కన్ఫ్యూషియస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చైనీయ తత్వము
ప్రాచీన తత్వము
孔夫子
పేరు: 孔丘|చైనీ భాష కాంగ్ కియు
జననం: క్రీ.పూ. సెప్టెంబరు 28, 551
కుఫూ, చైనా
మరణం: 479 క్రీ.పూ.
కుఫూ, చైనా
సిద్ధాంతం / సంప్రదాయం: కన్ఫ్యూషియానిజం స్థాపకుడు
ముఖ్య వ్యాపకాలు: నీతి తత్వము, సామాజిక తత్వము, ఎథిక్స్
ప్రముఖ తత్వం: కన్‌ఫ్యూషియానిజం
ప్రభావితం చేసినవారు: జ్‌హౌ కాలము చైనీయ తత్వం
ప్రభావితమైనవారు: తూర్పు తత్వవేత్తలు

కన్‌ఫ్యూషియస్ (ఆంగ్లం : Confucius) (చైనీస్ భాష : Kǒng Fūzǐ లేదా K'ung-fu-tzu), సాహిత్యపరమైన అర్థం: "కాంగ్ గురువు" ("Master Kong"),[1] (సెప్టెంబరు 28, క్రీ.పూ 551క్రీ.పూ. 479) చైనాకు చెందిన శోధకుడు,, సామాజిక తూర్పు దేశాల తత్వవేత్త. ఇతని బోధనలు, తత్వము అనేకానేక దేశాల ప్రజలపై తన లోతైన ప్రభావాన్ని చూపగలిగింది. ఉదాహరణకు చైనీస్, కొరియన్, జపనీస్, తైవానీస్, వియత్నామీస్ ఆలోచనలు, తత్వము, జీవితం.

ఇతడి తత్వము, ప్రభుత్వ-నీతి పై, సామాజిక-సంబంధాలపై, న్యాయంపై,, ప్రామాణికతపై తన ప్రభావంచే నొక్కివక్కాణించగలిగినది. ఈ నియమాలు చైనాలో అమితంగా ఆదరణ పొందాయి. ఇతర తత్వాలు దాదాపు మరచిపోయేంత ప్రభావం చూపగలిగింది, ఉదా: హాన్ సామ్రాజ్యం నాటి చైనీయుల న్యాయవాదం (法家) లేదా టావోయిజం (道家) [2][3][4] (206 క్రీ.పూ. – 220 సా.శ.). కన్‌ఫ్యూషియస్ ఆలోచనలు ఆతరువాతి కాలంలో అభివృద్ధి చెంది కన్‌ఫ్యూషియానిజం (儒家) అనే కొత్త తత్వానికి ఊపిరిపోసాయి. ఈ తత్వము యూరప్కు జెసూట్ సంఘం మాట్టియో రిక్కీ చే మొదటిసారిగా పరిచయం గావింపబడినది, దీని లాటిన్ నామం "కన్‌ఫ్యూషియస్".

ఇతని బోధనలు అనలెక్‌ట్స్ ఆఫ్ కన్ఫ్యూషియస్ (論語) లో కానవస్తాయి. ఈ బోధనలన్నీ కన్‌ఫ్యూషియస్ మరణించిన తరువాత క్రోడీకరించబడ్డాయి. నవీన చరిత్రకారులు ఈ క్రోడీకరణలను అంగీకరించడంలేదు. ఈ బోధనలు, కన్‌ఫ్యూషియస్ చేతి దస్తూరీ కాదని వీరి వాదన.[5][6] కానీ దాదాపు 2,000 యేండ్ల తరువాత, ఐదు క్లాసిక్‌లు ఇతడి రచనలు లేదా వీటికి ఇతను సంపాదకుడు,[7][8] అవి క్లాసిక్ ఆఫ్ రైట్స్ (సంపాదకుడు),, స్ప్రింగ్ అండ్ ఆటమ్న్ ఆన్నల్స్ (春秋) (రచయిత) మొదలగునవి అని విశ్వసిస్తున్నారు.

వ్యక్తిగత జీవితం , కుటుంబం

[మార్చు]

సంప్రదాయానుసారం, కన్ఫ్యూషియస్ క్రీ.పూ 551 లో వసంతకాలంలో జన్మించాడు. ఇతడి జన్మకాలములో నూరు తత్వాల పాఠశాల అనే తత్వ-ఉద్యమం బయలుదేరియుండినది. ఇతను లూ రాజ్యం (ప్రస్తుతంషాండోంగ్ రాష్ట్రం) లోనికుఫూ నగర సమీపంలో ఓ సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఇతడి కుటుంబం అనేక కష్టకాలాలనూ చూసింది.[9]

బోధనలు

[మార్చు]

అనలెక్‌ట్స్ 論語 లలో, కన్‌ఫ్యూషియస్ తనకు తాను "ఏమీ కనుగొనని వార్తాహరుడు" ("transmitter who invented nothing") అని వ్రాసుకున్నాడు.[7] ఇతడు "చదువు" పై అమిత ప్రాముఖ్యతను ప్రదర్శించాడు,[10][11] ఇతని గ్రంథము "విద్య" కొరకు గల చైనీభాష పదం చదువు తో ప్రారంభమవుతుంది. ఈ కారణాన చైనీయులు ఇతడిని "మహా గురువు"గా గౌరవిస్తారు.జీవితం , సమాజపు సిద్ధాంతాలను స్థిరపరచే సాంప్రదాయాలను నెలకొల్పే విధానాలను దూరంగా ఉంచి, స్వయంశోధన చేపట్టాలని, తద్వారా బాహ్యప్రపంచాన్ని అధ్యయనం చేయాలని తన శిష్యులకు బోధించేవాడు.[12]

కన్ఫ్యూషియస్ బోధనలలో ఒక బోధనపై ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూవచ్చాడు, అదే స్వీయ-శోధన , నడవడికల సూత్రీకరణ. నీతిశాస్త్రముపై , సామాజికనీతి, ప్రభుత్వ-నీతి మొదలగు అంశాలపై ఎక్కువ ప్రాధాన్యత ప్రకటించాడు.[13][14]

సంగీత సాధన

[మార్చు]

కన్ఫ్యూషియస్ వ్యక్తిత్వంలో, జీవితంలో సంగీత సాధనకు ప్రాధాన్యం ఉంది. చైనాదేశపు సంగీతం మనుష్యుని స్వభావంలో ఒక గుణసమత్వాన్ని, భావసమత్వాన్ని అందిస్తుందని, తద్వారా నైతిక జీవనం అలవడుతుందని చెప్పేవారు. సంగీతం వల్ల ప్రభుత్వ యంత్రాంగంలోని అధికారులకు, రాజుకూ నైతికత అలవడుతుందని, అది వారి పాలన వల్ల దేశంలో ప్రతిఫలిస్తుందని బోధించారు. సంగీతం వల్ల వ్యక్తికి నైతికత, శాంతి, పరతత్త్వ అనుభూతి కూడా లభిస్తుందని భావించేవారు. కన్ఫ్యూషియస్ హియాంక్సే(Hsiang tse) అనే విద్వాంసుని వద్ద సంగీతాన్ని అభ్యసించారు.[15]

పేర్లు

[మార్చు]
కన్‌ఫ్యూషియస్ చిత్రం, ఇ.టి.సి.వెర్నర్ (1922) రచన "మిథ్ , లెజెండ్స్ ఆఫ్ చైనా" నుండి సేకరణ.
  • మిచిలీ రుగ్గీరీ,, ఇతరుడు, జెసూట్స్, చైనీయుల సాహిత్యాలను పాశ్చాత్య భాషలలో తర్జుమా చేయునపుడు, " 孔夫子 "ను 'కన్‌ఫ్యూషియస్' అని తర్జుమాచేసారు. ఈ పేరే సాధారణంగా పాశ్చాత్యదేశాలలో ఉపయోగించడం జరుగుతున్నది.
  • రోమనీ కరణ::
  • కాంగ్ ఫూజీ (Kǒng Fūzǐ, లేదా Kǒng fū zǐ) పిన్‌యిన్ లో.
  • కూంగ్ ఫూ-త్జూ (K'ung fu-tzu) వడే గైల్స్లో (లేదా, కుంగ్ ఫు-త్జే).
  • ఫూజీ అనగా గురువు (టీచరు). చైనీయుల సాంప్రదాయం ప్రకారం, గురువును పేరుతో పిలవడం సాంప్రదాయం కాదు, కావున గౌరవపూర్వక నామవాచక ఉపయోగం "మాస్టర్ కాంగ్" అని లేదా "గౌరవనీయ గురువు" అనీ పిలువసాగారు.
  • 'ఫు' అనే అక్షరం ఐచ్ఛికం; నవీన చైనాలో ఇతను సర్వసాధారణంగా కాంగ్ జీ అని పిలువబడుతాడు.
  • ఇతని అసలు నామం 孔丘, "కాంగ్ ఖియు" (Kǒng Qiū). కాంగ్" అనునది సాధారణ చైనీయ కుటుంబ నామం.

(వడే గైల్స్ లో ఇతని పేరు కుంగ్ చియూ, అనువాదం డి.సి.లౌ).

  • ఇతని సౌజన్యం పేరు 仲尼, జ్‌హోంగ్ నీ.
  • క్రీ.పూ. 9వ శతాబ్దం ( en:Han Dynasty కాలపు యువాంషీ మొదటి సంవత్సరం ), ఇతనికి మొదటి మరణాంతర నామం (బిరుదు): 褒成宣尼公, "లార్డ్ బావోఛేంగ్‌జువాన్".
  • ఇతని ప్రసిద్ధ మరణాంతరనామాలు (బిరుదులు)
  • 至聖先師, 至聖先師,జీషేంగ్‌జియాంషీ, (అర్థం : జ్ఞాన స్థానాన్ని చేరిన గతకాలపు గురువు)
  • 至聖,至聖, జీషేంగ్, "మహా ఋషి";
  • 先師,先師, జియాంషీ, "మొదటి గురువు".[16]
  • ఇంకనూ 萬世師表,"వాషీషిబియావో", చైనీయ భాష లో "ఆదర్శ గురువు".

తత్వము

[మార్చు]
కన్‌ఫ్యూషియన్ యొక్క ఆకృతి చిత్రం టాంగ్ సామ్రాజ్యానికి చెందినది. కళాకారుడు వూ దావోజీ (680-740).

కన్‌ఫ్యూషియానిజంను చైనీయులు ఒక మతముగా అవలంబిస్తున్నప్పటికీ, అనేకానేక సందేహాలు ఉత్పన్నమౌతున్నాయి. ఇదొక తత్వమా లేక మతమా? అని వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నవి. కన్‌ఫ్యూషియానిజం లో "జన్మాంతరము" లేదు. దేవుడు లేదా దేవతల గురించి ఒక సంక్లిష్టమైన దృష్టి ఉన్నప్పటికీ, ఆధ్యాత్మికపరమైన, ఆత్మసంబంధమయిన విషయాలను ఈ తత్వము స్పృశించలేక పోవడం మతపరంగా ఒక లోటు.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. More commonly abbreviated to మూస:Zh-cp; see Names section
  2. Ban 111, vol.56
  3. Gao 2003
  4. Chen 2003
  5. Zhang 1899, p. 111
  6. Liu 2005, section 3
  7. 7.0 7.1 The Analects & 479 BC - 221 BC, VII.1
  8. Kang 1958
  9. Chien 1978
  10. Chien 1978, pp. 117–120
  11. The Analects & 479 BC - 221 BC, I.1
  12. The Analects & 479 BC - 221 BC, III.3; VI.13 and XVII.11
  13. Derrida 1983, p. 63
  14. Du 2005
  15. సంగీతం - సిద్ధి:శివానందమూర్తి:సుపథ ద్వైమాసిక పత్రిక:జూన్ 2011:పేజీ.45,46
  16. Zhang 1988, p. 76

ఇతర పఠనాలు

[మార్చు]
  • Chin, Annping (2007). The Authentic Confucius: A Life of Thought and Politics. New York: Scribner. ISBN 0-7432-4618-7.
  • Confucius. (1997). Lun yu, (In English The Analects of Confucius). Translation and notes by Simon Leys. New York: W.W. Norton. ISBN 0-393-04019-4.
  • Confucius. (2003). Confucius: Analects—With Selections from Traditional Commentaries. Translated by E. Slingerland. Indianapolis: Hackett Publishing. (Original work published c. 551–479 BC) ISBN 0-87220-635-1.
  • Csikszentmihalyi, M. (2005). "Confucianism: An Overview". In Encyclopedia of Religion (Vol. C, pp 1890–1905). Detroit: MacMillan Reference USA.
  • en:Herrlee Glessner Creel (1949). Confucius and the Chinese Way. (Reprinted numerous times by various publishers.)
  • Mengzi (2006). Mengzi. Translation by B.W. Van Norden. In en:Philip J. Ivanhoe & B.W. Van Norden, Readings in Classical Chinese Philosophy. 2nd ed. Indianapolis: Hackett Publishing. ISBN 0-87220-780-3.
  • Van Norden, B.W., ed. (2001). Confucius and the Analects: New Essays. New York: Oxford University Press. ISBN 0-19-513396-X.
  • Wu, J. (1995a). "Confucius". In I. McGreal (ed.), Great Thinkers of the Eastern World: The Major Thinkers of the Philosophical and Religious Classics of China, India, Japan, Korea and the world of Islam (pp 3–8). New York: HarperCollins. ISBN 0-06-270085-5
  • Wu. J. (1995b) "Mencius". In I. McGreal (ed.), Great Thinkers of the Eastern World: The Major Thinkers of the Philosophical and Religious Classics of China, India, Japan, Korea and the world of Islam (pp 27–30). New York: HarperCollins. ISBN 0-06-270085-5
  • Confucius appears as one of the main characters in Gore Vidal's Creation (novel). The book gives a very sympathetic and human portrait of him and his times.

బయటి లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.