న్యుమోనియా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Pneumonia
Classification and external resources
ICD-10 J12, J13, J14, J15, J16, J17, J18, P23
ICD-9 480-486, 770.0
DiseasesDB 10166
eMedicine topic list
MeSH D011014

న్యుమోనియా (Pneumonia) అనేది ఊపిరితిత్తుల్లో అసాధారణంగా మంటని కలిగించే పరిస్థితి.[1] ఊపిరితిత్తి యొక్క పెరెన్కైమా (అనగా, వాయుకోశం) లో మంట కలగటం మరియు వాయుకోశం అసాధారణంగా ద్రవంతో నిండటం(పేరుకుపోవటం మరియు శోధ స్రావం)వంటివి తరచుగా ఈ వ్యాధిలో కనిపించే లక్షణాలు.[2]

వాయుగోళాలు ఊపిరితిత్తులలో ఆక్సిజన్ శోషణకు ఉండే గాలితో నిండిన సూక్ష్మమైన సంచులు. న్యుమోనియా అనేక రకాల కారణాల వలన సంభవించవచ్చు, వీటిలో బాక్టీరియా నుండి సంభవించే అంటురోగాలు, వైరస్లు, ఫంగి, లేదా పరాన్న జీవులు, మరియు ఊపిరితిత్తులకు రసాయన లేదా భౌతిక పరమైన హాని సంభవించడం ఉన్నాయి. దీనికి కారణం అధికారికంగా కారణం తెలియనిది గా వివరించబడుతుంది—అంటే, అంటురోగాల కారణాలు వదిలివేయబడతాయి.

న్యుమోనియా యొక్క మాదిరి లక్షణాలలో దగ్గు, ఛాతీ నొప్పి, జ్వరం, మరియు శ్వాశ తీసుకోవడంలో ఇబ్బంది ఉంటాయి. నిర్ధారణా పరికరాలలో ఎక్స్-రేలు మరియు కఫం ఉన్నాయి. చికిత్స, న్యుమోనియా యొక్క కారణంపై ఆధారపడి ఉంటుంది; బాక్టీరియల్ న్యుమోనియాకు యాంటి బయాటిక్స్ తో చికిత్స చేస్తారు.

న్యుమోనియా అన్ని వయసుల వారిలో వచ్చే ఒక సాధారణ వ్యాధి, మరియు వయసు మళ్ళినవారిలో, దీర్ఘకాలికంగా జబ్బుతో మరియు అంత్యదశలో ఉన్నవారి మరణానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటి. అదనంగా, ప్రపంచవ్యాప్తంగా ఐదు సంవత్సరాల వయసు లోపు పిల్లలలో మరణానికి కూడా ఇది ప్రధాన కారణం.[3] కొన్నిరకాల న్యుమోనియా నుండి రక్షణకు టీకా మందులు అందుబాటులో ఉన్నాయి. న్యుమోనియా యొక్క రకము, తగిన చికిత్స, ఏవైనా ఇతర సమస్యలు, మరియు వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితిని బట్టి రోగ నిరూపణ జరుగుతుంది.

విషయ సూచిక

వర్గీకరణ[మార్చు]

న్యుమోనియాలను అనేక రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిలో రోగవిజ్ఞాన శాస్త్రజ్ఞులు శవపరీక్షలలో ఊపిరితిత్తులలో కనుగొన్న శరీర నిర్మాణ సంబంధ మార్పులను బట్టి వీటిని వర్గీకరించారు. న్యుమోనియాను కలిగించే సూక్ష్మజీవుల గురించి తెలిసిన తర్వాత, సూక్ష్మజీవశాస్త్ర సంబంధ వర్గీకరణ వెలువడింది, మరియు x-కిరణాల ఉనికితో, రేడియో వికిరణశాస్త్ర సంబంధ వర్గీకరణ వెలువడింది. వయసు, కొన్ని సూక్ష్మజీవులవల్ల కలిగే హానికర అంశాలు, ప్రాథమికమైన ఊపిరితిత్తుల వ్యాధి మరియు ప్రాథమిక దైహిక వ్యాధి, మరియు ఇటీవల కాలంలో ఆవ్యక్తి ఆసుపత్రి పాలయ్యడా అనే వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని జరిపిన రోగచికిత్స సంబంధ వర్గీకరణ ముఖ్యమైనది.

పూర్వపు వర్గీకరణ విధానాలు[మార్చు]

న్యుమోనియా గురించి ప్రాథమిక వివరణలు, ఊపిరితిత్తులను శవ పరీక్షలో ప్రత్యక్షంగా పరిశీలించడం లేదా సూక్ష్మదర్శినిలో వాటిని గమనించడం ద్వారా కానీ జరిగే శరీర నిర్మాణ లేదా రోగ లక్షణ పరంగా అవి అగుపడే విధానం పై కేంద్రీకరించబడ్డాయి.

 • ఖండ సంబంధ న్యుమోనియా ఊపిరితిత్తి యొక్క ఒక ఖండము లేదా ఒక భాగానికి చెందిన సంక్రమణం. ఖండ సంబంధ న్యుమోనియా తరచుగా స్ట్రిప్టోకాకస్ న్యుమోనియే ( క్లెబ్సిఎల్ల న్యుమోనియే ద్వారా కూడా కావచ్చు) వల్ల రావచ్చు.[4]
 • బహుఖండ సంబంధ న్యుమోనియా ఒక భాగం కంటే ఎక్కువ వాటికి సంబంధించినది, మరియు ఇది తరచుగా తీవ్ర వ్యాధిని కలుగచేస్తుంది.
 • శ్వాసనాళ న్యుమోనియా సూక్ష్మ శ్వాసనాళముల (బ్రోంకి లేదా బ్రోన్కియోల్స్) చుట్టూ భాగములుగా ఏర్పడి ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తంది.
 • అంతర జీవకణ న్యుమోనియా వాయుగోళాల మధ్య ప్రాంతాలను ఆక్రమిస్తుంది, దీనిని "అంతర జీవకణ న్యుమోనిటిస్" అనవచ్చు. ఇది ఎక్కువ వైరస్ లు లేదా వైవిధ్య బాక్టీరియాల వలన సంభవిస్తుంది.

X-రే లను కనుగొనడం ఊపిరితిత్తులను ప్రత్యక్షంగా పరీక్షించకుండానే న్యుమోనియా యొక్క నిర్మాణ రకాన్ని నిర్ధారించడాన్ని సాధ్యం చేసింది మరియు రేడియోలాజికల్ వర్గీకరణ యొక్క అభివృద్ధికి దారితీసింది. ప్రాథమిక పరిశోధకులు స్థానం, పంపిణీ, మరియు ఛాతీ ఎక్స్-రేలపై వారు చూసిన మరక ఆకారాన్ని బట్టి ఖండ సంబంధ న్యుమోనియా మరియు వైవిధ్య (ఉదా.క్లామిడోఫిల) లేదా వైరల్ న్యుమోనియాలను విభజించేవారు. కేవలం x-రే లతోనే న్యుమోనియా కారక సూక్ష్మజీవిని ఖచ్చితంగా నిర్దారించడం సాధ్యపడనప్పటికీ, కొన్ని ఎక్స్-రేల ఫలితాలు రోగం యొక్క గతిని ఊహించడానికి సహాయ పడతాయి.

ఆధునిక సూక్ష్మ జీవశాస్త్ర ఆవిష్కరణ వలన, రోగకారక సూక్ష్మజీవుల పై ఆధారపడి వర్గీకరణ సాధ్యమైంది. ఒక వ్యక్తి యొక్క న్యుమోనియా ఏ సూక్ష్మ జీవి వలన కలిగిందో నిర్దారించడం చికిత్స యొక్క రకాన్ని మరియు వ్యవధిని నిర్ణయించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. సూక్ష్మజీవ వర్గీకరణకు కఫ పరీక్షలు, రక్త పరీక్షలు, శ్వాశకోశ స్రావాల పరీక్షలు, మరియు ప్రత్యేక రక్త పరీక్షలు సూక్ష్మజీవ వర్గీకరణ నిర్ధారణకు ఉపయోగపడతాయి. ప్రాథమిక నిర్ధారణ సమయంలో సూక్ష్మజీవ వర్గీకరణ సాధ్యం కాదు, ఎందుకంటే ఇటువంటి ప్రయోగశాల పరీక్షలు నిర్వహించడానికి అనేక రోజుల సమయం పడుతుంది.

మిళిత రోగచికిత్స వర్గీకరణ[మార్చు]

సాంప్రదాయకంగా, చికిత్సకులు రోగ లక్షణాల పై ఆధారపడి న్యుమోనియాను వర్గీకరించారు, వాటిని "తీవ్రమైన"(మూడు వారాల కంటే తక్కువ నిడివి కలవి) మరియు "దీర్ఘకాలిక" న్యుమోనియాలుగా విభజించారు. దీర్ఘ కాల న్యుమోనియాలు వ్యాప్తి చెందని స్వభావాన్ని కలిగి ఉంటాయి, లేదా సూక్ష్మజీవి యుతమైనవి, బూజు, లేదా వాయుద్వార నిరోధాన్ని కలిగించే మిశ్రమ బాక్టీరియా వ్యాధుల వలన కలుగుతాయి. తీవ్రమైన న్యుమోనియాలను తిరిగి క్లాసిక్ బాక్టీరియల్ బ్రోంకోన్యుమోనియాస్ (స్ట్రెప్టోకాకస్ న్యుమోనియే వంటివి ), విలక్షణ న్యుమోనియాలు (మైకోప్లాస్మా న్యుమోనియే లేక క్లమిడియా న్యుమోనియే వంటి అంతర కణజాల న్యుమోనిటిస్ వంటివి ), మరియు ఆపేక్షిత న్యుమోనియా సంలక్షణాలుగా విభజించవచ్చు.

మరోవైపు దీర్ఘకాల న్యుమోనియాలలో నోకార్డియా , అక్టినోమైసెస్ మరియు బ్లాస్టోమైసెస్ డెర్మటైటిడిస్ , వాటితో పాటు (మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ మరియు వైవిధ్య మైకోబాక్టీరియా, హిస్టో ప్లాస్మాకాప్సులటుం మరియు కాక్సిడియోడెస్ ఇమ్మిటిస్ ) వంటివి ముఖ్యమైనవి.[5]

నేడు సాధారణ వర్గీకరణ విధానమైన ఈ మిళిత రోగ వర్గీకరణ, రోగి మొదటిసారి చికిత్స కొరకు వచ్చినపుడు అతని లేదా ఆమె యొక్క హాని కారకాలను గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. న్యుమోనియాకు కారణమైన సూక్ష్మజీవి గురించి తెలియకముందే సరైన ప్రారంభ చికిత్సను ఎంపిక చేసుకోవడానికి దారిచూపడం ఇంతకుముందు వర్గీకరణ విధానాల కంటే ఈ వర్గీకరణ యొక్క ప్రయోజనంగా చెప్పవచ్చు. ఈ విధానంలో రెండు ముఖ్యమైన న్యుమోనియా యొక్క విభాగాలు ఉన్నాయి: ఇటీవల ప్రవేశపెట్టిన రకమైన ఆరోగ్యరక్షణ-సంబంధిత న్యుమోనియా (వైద్యశాల వెలుపల ఉంది ఇటీవలే ఆరోగ్య రక్షణ వ్యవస్థలతో సంబంధం కలిగిన వారు) ఈ రెండు విభాగాల మధ్య ఉంటుంది.

సంఘం నుండి గ్రహించిన న్యుమోనియా[మార్చు]

కమ్యూనిటీ అక్వైర్డ్ న్యుమోనియా (CAP) ఇటీవలి కాలంలో వైద్యం పొందని వ్యక్తికి వ్యాపించే అంటువ్యాధి. CAP చాలా సాధారణ రకమైన న్యుమోనియా. CAP యొక్క అతి సాధారణమైన కారకాలు వ్యక్తి యొక్క వయసును బట్టి మారుతూ ఉంటాయి, కానీ వాటిలో స్ట్రెప్టోకొకాస్ న్యుమోనియే , వైరస్ లు, వివిధ బాక్టీరియాలు, మరియు హీమోఫైలాస్ ఇన్ఫ్లుఎంజా ఉన్నాయి. మొత్తం మీద, స్ట్రెప్టోకాకస్ న్యుమోనియా ప్రపంచ వ్యాప్తంగా సంఘం నుండి గ్రహించిన న్యుమోనియా యొక్క అత్యంత సాధారణ కారకం. గ్రామ్-నెగటివ్ బాక్టీరియా హానిని పొందే సమూహాలలో CAPని కలిగిస్తుంది. CAP యునైటెడ్ కింగ్డంలో సంభవించే మరణాలలో నాల్గవ అత్యంత సాధారణ కారణంగా మరియు యునైటెడ్ స్టేట్స్ లో ఆరవదిగా ఉంది. సంఘం నుండి గ్రహించబడిన తక్కువ తీవ్రత కలిగిన న్యుమోనియాను వర్ణించడానికి "వాకింగ్ న్యుమోనియా" అనే పదాన్ని వాడతారు(ఎందుకంటే ఈ రోగపీడితుడు వైద్యశాలలో ఉండవలసిన అవసరం లేకుండా "నడక" కొనసాగించవచ్చు).[6] వాకింగ్ న్యుమోనియా సాధారణంగా, మైకోప్లాస్మా న్యుమోనియే అనే వైవిధ్య బాక్టీరియా వలన కలుగుతుంది.[7]

ఆస్పత్రిలో వచ్చిన న్యుమోనియా[మార్చు]

వైద్య-శాలలో పొందిన న్యుమోనియాను, నోసోకామియల్ న్యుమోనియగా కూడా పిలుస్తారు, ఇది ఏదైనా ఇతర విధులు లేదా విధానం గురించి వైద్యశాలలో చేరిన కనీసం 72 గంటల తరువాత సంభవించే న్యుమోనియా. కారణాలు, సూక్ష్మ జీవరాశులు, చికిత్స మరియు రోగనిర్ధారణ సంఘం నుండి వ్యాపించే న్యుమోనియా కంటే విభిన్నంగా ఉంటాయి. ఏదైనా ఇతర కారణం వలన వైద్యశాలలో చేరిన రోగులలో సుమారు 5% మంది తరువాత న్యుమోనియాను పొందుతున్నారు. వైద్యశాలలో చేరిన రోగులు న్యుమోనియా పొందటానికి గల అవకాశాలలో కృత్రిమ వాయుప్రసారం, దీర్ఘాకాలం అసంతులిత ఆహారం తీసుకోవడం, మూలమైన గుండె మరియు ఊపిరితిత్తుల వ్యాధులు, తగ్గిన ఉదర ఆమ్లం, మరియు నిరోధక వ్యవస్థ భంగమవడం ఉండవచ్చు. అదనంగా, ఒక వ్యక్తి వైద్యశాలలో బహిర్గతమయ్యే సూక్ష్మజీవులు గృహంలో ఉండే వాటి కంటే తరచూ భిన్నంగా ఉంటాయి. వైద్యశాలలో పొందిన సూక్ష్మజీవులలో నిరోధకత కలిగిన MRSA, సూడోమోనాస్ , ఎంటరోబాక్టర్ , మరియు సేర్రాషియ బాక్టీరియాలు ఉండవచ్చు. వైద్యశాలలో-పొందిన న్యుమోనియా ఉన్న వ్యక్తులు సాధారణంగా మూలమైన ఇతర వ్యాధులు కలిగిఉండి ఇంకా ప్రమాదకరమైన బాక్టీరియాకు బహిర్గతం కావడం వలన, ఇది సంఘం-నుండి సంక్రమించే న్యుమోనియా కంటే ఎక్కువ మరణాంతకమైనది. వెంటిలేటర్-అసోసియేటెడ్ న్యుమోనియా (VAP) వైద్యశాల నుండి పొందిన న్యుమోనియా వంటిదే. VAP అనే న్యుమోనియా కనీసం 48 గంటల ఇన్ట్యూబేషన్(గొట్టాల ద్వారా సరఫరా) మరియు కృత్రిమ వాయుప్రసరణల తరువాత సంభవిస్తుంది.

న్యుమోనియా యొక్క ఇతర రకాలు[మార్చు]

భయంకరమైన న్యుమోనియా రకమైన SARS తీవ్రమైన అంటువ్యాధి, చైనాలో కొన్ని ప్రారంభ సూచనల తరువాత ఇది 2002లో సంభవించింది. SARS అనేది ఇంతకు ముందు తెలియని ఒక రోగ కారక క్రిమి అయిన SARS కరోనా వైరస్ చే కలుగ చేయబడుతుంది.
BOOP ఊపిరితిత్తుల యొక్క సూక్ష్మ వాయుద్వారాల వాపు వలన కలుగుతుంది. దీనిని క్రిప్టో ఆర్గనైజింగ్ న్యుమోనైటిస్ (COP)గా కూడా దీనిని పిలుస్తారు.
ఇసినోఫిల్స్, అనే ప్రత్యేక తరహా తెల్ల రక్త కణాలు ఊపిరితిత్తుల పై దాడి చేసినపుడు ఇస్నోఫిలిక్ న్యుమోనియా ఏర్పడుతుంది. ఇస్నోఫిలిక్ న్యుమోనియా తరచూ పరాన్న జీవిచే రోగ సంక్రమణకు ప్రతిస్పందనగా లేదా కొన్ని రకాల వాతావరణ కారకాలకు బహిర్గతం కావడం వలన సంభవిస్తుంది.
రసాయనిక న్యుమోనియా (సాధారణంగా రసాయన న్యుమోనైటిస్ పిలుస్తారు) రసాయనిక విషాలు అయిన తెగులు నాశినిల వలన కలుగుతుంది, ఇది శరీరంలోకి ఉచ్వాశ లేదా చర్మం నుండి ప్రవేశిస్తుంది. విషపూరిత పదార్థం నూనె అయినప్పుడు కలిగే న్యుమోనియాను లిపోయిడ్ న్యుమోనియా అని పిలుస్తారు.
ఆశించిన న్యుమోనియా (లేదా యాస్పిరేషన్ న్యుమోనిటిస్) తినేటప్పుడు, లేదా విసర్జన తరువాత లేదా వాంతి సమయాలలో నోరు లేదా జీర్ణాశయ పదార్ధాల ద్వారా ఆశించే బాహ్య పదార్ధాల వలన కలిగి ఫలితంగా శ్వాశనాళ న్యుమోనియా ఏర్పడుతుంది. దీని ద్వారా కలిగే ఊపిరితిత్తుల వాపు సంక్రమించేది కాదు కానీ అందుకు దారితీస్తుంది, ఎందుకంటే ఆశించిన పదార్థం వాయు రహిత బాక్టీరియా లేదా ఇతర అసాధారణ న్యుమోనియా కారకాలను కలిగి ఉండవచ్చు. వైద్యశాలలు మరియు సేవా కేంద్రాల రోగులలో ఆశించిన న్యుమోనియా మరణానికి దారితీసే కారణం కావచ్చు, ఎందుకంటే వారు వారి వాయు ద్వారాలను పూర్తిగా రక్షించుకోలేరు లేదా బలహీనమైన రక్షణను కలిగి ఉండవచ్చు.
ధూళి సుడిగాలులు, ప్రత్యేకించి యునైటెడ్ స్టేట్స్ లోని డస్ట్ బౌల్ వంటి వాటికి అతిగా బహిర్గతం అయినపుడు సంభవించే రుగ్మతను ధూళి న్యుమోనియా వివరిస్తుంది. ధూళి న్యుమోనియాలో, ధూళి ఊపిరితిత్తుల వాయుగోళాలలో పేరుకుపోయి, శైలికల కదలికలను ఆపి ఊపిరితిత్తులను వాటంతట అవే ఎల్లపుడూ శుభ్రపరచుకోకుండా చేస్తుంది.

సూచనలు మరియు లక్షణాలు[మార్చు]

వ్యాపించే న్యుమోనియా యొక్క ముఖ్య లక్షణాలు

సాంక్రామ్యక న్యుమోనియాకు గురైన వారు ఆకుపచ్చని లేదా పసుపు రంగు కఫం, లేదా శ్మ్లేషం మరియు తీవ్రమైన జ్వరంతో పాటు చలితో కూడిన వణకును కలిగి ఉంటారు. పుపుసవేష్టన ఛాతీ నొప్పి, తీవ్రమైన లేదా గుచ్చుతున్న నొప్పి వంటి స్వల్ప శ్వాశ కూడా సాధారణం, ఇది దీర్ఘంగా శ్వాశించేటపుడు లేదా దగ్గుతున్నపుడు లేదా పరిస్థితి తీవ్రమైనపుడు గుర్తిస్తారు. న్యుమోనియా ఉన్నవారు రక్తంతో కూడిన దగ్గు, తల నొప్పిలను కలిగి ఉంటారు, లేదా చెమటతో కూడిన జిడ్డు చర్మం పొందుతారు. పొందగల ఇతర లక్షణాలలో ఆకలి లేకపోవడం, అలసట, చర్మం నీలం రంగులోకి మారడం, వికారం, వాంతులు, ఆలోచనలు మారిపోవడం, మరియు కీళ్ళ నొప్పులు లేదా కండరాల నొప్పులు ఉంటాయి. కొన్ని అసాధారణ రకాలలో ఇతర లక్షణాలు కూడా ఉంటాయి; ఉదాహరణకు, లేగియోనెల్ల కారక న్యుమోనియాలో కడుపు నొప్పి మరియు విరేచనాలు కలుగవచ్చు, ట్యూబర్ క్యులోసిస్ లేదా న్యుమోసైటిస్ కారణమయ్యే న్యుమోనియాలో బరువు తగ్గడం మరియు రాత్రి చెమటలు ఉంటాయి. పెద్దవారిలో న్యుమోనియా యొక్క సూచనలు ఒకే రకంగా ఉండకపోవచ్చు. వారిలో అయోమయానికి గురయ్యే అవస్థ లేదా అస్థిరత్వానికి గురవడం, దాని ద్వారా పడిపోవడం జరుగవచ్చు. న్యుమోనియా కలిగిన శిశువులలో పై లక్షణాలు చాలావరకు ఉండవచ్చు, కానీ చాలా కేసులలో వారు కేవలం నిద్ర పోవడం లేదా జీర్ణశక్తి మందగించడం జరుగవచ్చు.[8]

న్యుమోనియా ఊపితితిత్తుల యొక్క అల్వియోలైను ద్రవంతో నింపివేస్తుంది, రక్త ప్రసరణను చేరుకోకుండా ఆక్సిజన్ ను అడ్డుకుంటుంది.ఎడమ ప్రక్కన ఉన్న అల్వియోలాస్ సాధారణంగా ఉంటుంది, అయితే కుడి ప్రక్కన ఉన్న అల్వియోలాస్ మాత్రం న్యుమోనియా వల్ల ద్రవంతో నిండిపోయి ఉంటుంది.

న్యుమోనియా యొక్క లక్షణాలకు వెంటనే వైద్య నిర్ధారణ అవసరం. ఆరోగ్య సేవకుల యొక్క శారీరక పరీక్ష జ్వరంను బహిర్గత పరచవచ్చు లేదా కొన్నిసార్లు వీటిని కనుగొనవచ్చు, తక్కువ శరీర ఉష్ణోగ్రత, పెరిగిన శ్వాశ రేటు, తక్కువ రక్త పోటు, అధిక హృదయ స్పందన, లేదా తక్కువ ఆక్సిజన్ సంతృప్తత, ఇది రక్తంలో ఉన్న ఆక్సిజన్ పరిమాణం పల్స్ ఆక్సీమెట్రి లేదా బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ వలన సూచించబడుతుంది. శ్వాసించడానికి కష్టపడేవారు, అయోమయానికి గురయ్యేవారు, లేదా కేయానోసిస్ (నీలం-వర్ణ చర్మం) కలిగినవారు వెంటనే చికిత్స పొందాలి.

ఊపిరితిత్తుల యొక్క భౌతిక పరీక్ష సాధారణంగా ఉండవచ్చు, కానీ తరచుగా ప్రభావితమైన ప్రాంతం యొక్క ఛాతీ విస్తరణ తగ్గుతుంది, శ్వాస నాళాల శ్వాసను స్టేతోస్కోప్ తో విన్నపుడు (వాపు ఉండి గట్టిపడిన ఊపిరితిత్తుల పెద్ద వాయుద్వారాల నుండి గట్టి శబ్దాలు వస్తాయి), మరియు రేల్స్ (లేదా చిటపటలు) ఉచ్వాశ సమయంలో ప్రభావిత ప్రాంతం నుండి వినవచ్చు. ప్రభావితమైన ఊపిరితిత్తిపై శబ్దం చేసినపుడు నిదానంగా వినిపిస్తుంది, కానీ స్వర ప్రతినాదం తగ్గడానికి బదులుగా పెరుగుతుంది (దీనిని పుపుస ద్రవం నుండి వేరుచేస్తుంది).[8] ఇవి సంబంధించిన సూచనలే అయినప్పటికీ, న్యుమోనియా ఉందని నిర్ధారించడానికి లేదా తోసిపుచ్చడానికి ఇవి సరిపోవు; అంతేకాక, అధ్యయనాలు సూచించిన దాని ప్రకారం ఒకే రోగిపై ఇద్దరు వైద్యులు వేర్వేరు నిర్ధారణలకు రావచ్చు.[9][10]

కారణం[మార్చు]

పై ప్యానెల్ ఒక సూక్ష్మదర్శిని క్రింద ఒక సాధారణ ఊపిరితిత్తును చూపిస్తుంది.తెలుపు రంగులో ఉన్న ఖాళీలు గాలిని కలిగి ఉన్న అల్వియోలై క్రింది ప్యానెల్ ఒక సూక్ష్మదర్శిని క్రింద న్యుమోనియాతో ఉన్న ఊపిరితిత్తును చూపిస్తుంది.ఎల్వియోలై మంట మరియు వ్యర్ధాలతో నిండిపోయింది.

న్యుమోనియా సూక్ష్మ జీవరాశుల వలన, ప్రకోపకారకాలు మరియు తెలియని కారణాల వలన కలుగుతుంది. న్యుమోనియాలు ఈ విధంగా విభజించబడినప్పుడు, వ్యాప్తి కారణాలు చాలా సాధారణంగా ఉంటాయి.

ఊపిరితిత్తులపై సూక్ష్మజీవుల దాడి మరియు ఈ వ్యాప్తికి రోగనిరోధక వ్యవస్థ యొక్క ప్రతిస్పందన సంక్రామ్యక న్యుమోనియా యొక్క లక్షణాలుగా ఉంటాయి. వందకు పైగా రకాల సూక్ష్మజీవుల ఆకారాలు న్యుమోనియను కలిగించగలిగినప్పటికీ, చాలా కేసులకు కొన్ని మాత్రమే కారణం. న్యుమోనియా యొక్క అత్యంత సాధారణ కారణాలలో వైరస్ లు మరియు బాక్టీరియా ఉన్నాయి. సాంక్రామ్యక న్యుమోనియా యొక్క అసాధారణ కారణాలలో ఫంగి మరియు పరాన్నజీవులు ఉన్నాయి.

వైరస్ లు[మార్చు]

పునరుత్పత్తి కొరకు వైరస్ లు కణాలపై దాడి చేస్తాయి. సాధారణంగా, వాయువులలోని చుక్కలు నోరు లేదా ముక్కు ద్వారా లోపలికి పీల్చినపుడు వైరస్ ఊపిరితిత్తులను చేరుతుంది. ఊపిరితిత్తులలోనికి ప్రవేశించిన తరువాత, వైరస్ వాయుగోళాల వాయుమార్గాల వెంటవుండే కణాలను ముట్టడిస్తుంది. ఈ దాడి తరచూ కణం యొక్క మరణానికి దారితీస్తుంది, వైరస్ నేరుగా కణాలను చంపండం కానీ, లేదా మృతకణాలు(అపోప్తోసిస్)గా పిలువబడే ఒక విధమైన కణ నియంత్రిత స్వయం-నాశనం ద్వారా కానీ ఇది జరుగుతుంది. రోగనిరోధక వ్యవస్థ వైరల్ అంటువ్యాధులకు ప్రతిస్పందించినపుడు, ఊపిరితిత్తులు మరింత నాశనమవుతాయి. తెల్ల రక్త కణములు, ముఖ్యంగా లింఫోసైట్లు, ప్రత్యేక రసాయనమైన సైటోకైన్లను ప్రేరేపిస్తాయి, అది ద్రవాన్ని వాయుగోళాలలోకి కారేటట్లు చేస్తుంది. ఈ విధంగా కణాల వినాశనం మరియు ద్రవం-నిండిన వాయుగోళాల సమ్మేళనం రక్తప్రవాహంలోనికి సాధారణ ఆక్సిజన్ సరఫరాకి అంతరాయం కలిగిస్తాయి.

ఊపిరితిత్తులను నాశనం చేయడంతో పాటు, అనేక వైరస్ లు ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేసి అనేక శారీరక క్రియలకు భంగం కలిగిస్తాయి. వైరస్ లు శరీరాన్ని బాక్టీరియా అంటువ్యాధులకు లోనయ్యేలా తయారుచేస్తాయి; ఈ కారణం వల్లనే బాక్టీరియల్ న్యుమోనియా వైరల్ న్యుమోనియను మరింత జటిలం చేస్తుంది.

వైరల్ న్యుమోనియా సాధారణంగా ఇన్ఫ్లుఎంజా వైరస్, రెస్పిరేటరీ సిన్సిటియాల్ వైరస్ (RSV), అడెనోవైరస్, మరియు మేటప్ న్యుమోవైరస్ వంటి వైరస్ ల వలన కలుగుతుంది. హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ అనే అసాధారణ కారకం నవజాత శిశువులలో మాత్రమే న్యుమోనియాను కలిగిస్తుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగి ఉన్న వారు సైటోమెగలోవైరస్ (CMV) వల్ల న్యుమోనియా పొందే హాని ఉంటుంది.

బాక్టీరియా[మార్చు]

ఎలెక్ట్రాన్ సూకష్మదర్శిని ద్వారా చిత్రీకరించబడిన, న్యుమోనియాకి ఒక సాధారణ కారణం అయిన బ్యాక్టీరియా స్త్రెప్తోకోకస్ న్యుమోనియే.

బాక్టీరియా ఊపిరితిత్తులలోకి వాయువులలోని రేణువులను పీల్చినపుడు ప్రవేశిస్తాయి, కానీ శరీరంలోని మరొక భాగంలో రోగలక్షణాలు ఉన్నపుడు రక్త ప్రవాహం ద్వారా ఊపిరితిత్తులకు చేరతాయి. అనేక బాక్టీరియాలు ముక్కు, నోరు మరియు ఎముక రంధ్రాల వంటి ఉన్నత శ్వాసక్రియ మార్గంలో నివశిస్తాయి, మరియు వాయుగోళాలలోనికి తేలికగా పీల్చబడతాయి. ఒకసారి లోపలికి ప్రవేశించిన తరువాత, బాక్టీరియా కణాల మధ్య ఖాళీ స్థలాన్ని మరియు వాయుగోళాల మధ్య స్థలాన్ని కలిపే రంధ్రాల ద్వారా దాడిచేస్తాయి. ఈ దాడి రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించి ఒక విధమైన రక్షక తెల్లరక్తకణాలు అయిన న్యూట్రోఫిల్స్ ను ఊపిరితిత్తుల లోనికి పంపేటట్లు చేస్తుంది. ఈ న్యూట్రోఫిల్స్ దాడి చేసే జీవులను మ్రింగివేసి చంపేస్తాయి, మరియు రోగనిరోధక వ్యవస్థను సాధారణంగా ఉత్తేజపరచే సైటోకిన్ లను విడుదల చేస్తాయి. ఇది బాక్టీరియల్ మరియు ఫంగల్ న్యుమోనియాలలో సాధారణంగా ఉండే జ్వరం, చలి, మరియు అలసటలకు దారితీస్తుంది. న్యూట్రోఫిల్స్, బాక్టీరియా, మరియు చుట్టుపక్కల ఉండే రక్త నాళాల లోని ద్రవాలు వాయుగోళాలను నింపి సాధారణ ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలిగిస్తాయి.

వ్యాధి సంక్రమించిన ఊపిరితిత్తు నుండి బాక్టీరియా రక్తప్రవాహంలోనికి ప్రయాణించి, తక్కువ రక్తపోటుతో కూడిన సెప్టిక్ షాక్ వంటి ప్రమాదకరమైన మరియు ప్రాణాంతకమైన వ్యాధిని కలిగిస్తుంది, మరియు శరీర భాగాలైన మెదడు, మూతపిండాలు, మరియు గుండెలకు హాని కలిగిస్తుంది. బాక్టీరియా ఊపిరితిత్తులు మరియు ఛాతీ గోడ మధ్య ప్రదేశం (శ్వాస కుహరం) లోనికి ప్రవేశించి పుపుస కుహరంలో చీము చేరడం అనే రుగ్మతను కలిగిస్తాయి.

బాక్టీరియల్ న్యుమోనియాకు అతి సాధారణ కారణం స్ట్రెప్టోకాకస్ న్యుమోనియా మరియు "వైవిధ్య" బాక్టీరియా. ఈ వైవిధ్య బాక్టీరియా అంతరకణ లేదా కణ కవచం లేని పరాన్నజీవి. అంతేకాక ఇవి తీవ్రంగా లేని న్యుమోనియాను కలిగిస్తాయి, అందువలన వైవిధ్య లక్షణాలు, ఇతర బాక్టీరియాల కంటే విభిన్న రకాల సూక్ష్మజీవి నాశకాలకు ప్రతిస్పందిస్తాయి.

న్యుమోనియాను కలిగించే గ్రామ్-పాజిటివ్ రకాల బాక్టీరియాను చాలా మంది ఆరోగ్యకర మానవుల ముక్కు లేదా నోటిలో కనుగొనవచ్చు. తరచుగా "న్యుమోకాకాస్"గా పిలువబడే స్ట్రిప్టోకాకస్ న్యుమోనియే కొత్తగా పుట్టిన శిశువులను మినహాయిస్తే మిగిలిన అన్ని వయసుల వారిలోనూ న్యుమోనియాను కలిగించే అతి సాధారణ బాక్టీరియల్ కారకం. ఎక్కువగా, అభివృద్ధి చెందుతున్న దేశాలలో న్యుమోకాకస్ వల్ల సంవత్సరానికి దాదాపు ఒక మిలియన్ శిశువులు మరణిస్తున్నారు.[11] న్యుమోనియాకు మరియొక ముఖ్య గ్రామ్-పాజిటివ్ కారకం స్టాఫిలోకాకస్ అరియెస్ , దీనిలో స్ట్రిప్టోకాకస్ అగలక్టియే అనేది అప్పుడే పుట్టిన శిశువులలో న్యుమోనియాకు ముఖ్య కారణమవుతోంది. గ్రామ్-నెగటివ్ బాక్టీరియా, గ్రామ్-పాజిటివ్ బాక్టీరియా కంటే తక్కువ తరచుగా న్యుమోనియాను కలిగిస్తుంది. న్యుమోనియాను కలిగించే గ్రామ్-నెగటివ్ బాక్టీరియా రకాలలో హీమోఫిలస్ ఇంఫ్లుయెన్జే , క్లేబ్సియెల్లా న్యుమోనియే , ఎస్చేరిచియాకోలి , సూడోమొనాస్ ఎరుగినోస మరియు మోరాక్జెల్ల కటర్ర్హలిస్ వంటివి కొన్ని. ఈ బాక్టీరియా ఎక్కువగా జీర్ణకోశం లేదా పేగులలో ఉండి వాంతిని పీల్చినపుడు ఊపిరితిత్తులలోనికి ప్రవేశిస్తాయి. న్యుమోనియాను కలిగించే "వైవిధ్య" బాక్టీరియా రకాలలో క్లామిడోఫైల న్యుమోనియే , మైకోప్లాస్మా న్యుమోనియే , మరియు లేగియోనెల్ల న్యుమోఫిల వంటివి కూడా ఉన్నాయి.

శిలీంద్రం[మార్చు]

ఫంగల్ న్యుమోనియా అసాధారణమైనది, కానీ ఇది, AIDS, రోగనిరోధకతను అణచివేసే ఔషధాలు లేదా ఇతర వైద్యపరమైన సమస్యల వలన నిరోధక వ్యవస్థ సమస్యలు కలిగి ఉన్న వ్యక్తులకు సంక్రమించవచ్చు. ఫంగి వల్ల కలిగే న్యుమోనియా యొక్క రోగలక్షణ శరీరధర్మం మాత్రం బాక్టీరియల్ న్యుమోనియా మాదిరిగానే ఉంటుంది. ఫంగల్ న్యుమోనియా తరచుగా హిస్టోప్లాస్మా కాప్సులాటుం , బ్లాస్టోమైసేస్, క్రిప్టోకాకస్ నియోఫోర్మాన్స్ , న్యుమోసైటిస్ జిరోవేకి , మరియు 0}క్రోసిడియోడేస్ ఇమ్మిటిస్ ల వలన కలుగుతుంది. హిస్టోప్లాస్మోసిస్ మిసిసిపి నదీపరీవాహక ప్రాంతంలో చాలా సాధారణంగా ఉంటుంది, మరియు కాక్సిడియోడిమైకోసిస్ నైరుతి యునైటెడ్ స్టేట్స్ లో సాధారణం.

పరాన్న జీవులు[మార్చు]

అనేక రకాల పరాన్నజీవులు ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయి. ఈ పరాన్న జీవులు శరీరంలోనికి చర్మం ద్వారా లేదా మ్రింగడం ద్వారా ప్రవేశిస్తాయి. ఒకసారి శరీరంలోనికి ప్రవేశించిన తరువాత, అవి సాధారణంగా రక్తం ద్వారా, ఊపిరితిత్తుల లోనికి ప్రయాణిస్తాయి. న్యుమోనియాలో ఇతర రకాలు కూడా ఉన్నాయి, కణజాల నాశనం మరియు రక్షణ వ్యవస్థ ప్రతిస్పందనల మిశ్రమం ఆక్సిజన్ రవాణాకు విఘాతం కలిగించవచ్చు. ఒక విధమైన తెల్ల రక్త కణం, ఇసినోఫిల్, పరాన్నజీవి రోగ సంక్రమణకు తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది. ఊపిరితిత్తులలోని ఇసినోఫిల్స్ ఇసినోఫిలిక్ న్యుమోనియాకి దారి తీస్తాయి, ఆ విధంగా ప్రాథమికంగా ఉన్న పరాన్నజీవి న్యుమోనియా క్లిష్టమవుతుంది. న్యుమోనియాను కలిగించే పరాన్నజీవులలో సాధారణంగా టోక్సోప్లాస్మా గొన్దీ , స్ట్రోన్గిలోయిడెస్ స్టర్కోరలిస్ , మరియు అస్కారియసిస్ ఉన్నాయి.

కారణం తెలియనివి[మార్చు]

ఇడియోపతిక్ ఇంటర్స్టీషియల్ న్యుమోనియాస్ (IIP) అనేవి ఊపిరితిత్తుల విసరణ వ్యాధులు. కొన్ని రకాల IIP లలో, ఉదాహరణకు కొన్ని రకాల సాధారణ ఇంటర్స్టీషియల్ న్యుమోనియాలలో, నిజానికి కారణం తెలియదు. కొన్ని రకాల IIP లలో కారణం తెలుస్తుంది, ఉదాహరణకు దేస్క్వమేటివ్ ఇంటర్ స్టీషియల్ న్యుమోనియా పొగ త్రాగడం వలన కలుగుతుంది, మరియు ఆ పేరు ఒక తగని పేరు.

వ్యాధి నిర్ధారణ[మార్చు]

రొమ్ము x-ray లో కనిపించే విధంగా న్యుమోనియా. A: సాధారణ రొమ్ము x-ray. B: కుడి ఊపిరితిత్తులో న్యుమోనియా నీడతో ఉన్న అసాధారణ రొమ్ము x-ray (తెలుపు ప్రాంతం, చిత్రం యొక్క ఎడమ వైపు).
కుడి వైపు ఉన్న న్యుమోనియాను చూపిస్తున్న రొమ్ము యొక్క CT ( చిత్రం యొక్క కుడి వైపు ).

రోగి యొక్క లక్షణాలు మరియు శారీరక పరీక్షల వలన న్యుమోనియా అని అనుమానించితే, నిర్ధారణను ధృవపరచడానికి మరిన్ని పరీక్షలు అవసరం. ఛాతీ X-రే నుండి సమాచారం మరియు రక్త పరీక్షలు సహాయ పడతాయి, కొన్ని సందర్భాలలో కఫం పరీక్ష కూడా ఉపయోగపడుతుంది. X-రే సదుపాయాలున్న వైద్యశాలలు మరియు వైద్య కేంద్రాలలో రోగ నిర్ధారణకు సాధారణంగా ఛాతీ X-రే ఉపయోగిస్తారు. ఏదేమైనా, సమాజ వ్యవస్థలో (సాధారణ పద్ధతి), న్యుమోనియా సాధారణంగా లక్షణాలు మరియు భౌతిక పరీక్ష ఆధారంగానే నిర్దారింపబడుతుంది.[ఆధారం కోరబడినది] కొంతమందిలో, ప్రత్యేకించి ఇతర రోగాలతో బాధపడే వారిలో న్యుమోనియా నిర్ధారణ కష్టతరంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఒక ఛాతీ యొక్క CT స్కాన్ లేదా ఇతర పరీక్షలు న్యుమోనియాను ఇతర రోగాల నుండి వేరు చేయడానికి అవసరమవుతాయి.

పరిశోధనలు[మార్చు]

అస్పష్ట పరిస్థితులలో న్యుమోనియా నిర్ధారణకు ఛాతీ x-రే ఒక ముఖ్య పరీక్ష. ఛాతీ x-రేలు అస్పష్టత ఉన్న ప్రదేశాలను తెలియచేస్తాయి (తెల్లగా కనబడేవి) ఇవి గట్టిదనాన్ని సూచిస్తాయి. న్యుమోనియా ప్రతిసారీ X-రే లలో కనిపించదు, ఎందుకంటే వ్యాధి ప్రారంభ దశలలో ఉండటం, లేదా ఊపిరితిత్తులలో వ్యాధి వ్యాపించిన భాగాలను x-రే లో తేలికగా చూడలేక పోవడం. ఛాతీ x-రే లో న్యుమోనియా కనిపించని కొన్ని సందర్భాలలో, ఛాతీ CT (కంప్యూటెడ్ టోమోగ్రఫీ) ద్వారా దీనిని గుర్తించవచ్చు. కొన్నిసార్లు X-రేలు తప్పుదారి చూపించవచ్చు, ఊపిరితిత్తుల మీది మచ్చలు మరియు రక్తాధిక్య గుండె వైఫల్యం(కంజెస్టివ్ హార్ట్ డిసీజ్), వంటి ఇతర సమస్యలు X-రే లో న్యుమోనియాను అనుకరిస్తాయి.[12] న్యుమోనియా యొక్క హానిని అంచనా వేయడానికి కూడా ఛాతీ X-రే లను ఉపయోగిస్తారు (క్రింద చూడుము. )

సూక్ష్మజీవి నాశకాలు రోగి యొక్క ఆరోగ్యం మెరుగుపరచడంలో వైఫల్యం చెందినపుడు, లేదా ఆరోగ్య కార్యకర్తకు నిర్ధారణ గురించి అనుమానమున్నపుడు, రోగి యొక్క కఫ పరీక్షను కోరవచ్చు. కఫ పరీక్షలకు రెండు నుండి మూడు రోజుల సమయం పడుతుంది, అందువలన అవి ముందే ప్రారంభించబడిన సూక్ష్మజీవి నాశకాలకు సంక్రామ్యత ఎంతవరకు ప్రతిస్పందిస్తోందో ధృవపరచుకోవడానికి ఉపయోగించబడతాయి. రక్తంలోని బాక్టీరియాను కనుగొనడానికి రక్త నమూనాను కూడా ఇదే విధంగా పరీక్షించవచ్చు. బాక్టీరియాను గుర్తించినట్లయితే వాటిపై ఏ సూక్ష్మజీవి నాశకాలు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయో పరీక్షించబడతాయి.

ఒక సంపూర్ణ రక్త గణనలో అధిక తెల్ల రక్తకణాల గణన ఉన్నట్లయితే, అది ఒక అంటువ్యాధి లేదా శోధను (మంటను) సూచిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ సమస్యలు ఉన్న కొందరు వ్యక్తులలో, తెల్ల రక్తకణాల గణన వంచనా పూరితంగా సాధారణంగా ఉంటుంది. మూత్రపిండాల పనితీరును అంచనా వేయడానికి (కొన్ని సూక్ష్మజీవి నాశకాలను సూచించడంలో ముఖ్యమైనది) లేదా రక్తంలో సోడియం హీనతను గమనించడానికి రక్త పరీక్షలను వాడవచ్చు. న్యుమోనియాలో రక్తంలో సోడియం హీనత కలగడానికి ఊపిరితిత్తులు(SIADH) వ్యాధి బారినపడి యాంటి-డైయురేటిక్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి చేయడం కారణమని భావిస్తారు. ప్రత్యేక రక్త సిరాలజీ పరీక్షలు ఇతర బాక్టీరియాలైన (మైకోప్లాస్మా , లేజియోనెల్ల మరియు క్లమిడోఫిలా ) కొరకు మరియు మూత్ర పరీక్ష లేజియోనెల్ల ప్రతి రక్షకానికి లభిస్తున్నాయి. ఇన్ఫ్లుఎంజా, రెస్పిరేటరి సిన్సిటిఅల్ వైరస్, మరియు అడెనోవైరస్ ల ఉనికి కొరకు శ్వాసక్రియా స్రావాలను కూడా పరీక్షించవచ్చు. పూతిక వలన కలిగే హానిని తెలుసుకోవడానికి కాలేయ పనితీరు పరీక్షలు జరపవలసి ఉంటుంది.[8]

కనుగొన్న విషయాలను మిళితం చెయ్యటం[మార్చు]

అత్యవసర గదిలో నున్న 1134 రోగుల ఛాతీ రేడియోగ్రాఫ్ లను శోధించి ఉత్తమమైనవిగా ఊహించబడిన ఐదు రోగ చిహ్నాలు కనుగొనబడిన ఒక అధ్యయనం క్రింది విధంగా వాటిని సూచించింది.[13]

 • ఉష్ణోగ్రత > 100 డిగ్రీస్ F (37.8 డిగ్రీస్ C)
 • నాడి > 100 స్పందనలు/నిమిషం
 • పొలుసులు/పగుళ్ళు
 • శ్వాస శబ్దాలు తగ్గిపోవటం
 • ఉబ్బసం లేకపోవటం

అనేక కనుగొన్న విషయాల పై ఆధారపడిన రెండు ప్రత్యేక ప్రామాణికతలలో శోధించబడిన సంభావ్యత:

 • 5 కనుగొన్న విషయాలు - 84% నుండి 91% అవకాశం
 • 4 కనుగొన్న విషయాలు - 58% నుండి 85%
 • 3 కనుగొన్న విషయాలు - 35% నుండి 51%
 • 2 కనుగొన్న విషయాలు - 14% నుండి 24%
 • 1 కనుగొన్న విషయాలు - 5% నుండి 9%
 • 0 కనుగొన్న విషయాలు - 2% నుండి 3%

తరువాత జరిగిన ఒక అధ్యయనంలో [14] వైద్యుని నిర్ణయంతో నాలుగు ఊహాజనిత నియమాలను పోల్చినపుడు వాటిలో రెండు నియమాలు, పైన చెప్పబడిన[13] మరియు [15] కూడా వైద్యుని నిర్ణయం కంటే ఎక్కువ ఖచ్చితత్వాన్ని కలిగి ఉన్నాయి, దీనికి కారణం ఊహాజనిత నియమాలలో ఎక్కువ నిశ్చితత్వం ఉండటం.

వైవిధ్యాన్ని చూపే వ్యాధి నిర్దారణ[మార్చు]

అనేక వ్యాధులు మరియు/లేదా పరిస్థితులు న్యుమోనియా వంటి రోగ లక్షణాలను కనబరచవచ్చు మరియు వ్యాధి యొక్క నిర్ధారణలో అంత జాగ్రత్త అవసరం. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) లేదా అనేక ధ్వనుల గురకతో కూడిన ఆస్తమా, న్యుమోనియా వంటిదే. ఊపిరితిత్తులలో నీరు మూడవ రకం గుండె ధ్వని మరియు అసాధారణ ECG వలన న్యుమోనియాగా పొరపాటు పడే అవకాశం ఉంది. గమనించదగిన ఇతర వ్యాధులలో శ్వాసనాళాల వాపు, ఊపిరితిత్తుల కాన్సర్ మరియు పల్మనరీ ఎమ్బోలి(పుపుస రక్త స్రావ నిరోధం) ఉన్నాయి.[8]

నివారణ[మార్చు]

సంక్రామ్యక న్యుమోనియాను నివారించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒక వ్యక్తి న్యుమోనియా వ్యాధి యొక్క హానికి గురయ్యే అవకాశాలను ఆధార రుగ్మతలకు (AIDS వంటి వాటిని) సక్రమంగా చికిత్స చేయడం ద్వారా నివారించవచ్చు. పొగత్రాగడం ఆపివేయడం చాలా ముఖ్యమైనది ఎందుకంటే అది ఊపిరి తిత్తులు పాడవడాన్ని పరిమితం చేయడంలో సహాయం చేయడమే కాక, న్యుమోనియాకు వ్యతిరేకంగా శరీరంలోని సహజ రక్షకాలకు సిగరెట్ పొగ అడ్డుపడుతుంది.

పరిశోధన ప్రకారం నవజాత శిశువులలో న్యుమోనియాను అరికట్టడానికి అనేక మార్గాలున్నాయి. గర్భవతులైన స్త్రీలకు గ్రూప్ B స్ట్రిప్టోకాకస్ మరియు క్లమిడియా ట్రకోమాటిస్ కొరకు పరీక్షలు చేయడం, మరియు అవసరమైనపుడు సూక్ష్మజీవి నాశక చికిత్స అందించడం వల్ల, శిశువులలో న్యుమోనియా తగ్గుతుంది. శిశువుల యొక్క నోరు మరియు గొంతును మేకోనియం-వడకట్టిన అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తో పీల్చడం వలన ఆశించే న్యుమోనియా యొక్క రేటు తగ్గుతుంది.

పిల్లలలో మరియు పెద్దవారిలో న్యుమోనియా నివారణకు టీకాలు వేయడం ముఖ్యం. హేమోఫిలుస్ ఇన్ఫ్లుఎంజా మరియు స్ట్రిప్టోకాకస్ న్యుమోనియా లకు వ్యతిరేకంగా జన్మించిన మొదటి సంవత్సరంలో టీకాలు వేయడం వలన పిల్లలలో న్యుమోనియా ఏర్పడడంలో ఈ బాక్టీరియా పాత్ర చాలా వరకు తగ్గింది. పిల్లలకు స్ట్రిప్టోకాకస్ న్యుమోనియా కు వ్యతిరేకంగా టీకాలు వేయడం పెద్దవారిలో ఈ వ్యాధి సంక్రామ్యత తగ్గుముఖం పట్టడానికి దారి తీసింది దీనికి కారణం ఎక్కువ మంది పెద్దవారు ఈ వ్యాధి పిల్లల నుండే పొందడం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హిబ్ టీకా విస్తృతంగా వాడుతున్నారు. ఇది మారుతున్నప్పటికీ, 2009 నాటికి అధిక ఆదాయం కల దేశాలలో ఇంకా చిన్న పిల్లల న్యుమోకాకల్ టీకాను వాడుతున్నారు. 2009లో, జాతీయ టీకా కార్యక్రమంలో న్యుమోకోకల్ సంయోజక టీకాను చేర్చిన మొదటి అల్ప-ఆదాయ దేశం రవాండా.[16]

పెద్దలకు స్ట్రిప్టోకాకస్ న్యుమోనియా వ్యతిరేక టీకా కూడా అందుబాటులో ఉంది. U.S.లో, 65 సంవత్సరాలు నిండిన వారిలో ఆరోగ్యవంతులైన వారందరికీ మరియు పెద్దవారిలో ఊపిరితిత్తులలోని వాయుగోళాల వాపు, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, డయాబెటిస్ మెల్లిటస్, కాలేయం యొక్క సిర్రోసిస్, మద్యపానం, మెదడు వెన్నెముక ద్రవ స్రావాలు ఉన్నవారికీ లేదా ప్లీహం లేనివారికి సూచించబడింది. ఐదు లేదా పది సంవత్సరాల తరువాత మరలా టీకాలు ఇవ్వవలసి ఉంటుంది.[17]

స్ట్రిప్టోకాకస్ న్యుమోనియా కి వ్యతిరేకంగా టీకాలు తీసుకున్న వ్యక్తులందరికీ ప్రతి సంవత్సరం ఇన్ఫ్లుఎంజా టీకా ఇవ్వవలసి ఉంటుంది. వీరితో బాటు, ఆరోగ్య రక్షణ కార్యకర్తలు, ప్రజారోగ్య కేంద్రాలలో నివసించే వారు, మరియు గర్భిణీ స్త్రీలు టీకాలు తీసుకోవాలి.[18] పడిశం(ఇన్ఫ్లుఎన్జ) చెలరేగినపుడు, అమంటడీన్, రిమాంటడీన్, జానమివిర్, మరియు ఒసేల్టమివిర్ వంటి మందులు పడిశాన్ని నిరోధించడానికి సహాయ పడతాయి.[19][20]

చికిత్స[మార్చు]

చాలా వరకు న్యుమోనియా కేసులకు వైద్యశాలలో చేర్చకుండానే చికిత్స అందించవచ్చు. నోటి ద్వారా తీసుకునే సూక్ష్మజీవి నాశకాలు, విశ్రాంతి, ద్రవాలు, మరియు గృహ సంరక్షణ సంపూర్ణ నివారణకు సరిపోతాయి. ఏదేమైనా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, మరియు వయసులో పెద్దవారికి మరింత మెరుగైన చికిత్స అవసరమవుతుంది. లక్షణాలు మరీ తీవ్రంగా ఉన్నపుడు, గృహ చికిత్స ద్వారా న్యుమోనియా తగ్గనపుడు, లేదా సమస్యలు వచ్చినపుడు, రోగిని వైద్యశాలలో చేర్చవలసి ఉంటుంది.

బాక్టీరియల్ న్యుమోనియా[మార్చు]

బాక్టీరియల్ న్యుమోనియాకు చికిత్స చేయడానికి సూక్ష్మజీవి నాశాకాలను వాడతారు. దీనికి వ్యతిరేకంగా, వైరల్ న్యుమోనియాలో సూక్ష్మజీవి నాశకాలు ఉపయోగపడవు, అయితే వైరల్ న్యుమోనియా వలన దెబ్బతిన్న ఊప్పిరితిత్తులకు చికిత్స చేయడానికి లేదా బాక్టీరియా సోకకుండా నిరోధించడానికి వీటిని వాడతారు.[ఆధారం కోరబడినది] యాంటిబయోటిక్ ఎంపిక న్యుమోనియా యొక్క స్వభావం, స్థానిక భూభాగంలో ఉండే సాధారణంగా ఉండే సూక్ష్మజీవులు, మరియు నిరోధక స్థితి మరియు వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి పై ఆధారపడి ఉంటుంది. న్యుమోనియా చికిత్స దానికి కారణమైన సూక్ష్మజీవి మరియు దాని యాంటిబయోటిక్ ప్రతిస్పందన ఆధారంగా జరగాలి. ఏదేమైనా, విస్తృతమైన అంచనాల తరువాత కూడా కేవలం 50% ప్రజలలోనే న్యుమోనియా యొక్క నిర్దిష్ట కారణం గుర్తించబడుతోంది.[ఆధారం కోరబడినది] ఎందుకంటే, తీవ్రమైన న్యుమోనియా ఉన్న వ్యక్తికి సాధారణంగా చికిత్సలో జాప్యం జరుగకూడదు, ప్రయోగశాల నివేదికలు అందుబాటులోకి రాకముందే సాధారణంగా అనుభవం పై ఆధారపడిన చికిత్స మొదలుపెడతారు. యునైటెడ్ కింగ్డంలో, అమోక్సిసిలిన్ మరియు క్లారిత్రోమైసిన్ లేదా ఎరిత్రోమైసిన్ వంటి యాంటిబయోటిక్ లను సంఘం-నుండి వచ్చిన న్యుమోనియా రోగుల కొరకు ఎంపిక చేస్తారు; పెనిసిలిన్ లు సరిపడని రోగులకు అమోక్సిసిలిన్ కు బదులుగా ఎరిత్రోమైసిన్ ఇవ్వడం జరుగుతుంది.[21] ఉత్తర అమెరికాలో, "వైవిధ్య" విధాలైన సంఘం-నుండి సంక్రమించిన న్యుమోనియా అత్యంత సాధారణంగా మారాయి, మాక్రోలైడ్ లు (అజిత్రోమైసిన్ మరియు క్లారిత్రోమైసిన్ వంటివి), ఫ్లురోక్వినోలోన్స్, మరియు డొక్సిసిక్లిన్ సంఘం నుండి-సముపార్జించిన న్యుమోనియా అవుట్ పేషంట్ చికిత్సలో అమోక్సిసిలిన్ స్థానాన్ని ఆక్రమించాయి.[22] సాంప్రదాయకంగా చికిత్స అవధి ఏడు నుండి పది రోజులుగా ఉంది, కానీ స్వల్పకాల(కేవలం మూడురోజుల) చికిత్సలు సరిపోతున్నాయనడానికి ఆధారాలు ఉన్నాయి.[23][24][25]

వైద్యశాల-సముపార్జిత న్యుమోనియా యొక్క యాంటిబయోటిక్ లలో మూడవ- మరియు నాల్గవ-తరం సెఫలోస్పోరిన్స్, కార్బపెనెంస్, ఫ్లురో క్వినోలోన్స్, ఎమినో గ్లైకో సైడ్స్, మరియు వాన్కోమైసిన్ ఉన్నాయి.[26] ఈ యాంటిబయోటిక్స్ ను సాధారణంగా సిరల ద్వారా ఇస్తారు. కారణమైన అనేక సూక్ష్మజీవులకు చికిత్స చేయడంలో ప్రయత్నంగా అనేక యాంటిబయోటిక్ ల సమ్మేళనాలను ఉపయోగించవచ్చు. ప్రాంతాలను బట్టి సూక్ష్మజీవులలో తేడాలు ఉండటంవలన ఒక వైద్యశాలకు మరొక వైద్యశాలకు మధ్య యాంటిబయోటిక్ ఎంపికలో తేడాలు ఉండవచ్చు, మరియు యాంటి బయోటిక్ చికిత్సలకు సూక్ష్మజీవుల నిరోధకత సామర్ధ్యాన్ని బట్టి కూడా యాంటిబయోటిక్ లలో తేడాలు వస్తాయి.

న్యుమోనియా వలన శ్వాస తీసుకోవడం కష్టమైన రోగులకు అదనపు ఆక్సిజన్ అవసరం కావచ్చు. తీవ్రంగా జబ్బుపడిన వ్యక్తులకు ఇంటెన్సివ్ కేర్(తీవ్రమైన జాగ్రత్త) అవసరమవుతుంది, దీనిలో సాధారణంగా ఎండోట్రకియేల్ ఇంట్యూబేషన్ మరియు కృత్రిమ వాయు ప్రసరణ ఉంటాయి.

దుకాణాలలో అమ్మే దగ్గు మందు న్యుమోనియా సహాయకారిగా గుర్తించబడలేదు.[27]

వైరల్ న్యుమోనియా[మార్చు]

ఇన్ఫ్లుఎంజా A వలన కలిగే వైరల్ న్యుమోనియా చికిత్సకు రిమాంటడిన్ లేదా అమంటడిన్ వాడతారు, అయితే ఇన్ఫ్లుఎంజా A లేదా B వలన ఏర్పడే వైరల్ న్యుమోనియా చికిత్స ఒసేల్టామివిర్ లేదా జానమివిర్ తో చేయవచ్చు. లక్షణాలు మొదలైన 48 గంటల లోపు ప్రారంభించినపుడు మాత్రమే ఈ చికిత్సలు ఉపయోగకరంగా ఉంటాయి. అనేక రూపాలైన H5N1 ఇన్ఫ్లుఎంజా A, అవియన్ ఇన్ఫ్లుఎంజా లేదా "బర్డ్ ఫ్లూ,"గా కూడా పిలువబడుతుంది, రిమాంటడిన్ మరియు అమంటడిన్ కు నిరోధకత కనబరచింది. SARS కరోనావైరస్, అడెనోవైరస్, హంటవైరస్, లేదా పారాఇన్ఫ్లుఎంజా వైరస్ ల వలన కలిగి వైరల్ న్యుమోనియాలకు సమర్ధవంతమైన చికిత్సలు ఇంకా తెలియవు.

ఆశించిన న్యుమోనియా[మార్చు]

బాక్టీరియా సంక్రమించని రసాయనిక న్యుమోనిటిస్ కు యాంటి బయోటిక్స్ వాడటానికి బలం చేకూర్చే ఆధారాలు లేవు. ఆశించిన న్యుమోనియాలో సంక్రామ్యత ఉంటే, యాంటి బయోటిక్ ఎంపిక అనేక కారకాల పై ఆధారపడి ఉంటుంది, వీటిలో వ్యాధి కారకంగా అనుమానింపబడే జీవి మరియు న్యుమోనియా సంఘం ద్వారా సముపార్జించినదా లేదా వైద్యశాలలో అభివృద్ధి చెందినదా వంటివి ఉంటాయి. సాధారణ ఎంపికలలో క్లిండామైసిన్, బీటా-లాక్టం యాంటిబయోటిక్ మరియు మెత్రోనిడాజోల్ ల సమ్మేళనం, లేదా ఎమినోగ్లైకోసైడ్ ఉంటాయి.[28] కార్టికోస్టెరాయిడ్ లు సాధారణంగా ఆశించిన న్యుమోనియాకు వాడతారు, కానీ వాటి ఉపయోగాన్ని సమర్ధించే ఆధారాలు కూడా లేవు.[28]

సమస్యలు[మార్చు]

కొన్నిసార్లు న్యుమోనియా అదనపు సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యలు ఎక్కువగా బాక్టీరియల్ న్యుమోనియా మరియు వైరల్ న్యుమోనియాలలో ఉంటాయి. అత్యంత ముఖ్యమైన సమస్యలలో ఇవి ఉన్నాయి:

శ్వాసకోశ మరియు రక్త ప్రసరణ వ్యవస్థలు పని చెయ్యకపోవటం[మార్చు]

న్యుమోనియా ఊపిరితిత్తులను ప్రభావితం చేయడం వలన, న్యుమోనియా రోగులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కుంటారు, ఆధారం లేకుండా, జీవించడానికి తగినంత శ్వాసించడం వారికి సాధ్యం కాకపోవచ్చు. బై-లెవెల్ పోజిటివ్ ఎయిర్ వే ప్రెషర్ యంత్రం వంటి రోగ-వ్యాప్తి చేయని శ్వాస సహాయత ఉపయోగకరంగా ఉంటుంది. ఇతర సందర్భాలలో, శ్వాసనాళాల లోకి గొట్టం (బ్రీతింగ్ ట్యూబ్) ప్రవేశ పెట్టడం అవసరం కావచ్చు, కృత్రిమ వాయుప్రసరణ కూడా వ్యక్తి ఊపిరి పీల్చుకోవడానికి సహాయ పడుతుంది.

అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రస్ సిండ్రోమ్ (ARDS)ను ప్రేరేపించడం ద్వారా న్యుమోనియా శ్వాసకోశ వైఫల్యాన్ని కలిగిస్తుంది, దీని ఫలితంగా సంక్రామ్యత మరియు వాపుల మిళిత ప్రతిస్పందన ఉంటుంది. ఊపిరితిత్తులు త్వరితంగా స్రావంతో నిండిపోయి పెళుసుగా తయారవుతాయి. ఈ పెళుసుదనం, వాయుగోళాలలో ద్రవం వలన ఆక్సిజన్ తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు తోడై, యాంత్రిక వాయు సరఫరా అవసరాన్ని సృష్టిస్తుంది.

ప్లూరల్ ఎఫ్యూషన్ ప్లూరల్ ఎఫ్యూషన్ చూపిస్తున్న రొమ్ము x-rayA బాణం గుర్తు కుడి రొమ్ములో "ద్రవ్య పొరను" సూచిస్తుంది. బ బాణం గుర్తు కుడి ఊపిరితిత్తు యొక్క వెడల్పును సూచిస్తుంది.ఊపిరితిత్తు చుట్టూ ద్రవాలు పేరుకుపోవటం వలన ఉపయోగకరమైన ఊపిరితిత్తు యొక్క పరిమాణం తగ్గిపోతుంది.

పూతిక మరియు సెప్టిక్ షాక్ న్యుమోనియా యొక్క ప్రభావవంతమైన సమస్యలు. సూక్షంజీవులు రక్తప్రవాహం లోనికి ప్రవేశించినపుడు నిరోధక వ్యవస్థ సైటోకైన్స్ స్రవించడం ద్వారా ప్రతిస్పందించినపుడు పూతిక ఏర్పడుతుంది. పూతిక సాధారణంగా బాక్టీరియల్ న్యుమోనియాలో ఏర్పడుతుంది; స్ట్రిప్టోకాకస్ న్యుమోనియా అత్యంత సాధారణ కారణం. పూతిక లేదా సెప్టిక్ షాక్ కు గురైన రోగులను వైద్యశాలలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్చవలసి ఉంటుంది. వారికి రక్తపోటు తగ్గకుండా ఉండటానికి తరచుగా సిరల ద్వారా ద్రవములు మరియు మందులు ఎక్కించవలసి ఉంటుంది. పూతిక తరచు కాలేయం, మూత్రపిండాలు, మరియు గుండె దెబ్బతినడం, ఇంకా ఇతర సమస్యలను కలిగిస్తుంది మరియు తరచూ మరణానికి కారణమవుతుంది.

పుపుసావరణ ద్రవం, పుపుస కుహరంలో చీము, మరియు గడ్డలు[మార్చు]

అప్పుడప్పుడూ, ఊపిరితిత్తులకు వ్యాపించే సూక్ష్మజీవులు ద్రవానికి కారణమవుతాయి (ఒక పుపుసావరణ ద్రవం) ఇది ఊపిరి తిత్తుల చుట్టూ ఉండే స్థలాన్ని నింపివేస్తుంది (పుపుస కుహరం). సూక్ష్మజీవులు పుపుసకుహరంలో ఉంటే, ఈ ద్రవాన్ని పుపుసకుహరంలో చీము అంటారు. ఒక న్యుమోనియా రోగిలో ఈ పుపుసావరణ ద్రవం ఉన్నట్లయితే, ఈ ద్రవాన్ని తరచూ సూదితో సేకరించి (థోరాసెంటేసిస్) పరీక్షిస్తారు. ఈ పరీక్ష ఫలితాల పై ఆధారపడి, ద్రవాన్ని పూర్తిగా తొలగించడం అవసరమవుతుంది, ఇందుకు తరచూ ఛాతీ గొట్టం ఉపయోగిస్తారు. పుపుస కుహరంలోని చీము తీవ్రంగా ఉన్న పరిస్థితులలో శస్త్ర చికిత్స అవసరం కావచ్చు. ద్రవాన్ని తొలగించకపోతే, సంక్రామ్యత తొలగదు, ఎందుకంటే పుపుస కుహరంలోనికి యాంటిబయోటిక్స్ చొచ్చుకొని పోలేవు.

అరుదుగా, ఊపిరితిత్తులలోని బాక్టీరియా సంక్రామ్యక ద్రవంతో కలిసి గడ్డగా పిలువబడే సంచి లాగా తయారవుతుంది. ఊపిరితిత్తులలోని గడ్డలను సాధారణంగా ఛాతీ x-రే లేదా ఛాతీ CT స్కాన్ ద్వారా చూడవచ్చు. గడ్డలు సాధారణంగా ఆశించిన న్యుమోనియాలో వస్తాయి మరియు తరచూ అనేక రకాలైన బాక్టీరియాను కలిగి ఉంటాయి. సాధారణంగా ఊపిరితిత్తులలోని గడ్డల చికిత్సకు యాంటిబయోటిక్స్ సరిపోతాయి, కానీ కొన్ని సార్లు ఈ గడ్డలను సర్జన్ లేదా రేడియాలజిస్ట్ తొలగిస్తారు.

వ్యాధిని అంచనా వెయ్యటం[మార్చు]

చికిత్సతో, అధిక భాగం బాక్టీరియల్ న్యుమోనియా రకాలను రెండు నుండి నాలుగు వారాలలో తగ్గించవచ్చు.[29] వైరల్ న్యుమోనియా ఎక్కువ కాలం ఉండవచ్చు, మరియు మైకోప్లాస్మల్ న్యుమోనియా పూర్తిగా తగ్గడానికి నాలుగు నుండి ఆరువారాల సమయం పట్టవచ్చు.[29] న్యుమోనియా సంఘటన యొక్క అంతిమ ఫలితం వ్యాధి మొదట నిర్ధారించబడినప్పుడు అతను లేదా ఆమె ఎంత జబ్బుపడి ఉన్నారనే దాని పై ఆధారపడి ఉంటుంది.[29]

యునైటెడ్ స్టేట్స్ లో, న్యుమోకాకల్ న్యుమోనియా వచ్చిన ప్రతి ఇరవై మందిలో ఒకరు చనిపోతారు.[30] న్యుమోనియా అధిగమించి రక్తాన్ని విషపూరితం (బాక్టేరేమియా) చేసిన కేసులలో, రోగులలో కేవలం 20% మరణిస్తారు.[31]

మరణాల రేటు (లేదా మృతుల సంఖ్య) న్యుమోనియా యొక్క ఆధార కారణం పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మైకోప్లాస్మా వలన సంభవించే న్యుమోనియాలో మరణాలు చాలా తక్కువ. ఏమైనప్పటికీ, మెథిసిలిన్-నిరోధకతతో స్టాఫిలోకాకస్ ఆరియస్ (MRSA) న్యుమోనియా కలిగిన రోగులలో వెంటిలేటర్ పై ఉన్నవారిలో దాదాపు సగం మంది మరణించవచ్చు.[32] ఆధునిక వైద్య సేవా సౌకర్యాలు లేని ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో, న్యుమోనియా మరీ ఎక్కువ మరణ కారకంగా ఉంది. వైద్యశాలలు మరియు ఆసుపత్రుల అందుబాటు పరిమితంగా ఉండటం, x-కిరణాల అందుబాటు పరిమితంగా ఉండటం, సూక్ష్మ నాశకాల పరిమిత ఎంపిక, వ్యాధికి ముఖ్య కారణాలకు చికిత్స చేయలేకపోవటం వంటి కారణాలతో న్యుమోనియా వ్యాధి మరణాల రేటు పెరుగుతోంది. ఈ కారణాల వలన అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇదు సంవత్సరాల లోపు వయసు గల పిల్లల మరణాలలో ఎక్కువ భాగం న్యుమోకాకల్ వ్యాధి వల్ల సంభవిస్తున్నాయి.[11]

చికిత్స అంచనా నిబంధనలు[మార్చు]

న్యుమోనియా యొక్క లక్షణాలను మరింత లక్ష్య పూర్వకం చేయడానికి చికిత్స అంచనా నియమాలు అభివృద్ధి పరచబడతాయి. ఒక రోగిని వైద్యశాలలో చేర్చడాన్ని నిర్ణయించడంలో ఈ నియమాలు సహాయపడతాయి.

ఎపిడెమియోలజి[మార్చు]

ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో న్యుమోనియా చాలా సాధారణమైన వ్యాధి. అన్ని వయో సమూహాలలోను ఇది మరణానికి ముఖ్య కారణంగా ఉంది. పిల్లలలో, ఈ మరణాలు ఎక్కువగా జనన సమయంలో సంభవిస్తాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి అంచనా ప్రకారం ప్రతి ముగ్గురు నవజాత శిశువులలో ఒకరు న్యుమోనియా వలన మరణిస్తున్నారు.[35] ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లలలో రెండు మిలియన్లకు పైన చనిపోతున్నారు. WHO వారి అంచనా ప్రకారం వీరిలో 1 మిలియన్ (టీకా ద్వారా నిరోధించతగినవి) చావుల వరకు స్ట్రెప్టోకాకస్ న్యుమోనియా బాక్టీరియా వలన సంభవిస్తున్నాయి, మరియు వీటిలో 90% పైన చావులు అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంభవిస్తున్నాయి.[36] బాగా పెద్ద వయసు వచ్చే వరకు న్యుమోనియా వలన సంభవించే మరణాలు సాధారణంగా వయసుతో పాటు తగ్గుతుంటాయి. పెద్ద వయసు వారికి, న్యుమోనియా వలన మరియు దాని సంబంధిత మరణం వలన ప్రత్యేక హాని పొంచి ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ వ్యాధి యొక్క భార తీవ్రత వలనను మరియు పారిశ్రామిక దేశాలలో వ్యాధి పట్ల అవగాహన తక్కువగా ఉండటం వలన, సంబంధిత పౌరులు మరియు విధాన నిర్ణేతలు వ్యాధికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంఘం నవంబర్ 2 ను వరల్డ్ న్యుమోనియా డేగా ప్రకటించింది.

యునైటెడ్ కింగ్డం లో, 18–39 సంవత్సరాల వయో సమూహంలో న్యుమోనియా యొక్క సాంవత్సరిక సంభావ్యత ప్రతి 1000 మంది ప్రజలలో 6 గా ఉంది. 75 సంవత్సరాల వయసు పైబడిన వారిలో, ఇది ప్రతి 1000 మంది ప్రజలకు 75 కేసులుగా ఉంది. న్యుమోనియా సోకిన వారిలో దాదాపు 20–40% వైద్యశాలలో చేరుతుండగా వారిలో 5–10% క్రిటికల్ కేర్ యూనిట్ లో చేరుతున్నారు. అదేవిధంగా, UKలో మరణాల రేటు సుమారు 5–10%.[8]

సంవత్సరంలోని మిగిలిన కాలాల కంటే శీతాకాలంలో న్యుమోనియా కేసులు అధికంగా ఉంటాయి. న్యుమోనియా సాధారణంగా ఆడవారి కంటే మగవారిలో ఎక్కువగా వస్తుంది, మరియు సూర్యుని నుండి లభించే విటమిన్ D సంశ్లేషించుకోవడంలో తేడాల వలన కకాషియన్ల కంటే నల్లవారికి ఎక్కువగా వస్తుంది. అల్జైమర్స్ వ్యాధి, సిస్టిక్ ఫైబ్రోసిస్, వాయుగోళాల వాపు, పొగ త్రాగడం, మద్యపానం, లేదా నిరోధక వ్యవస్థ సమస్యలు వంటి వ్యాధులు ఉన్న వ్యక్తులలో న్యుమోనియా వలన కలిగే హాని అధికంగా ఉంటుంది.[37] ఈ వ్యక్తులలో న్యుమోనియా మరలా సంభవించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కారణం వలన వైద్యశాలలో చేరిన వ్యక్తులకు కూడా న్యుమోనియా వలన కలిగే హాని ఎక్కువగా ఉంటుంది.

చరిత్ర[మార్చు]

గెడ్డంతో ఉన్న బట్ట తల కలిగిన ఒక ముసలి వ్యక్తి యొక్క తలను చూపిస్తున్న గీసిన చిత్రం.
Hippocrates, the ancient Greek physician known as the "father of medicine"

న్యుమోనియా యొక్క లక్షణాలు హిప్పోక్రాట్స్(c.క్రీస్తుపూర్వం 460-క్రీస్తుపూర్వం 370) వివరించారు: 460 BC – 370 BC):

పెరిన్యుమోనియా, మరియు శ్వాసకుహర ప్రభావాలు ఈ విధంగా గమనించబడతాయి:తీవ్ర జ్వరం, ఒక ప్రక్క లేదా రెండు ప్రక్కలా నొప్పి, నిశ్వాసంలో దగ్గు ఉన్నపుడు, మరియు ఉమ్మిన కఫం తెల్లగా లేదా పాలిపోయినట్లుగా ఉండటం, లేదా పలుచని, నురగతో, మరియు ఎర్రబారినట్లుగా ఉండటం, లేదా సాధారణం కాని ఏ ఇతర లక్షణమైనా...... న్యుమోనియా తీవ్రంగా ఉన్నపుడు, రోగికి విరేచనం కానపుడు రోగం చికిత్సకు లొంగదు, రోగికి ఆయాసం ఉంటే అది మరింత ప్రమాదకరమైనది, మరియు మూత్రం పలుచగా, మంటగా రావటం, మరియు మెడ మరియు తల భాగాలలో చెమటలు పట్టటం, అటువంటి చెమటలు ప్రమాదకరంగా మారి ఉక్కిరి బిక్కిరి చేసి, ఎగశ్వాస కలిగించి, వ్యాధి తీవ్రతను పెంచుతాయి.[38]

ఏదేమైనా, హిపోక్రాట్స్ న్యుమోనియాను "పూర్వీకులచే పేరు పెట్టబడిన" ఒక వ్యాధిగా సూచించారు. శస్త్రచికిత్సలో పుపుస కుహరంలో చీము కారడం యొక్క ఫలితాలను కూడా ఆయన తెలియచేసారు. మైమొనిడెస్ (క్రీ.శ.1138–1204) ప్రకారం "న్యుమోనియాలో తప్పనిసరిగా ఉండే ప్రాథమిక లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి: తీవ్రమైన జ్వరం, ప్రక్కన గుచ్చినట్లుండే [పుపుస శోధ] నొప్పి, తీవ్రమైన లఘు శ్వాసలు, క్రమబద్ధంకాని నాడి మరియు దగ్గు."[39] ఈ రోగ సంబంధ వివరణ ఆధునిక పాఠ్య పుస్తకాలతో సరిపోల్చదగినదిగా ఉండి, మరియు మధ్య యుగాల నాటి వైద్య విజ్ఞాన వ్యాప్తిని 19వ శతాబ్దంలో ప్రతిఫలింపచేస్తుంది.

న్యుమోనియా వలన చనిపోయిన వ్యక్తుల యొక్క వాయు మార్గాలలో బాక్టీరియాను మొదటిసారి 1875లో ఎడ్విన్ క్లెబ్స్ గమనించారు.[40] రెండు సాధారణ బాక్టీరియా కారకాలైన స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా మరియు క్లేబ్సిఎల్లా న్యుమోనియా లను గుర్తించే ప్రారంభ కార్యక్రమం కార్ల్ ఫ్రైడ్ లాండర్[41] మరియు ఆల్బర్ట్ ఫ్రాన్కెల్[42] ద్వారా వరుసగా 1882 మరియు 1884లో చేయబడింది. ఫ్రైడ్లాండర్ యొక్క ప్రాథమిక చర్య గ్రామ్ స్టైన్ ను ప్రవేశపెట్టింది, అది ఈనాటికీ బాక్టీరియా వర్గీకరణకు మూలాధార ప్రయోగశాల పరీక్షగా వాడుతున్నారు. 1884 లోని క్రిస్టియన్ గ్రామ్ యొక్క పత్రం రెండు రకాల బాక్టీరియాలను విడదీయడానికి సహాయపడే పద్ధతిని వివరించింది మరియు న్యుమోనియా ఒకటి కంటే ఎక్కువ సూక్ష్మజీవుల వలన కలుగుతుందని చూపింది.[43]

"ఆధునిక వైద్య శాస్త్ర పితామహుడి"గా పిలువబడే సర్ విలియం ఒస్లేర్ 1918 నాటి తన పత్రంలో, న్యుమోనియా యొక్క రోగత్వం మరియు మృతత్వాన్ని ప్రశంసించారు, ఆయన కాలంలో మరణానికి ముఖ్య కారణంగా ఉన్న క్షయను అధిగమించడం వలన ఆయన దీనిని "మనుషుల మరణానికి నాయకుడు"గా అభివర్ణించారు. (ఈ పదం ముఖ్యంగా జాన్ బన్యన్ చే వినియోగం, లేదా ట్యూబర్ క్యులోసిస్ కు సంబంధించి వాడబడింది.[44])ఏదేమైనా, 1900లోని అనేక కీలక అభివృద్ధులు న్యుమోనియా రోగుల ఫలితాలను మెరుగు పరచాయి. పెన్సిలిన్ మరియు ఇతర సూక్ష్మజీవి నాశకాలను కనుగొనడం వలన, ఆధునిక శస్త్రచికిత్స పద్ధతులు, మరియు ఇరవయ్యో శతాబ్దంలోని తీవ్రమైన జాగ్రత్త వలన, న్యుమోనియా వలన మరణాలు అభివృద్ధి చెందిన ప్రపంచంలో అతి త్వరితంగా క్షీణించింది. హీమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా టైప్ b కి వ్యతిరేకంగా శిశువులకి టీకాలు 1988లో మొదలయ్యాయి మరియు అప్పటి నుండి తక్కువ సమయంలోనే నాటకీయమైన తరుగుదలకు దారితీసింది.[45] పెద్దవారిలో స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా కి వ్యతిరేకంగా పెద్దలకు టీకాలు 1977 లోను పిల్లలకు 2000 లోను ప్రారంభమై, అదే విధంగా తగ్గిపోయాయి.[46]

చిత్రాల గ్యాలరీ[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. మూస:EMedicineDictionary
 2. మూస:DorlandsDict
 3. ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో మరణాలకి ప్రపంచవ్యాప్త కారణాలు. http://www.who.int/entity/child_adolescent_health/media/causes_death_u5_neonates_2004.pdf.
 4. Feldman C, Kallenbach JM, Levy H, Thorburn JR, Hurwitz MD, Koornhof HJ (1991). "Comparison of bacteraemic community-acquired lobar pneumonia due to Streptococcus pneumoniae and Klebsiella pneumoniae in an intensive care unit". Respiration 58 (5-6): 265–70. doi:10.1159/000195943. PMID 1792415. 
 5. 5.0 5.1 5.2 5.3 పట్టిక 13-7 లో: Mitchell, Richard Sheppard; Kumar, Vinay; Abbas, Abul K.; Fausto, Nelson (2007). Robbins Basic Pathology (8th ed.). Philadelphia: Saunders. ISBN 1-4160-2973-7.  ఉదహరింపు పొరపాటు: Invalid <ref> tag; name "Kumar13-7" defined multiple times with different content
 6. "UpToDate Inc.". Retrieved ~~~~~.  Check date values in: |accessdate= (help)
 7. Krause DC, Balish MF (February 2004). "Cellular engineering in a minimal microbe: structure and assembly of the terminal organelle of Mycoplasma pneumoniae". Mol. Microbiol. 51 (4): 917–24. PMID 14763969. 
 8. 8.0 8.1 8.2 8.3 8.4 Hoare Z, Lim WS (2006). "Pneumonia: update on diagnosis and management". BMJ 332: 1077–9. doi:10.1136/bmj.332.7549.1077. PMID 16675815. 
 9. Metlay JP, Kapoor WN, Fine MJ (November 1997). "Does this patient have community-acquired pneumonia? Diagnosing pneumonia by history and physical examination" (PDF). JAMA 278 (17): 1440–5. doi:10.1001/jama.278.17.1440. PMID 9356004. 
 10. Wipf JE, Lipsky BA, Hirschmann JV et al. (May 1999). "Diagnosing pneumonia by physical examination: relevant or relic?". Arch. Intern. Med. 159 (10): 1082–7. doi:10.1001/archinte.159.10.1082. PMID 10335685. 
 11. 11.0 11.1 ప్రపంచ ఆరోగ్య సంస్థ. తీక్షణమైన శ్వాస సంబంధిత వ్యాధులు: స్త్రేప్తోకోకస్ న్యుమోనియే .
 12. Syrjälä H, Broas M, Suramo I, Ojala A, Lähde S (August 1998). "High-resolution computed tomography for the diagnosis of community-acquired pneumonia" (PDF). Clin. Infect. Dis. 27 (2): 358–63. doi:10.1086/514675. PMID 9709887. 
 13. 13.0 13.1 Heckerling PS, Tape TG, Wigton RS et al. (1990). "Clinical prediction rule for pulmonary infiltrates". Ann. Intern. Med. 113 (9): 664–70. PMID 2221647. 
 14. Emerman CL, Dawson N, Speroff T et al. (1991). "Comparison of physician judgment and decision aids for ordering chest radiographs for pneumonia in outpatients". Annals of emergency medicine 20 (11): 1215–9. doi:10.1016/S0196-0644(05)81474-X. PMID 1952308. 
 15. Gennis P, Gallagher J, Falvo C, Baker S, Than W (1989). "Clinical criteria for the detection of pneumonia in adults: guidelines for ordering chest roentgenograms in the emergency department". The Journal of emergency medicine 7 (3): 263–8. doi:10.1016/0736-4679(89)90358-2. PMID 2745948. 
 16. PneumoADIP. టీకా పరిచయం: రువాండా.
 17. Butler JC, Breiman RF, Campbell JF, Lipman HB, Broome CV, Facklam RR (October 1993). "Pneumococcal polysaccharide vaccine efficacy. An evaluation of current recommendations". JAMA 270 (15): 1826–31. doi:10.1001/jama.270.15.1826 (inactive 2009-05-29). PMID 8411526. 
 18. "Prevention and control of influenza: recommendations of the Advisory Committee on Immunization Practices (ACIP)". MMWR Recomm Rep 48 (RR-4): 1–28. April 1999. PMID 10366138. 
 19. Jefferson T, Deeks JJ, Demicheli V, Rivetti D, Rudin M (2004). "Amantadine and rimantadine for preventing and treating influenza A in adults". Cochrane Database Syst Rev (3): CD001169. doi:10.1002/14651858.CD001169.pub2. PMID 15266442. 
 20. Hayden FG, Atmar RL, Schilling M et al. (October 1999). "Use of the selective oral neuraminidase inhibitor oseltamivir to prevent influenza". N. Engl. J. Med. 341 (18): 1336–43. doi:10.1056/NEJM199910283411802. PMID 10536125. 
 21. "2004 Pneumonia Guideline - Synopsis" (PDF). p. iv5. 
 22. Lutfiyya MN, Henley E, Chang LF, Reyburn SW (February 2006). "Diagnosis and treatment of community-acquired pneumonia". Am Fam Physician 73 (3): 442–50. PMID 16477891. 
 23. Pakistan Multicentre Amoxycillin Short Course Therapy (MASCOT) pneumonia study group (2002). "Clinical efficacy of 3 days versus 5 days of oral amoxicillin for treatment of childhood pneumonia: a multicentre double-blind trial". Lancet 360: 835–41. doi:10.1016/S0140-6736(02)09994-4. PMID 12243918. 
 24. Agarwal G, Awasthi S, Kabra SK, Kaul A, Singhi S, Walter SD; ISCAP Study Group. (2004). "Three day versus five day treatment with amoxicillin for non-severe pneumonia in young children: a multicentre randomised controlled trial". BMJ 328: 791–4. doi:10.1136/bmj.38049.490255.DE. PMID 15070633. 
 25. el Moussaoui R, de Borgie CA, van den Broek P, Hustinx WN, Bresser P, van den Berk GE, Poley JW, van den Berg B, Krouwels FH, Bonten MJ, Weenink C, Bossuyt PM, Speelman P, Opmeer BC, Prins JM. (2006). "Effectiveness of discontinuing antibiotic treatment after three days versus eight days in mild to moderate-severe community acquired pneumonia: randomised, double blind study". BMJ 332: 1355–8. doi:10.1136/bmj.332.7554.1355. PMID 16763247. 
 26. American Thoracic Society; Infectious Diseases Society of America (February 2005). "Guidelines for the management of adults with hospital-acquired, ventilator-associated, and healthcare-associated pneumonia". Am J Respir Crit Care Med 171 (4): 388–416. doi:10.1164/rccm.200405-644ST. PMID 15699079. 
 27. Chang CC, Cheng AC, Chang AB (2007). "Over-the-counter (OTC) medications to reduce cough as an adjunct to antibiotics for acute pneumonia in children and adults". Cochrane Database Syst Rev (4): CD006088. doi:10.1002/14651858.CD006088.pub2. PMID 17943884. 
 28. 28.0 28.1 O'Connor S (2003). "Aspiration pneumonia and pneumonitis". Australian Prescriber 26 (1): 14–7. 
 29. 29.0 29.1 29.2 మూస:EMedicine, నిర్దిష్టంగా, "50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న రోగులలో ఎలాంటి పైకి కనిపించని ఊపిరితిత్తుల వ్యాధి లేకుండా నాలుగు వారాలలో సాధారణంగా రొమ్ము రెడియోగ్రాఫ్ తేటతెల్లం అయిపోతుంది" . తరచుగా లక్షణాలు 1–2 వారాలలో కనిపిస్తాయి.]
 30. రోగాలు: న్యుమోనియా - kidshealth.com
 31. Mufson, MA; RJ Stanek (1999-07-26). "Bacteremic pneumococcal pneumonia in one American City: a 20-year longitudinal study, 1978–1997". Am J Med (Department of Medicine, Marshall University School of Medicine) 107 (1A): 34S–43S. doi:10.1016/S0002-9343(99)00098-4. PMID 10451007. 
 32. Combes A, Luyt CE, Fagon JY et al. (October 2004). "Impact of methicillin resistance on outcome of Staphylococcus aureus ventilator-associated pneumonia". Am. J. Respir. Crit. Care Med. 170 (7): 786–92. doi:10.1164/rccm.200403-346OC. PMID 15242840. 
 33. Fine MJ, Auble TE, Yealy DM et al. (January 1997). "A prediction rule to identify low-risk patients with community-acquired pneumonia". N. Engl. J. Med. 336 (4): 243–50. doi:10.1056/NEJM199701233360402. PMID 8995086. 
 34. Lim WS, van der Eerden MM, Laing R et al. (2003). "Defining community acquired pneumonia severity on presentation to hospital: an international derivation and validation study". Thorax 58 (5): 377–82. doi:10.1136/thorax.58.5.377. PMID 12728155. 
 35. Garenne M, Ronsmans C, Campbell H (1992). "The magnitude of mortality from acute respiratory infections in children under 5 years in developing countries". World Health Stat Q 45 (2-3): 180–91. PMID 1462653. 
 36. WHO (1999). "Pneumococcal vaccines. WHO position paper". Wkly. Epidemiol. Rec. 74 (23): 177–83. PMID 10437429. 
 37. Almirall J, Bolíbar I, Balanzó X, González CA (February 1999). "Risk factors for community-acquired pneumonia in adults: a population-based case-control study". Eur. Respir. J. 13 (2): 349–55. doi:10.1183/09031936.99.13234999. PMID 10065680. 
 38. హిప్పోక్రాటేస్ తీవ్రమైన వ్యాధుల గురించి వికీ మూల లింక్
 39. మైమోనిడేస్, ఫుసుల్ మూస ("Pirkei Moshe ").
 40. Klebs E (1875-12-10). "Beiträge zur Kenntniss der pathogenen Schistomyceten. VII Die Monadinen". Arch. Exptl. Pathol. Parmakol. 4 (5/6): 40–488. 
 41. Friedländer C (1882-02-4). "Über die Schizomyceten bei der acuten fibrösen Pneumonie". Virchow's Arch pathol. Anat. U. Physiol. 87 (2): 319–324. doi:10.1007/BF01880516.  Check date values in: |date= (help)
 42. Fraenkel A (1884-04-21). "Über die genuine Pneumonie, Verhandlungen des Congress für innere Medicin". Dritter Congress 3: 17–31. 
 43. Gram C (1884-03-15). "Über die isolierte Färbung der Schizomyceten in Schnitt- und Trocken-präparaten". Fortschr. Med 2 (6): 185–9. 
 44. William Osler, Thomas McCrae (1920). The principles and practice of medicine: designed for the use of practitioners and students of medicine (9th ed.). D. Appleton. p. 78. One of the most widespread and fatal of all acute diseases, pneumonia has become the "Captain of the Men of Death," to use the phrase applied by John Bunyan to consumption. 
 45. Adams WG, Deaver KA, Cochi SL et al. (January 1993). "Decline of childhood Haemophilus influenzae type b (Hib) disease in the Hib vaccine era". JAMA 269 (2): 221–6. doi:10.1001/jama.269.2.221. PMID 8417239. 
 46. Whitney CG, Farley MM, Hadler J et al. (May 2003). "Decline in invasive pneumococcal disease after the introduction of protein-polysaccharide conjugate vaccine". N. Engl. J. Med. 348 (18): 1737–46. doi:10.1056/NEJMoa022823. PMID 12724479. 

వెలుపటి వలయము[మార్చు]

మూస:Medical conditions మూస:Respiratory pathology మూస:Common Cold