Jump to content

తట్టు

వికీపీడియా నుండి
తట్టు లేదా పొంగు
వర్గీకరణ & బయటి వనరులు
చర్మము మీద కనిపించే రోగ లక్షణం తట్టు

మీజిల్స్ వైరస్
మీజిల్స్ వైరస్
Virus classification
Group:
Group V ((−)ssRNA)
Order:
Family:
Genus:
Species:
మీజిల్స్ వైరస్

తట్టు లేదా పొంగు అనబడే ఈ వ్యాధినే ఆంగ్ల భాషలో మీజిల్స్ (measles లేదా rubeola) అని పిలుస్తారు. ఈ అంటు వ్యాధి ప్రధానంగా పిల్లలలో వస్తుంది. ఇది మార్‌బిల్లీ వైరస్ అనే వైరస్ వల్ల కలుగుతుంది. తట్టు ప్రపంచములో ఉన్నట్లుగా క్రీ.పూ.600 సంవత్సరము నుండి ఆధారాలున్నయి . తట్టు గురించి శాస్త్రీయమైన విశ్లేషణ 860-932 సంవత్సరాల మధ్య పర్షియా వైద్యుడు ఇబిన్ రాజీ (రాజెస్) చేశాడు. రాజెస్ ఆటలమ్మకు తట్టుకి గల వ్యత్యాసాలు వివరిస్తూ పుస్తకం వ్రాశాడు. మొట్టమొదటిసారిగా తట్టుని కలిగించే ఈ వైరస్ 1954వ సంవత్సరములో అమెరికాలో డేవిడ్ ఎడ్‌మాన్‌స్టన్ వర్ధనం చేశాడు. డేవిడ్ ఈ వైరస్ వేరు చేసి కోడి గుడ్డు భ్రూణం (చిక్ ఎంబ్రియో) లో వ్యాప్తి చెందేటట్లు చేశాడు.[1] ఇప్పటి దాకా 21 రకాల తట్టుని కలిగించే మీజిల్స్ వైరస్ జాతులు వేరు చేయబడ్డాయి.[2] 1963 సంవత్సరములో తట్టు వ్యాధి నిరోధక టీకా తయారి జరిగి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. జెర్మన్ మీజిల్స్ అనే ఇంకో తట్టు వంటి దద్దుర్లు కలిగించే వ్యాధి రుబెల్లా వైరస్ వల్ల వస్తుంది.

వ్యాధి వ్యాప్తి

[మార్చు]

తట్టు సంబంధించిన వైరస్ సాధారణంగా శ్వాసతో పాటు వచ్చే తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. జనసాంద్రత ఎక్కువ ఉన్నప్రదేశాలలో జబ్బు ఎక్కువగా ప్రబలుతుంది. సాధారణంగా ఈ జబ్బు ఇన్‌కుబేషన్ పీరియడ్ 4-12 రోజులు (రోగ క్రిములు శరీరంలో ప్రవేశించినప్పటినుండి రోగ లక్షణాలు కనిపించడానికి పట్టే సమయం). తట్టు వచ్చిన వారు వేరే వారికి ఈ రోగాన్ని రోగలక్షణాలు కనిపించిన 3 రోజులనుంచి మొదలుకొని దద్దుర్లు పూర్తిగా తగ్గిన 5 రోజుల వరకు వ్యాప్తిగావించగలరు (ఇన్‌ఫెక్షియస్).

వ్యాధి లక్షణాలు

[మార్చు]

వ్యాధి నిర్ధారణ చేయాడానికి ఈ ప్రధాన లక్షణాలు ఉండాలి.

  • కళ్ళు ఎర్రపడడం (కంజక్టైవల్ కంజషన్)
  • నోటి లోపలి బుగ్గలలో కాప్లిక్ స్పాట్స్ (ఇసుక రేణువుల వంటి మచ్చలు) కనిపించడం, ఇవి 24-36 గంటలు మాత్రమే ఉంటాయి.రాష్ ప్రారంభ్యం అయి జ్వరం తగ్గుముఖం పట్టగానే కాప్‌లిక్ స్పాట్స్ కనిపించవు
  • మూడు రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉండడం
  • రాష్ (దద్దుర్లు) ముఖం నుండి ప్రారంభమయి కాళ్ళ వైపు పాకడం.
  • దగ్గు
  • మగతగా ఉండడం
  • అన్న హితవు లేక పోవడం

ఈ వ్యాధి చాలా తేలికగా పాక గలిగే అంటువ్యాధి కాబట్టి ముఖ్యంగా తట్టు ఉన్న వారితో కలవడం అనే విషయం రోగిని అడగడం ద్వారా తెలుసుకోవచ్చు.

వ్యాధి నిర్ధారణ, చికిత్స

[మార్చు]
రోగిని వైద్యుడు పరీక్షించడం ద్వారా

వ్యాధి విర్ధారణ ముఖ్యంగా రోగి వ్యాధి లక్షణాలు, కనిపించే రోగి చర్మము పై దద్దుర్లు (రాష్) ద్వారా చేస్తారు. వైరస్ వల్ల కలిగే అన్ని వ్యాధులలో రాష, జ్వరం కనిపిస్తుంది. మిగతా వైరల్ జ్వరాలనుండి మీజిల్స్ లేదా తట్టుని పైన పేర్కొన్న ముఖ్యమైన లక్షణాల ద్వారా వేరు చేస్తారు.

లాబ్ పరీక్షలు

రోగ పరీక్షించడం ద్వారా నిర్ధారణ రాక పోతే లాబ్ పరీక్షలు చేయవచ్చు.లాలాజలాన్ని వైరస్ పరీక్షకి పంపి తట్టు ఉందో లేదో నిర్థారిస్తారు. మీజిల్స్ వైరస్ దాడి చేత మానవ శరీరం వ్యాధి నిరోధక ఆంటీబాడీస్ తయారు చేస్తుంది. వాటిని రక్త పరీక్ష ద్వారా పరీక్షించి వ్యాధిని నిర్థారించవచ్చు. ఈ వ్యాధి నిరోధకా ఆంటీబాడీస్ రెండు రకాలు IgM IgG. మీజిల్స్ IgM రక్తములో కనిపిస్తే మీజిల్స్ ఉన్నట్లు అర్థం. అదే మీజిల్స్ IgG రక్తంలో కనిపడితే పూర్వం మీజిల్స్ గ్రస్తమయ్యినట్లు లేదా పూర్వము మీజిల్స్ కి సంబంధించిన టీకా తిసుకొన్నట్లు అర్థము.

ఆరోగ్య సంక్షేమ శాఖ నివేదన

తట్టు వ్యాధి సమాజములో కనిపించిన వేంటనే ఆరోగ్య సంక్షేమ కేంద్రాన్ని నివేదంచాలి. వారు ఆ ప్రదేశములో ఆ వ్యాధి ప్రబలకుండా ఆ వ్యాధి గ్రస్తులను ఒకచోట వేరు చేసి ఉంచుతారు.

చికిత్స

మిగతా వైరల్ జబ్బుల వలే తట్టుకు ప్రత్యేకించి చికిత్స లేదు. వ్యాధి లక్షణాలు అనుసరించిన మందులు వాడాలి. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలి. మిగతా వారితో కలియరాదు. జ్వరానికి పేరాసిటమాల్ వంటి జ్వరం తగ్గించే బిళ్ళలు వాడాలి.

ఈ వైరస్ క్రిమి సంబంధించిన విషయాలు

[మార్చు]

ఈ వైరస్ ని మీజిల్స్ వైరస్ అని పిలుస్తారు. పారామిక్సోవైరిడే కుటుంబానికి చెందిన అన్ని వైరస్ ల వలే ఈ వైరస్ కూడా కవచాన్ని కలిగి ఉంటుంది.ఈ వైరస్ ఆర్.ఎన్.ఎ అనే కేంద్రక ఆమ్లము చేత నిర్మించబడింది.

వ్యాధి సోకే విధానం

[మార్చు]

తట్టు కలిగించే వైరస్ క్రిమి చాలా తేలికగా వ్యాప్తి చెందుతుంది. ప్రధానంగా వ్యాప్తి గాలి ద్వారా జరుగుతుంది. వ్యాధి ఉన్న వ్యక్తికి దగ్గరగా ఉండడం వల్ల రోగి విడిన గాలిలో ఉండే క్రిములు అతనితో సావాసం చేస్తున్న వ్యక్తి శ్వాసనాళ వ్యవస్థలొకి ప్రవేశిస్తాయి. రోగి దగ్గి నప్పుడు లేదా తుమ్మి నప్పుడు ఆ క్రిములు మరింత వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఒకసారి మరో రోగి శరీరంలోకి ప్రవేశించగానే ఈ క్రిములు శరీర ఉపరితలం పై ఉండే కణజాలం (ఎపితీలియమ్) కి అంటుకొని అక్కడనుండి కణాలలొకి ప్రవేశించి రక్తం ద్వారా వివిధ శరీర వ్యవస్థలకు చేరతాయి.[3]

మానవులే ఈ వైరస్ కి వ్యాధి ముఖ్య అతిథులు. ఈ వైరస్ మిగతా జంతువులలో ప్రవేశిస్తే వ్యాధిని కలిగించవు. కాని వేరే జంతువులకు వ్యాప్తి చెందుతాయి.

వ్యాధి తీవ్రత వల్ల కలిగే ఉపద్రవాలు(కాంప్లికేషన్స్)

[మార్చు]

సాధారణంగా తట్టు వల్ల చిన్న చిన్న ఉపద్రవాలు వస్తాయి. తీవ్రమైన ఉపద్రవాలు సాధారణంగా రావు. అప్పుడప్పుడు ఊపిరిత్తుతులకు నిమ్ము చేరి న్యుమోనియా రావచ్చు. కొద్దిగా అతిసారం జరగవచ్చు. తీవ్రమైన ఉపద్రవాలు మెదడువాపు (ఎన్‌సెఫలైటిస్), మెనింజైటిస్ అరుదుగా రావచ్చు. తట్టు వచ్చాకా చాలా సంవత్సరాలకు సబ్ స్కిరీజింగ్ పాన్ ఎన్‌సెఫలైటిస్ అనే అవిటి చేసే ఉపద్రవం వస్తుంది. తట్టు సంబంధించిన వైరస్ నాడీ వ్యవస్థలో స్తుప్తావస్థలో ఉండి 15-16 సంవత్సరాలకు వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారు పూర్తిగా అవిటివారు అయి మతిమరుపు, మూర్ఛ వ్యాధితో బాధపడి ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధులతో సగటు జీవితకాలం కంటేచాలా ముందుగా మరణిస్తారు.అభివృద్ధి చెందిన దేశాలలో తట్టు వలన మరణించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.అభివృద్ధిలో వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇంకా ఈ జబ్బు చేతమరణించేవారి సంఖ్య్ ఏక్కువగానే ఉంది. అభివృద్ధిలో వెనుక పడీన దేశాలలో పిల్లలు పౌష్టికాహారం తీసుకోక పోవడం వల్ల శరీరానికి వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లి మాములు స్థాయి ఈ క్రిమి వ్యాధి కలిగించిన మరణం సంభవిస్తుంది. ఇతరకారణాల వల్ల కుపోషణ (మాల్‌న్యూట్రిషన్) గా ఉన్నవారిలో కూడా మరణం సంభవైంచే సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. పౌష్టికాహారం సరిగా లేని వారిని వ్యాధి సోకితే మరణించే శాతం 30% వరకు ఉండవచ్చు.కొన్ని సందర్భాలలో పిల్లలు పౌష్టికంగా ఉన్న ఈ వ్యాధి వచ్చాక కుపోషణగా మారిపోవచ్చు. అటువంటివారిలో తగు జాగ్రత్తలు తీసుకొని పౌష్టికాహారం ఇచ్చి సమపాళ్ళలో విటమిన్స్ ముఖ్యంగా విటమిన్ ఎ, జింక్ వంటివి ఇవ్వాలి

ప్రపంచ వ్యాప్త యం.యం.ఆర్. నిర్మూలన

[మార్చు]

ఈ మధ్యకాలములో జపాన్ దేశములో తట్టు వ్యాధి చాలా ఎక్కువగా కనిపించింది. తట్టు వలన చాలా మంది బాధ పడ్డారు. చాలా తేలికగా వ్యాప్తి చెందే వ్యాధి కారణం చేత ఈ వ్యాధి ముఖ్యంగా జనసమ్మర్థం ఉన్న చోట్ల ప్రబలంగా వ్యాప్తి చెందుతుంది.ఈ వ్యాధి అకస్మాత్తుగా ప్రబలడం వల్ల కొన్ని జపాన్లొ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూసి వేయవల్సి వచ్చింది.[4] 1990 సంవత్సరములో అమెరికా ఖండంలోని ప్రభుత్వాలు గవదలు (మమ్స్) రుబెల్లతో సహా ఈ వ్యాధి నిర్మూలించాలని ప్రణాళిక తయారు చేశాయి. ఉత్తర అమెరికా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా నుండి ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించారు. చివరిగా ఈ వ్యాధి 2002 నవంబరు 12 సంవత్సరములో గుర్తించాక తట్టు నిర్మూలించబడింది అని ప్రకటించారు.[5] కాని తరువాత కూడా రెండు మూడు సార్లు ఈ వ్యాధి వ్యాధి ప్రబలంగా ఉన్న దేశాలనుండి వచ్చినవారి వల్ల ఈ దేశాలకు వ్యాప్తి చెంది వ్యాధి మళ్ళి ఈ దేశములో కనిపించింది. బోస్టన్లో జూన్ 2006 సంవత్సరములో భారత దేశము నుండి ఒక వ్యక్తి ఈ వ్యాధిని తీసుకొని వెళ్ళాడు.[6], [7] ఇండియానా, ఇండియానాపోలిస్ అనే అమెరికా ప్రదేశాలలో 2005 సంవత్సరములో ఈ వ్యాధి తట్టు టీకా తీసుకోని ప్రజలలో సోకి కలవరం లేపింది. 2010 సంవత్సరముకల్ల రుబెల్లా అనే వైరస్ కూడా నిర్మూలుంచాలనే ప్రణాళిక నడుస్తున్నది.[8] 2006 సంవత్సరములో బొలివియా బ్రెజిల్, కొలంబియా గ్వాటామెలా మెక్సికొపెరూ వెనిజులా దేశాలలో అప్పుడప్పుడు ఈ జబ్బు పొడసూపుతున్నది. ఈ వ్యాధి నిర్మూలనకు కొన్ని సంస్థలు కూడా పనిచేస్తున్నవి.[9]

మూలాలు

[మార్చు]
  1. Live attenuated measles vaccine. EPI Newsl. 1980 Feb;2(1):6.
  2. Rima BK, Earle JA, Yeo RP, Herlihy L, Baczko K, ter Muelen V, Carabana J, Caballero M, Celma ML, Fernandez-Munoz R 1995 Temporal and geographical distribution of measles virus genotypes. J Gen Virol 76:11731180.
  3. Flint SJ; Enquist LW; Racaniello VR; AM Skalka. Principles of Virology, 2nd edition: Molecular Biology, Pathogenesis, and Control of Animal Viruses.
  4. Bing[permanent dead link]
  5. "Measles". Archived from the original on 2014-03-06. Retrieved 2014-04-18.
  6. http://www.boston.com/yourlife/health/diseases/articles/2006/06/10/measles_outbreak_shows_a_global_threat/ Boston Globe article
  7. http://www.npr.org/templates/story/story.php?storyId=5500100 NPR report
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-10-22. Retrieved 2007-09-20.
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-12-11. Retrieved 2007-09-20.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=తట్టు&oldid=4215336" నుండి వెలికితీశారు