రొట్టె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Various breads
Bread, white (typical)
పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
శక్తి 270 kcal   1110 kJ
పిండిపదార్థాలు     51 g
- పీచుపదార్థాలు  2.4 g  
కొవ్వు పదార్థాలు3 g
మాంసకృత్తులు 8 g
థయామిన్ (విట. బి1)  0.5 mg  38%
రైబోఫ్లేవిన్ (విట. బి2)  0.3 mg  20%
నియాసిన్ (విట. బి3)  4 mg  27%
సోడియం  681 mg45%
శాతములు, అమెరికా వయోజనులకు
సూచించబడిన వాటికి సాపేక్షంగా
Bread, whole-wheat (typical)
పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
శక్తి 250 kcal   1030 kJ
పిండిపదార్థాలు     46 g
- పీచుపదార్థాలు  7 g  
కొవ్వు పదార్థాలు4 g
మాంసకృత్తులు 10 g
థయామిన్ (విట. బి1)  0.4 mg  31%
రైబోఫ్లేవిన్ (విట. బి2)  0.2 mg  13%
నియాసిన్ (విట. బి3)  4 mg  27%
సోడియం  527 mg35%
శాతములు, అమెరికా వయోజనులకు
సూచించబడిన వాటికి సాపేక్షంగా

రొట్టెలు (Bread) ఆహారధాన్యాల పిండికి నీరు కలిపి తయారుచేసిన మెత్తని ఆహార పదార్ధము.[1] వీనిలో కొన్ని ముక్కలుగా కోసి తింటాము. వీనిలో ఉప్పు, కొవ్వు, మెత్తబడడానికి ఈస్ట్ (Yeast) మొదలైనవి ప్రధానంగా చేరుస్తారు. కొన్నింటిలో పాలు, గుడ్డు, పంచదార, మసాలా దినుసులు, పండ్లు, కూరగాయలు, గింజలు మొదలైనవి కూడా కలుపుతారు. రొట్టెలు మానవులు భుజించే ఆహార పదార్ధాలలో అతి ప్రాచీనమైనవి.

తాజా రొట్టె మంచి రుచి, వాసన, నాణ్యత కలిగి దుదిలాగ మెత్తగా ఉంటుంది. దీనిని తాజాగా ఉంచడం చాలా ముఖ్యం. గట్టిపడిపోతే రొట్టె పాడయినట్లుగా భావిస్తారు. ఆధునిక రొట్టెలు కొన్ని సారులు కాగితం లేదా ప్లాస్టిక్ పొరతో చుట్టివుంచుతారు, లేదా రొట్టెలకోసం ప్రత్యేకమైన పెట్టె (Breadbox) లలో నిలువచేస్తారు. తడిగా ఉన్న ప్రదేశాలలో రొట్టె మీద బూజు (Mold) పడుతుంది. అందువలన వీటిని తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మంచిది.

రొట్టెలలో రకాలు[మార్చు]

  • గోధుమ రొట్టె (Wheat bread) : రొట్టె ఎక్కువగా గోధుమ పిండితో చేస్తారు. దీనిలో నీరు కలిపి ముద్దచేసి, పొంగడానికి ఈస్ట్ కలిపుతారు. దీనిలోని గ్లుటెన్ వలన మెత్తగా సాగుతుంటుంది. అయితే కొన్నిసార్లు ఇతర ఆహారధాన్యాల నుండి కూడా రొట్టెలను తయారుచేస్తారు. జొన్న రొట్టెలు మొదలైనవి.
  • తెల్లని రొట్టె (White bread) : గింజలలోని మధ్యనున్న తెల్లని భాగం (Endosperm) నుంచి తీసిన పిండితో చేసిన రొట్టె.
  • గోధుమ రొట్టె (Brown bread) : గింజలోని మధ్యనున్న తెల్లనిభాగం (Endosperm) తో సహా కొంత బయటున్న పొట్టు (Bran) ను లేదా కృత్రిమ గోధుమరంగు పదార్ధాల్ని కలిపి చేసిన రొట్టె.[2]
  • పాల రొట్టె (Milk bread) : పాలు ఎక్కువగా పోసి తయారుచేసిన రొట్టె.

మూలాలు[మార్చు]

  1. "bread." Britannica Concise Encyclopedia. Encyclopædia Britannica, Inc., 2006. Answers.com 19 Feb. 2008. http://www.answers.com/topic/bread
  2. CBS Interactive Inc. White Bread In Wheat Bread's Clothing CBS Early Show, accessed June 14, 2008.
"https://te.wikipedia.org/w/index.php?title=రొట్టె&oldid=2299206" నుండి వెలికితీశారు