Coordinates: 10°56′54″N 79°21′24″E / 10.94841°N 79.356708°E / 10.94841; 79.356708

ఐరావతేశ్వర దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
Great Living Chola Temples
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
ఐరావతేశ్వర దేవాలయ దృశ్యం
రకంసాంస్కృతిక
ఎంపిక ప్రమాణంi, ii, iii, iv
మూలం250
యునెస్కో ప్రాంతంఆసియా-పసిఫిక్
భౌగోళికాంశాలు10°56′54″N 79°21′24″E / 10.94841°N 79.356708°E / 10.94841; 79.356708
శిలాశాసన చరిత్ర
శాసనాలు1987 (11వ సమావేశం)
పొడిగింపులు2004

ఐరావతేశ్వర దేవాలయం ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం పట్టణంలో నెలకొంది. ఇది ద్రావిడ నిర్మాణ శైలి కలిగిన ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ దేవాలయాన్ని 12 వ శతాబ్దంలో రాజరాజ చోళుడు II నిర్మించాడు. ఇది యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, చోళపురం లోని గంగైకొండ చోళీశ్వర దేవాలయాలతోపాటు గుర్తించబడింది. ఈ దేవాలయాలు చోళుళ నిర్మాణ శైలికి తార్కాణాలు.[1]

పురాణగాథ

[మార్చు]

ఐరావతేశ్వర దేవాలయం ప్రసిద్ధ శివాలయం. ఈ దేవాలయంలోమూలవిరాట్టు మహాశివుడు. ఈ దేవాలయం లోని ప్రధాన దైవాన్ని దేవతల రాజైన ఇంద్రుని యొక్క ఐరావతం పూజించినట్లు పురాన గాథ. పురాణాల ప్రకారం ఐరావతం దాని వాస్తవ రంగు తెలుపును దుర్వాస మహాముని శాపం వల్ల కోల్పోయి ఈ దేవాలయంలో శివుని అర్చించి అచట గల కోనేరులోని నీటిలో స్నానమాచరించినపుడు దాని పూర్వపు రంగును పొందినది. ఈ ఇతిహాసం దేవాలయం లోని అంతర్గత మందిరంలో ఇంద్రుడు ఐరావతంతో కూర్చుని ఉండే చిత్రం ద్వారా తెలుస్తుంది.[2] ఈ గాథ కారణంగా ఈ దేవాలయాన్ని ఐరావతేశ్వరాలయం అని పిలుస్తారు. .

పురాణాల ప్రకారం నరకాధిపతి యముడు కూడా శివుణ్ణి ఇచట అర్చించినట్లు తెలుస్తుంది. యముడు ఒక మహర్షి శాపం మూలంగా తన శరీరమంతా మంటలతో మండుతున్నట్లు అనిపించి ఆ బాధను పోగొట్టుకొనడానికి ఈ దేవాలయంలో అర్చించినట్లు తెలుస్తుంది. యముడు ఈ దేవాలయ కోనేరులో స్నానమాచరించి శరీర మంటలను పోగొట్టుకున్నాడని తెలుస్తుంది. ఈ కారణంగా ఈ సరస్సును "యమ తీర్థం" అని పిలుస్తారు.

దేవతలు

[మార్చు]

ఈ దేవాలయానికి ఉత్తర దిశగా పెరియ నాయకి అమ్మన్ దేవాలయం విడిగా ఉంది. బయటి భాగంలో ప్రాకారాల నిర్మాణం తర్వాత ఇది ప్రధాన దేవాలయంలో ఒక భాగంగా నెలకొంది. ప్రస్తుతం ఆలయంలో దెవత నిలబడి ఉండేటట్లు ఉండే దేవాలయంగా వేరుగా నెలకొంది.[3]

నిర్మాణ శైలి

[మార్చు]

ఈ దేవాలయం అనేక శిల్పాల సమాహారం. ఇందులోఅనేక రాతి శిల్పాలు నెలకొన్నవి. ఈ దేవాలయం బృహదీశ్వరాలయం లేదా గంగైకొండ చోళీశ్వర దేవాలయాల కంటే కొంచెం చిన్నది. శిల్పకళలో వాటికంటే విశిష్టమైనది. ఎందుకంటే ఈ దేవాలయం నిత్య వినోదం, శాశ్వత వినోదం కోసం నిర్మించబడినట్లు తెలుస్తుంది.

ఈ దేవాలయం యొక్క మహద్వారం తూర్పు వైపున ఉంది.[4] ఈ వేవాలయ విమానం (టవర్) 24 మీ (80 అడుగులు) ఎత్తులో ఉంటుంది. ఈ దేవాలయం లోని గర్భగుడి అక్ష మంటపాలతో, పరివృత్త మార్గంతో గాని కూడుకొని లేదు.[1] దాని దక్షిణం వైపు గల మంటపం పెద్ద రాతి చక్రాలు, గుర్రాలతో కూడుకొని ఉన్న రథం ఆకారంలో ఉంటుంది.[5] ఈ దేవాలయం మంటపాలు అత్యంత శోభాయమానంగా అలంకరింపబడి ఉంటాయి. అన్ని శిల్పాలు నిర్మాణం యొక్క సొగసును ద్విగుణీకృతం చేస్తున్నాయి.[1] అంతర్భాగంలో తూర్పు వైపు చెక్కబడిన నిర్మాణాల సముదాయం కలిగి ఉంది. వాటిలో "బలిపీఠం" ఉంది. దాని పీఠములో చిన్న గణేషుని విగ్రహం కలిగి ఉంది. ఈ బలిపీఠం యొక్క పీఠములో దక్షిణ భాగంలో మూడు అందముగా చెక్కబదిన మెట్లు ఉన్నాయి. ఈ మెట్లను తాకినపుడు సంగీతంలోని సప్తస్వరాల శబ్డం వినబడుతుంది. [3][6]

నైరుతి మూలలో గల మంటపంలో నాలుగు విగ్రహాలున్నాయి. ఇందులో ఒకటి యముడు విగ్రహం. ఈ విగ్రహంతోపాటు అతి పెద్ద రాళ్లపై "సప్తమాతలు" యొక్క శిల్పాలు చెక్కబడినవి.[3] విడిగా నిర్మించబడిన దేవీ యొక్క దేవాలయం ప్రధాన దేవాలయం కంటే తరువాత నిర్మించబడింది. హిందూ దేవాలయ సంస్కృతిలో అమ్మవారి విగ్రహం ఉండటం అత్యవసరమైనదైనందున దీనిని నిర్మించినట్లు తెలుస్తుంది.[1]

దేవాలయంలోని శాసనాలు

[మార్చు]

ఈ దేవాలయంలో వివిధ శాసనాలున్నాయి. ఇందులో "కుళుత్తుంగ చోళుడు (రెండవ)" దేవాలయాన్ని పురరుద్దరించినట్లు తెలుస్తోంది.[7]

వరండా యొక్క ఉత్తర గోడకు 108 విభాగాల శాసనాలున్నాయి. ఇందులో 63 శైవాచార్యుల యొక్క చిత్రం, వివరాలు ఉన్నాయి. వారి జీవితంలో ప్రధాన ఘట్టాలు అందులో ఉన్నాయి. [7][8][9] హిందూ మతంలో శైవం యొక్క మూలాలను ఇవి ప్రతిబింబిస్తున్నాయి.[10] ఈ దేవాలయంలో రాజరాజ II కాలంలో దేవాలయంలో గానం చేసిన 108 మంది దేవర ఓతువర్స్ యొక్క ముఖ్యమైన శాసనాలున్నవి. కావేరి, గంగ, యమున, గోదావరి, నర్మద వంటి నదీమ తల్లుల గూర్చి శాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయి.[4]

UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశం

[మార్చు]

ఈ దేవాలయం చోళుల యొక్క ప్రసిద్ధ దేవాలయాల జాబితాలో స్థానాన్ని 2004 లో సంపాదించింది. చోళుల విశిష్ట దేవాలయాలలో తంజావూరు బృహదీశ్వరాలయం, గంగైకొండ చోళపురం లోని చండైకొండ చోళీశ్వరాలయం, దారసురంలోని ఐరావతేశ్వరాలయాలు ప్రసిద్ధమైఅంవి. ఈ దేవాలయానన్నీ 10వ, 12 వ శతాబ్దముల మధ్య చోళుల కాలంనాటివి. మీ మూడు దేవాలయాలకొ అనేక పోలికలున్నాయి.[11]

చిత్రమాలిక

[మార్చు]

ప్రపంచ వారసత్వ ప్రదేశం

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 1.2 1.3 Great Living Chola Temples - UNESCO World Heritage Centre
 2. See P.V. Jagadisa Ayyar, pp 350-351
 3. 3.0 3.1 3.2 See P.V. Jagadisa Ayyar, p 351
 4. 4.0 4.1 http://www.thehindu.com/todays-paper/tp-features/tp-editorialfeatures/darasuram-architectural-marvel-from-chola-period/article2260784.ece
 5. See Chaitanya, K, p 42
 6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-01-23. Retrieved 2015-02-17.
 7. 7.0 7.1 See P.V. Jagadisa Ayyar, p 353
 8. See Chaitanya, K, p 40
 9. See Geeta Vasudevan, p 55
 10. http://whc.unesco.org/en/list/250/
 11. See P.V.Jagadisa Ayyar, p 316

సూచికలు

[మార్చు]
 • Geeta Vasudevan (2003). The Royal Temple of Rajaraja: An Instrument of Imperial Chola Power. Abhinav Publications. ISBN 81-7017-383-3.
 • P.V. Jagadisa Ayyar (1993). South Indian Shrines. New Delhi: Asian Educational Services. ISBN 81-206-0151-3.
 • Krishna Chaitanya (1987). Arts of India. Abhinav Publications.
 • Richard Davis (1997). Lives of Indian images. Princeton, N.J: Princeton University Press. ISBN 0-691-00520-6.

ఇతర లింకులు

[మార్చు]

Media related to ఐరావతేశ్వర దేవాలయం at Wikimedia Commons