రథం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రథం లేదా రథము (ఆంగ్లం : Ratha) ( సంస్కృత భాష రథ rátha), (అవెస్తన్ భాష raθa), ఇది ఇండో-ఇరానియన్ పదం, ప్రాచీన కాలంలో, చక్రాలతో కూడిన వాహనానికి వాడేవారు.

రథానికి, రెండు లేక నాలుగు చక్రాలూ, రెండు లేక అంతకన్నా ఎక్కువ గుర్రాలూ లాగేవి, (సూర్యుని రథానికి ఏడు గుర్రాలు లాగుతున్నాయి). ఈ రథాలకు గుర్రాలే గాక ఏనుగులూ లాగేవి. ఈ రథాన్ని నడిపేవానికి రథసారథి అని అంటారు. పార్థుని (అర్జునుని) రథసారథి, పార్థసారథి (శ్రీకృష్ణుడు). నేడు అనేక దేవాలయాలలో గల ఆయా దేవుళ్ళను, ఉత్సవాల సమయాన ఊరేగిస్తూ, భక్తులే అమిత భక్తితో మంత్రోచ్ఛారణలతో, శ్లోకాలను, కీర్తనలనూ, భజన్లను పాడుతూ ఆలాపిస్తూ రథాలకు తాళ్ళు కట్టి లాగుతా ఊరేగిస్తారు.

జటప్రోలు సంస్థానానికి చెందిన రథం
(ఆం.ప్ర.రాష్ట్ర మ్యూజియమ్ లో భద్రపరచినది)
దస్త్రం:100 0532.jpg
ఉడుపి లోని కృష్ణుని బ్రహ్మరథం.

రథాయాత్ర[మార్చు]

ఒరిస్సాలోని పూరీలో ప్రతి సంవత్సరం జరిగే జగన్నాథ రథాయాత్ర చాలా ప్రసిద్ధిచెందినది. పవిత్రమైన ఆ రోజున జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్రలను మూడు వేరువేరు రథాలలో పట్టణమంతా ఊరేగిస్తారు. రథాయాత్ర రోజు చాలా జనం తండోపతండాలుగా వస్తారు. రథాన్ని భక్తులే తాళ్ళు కట్టి లాగుతారు. ఆలయ నియమాల ప్రకారం రథం ఎట్టిపరిస్థితులలోను వెనుకకు వెళ్ళకూడదు. కొంతమంది భక్తులు చక్రాల క్రింద పడి చనిపోయినా రథం ముందుకు పోవాల్సిందే. ఏ కట్టడమైనా అడ్డు వస్తే తొలగిస్తారు. అందుకేనేమో పూరీలొని రథాయాత్ర జరిగే వీధులు చాలా విశాలంగా ఉంటాయి.

ఇవీ చూడండి[మార్చు]

పాదపీఠికలు[మార్చు]

మూలాలు[మార్చు]

  • Bryant, Edwin (2001). The Quest for the Origins of Vedic Culture. Oxford University Press. ISBN 0-19-513777-9.
  • Fussman, G.; Kellens, J.; Francfort, H.-P.; Tremblay, X.: Aryas, Aryens et Iraniens en Asie Centrale. (2005) Institut Civilisation Indienne ISBN 2-86803-072-6
  • Kazanas, Nicholas. The AIT and Scholarship. Athens, 2001.
  • Peter Raulwing, Horses, Chariots and Indo-Europeans, Foundations and Methods of Chariotry Research from the Viewpoint of Comparative Indo-European Linguistics, Archaeolingua, Series Minor 13, Budapest 2000)
"https://te.wikipedia.org/w/index.php?title=రథం&oldid=2883741" నుండి వెలికితీశారు