వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2015)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2015 సంవత్సరంలో "ఈ వారం వ్యాసం" శీర్షికలో ప్రదర్శించిన వ్యాసాలు

ప్రస్తుత ప్రతిపాదనలు, జాబితా కోసం వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.


1వ వారం

క్రైస్తవ మతము

క్రైస్తవ మతం ప్రపంచంలో మానవాళి అత్యధికంగా పాటించే మతం అని చెప్పడంలో సందేహం లేదు. ఏసు క్రీస్తు బోధనల ప్రకారం జీవించేవారిని క్రైస్తవులు అని అనడం కద్దు. పరిశుద్ధ గ్రంధము (హోలీ బైబిల్) క్రైస్తవుల పవిత్ర గ్రంధము. ఆర్యుల వేద కాలంలో యూదుల మతము ఆవిర్భవించింది. బైబిలు పాత నిబంధనలో మొదటి ఐదు అధ్యాయాలైన ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయకాండము, ద్వితియోపదేశకాండము, సంఖ్యాకాండము వంటి పుస్తకాలు యూదులకు పవిత్రమైనవి. వీటిని ధర్మశాస్త్ర గ్రంధాలని యూదులు నమ్ముతారు. అయితే కాల క్రమేణా విగ్రహారాధన ఊపందుకొని యూదుల ఆచార వ్యవహారాలు చాలా మార్పులకు లోనయ్యాయి. నేడు హిందువులు తమ దేవతలను సంతృప్తి పరచడం కోసం జంతువులను బలి ఇస్తున్నట్లుగా ఆ కాలంలో యూదులు కూడా పాప పరిహారార్ధం జంతు బలులు అర్పించేవారు , యూదుల ఆచారాలు వెర్రి తలలు వేశాయి. ధనిక - పేద, యజమాని - బానిస వంటి అసమానతలు, వ్యాధి గ్రస్తుల పట్ల చిన్న చూపు, మూడ నమ్మకాలు ఏర్పడ్డాయి. పాత నిబంధనలో భాగమైన యోషయా గ్రంధం 7:14 లో "ఇదిగో ఒక కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయన ఇమ్మనుయేలు అని పిలుచును" అని వ్రాయబడినట్లుగానే , కొన్ని వందల సంవత్సరాల తర్వాత వ్రాయబడిన క్రొత్త నిబంధనలో భాగమైన మత్తయి సువార్త ప్రకారం యూదుల కులంలో కన్య అయిన "మరియ" (మేరీ) కు యేసు క్రీస్తు జన్మించడం జరిగింది.

(ఇంకా…)

2వ వారం

హరికథ

ఆంధ్ర దేశంలో అన్ని జానపద కళారూపాలతో పాటు వర్ధిల్లి ప్రజాభిమానాన్ని చూరగొన్న కళారూపాలలో ముఖ్యమైన హరికథా గానం ఆంధ్రుల హరికథా చరిత్రలో హరికథ ఒక ప్రత్యేకతనూ, గౌరవాన్నీ సంపాదించింది. హరిలీల లను చెప్పే విధానమును హరికథ అంటారు. దీనికి తెలుగు సాహిత్యంలో చాలా ప్రాముఖ్యత కలదు. నారదుడు మొదటి హరిదాసు అంటారు. దానిని ఒక విశిష్ట కళారూపంగా తీర్చి దిద్దిన వాడు ఆదిభట్ల నారాయణదాసు. బ్రహ్మశ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు ప్రముఖ హరికథ విద్వాంసుడు మరియు అష్టభాషాపండితుడు. హరికథ సంగీత, సాహిత్యాల మేలు కలయిక. ఈ కథ చెప్పువారిని భాగవతులు లేదా భాగవతార్ అని అందురు. ఆధునిక యుగంలో ఆదిభట్ల నారాయణదాసు, పరిమి సుబ్రహ్మణ్యం భాగవతార్ మొదలగువారు ఈ ప్రక్రియలో ఆద్యులు. హరికథా కళారూపంలో ఒకే ఒక్క పాత్ర ధారి మూడు గంటల కాలం కథా గానం కావిస్తాడు. ఒకే వ్వక్తి అన్ని పాత్రల్లోనూ జీవించి, రసవత్తరంగా నటిస్తాడు. నోటితో వాచికం చెపుతూ, మృదుమధురమైన గానం పాడుతూ, ముఖంలో సాత్వికమూ, కాలితోనృత్యమూ, చేతులతో ఆంగికమూ గుప్పిస్తూ ఆకర్షణీయమైన ఆహార్యంతో ఏకకాలంలో అభినయిస్తాడు. హరికథలో ఉన్న ప్రత్యేకత ఇదే. మూడు గంటల కాలం కూర్చున్నా ప్రేక్షకులకు విసుగు జనించకుండా పిట్ట కథలతో, మధ్య మధ్య హాస్యరసాన్ని పోషిస్తూ సమాజంలో వున్న కుళ్ళు ఎత్తి చూపిస్తూ, వేదాంత బోధ చేస్తూ జనరంజకంగా హరికథను గానం చేస్తాడు.

(ఇంకా…)

3వ వారం

రామనాథ స్వామి దేవాలయం

రామనాథ స్వామి దేవాలయం భారత దేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం. ఇది 275 పాడల్ పేత్ర స్థలములలో ఒకటి. దీనిని ప్రసిద్ధ భక్తులైన "నాయనార్లు", అప్పార్లు, సుందరార్లు అంరియు తిరుగ్నాన సంబందార్లు తమ కీర్తనలతో ఆ దేవాలయ మహిమలను కీర్తించారు. ఈ దేవాలయం 12 వ శతాబ్దంలో పాండ్య రాజ్యంలో విస్తరింపబడినది. ఈ దేవాలయ ముఖ్య విగ్రహాలు జఫాన రాజ్యానికి చెందిన జయవీర చింకైరియన్ మరియు ఆయన తర్వాత వారైన గుణవీర చింకైయన్ లచే పునరుద్ధరింపబడినది. ఈ దేవాలయం మిగిలిన భారతదేశంలోని హిందూ దేవాలయాల కంటే అతిపెద్ద వరండా కలిగియుంది. ఈ దేవాలయం రామేశ్వరం అనే ద్వీప పట్టణంలో ఉంది. ఇది శైవులకు, వైష్ణవులకు మరియు స్మార్థులకు ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లింది. ఈ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయంలో శివుడు "జ్యోతిర్లింగం" గా కొలువబడుతున్నాదు. "జ్యోతిర్లింగం" అనగా దీప స్థంబం అని అర్థం.ఇతిహాసాల ప్రకారం రామాయణం లో రాముడు విష్ణువు యొక్క ఏడవ అవతారం. రామేశ్వరంలో శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధీనేతైన రావణాసురుడు పరిపాలించిన లంక కు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువు ని రామసేతువు అని పిలుస్తారు.రావణాసురిడిని నిహతుడిని చేశాక తనకి అంటిన బ్రహ్మ హత్యాపాతకం నిర్మూలించుకోవడం కొరకు రామేశ్వరము లింగ ప్రతిష్ఠ చేయాలనుకుంటాడు.

(ఇంకా…)

4వ వారం

మందేశ్వర స్వామి దేవాలయం

మందేశ్వర(శనేశ్వర) స్వామి దేవాలయం,మందపల్లి, తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలంలో గలదు. హిందూ దేవాలయాలలో అనేక చోట్ల శని గ్రహము "నవగ్రహాలలో" ఒక భాగంగా ఉంటుంది. కానీ భారతదేశంలో ఒక్క శని ని మాత్రమే పూజించే మందిరాలలో మందేశ్వర స్వామి దేవాలయం ఒకటి. మందపల్లి గ్రామం రాజమండ్రి కి 38 కి.మి., కాకినాడ కు 60 కి.మి., అమలాపురంకు30 కి.మి.,రావులపాలెంకు 9 కి.మి. దూరంలో ఉంది. పూర్వం అశ్వత్థ, పిప్పలాదులనే రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే మునులను సంహరించి భక్షించేవారు. అప్పుడు వారంతా వెళ్ళి అక్కడే పరమేశ్వరుని తపస్సులో ఉన్న శనీశ్వరునితో మొరపెట్టుకున్నారు. వారి మొరను ఆలకించిన మందుడు ఆ రాక్షసులను హతమార్చాడు. అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని నివారించుకొనేందుకు మందపల్లిలో శివాలయాన్ని ప్రతిష్టించి పూజలు చేశాడు. అప్పట్నుంచీ ఆ ఆలయం శనైశ్చరాలయంగా ప్రసిద్ధి గాంచింది. మందపల్లి శనీశ్వర స్వామి ఇతర ఆలయాలకు కాస్తంత భిన్నం. వాస్తవానికి సోమేశ్వర స్వామి ఆలయం అయినా, శనీశ్వరుడు ప్రతిష్ఠించడంతో శనీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాదిమంది భక్తులు వస్తుంటారు.

(ఇంకా…)

5వ వారం

వెల్డింగ్

వెల్డింగ్ అనగా ఒకే రకమైన (సజాతి) లోహాలను, లేదా రెండు రకాల (విజాతి) లోహాల ఫలకాలను, వస్తువులను ఒకదానితో నొకటి మేళనం చెందునట్లు కరగించి అతుకు ప్రక్రియ. ఇది పురాతనమైన ప్రక్రియ. మానవుడు మృత్తిక నుండి లోహాల ముడి ఖనిజాన్ని గుర్తించి, వేరుచేసి అందుండి లోహాలను ఉత్పత్తి చేసి, వాటి నుండి తన అవసరానికి సరిపడ వస్తువులను తయారు చెయ్యడం ప్రారంభించిన తరువాత లోహాలను అతుకుటకు వెల్డింగ్ అవసరమైనది. లోహాల నుండి వస్తువులను మొదట ఫొర్జింగ్ పద్ధతిలో తయారు చేసేవారు. లోహాలను కరుగు స్థితి వచ్చు వరకు కొలిమిలో వేడి చేసి సుత్తెలతో లేదా సమ్మెటతో మోది తమకు కావలసిన ఆకారము వచ్చేటట్లు చేసేవారు. వెల్డింగ్ పద్ధతిలో లోహ భాగాలను జోడించడం తెలిసిన తరువాత వివిధరకాలలో పరిమాణంలో వస్తువులను తయారుచెయ్యడం సులభమైనది. మొదటలో ఫోర్జింగ్ విధానం లోనే అతుకవలసిన లోహ అంచులను ఎర్రగా అయ్యే వరకు కొలిమిలో వేడిచేసి రెండు అంచులను దగ్గరగా చేర్చి బలంగా సుత్తెలతో లేదా సమ్మెటలతో మోది రెండు అంచులు ఒకదానితో ఒకటి ఏకరూపతతో కలిసిపోయేలా చేసేవారు. ఇప్పటికీ కొన్ని గ్రామాలలో సంప్రదాయ కమ్మరి వారు ఎద్దుల బండ్ల చక్రాలకు వేసే ఇనుపపట్టిని వలయకారంగా వంచి రెండు అంచులను కొలిమిలో వేడిచేసి, సుత్తెలలో మోది అతకడం వాడుకలో ఉన్నది. ఇలాగే వ్యవసాయ పని ముట్టులను, పరికరాలను ఫొర్జింగ్ రీతిలో అతకడం చూడవచ్చును. ఆ తరువాత లోహ ఆభరణాలను, లోహ పాత్రలను మరింత తేలిక పద్ధతిలో అతకడం కనుగొన్నారు.

(ఇంకా…)

6వ వారం

డల్లాస్

డల్లాస్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న పెద్ద నగరాలలో ఇది 4వ స్థానంలో ఉంది. అమెరికాలో ఇది 9వ స్థానంలో ఉంది. డల్లాస్ నగరం జలభాగం మరియు డల్లాస్ కౌన్టీ నియోజకవర్గాన్ని చేర్చకుండా భూభాగం మాత్రమే 342.5 చదరపు మైళ్ళు విస్తరించి ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో లెక్కల ననుసరించి నగర జనాభా 2007 జూన్ 22 తారీఖుకు 1,232,940. డల్లాస్ నగరం 12 కౌంటీలు కలిగిన డల్లాస్-ఫోర్ట్‌వర్త్ మహానగర ఆర్ధిక కేంద్రం. ఈ రెండు ప్రాంతాలను కలిపి ప్రజలు ది మెట్రో కాంప్లెక్స్' 'అని అభిమానంగా పిలుచుకుంటూ ఉంటారు. డల్లాస్ మహానగరపాలిత ప్రాంతం 66 లక్షల జనాభాతో అమెరికాలో మహానరపాలిత ప్రాంతాలలో 4వ స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా ఉన్న నగరాల గురించి అధ్యయనంలో లగ్ బరో' 'విశ్వవిద్యాలయంచే ఈ నగరం నైరుతి ప్రాంత అమెరికాలో ఏకైకవిశ్వ నగరంగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. డల్లాస్ నగరం 1841లో స్థాపించబడింది. ఫిబ్రవరి 2 1856 లో నగర హోదాను పొంది నగరపాలిత ప్రాంతం అయింది. నగరం ప్రధానంగా బ్యాంకింగ్, వ్యాపారం, సమాచార రంగం, విద్యుత్‌శ్చక్తి, కంఫ్యూటర్ విజ్ఞానం మరియు రవాణా రంగాలపై ఆధార పడి ఉంది. డల్లాస్ భూమధ్యస్థంగా ఉంది కనుక ఇక్కడ నుండి జలమార్గాలు, సముద్రంతో సంబంధ బాందవ్యాలు తక్కువే. చమురు పరిశ్రమలకు మరియు పత్తి పంటలకు డల్లాస్‌కు ప్రత్యేకత ఉంది.

(ఇంకా…)

7వ వారం
దస్త్రం:Sarojini Naidu in Bombay 1946.jpg

సరోజినీ నాయుడు

సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి. సరోజినీ దేవి 1935 డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెష్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారత దేశపు తొలి మహిళా గవర్నరు కూడా. ఈ దేశం బానిస తనం నుంచీ, నియంతృత్వ సంకెళ్ళ నుంచీ విముక్తి పొంది నాది, నేను అన్న భావంతో అఖిల భారత ప్రజానీకం స్వేచ్ఛా, స్వాత్రంత్ర్యాలతో జీవించాలన్నదే వారి మహత్తర ఆశయం. అటువంటి పూజనీయులైన పురుషులే కాక, భారత మహిళలు ఏ రంగంలోనూ, తీసిపోరని నిరూపించిన వీర మహిళలు మన దేశంలో చాలా మంది పుట్టారు. అటువంటి వారిలో శ్రీమతి సరోజినీ నాయుడు కూడా ఒకరు.సరోజిని నాయుడు మంచి రచయిత్రి. పద్య రచయిత. ఈమె క్రీ.శ. 1879 వ సంవత్సరం ఫిబ్రవరి 13 వ తేదీన హైదరాబాద్ లో జన్మించారు. వీరిది బెంగాలీ బ్రాహ్మణ కుటుంబం. ఈమె తండ్రి డా. అఘోరనాథ్ చటోపాథ్యాయ, తల్లి శ్రీమతి వరద సుందరి. అఘోరనాథ్ చటోపాథ్యాయగారు నిజాం కాలేజీకి మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడిగా పని చేసారు. తల్లి వరదాదేవి చక్కని రచయిత్రి. చిన్నతనం నుంచీ ఆమె బెంగాలీ భాషలో చక్కని కావ్యాలూ, కథలు వ్రాయడం జరిగింది.

(ఇంకా…)

8వ వారం

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం హిందూ మత ప్రసిద్ద శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో ఒకటి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ దేవాలయం "రుద్రసాగరం" సరస్సు సమీపాన కలదు. ఈ దేవాలయం లో విశేషమైన శివలింగాన్ని "స్వయంభువు" గా భావిస్తారు. ఈ క్షేత్రంలో ఇతర చిత్రాలు, లింగాల వలె కాకుండా మంత్ర శక్తి తో యేర్పడిన శివలింగం గా భావిస్తారు. శివ పురానం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు,తమలో తము "నేను గొప్ప అంటే నేను గొప్ప" అని వాదించుకున్నారు.ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకొన్నాడు.ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది.బ్రహ్మ విష్ణువులు ఇద్దరు లింగాన్ని సమీపించారు.అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కలికంగా సద్దుమణిగింది.ఆ మహా లింగం మొదలు,తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది.బ్రహ్మ హంసా రూపం దరించి లింగం అగ్ర బాగాన్ని చూడడానికి,విష్ణువు వరాహ రుపమలో ఆదిని కనుక్కోవడానికి బయలు దేరాడు.బ్రహ్మకు ఎంతకు లింగం అగ్ర భాగం కాని మొదలు కాని కనిపించలేదు.ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం(మొగలి పువ్వు) జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని అపితనకు,బ్రహ్మకు,విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి,సహాయం చేయమని అడిగాడు.

(ఇంకా…)

9వ వారం

గాడ్గే బాబా

దేబూజీ ఝింగ్‌రాజీ జానోర్కర్ (ఫిబ్రవరి 23, 1876 – డిసెంబర్ 20, 1956) సంత్ గాడ్గే మహరాజ్‌గా, గాడ్గే బాబాగానూ(హిందీ: गाडगे बाबा) సుప్రఖ్యాతుడైన సాధువు, సంఘసంస్కర్త. సంచార భిక్షువు. మహారాష్ట్రవ్యాప్తంగా వున్న తన భక్తుల సహకారం తీసుకుని వారంవారీ పండుగలు నిర్వహించేవారు. గ్రామాలలో శుభ్రత, తోటివారికి సాయపడే లక్షణం, సేవ వంటివాటిని ప్రచారం చేస్తూండేవారు. భారతదేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పక్షాలూ, సేవాసంస్థలు ఆయనను స్ఫూర్తిగా స్వీకరిస్తూన్నారు. ఆయన అసలుపేరు దేవీదాస్ దేబూజీ. గాడ్గే బాబా మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన అంజన్గావ్ తాలూకాకు చెందిన షేన్గావ్ గ్రామంలోని రజక కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జింగ్రాజీ, సక్కుబాయిలు. వారు రజక కులంలో జన్మించినా తండ్రితాతల కాలం నుంచే ఉన్న భూమిని సాగుచేసుకుంటూ జీవించేవారు. తండ్రి దేబూజీ చిన్నతనంలోనే మద్యపానానికి బానిసై మరణించడంతో దేబూజీ మేనమామ ఇంట్లో ఆశ్రయం పొందారు. మేనమామ కూడా మంచి భూవసతి కలిగినవాడు కావడంతో దేబూజీ ఆయన పశువుల్ని చూసుకుంటూ, పొలంపనులు చేస్తూ కుటుంబంలో మంచిపేరు తెచ్చుకున్నారు. చిన్నతనం నుంచీ భజనమండళ్ళలో కీర్తనలు, పాటలు పాడుతూ చుట్టుపక్కల గ్రామాలలో కూడా ప్రఖ్యాతిపొందారు. ఆయన సన్యాసాశ్రమ పూర్వపు జీవితంలో ఒక ముఖ్యమైన ఘటన జరిగింది. షావుకారు తన ఆస్తిని అన్యాయంగా ఆక్రమించుకోబోగా దానిని సహించలేక ఎదురుతిరిగారు. షావుకారు గూండాలను పంపితే దేబూజీ ఒక్కడే వారందరినీ తన్ని తరిమేశారు.

(ఇంకా…)

10వ వారం

భూత్పూరు

భూత్పూరు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఈ గ్రామం జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్‌కు 8 కిమీ దూరంలో 44వ నెంబరు (పాతపేరు 7వ నెంబరు) జాతీయ రహదారిపై 16°42' ఉత్తర అక్షాంశం, 78°3' తూర్పు రేఖాంశంపై ఉపస్థితియై ఉన్నది. చరిత్రలో బూదపురంగా పిలువబడిన ఈ గ్రామం పలు యుద్ధాలకు స్థానమైంది. తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక వేయించిన శాసనంతో పాటు ఈ గ్రామంలో గోనరెడ్ల పాలకులకు మరియు చాళుక్యులకు సంబంధించిన పలు చారిత్రక ఆధారాలు, శాసనాలున్నాయి. పురాతనమైన నందీశ్వరాలయం గ్రామం నడిబొడ్డున ఉన్నది. మహబూబ్‌నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు ప్రధాన రహదారి కూడా గ్రామం మీదుగా వెళ్ళుచుండటంతో ఈ గ్రామం ప్రధాన రోడ్డు కూడలిగా మారింది. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 6248. గ్రామ కోడ్ సంఖ్య 575543. ఈ గ్రామం దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మొదట జడ్చర్ల తాలుకాలో భాగంగా ఉన్న ఈ గ్రామం 1986లో మండల వ్యవస్థ ఏర్పడిన పిదప ప్రత్యేకంగా మండల కేంద్రంగా మారింది. ఈ గ్రామంలోనే కాకుండా గ్రామ పరిసరాలలో కూడా పలు చారిత్రక ఆధారాలు, శాసనాలు ఉన్నాయి.

(ఇంకా…)

11వ వారం

మెరామిక్ జలాంతర్గత గుహలు

మెరామిక్ జలాంతర్గత గుహలు యునైటెడ్ స్టేట్స్‌ లోని సెయింట్ లూయిస్ పట్టణము తూర్పున ఉన్న మిస్సోరీ నది కింది భాగములో ఏర్పడిన అద్భుతమైన గుహలు. ఇవి లైమ్ స్టోన్స్(సున్నపురాయి) నీటి కలయిక వలన భూ అంతర్భాగములో రూపు దిద్దుకున్నాయి. అనేక వేల సంవత్సరాల నుండి విస్తారమైన సున్నపురాయి నిలువల మీద ప్రవహిస్తున్న మిస్సోరీ నది కారణంగా అద్భుత జలాంతర్గత గుహలు రూపు దిద్దుకున్నాయి. ఈ గుహల్లో కొలంబస్‌కు పూర్వపు స్థానిక అమెరికన్ అవశేషాలు కనుగొనబడ్డాయి. ప్రస్తుతము ఇవి సెయింట్ లూయిస్ పట్టణ ప్రత్యేక పర్యటక ఆకర్షణలలో ప్రధానమైనవి. యు ఎస్ హైవే 66 ప్రధాన ఆకర్షణలలో ఇది ఒకటి. దీనిని సంవత్సరానికి 1,50,000 మంది సందర్శిస్తుంటారని అంచనా. యు.ఎస్.ఎ. బాబ్ కేవ్ కామ్ ఈ గుహలను అమెరికాలో ఉన్న పొడవైన గుహలలో 171వ శ్రేణిలో ఉన్నట్లు గుర్తించారు.మెరామిక్ కేవర్న్ గుహలు 400 వేల సంవత్సరాల నుండి చిన్నగా సున్నపురాయి నిలువల కారణంగా రూపు దిద్దుకుంటున్నట్లు పరిశీలకుల భావన. శతాబ్దాల ముందు కాలములో స్థానిక అమెరికన్లు వీటిని నివాసార్థము ఉపయోగించారు. మొదటి సారిగా మిసిసిపి నది పశ్చిమ తీరములో ఐరోపా వారు దీనిని గుర్తించారు.

(ఇంకా…)

12వ వారం

జీవకణం

జీవకణం (ఆంగ్లం Cell) జీవులన్నిటిలో జీవం యొక్క మూలం. 1632 – 1723 లలో అంథోని వాన్ లివెహాక్ కటకం ఉపయోగించి ఒక సూక్ష్మదర్శిని తయారుచేసుకొని వర్షపు నీటిలొ ఉండే వొర్టిసెల్లా అనేనీ ప్రోటొజోవా బొమ్మను, తన నోటి లొ ఉండే గీశాడు. 1665 లో రాబర్ట్ హుక్ కణాలను బిరడా మరియు మొక్కలలో గుర్తించాడు. 1839 లో థియోడార్ ష్వాన్ మరియు మథయాస్ జాకబ్ ష్లీడెన్ మొక్కలు మరియు జంతువులన్నీ కాణాలతో నిర్మించడ్డాయని గుర్తించారు. ఇదే కణ జీవశాస్త్రానికి మూలం.1953 లో జేమ్స్ డి.వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్ డి.ఎన్.ఎ. యొక్క నిర్మాణాన్ని ప్రకటించారు. కేంద్రకం (Nucleus) రెండు త్వచాలతో ఆవరించిన సూక్ష్మాంగం. లోపలి, వెలుపలి పొరలుగా ఏర్పడిన ఈ త్వచాలు రెండింటిని కలసి 'కేంద్రక ఆచ్ఛాదనం' అంటారు. రసాయన సంఘటనలో ఒక్కో కేంద్రక పొరలమధ్య పరికేంద్రక కుహరిక ఉంటుంది. వెలుపలిపొర అంతర్జీవ ద్రవ్యజాలంతో కలిసి ఉంటుంది. కణక్రియల నియంత్రణకు కేంద్రకం ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఇది సాధారణంగఅ గోళాకరంలో కణం మధ్య అమరి ఉంటుంది. దీనిలో కేంద్రక రసం ఉంటుంది. ఈ కేంద్రక రసంలో క్రోమోసోములు, కేంద్రకాంశం తేలుతూ ఉంటాయి. క్రోమోసోములలో డి ఆక్సీ రైబోనూక్లియక్ ఆమ్లం (డి.ఎన్.ఎ.) అనే సంక్లిష్ట అణువులుంటాయి.

(ఇంకా…)

13వ వారం

మిమిక్ ఆక్టోపస్

మికిక్ ఆక్టోపస్ అనేది పరిసరాలకు అనుగుణంగా రంగులు, ఆకారాలు మార్చుకొనే ఒక ప్రత్యేక ఆక్టోపస్. యిది సముద్రపు జీవులలో ఒక వెవిధ్యతను ప్రదర్శిస్తుంది.చాలా ఆక్టోపస్ లు వాటి పరిసరాలకు అనుగుణంగా శరీర రంగును మార్చుకొని, టెక్ట్చర్ ను వివిధరాకాలుగా మార్చి శతృవులనుండి రక్షించుకుంటాయి.ఈ రంగులను మార్చుటకు వాటిలో గల క్రోమిటోపోర్లు సహాయపడతాయి. కానీ ఈ మిమిక్ ఆక్టోపస్ కు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దాని శారీరాన్ని వివిధ రకాలుగా వివిధ జీవులలాగ మార్చుకుంటుంది. మిమిక్ ఆక్టోపస్ ఆక్టోపస్ జాతులలో తెలివైనది. ఇది 15 రకాల జీవులలాగ వెను వెంటనే ఆకారాన్ని మలుచుకోగలదు. రాళ్ళలాగ, కోరల్స్ లాగ, కొన్ని జీవులలాగ యిలా వివిధరకాలుగా కనిపించి శతృవుల బారినుండి రక్షించుకుంటుంది. మిమిక్ ఆక్టోపస్ సముద్రం లో గల జలచరాలలో వివిధ రకాల జంతువుల ప్రవర్తనను ప్రవర్తించే ఏకైన జలచరం. తన శతృ జంతువును బట్టి వేరొక జంతు ఆకారాన్ని యేర్పరచుకొని దానిబారినుండి రక్షించుకోగలదు. ఉదాహరణకు రెండంగుళాల పొడవు, పెన్సిలంత పొడవు గల ఏదైనా జల చరం తరిమితే ఈ ఆక్టోపస్ ఆ జలచరం శతృవైన జలచరం వేషం మారుస్తుంది.

(ఇంకా…)

14వ వారం

ఘట్టమనేని కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ గా తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితుడైన ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి తెలుగు సినిమా నటుడు, నృత్య కళాకారుడు, దర్శకుడు, నిర్మాత మరియు భారత పార్లమెంటు సభ్యుడు. ఈయన 1942 మే 31 న గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెం గ్రామములో శ్రీ వీరరాఘవయ్య చౌదరి, శ్రీమతి నాగరత్న దంపతులకు జన్మించాడు. బి.యస్.సి. వరకు చదువుకున్నారు. సినీ పరిశ్రమలో మంచి మనిషిగా కూడా పేరు పొందాడు. 1962 లో ప్రారంభమైన తన సుదీర్ఘ కెరీర్లో ఐదు దశాబ్దాలపాటు తెలుగు సినిమారంగంలో 350 చిత్రాలలో నటించారు. 2008 లో, అతను ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పొందాడు. 2009 లో, భారతదేశం ప్రభుత్వం భారతీయ సినిమా తన సేవలకు గాను పద్మ భూషణ్ గౌరవించింది. కాంగ్రెస్ పార్టీ కోసం ఏలూరు నుండి పార్లమెంట్ సభ్యత్వానికి ఎన్నికయ్యారు. రాజకీయ రంగ ప్రవేశం కూడ చేసి, 1989 లో 9వ లోక్‌సభ కు ఏలూరు నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్ధిగా ఎన్నికయ్యాడు. ఇతడు ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలో బి.యస్సీ చదువుతుండగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కు పౌరసత్కారం జరిగింది. అక్కడ అక్కినేనికి అభిమానులు పట్టిన నీరాజనాలు, అందించిన గౌరవ సత్కారాలు చూసి, తను కూడా ఒక మంచి నటుడిగా ఎదిగితే ఎంత బాగుంటుంది అనే ఆలోచనలో పడ్డారు.

(ఇంకా…)

15వ వారం

మీనాక్షి అమ్మవారి ఆలయం

మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం లేదా మీనాక్షి అమ్మవారి ఆలయం ఒక చారిత్రక హిందూ ఆలయం ఇది ఇండియా తమిళనాడులోని మదురై పవిత్ర నగరంలో ఉంది. ఇది సుందరేశ్వర్ లేదా సుందరనాథుడు - రూపంలో శివ దేవుడికి- మరియు మీనాక్షి రూపంలోని అతడి దేవేరి పార్వతికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటి పాత మదురై నగరపు జీవన విధానాన్ని కలిగి ఉంది. ఆలయ సముదాయం ముఖ్య దేవతలకు రెండు బంగారు గోపురాలతో పాటు 14 అద్భుతమైన గోపురాలు లేదా టవర్లకు నిలయంగా ఉంది, ఇవి అద్భుతమైన శిల్ప, చిత్రకళా రీతులతో ఉంది. ఆలయం తమిళ ప్రజలకు అతి ముఖ్యమైన చిహ్నంగా ఉంది, తమిళ సాహిత్యంలో అతి పురాతన కాలం నుంచీ ఈ ఆలయం ప్రస్తావించబడుతోంది, అయితే ఆలయ ప్రస్తుత రూపం 1600 సంవత్సరంలో నిర్మించబడిందని నమ్మిక. ఎత్తైన ఆలయ గోపురం 51.9 మీటర్ల ఎత్తు ఉంది.హిందూ పురాణం ప్రకారం, శివుడు మీనాక్షిని (పార్వతిఅవతారాన్ని) పెళ్లాడడానికి సుందరేశ్వర్ రూపంలో భూమ్మీదకు వచ్చాడు. మధుర పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతి ఒక చిన్న పాప రూపంలో భూమ్మీదికి వచ్చింది. పెరిగి పెద్దయిన తర్వాత ఆమె నగరాన్ని పాలించసాగింది. దేవుడు భూ మ్మీద అవతరించి ఆమెను పెళ్లాడతానని వాగ్దానం చేశాడు.

(ఇంకా…)

16వ వారం
నాగభూషణం

నాగభూషణం తెలుగు సినిమాలలో ప్రత్యేకంగా సాంఘిక చిత్రాలలో ప్రతినాయకులకు గుర్తింపు తెచ్చిన నటుల్లో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన నటుడు. విలన్ చెప్పే డైలాగులకు కూడా క్లాప్స్ కొట్టించిన ఘనుడతను. పూర్తిపేరు చక్రవర్తుల నాగభూషణం.ఇంటర్మీడియట్ వరకూ సజావుగా సాగిన చదువు ఆర్ధికలోపం కారణంగా వెనకడుగువేయడంతో ఉద్యోగాన్వేషణ చేయక తప్పలేదు. ఎట్టకేలకు నెలకు పాతిక రూపాయల జీతంతో సెంట్రల్ కమర్షియల్ సూపరిడెంట్ కార్యాలయంలో ఉద్యోగం దొరికింది. దాంతో మద్రాసుకు మకాం మర్చారు. 1941లో సుబ్బరత్నంతో వివాహం జరిగింది. ఆమె అకాల మరణంతో శశిరేఖను మారు వివాహం చేసుకున్నారు. ముగ్గురు కుమారులు-ఇద్దరు కుమార్తెలు సంతానం. ఎస్.వి.రంగారావు కొన్ని సాంఘిక చిత్రాలలో ప్రతినాయకుని వేషం వేసినా అవి సంఖ్యాపరంగా చాలా తక్కువ. ఆర్.నాగేశ్వరరావు, రాజనాల, సత్యనారాయణలు కథానాయకునితో ఫైటింగులు చేసే ప్రతినాయకులు. విలనిజానికి ఒక ప్రత్యేక పంథా ను ప్రవేశపెట్టి, కామెడీ టచ్ ఇచ్చిన నటులు నాగభూషణం.కథను హీరో నడిపిస్తుంటే ఆ హీరోను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడానికి ఓ విలనుండాలి.అందులో ఆరితేరినవాడు నాగభూషణం. కన్నింగ్ విలనిజానికి నిలువెత్తు తెరరూపం నాగభూషణం. హీరో విరుచుకు పడటానికి వచ్చినప్పుడు అతనికి కావల్సినదేదో ఇచ్చి పంపేసి.. ఆనక ఇరకాటంలో పడవేయడంలో నేర్పరి నాగభూషణం. ఈయన హీరోతో ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనరు.

(ఇంకా…)

17వ వారం

రామానుజాచార్యుడు

రామానుజాచార్య లేదా రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి. రామానుజాచార్యుడు త్రిమతాచార్యుల లో ద్వితీయుడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవుని పై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిలేని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆచార్యుడు తన జీవితంలో సాధించిదలచిన(సాధించిన) ముఖ్య ఉద్దేశ్యాలలో మొదటిది, ప్రబలంగా కొనసాగుతున్న, బౌధ్ధ, జైన, శైవ, వైష్ణవ సాంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించటం మరియు రెండవది, ఆదిశంకరుని అద్వైత సిద్ధాంతం లోని లొసుగులను సరిదిద్ది, విశిష్టాద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించటం. సాంప్రదాయక జీవితచరిత్రకారుల ప్రకారం ఆచార్యుల జీవితకాల వ్యవధి నూట ఇరవై సంవత్సరాలు (120 సం.). వంద సంవత్సరాలకు పైచిలుకు మనిషి బ్రతికే అవకాశం తక్కువ. కనుక ఈ నూట ఇరవై సంవత్సరాల వ్యవధి కొంత అనుమానాస్పదమౌతుంది. సాంప్రదాయక ఆధారాల ప్రకారం రామానుజాచార్యులు తమిళ 'పింగళ' సంవత్సరంలో జన్మించి, మరో 'పింగళ' సంవత్సరంలో పరమపదించారు. (2015 ఏప్రిల్ 24 - రామానుజాచార్యుల జయంతి)

(ఇంకా…)

18వ వారం

పుచ్చలపల్లి సుందరయ్య

పుచ్చలపల్లి సుందరయ్య (1913 – 1985) ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు . కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన ఆయన తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు. పుచ్చలపల్లి సుందరయ్య శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో 1913 మే 1 న జన్మించాడు. తండ్రి వెంకటరామిరెడ్డి, తల్లి శేషమ్మ. తల్లిదండ్రులు సుందరరామిరెడ్డి అని పేరు పెట్టారు. ఆరేళ్ళ వయసులో తండ్రి మరణించాడు. ప్రాథమిక విద్యను వీధిబడిలోనే పూర్తిచేసాడు. తరువాత అక్కయ్య వాళ్ళ ఇంటివద్ద ఉంటూ తిరువళ్ళూరు, ఏలూరు, రాజమండ్రి, మద్రాసు లలో చదివాడు. ఈయన్ని "కమ్యూనిస్టు గాంధీ" అంటారు. పార్లమెంటు భవనంలో 'చప్రాసీ'ల సైకిళ్లతోపాటుఈయన 'సైకిలు' కూడా స్టాండులో ఉండేది. రాష్ట్ర విధానసభలోనూ అదే సైకిలు. పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే తన ప్రజాసేవకు ఆ బంధాలు, బాంధవ్యాలు అడ్డుతగులుతాయని పెళ్లికాగానే కుటుంబనియంత్రణ శస్త్రచికిత్స చేయించుకొన్నాడు. తండ్రినుంచి లభించిన ఆస్తిని నిరుపేద ప్రజలకు పంచివేశాడు.1985 మే19న మద్రాసులోని అపోలో ఆస్పత్రిలో పుచ్చలపల్లి కన్నుమూశాడు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి లో ఆయన పేరుతో గ్రంథాలయం,

(ఇంకా…)

19వ వారం

నైనీటాల్

భారత దేశపు సరస్సుల జిల్లా గా పిలువబడే నైనిటాల్ హిమాలయ శ్రేణులలో కలదు. అది కుమావొన్ హిల్స్ మధ్య భాగం లో వుంది అందమైన సరస్సులు కలిగి వుంది. నైనీతాల్ పేరులోని నైనీ అంటే నయనం మరియు తాల్ అంటే సరసు. నైనీతాల్ ప్రసిద్ధ హిల్ స్టేషనే కాక పుణ్యా క్షేత్రాలలో ఒకటిగా ప్రఖ్యాతి గాచింది. ఇది సముద్రమట్టానికి 2084 మీటర్ల (6,837 అడుగుల) ఎత్తున ఉంది. నైనీతాల్ కంటి ఆకారం కలిగిన ఉన్న పర్వతశిఖరాల మద్య ఉన్న ప్రదేశంలో ఉపస్థితమై ఉంది. నగరంలో ఉన్న శిఖరాలలో నగరానికి ఉత్తరాన ఉన్న సముద్రమట్టానికి 2615 మీటర్ల (8,579 అడుగుల) ఎత్తులో ఉన్న నైనాశిఖరం, నగరానికి పడమరన సముద్రమట్టానికి 2438 మీటర్ల (7,999 అడుగుల) ఎత్తులో ఉన్నడియోపద శిఖరం మరియు నగరానికి దక్షిణంలో సముద్రమట్టానికి 2278 మీటర్ల (6,837 అడుగుల) ఎత్తులో ఉన్న ఆయర్పద శిఖరం నగరం చుట్టూ ఉన్న ఎత్తైన శిఖరాలలో ముఖ్యమైనవి.నైనిటాల్ ను స్కంద పురాణం లోని మానస ఖండ్ లో ముగ్గురు ఋషుల సరస్సు లేదా ముగ్గురు ఋషుల సరోవరం అని కూడా అంటారు. ఈ ముగ్గురు ఋషుల పేర్లు అత్రి, పులస్త్య, మరియు పులాహ.వీరు వారి దాహం తీర్చుకునేతందుకు గాను నైనిటాల్ వద్ద ఆగారు. వారికి ఆ ప్రాంతం లో నీరు దొరక లేదు.వెంటనే వారు ఒక పెద్ద గొయ్యి తవ్వి దానిలోకి మానస సరోవరం నీటిని నింపి దాహం తీర్చుకున్నారు. ఆ విధంగా నైనిటాల్ సరస్సు సృష్టించబడింది. మరో కథనం ప్రకారం ఇక్కడ శివుడి భార్య అయిన సతి యొక్క ఎడమ కన్ను పడి ఆ ప్రాంతంలో నైని సరస్సు సృష్టించబడింది.

(ఇంకా…)

20వ వారం

జిడ్డు కృష్ణమూర్తి

జిడ్డు కృష్ణమూర్తి మే 12, 1895 న ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లె లో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు. ఆయన ఓ ప్రముఖ తత్వవేత్త. 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు. ఆయన స్పృశించిన ముఖ్యాంశాలు - మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజం లో మౌలిక మార్పు. జిడ్డు కృష్ణమూర్తి 1895 లో మదనపల్లి లో జన్మించాడు. తరువాత వారి కుటుంబమంతా మద్రాసు లో నివాసం పెట్టారు . మద్రాసు లోని "అడయారు" దివ్యజ్ఞాన సమాజం కి అంతర్జాతీయ కేంద్రం గా ఉండేది. అనీ బిసెంట్ దానికి అధ్యక్షురాలు. కృష్ణమూర్తి , ఆయన తమ్ముడు నిత్యానంద కలసి అడయారు నది సముద్రం లో కలిసే చోట నిత్యమూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అడయారు గ్రంథాలయాధికారి ఈ సోదరులిద్దరినీ చూసి ఆకర్షింపబడ్డాడు. ఈ విషయం డాక్టర్ అనిబిసెంట్ కి తెలియజేసి, ఆ ఇద్దరినీ ఆమె వద్దకు రప్పించాడు. ఆ సొదరులిద్దరినీ చూసి అనిబిసెంట్ కూడా చాలా ప్రభావితురాలైంది. అంతటి తో వారిద్దరినీ విద్యార్జన నిమిత్తం ఇంగ్లాండ్ పంపించింది. పారిస్ లోని సారబాన్ విశ్వ విద్యాలయం లో కృష్ణమూర్తి సంస్కృతమూ , ఫ్రెంచి భాషలను అధ్యయనం చేయసాగాడు.

(ఇంకా…)

21వ వారం

అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం

అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవం ను మే 22 న జరుపుకుంటారు.2010 ని అంతర్జాతీయ జీవవైవిద్య సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. భూమిపై జీవాల మధ్య భేదాన్నే 'జీవవైవిద్యం' అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిద్యం సుమారు 3.5 బిలియన్‌ సంవత్సరాల పరిణామం. మన జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతుంది. దీంతో జీవవైవిద్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఇదివరకూ ప్రతి ఇంటిలో పిచ్చుకలు ఉండేవి. రాను రానూ అవి కనుమరుగైపోతున్నాయి. నేడు అంతర్జాతీయ 'జీవవైవిద్య దినోత్సవం'. మే నెల 20వ తేదీన 'పిచ్చుకల దినోత్సవం' కూడా. మరి ఈ సందర్భంగా మన దేశంలో 'జీవవైవిద్యం' గురించి, అందులో పిచ్చుకల పరిస్థితి ఎలా ఉందో ఏమిటో తెలుసుకుందాం. ప్రపంచంలోని 12 మహా జీవవైవిద్య ప్రాంతాలలో భారత దేశం ఒకటి. సుమారు 45 వేల వృక్ష జాతులు, దాదాపు 77 వేల జంతు జాతులు ఈ దేశంలో ఉన్నాయి. కానీ ఇదంతా గతం. నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో 10 శాతానికిపైగా ప్రమాదంలో ఉంది. వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి.

(ఇంకా…)

22వ వారం

అటల్ బిహారీ వాజపేయి

అటల్ బిహారీ వాజపేయి (జ.డిసెంబరు 25 1924) మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించిన అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. ఈయన బ్రహ్మచారి. ఇతను మొదటిసారిగా రెండో లోక్‌సభ కు ఎన్నికైనారు. మధ్యలో 3వ, 9వ లోక్‌సభలకు తప్పించి 14వ లోకసభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికైనారు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీ కి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 1996 లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998 లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. 1999 లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994 లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. అతడు మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించారు. ఆయన ఆరోగ్య కారణంగా క్రియాశీల రాజకీయాలనుండి తప్పుకున్నారు. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గానూ భారత ప్రభుత్వం డిసెంబరు 24, 2014 లో భారతరత్న పురస్కారాన్ని పొందినట్లు ప్రకటించింది. ఆయన పుట్టినదినం అయిన డిసెంబరు 25 ను సుపరిపాలన దినం గా భారత ప్రభుత్వం ప్రకటించింది.

(ఇంకా…)

23వ వారం
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టక్నాలజీ మద్రాస్‌ (ఐఐటీ మద్రాస్‌) దక్షిణ భారత దేశంలోని చెన్నై(గతంలో మద్రాస్‌)లో ఉన్న ఒక ఇంజినీరింగ్‌ మరియు టెక్నాలజీ కళాశాల. భారత ప్రభుత్వం చేత, జాతీయ ప్రాముఖ్యత గల సంస్థగా గుర్తింపు పొందింది. భారతదేశంలో ఉన్న అత్యుత్తమ ఇంజినీరింగ్‌ సంస్థలలో ఒకటి. పశ్చిమ జర్మనీ ప్రభుత్వం యొక్క సాంకేతిక మరియు ఆర్థిక సహకారంతో 1959లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టం చేయడం ద్వారా రూపొందించిన 15 ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలలలో ఐఐటీ మద్రాస్‌ మూడవది. ఇంజినీరింగ్‌ మరియు టెక్నాలజీలలో అత్యుత్తమ విద్యావకాశాలు, పరిశోధన కోసం వీటిని ఏర్పాటు చేశారు. ఐఐటీ మద్రాస్‌ 2.5 చదరపు కిలోమీటర్లు (620 ఎకరాల) విస్తీర్ణంలో క్యాంపస్‌ ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్‌ సంస్థ. ఇది గిండి జాతీయ పార్క్‌లో ఒక భాగంగా ఉంది. సంస్థలో సుమారు 360 మంది అధ్యాపకులు, 6 వేల మంది విద్యార్థులు మరియు 1250 మంది నిర్వహణ మరియు సహాయ సిబ్బంది ఉన్నారు. 1961లో భారత పార్లమెంటులో రూపుదిద్దుకొన్నప్పటి నుంచి ఈ సంస్థ ఎదుగుతూ వచ్చింది. దీని అద్భుతమైన క్యాంపస్‌లో అధిక భాగం గిండి నేషనల్‌ పార్క్‌ యొక్క రక్షిత అడవిలో భాగం. ఇది ఇప్పటికీ చితల్‌కు (మచ్చల దుప్పులు) స్వస్థలం. బ్లాక్‌బక్‌ మరియు ఇతర వన్యమృగాలకు ఇది కేంద్రం. 2003లో లోతు పెంచిన సహజసరస్సు, వర్షపు నీటిని తనలో ఇంకింపజేసుకుంటుంది.


(ఇంకా…)

24వ వారం

అసిటిలిన్

అసిటిలిన్ వాయువును ఎసిటెలిన్,అసిటిలీన్ అని స్వల్ప ఉచ్ఛరణ భేదంతో పిలుస్తుంటారు అసిటిలిన్/ఎసిటిలీన్ కర్బన ఉదజని సమ్మేళనం వలన ఏర్పడిన వాయువు. ఇది ఒక హైడ్రోకార్బన్. చాలా త్వరగా, త్రీవంగా మండే గుణమున్నది. అందుచే అసిటిలిన్ వాయువును ఎక్కువగా ఇంధనంగా వినియోగిస్తారు ఇది కర్బన రసాయన శాస్త్రంలో ఆల్కైన్ సమూహం కు చెందినది. అసిటిలిన్ శాస్త్రియ పేరు ఈథైన్. దీనిని కొన్ని రకాల రసాయన పదార్థాలను తయారు చేయుటకు కూడా వాడెదరు. స్వఛ్ఛమైన అసిటిలిన్ వాయువునకు వాసన లేదు. అయితే వ్యాపారత్మకంగా కాల్సియం కార్బైడ్ నుండి ఉత్పత్తి చేసె వాయువులో జనక పదార్థాలలో భాస్వరం వంటి మలినాలు వుండటం వలన ఘటైన వెల్లుల్లి వాసన వస్తుంది. అసిటిలిన్ ను మొదటగా ఎడ్మండ్ డేవి మొదటగా క్రీ.శ.1836లో గుర్తించాడు. ఆయన దాన్నిని న్యూ కార్బోరేట్ ఆఫ్ హైడ్రోజను అని పేర్కొన్నాడు. క్రీ.శ.1860 మరల దీనిని ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త మర్సెల్లి బెర్తెలెట్ కనుగొనటం జరిగినది ఆయనే ఈ వాయువునకు అసిటిలిన్ అనే పేరును నిర్ణయించాడు. అసిటిలిన్ వాయువునకు స్థిరత్వం తక్కువ కావున అసిటిలిన్ ను ఒక ప్రాంతం నుండిమరో ప్రాంతంకు రవాణా చెయ్యడం అసాధ్యంగా వుండేది.

(ఇంకా…)

25వ వారం

తాజ్ మహల్

తాజ్ మహల్ ఒక అద్భుతమైన సమాధి.ఇది భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది, ఇది చక్రవర్తి షాజహాన్ జూన్ 17, 1631 న మరణించిన తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు. తాజ్ మహల్ మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తించబడింది, ఇది పర్షియా, భారతీయ మరియు ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించబడింది. 1983వ సంవత్సరంలో తాజ్ మహల్‌ను యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా మారింది మరియు "భారత దేశంలో ఉన్న ముస్లిం కళ యొక్క ఆభరణంగా ఉదహరించింది అంతేగాక విశ్వవ్యాప్తంగా మెచ్చుకొనబడిన వాటిలో ఒక దివ్యమైన ప్రపంచ పూర్వ సంస్కృతిగా అభివర్ణించింది. తెల్లటి పాల రాయితో చేసిన సమాధి గోపురం దీనిలో ఉన్న బాగా ప్రాచుర్యం పొందిన భాగం, నిజానికి తాజ్ మహల్‌ ఒక మిశ్రమ సమన్వయ నిర్మాణం. ఈ కట్టడం యొక్క నిర్మాణం 1632వ సంవత్సరంలో మొదలై 1653లో పూర్తయింది మరియు వేల మంది శిల్పులు, చేతి పని నిపుణులు ఈ నిర్మాణం కోసం పని చేశారు. తాజ్ మహల్ నిర్మాణం అబ్దుల్-కరీం మాముర్ ఖాన్, మక్రమత్ ఖాన్ మరియు ఉస్తాద్ అహ్మద్ లాహూరి మొదలైన నిర్మాణ శిల్పుల మండలి యొక్క సార్వభౌమ్య పర్యవేక్షణలో జరిగింది. సాధారణంగా లాహూరి ప్రధాన రూప శిల్పిగా ఎంచబడ్డాడు.

(ఇంకా…)

26వ వారం

పిక్టోరియలిజం

పిక్టోరియలిజం అనునది 19 ద్వితీయార్థంలో మరియు 20వ శతాబ్దంలో ఫోటోగ్రఫిని అంతర్జాతీయ స్థాయిలో నడిపించిన ఒక కళా ఉద్యమం. ఈ పదానికి ప్రామాణిక నిర్వచనం లేకున్ననూ ఇది సాధారణంగా యథాతథంగా ఏర్పడే ఛాయాచిత్రాన్ని కేవలం నమోదు చేయటానికి మాత్రమే పరిమితం కాకుండా, ఛాయాగ్రహకుడు ఏదో ఒక విధంగా దానిని మార్చి ఒక భావాత్మకమైన ఛాయాచిత్రాన్ని సృష్టించే శైలిని సూచిస్తుంది. సాధారణంగా ఒక పిక్టోరియల్ ఛాయాచిత్రం స్పష్టత లోపించినదై బ్లాక్-అండ్-వైట్ కే పరిమితం కాకుండా వార్మ్‌ బ్రౌన్ లేదా ఊదా రంగులలో ముద్రితమై కుంచెతో అక్కడక్కడా మెరుగులు అద్దబడి, ఏర్పడిన ఛాయాచిత్రం యొక్క అందాన్ని పెంచేవిధంగా ఉంటుంది. ఒక పిక్టోరియలిస్ట్ కళాకారుడికి ఛాయాచిత్రం ఒక చిత్రపటం వలె భావోద్రేక ఉద్దేశ్యాన్ని వీక్షకుని ఊహాలోకాన్ని ప్రభావితం చేసేదిగా ఉంటుంది.పిక్టోరియలిజం 1885 నుండి 1915 వరకు ఉద్యమంగా వర్థిల్లిననూ 1940 వరకూ ఈ కళని ప్రచారం చేసినవారూ లేకపోలేదు. ఒక ఛాయాచిత్రం కేవలం వాస్తవాన్ని నమోదు చేయుటకు మాత్రమే ఉపయోగపడుతుంది అనే విమర్శనాత్మక ప్రస్తావనను వ్యతిరేకిస్తూ ఉద్భవించిన పిక్టోరియలిజం ఫోటోగ్రఫి ని ఒక కళగా గుర్తించి అంతర్జాతీయ ఉద్యమంగా రూపుదిద్దుకొన్నది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా చిత్రకారులు, ఛాయాచిత్రకారులు మరియు కళావిమర్శకులు వ్యతిరేక అభిప్రాయాలతో చర్చించిన తర్వాత ఛాయాచిత్రాలను పలు కళా ప్రదర్శనశాలలు కైవసం చేసుకొన్నాయి.

(ఇంకా…)

27వ వారం

భారమితి

భారమితి లేదా బారోమీటర్ అనే పరికరాన్ని వాతావరణ పీడనాన్ని కొలిచేందుకు ఉపయోగిస్తారు. భారమితిని ఉపయోగించి వాతావరణ పీడనంలోని హెచ్చు, తగ్గులను గుర్తించెదరు. వాతావరణ పీడనంలోని మార్పులను వాతావరణ శాస్త్రవేత్తలు భారమితి సహయంతోనే లెక్కించెదరు. మొదట్లో ఒక వైపున మూసి ఉన్న గాజుగొట్టంలో పాదరసం నింపిన భారమితిని ఉపయోగించేవారు. ప్రస్తుతం డిజిటల్‌ భారమితులు వాడుకలోనికి వచ్చాయి. డిజిటల్ భారమితులు పాదరసముతో చేసిన భారమితి కన్నఖచ్చితమైన రీడింగ్‌ను చూపిస్తాయి. కంప్యూటరులో ఆటోమెటిక్‌గా నమోదు అగును.భారమితిని కీ.శ.1643లో కనుగొన్నకీర్తి ఎవంజెలిస్టా టొరిసెల్లికి దక్కినను, ఇటలికీ చెందిన గణితవిజ్ఞానవేత్త, ఖగోళవేత్త అయిన గాస్పారొబెర్టి నీటిని ఉపయోగించి 1640-1643 మధ్యలో కనుగొన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. భూగోళం చుట్టూ ఆవరించి కొన్ని కిలోమీటర్ల ఎత్తువరకు గాలి ఆవరించి ఉన్నది. దీనినే వాతావరణం అంటారు. మాములుగా గాలి తేలికగా ఉన్నట్లు, ఎటువంటి భారంలేనట్లు భావించెదరు. కాని నిజానికి ఒక ఘనమీటరు వాతావరణంలోని గాలిభారం 1.0 కే.జి వరకు ఉండును(200Cవద్ద గాలి సాంద్రత 1.225Kg/m3. వాతావరణంలోని ఉష్ణోగ్రతలో హెచ్చు,తగ్గుల ననుసరించి, ఈ విలువలో మార్పు ఉండును). ఈ విధంగా వాతావరణం భూపరిసరాలపై కల్గించే ఒత్తిడిని వాతావరణ పీడనం అందురు.

(ఇంకా…)

28వ వారం

ఆంగ్‌కోర్ వాట్

అంగ్ కోర్ వాట్ ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది కంబోడియా లోని అంగ్ కోర్ వద్ద ఉన్నది. 12వ శతాబ్దంలో ఖ్మేర్ రాజైన సూర్యవర్మన్ II దీనిని నిర్మించారు. ఇది వైష్ణవాలయం. ఇది ఖ్మేర్ నిర్మాణ శైలి లో నిర్మింపబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణుదేవాలయం. ఇది కంపూచియాలోని సీమ్‌ రీప్‌ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారతీయ ఇతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ దేవాలయం ఆ దేశ జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది. ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. ఖ్మేర్‌ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగింది. క్రీ.శ 12వ శతాబ్దకాలంలో ఆంగ్‌కోర్‌ వాట్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్‌ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట. ఈ దేవాలయ నిర్మాణం భారతదేశం లోని తమిళనాడు దేవాలయాలను పోలి ఉంటుంది. తమిళనాడుకు చెందిన చోళరాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయాల్లో కనిపిస్తాయి.

(ఇంకా…)

29వ వారం

జాన్ ఎవరెట్ క్లౌ

జాన్ ఎవరెట్ క్లౌ (జూలై 16 1836-నవంబర్ 26 1910) తెలుగునాట పేరొందిన క్రైస్తవ మతబోధకుడు, సంఘ సేవకుడు. 1876-78 కాలంలో కోస్తాంధ్ర ప్రాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన కరువు కాలంలో క్లౌ చేసిన సేవలు పేర్కొనదగినవి. 1876లోనే కరవు జాడలు పసిగట్టి ఆంగ్లేయ ప్రభుత్వం ప్రారంభించిన బకింగ్ హాం కాలువ పనులలో 3 మైళ్ళ పనికి కాంట్రాక్టు ప్రయత్నించి పొందారు. రాజుపాలెం అనే గ్రామం వద్ద సహాయ శిబిరాన్ని ఏర్పాటుచేసి "అన్నం పెట్టించి, కూలీ ఇస్తానని" బోధకులతో గ్రామాల్లో చెప్పించారు. వారిని అనుసరించి అనూహ్యమైన సంఖ్యలో అన్నార్తులు వచ్చారు. వేలాదిమంది బీదసాదలు ఆ శిబిరానికి నకనకలాడుతూ చేరుకుని అప్పటికి ఉడకని అన్నమే తిని మరణించినవారూ, చేరుకుంటూనే తట్టుకోలేక మరణించినవారూ, రేపు తినగలమో లేదోనని తినీ తినీ చనిపోయినవారూ ఇలా వేలకొద్దీ శవాలు పేరుకునేవి. వాటిని తీయించి శుభ్రం చేయించి ఉన్నవారిని బతికించుకునేందుకు ప్రయత్నాలు చేసేవారు. వేలాదిమంది కూలీలను, అట్టడుగు వర్గాలకు చెందినవారినీ వారు పనుల నెపంతో బతికించారు. ఆకలి కారణంగా క్రైస్తవంలోకి చేరడాన్ని నిరసించి, తనపై అధికారుల ఆగ్రహాన్ని చవిచూస్తూనే, కరవు కాలంలో మతమార్పిడులు చేసేందుకు వీల్లేదంటూ నిలిచారు. కరవు ముగిసాకా, స్వచ్ఛందంగా ముందుకువచ్చినవారికే బాప్తిజం ఇచ్చారు. అన్నార్తులకు, క్రైస్తవ సమాజానికి ఆయన చేసిన సేవలకు అపోస్తల్ ఆఫ్ తెలుగూస్ (తెలుగువారి అపోస్తలుడు)గా పేరొందారు.

(ఇంకా…)

30వ వారం

రాగతి పండరి

రాగతి పండరి ( జూలై 22 1965 - 19 ఫిబ్రవరి 2015) తెలుగు వ్యంగ్య చిత్రకారులు/కార్టూనిస్టులలో (వాగ్దేవి, కె.సి లలిత అడపాదడపా వ్యంగ్య చిత్రాలను ప్రచురించినప్పటికీ), రాశిలోనూ, వాసిలోనూ సమానమైన కీర్తి ప్రతిష్టలను ఆర్జించుకున్న ఏకైక మహిళా కార్టూనిస్ట్. అదొక్కటే ప్రత్యేకత కాదు, అనతి కాలంలోనే తెలుగు వ్యంగ్య చిత్ర కళా రంగంలో చాలా మంచి పేరు తెచ్చుకుని, ఆ రంగంలో అగ్రగణ్యులైన బాపు, జయదేవ్, బాబు ల సరసన నిలబడగలిగిన స్థాయి చేరుకున్నది. ఈ మంచి పేరుకు వెనుక అకుంఠిత దీక్ష, వ్యంగ్య చిత్ర కళ మీద ఎనలేని ప్రేమ, నిరంతర పరిశ్రమ ఉన్నాయి. దురదృష్టవశాత్తూ, ఈమెకు చిన్నతంలో వచ్చిన పోలియో మూలంగా శారీరకంగా చలాకీగా తిరగలేక పోయినా, అంతకు మించిన మానసిక చలాకీతనంతో, చకచకా కార్టూన్లు గీసి అందరి మన్ననలు అందుకున్నది. ఆమె మాటలలోనె చెప్పాలంటే, "జీవితంలో వేదనని కాసేపు పక్కకు నెట్టి, నిండుగా నవ్వగలిగే శక్తినిచ్చే కార్టూన్లు, మనిషికి గ్లూకోజు డోసులాంటివి". ఏవిధమైన తటపటాయింపు లేకుండా, తాను కార్టూన్లు గీయాలన్న కోరిక మరియు స్పూర్తి, ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ కలగ చేశారని చెపుతుంది. అలాగే, జయదేవ్ కూడ రాగతి పండరి తన నిజమైన శిష్యురాలని చెప్పుకుంటారు. రాగతి పండరి 1965 సంవత్సరం జూలై 22 న విశాఖపట్టణంలో జన్మించింది. ఈమె తండ్రి రాగతి గోవిందరావు. తల్లి రాగతి శాంతకుమారి. ఈమె చదువు ఇంటివద్దనే కొనసాగింది.

(ఇంకా…)

31వ వారం
దస్త్రం:1973 Baghdad mosque.jpg

బాగ్దాద్

బాగ్దాద్ లేదా బాగ్దాదు (ఆంగ్లం : Baghdad) (అరబ్బీ భాష : 'بغداد' ) ఇరాక్ దేశపు రాజధాని. దీని జనాభా దాదాపు 70 లక్షలు. ఇరాక్ లో ప్రధాన మరియు అతిపెద్ద నగరం మధ్య ప్రాచ్యం లో కైరో మరియు టెహరాన్ ల తరువాత అతిపెద్ద మూడవ నగరం. ఈ నగరం టైగ్రిస్ నది ఒడ్డున ఉన్నది. దీని చరిత్ర క్రీ.శ. 8వ శతాబ్దం వరకూ వెళుతుంది. ఈ నగరం ఒకానొక కాలంలో ముస్లిం ప్రపంచం లో దార్ ఉల్ సలామ్ విద్య, విజ్ఞాన, సాంస్కృతిక, చారిత్రక, కళల కేంద్రంగా విరాజిల్లినది. దీని పేరుకు మూలం పర్షియన్ భాష, అందరూ ఆమోదించే పేరు, 'భాగా లేదా బాగ్' "దేవుడు" + దాద్ "బహుమతి" వెరసి "దేవుని బహుమతి" లేదా "దేవుని ప్రసాదము". నవీన పర్షియన్ ల ఇంకో వాదన ప్రకారం, "ప్రసాదింపబడిన ఉద్యానవనం". కాని ఇవి ఇస్లాం కు పూర్వం నిర్వచింపబడిన పేర్లు. అబ్బాసీయుల కాలంలో మన్సూర్ దీనికి "మదీనత్ అస్-సలామ్" లేదా "శాంతి నగరం" అని పేరు పెట్టాడు. అతని కాలంలో నాణెములపై, తులామానాలపై ఇదే పేరును ఉపయోగించాడు. జూలై 30 క్రీ.శ. 762 న ఖలీఫా అబూ జాఫర్ అల్ మన్సూర్ ఈ నగరాన్ని స్థాపించాడు.

(ఇంకా…)

32వ వారం

బ్రిటీషు రాజ్

బ్రిటీష్ రాజ్ అంటే స్థూలంగా 1858 నుంచి 1947 వరకూ భారత ఉపఖండంలో సాగిన బ్రిటీషు పాలన. ఇండియాగా సాధారణంగా పిలిచే నాటి బ్రిటీష్ పాలిత ప్రాంతంలో -బ్రిటీషర్లు నేరుగా పరిపాలించే ప్రాంతాలతో పాటుగా, వేర్వేరు రాజులు పరిపాలించే ప్రిన్స్ లీ స్టేట్స్ కూడా కలిసివున్నాయి- మొత్తంగా ఆ ప్రాంతమంతా బ్రిటీష్ సార్వభౌమత్వం లేదా చక్రవర్తిత్వం కింద ఉన్నట్టు. ఈ ప్రాంతాన్ని కొందరు బ్రిటీష్ ఇండియా అని కూడా వ్యవహరించేవారు. విక్టోరియా రాణి కోసం భారత సామ్రాజ్యాన్ని అధికారికంగా టోరీ ప్రధాని బెంజమిన్ డిస్రేలీ 1876లో ఏర్పరిచారు. జర్మనీ, రష్యా పాలకులకు విక్టోరియా తీసిపోయినట్టు భావించకుండా ఉండేందుకు(ఆమె ఆధిక్యతాభావాన్ని సంతృప్తిపరచడానికే) ఈ ఏర్పాటుచేశారు. పరిపాలన విధానం జూన్ 28, 1858లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ నుంచి విక్టోరియా రాణి సింహాసనానికి మారినప్పుడు ఏర్పాటయింది (1876లో అదే సంజీవ్ భారతదేశపు చక్రవర్తిగా ప్రకటించారు). బ్రిటీష్ ఇండియా సామ్రాజ్యం యూనియన్ ఆఫ్ ఇండియా(తర్వాతి కాలంలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా), డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్(తదనంతర కాలంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్, దానిలోని తూర్పుభాగం మరింత తర్వాతి కాలంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్‌ అయింది), డొమినియన్ ఆఫ్ సిలోన్ (ప్రస్తుతం శ్రీలంక), సిక్కిం (ప్రస్తుతం భారతదేశంలో భాగం)గా ఐదు సార్వభౌమ రాజ్యాలుగా 1947లో విభాజితమయ్యే వరకూ కొనసాగింది.

(ఇంకా…)

33వ వారం

భగత్ సింగ్

భగత్ సింగ్ (సెప్టెంబరు 28 1907-మార్చి 23 1931) భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు.భారత స్వాతంత్ర్యోద్యమమునకు పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులల్లో ఆయన ఒకరు. ఈ కారణంగానే "షహీద్ భగత్ సింగ్" గా కొనియాడబడతాడు. చరిత్రకారుడు కె.ఎన్. పనిక్కర్ ప్రకారం భగత్ సింగ్,భారతదేశంలో ఆరంభ మార్కిస్టు. భగత్ సింగ్ హిందుస్తాన్ సోషియలిస్టు రిపబ్లికన్ పార్టీ స్థాపక సభ్యుల్లో ఒకడు. ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న లాయల్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. భారత్‌లో బ్రిటీషు పాలన ను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించాడు. యుక్త వయస్సులోనే ఐరోపా విప్లవ ఉద్యమాలను చదివిన సింగ్ అరాజకవాదం మరియు సామ్యవాదమునకు ఆకర్షితుడయ్యాడు. అనేక విప్లవాత్మక సంస్థల్లో ఆయన చేరాడు. హిందూస్తాన్ గణతంత్ర సంఘం లో ఒక్కో మెట్టెక్కుతూ అనతికాలంలోనే అందులోని నాయకుల్లో ఒకరుగా ఎదిగిన ఆయన ఆ తర్వాత దానిని హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘం గా మార్చాడు. భారత మరియు బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజుల నిరాహారదీక్షను చేపట్టడం ద్వారా సింగ్‌ విపరీతమైన మద్దతును కూడగట్టుకున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజ్‌పత్ రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు ఆయన్ను ఉరితీశారు. ఆయన ఉత్తరదాయిత్వం భారత స్వాతంత్ర్య సిద్ధికి పోరాడేలా భారత యువతను ప్రేరేపించింది. అంతేకాక భారత్‌లో సామ్యవాద వ్యాప్తి మరింత పుంజుకుంది.

(ఇంకా…)

34వ వారం

సోమనాథ్

సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రం లోని వెరావల్‌లో ఉన్న హిందూ పుణ్య క్షేత్రము. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని "ప్రభాస తీర్థం" అని కూడా పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. సోముడు అనగా చంద్రుడు అని అర్ధం. చంద్రుడిని దక్షుడి శాపం నుండి విముక్తిడిని చేసిన శివుడి ఆలయం కనుక ఇది సోమనాధ ఆలయం ఇక్కడి శివుడు సోమనాధుడు అయ్యాడు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపః ఫలంగా స్వయంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిసాడు. ఆరుమార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్మించబడినందు వలన ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణించబడుతుంది. చివరిసారిగా ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. జునాగర్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడకు విచ్చేసిన సర్దార్ వల్లభాయి పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయాభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారు. పటేల్ మరణానంతరం భారతదేశ మరియొక మంత్రి అయినకె ఎమ్ మున్షి ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణపు కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి.పురాణ కథనం అనుసరించి ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, ఆ తరువాత రావణుడు వెండితోను, కృష్ణుడు దీనిని కొయ్యతోనూ నిర్మించారని ప్రతీతి. భీముడు రాతితోనూ పునర్నిర్మించారని చెబుతారు. చంద్రుడు దక్షుడి కుమార్తెలు తన భార్యలు అయిన 27 నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉన్న కారణంగా మిగిలిన వారు తమ తండ్రితో మొరపెట్టుకోగా మామ అయిన దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపించిన కారణంగా తనకు ప్రాప్తించిన క్షయ వ్యాధి నివారణార్ధం చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రదేశమే ఈ ప్రభాసతీర్ధము.

(ఇంకా…)

35వ వారం

ఓణం

ఓణం దక్షిణ భారతదేశ రాష్ట్రమైన కేరళలో అతిపెద్ద పండుగ. ఇది మలయాళీ క్యాలెండరులో మొదటి నెల అయిన చింగంలో (ఆగష్టు–సెప్టెంబర్) వస్తుంది మరియు మహాబలి ఆ ప్రాంతమునకు తిరిగి రావటాన్ని సూచిస్తుంది. ఈ పండుగ పదిరోజుల పాటు కొనసాగుతుంది. ఇది కేరళ యొక్క ఆచారములు మరియు సాంప్రదాయములు వంటి అనేక అంశములతో ముడిపడి ఉంది. చక్కని పువ్వుల మాలలు, భోజనం, సర్పాకారపు పడవ పందెములు మరియు కైకొట్టికలి నృత్యము మొదలైనవన్నీ ఈ పండుగలో భాగములు. ఈ పండుగ రోజు, ప్రజలు కొత్త దుస్తులు ధరిస్తారు.మగవారు ఒక చొక్కా మరియు ముండు అని పిలవబడే లంగా వంటి క్రింది ఆచ్చాదనను, స్త్రీలు ముండు మరియు నరియతు అనబడే ఒక బంగారు పైఆచ్చాదనను ధరిస్తారు. ఆడపిల్లలు పావడ మరియు రవికె ధరిస్తారు. ఓణం కేరళలోని వ్యవసాయ పండుగ.ఓణం ఆధునిక కాలంలో కూడా ఇంకా జరుపుకొనే ఒక ప్రాచీన పండుగ. మళయాళ మాసం చింగంలో వచ్చే కేరళ యొక్క వరికోత పండుగ మరియు వర్షపు పువ్వుల పండుగ, పాతాళం నుండి మావెలి రాజు యొక్క వార్షిక ఆగమనాన్ని వేడుకగా చేసుకుంటాయి. చరిత్ర పూర్వం నుండి కేరళ ప్రజలు మవేలి చక్రవర్తిని పూజించటం మూలంగా ఓణం ప్రత్యేకమైంది.చరిత్ర ప్రకారం, మహాబలి పాలించిన సమయం కేరళ కు కు స్వర్ణ యుగం. ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖంగా మరియు సిరిసంపదలతో ఉన్నారు మరియు ఆ దేశ ప్రజలందరూ తమ రాజుని చాలా గౌరవించేవారు.

(ఇంకా…)

36వ వారం

సర్వేపల్లి రాధాకృష్ణన్

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (సెప్టెంబర్ 5, 1888 – ఏప్రిల్ 17, 1975) భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి కూడా. అంతేకాదు భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టినాడని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో(చైనా, పాకిస్తానులతో యుద్ద సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ 5-9-1888న మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.మీల దూరమున ఉన్న తిరుత్తణిలో సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు. వీరాస్వామి ఒక జమీందారీలో తహసిల్దార్. వారి మాతృభాష తెలుగు. సర్వేపల్లి బాల్యము మరియు విద్యాభ్యాసము ఎక్కువగా తిరుత్తణి మరియు తిరుపతిలోనే గడిచిపోయాయి. ప్రాథమిక విద్య తిరుత్తణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మున్నగుచోట్ల చదివి ఎం.ఏ పట్టా పొందాడు. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన. 1906లో 18 సంవత్సరాల చిరుప్రాయంలో శివకామమ్మతో వివాహము జరిగింది. వీరికి ఐదుగురు కూతుళ్ళు, ఒక కుమారుడు కలిగారు. 21 సంవత్సరాలైనా దాటని వయసులో ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యాడు. తత్వశాస్త్రంలో అతని ప్రతిభను విని మైసూరు విశ్వవిద్యాలయం అతనిని ప్రొఫెసర్ గా నియమించింది.

(ఇంకా…)

37వ వారం

రామప్ప గుడిలో శిల్ప కళా చాతుర్యం

ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం.రామప్ప దేవాలయము తెలంగాణా రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో మరియు కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇది వరంగల్లు జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. శిల్పకళా విశిష్టతతో నిర్మితమైన రామప్ప గుడి వరంగల్ జిల్లా ములుగు తాలూకాలో వుంది. ఇది వరంగల్లు కు నలబై మైళ్ళ దూరంలో వుంది. ఈ గుడిని 1162 లో రుద్రసేనాని అనే రెడ్డి సామంతు కట్టించాడు. రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణిచనలవికానివి. ఈ కాకతీయ శిల్పచాతుర్యమంతా, ఇన్నేళ్ళు గడిచినా, ఈ నాటికి చూపరులకు అమితానందాన్ని కలిగిస్తూంది. భరత నాట్య శాస్త్రమంతా మూర్తీ భవించి, స్థంబాలమీదా, కప్పులమీదా, కనబడుతుంది. రామప్ప గుడి లోని విగ్రహాలు, స్థంబాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా పెద్ద నల్లారాతి నాట్య కత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి.

(ఇంకా…)

38వ వారం

కురుమూర్తి

కురుమూర్తి మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని ఒక గ్రామము. ఈ గ్రామములో, జిల్లాలోనే అతి పురాతనమైన దేవస్థానంగా పేరుగాంచిన, కురుమూర్తి వేంకటేశ్వర దేవస్థానం కలదు. మహబూబ్ నగర్ నుండి కర్నూలు వెళ్ళు రైలు మార్గములో కురుమూర్తి కలదు. ఈ దేవస్థానానికి బస్సు సౌకర్యము కూడా కలదు. తిరుమల వేంకటేశ్వర ఆలయానికి, కురుమూర్తి ఆలయానికి పోలికలున్నాయి. ఈ క్షేత్రాన్ని గురించి కపిలవాయి లింగమూర్తి, వైద్య వెంకటేశ్వర్లు పరిశీలించి విశ్లేషాత్మక వివరణలతో పరిశీలించారు. అమ్మాపూర్‌ గ్రామ సమీపంలో ఏడు కొండల మధ్య వెలసిన స్వయంబువంపై లక్ష్మి సమేతంగా వెలిసిన స్వామివారు పేదల తిరుపతిగా ఇక్కడ మొక్కులందుకుంటున్నారు. పూర్వం కురుమూర్తికి కురుమతి పేరు ఉన్నట్లు ఆలయ చరిత్ర ప్రకారం తెలుస్తున్నది. ఆత్మకూరు పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ఎత్తయిన ఏడు కొండలపై ఉన్న కురుమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం క్రీ.శ. 1268 ప్రాంతములో ముక్కెర వంశ మూలపురుషుడు గోపాలరాయుడు నిర్మించాడు. 1350లో చంద్రారెడ్డి అభివృద్ధిపర్చగా, సోమభూపాలరావు కొండపైకి మెట్లు నిర్మించి ఏటా జాతర నిర్వహించే సాంప్రదాయం అమలులోకి తెచ్చాడు.1870 లో ఉద్దాల మండపం ఏర్పాటు చేశారు. కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో ఉద్దాల (పాదుకల) ఊరేగింపు ప్రధాన ఘట్టం. వేడుకలు మండల పరిధిలోని వడ్డేమాన్ నుంచి ప్రారంభమౌతాయి. ఆ పాదుకలను ఈ మండపంలో ఉంచుతారు. వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.

(ఇంకా…)

39వ వారం

చిలకమర్తి లక్ష్మీనరసింహం

చిలకమర్తి లక్ష్మీనరసింహం (1867 - 1946) ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఈ నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేసేవాడు. లక్ష్మీనరసింహం 1867 సెప్టెంబర్ 26 న పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలములోని ఖండవల్లి గ్రామములో ఒక బ్రాహ్మణ కుటుంబములో వెంకయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ప్రాథమిక విద్య వీరవాసరం, నరసాపురం పట్టణాలలో సాగింది. 1889 లో రాజమండ్రి హైస్కూలులో పట్టం చేత పట్టుకొన్నాడు. 1889 లో రాజమండ్రి ఆర్య పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా చేరాడు. తరువాత ఇన్నీసు పేట స్కూలులోనూ, మునిసిపల్ హైస్కూలులోనూ విద్యాబోధన సాగించాడు. తరువాత ఒక సంవత్సరం సరస్వతి పత్రిక సంపాదకునిగా పనిచేశాడు. ఆపై ఉద్యోగం విరమించి 1899లో హిందూ లోయర్ సెకండరీ స్కూల్ స్థాపించి 9 సంవత్సరాలు నడిపాడు. తరువాత ఈ పాఠశాల వీరేశలింగం హైస్కూల్ గా మార్చబడింది.

(ఇంకా…)

40వ వారం
బెల్లం
బెల్లం ఒక తియ్యని ఆహార పదార్థము. దీనిని సాధారణంగా చెరకు రసం నుండి తయారుచేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో అనకాపల్లి బెల్లం తయారీకి ప్రసిద్ధి. పామే కుటుంబానికి చెందిన తాటి, జీలుగ చెట్లనుండి కూడా బెల్లం తయారవుతుంది. చెరకు గడలను కొట్టి ఆ పొలంలోనే ఏర్పాటు చేసుకొన్న గానుగ వద్దకు చేర్చి అందులో నుండి రసం తీసి దాన్ని పెద్ద పెనంలో కాగబెట్టి బెల్లం తయారు చేస్తారు. ఈ బెల్లం. నేల రకాన్ని బట్టి, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను, లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను ఉంటుంది. దాన్ని బట్టి దానికి ధర వస్తుంది. గట్టి దనాన్ని రైతు పరి భాషలో రాపు లేదా జేడు అంటారు. పక్వానికొచ్చిన చెరకును కొట్టి ఆ పొలంలోనే ఏర్పాటు చేసుకొన్న గానుగ వద్దకు చేర్చి, వాటిని శుభ్రం చేసి, గానుగ దగ్గరికి చేరుస్తారు. చెరకు పైనున్న ఆకులను తీసేవేసి వాటిని గానుగలో పెట్టి రసం తీస్తారు. ఆ రసాన్ని పెద్ద ఇనుప రేకుతో చేసిన పెనంలో సేకరించి దాన్ని బాగా కాగ బెడతారు. చెరకు పాలు బెల్లంగా తయారు కావడానికి కొన్ని దశలుంటాయి. ఈ చెరకు పాలు కాగేటప్పుడు మొదటగా బుడ్డ పగలడం అంటారు. అనగా బాగా కాగిన ఆ రసం అందులోని మురికి అంతా ఒక పెద్ద తెట్టుగా పైన చేరుతుంది. అనగా పొంగు రావడానికి తొలి దశ అన్నమాట. అప్పుడు ఆ మురికిని ఒక ప్రత్యేకమైన సాధనంతో తీసి వేయాలి. ఆ తర్వాత ఆ చెరుకు రసం తెర్లుతుంది. ఇలా కొంత సేపు తెర్లి.. చీమల పొంగు అనే దశకు చేరు కుంటుంది.
(ఇంకా…)
41వ వారం
బురఖా
బురఖా అనేది కొందరు స్త్రీలు తమ వస్త్రాలపైన ధరించే ముసుగు. దీనికి "హిజాబ్" అనే అరబిక్ పదం "కప్పుకొనుట" అనే అర్ధం కలిగి ఉంది. బురఖాను అధికంగా తమ మత సంప్రదాయానుసారం ముస్లిం స్త్రీలు ధరిస్తారు. ముస్లింలలోనే గాక, గౌరవం, సాంప్రదాయం, సిగ్గు, మొదలగు వాటిని ఆచరించే వారు, ఈ సంప్రదాయాన్ని, దేశం, మతం, భాష, ప్రదేశం అనే తారతమ్యాలు లేకుండా ఆచరించే వారు కోకొల్లలుగా కనిపిస్తారు. వారు ఈ పరదా పద్దతిని అనుసరించి తల మరియు భుజాలపైనుండి ధరించే వస్త్రాలను, దుపట్టా, డుపట్టా, ఓణీ, ఓఢ్‌నీ, ఓణ్ణీ, చున్నీ, చునరీ, చాదర్, చద్దర్, స్కాఫ్ మరియు ఖిమార్ మొదలగు పేర్లతో పిలుస్తారు. ఇస్లామీయ సాహిత్యంలో హిజాబ్ అనగా గౌరవంతో కూడిన హుందాతనం, వ్యక్తిగతం, మరియు సద్-నీతి.ఈ పదము ఖురాన్ లో, తలపై కప్పుకునే వస్త్రం కొరకు ఉపయోగించబడినది. ప్రపంచంలోని పలు దేశాలలో పలు విధాలుగా ముస్లిం స్త్రీలు 'హిజాబ్', 'నఖాబ్', 'జిల్బాబ్' ను ధరిస్తారు. బురఖా భారతీయ, అఫ్ఘానీ, ఇరాకీ మరియు ఇరాన్ సంస్కృతికి చిహ్నం. భారతీయ సంతతికి చెందినవారు ఎక్కడవున్నా నల్లని బురఖాలో దర్శనమిస్తారు.బురఖా నిర్బంధమని ఇస్లాం చెప్పలేదు కానీ పవిత్ర ఖురాన్‌లో ఈ ప్రస్తావన ఉంది. దీనిని హిజాబ్ (అడ్డుతెర) అనికూడా అంటారు. ముస్లిం మహిళ పర పురుషుల చెడు చూపుల నుంచి తనను తాను రక్షించుకొనేందుకు బురఖాను ధరించమని ప్రవక్త సూచించారు.
(ఇంకా…)
42వ వారం
భారతదేశంలో ఇస్లాం
భారతదేశం లో హిందూమతం తరువాత రెండవ స్థానంలో ఇస్లాం మతం గలదు. 2007 గణాంకాల ప్రకారం, 13.4% ముస్లింలు గలరు. ప్రస్తుతం భారత్ లో ముస్లింలు ఇండోనేషియా మరియు పాకిస్తాన్ ల తరువాత మూడవ స్థానంలో వున్నారు.దక్షిణాసియా లో ముస్లింల దండయాత్రల మూలంగా భారత్ లో ఇస్లాం ప్రవేశించిందని, సాధారణంగా ఓ నమ్మకమున్నది. చరిత్రను చూస్తే క్రింది విషయాలు ద్యోతకమవుతాయి. భారతదేశంలో మొదటి మస్జిద్ (మసీదు) క్రీ.శ. 612 లో చేరామన్ పెరుమాళ్ కాలంలో కేరళ లో నిర్మింపబడినది. ఈ కాలం ముహమ్మద్ ప్రవక్త జీవితకాలం. (క్రీ.శ. 571 - 632 ). కేరళ లోని కొడుంగళూర్ లో మాలిక్ బిన్ దీనార్ చే నిర్మింపబడినది. మాలిక్ బిన్ దీనార్ మరియు 20 మంది ముహమ్మద్ ప్రవక్తగారి అనుయాయులు, మొదట కేరళలోని, కొడుంగళూర్ వచ్చారు. వీరు భారతదేశంలో ప్రవేశించినపుడు, ఈ రాష్ట్రాలలో ఇస్లాం మతానికి మంచి స్పందన లభించినది. తదనంతరం, ఇతర రాష్ట్రాలలో కూడా మంచి స్పందన లభించింది. ఇస్లామీయ తత్వం, ఏకేశ్వరోపాసక నియమం, సర్వమానవ సోదరభావత్వం, సమానత్వాల ప్రవచనాలు, శాస్త్రాలతో కూడిన ఖురాన్, సాదా సీదా జీవన సరళి, మున్నగు విషయాలు ప్రజలపై ప్రభావం చూపాయి. మాలిక్ బిన్ దీనార్ మొదటి మస్జిద్ ను నిర్మించాడు, ఈ మస్జిద్, హిందూ దేవాలయ శైలి (కేరళ శైలి) లో నిర్మింపబడినది.
(ఇంకా…)
43వ వారం
ఆది పరాశక్తి
ఆది పరాశక్తి హైందవ పురాణాల ప్రకారం సర్వశక్తిమంతురాలైన దేవత. పరబ్రహ్మ స్వరూపం. శాక్తేయంలో ఆది పరాశక్తే పరమసత్య స్వరూపంగా గుర్తింపబడినది. దేవి భాగవత పురాణములో ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు మరియు వినాశకారి ఆది పరాశక్తే అని సూచించబడినది.శాక్తేయం ప్రకారం ఆది పరాశక్తి శూన్యబిందు, అనగా దివ్యమైన శూన్య స్త్రీ శక్తి. ఈ శక్తి యొక్క సార్వత్రిక ఆత్మ (పురుషుడు) మరియు ప్రకృతి శక్తికి జన్మించిన అంశములు. దుర్గా దేవి ఆది పరాశక్తి యొక్క సమీప రూపాంతరము. ఆది పరాశక్తి యొక్క మానవ రూపమే శక్తికి, సౌందర్యానికి దేవత అయిన దుర్గా దేవి. దుర్గా దేవి సాత్విక, రాజసిక మరియు తామసిక గుణాలు మూడూ కలసిన ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము. అయితే, అనంత విశ్వానికి అధినేత్రి అయిన ఆది పరాశక్తి రూపం లేనిదీ, నిర్గుణ బ్రహ్మ అనే వాదన కూడా కలదు. ఈ వాదన ప్రకారం ఆది పరాశక్తి ఒక దివ్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన చైతన్యము. ఆదిమ శక్తి తనే కావటం మూలాన ఇతర దేవతలకి కూడా తనే మూలము. కావున ఆది పరాశక్తే అఖండ సత్యం. ఈ శక్తి దానికై అదే సంపూర్ణం. ఆది పరాశక్తి భర్త లేనిది. కానీ ఈ జగత్తుకి శివుడిని ఆహ్వానించటానికి తాను స్త్రీ రూపంలో జన్మనెత్తినది. హిందూ మతంలో ఆది పరాశక్తి అనగా ఈ సమస్త విశ్వాన్ని నడిపించే ఒక దివ్య శక్తి. స్త్రీ యొక్క సృజనాత్మక శక్తికి దైవత్వాన్ని ఆపాదించే ఒక భావన.
(ఇంకా…)
44వ వారం

మదీనా

మదీనా హిజాజ్ , సౌదీ అరేబియా కు పశ్చిమాన గల ప్రాంతం, మరియు అల్-మదీనా రాష్ట్రపు రాజధాని. ఇస్లాం లోని రెండవ అతిపవిత్రమయిన నగరం. ముహమ్మద్ సమాధిగల నగరం. ముహమ్మదుప్రవక్త తన అనుయాయులతో కలసి మక్కా నుండి వలస హిజ్రత్ చేసిన నగరం కూడానూ.మదీనాలో ప్రస్తుతం జనాభా 1,300,000 కన్నా ఎక్కువ గలదు (2006). దీనికి ప్రాచీన నామం యస్రిబ్. దీనికి ఈనామం రోమన్లతో జరిగిన యుద్ధములో యూదులు ఓడిపోయి కాందిశీకులుగా అరేబియాలో నివాసమేర్పరచుకొన్నారు. తరువాతికాలంలో దీనికి మదీనతున్-నబి లేదా అల్ మదీనా అల్ మునవ్వరా (ప్రకాశింపబడిన నగరము)("జ్ఞానోదయ నగరము" లేదా "తేజో నగరము""), సూక్ష్మంగా మదీనా అర్థం నగరము. మదీనా మక్కా నగరానికి 338 కి.మీ. ఉత్తరాన మరియు ఎర్రసముద్రతీరానికి తూర్పున 193 కి.మీ. దూరాన గలదు. ఇస్లాం లో మక్కా తరువాత మదీనా 2వ పవిత్రనగరము. హిజాజ్ ప్రాంతంలోని సారవంతమైననేలపై వ్యాపించియున్నది. కొండలు మరియు పర్వతపంక్తుల మధ్యలో వ్యాప్తి చెందిన నగరం. ఈ నగరం 30 నుండి 40 అడుగుల ఎత్తుగల బలిష్ఠమైన వర్తులాకారపుకోటగోడలచే 12వ శతాబ్దంలో నిర్మింపబడినది. దీనికి నాలుగు ప్రధాన ద్వారాలుగలవు. అందులో అత్యంతప్రాశస్తమైనది అందమైనది బాబ్-అల్-సలామ్ ద్వారం, లేదా 'ఈజిప్షియన్ గేట్'. కోటగోడలకు ఆవలగూడా పశ్చిమాన మరియు దక్షిణాన ఇండ్లు, మైదానలు, తోటలు మరియు వనాలు గలవు. వీటికిగూడా గోడలు మరియు ద్వారాలు గలవు.

(ఇంకా…)

45వ వారం

కమల్ హాసన్

కమల్ హాసన్ (జ.నవంబర్ 7, 1954) భారతదేశ జాతీయ నటుడు. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశ మంతటా సుపరిచితుడు. ఈయన శ్రీనివాసన్, రాజ్యలక్ష్మి దంపతులకు నాలుగో సంతానం మరియు ఆఖరి వాడు. కొడుకులందరికి చివరి పదం "హాసన్" అని వచ్చేలా పేరు పెట్టారు ఈ దంపతులు. ఇది హాసన్ అనబడే ఒక మిత్రుడితో తమకి ఉన్న అనుబంధానికి గుర్తు. కమల్ 6 యేళ్ళ పసి వయసులోనే చిత్ర రంగంలోకి ప్రవేశించాడు. ఆయన మొదటి చిత్రం "కలత్తూర్ కన్నమ్మ". బాల్యంలోనే ఆయన శాస్త్రీయ కళలను అభ్యసించాడు. నూనూగు మీసాల వయసులో సినిమాలలో నృత్య దర్శకుడిగా పని చేసాడు. అదే సమయంలో ప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు కె.బాలచందర్ తో ఆయనకు ఏర్పడిన అనుబంధం తరువాత సుదీర్ఘ గురు-శిష్య సంబంధంగా మారింది. కమల్ నేపథ్య గాయకుడిగా కూడా శిక్షణ పొందాడు. ఇటీవలి కొన్ని చిత్రాలలో పాటల రచయితగా కూడా పని చేసాడు. భరత నాట్యం ప్రదర్శించటంలో ఆయనకి ఆయనే సాటి. తమిళ చిత్ర రంగంలో తిరుగులేని నటుడిగా ఎదిగాడు. కమల్ తన సినీ జీవితాన్ని "కలత్తూర్ కన్నమ్మ" అనే చిత్రంలో బాల నటుడిగా ఆరంభించాడు. ఇది ఆయనకి ఉత్తమ బాల నటుడిగా అవార్డ్ తెచ్చిపెట్టిన మొదటి చిత్రం.

(ఇంకా…)

46వ వారం

జవాహర్ లాల్ నెహ్రూ

జవహర్‌లాల్ నెహ్రూ(నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాటములో ప్రముఖ నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు మరియు చరిత్రకారుడు కూడా. ఆయన భారత దేశానికి అందరికంటే ఎక్కువకాలం పనిచేసిన ప్రధాన మంత్రి. వీరి పదవీ కాలం 1947 నుండి 1964 వరకు సాగింది. భారత స్వాతంత్ర్య సంగ్రామ ప్రముఖ నాయకుడైన నెహ్రూ, స్వంతంత్ర భారతదేశ మొదటి ప్రధానిగా కాంగ్రెస్ పార్టీచే ఎన్నుకోబడ్డారు.పిమ్మట 1952 లో భారతదేశ మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినపుడు ప్రధాని అయ్యారు. అలీనోద్యమ స్థాపకుల్లో ఒకరైన నెహ్రూ యుద్ధానంతర కాల అంతర్జాతీయ రాజకీయాలలో ముఖ్య వ్యక్తి. భారత దేశం లో సంపన్న న్యాయవాది మరియు రాజకీయ వేత్త అయిన మోతిలాల్ నెహ్రూ కుమారుడైన నెహ్రూ, యువకునిగా ఉన్నప్పుడే భారత జాతీయ కాంగ్రెస్ లో వామ పక్ష నాయకుడయ్యారు. బ్రిటిష్ సామ్రాజ్యం నుండి సంపూర్ణ స్వాతంత్ర్య సముపార్జనకు అనుకూలుడైన నెహ్రూ,మహాత్మా గాంధీ సలహాలతో , ప్రజాకర్షణ కలిగిన సంస్కరణ వాద నాయకుడిగా ఎదిగి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. దీర్ఘ కాలం కొనసాగిన భారత స్వాతంత్ర సంగ్రామంలో ముఖ్యపాత్ర వహించి గాంధీగారి రాజకీయ వారసునిగా గుర్తించ బడ్డారు.
(ఇంకా…)

47వ వారం
భర్త పట్ల క్రౌర్యం
భర్త పట్ల క్రౌర్యం (ఆంగ్లం: Cruelty against husband) అనగా స్త్రీల రక్షణ కొరకు ఉన్న చట్టాలను తనకనుకూలంగా ఉపయోగించుకొని భర్త మరియు అయన కుటుంబీకులు ప్రమేయం లేనప్పటికీ దుర్వినియోగం చేస్తూ, డబ్బు కోసం వేదిస్తూ భయపెట్టడం. కొన్ని సందర్భాలలో శారీరకంగానూ, మాససికంగానూ మరియు సామాజికం గానూ భర్తని వేధించటం. చట్టం స్త్రీలకే అనుకూలంగా ఉన్నది అనే భ్రమ నెలకొని ఉండటం మూలాన భార్య/ఆమె కుటుంబీకులు/ఆమె బంధుమిత్రులు తాము ఆడిందే ఆటగా, పాడిందే పాటగా వ్యవహరించటం, వాటికి కట్టుకొన్న భర్త ఒప్పుకోని పక్షంలో స్త్రీ సంక్షేమం కోసం రూపొందించిన చట్టాలనే అమాయక భర్త పై అస్త్రాలుగా ప్రయోగించటం/లేదా ప్రయోగిస్తామని బెదిరించటమే "భర్త పట్ల క్రౌర్యం". హైందవ వివాహ సంస్కారాల ప్రకారం వివాహంలో వరుడు "మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా, కంఠేబధ్నామి శుభగే త్వం జీవం శరదశ్శతమ్" అనే మంత్రంతో వధువు మెడలో మాంగల్యాన్ని కడతాడు. దీని అర్థం "నా జీవితానికి మూలమైన, హేతువైన ఈ సూత్రమును నీ కంఠమున నేను కట్టుచున్నాను. నీవు నూరు సంవత్సరములు జీవించాలి" అని. అదే విధంగా నాతిచరామి మంత్రం "ధర్మేచ అర్థేచ కామేచ త్యయేషా నాతిచరితవ్యా నాతిచరామి" అనే మంత్రంతో ఇద్దరూ కలిసి "ధర్మార్థ కామములందు ఒకరికొకరు తోడుగా ఉంటామని" ప్రతిజ్ఞ చేస్తారు..
(ఇంకా…)
48వ వారం

ఒలిక్ ఆమ్లం

ఒలిక్ ఆమ్లం అనునది ఒక కొవ్వు ఆమ్లం. ఒక ద్విబంధమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం. కొవ్వుఆమ్లాలను కార్బోమొనాక్సిల్ అమ్లములని కూడా పిలుస్తారు. ఓలియిక్ ఆమ్లం ఒక సరళ హైడ్రొకార్బను శృంఖాలన్ని కలిగి ఉంటుంది. శృంఖలంలో ఎటువంటి కొమ్మలు ఉండవు.ఇది మొక్కల/చెట్ల గింజ లనుండి, మరియు జంతు కొవ్వులలో విస్తృతంగా లభ్యమవుతుంది. ఆలివ్/ఒలివ్ నూనెలో 75% ఓలియిక్ ఆమ్లం ఉన్నది. ఒలిక్ అమ్లం యొక్క ఉనికిని నూనెలలో, కొవ్వు లలో మొదటగా క్రీ.శ 1846 లో మైకెల్ యూజెన్ చెవ్రెల్ గుర్తించాడు. ఇది ఒలివ్ నూనె లో 75% వరకు ఉండుట వలన సాధారణ పేరు ఓలిక్ ఆమ్లము అయినది. ఒలిక్ ఆమ్లం యొక్క శాస్త్రీయ నామం, సిస్-9 ఆక్టాడెకెనొయిక్ ఆసిడ్. అణు ఫార్ములా C18H34O2.అణుభారం 282.47 గ్రాములు/మోల్. ఒలిక్ ఆమ్లంలో ద్విబంధం 9వ కార్బను వద్ద ఉండటం వలన దీనిని ఒమేగా-9 కొవ్వు ఆమ్లమని కూడా పిలుస్తారు. ఒలిక్ ఆమ్లం నూనెలలో మరియు జంతు కొవ్వులలో ఒలిక్ ఆమ్లం గా ఒంటరిగా కాకుండ నూనెలోగ్లిసెరోల్ తో సంయోగం చెంది గ్లిసెరైడ్/గ్లిజరాయిడ్ రూపంలో ఉండును. వీటిని ఎస్టరు ఆఫ్ ఫ్యాటి ఆసిడ్లు అందురు.సాధారణంగా సిస్ అమరిక ఉండి, ఒక ద్విబంధాన్ని 9 వ కార్బను వద్ద కలిగి ,18 కార్బనులు ఉన్న కార్బోమోనాక్సిల్ ఆమ్లం ను మాత్రమే ఒలిక్ ఆమ్లం లేదా సిస్-9-ఆక్టాడెకెనోయిక్ ఆమ్లం అందురు.

(ఇంకా…)

49వ వారం

బి.నాగిరెడ్డి

బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (డిసెంబర్ 2, 1912 - ఫిబ్రవరి 25, 2004) తెలుగు సినీనిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.ఈయన డిసెంబర్ 2, 1912న కడప జిల్లా ‌పొట్టింపాడు గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. ఆ పల్లెటూరి వీధిబడిలో రామాయణ మహాభారతాలు, భాగవతంలాంటి పురాణగ్రంథాలను మాత్రమే బోధించేవారు. ధర్మబద్ధమైన జీవితం ఎలా గడపాలో ఉపాధ్యాయుడు పిల్లలకు రోజూ చెప్పేవాడు. ప్రాచీన గ్రంథాల్లోని సూక్తులను, సుభాషితాలను పిల్లలచేత కంఠస్థం చేయించేవాడు. ఆ ఉపాధ్యాయుడి వద్ద చదువుకున్న నాగిరెడ్డి పది, పన్నెండేళ్ళు వచ్చేనాటికే పురాణేతిహాసాలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకోగలిగాడు. అవన్నీ ఆయన ఆలోచనావిధానాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆ తర్వాత ఆయన మద్రాసు (ఈనాటి చెన్నై) నగరాన్ని చేరుకుని కొన్నేళ్ళపాటు పాఠశాల విద్య అభ్యసించాడు. పాఠశాల విద్య పూర్తి కాకుండానే ఆయన తన కుటుంబం నడుపుతున్న ఎగుమతి వ్యాపార బాధ్యతలు చేపట్టవలసివచ్చింది.యువకుడుగా ఆయన స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఖాదీ ఉద్యమంలో పాల్గొన్నాడు. కానీ వ్యాపార నిమిత్తం బర్మా వెళ్ళవలసి వచ్చింది. అయితే రెండవ ప్రపంచయుద్ధసమయంలో వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. ఆయన మళ్ళీ జీవితం కొత్తగా ప్రారంభించవలసివచ్చింది. ప్రింటింగ్ ప్రెస్ ను ప్రారంభించాడు. క్రమంగా ప్రచురణ రంగప్రవేశానికి అదే దోహదం చేసింది. (ఇంకా…)

50వ వారం

సిసిలీ

సిసిలీ మధ్యధరా సముద్రం (మెడిటరేనియన్ సముద్రం) లోని అతి పెద్ద ద్వీపం సిసిలీ. క్రీస్తు పూర్వం 8000 నుంచే ఇక్కడ మనుషులు జీవించిన దాఖలాలున్నాయి. క్రీస్తు పూర్వం 750లో ఇది గ్రీక్ కాలనీగా ఉండేది. మాఫియా ఇక్కడే పుట్టింది. ఈ రోజుకీ మాఫియా నేర చరిత్రగల వ్యక్తులు ఇటలీ, అమెరికా ఇంకా మరి కొన్ని దేశాల్లో ఉన్నారు. 1946లో ఇటాలియన్ రిపబ్లిక్ స్థాపించబడ్డాక సిసిలీకి స్వయం ప్రతిపత్తి కలిగింది. సంగీతం, ఆర్కిటెక్చర్, భాష, వంటకాల విషయంలో సిసిలీ పేరుపొందింది. ఎత్నా, ట్రోంబోలీ అనే అగ్నిపర్వతాలు సిసిలీ ద్వీపం ఉత్తర దిశలో ఉన్నాయి. గైడ్ సహాయంతో ట్రోంబోలీ అగ్నిపర్వతం మీదకి ఎక్కవచ్చు. ఒకవైపు వేడి లావా కారిన గుర్తులని గైడ్ చూపిస్తాడు. 2002లో వౌంట్ ఎత్నా బద్దలైంది. ఇక్కడ బీచ్‌లలోని ఇసుక నల్లగా ఉండడానికి కారణం ఆ బూడిదే. ఎత్నా యూరప్‌లోని అత్యంత ఎత్తయిన అగ్నిపర్వతం. ఇక్కడ వేడినీటి బుగ్గలు కూడా ఉన్నాయి. యూరప్‌లో ప్రస్తుతం ఏక్టివ్‌గా ఉన్న అగ్నిపర్వతం ఎత్నానే. సమీపంలోని నెబ్రోడీ-మడోనీ పార్క్‌లని కూడా చూడవచ్చు. అత్యంత పురాతన రాతి ఇళ్లు అల్కాంతర రివర్ పార్కు మొదలైనవి కూడా చూడవచ్చు.క్రిస్టియన్స్ అధికంగా ఆరాధించే సెయింట్ పాల్ ఇక్కడి సెయింట్ జాన్స్ చర్చ్‌లో కొంత కాలం బోధనలు చేశాడు. రోమ్‌లో రెండేళ్లపాటు హౌస్ అరెస్టులో ఉన్నాక క్రీ.శ. 64లో ఆయనకి అక్కడ మరణ శిక్ష విధించారు. అదేచోట నేటి రోమ్ సెయింట్ పాల్ ఆఫ్ ది త్రీ ఫౌంటెన్స్ అనే ఫౌంటెన్‌ని ఆయన గుర్తుగా ఏర్పాటు చేశారు.

(ఇంకా…)

51వ వారం

షణ్ముఖుడు

షణ్ముఖుడు అనగా కుమారస్వామి శివ పార్వతుల తనయుడు.వినాయకుని తమ్ముడు. దేవతల సేనాధిపతి. ఈయనకే 'స్కందుడు' అని, 'కార్తికేయుడు' అని, 'శరవణుడు' అని, 'సుబ్రహ్మణ్యుడు' కూడా పేర్లున్నాయి. ఈయన వాహనము నెమలి. స్కంద పురాణంలో ఈయన గాధ వివరంగా ఉన్నది. ఇతన్ని కొలిచే పర్వదినం సుబ్రహ్మణ్య షష్టి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజు జరుపుకొంటారు. ఈయన బ్రహ్మచారి అని కూడా చెబుతారు. ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లితే ఆయన తల్లికి బుగ్గ మీద గాయమయ్యిందట.జగజ్జనని, "నాయనా! ఈ ప్రపంచములోని ప్రతి ప్రాణిలోనూ నేను వున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే ! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్ను గాయపరచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించి ఉంది కనుక తాను ఇక ఎవరినీ పెళ్ళాడలేను అనుకుని కార్తికేయుడు బ్రహ్మచారి గా వుండి పోయాడట. సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలనూ, మానవులనూ బాధిస్తున్నారు. శివపార్వతుల ఔరస కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపాడు. తన పూలబాణాలతో శివుని తపస్సు భంగముచేసి ప్రణయములోనికి దింపాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు. శివునినుండి వెలువడిన దివ్యతేజస్సు ఆరుభాగాలుగా విభజింపబడింది. వాటిని వాయువు, అగ్ని దేవుళ్ళు గంగానదిలో ఉంచారు.

(ఇంకా…)

52వ వారం

శ్రీనివాస రామానుజన్

శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (డిసెంబరు 22, 1887—ఏప్రిల్ 26, 1920) భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు.రామానుజన్ తమిళనాడు లోని ఈరోడ్ అనే పట్టణంలో పుట్టి పెరిగాడు. ఇతడికి పది సంవత్సరాల వయసులోనే గణితశాస్త్రం తో అనుభందం ఏర్పడింది. చిన్న వయసులోనే గణితం పట్ల ప్రకృతి సిద్ధమైన ప్రతిభ కనపరిచేవాడు. ఆ వయసులోనే ఎస్ ఎల్ లోనీ త్రికోణమితి మీద రాసిన పుస్తకాలను వంటపట్టించుకున్నాడు. పదమూడు సంవత్సరాలు నిండే సరికల్లా ఆ పుస్తకాన్ని ఔపోసన పట్టడమే కాకుండా తన సొంతంగా సిద్ధాంతాలు కూడా రూపొందించడం ప్రారంభించాడు.రామానుజన్ డిసెంబరు 22, 1887 నాడు తమిళనాడు రాష్ట్రం లోని ఈరోడ్ పట్టణము నందు ఆయన అమ్మమ్మ ఇంట్లో జన్మించాడు. రామానుజన్ తండ్రి కె శ్రీనివాస అయ్యంగార్ ఒక చీరల దుకాణంలో గుమస్తాగా పని చేసేవారు. ఈయన తంజావూరు జిల్లాకి చెందిన వారు. తల్లి కోమలటమ్మాళ్ గృహిణి మరియు ఆ ఊరిలోని గుడిలో పాటలు పాడేది. వీరు కుంబకోణం అనే పట్టణంలో, సారంగపాణి వీధిలో, దక్షిణ భారతదేశ సాంప్రదాయ పద్దతిలో నిర్మించబడ్డ ఒక పెంకుటింట్లో నివాసం ఉండేవారు. ఇది ఇప్పుడు మ్యూజియంగా మార్చారు.రామానుజన్ ఒకటిన్నర సంవత్సరాల వయసులో ఉండగా ఆయన తల్లి సదగోపన్ అనే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. కానీ మూడు నెలలు పూర్తవక మునుపే ఆ బిడ్డ కన్నుమూశాడు.

(ఇంకా…)

53వ వారం
నాలుగు ప్రాథమిక బలాలు
నాలుగు ప్రాథమిక బలాలు ప్రకృతిలో ఉన్నాయని ఆధునిక భౌతిక శాస్త్రం చెబుతోంది. భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ అతనికి సహస్ర నామాలు ఎలా ఉన్నాయో అలాగే విశ్వావిర్భవానికి మూలకారణమైన ఆదిశక్తి ఒక్కటే అయినప్పటికీ అది ఈ నాడు మనకి నాలుగు వివిధ బలాలుగా ద్యోతకమవుతున్నదని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. ఈ నాలుగూ పరస్పరమూ పొంతన లేకుండా విడివిడిగా ఉన్న నాలుగు విభిన్న బలాలా లేక ఒకే ఆదిశక్తి వివిధ రూపాలలో మనకి కనిపిస్తోందా అన్న సమస్య ఇక్కడ ప్రస్తావిస్తూన్న అంశం. ఈ నాలుగు ప్రాథమిక బలాలు గురుత్వాకర్షణ బలం, విద్యుదయస్కాంత బలం, బృహత్ సంకర్షక బలం మరియు లఘు సంకర్షక బలం. పదిహేడో శతాబ్దంలోనే నూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని లేవదీశాడు. గురుత్వాకర్షణ బలం విశ్వవ్యాప్తంగా ఉన్న బలం అని నూటన్ సూత్రీకరించేడు. ఈ గురుత్వాకర్షణ సిద్ధాంతంలో మనం అర్ధం చేసుకోవలసిన అంశాలు రెండు. ఈ విశ్వంలో ప్రతీ వస్తువు ప్రతీ ఇతర వస్తువుని ఆకర్షిస్తోంది అన్నది మొదటి అంశం. రెండు వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ బలం ఆ రెండు వస్తువుల గురుత్వం లేదా ద్రవ్యరాశి మీదా, వాటి మధ్య ఉండే దూరం మీదా ఆధారపడి ఉంటుందన్నది రెండవ అంశం. వస్తువుల గరిమ ఎక్కువ అయిన కొద్దీ వాటి మధ్య ఆకర్షణ పెరుగుతుంది. వస్తువుల మధ్య దూరం పెరిగిన కొద్దీ వాటి మధ్య ఆకర్షణ తరుగుతుంది.
(ఇంకా…)
54వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2015 54వ వారం

ఇవి కూడా చూడండి[మార్చు]