శిలీంధ్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శిలీంధ్రాలు
Temporal range: Early సిలూరియన్ - Recent
Fungi collage.jpg
Clockwise from top left: Amanita muscaria, a basidiomycete; Sarcoscypha coccinea, an ascomycete; black bread mold, a zygomycete; a chytrid; a Penicillium conidiophore.
Scientific classification
Domain:
(unranked):
Kingdom:
శిలీంధ్రాలు

(లిన్నేయస్, 1753) R.T. Moore, 1980[1]
Subkingdom/Phyla
Chytridiomycota
Blastocladiomycota
Neocallimastigomycota
Glomeromycota
జైగోమైకోటా

Dikarya (inc. Deuteromycota)

ఏస్కోమైకోటా
బెసిడియోమైకోటా

శిలీంధ్రాలు (ఆంగ్లం: Fungus) ఒక రకమైన సూక్ష్మక్రిములు. ఇవి మట్టిలో విరివిగా ఉంటాయి. వీటిలో 70,000 రకాలు గుర్తించబడ్డాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా మొక్కలలో, జంతువులలో, మానవులలో వివిధరకాలైన వ్యాధులు కలుగజేస్తాయి. కొన్ని ప్రాణాంతకముగా మారే అవకాశం ఉంది. శిలీంధ్రాల గురించి తెలియజేసే విజ్ఞానాన్ని మైకాలజీ అంటారు.

ఉనికి[మార్చు]

శిలీంధ్రాలు విశ్వవ్యాప్తంగా ఉన్నాయి. ఇవి గాలిలో, నీటిలో, నేలపై, నేలలోను, సజీవ నిర్జీవ దేహలలో ఉంటాయి. అత్యధిక జాతులు కుళ్ళుచున్న సేంద్రీయ పదార్థాలపై పూతికాహారులు (Saprophytes) జీవిస్తున్నాయి. నీటిలో నివసించే శిలీంధ్రాలు ఆదిమమైనవి. వీటికన్నా పరిణతి చెందినవి మృత్తికావాసం చేసేవి. వీటికన్నా పరిణతి చెందినవి పరాన్నజీవులు.

కొన్ని జంతువుల, వృక్షాల దేహాలలో పరాన్నజీవులు (Parasites) గా వివిధ వ్యాధులను కలుగజేస్తున్నాయి.

కొన్ని శిలీంధ్ర ప్రజాతులు వృక్షాల వేరు వ్యవస్థలలో శిలీంధ్ర మూలాలు (Mycorrhiza) గా ఏర్పడి సహజీవనం చేస్తూ, నీరు, లవణ పోషణకు ఉపకరిస్తాయి. చాలా వృక్ష జాతులు (90% పైగా) వాని మనుగడకు ఈ విధంగా శిలీంధ్రాలపై ఆధారపడిఉంటాయి.[2][3][4] ఈ విధమైన సహజీవనం మానవులకు చాలా ప్రాచీన కాలం అనగా ఇంచుమించు 400 మిలియను సంవత్సరాల నుండి తెలుసును.[5] ఇవి మొక్కలు నత్రజని, ఫాస్ఫేటు లను భూమి నుండి పీల్చుకోవడాన్ని అధికం చేస్తాయి.[6] కొన్ని శిలీంధ్రాలు ఒక మొక్క నుంచి మరొక మొక్కకు పిండి పదార్ధాలు మొదలైన ఆహార పదార్ధాలను తరలిస్తాయి.[7]

Polypores growing on a tree in Borneo

ఉపయోగాలు[మార్చు]

 • ఆహారపదార్ధాలలో పాల నుండి పెరుగును తయారుచేసేవి శిలీంద్రాలు.
 • బేకరీలలో గోధుమ రొట్టెను మెత్తగా చిన్నచిన్న రంధ్రాలతో తయారుచేసేవి కూడా ఇవే.
 • మధ్యం తయారీలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు.
 • పెన్సిలిన్ వంటి చాలా రకాల సూక్ష్మజీవి నాశకాలు (Antibiotics) ను శిలీంద్రాల నుండి తయారుచేస్తారు. ఇవి ప్రమాదకరమైన బాక్టీరియా వ్యాధుల నుండి మనను కాపాడుతున్నాయి.
 • పుట్టగొడుగులు ఆహారంగా మనకందరకు చాలా ఇష్టం. వీటిలో కొన్ని విషపూరితమైనవి గలవని మరిచిపోవద్దు.

వ్యాధులు[మార్చు]

మనుషులలో[మార్చు]

కొన్ని శిలీంధ్రాలు మానవులలో ముఖ్యంగా రోగనిరోధకశక్తి లోపించిన వారిలో ప్రాణాంతకమైన వ్యాధుల్ని కలుగజేస్తాయి. ఏస్పర్జిలస్, కాండిడా, క్రిప్టోకాకస్, [8][9] హిస్టోప్లాస్మా, [10] and న్యూమోసిస్టిస్ మొదలైనవి.[11] కొన్ని వ్యాధికారక శిలీంధ్రాలు తామర వంటి చర్మ వ్యాధుల్ని కలుగజేస్తాయి.

వృక్షాలలో[మార్చు]

 • అగ్గి తెగులు - వరి
 • ఆకుపచ్చకంకి తెగులు - సజ్జ
 • కొరడా కాటుక తెగులు - చెరకు
 • టిక్కా ఆకుమచ్చ తెగులు - వేరుశెనగ

మూలాలు[మార్చు]

 1. "Taxonomic proposals for the classification of marine yeasts and other yeast-like fungi including the smuts". Bot. Mar. 23: 371. 1980.
 2. Volk, Tom. "Tom Volk's Fungi FAQ". Archived from the original on 2006-08-28. Retrieved 2006-09-21.
 3. Wong, George. "Symbiosis: Mycorrhizae and Lichens". Archived from the original on 2006-10-05. Retrieved 2006-09-21.
 4. Knowledge of nitrogen transfer between plants and beneficial fungi expands Archived 2008-04-09 at the Wayback Machine southwestfarmpress.com. 2005-06-10 Retrieved 2007-04-06.
 5. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.
 6. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.
 7. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.
 8. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.
 9. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.
 10. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.
 11. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.

బయటి లింకులు[మార్చు]