అంటువ్యాధి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అంటువ్యాధి
Infectious disease
Classification and external resources
Malaria.jpg
A false-colored electron micrograph shows a malaria sporozoite migrating through the midgut epithelia.
ICD-10 A00-B99
ICD-9 001-139
MeSH D003141

అంటువ్యాధులు (ఆంగ్లం Infectious diseases) ఒకరి నుండి మరొకరికి సంక్రమించే వ్యాధులు. ఇవి ఎక్కువగా సూక్ష్మక్రిములవల్ల కలుగుతాయి. ఒక ప్రాంతంలో త్వరగా వ్యాపించే అంటువ్యాధుల్ని మహమ్మారి (Epidemic) అంటారు. అలాగే విశ్వం అంతా వ్యాపించిన మహమ్మారిని విశ్వమారి (Pandemic) అంటారు.

రోగగ్రస్థులైన వారితో అతిగా కలిసి ఉండటం వల్ల, పదే పదే రోగి శరీరమును తాకుతుండటం వల్ల, రోగులతో కలిసి భుజించడం వల్లనూ, రోగులతో పడుకోవడం వల్లను, రోగుల దగ్గర కూర్చుండటం వల్ల, రోగులు ధరించిన బట్టలను, వాడిన సబ్బు, తువ్వాలు, రోగులు వాడి మిగిల్చిన చందనాది లేపనాలను వాడటం వల్లనూ, అరోగ్యవంతులైన వారికి అంటు వ్యాధులు రోగుల నుంచి సోకుతాయి.

అంటువ్యాధులు అనగా ఏవి?[మార్చు]


మశూచకము, కలరా, చలిజ్వరము, కుష్టురోగము అనగా కుష్ఠువ్యాధి, సుఖ రోగములు మొదలగు వ్యాధులు ఒకరి నుండి మరియొకరికి త్వరితంగా సంక్రమించును. స్ఫోటకము, కలరా మొదలగునవి కొన్ని అంటు వ్యాధులు అనేక మంది అతి తక్కువకాలంలో ఒకరి నుండి మరి యొకరికి సంక్రమించి అపారప్రాణనష్టం కల్గించును. కొన్నిఅంటు వ్యాధులు ఇంత కంటే తక్కువ తీవ్ర మైనవై తమ చుట్టు నుండు వారల నెల్ల నంటు కొనక కొందరిని మాత్రమే, కొన్ని సందర్భములలో మాత్రమే సంక్రమించును. ఇంటిలో నొకనికి కుష్టు రోగముగాని, క్షయ వ్యాధి గాని ఉన్న యెడల, ఆ వ్యాధి ఆ యింటిలో అందరికి సంక్రమించక పీవచ్చును.ఇది అవతలి వ్యక్తికున్న రోగనిరోధక శక్తిమీద,సంక్రమణ రోగతీవ్రతమీద ఆధారపడి వుండును.


ఇవిగాక కలరా,మశూచికము, చలి జ్వరము మొదలగు కొన్ని వ్యాధులు ఇతరుల సంక్రమించిన తరువాత అతికొద్దిసమయంలోనే తమ లక్షణములను సూచించును. క్షయ మొదలగు మరి కొన్ని వ్యాధులు సంక్రమించిన పిమ్మట వాని లక్షణములు బయలు పడుటకు ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరములు పట్టును. ఈ కారణాన ఈవ్యాధులు 'అంటువ్వాధుల 'ని ప్రజలు తెలిసికొనుటకంతగా వీలు లేదు.అంటు వ్యాధుల కన్నిటికిని కొన్ని సామాన్య లక్షణములు అనగా పోలికలు గలవు. వీనిని బట్టి యే అంటు వ్యాధో శోధకులు గ్రహిం గలరు. అంటువ్యాధులను వ్వాపింప జేయురోగ సూక్ష్మజీవజనకాలు(రోగకారక బాక్టిరియా,లేదా వైరస్,శిలీంధ్రాలు,పరాన్న సూక్ష్మజీవులు.) చెట్ల పరాగరేణువులను బోలి యుండును. ఇట్లే అంటు వ్యాధుల రోగకారకాలు మన శరీరములో ప్రవేశించిన తరువాత వాని జాతి భేదములను బట్టి ఆయా వ్యాధులు బయట పడుటకు వేరు వేరు కాలములు పట్టును. అంటు వ్వాధుల కన్నిటికి ఒక్కొక్క వ్యాధిని వ్వాపింప చేయుటకు ఒక్కొక్క రోగజనకం కలదు.

పైని చెప్పబడిన అంటు వ్యాధులను కలిగించు రోగజనకాలు మిక్కిలి సూక్ష్మమైన పరిమాణము గలవగుట చేత వానికి సూక్ష్మజీవులని పేరు. కావున సూక్ష్మజీవుల మూలమున గలుగు వ్యాధులన్నియు అంటు వ్యాధులని గ్రహింప వలెను.

ముఖ్యమైన సూత్రాలు[మార్చు]

ఒక వ్యాధి అంటు వ్యాధి యగునా కాదా అని తెలిసి కొనుటకు ఈ క్రింది 5 సూత్రములను గమనింప వలెను.

  1. ఒక వ్వాధిని పుట్టించు సూక్ష్మజీవులు అదే వ్వాధిగల రోగులందరి శరీరముల యందును కనబడవలెను.
  2. ఇట్లు కనిపెట్టబడిన సూక్ష్మ జీవులను మనము ప్రత్యేకముగ తీసి,సాధారణముగా సూక్ష్మజీవులు తిను ఆహారము వానికి పెట్టి పెంచిన యెడల అవి తిరిగి పెరగవలెను.
  3. ఇట్లు పెంచిన సూక్ష్మజీవులను వేరుపరచి వానిని ఆరోగ్యవంతులైన ఇతర మానవుల శరీరములో నెక్కించి నప్పుడు ఆ సూక్ష్మజీవులు క్రొత్తవాని శరీరములో మొదటి రోగికుండిన రోగచిహ్నముల నన్నింటిని కనుబరచవలెను.
  4. ఈ ప్రకారము వ్వాధిని పొంది రోగి యొక్క శరీరములో ఈ సూక్ష్మజీవులను తిరిగి మనము కనిపెట్టవలెను.
  5. ఈ సూక్ష్మజీవులు తిరిగి మరియొకనికి ఇదే వ్వాధిని కలిగింప శక్తిగలవై యుండవలెను.

ఈ పరిశోధనలన్నియు మానవుల పట్లచేయుట ఒక్కొక్కచో వారి ప్రాణానికి హానికరము కావున సాధారణముగ ఒక వ్యాధి సంక్రమణవ్యాదిఅవునో?కాదో గుర్తించవలసినప్పుడు మానవజాతికి మిక్కిలి దగ్గర కుంటుంబములో చేందిన కోతులకు ఆవ్యాధులను సంక్రమింపజేసి పరిశోధనలు చేయుదురు. పైని చెప్పిన శోధన ప్రకారము కలరా, మశూచకము, చలిజ్వరము మొదలగు అంటు వ్యాధులన్ని నిదర్శనములకు నిలచినవి కాని, కుష్టు వ్యాధి విషయములో మాత్ర మీ శోధనలు పూర్తి కాలేదు. కుష్ఠువ్యాధి గల రోగి శరీరములో నొక తరహా సూక్ష్మ జీవులుండును గాని, ఇవి క్రొత్త వారల కంటించి నప్పుడు వారికి ఈ వ్యాధి తప్పక అంటునట్లు శోధనల వలన తేలలేదు. బహుశః కుష్ఠు వ్యాధి సూక్ష్మ జీవి ఒకని శరీరములో ప్రవేశించిన తరువాత వ్వాధి లక్షణములు బయలు పడు వరకు పట్టు కాలము అనగా అంతర్గత కాలము అనేక సంవత్సరములే గాక రెండు మూడు తరములు కూడా వుండునేమో యని సందేహముగ నున్నది. ఇట్లే ఇంకను కొన్ని వ్యాధుల విషయములో మధ్య మధ్య కొన్ని విషయములు తెలియక పోవుట చేత నవి అంటు వ్యాధులగునో కావో అను సందేహములున్నవి.

అంటువ్యాధులు సంక్రమించే విధానమును బట్టి వాటిని 5 విధములుగా విభజించ వచ్చు[మార్చు]

అవి.

  1. వైరస్ సంభందిత అంటు వ్యాధి
  2. బ్యాక్టీరియా సంభందిత అంటు వ్యాధి
  3. శిలీంద్ర సంభందిత అంటు వ్వాధి.
  4. ప్రోటోజోవా అంటు వ్వాధి
  5. పెంపుడు జంతువులవల్ల సంక్రమించే అంటువ్యాధి.

వైరస్ సంబంధిత అంటువ్యాధులు[మార్చు]

బాక్టీరియా సంబంధిత అంటువ్యాధులు[మార్చు]

శిలీంధ్ర సంబంధిత అంటువ్యాధులు[మార్చు]

ప్రోటోజోవా అంటువ్యాధులు[మార్చు]

పెంపుడుజంతువుల వల్ల కలిగే వ్యాధులు[మార్చు]

పెంపుడు జంతువులద్వారా సుమారు 200 వ్యాధులు సోకే ప్రమాదం ఉందట. పెంపుడు జంతువులు, పక్షుల నుంచి సంక్రమించే జబ్బులను 'జూనోసిస్‌' వ్యాధులు అంటారు. జోసఫ్‌ ఫాస్టర్‌ అనే బాలుడు కుక్కకాటుతో రేబిస్‌ వ్యాధి బారిన పడ్డాడు. శాస్త్రవేత్త లూయిస్‌పాశ్చర్‌ ఆ వ్యాధి నిరోధక మందును కనుగొన్నారు. ఈ మందును బాలునికి 1885 జూలై 6న ఇచ్చి కాపాడారు. ఆ రోజు జ్ఞాపకార్థమే 'అంతర్జాతీయ జూనోసిస్‌ డే'గా నిర్వహిస్తున్నారు. కుక్కలవల్ల రేబిస్, టాక్సోకొరియాసిస్, పశువులవల్ల సాల్మనెల్లోసిస్‌, క్షయ, బద్దెపురుగులు(ఎకినోకోకోసిస్‌), పక్షులవల్ల సిట్టకోసిస్‌, బర్డ్‌ప్లూ, ఎలుకల వల్ల లిస్టీరియోసిస్‌, లెప్టోస్పైరోసిస్, గొర్రెల ద్వారా ఆంత్రాక్స్‌, పందుల వల్ల మెదడువాపు, కుందేళ్ల వల్ల లెఫ్టోస్పైరోసిస్‌ వస్తాయట.