ్య గారి ఆధ్వర్యంలొ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆ కాలంలోనే పన్నిద్దరాళ్వారుల ప్రతిష్ట జరిగింది. ఈ విగ్రహాలను విజయవాడ నుండి తెప్పించారు. శ్రీవారి విమానం చుట్టూ దశావతారాల్ని శిల్పులచే చెక్కించారు.

(జూలై 6 2016-"జగన్నాథ రథయాత్ర" సందర్భంగా...)

(ఇంకా…)

28వ వారం

భూఖండ చలనము

భూఖండ చలనము అనగా సముద్ర ఉపరితలము పైన ఉన్న ఖండాల యొక్క పరస్పర కదలిక. అసలు భూఖండాలు కదలి ఉండవచ్చని మొట్టమొదట ఆలోచన వ్యక్తం చేసింది 1596లో అబ్రహం ఓర్టీలియస్ అన్న శాస్త్రవేత్త. ఈ కోన్సెప్ట్ ని సోంతంగా మరియూ పూర్త్రిగా వ్రుధ్ధి చేసింది 1912లో ఏల్ఫ్రెడ్ వేగెనెర్ అన్న వ్యక్తి ఈ భూ ఖండ కదలికల సిధ్ధాంతాన్ని తరువాత ప్లేట్ టెక్టోనిక్స్ అన్న మరొక సిధ్ధాంతం భర్తీ చేసింది. ఈ కొత్త సిధ్ధాంతం పాత దాని మీద ఆధార పడి ఉంటుంది కాని ప్రకృతి యొక్క ఈ ప్రవర్తనని దాని కన్నా బాగా సూచిస్తుంది. అట్లాంటిక్ మహాసముద్రమునకు రెండు వైపుల ఉన్న భూఖండాలు ఒక దాని పక్కన ఒకటి సరిగ్గా పట్టాయని మొట్టమదట ఆబ్రహం ఓర్తెలియుస్ (ఓర్తెలియుస్ 1596), థెయొడొర్ ఖ్రిస్టొఫ్ లిలియెంథల్ (1756), ఎలెగ్సాండర్ వొన్ హంబొల్ద్ట్ (1801 అంద్ 1845), ఆంటోనియొ శ్నిడెర్-ఫెల్లెగ్రిని (శ్నైడెర్-ఫెల్లెగ్రిని 1858) మొదలైన శాస్త్రవేత్తలు కనుగొన్నరు. వీటిలో అతి ముఖ్యంగా ఆఫ్రికా మరియు సౌథ్ అమెరికా ప్రాముఖ్యంగా కనిపిస్తాయి . 1889 లో రాస్తూ ఆల్ఫ్రెడ్ వెల్లేస్ రుస్సెల్ ఇలా అన్నారు : ఆఖరికి జియొలొజిస్ట్స్ కూడా ఏమనుకునేవారంటే ఈ భూమి ఉపరితలం మీద ఉన్న అన్ని గొప్ప లక్షణాలు కూడా మారుతూ ఉంటాయి . అందువల్ల మనకి తెలిసిన కాలంలో అన్ని సముద్రాలూ , ఖండాలూ కూడా ఒక దానితో ఒకటి అనేక మార్లు, మళ్ళి మళ్ళి స్థానాలు మార్చుకునుంటాయి.

(ఇంకా…)

29వ వారం

మండ్య

మండ్య (కన్నడ: ಮಂಡ್ಯ) కర్ణాటక రాష్ట్రములోని నగరము మరియు మండ్య జిల్లా (కన్నడం: ಮಂಡ್ಯ ಜಿಲ್ಲೆ ) యొక్క ప్రధానపట్టణం. మండ్య మైసూరు నుండి 40 కిలోమీటర్లు, బెంగళూరు నుండి వంద కిలోమీటర్లు దూరములో ఉన్నది. ఈ నగరానికి మాండవ్య ఋషి పేరు మీద మాండవ్యనగరంగా పేరు వచ్చింది. అదే కాలక్రమేణా మండ్య అయ్యింది. 2011 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 1,808,680 వీరిలో 16.03% ప్రజలు నగరాలలో నివసిస్తున్నారు. మాండ్య జిల్లాకేంద్రం మాడ్య కారణంగా జిల్లాకు ఈ పేరు వచ్చింది. మాండ్య నగర నామం వెనుక పురాణ కథనం ప్రచారంలో ఉంది. ఇది మాండవ్య ముని నివసించిన ప్రాంతం కనుక నగరానికి ఈ పేరు వచ్చిందని విశ్వసిస్తున్నారు. అయినప్పటికీ పరిశోధకులు, విద్యావంతులు పురాతన శిలాక్షరాలను అనుసరించి మన్- త- య (ಮಂಟಯ) అని పేర్కొన్నారు. ఇది పురాతన కాలం నుండి మానవ నివాసప్రాంతంగా ఉందని విశ్వసిస్తున్నారు. కాలక్రమంలో ఇది మాండ్య అయింది. మాండ్య చరిత్ర మైసూరు రాష్ట్రంతో సమీప బాంధవ్యం ఉంది. మాండ్య మరియు కావేరీ ముఖద్వారం పరిసర ప్రాంతాలను గంగాలు, చోళులు, హొయసలులు తరువాత 1346 లో విజయనగర రాజులు పాలించారు. 1565 యుద్ధం తరువాత క్రిష్ణదేవరాయలు సమఖ్య దక్కన్ నవాబుల చేతిలో ఓడిపోయిన తరువాత విజయనగర సామ్రాజ్యం పతనావస్థకు చేరుకుంది. తరువాత క్రమంగా ఒడయార్లు బలపడసాగారు.

(ఇంకా…)

30వ వారం

దబ్బల రాజగోపాల్ రెడ్డి

దబ్బల రాజగోపాల్ (రాజ్ రెడ్డి) (జననం: 1937 జూన్ 13) ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త మరియు ట్యూరింగ్ అవార్డు గ్రహీత. ఆయన కంప్యూటర్ సైన్సు మరియు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగాలలో ఖ్యాతి గడించాడు. గత 40 సంవత్సరాలుగా స్టాన్‌ఫర్డు మరియు కార్నెగీ మిలన్ విశ్వవిద్యాలయాలలో ఆచార్యుడిగా సేవలందిస్తున్నాడు. రోబోటిక్స్ సంస్థకు డైరక్టరుగా కూడా ఉన్నాడు. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ), హైదరాబాద్ నకు ఛైర్మన్ గా కూడా ఉన్నాడు. అల్ప అదాయ వర్గాల వారు, ప్రతిభావంతులైన యువకుల విద్యావసరాలను తీర్చడానికి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ స్థాపనకు సహాయం చేశాడు. ఆసియా ఖండంలో ACM ట్యూరింగ్ అవార్డు పొందిన మొదటి వ్యక్తి గా గుర్తింపు పొందాడు. ఈ అవార్డు ఆయనకు 1994 లో వచ్చింది. ఈ అవార్డు కంప్యూటర్ విజ్ఞానం నందు ఇచ్చే అత్యున్నత అవార్డు. ఇది ఆయన కృత్రిమ మేథస్సు రంగంలో చేసిన కృషికి ఇవ్వబడినది. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు అభ్యర్థన మేరకు రాష్ట్రంలో ట్రిపుల్‌ ఐటీల ఏర్పాటుకు మార్గదర్శిగా, పాలక మండలి అధ్యక్షుడిగా ఉండటానికి అంగీకరించాడు. విద్యార్థులకు ఐటీలో పరిశోధనలకు సంబంధించిన శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో హైదరాబాద్‌లో తొలి ట్రిపుల్‌ఐటీని ఏర్పాటు చేశాడు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ కు ఛైర్మన్ మరియు ఛాన్సిలర్ గా వ్యవహరించాడు. 1999 నుండి 2001 లో యేర్పాటు చేయబడిన "ప్రెసిడెంట్స్ ఇన్పర్మేషన్ టెక్నాలజీ అడ్వైజరీ కమిటీ" (PITAC) కు సహ ఛైర్మన్ గా ఉన్నాడు.

(ఇంకా…)

31వ వారం

మదురై

మదురై దక్షిణ తమిళనాడులోని ప్రముఖ నగరము. అదే పేరుగల జిల్లాకు కేంద్రము. మదురై ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రము. ఇది వైగై నదీ తీరాన ఉంది. తమిళనాడులో మదురై పెద్దనగరాలలో మూడవ శ్రేణిలో ఉంది. 2001 జనాభా గణాంకాలను ప్రకారం మదురై నగర జనాభా 12,00,000. మదురై ప్రపంచంలోని పురాతనకాల నివాస నగరాలలో ఒకటి. మదురై నగరం మదురై జిల్లా కేంద్రంలో పాండ్యులు ముందుగా కొర్కైని రాజధానిగా చేసుకుని పాలించారు. తరువాత పాండ్యులు నెడుంజళియన్ కాలంలో కూడల్ నగరానికి వారి రాజధానిని మార్చుకున్నారు. ఆ నగరమే ప్రస్తుత రాజధాని. మదుర నాయక మహారాజు చేత నిర్మించబడిన మీనాక్షీ కోవెలకు మదురై ప్రసిద్ధి చెంది ఉంది. ద్రవిడ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్న మదురై మీనాక్షీ ఆలయం భారతీయుల ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి. మదురకు కూడలి నగరం, మల్లెల నగరం, ఆలయనగరం, నిద్రించని నగరం మరియు నాలుగు కూడలుల నగరంగా ప్రసిద్ధి కలిగి ఉంది. భారతదేశంలో పర్యటించిన గ్రీకు దూత మెగస్తనీస్ 3వ శతాబ్దంలో మదురై నగరాన్ని గురించి ప్రస్తావించాడు. మౌర్య చక్రవర్తి ప్రధాన మంత్రి కౌటిల్యుడు ఈ నగర ప్రస్తావన చేసాడు. క్రీ. శ 14వ శతాబ్దం ఆరంభంలో తమిళనాడు మరియు కేరళలోని కొన్ని ప్రాంతాలను పాలించిన పాండ్యరాజుల ఆదర్శపాలన మరియు సాంస్కృతిక కేంద్రంగా మదురై విలసిల్లింది. 1311లో పాండ్య సింహాసనం ఢిల్లీ నవాబుల చేతిలో పతనం చేయబడింది. బాబర్ రాజ్యంలోకి చేరిన ఈ నగరం తరువాత బాబర్ సమ్రాజ్యం పతనావస్థకు చేరిన తరువాత 14వ శతాబ్దంలో స్వతంత్రం పొంది విజయనగర సామ్రాజ్యంలో భాగం అయింది.

(ఇంకా…)

32వ వారం

సర్దార్ గౌతు లచ్చన్న

గౌతు లచ్చన్న (ఆగష్టు 16, 1909 - ఏప్రిల్ 19, 2006) భారతదేశంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి. ఆయన సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలిచ్చిన కితాబే సర్దార్. సర్దార్ గౌతు లచ్చన్న, వి.వి.గిరి, నేతాజి సుభాష్ చంద్రబోస్, జయంతి ధర్మతేజ, మొదలగు అనేకమంది జాతీయ నాయకులతో కలిసి భారత దేశ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని , అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళాడు. ప్రకాశం పంతులు మరియు బెజవాడ గొపాలరెడ్డి మంత్రివర్గంలో, మంత్రి పదవి నిర్వహించిన లచ్చన్న,మధ్యపాన నిషేధం విషయం లో, ప్రకాశం పంతులు తో విభేదించి, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, ప్రకాశం ప్రభుత్వ పతనానికి కారణభూతుడయ్యాడు.చిన్న రాష్ట్రాలు కావాలన్నాడు. తెలంగాణాకొరకు మర్రి చెన్నారెడ్డి తో చేతులు కలిపాడు. తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని, ఔచిత్యాన్ని వివరిస్తూ పుస్తకం వ్రాశాడు. ఇందిరాగాంధి అత్యవసర పరిస్థితి విధించినప్పుడు, వ్యతిరేకించి, స్వేచ్చ కోసం పోరాడాడు. చౌదరి చరణ్ సింగ్, జయప్రకాష్ నారాయణ, మసాని లతో పనిచేశాడు. తెలుగు వారి రాజకీయ జీవనములో స్వాతంత్రానికి ముందు, తరువాత ప్రభావితము చేసిన నాయకుడు లచ్చన్న.కేవలము స్కూల్ విద్యకే పరిమితమైనా, ఆచార్య రంగా ప్రధమ అనుచరుడుగా, తెలుగులో మంచి ఉపన్యాసకుడుగా,రాజాజి ఉపన్యాసాల అనువాదకుడిగా, చరిత్ర ముద్ర వేయించుకున్న బడుగువర్గ పోరాట జీవి లచ్చన్న. సర్దార్ గౌతు లచ్చన్న: ఉత్తర కోస్తా కళింగసీమలో ఉద్దానం ప్రాంతాన (నాటి గంజాం జిల్లా) సోంపేట తాలూకాలో బారువా అనే గ్రామంలో 1909 ఆగష్టు 16 వ తేదీన ఒక సాధారణ బీద గౌడ కుటుంబములో గౌతు చిట్టయ్య, రాజమ్మ దంపతులకు 8 వ సంతానం గా పుట్టాడు. లచ్చన్న తాత.

(ఇంకా…)

33వ వారం

సత్య నాదెళ్ల

సత్యనారాయణ నాదెళ్ల (సత్య నాదేళ్ల) ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా 2014 ఫిబ్రవరి 4 న నియమితులయ్యారు. సత్య నాదెళ్ల హైదరాబాద్‌కి చెందిన ఒక ప్రవాస భారతీయుడు. మైక్రోసాఫ్ట్ కొత్త సీఈవోగా ఇతను నియమితులయ్యే అవకాశముందని వార్తలు రావడంతో ఇతని పేరు వెలుగులోకి వచ్చింది. 2014 ఫిబ్రవరి 4న మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులయ్యారు. అంతకుముందు ఆయన మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈవో బామర్ 2015లోగా రిటైర్ కావాలనుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వారసుడి అన్వేషణ అనివార్యమైంది. 1976 నుండి సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత మూడవ సిఇఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టాడు. ఇటుంటి గొప్ప అవకాశం భారతీయులకు, అందులోనూ తెలుగువాళ్లకు లభించడం గర్వించదగిన విషయం. సీఈఓ ఎంపిక కోసం సంస్థ ఐదు నెలల పాటు కసరత్తు చేసి సత్యను ఎంపిక చేసింది. ఈ సంస్థ సీఈఓగా స్టీవ్ బామర్ సుదీర్ఘ కాలం పని చేశారు. వీరిది అనంతపురం జిల్లా, ఎల్లనూరు మండలం, బుక్కాపురం గ్రామము.ఆయన తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ ... 1962 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. రాష్ట్రంలో మంచి అధికారిగా పేరుతెచ్చుకున్నారు.2004 నుంచి 2009 వరకు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యునిగా.. ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేశారు. నాదెళ్ల యుగంధర్ నాయుడు ఐఏఎస్‌కు ఎంపికైన తర్వాత కుటుంబాన్ని హైదరాబాద్‌కు మార్చారు.

(ఇంకా…)

34వ వారం

నాలుగు ప్రాథమిక బలాలు

నాలుగు ప్రాథమిక బలాలు ప్రకృతిలో ఉన్నాయని ఆధునిక భౌతిక శాస్త్రం చెబుతోంది. భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ అతనికి సహస్ర నామాలు ఎలా ఉన్నాయో అలాగే విశ్వావిర్భవానికి మూలకారణమైన ఆదిశక్తి ఒక్కటే అయినప్పటికీ అది ఈ నాడు మనకి నాలుగు వివిధ బలాలుగా ద్యోతకమవుతున్నదని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. ఈ నాలుగు ప్రాథమిక బలాల పేర్లు గురుత్వాకర్షణ బలం, విద్యుదయస్కాంత బలం, బృహత్ సంకర్షక బలం మరియు లఘు సంకర్షక బలం. పదిహేడో శతాబ్దంలోనే న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని లేవదీశాడు. గురుత్వాకర్షణ బలం విశ్వవ్యాప్తంగా ఉన్న బలం అని న్యూటన్ సూత్రీకరించేడు. న్యూటన్ ఈ గురుత్వాకర్షణ బలం యొక్క లక్షణాలని సూత్రబద్ధం చెయ్యటమే కాకుండా ఈ సూత్రాలు విశ్వవ్యాప్తంగా అమలులో ఉంటాయని ఉద్ఘాటించేడు. న్యూటన్ విశ్వంలో ఉన్న ఏ రెండు వస్తువులైనా ఎంత బలంతో ఆకర్షించుకుంటాయో లెక్క కట్టటానికి ఒక సూత్రం ఇచ్చేడు తప్ప ఆ రెండు వస్తువులు ఎందుకు, ఎలా ఆకర్షించుకుంటాయో చెప్పలేదు. అదేదో దైవ దత్తమైన లక్షణంలా ఒదిలేసేడు. అయిన్‌స్టయిన్ వచ్చి ఈ వెలితిని పూరించేడు. ఒక స్థలకాల సమవాయంలో గరిమ ఉన్న ఒక వస్తువుని ప్రవేశపెట్టినప్పుడు, తలగడ మీద బుర్ర పెట్టినప్పుడు తలగడ లొత్త పడ్డట్లు ఆ స్థలకాల సమవాయం లొత్త పడుతుందనిన్నీ, ఆ లొత్త చుట్టుపట్ల ఉన్న చిన్న చిన్న వస్తువులు ఆ లొత్త లోకి దొర్లినప్పుడు పెద్ద గరిమ గల వస్తువు చిన్న గరిమ గల వస్తువుని ఆకర్షించినట్లు మనకి భ్రాంతి కలుగుతుందనిన్నీ అయిన్‌స్టయిన్ చెప్పేరు. దీనినే సాధారణ సాపేక్ష సిద్ధాంతం అంటారు.


(ఇంకా…)

35వ వారం
విఠోబా

విఠోబా లేదా విఠలుడు లేదా పాండురంగడు మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్, మరియు తెలంగాణా రాష్ట్రాల్లో ఎక్కువగా ఆరాధించే ఒక హిందూ దేవుడు. ఈయన విష్ణువు లేదా ఆయన అవతారమైన శ్రీకృష్ణుని యొక్క అంశగా భావిస్తారు. విఠోబాను సాధారణంగా చేతులు వెనక్కు కట్టుకుని నిల్చుని ఉన్న నల్లటి యువకుడిగా చిత్రీకరిస్తారు. చాలా ప్రతిమల్లో రుక్మిణి కూడా తోడుగా ఉంటుంది. మహారాష్ట్రలోని వార్కరీ, కర్ణాటకలోని హరిదాసు లాంటి ఏకేశ్వరోపాసనా సాంప్రదాయాలలో విఠోబా ప్రధాన దైవం. పండరీపురము లోని విఠల దేవాలయం ప్రధాన దేవాలయం. విఠోబా గురించిన కథలన్నీ ఆయన భక్తుడు పుండరీకుడి చుట్టూ తిరుగుతాయి. ఈ పుండరీకుడే విఠోబాను పండరీపురమునకు రప్పించాడని భక్తుల విశ్వాసం. మరి కొన్ని కథలు ఆయన భక్తకవులను ఎలా కరుణించాడనే సంఘటనలమీద ఉంటాయి. ఈ వార్కరీ సాంప్రదాయానికి చెందిన వాగ్గేయకారుడు మరాఠీ భాష లో విఠోబా దేవునిపై "అభంగాలు" అనే దివ్య సంకీర్తనలు రచించారు. కన్నడదేశంలోని హరిదాసు సాంప్రదాయంలో స్తోత్రాలు, మరాఠీ లోని హారతి పాటలు విఠోబా సాహిత్యంలో చెప్పుకోదగ్గవి. చాంద్రమానం ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే శాయనీ ఏకాదశి, కార్తీకమాసములో వచ్చే ప్రబోధిని ఏకాదశిలో విఠోబాకు విశేష పూజలు జరుగుతాయి. విఠోబా పేరు మీద, చరిత్రమీద అనేక వాదోపవాదాలు ఇప్పటికీ జరుగుతున్నాయి.

(ఇంకా…)

36వ వారం
యలవర్తి నాయుడమ్మ

యలవర్తి నాయుడమ్మ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రసాయన శాస్త్రవేత్త. చర్మ పరిశోధనలలో విశేష కృషి చేసిన మేధావి. గుంటూరు జిల్లా యలవర్రు గ్రామములో ఒక వ్యవసాయ కుటుంబములో సెప్టెంబరు 10, 1922 న జన్మించాడు. గ్రామ పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసించిన పిమ్మట గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. 1943 లో కాశీ హిందూ విశ్వవిద్యాలయములో రసాయన టెక్నాలజిలో ఉన్నతవిద్యనభ్యసించి మద్రాసు చర్మ టెక్నాలజీ సంస్థలో ప్రత్యేక విద్య గరపి అదే సంస్థలో అంచెలంచెలుగా ఎదిగి డైరెక్టరు అయ్యాడు. 1958 నుండి 1971 వరకు సుదీర్ఘకాలము డైరెక్టరుగా ఉన్నాడు. తన ఆధ్వర్యములో చర్మపరిశోధనా సంస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాడు. అమెరికా లోని లీ హై యూనివర్సిటీ లో అంతర్జాతీయ చర్మ శుద్ధి అంశం మీద డాక్టరేట్ (పి.హె.డి) డిగ్రీ పొందారు. అమెరికా లోని చర్మ పరిశుభ్రం చెసే పరిశ్రమలో అఖండ పరిశోధనలు చేసి, అధ్భుత విజయాలను సాధించారు. 1943-45 నడుమ కాలంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ(మద్రాసు) లో శాస్త్రవేత్తగా చేసిన పరిశోధనలు మేళవించగా, అమెరికా లో చేసిన పరిశోధనా కృషి ఫలవంతమైనది. తిరిగి మాతృదేశానికి వచ్చి, 1951 లో సెంట్రల్ లెదర్ రీసెర్చ్ యూనివర్సిటీ లో శాస్త్రవేత్తగా చేరారు. ఎన్నో నూతన లాభదాయక ప్రణాళికలను రూపొందించి చర్మకార పరిశ్రమను అభివృద్ధి చేశారు. కేంద్ర చర్మ పరిశోధనా సంస్థనూ సాటిలేని పరిశోధనా సంస్థగా రూపొందించారు. 1956 లో డైరక్టర్ గా పదోన్నతి పొందారు. "సామాన్య మానవుని కోనం విజ్ఞాన శాస్త్రం" అనే ఉత్తమ సదాశయాన్ని ఆచరణలోకి తెచ్చిన ఉదాత్తుడైన నాయుడమ్మ గొప్ప వైజ్ఞానికుడు, విద్యావేత్త, చదువులు ముగించుకొని ఉద్యోగాలలో ప్రవేశించిన తర్వాత కాస్త మంచి జీతమే వస్తుందనుకోగానే సంవత్సరములో ఒక నెలజీతం అందుబాటులో ఉన్న పేద విద్యార్థులకు కేటాయించారు.

(ఇంకా…)

37వ వారం

పెరుగు శివారెడ్డి

పెరుగు శివారెడ్డి (సెప్టెంబర్ 12, 1920 - సెప్టెంబర్ 6, 2005) ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. పెరుగు శివారెడ్డి కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడు గ్రామంలో 1920 , సెప్టెంబరు 12 న జన్మించారు. ఈయన తండ్రిపేరు పి.హెచ్.రెడ్డి. ఆయన 1946లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.బి.యస్. (డాక్టరు) పట్టాని పొంది 1952లో నేత్రవైద్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.యస్. పట్టాని స్వీకరించారు. ప్రారంభ ఉద్యోగం మద్రాసు మెడికల్ సర్వీసెస్ లో అసిస్టెంట్ సర్జన్ (1949-53) ఆంధ్ర మెడికల్ కాలేజి, కె.జి (కింగ్ జార్జి) హాస్పిటల్, విశాఖ పట్టణంలో ఆఫ్తాల్మోలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అసిస్టెంట్ సర్జన్ గా (1953-56) పనిచేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ, హైదరాబాద్ (1958 - 61) సరోజినీ ఐ హాస్పటల్ ఆహ్వానం మీద అక్కడ సూపరిండెంట్ గా, అఫ్తాల్మాలజీ ప్రొఫెసర్ గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. 1961-75 తర్వాతి కాలంలో రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో చేరారు. అప్తాల్మాలజీ డైరక్టరుగా (1978-81) పోస్టు గ్రాడ్యుయేషన్ స్టడీస్ కు ప్రొఫెసరుగా (1975 - 78) వ్యవహరించారు. రాష్ట్రంలో అనేక గ్రామాలలో కాటరాక్ట్ సమస్యలతో బాధపడేవారున్నారని గ్రహించారు. ఈ రోజున ఉన్న విధంగా అన్ని ఊళ్లలో కంటి వైద్యులు అందుబాటులో లేరు. కంటివైద్యం చాలా సమస్యాత్మకంగా ఉండేది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కంటి చూపే పోతుందని సమస్యలను అవగాహన చేసుకొని ఊరూరా క్యాంపులు నిర్వహించి ప్రజలను ఎడ్యుకేట్ చేశారు. ఆపరేషన్లు నిర్వహించారు. మన దేశంలో ఈ తరహాగా ఐ క్యాంఫులు, నిర్వహించడం తొలిసారి. దాదాపు 500 క్యాంపులు, మూడు లక్షల కాటరేక్ట్ ఆపరేషన్లు చేశారు. సొంత డబ్బు చాలా ఖర్చు చేశారు.

(ఇంకా…)

38వ వారం

నీలిమందు

నీలిమందు ఒక రంజనం లేదా అద్దకపు రంగు. నీలిమందుని మొదట్లో ఒక జాతి మొక్కలనుండి తయారు చేసేవారు. సంధాన రసాయనం బాగా పుంజుకున్న తరువాత దీనిని కృత్రిమంగా తయారు చెయ్యటం మొదలు పెట్టేరు. నీలిమందుకి భారతదేశానికీ చాలా గట్టి లంకె ఉంది. సింధు నాగరికత రోజులనుండి వృక్షసంపద నుండి రంగులు తీసి వాడటం భారతీయులకి తెలుసు. హరప్పా దగ్గర దొరకిన ఒక వెండి పాత్ర చుట్టూ చుట్టబెట్టిన అద్దకపు బట్టే దీనికి నిదర్శనం. అజంతా గుహలలో ఉన్న చిత్రాలలో మొక్కలనుండి తీసిన రంగులు కనిపిస్తున్నాయి. కౌటిల్యుడి అర్థశాస్త్రం లో రంగుల ప్రస్తావన ఉంది. రంజనాలు మొక్కల నుండి తయారు చెయ్యటమే కాకుండా వాటిని బట్టలకి అద్దటంలో ఉన్న సాంకేతిక సూక్ష్మాలని కూడ కనిపెట్టేరు భారతీయులు. ఎనిమిదవ శతాబ్దం నాటికే మధ్య ఆసియాలోనూ, ఈజిప్ట్ లోనూ భారతదేశంలో చేసిన అద్దకం బట్టలు మంచి ప్రాచుర్యంలో ఉండేవి. పదమూడవ శతాబ్దంలో ఇండియా వచ్చిన మార్కోపోలో ఇండియాలో నీలిమందు వాడకం గురించి ప్రస్తావించేడు. అప్పటికి గ్రీకు దేశంలోనూ, రోములోనూ ఈ నీలిరంగు రంజనం వాడకంలో లేకపోలేదు. కాని ఈ రంగుకి 'ఇండిగో' అన్న పేరు రావటానికి మార్కోపోలో ఇండియాలో ఈ రంగుని చూడటమే అని అభిజ్ఞవర్గాల నమ్మకం. గ్రీకు భాషలో "ఇండికాన్" అన్నా లేటిన్ భాషలో "ఇండికమ్" అన్నా "ఇండియా నుండి వచ్చినది" అనే అర్థం.

(ఇంకా…)

39వ వారం

కన్ఫ్యూషియస్

కన్‌ఫ్యూషియస్ (సెప్టెంబరు 28, క్రీ.పూ 551 – క్రీ.పూ. 479) చైనా కు చెందిన శోధకుడు, మరియు సామాజిక తూర్పు దేశాల తత్వవేత్త. ఇతని బోధనలు మరియు తత్వము అనేకానేక దేశాల ప్రజలపై తన లోతైన ప్రభావాన్ని చూపగలిగింది. ఉదాహరణకు చైనీస్, కొరియన్, జపనీస్, తైవానీస్ మరియు వియత్నామీస్ ఆలోచనలు, తత్వము మరియు జీవితం. ఇతడి తత్వము, ప్రభుత్వ-నీతి పై, సామాజిక-సంబంధాలపై, న్యాయంపై, మరియు ప్రామాణికతపై తన ప్రభావంచే నొక్కివక్కాణించగలిగినది. ఈ నియమాలు చైనాలో అమితంగా ఆదరణ పొందాయి. ఇతర తత్వాలు దాదాపు మరచిపోయేంత ప్రభావం చూపగలిగింది, ఉదా: హాన్ సామ్రాజ్యం నాటి చైనీయుల న్యాయవాదం లేదా టావోయిజం (206 క్రీ.పూ. – 220 క్రీ.శ.). కన్‌ఫ్యూషియస్ ఆలోచనలు ఆతరువాతి కాలంలో అభివృద్ధి చెంది కన్‌ఫ్యూషియానిజం అనే కొత్త తత్వానికి ఊపిరిపోసాయి. ఈ తత్వము యూరప్ కు జెసూట్ సంఘం మాట్టియో రిక్కీ చే మొదటిసారిగా పరిచయం గావింపబడినది, దీని లాటిన్ నామం "కన్‌ఫ్యూషియస్". ఇతని బోధనలు అనలెక్‌ట్స్ ఆఫ్ కన్ఫ్యూషియస్ లో కానవస్తాయి. ఈ బోధనలన్నీ కన్‌ఫ్యూషియస్ మరణించిన తరువాత క్రోడీకరించబడ్డాయి. నవీన చరిత్రకారులు ఈ క్రోడీకరణలను అంగీకరించడంలేదు. ఈ బోధనలు, కన్‌ఫ్యూషియస్ చేతి దస్తూరీ కాదని వీరి వాదన. కానీ దాదాపు 2,000 యేండ్ల తరువాత, ఐదు క్లాసిక్‌లు ఇతడి రచనలు లేదా వీటికి ఇతను సంపాదకుడు, అవి క్లాసిక్ ఆఫ్ రైట్స్ (సంపాదకుడు), మరియు స్ప్రింగ్ అండ్ ఆటమ్న్ ఆన్నల్స్ (రచయిత) మొదలగునవి అని విశ్వసిస్తున్నారు.


(ఇంకా…)

40వ వారం

పాలాసియో డి సాల్

పాలాసియో డి సాల్‌ (స్పానిష్ భాషలో "పాలెస్ ఆఫ్ సాల్ట్") అనే హోటల్ ఉప్పు దిమ్మలతో కట్టబడినది. ఇది ప్రపంచం లో అతి పెద్ద ఉప్పు క్షేత్రం అయిన సలార్ డి ఉయుని వద్ద కలదు. ఇది 10582 చ.కి.మీ. వైశాల్యం గలది. ఇది బొలీవియా దేశ ముఖ్య పట్టణం "లా పాజ్" కు దక్షిణంగా 350 కి.మీ. దూరంలో ఉన్నది. ప్రపంచంలో అతి పెద్ద ఉప్పు క్షేత్రం గా ప్రసిద్ధి పొందిన ప్రాంతం సలార్ డి ఉయుమి. ఇది బొలీవియా వాయువ్య ప్రాంతంలో పొటోసి మరియు ఓరుడి సంస్థ వద్ద ఉన్నది. ఇది "ఆండీస్" పర్వత శిఖరం నుండి 3656 మీ. ఎత్తులో గలదు. ఈ హోటల్ ఒక పర్యాటక ప్రదేశం. ఇది ఎందరోపర్యాటకులను ఆకర్షించే హోటల్. అనేక ప్రాంతములనుండి ఈ హోటల్ లో విశ్రాంతి కోసం అనేక మంది వస్తుంటారు. బొలివియా దేశంలోని ఉయుని పట్టణం దగ్గర ఈ 'లవణ మందిరం' ఉంది. విశాలమైన 12 గదులు, మంచాలు, కుర్చీలు, ఇతర వస్తుసామగ్రి మొత్తాన్ని ఉప్పుతోనే చేశారు. దీని పేరు 'పాలాసియో డి సాల్‌'. అంటే స్పానిష్‌ భాషలో ఉప్పు ప్యాలెస్‌ అని అర్థం. దీని నిర్మాణానికి 15 అంగుళాల ఉప్పు ఘనాలను ఏకంగా 10 లక్షలు తయారు చేసి వాటితో కట్టారు. ఇందులో అలంకరణ కోసం పెట్టిన శిల్పాలు, కళాఖండాలు కూడా ఉప్పుతో మలిచినవే. ఇందులోని ఈతకొలనులో ఉప్పు నీరే ఉంటుంది. హోటల్‌ బయట గోల్ఫ్‌ కోర్స్‌ కూడా ఉప్పు మయమే.

(ఇంకా…)

41వ వారం

మాడపాటి హనుమంతరావు

మాడపాటి హనుమంతరావు ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు రచయిత. హనుమంతరావు 20వ శతాబ్ది తొలిదశకంలో హైదరాబాద్ రాజ్యంలోని తెలుగు ప్రాంతాల్లో(నేటి తెలంగాణ) ఆంధ్రోద్యమం వ్యాప్తిచేసేందుకు కృషిచేశారు. ఆయన చేసిన కృషికి గాను ఆంధ్ర పితామహుడు అన్న పేరును పొందారు. న్యాయవాద వృత్తిని చేపట్టిన మాడపాటి విజయవంతమైన లాయరుగా పేరుపొందారు. తీరిక సమయాలన్నిటా ఆంధ్రోద్యమానికి, తెలంగాణాలో గ్రంథాలయాల అభివృద్ధికి కేటాయించేవారు. ఆంధ్రజనసంఘం, ఆంధ్రమహాసభ వంటి ప్రజాసంఘాల స్థాపనలోనూ, వాటి నిర్వహణలోనూ కీలకపాత్ర వహించారు.తర్వాతి తరం ప్రజానాయకులు వీరిని మితవాదిగా గుర్తించారు. ఆయన ప్రజాహితరంగంలో, సాంస్కృతిక చైతన్యం కలిగించడంలో ఎంతో కృషిచేసినా చాలా కాలం వరకూ క్రియాశీలకమైన రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. 1952లో శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు. హైదరాబాద్ నగరానికి తొలి మేయరు పదివిని అధిష్టించారు. మాడపాటివారు మంచి కవి, రచయిత. మాడపాటి మొత్తం పదమూడు కథలు రాశారు. వీటిలో హృదయశల్యం, రాణీసారందా, ముసలిదాని ఉసురు, నేనే, అగ్ని గుండం, నాడు నీ పంతం, నేడు నా పంతం, ఆత్మార్పణం, తప్పు , ఎవరికి, విధి ప్రేరణం అనే కథలు 'మల్లికాగుచ్చం' పేరుతో 1911 లో పుస్తక రూపం దాల్చాయి. మాడపాటికి రచయితగా శాశ్వత కీర్తిని అందించిన గ్రంథం 'తెలంగాణా ఆంధ్రోద్యమం'.

(ఇంకా…)

42వ వారం

జలుబు

జలుబు లేదా పడిసం లేదా రొంప శ్వాసనాళం యొక్క పైభాగంలో వైరస్ దాడి చేయడం వల్ల కలిగే జబ్బు. ఇది ప్రధానంగా ముక్కు, గొంతు, స్వరపేటికలను ప్రభావితం చేస్తుంది. వైరస్ సోకిన రెండు రోజుల లోపే దీని ప్రభావం మొదలవుతుంది. దీని లక్షణాలు కళ్ళు ఎరుపెక్కడం, తుమ్ములు, దగ్గు, గొంతు రాపు, ముక్కు కారడం, శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండటం (ముక్కు దిబ్బడ), తలనొప్పి, మరియు జ్వరము. ఇవి సాధారణంగా ఏడు నుంచి పది రోజులలో తగ్గిపోతాయి, కొన్ని లక్షణాలు మూడు వారాల వరకు ఉండిపోతాయి. ఇది మిగతా ఆరోగ్య సమస్యలతో కలిసి న్యుమోనియాగా మార్పు చెందే అవకాశం కూడా ఉంది.

జలుబు 200 లకు పైగా వైరస్‌ ల వల్ల రావచ్చు. వీటిలో రైనోవైరస్‌లు అత్యంత సాధారణమైనవి. వాతావరణంలో ఉండే ఈ వైరస్ దేహంలోకి ప్రవేశించినపుడు, జలుబుతో బాధపడుతున్న వ్యక్తి ఉపయోగించిన తువ్వాళ్ళు, చేతి రుమాలు వంటివి వాడటం వల్ల జలుబు వ్యాపిస్తుంది. పిల్లలు బడికి వెళ్ళినపుడు, సరిగా నిద్రపోనప్పుడు, మానసిక ఒత్తిడి లాంటి పరిస్థితుల్లో ఇది సులభంగా వ్యాపిస్తుంది. జలుబు లక్షణాలు వైరస్ లు కణజాలాన్ని నాశనం చేయడం వల్ల కాకుండా శరీరంలోని వ్యాధినిరోధక వ్యవస్థ ఆ వైరస్ లను ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నం వల్లనే కలుగుతాయి. ఇన్ ఫ్లూయెంజా వచ్చిన వ్యక్తులు కూడా ఇలాంటి లక్షణాలే కనబరుస్తారు కానీ ఇంతకన్నా ఎక్కువగా ఉంటాయి.

(ఇంకా…)

43వ వారం
గుండు సుదర్శన్

డాక్టర్ గుండు సుదర్శన్ (సూరంపూడి సుదర్శన్) ఒక ప్రముఖ హాస్య నటుడు, రచయిత. సుమారు 350 పైగా సినిమాలలో నటించాడు. పది సంవత్సరాల వయసు నుండే నాటకాలలో నటించిన అనుభవం ఉంది. 1993 లో బాపు దర్శకత్వంలో వచ్చిన మిష్టర్ పెళ్ళాం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆయన సివిల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ, హైదరాబాదులోని జె.ఎన్.టి విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్.డీ చేశాడు. మనస్తత్వ శాస్త్రంలో కూడా పట్టా సంపాదించాడు. సినిమాలలో పూర్తి స్థాయి నటుడు కాక మునుపు తన స్వస్థలమైన భీమవరం లోని ఎస్.ఆర్.కె.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేశాడు. నటన పై మక్కువతో తెలుగు సినిమాలలో హాస్యనటుడిగా రాణిస్తున్నాడు. ఖాళీ సమయాలలో విద్యార్థులకు, ఉద్యోగులకు స్ఫూర్తి దాయక ఉపన్యాసాలు ఇస్తుంటాడు. ఆయన పుట్టి పెరిగింది అంతా భీమవరంలోనే. తల్లిదండ్రులు సుబ్బారావు, కనకలత. తండ్రి సుబ్బారావు న్యాయవాదిగా పనిచేసేవాడు. ఆయనకు చిన్నప్పటి నుంచి ఊర్లో జరిగే పౌరాణిక నాటకాలు అన్నీ చూసే అలవాటు ఉండేది. ఏడో తరగతి దాకా తాతగారి ఊరైన మంచిలి లో చదివాడు. పదేళ్ళ వయసు నుంచి నాటకాల్లో నటించడం ప్రారంభించాడు.

(ఇంకా…)

44వ వారం

మంచుమనిషి
మంచుమనిషి అనునది సామాన్యశక పూర్వం 3,359 - 3105 సంవత్సరాల మధ్య నివసించిన పురుషుని యొక్క మమ్మీ. ఇది ప్రకృతి సహజంగా తయారైన మమ్మీ. ఈట్జల్ ఆల్ప్స్ పర్వతాల్లో లభించింది కాబట్టి ఈ మమ్మీని ఈట్జి అని కూడా పిలుస్తున్నారు. ఈ వ్యక్తి సా.పూ 3239 - 3105 సంవత్సరాల మధ్య మరణించి ఉండేందుకు 66 శాతం అవకాశాలున్నాయి. 1991 సెప్టెంబరులో, ఈట్జల్ ఆల్ప్స్ పర్వతాల్లో, ఆస్ట్రియా, ఇటలీల సరిహద్దు వద్ద ఈ మమ్మీని కనుగొన్నారు. ఇది ఐరోపాకు చెందిన, అత్యంత పురాతన, ప్రకృతిసహజ మమ్మీ. రాగియుగపు యూరపియన్ల గురించి పరిశోధకులకు అంతకుముందు తెలియని సమాచారం ఈ మమ్మీ ద్వారా లభించింది. అతడి దేహాన్ని, వస్తువులనూ ఇటలీ, దక్షిణ టైరోల్ లోని పురావస్తు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు. 1991 సెప్టెంబరు 19 న ఆల్ప్స్ పర్వతాల్లో 3,210 మీటర్ల ఎత్తున ఇద్దరు జర్మను యాత్రికులు హెల్ముట్ సైమన్, ఎరికా సైమన్‌లకు ఈట్జి కనబడింది. వారు ఈ మమ్మీని చూసినపుడు, అది ఇటీవలే మరణించిన పర్వతారోహకు డెవరిదైనా శవమై ఉంటుందని భావించారు. మరుసటి రోజున ఒక పర్వత ప్రాంత పోలీసు, సమీపంలోని పర్వత విడిది కీపరు ఒకతనూ కలిసి, నడుం దాకా మంచులో దిగబడి ఉన్న ఆ దేహాన్ని వెలికి తీయడానికి ప్రయత్నించారు. కానీ వాతావరణం అనుకూలించక మధ్యలోనే ఆపేసారు.

(ఇంకా…)

45వ వారం

ఆపరేషన్ ఎంటెబ్బె

ఎంటెబ్బె ఆపరేషన్ ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) విజయవంతంగా జరిపిన ఉగ్రవాద వ్యతిరేక చర్య. ఈ ఆపరేషన్ 1976 జూలై 4 న ఉగాండా లోని ఎంటెబ్బె విమానాశ్రయంలో జరిగింది. అంతకు ఒక వారం ముందు జూన్ 27న, ఎయిర్ ఫ్రాన్స్‌కు చెందిన విమానాన్ని పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్టైన్ - ఎక్స్‌టర్నల్ ఆపరేషన్స్ (PFLP-EO) అనే సంస్థకు చెందిన ఇద్దరు సభ్యులు వాదీ హద్దాద్ ఆదేశానుసారం, జర్మన్ రివల్యూషనరీ సెల్స్ కు చెందిన ఇద్దరు సభ్యులతో కలిసి హైజాక్ చేసారు. 240 మంది ప్రయాణీకులను బందీలుగా పట్టుకున్నారు. బందీల విడుదల జరగాలంటే ఇజ్రాయిల్ జైళ్ళలో ఉన్న పాలస్తీనా మరియు సంబంధిత ఉగ్రవాదులు 40 మందిని, మరి నాలుగు ఇతర దేశాల్లో ఖైదీలుగా ఉన్న 13 మంది ఉగ్రవాదులనూ విడిపించాలని షరతు విధించారు. ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్ లో బయల్దేరి పారిస్ వెళ్ళవలసిన విమానం, దారిలో ఏథెన్స్ లో ఆగి, తిరిగి బయల్దేరింది. దారిలో హైజాకర్లు దాని దారి మళ్ళించి, బెంఘాజి మీదుగా ఉగాండాకు చెందిన ఎంటెబ్బెకు తరలించారు. ఉగాండా ప్రభుత్వం హైజాకర్లకు మద్దతు పలికింది. ఉగాండా అధ్యక్షుడు, ఇదీ అమీన్ స్వయంగా వారికి స్వాగతం పలికాడు. బందీలను విమానం నుండి విమానాశ్రయం లోని ఒక ఖాళీ భవనంలోకి తరలించి, వారిలో ఇజ్రాయిలీలను, ఇజ్రాయిలేతరులైన యూదులనూ విడదీసి వారిని వేరే ఒక గదిలోకి తరలించారు.

(ఇంకా…)

46వ వారం

ఝాన్సీ లక్ష్మీబాయి

ఝాన్సీ లక్ష్మీబాయి మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857 లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం లో ప్రముఖ పాత్ర పోషించింది. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలన లో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. మరియు భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలన ను అడ్డుకొన్న వాళ్లకి ఈమె గుర్తుగా నిలిచారు. భారత దేశం యొక్క "జాయన్ ఆఫ్ ఆర్క్" లాగా ఆమె భారత దేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల19 న మహారాష్ట్ర కు చెందిన సతర లో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసి లో విక్రమ నామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు జన్మించింది. డీ.బీ పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 19, 1835 వసంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. కానీ దీనికి వేరే చారిత్రక ఆధారాలు లేకపోవడం వలన 1828 అన్ని చోట్లా ఆమోదింపబడుతున్నది. దీనికి ఆధారం 1854లో జాన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణిని కలవడానికి వెళ్ళినపుడు ఆమె తరుపు గుమస్తా ఆయనకు రాణీ 26 ఏళ్ళ స్త్రీ అని చెప్పడం జరిగింది. ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే మరియు భాగీరథీబాయి లు. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం.

(ఇంకా…)

47వ వారం

ఆంధ్రప్రదేశ్ తోలు బొమ్మలాట

తోలుబొమ్మలాట అనేది భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జానపద కళారూపం. ఈ తోలుబొమ్మలాటలో చర్మంతో చేసిన వివిధ బొమ్మలతో ఒక కథని తయారుచేసి గ్రామాలలో కళారూపంగా ప్రదర్శిస్తారు. ప్రస్తుత కాలంలో పురాణ గాథలైన రామాయణం, మహాభారతం లోని కొన్ని కథలను టెలివిజన్ లో చూస్తూ ఉంటాము. కానీ పూర్వ కాలంలో మారుమూల గ్రామాలలోని ప్రజలకు ఈ గాథలను తెలియజెప్పే సాధనాలు లేవు. ఆ కాలంలో ఆ కథలను అర్థవంతంగా తెలియజెప్పేందుకు ఈ కళాకారులు వివిధ రకాల పాత్రల యొక్క బొమ్మలను చేసి వాటిని ప్రదర్శించేవారు. తోలుబొమ్మలాట అనగా తోలుతో చేసిన బొమ్మలతో నాట్యం చేయించుట. పల్లె వాసులకు వినోదాన్ని పంచి పెట్టిన అతి ప్రాచీన కళల్లో తోలుబొమ్మలాటలు మొదటిది. హరికథలు, బుర్రకథలు, వీధి నాటకాలు మొదలగు వాటి ఉనికి లేనప్పుడే ఈ తోలుబొమ్మలాటలు పల్లెవాసుల కందుబాటు లోకి వచ్చాయి. బహుళ ప్రచారం పొందాయి. ఈనాడు ఆంధ్రదేశంలో ఈ తోలుబొమ్మలాటల్ని, బుట్టబొమ్మలాటల్ని, కొయ్య కావళ్ళవారి ప్రదర్శనలనూ అతి అరుదుగా చూస్తూ వున్నాం. కాని కొయ్య బొమ్మలాటల్ని మాత్రం ఎక్కడా చూడలేక పోతున్నాం. ఈ ఆట క్రీ.శ. 1700 కాలంలో తోలుబొమ్మలాటలు ఆంధ్రదేశంలో ఎక్కువగా ప్రదర్శింపబడుతుండేవి.

(ఇంకా…)

48వ వారం

పాలెగాళ్లు

పాలెగాళ్లు దక్షిణ భారతదేశంలోని ప్రాంతాలను పరిపాలించిన రాజులు. పాలెగాళ్లను తమిళంలో పాలైయాక్కరర్ అని, తెలుగులో పాలెగాడని, కన్నడంలో పాళె యగరరు అని అంటారు. వీళ్లు క్రీ.శ.17, 18వ శతాబ్దాల్లో సాయుధులై పాలన సాగించారు. విజయ నగర రాజ్య పతనానంతరం పాలెగాళ్ల పాలన ప్రారంభమైంది. క్రీ.శ.1800 నాటికి సీమలో 80 మంది పాళెగాళ్లు, 30 వేల మంది సైని కులు ఉండేవారు. క్రీ.శ.1600 నుండి క్రీ.శ.1800 వరకు రాయలసీమ ప్రాంతంలో బలమైన రాజుల పాలన లేదు. పాళెగాళ్ల పాలనే రాయలసీమలో ఉండేది. సీమలో దండయాత్రలు జరిగినప్పుడు గండికోట, సిద్ధవటం కోట పరాయి రాజుల వశమైనప్పటికీ బురుజులు మాత్రం పాళెగాళ్ల ఆధీనంలోనే ఉండేవి. విజయనగర రాజుల కాలంలోనే ( క్రీ.శ. 1336-1680) పాళెగాళ్ల వ్యవస్థ ఏర్పడింది. రాయలసీమలో పాళెగాళ్లు విజయనగర రాజులకు పన్నులు వసూలు చేయడంలోనూ, అంతర్గత రక్షణ కల్పించడంలోనూ, రాజులకు అవసరమైన సైన్యాన్ని సమీకరించడంలోనూ సహాయపడేవారు. క్రీ.శ.1565 లో జరిగిన తళ్లికోట యుద్ధం లో సుల్తానుల చేతులలో పరాజయం పొందిన విజయనగర రాజులు తమ రాజధానిని బళ్లారి జిల్లాలోని హంపీ నుంచి అనంతపురం జిల్లాలోని పెనుగొండ కు మార్చారు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సలహాతో బీజాపూర్, గోల్కొండ నవాబులు ఉమ్మడిగా 1650 లో పెనుగొండ మీద దాడి చేసి విజయనగర రాజ్యాన్ని ధ్వంసం చేశారు.

(ఇంకా…)

49వ వారం

ప్లాసీ యుద్ధం

ప్లాసీ యుద్ధం బెంగాలు నవాబు, అతడి ఫ్రెంచి మిత్రులపై బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్ణయాత్మక విజయం సాధించిన యుద్ధం. 1757 జూన్ 23 న జరిగిన ఈ యుద్ధం, బెంగాల్లో కంపెనీ స్థానాన్ని సుస్థిరపరచింది. తరువాతి వంద సంవత్సరాల్లో కంపెనీ తమ ప్రాబల్యాన్ని భారతదేశం అంతటా విస్తరించింది. ఈ యుద్ధం బెంగాల్లో భాగీరథి నదీ తీరంలోని ప్లాసీ (ప్రస్తుత పలాషి) వద్ద జరిగింది. ఈ ప్రదేశం కలకత్తాకు ఉత్తరాన 150 కిమీ వద్ద, అప్పటి బెంగాలు రాజధాని ముర్షిదాబాదుకు దక్షిణాన ఉంది. బెంగాలు నవాబు సిరాజుద్దౌలా, ఇస్ట్ ఇండియా కంపెనీ ఈ యుద్ధంలో ప్రత్యర్ధులు. సిరాజుద్దౌలా అంతకు ఏడాది ముందే బెంగాలు నవాబయ్యాడు. వెంటనే అతడు ఇంగ్లీషువారిని వారి కోటల విస్తరణను ఆపమని ఆదేశించాడు. రాబర్టు క్లైవు, నవాబు యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైన మీర్ జాఫరును లంచంతో లోబరచుకుని, అతణ్ణి బెంగాలు నవాబును చేస్తానని ఆశ గొలిపీ, తన పక్షానికి తిప్పుకున్నాడు. ప్లాసీ యుద్ధంలో క్లైవు, బెంగాలు నవాబును ఓడించి కలకత్తాను స్వాధీనపరచుకున్నాడు. ఈ యుద్ధానికి ముందు సిరాజుద్దౌలా బ్రిటిషు వారి నియంత్రణలో ఉన్న కలకత్తాపై దాడి చెయ్యడం, చీకటి గది మారణకాండ చేయించడం జరిగాయి. వారు రాబర్టు క్లైవు నాయకత్వంలో మద్రాసు నుండి అదనపు బలగాలను పంపించి కలకత్తాను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ వెంటనే క్లైవు ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న చందర్‌నగర్ కోటను వశపరచుకున్నాడు.

(ఇంకా…)

50వ వారం

బాపు

బాపు ( డిసెంబరు 15, 1933 - ఆగస్టు 31, 2014) తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం. బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. బాపు డిసెంబరు 15, 1933 వ సంవత్సరం లో పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలం కంతేరు లో వేణు గోపాల రావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించాడు. 1955 వ సంవత్సరం లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి లాయర్ పట్టా పుచ్చుకున్నాడు. అదే సంవత్సరం ఆంధ్ర పత్రిక దినపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు. బాపు చిత్రకళ ఒక విషయానికి పరిమితంకాలేదు. 1945 నుండి బాపు చిత్రాలనూ, వ్యంగ్యచిత్రాలనూ, పుస్తకాల ముఖచిత్రాలనూ, పత్రికల ముఖచిత్రాలనూ, కథలకు --భాస్కరనాయుడు (చర్చ) 05:08, 21 డిసెంబరు 2016 (UTC)బొమ్మలనూ, విషయానుగుణ చిత్రాలనూ పుంఖాను పుంఖాలుగా సృష్టిస్తున్నాడు. కొత్త రచయితలూ, ప్రసిద్ధ రచయితలూ, పురాణాలూ, జీవితమూ, సంస్కృతీ, రాజకీయాలూ, భక్తీ, సినిమాలూ - అన్ని రంగాలలో ఆయన గీతలు వాసికెక్కాయి. ఆయన చిత్రాలతో ఉన్న శుభాకాంక్ష పత్రికలు, పెళ్ళి శుభలేఖలూ కళాప్రియులు కోరి ఏరుకుంటారు. బాపు రాత కూడా అంతే. ఇంతవరకూ తెలుగునాట ఎవరి చేతి వ్రాతకూ ఆ ప్రాముఖ్యత అందలేదు. తెలుగులో బాపు అక్షరమాల (ఫాంట్) ఎన్నో డి.టి.పి సంస్థలూ, ప్రచురణా సంస్థలూ వాడుతుంటాయి. నవరసాలు, అష్టవిధనాయికలు, జనార్దనాష్టకము, అన్నమయ్య పాటలు, రామాయణము, భారతీయ నృత్యాలు, తిరుప్పావై - ఇలా ఎన్నో విషయాలపై బాపు ప్రత్యేక చిత్రావళిని అందించాడు. ఆయన చిత్రాలలో కొన్ని ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి.[ప్రత్యుత్తరం]

(ఇంకా…)

51వ వారం

ముహమ్మద్ రఫీ

మహమ్మద్ రఫీ (డిసెంబర్ 24, 1924 - జూలై 31, 1980) ప్రముఖ ఉత్తర భారత నేపథ్యగాయకుడు. హిందీ సినీ వినీలాకాశంలో అతిపెద్ద తారగా విలసిల్లినవాడు. సంగీతాభిమానులందరికీ చిరపరిచితుడు అయిన రఫీ హిందీ, ఉర్దూ, మరాఠీ మరియు తెలుగు భాషలలో పాటలు పాడాడు. 17 భాషలలో తన గానంతో అందరినీ అబ్బురపరచాడు. హిందీ సినిమా (బాలీవుడ్) జగతులో గుర్తింపబడ్డాడు. భారత ఉపఖండంలో ప్రఖ్యాతిగాంచిన గాయకుడు. హిందీ సినిమా గాన జగతులో 1950 నుండి 1970 కాలం మహమ్మద్ రఫీ యుగం అంటే అతిశయోక్తి గాదు. రఫీ మరియు లతా మంగేష్కర్ ల గాయక జోడీ, హిందీ నేపథ్యగాన చరిత్రలో కొత్త ఒరవడిని, రికార్డును సృష్టించింది. కేవలం రఫీ పాటలతో వందల కొద్దీ చిత్రాలు విజయం పొందాయి. రాజేంద్రకుమార్ మరియు షమ్మీ కపూర్ రఫీ పాటలతోనే హిట్టయ్యారు. రాజేంద్రకుమార్ కేవలం రఫీ పాటలతోనే సిల్వర్ జూబిలీ హీరో అయ్యాడు. రఫీ, ముకేష్, మన్నాడే, కిషోర్ కుమార్ మరియు మహేంద్ర కపూర్ ల కాలం సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గది. పంజాబ్ లోని కోట్లా సుల్తాన్ పూర్ లో జన్మించాడు. తండ్రి హాజి అలి మహమ్మద్. రఫీ హిందుస్థానీ క్లాసికల్ సంగీతం ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్, ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్, పండిత్ జీవన్ లాల్ మట్టూ మరియు ఫిరోజ్ నిజామి ల వద్ద నేర్చుకున్నాడు. ఒక రోజు తన మామ హమీద్ తోడు ప్రఖ్యాత గాయకుడు కె.ఎల్. సెహ్ గల్ గానకచ్చేరి చూడడానికి వెళ్ళాడు. విద్యుత్ అంతరాయం వలన సెహ్ గల్ పాడడానికి నిరాకరించాడు.


(ఇంకా…)

52వ వారం

ఎడ్వర్డ్ జెన్నర్

ఎడ్వర్డ్ ఆంటోనీ జెన్నర్ (17 మే 1749 -26 జనవరి 1823) గ్లోస్టర్ షైర్ లోని బర్కిలీలో తన సహజ పరిసరాలను అధ్యయనం చేసిన ఆంగ్ల శాస్త్రవేత్త. జెన్నర్ మశూచి టీకా మందుకు మార్గదర్శిగా చాలా విరివిగా విశ్వసించబడ్డారు మరియు ఆయన 'రోగ నిరోధక శాస్త్ర పితామహుడు' గా పేరు పొందారు. జెన్నర్ యొక్క ఆవిష్కరణ మరి ఏ ఇతర వ్యక్తి యొక్క కృషికంటే కూడా ఎక్కువ ప్రాణాలను కాపాడింది. ఎడ్వర్డ్ జెన్నర్ 1749 మే 17న బర్కిలీలో జన్మించారు. జెన్నర్ తన 14వ ఏట మొదులుకొని 8 సంవత్సరాల పాటు దక్షిణ గ్లోస్టర్ షైర్ లోని చిప్పింగ్ సాడ్బరీలో డేనియల్ లుడ్లో అనే శస్త్రచికిత్స నిపుణుని వద్ద శిక్షణ పొందారు. 1770లో జెన్నర్ సెయింట్ జార్జ్ హాస్పిటల్ లో శస్త్రచికిత్స నిపుణుడు జాన్ హంటర్ మరియు ఇతరుల వద్ద శస్త్రచికిత్స మరియు శరీరనిర్మాణ శాస్త్రాలలో వారికి సమానంగా చేరుకున్నారు. వైద్య శ్రేణులలో చాలా ప్రసిద్ధమైన "ఆలోచించకు, ప్రయత్నించు" నే విలియం హార్వీ యొక్క సలహాను హంటర్ తన విద్యార్థి అయిన జెన్నర్ కు పదే పదే చెప్పేవారు. జెన్నర్ శస్త్రచికిత్స పద్ధతిని మరియు శస్త్రచికిత్స సంస్థలను అభివృద్ధి చేసేందుకు ప్రసిద్ధి చెందిన వ్యక్తులచే త్వరగా గుర్తింపబడ్డారు. హంటర్ "పకృతి చరిత్ర" లో ఆయనతో సంబంధాలు కలిగి ఉండి ఆయనను రాయల్ సొసైటీకి ప్రతిపాదించారు. 1773లో తన స్వస్థలమైన పల్లె ప్రాంతానికి తిరిగివచ్చి ఆయన ఒక విజయవంతమైన సాధారణ వృత్తి సాధకుడు మరియు శస్త్రచికిత్స నిపుణుడు అయ్యారు.

(ఇంకా…)

ఇవి కూడా చూడండి[మార్చు]