బాగ్దాద్
బాగ్దాద్ بغداد |
|
ఇరాక్ లోని బాగ్దాద్ ప్రదేశం. | |
అక్షాంశరేఖాంశాలు: 33°20′00″N 44°26′00″E / 33.33333°N 44.43333°E | |
---|---|
దేశము | ఇరాక్ |
ప్రాంతము | బాగ్దాద్ గవర్నరేట్ |
ప్రభుత్వం | |
- Type | {{{government_type}}} |
- గవర్నరు | హుసేన్ అల్ తహ్హాన్ |
వైశాల్యము | |
- City | 734 km² (283.4 sq mi) |
ఎత్తు | 34 m (112 ft) |
జనాభా (2006)[1][2] | |
- City | 70,00,000 |
- సాంద్రత | 34,280/km2 (88,784.8/sq mi) |
- మెట్రో | 90,00,000 |
రమారమి అంకెలు | |
కాలాంశం | గ్రీనిచ్ సమయం +3 (UTC) |
- Summer (DST) | +4 (UTC) |
బాగ్దాద్ లేదా బాగ్దాదు (ఆంగ్లం : Baghdad) (అరబ్బీ భాష : 'بغداد' ) ఇరాక్ దేశపు రాజధాని. దీని జనాభా దాదాపు 70 లక్షలు. ఇరాక్ లో ప్రధాన, అతిపెద్ద నగరం.[1][2], మధ్య ప్రాచ్యంలో కైరో, టెహరాన్ ల తరువాత అతిపెద్ద మూడవ నగరం. ఈ నగరం టైగ్రిస్ నది ఒడ్డున ఉంది. దీని చరిత్ర సా.శ. 8వ శతాబ్దం వరకూ వెళుతుంది. ఈ నగరం ఒకానొక కాలంలో ముస్లిం ప్రపంచంలో దార్ ఉల్ సలామ్ విద్య, విజ్ఞాన, సాంస్కృతిక, చారిత్రక, కళల కేంద్రంగా విరాజిల్లినది.
పేరు
[మార్చు]దీని పేరుకు మూలం పర్షియన్ భాష,[3] అందరూ ఆమోదించే పేరు, 'భాగా లేదా బాగ్' "దేవుడు" + దాద్ "బహుమతి" వెరసి "దేవుని బహుమతి" లేదా "దేవుని ప్రసాదము". నవీన పర్షియన్ ల ఇంకో వాదన ప్రకారం, "ప్రసాదింపబడిన ఉద్యానవనం". కాని ఇవి ఇస్లాంకు పూర్వం నిర్వచింపబడిన పేర్లు. అబ్బాసీయుల కాలంలో [4]. మన్సూర్ దీనికి "మదీనత్ అస్-సలామ్" లేదా "శాంతి నగరం" అని పేరు పెట్టాడు. అతని కాలంలో నాణెములపై, తులామానాలపై ఇదే పేరును ఉపయోగించాడు.[5].
చరిత్ర
[మార్చు]బాగ్దాద్ స్థాపన
[మార్చు]జూలై 30 సా.శ. 762 న ఖలీఫా అబూ జాఫర్ అల్ మన్సూర్ ఈ నగరాన్ని స్థాపించాడు.[6]. మన్సూర్ నమ్మకం ప్రకారం బాగ్దాద్, అబ్బాసీయులకు, ఇస్లామీయ కేంద్రంగాను, రాజధాని గాను సరైన నగరం. మన్సూర్ ఈ నగర స్థాపన నావల్ల జరగాలి, ఇందే నేను జీవించాలి, నాతరువాత వారునూ పరిపాలించాలి అని అన్నాడు.[7] ఈ నగరపు భౌగోళికాంశాలు, దీని అభివృద్ధికి చాలా తోడ్పడ్డాయి. మధ్యప్రాచ్యం నుండి ఆసియా ప్రాంతానికి వారధిగా ఈ నగరం యున్నది. నెలవారి వ్యాపార జాతరలు ఇంకనూ తోడ్పడ్డాయి. దీనికి నీటివనరులు, పొడి వాతావరణం మొదలగునవి అనుకూలాంశములు. హారూన్ రషీద్ (9వ శతాబ్దపు తొలిదశ) కాలంలో బాగ్దాద్ నగరం ఉచ్చస్థితికి చేరుకున్నది.
బాగ్దాద్ నగర ఉత్థానస్థితి కారణంగా పర్షియా దేశ రాజధాని టెసిఫాన్ నగరానికి గ్రహణం పట్టినట్టయింది. బాబిలోనియా ప్రాంతం (క్రీ.పూ. 2 వ శతాబ్దంలో అంతమయినది) బాగ్దాద్ నగరానికి దక్షిణాన 90 కి.మీ. దూరాన ఉంది.
బాగ్దాద్ నిర్మాణము
[మార్చు]ప్రారంభ సంవత్సరాలలో, ఈ నగరం ఖురాన్ వర్ణించినటువంటి స్వర్గం గుర్తుకు వచ్చేలా వుందని, వుండాలని భావించేవారు.[8]. సా.శ. 758 ఈ నగరానికి శంకుస్థాపన చేయడానికి ఖలీఫా మన్సూర్ ప్రపంచంలోని పలు ఇంజనీర్లను, సర్వేయర్లను, నిర్మాణ కళాకారులను ఆహ్వానించాడు. వీరిని క్రోడీకరించి, బాగ్దాద్ నగర నిర్మాణ నమూనా తయారు చేయమని కోరాడు. దాదాపు 1 లక్ష మంది, నిర్మాణపు నిపుణులు కళాకారులు వచ్చి సర్వేలు నమూనాలు తయారు చేయడం ప్రారంభించారు. చాలా మందికి జీతాలు పంచడంగూడా జరిగింది. ఈ నగరపు నమూనా రెండు పెద్ద అర్ధ-గోళాలు కలిగినది, వీటి వ్యాసాలు దాదాపు 19 మైళ్ళు. ఖగోళికులైన నౌబక్త్, మాషాఅల్లా, ఇద్దరూ కలసి మహూర్తాలు లెక్కించి, ఈ నగరం సింహరాశిలో వుండాలని, దీని శంకుస్థాపన జూలై నెలలో జరగాలని నిర్ణయించారు.[9]. ఈ నిర్మాణ కార్యక్రమంలో అబూ హనీఫా ఇటుకలను లెక్కపెట్టే పని చేపట్టి, ఒక కాలువ నిర్మాణం కూడా చేపట్టాడు. ఈ కాలువ వలన, నిర్మాణపు పనుల కొరకు నీరు అందించింది. ఈ నగరపు నిర్మాణంలో చలువరాయి ఉపయోగించబడింది. నది ఒడ్డున మెట్లకు కూడా ఈ చలువరాయే ఉపయోగించడం జరిగింది. నగరంలో అనేక ఉద్యానవనాలు, తోటలు, భవంతులు, సుందరమైన రహదారులు నిర్మించబడినవి. వీటి వలన, నగరానికి సుందరత్వం కలిగినది.[10]. ఈ నగరాన్ని20 కి.మీ. వ్యాసనిడివి గల వృత్తాకారంలో డిజైన్ చేశారు., ఇది "గుండ్రని నగరం"గా పేరుగాంచింది. దీని అసలు డిజైన్ "ఉంగరపు ఆకారం"లో గలదు. , ఆఖరి నిర్మాణంలో బయటి ఉంగరంలో ఇంకో ఉంగరపు ఆకారం చేర్చబడింది.[11] ఈ నగరపు మధ్యలో మస్జిద్, , రక్షకభట నిలయం గలవు. ఈ నమూనాలన్నీ పర్షియాకు చెందిన ససానిద్ ల డిజైన్‌లను పోలి యుంటుంది. విశాలమైన పురవీధులు, సుందరమైన భవంతులు, ప్రభుత్వ భవనాలు, మస్జిద్‌లు, చర్చీలు, సినగాగ్‌లు నగర నడిబొడ్డున ఉన్నాయి.
నగర చుట్టూగల కుడ్యం
[మార్చు]ఈ నగర చుట్టూ గల కుడ్యాలకు కూఫా, బస్రా, ఖురాసాన్ , సిరియా ల పేర్లు పెట్టారు. కారణం ఈ గోడలు ఆయా నగరాల లేదా దేశాల వైపు వుండడమే.[12].
స్వర్ణ ద్వార సౌధం
[మార్చు]బాగ్దాద్ కు మధ్యన కేంద్రకూడలి వద్ద 'బంగారు ద్వార సౌధం' గలదు. ఈ భవంతి, ఖలీఫా , అతని కుటుంబ నివాసం. ఈ భవంతి మధ్యన 160 అడుగుల ఎత్తుగల పచ్చని గుమ్మటం వుండేది. ఈ గుమ్మటం పైభాగాన చేతిలో దీపం పట్టుకొన్న ఓగుర్రపువ్యక్తి నిల్చుని వుండేవాడు. సిరియా ద్వారం వద్ద రక్షకభటుల భవనం వుండేది. ఈ భవనంలో సైన్యాధ్యక్షుడు నివాసముండేవాడు. 813 లో ఖలీఫా అమీన్ మరణం తరువాత ఖలీఫా భవంతి నిరుపయోగంగా మారింది. ఈ భవంతిలో ఖలీఫాలు నివాసం ఉండడం మానేశారు.[13].
అబ్బాసీయులు , వృత్తాకార నగరం
[మార్చు]అబ్బాసీ ఖలీఫాలు ముహమ్మద్ ప్రవక్త వంశీయులు , ఖురైష్ తెగకు సంబంధించినవఅరు. వీరు షియా ముస్లింలుగా పరిగణింపబడుతారు. వీరు ఖురాసాన్ ఉద్యమంద్వారా ఉమయ్యద్ ఖలీఫాల పర్షియన్ సామ్రాజ్యం పైగల పట్టును విడదీయడానికి పూనుకున్నారు.[14]. వీరు, అరబ్-ఇస్లామిక్ , పర్షియాకు చెందినససానిద్ ల వారసులుగా భావించుకున్నారు. ఈ రెండు సంస్కృతుల సమ్మేళనాలు వీరి నిర్మాణాలలో కానవస్తాయి. వీరు (మన్సూర్ ఖలీఫా కాలంలో) బాగ్దాద్ నగరంలో విజ్ఞాన భవనం నిర్మించి ఈ సంస్కృతుల ప్రాతినిథ్యాన్ని ప్రపంచానికి చాటారు. వృత్తాకారపు నగరమైన బాగ్దాద్, అరబ్-పర్షియన్ సంస్కృతులకు చిహ్నం. ఈ విజ్ఞాన భవనంలో ప్రపంచంలోని భాషలయిన గ్రీకు అరబ్బీ పర్షియన్ మొదలగులయందు విజ్ఞాన గ్రంథాలను తర్జుమా కార్యక్రమాలను చేపట్టారు. మన్సూర్ ఖలీఫా ("తర్జుమా ఉద్యమం") చేపట్టే ఖ్యాతిని పొందాడు.[15].
విద్యా విజ్ఞాన కేంద్రం (8 - 9వ శతాబ్దాలు)
[మార్చు]స్థాపింపబడిన ప్రథమ జెనరేషన్ లోనే, బాగ్దాద్ నగరం విజ్ఞాన కేంద్రముగానూ, వాణిజ్య కేంద్రంగానూ ఎదిగింది. విజ్ఞాన భవనం గ్రీకు భాష, మధ్య పర్షియా, సిరియన్ అనువాదపు ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించింది. అబ్బాసీయ సామ్రాజ్యానికి చెందిన అనేక స్కాలర్లు, బాగ్దాద్ కు బయలు దేరారు. గ్రీకు శాస్త్రాలను, భారతీయ శాస్త్రాలను అధ్యయనం చేసి, వాటిని అరబ్బులోనూ, ఇస్లామీయ ప్రపంచంలోనూ పరిచయంచేసారు. బాగ్దాద్ నగరం, అలనాటి చారిత్రాత్మమ, ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా మార్పు చెందినది. ఆ తరువాత ఈ నగరం ఖర్తబా (కార్డోబా) (స్పెయిన్) నగరంతో అనుసంధానం చేయబడింది.[16] కొన్ని లెక్కల ప్రకారం ఈ నగరంలో అత్యధికంగా 10 లక్షలకు పైగా జనాభా వుండేది.[17] అలీఫ్ లైలా (వెయ్యిన్నొక్క రాత్రులు) లో గల అనేక జానపద కథలు బాగ్దాద్ నగరానికి కేంద్రంగా చేసుకొని వ్రాసినవే. ఈ బాగ్దాద్ నగరంలో అరబ్బేతరులైన పర్షియన్లు, అరామియన్లు, గ్రీకులు, కొంత జనాభా వుండేది. ఈ సముదాయాలు రాను రాను అరబ్బీ భాషను స్వీకరించారు.
బాగ్దాద్ లో అబ్బాసీయ కాల సమాప్తి
[మార్చు].
10వ శతాబ్దం లో, నగరపు జనాభా దాదాపు 300,000 నుండి 500,000 వరకూ వుండేది. కాని ఖలీఫాల అంతర్-సమస్యల కారణంగా బాగ్దాద్ నగరపు అభివృద్ధి కుంటుపడినది. ఈ సమస్యల కారణంగానే 808 - 819, 836 - 892 కాలములలో రాజధానిని బాగ్దాద్ నుండి సమర్రా నగరానికి మార్చబడింది. తరువాతి కాలంలో ఇరాన్ రాజకీయ కర్ర పెత్తనంలో బువైహిద్‌ల (945 - 1055), సెల్జుక్ తురుష్కుల (1055 - 1135) ల కాలాలలో క్షీణ దశకు చేరుకున్నది. సెల్జుక్‌లు సైబీరియా స్టెప్పీ ప్రాంతాలకు చెందిన ఒగూజ్ తురుష్కుల సంతతికి చెందిన వారు. వీరు సున్నీ ముస్లింలుగా మారారు. సా.శ. 1040 లో ఘజనవీడు లకు అంతమొందించి తమ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. సెల్జుక్ ల నాయకుడు తుగ్రిల్ బేగ్, 1055 లో బాగ్దాద్ ను వశపరచుకున్నాడు. సెల్జుక్ లు బుయీద్ లను పదవీచ్యుతులను చేసి బాగ్దాద్ ను తమ ఆధీనంలో తీసుకున్నారు. వీరు అబ్బాసీయ ఖలీఫాల టైటిల్ అయిన సుల్తాన్ తమకూ అన్వయించుకుని, తాము కూడా అబ్బాసీయఖలీఫాల మాదిరి చెలామణి అయ్యారు. ఈ తుగ్రిల్ బేగ్ అబ్బాసీ ఖలీఫాల సంరక్షకుడిలా నడచుకున్నాడు.[18].
1258 ఫిబ్రవరి 10, న బాగ్దాద్ మంగోలులుచే ఆక్రమించుకొనబడింది. ఈ ఆక్రమణను చెంఘీజ్ ఖాన్ మనుమడైన హులెగు (ముస్లిం సముదాయాలలో "హలాకూ"గా గుర్తించబడుతాడు), బాగ్దాద్ దురాక్రమణ చేపట్టాడు. ఈ దురాక్రమణలో వేలకొలది ఇండ్లు కాల్చబడ్డాయి, లూటీలు మారణహోమాలు జరిగాయి. ఖలీఫా అయిన అల్ ముస్తసీమ్ను మట్టుబెట్టారు, భవంతులు కార్యాలయాలు, వంతెనలు, కాలువలు, వ్యావసాయిక నీటి పారుదల ప్రాజెక్టులు, కాలువలు పిల్లకాలవలు ధ్వంసం చేయబడ్డాయి. ఈ దెబ్బతో ఇస్లామీయ సంస్కృతి కోలుకోలేక పోయింది. ఈ కాలంలో బాగ్దాద్ ను ఇరాన్కు చెందిన మంగోల్ చక్రవర్తులు ఇల్-ఖనీద్లు పరిపాలించారు. 1401 లో, బాగ్దాద్ తిరిగీ దురాక్రమణకు గురయ్యంది, ఈ సారి ఈ దురాక్రమణ తైమూర్ లంగ్ చే జరిగింది. బాగ్దాద్ ఒక ప్రాంతీయ రాజధానిగా మార్చబడింది. , దీనిపై పెత్తనం జలైయిరిద్‌లు (1400 - 1411), కారా కోయున్లు (నల్లగొర్రెల తురుష్కులు) (1411 - 1469), అక్ కోయున్లు (తెల్లగొర్రెల తురుష్కులు) (1469 - 1508), , ఇరానీ సఫవీధులు (1508 - 1534) సామ్రాజ్యాలదై యుండినది.
ఉస్మానియా (ఒట్టోమాన్) బాగ్దాద్ (16 నుండి 19వ శతాబ్దం)
[మార్చు]1534 లో, బాగ్దాద్ ఉస్మానియా తురుష్కులచే ఆక్రమించుకొనడమైనది . ఉస్మానీయుల కాలంలో, బాగ్దాద్ నగర ప్రభావం క్రమంగా క్షీణిస్తూవచ్చింది. దీనకారణాలలో ఇరానీయులు , తురుష్కుల మధ్య శతృత్వం ఒకటి. ఇరానీయులు బాగ్దాద్ పై తురుష్కుల పెత్తనాన్ని అంగీకరించ పోవడం ఒకటి. 1623 - 1638 మధ్యకాలంలో ఇరానీయుల ఆధ్వర్యంలో బాగ్దాద్ తిరిగీ మధ్య ప్రాచ్యంలో అతిపెద్ద నగరంగా రూపుదిద్దుకుంది. మమ్‌లూక్ ల ప్రభుత్వ కాలంలో బాగ్దాద్ వైభవం తిరిగీ జీవం పోసుకున్నది. నట్టల్ విజ్ఞాన సర్వస్వం నివేదిక ప్రకారం 1907 లో బాగ్దాద్ జనాభా 185,000.
20వ శతాబ్దం
[మార్చు]1638 లో ఉస్మానీయులు తమ సామ్రాజ్యంలో కలుపుకుని 1917 మొదటి ప్రపంచయుద్ధం జరిగే సమయం వరకూ తమ ఆధీనంలో వుంచారు. 1917 లో మొదటి ప్రపంచయుద్ధం సమయంలో ఆంగ్లేయులు దీనిని వశపరచుకుని, "ఇరాక్ సామ్రాజ్య" నకు రాజధానిగా 1021 లో మార్చారు. 1932లో ఇరాక్ కు పాక్షిక స్వాతంత్ర్యం ఇవ్వబడింది. 1946లో సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ఇవ్వడం జరిగింది. నగర జనాభా 1950 లో 145,000 వున్నది, 1990లో 580,000 వరకూ పెరిగింది.
1970 కాలంలో పెట్రోల్ ధరలు పెరిగిన కారణంగా బాగ్దాద్ కు మహర్దశ వచ్చింది. 1980 లో ఇరాన్-ఇరాక్ యుద్ధంలో ఈ నగరానికి కష్టకాలం వచ్చింది.
2003 ఇరాక్ పై దాడి
[మార్చు]2003 మార్చి ఏప్రిల్లో అమెరికా జరిపిన ఇరాక్ పై దురాక్రమణ, అమెరికా ఇరాక్ ను ఆధీనంలో తీసుకునే సమయంలో బాగ్దాద్ తీవ్రంగా లూటీలకు విచక్షణా రహిత బాంబుల ప్రయోగాలకు లోనైనది. ఇది సద్దాం హుసేన్ కాలం. ఇరాన్-ఇరాక్ యుద్ధకాలంలో సద్దాం హుసేన్ ను చేరదీసిన అమెరికా, సద్దాం హుసేన్ ఇరాక్ ను సహించలేక, ఇరాక్ పై దాడి జరిపింది. అమెరికా సైన్యం బాగ్దాద్ నగరాన్ని స్వాధీనపరచుకున్నాయి. కోలిషన్ ప్రొవిజనల్ అథారిటీ 3 చ.కి.మీ. గ్రీన్-జోన్ ను స్థాపించింది, ఈ ప్రదేశంలోనే క్రొత్త ప్రభుత్వం తన కార్యకలాపాలను ప్రారంభించింది.[19] "[20] అమెరికా అధిపత్యాన్ని బాగ్దాదీయులు సహించలేక పోయారు. అమెరికా దాడులవలన, బాగ్దాద్ నగరపు మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్తు, విద్య, వైద్యం, ఇతర ప్రముఖ రంగాలన్నీ తీవ్రంగా ప్రభావితమైనవి. అమెరికా దాడి సమయంలో దాదాపు నగరమంతా అరాచకానికి లోనయ్యింది. ప్రజలు అన్నివిధాలా నష్టపోయారు. 1950లో 90 శాతం వరకూ బాగ్దాద్ ప్రజలలో సున్నీ ముస్లింలు వుండేవారు. ప్రస్తుతం షియా ముస్లింలు బాగ్దాద్ జనాభాలో 40 శాతం గలరు. అనగా సున్నీ ముస్లింలు గణనీయంగా తగ్గిపోయారు. పేర్కొనదగ్గ క్రైస్తవుల సంఖ్య కూడా ఈ నగరంలో గలదు.
భౌగోళికం , వాతావరణం
[మార్చు]బాగ్దాద్ నగరం టిగ్రిస్ నది (en:River Tigris) ఒడ్డున ఉంది. ఒక విధంగా చెప్పాలంటే టిగ్రిస్ నది బాగ్దాద్ నగరాన్ని రెండుగా చీలుస్తున్నది. తూర్పు భాగాన్ని 'రిసాఫా', పశ్చిమ భాగాన్ని 'కర్ఖ్' అనీ పిలుస్తారు. ఈ నగరపు భూమి దాదాపు చదునుగా ఉంది. బాగ్దాద్ అత్యుష్ణ మండలంలో వున్న కారణంగా, ఎక్కువ వేడిమికలిగి వాతావరణం (కోఫెన్ వాతావరణం BWh) కలిగి వుంటుంది. ప్రపంచంలో అత్యంత వేడిమి గల నగరాలలో బాగ్దాద్ ఒకటి. వేసవి కాలం జూన్ నుండి ఆగస్టు వరకు వుంటుంది, ఈ కాలంలో అధిక ఉష్ణోగ్రత 44 °C (111 °F) వుంటుంది. వర్షపాతం తక్కువే. కనీస ఉష్ణోగ్రత 24 °C (75 °F) వరకూ వుంటుంది. అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రత 50 °C (122 °F).[21]
పరిపాలనా విభాగములు
[మార్చు]బాగ్దాద్ నగరం 9 జిల్లాలు, 89 పరిసరాలు, అధికారికంగా కలిగి ఉంది. ఈ నగరపు ఉపవిభాగాలు, పురపాలక కేంద్రాలుగా 2003 వరకు ఏలాంటి రాజకీయ కార్యక్రమాలు లేకుండా సాగాయి. దాని తరువాత అమెరికా ఆధిపత్యాన గల Coalition Provisional Authority (CPA) వీటియందు క్రొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పరిసర ప్రాంతాల యందు పురపాలక సంఘాల ఏర్పాటు, అందులో ప్రజల భాగస్వామ్యం మిగతా విషయాలు చోటు చేసుకున్నవి. ఈ విధంగా అధికార వికేంద్రీకరణ, ప్రజల భాగస్వామ్యం, కౌన్సిళ్ళ ఏర్పాటు త్వరిత గతిన జరిగాయి.
బాగ్దాద్ రాష్ట్రంలో 127 వేరువేరు కౌన్సిళ్ళు రంగంలోకి వచ్చాయి. బాగ్దాద్ రాష్ట్ర జనాభా దాదాపు 70 లక్షలు. క్రింది స్థాయి కౌన్సిళ్ళు సరాసరి 74,000 జనాభాను ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
9 జిల్లాల అడ్వైజరీ కౌన్సిళ్ళు (DAC) క్రింది విధంగా ఉన్నాయి:[22]
- అజామియా
- కార్ఖ్[23]
- కరాదాహ్[24][25]
- కాజిమియా[26]
- మన్సూర్
- సద్ర్ నగరం (తౌరా)[27]
- రషీద్[28]
- రుసాఫా
- నవీన బాగ్దాద్ (తిసా నిస్సాన్) (9 ఏప్రిల్)[29] ఈ నగరం, దిగువ నివ్వబడిన చిన్న చిన్న పరిసర ప్రాంతాలూ కలిగివున్నది :
- గజాలియా
- అల్ ఆమిరియా
- డోరా
- కర్రాదా
- అల్ జజ్రియా
- జయూనా
- అల్ సైదియా
- హుర్రియా నగరం
- అల్ సాదూన్
- అల్ షుఆలా
- బాబ్ అల్ మౌసమ్
- బాబ్ అల్ షర్ఖి
- Al-Baya'|అల్ భయా
- అల్ జఫ్రానియా
- హయ్య్ ఉర్
- షఆబ్
- హయ్య్ అల్ జామియా
- అల్ ఆదిల్
- అల్ ఖజ్రా
- హయ్య్ అల్ జిహాద్
- హయ్య్ అల్ ఆమిల్
- హయ్య్ అఊర్
- అల్ హొరాయా
- హయ్య్ అల్ షుర్తా
- యర్మూక్
- అల్ సైదియా
- జెస్ర్ దియాలా
- అబూ దిషేర్
- రగీబా ఖాతూన్
- అరబ్ జిజూర్
- అల్ అవషోష్
- అల్ ఫతేల్
- అల్ ఉబైదీ
- అల్ వజీరియా
సంస్కృతి
[మార్చు]అరబ్ సాంస్కృతిక జీవితంలో బాగ్దాద్ తన పాత్రను ప్రత్యేకంగా పోషించింది. ఈ నగరం అనేక రచయితలకు, సంగీతకారులకు, కళాకారులకు పుట్టినిల్లుగా కళాపోషక కేంద్రంగా వర్థిల్లింది. బాగ్దాద్ లో మాట్లాడే భాష (అరబ్బీ మాండలికం), ఇతర ప్రాంతాలలో మాట్లాడే మాండలాకలకంటే భిన్నంగా కానవస్తుంది. అరబ్ తెగల మాండలకైన వెర్సీఘ్ (అరబ్బీ మాండలికం), యొక్క ప్రభావం ఎక్కువ కానవస్తుంది. మధ్య యుగం లో అనేక గ్రామాలనుండి, అనేక తెగలవారు, పట్టణావాసం చేయడం ఒక ముఖ్య కారణం.
విద్యాలయాలు
[మార్చు]- కొన్న ముఖ్యమైన సాంస్కృతిక సంస్థలు
- :
- ఇరాకీ జాతీయ ఆర్కెస్ట్రా—2003 ఇరాక్ పై దాడి జరిగినపుడు వీరికి అంతరాయం కలిగినది. తరువాత వీరి కార్యక్రమాలు తేరుకున్నవి.
- ఇరాక్ జాతీయ థియేటర్—2003 ఇరాక్ పై దాడి జరిగినపుడు ఇది లూటీకి గురైనది. ప్రస్తుతం దీని పునరుద్దరణా కార్యక్రమాలు రూపుదాల్చుకున్నవి.[30] 1990 లో ఐక్యరాజ్యసమితి ఆర్థిక నిషేధింపులు (ఎకనామిక్ సాంక్షన్స్) చేసినపుడు, ఇతర దేశాల నుండి సినిమాల దిగుమతి నిషేధింపబడినవి, ఈ సమయంలో ఈ థియేటర్ యొక్క కళా కార్యక్రమాలు వేగం పుంజుకున్నవి.[31] బాగ్దాద్ నగరంలో సాంస్కృతిక విద్య నందించే సంస్థలలో సంగీత అకాడెమీ, ఫైన్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్, సంగీతం, బాలే పాఠశాల, బాగ్దాద్ ముఖ్యమైనవి. బాగ్దాద్ నగరం అనేక సంగ్రహాలయాలకు కేంద్రం. వీటికి మంచి ఉదాహరణలు పురావస్తు (ఆర్టిక్రాఫ్ట్స్) సంగ్రహాలయము, ప్రాచీన నాగరికతలకు చెందిన పురావస్తువులు; అమెరికా సైన్యం బాగ్దాద్ లో ప్రవేశించిన వెనువెంటనే, వీటిలో అధిక భాగం చోరీకి గురయ్యాయి. During the ఇరాక్ ఆక్రమణ కాలంలో, ఇరాక్ రేడియో ("స్వాతంత్ర రేడియో") వార్తలు, వినోద కార్యక్రమాలు ప్రసారం చేసేది. ఇదేగాక "దిజ్లా" అనే ప్రైవేటు రేడియో కూడా మొదటి స్వతంత్ర రేడియోగా గుర్తింపు పొందినది. దీని కేంద్రం బాగ్దాదు పరిసరాలలో 'జామియా' వద్ద నున్నది. దీనిపై కూడా అనేక దాడులు జరిగినవి.[32]
ప్రదేశాలు , ప్రాచీన కట్టడాలు
[మార్చు]చూడదగ్గ ప్రదేశాలలో ఇరాక్ జాతీయ సంగ్రహాలయం ఒకటి, దీనిలోని అద్వితీయ సంగ్రహాలు 2003 నాటి దాడిలో లూటీ చేయబడ్డాయి. నేటి ఇరాకీ పార్టీల మధ్య ఈ సంగ్రహాలయపు శిథిలాలు చారిత్రక శిథిలాలుగా వుంచాలా లేదా తొలగించాలా అనే చర్చలు జరుగుచున్నవి. ఇరాక్ జాతీయ గ్రంథాలయం లోని వేలకొలదీ అమూల్యమైన అత్యంత ప్రాచీన వారసత్వ గ్రంథ, పత్రాల, రచనా సంపద అంతా ధ్వంసం చేయబడింది. ఈ దాడి ముస్లిం ధార్మిక, విజ్ఞాన కేంద్రాలపై చెంఘీజ్ ఖాన్ దాడిని గుర్తుకు తెస్తుంది. ఈ గ్రంథాలయపు ప్రధాన భవనం అగ్నికి ఆహుతి చేయబడింది. ఖాదిమియా లోని అల్ ఖాదిమైన్ ధార్మిక కేంద్రం అగ్నికి ఆహుతి చేయబడింది. అబ్బాసీయ కాలపు మదరసా అల్-ముస్తన్‌సిరియా, సరాయ్ భవనం మొదలగునవి, ఇలాగే నేలమట్టమయ్యాయి.
- బాగ్దాద్ టవర్ (సద్దాం టవర్ గా కూడా వ్యవహరిస్తారు): 1991 లో తయారైన ఈ టవర్, అమెరికా బాంబు దాడుల కారణంగా పాక్షికంగాఅ దెబ్బతిన్నది. ఈ టవర్ అత్యంత ఎత్తైన ప్రాంతపు టవర్. ఇక్కడి నుండి బాగ్దాదు నగరాన్నంతా వీక్షించవచ్చు.
- జద్రియా (జిస్ అబుల్ తబ్‌ఖైన్) లో గల రెండు లెవళ్ళ వంతెన.
- బాగ్దాద్ మధ్య భాగాన గల 'సహత్ అల్ తహ్రీర్' (విమోచనా కూడలి).
- సరాయ్ సౌఖ్
- బాగ్దాది సంగ్రహాలయము (మైనపు సంగ్రహాలయం)
- ముస్తాన్‌సిరియా పాఠశాల, 13వ శతాబ్దపు అబ్బాసీయ కట్టడం.
- అల్ మన్సూర్ ప్రాంతము లోని అల్-జారా తోట, బాగ్దాద్ ప్రధాన కేంద్రంలో యున్నది.
- కహ్రామనా, 40 దొంగల గుహలు.
- అల్ రషీద్ హోటల్
- అల్ జుంది అల్ మజ్‌హూల్ స్మారక కట్టడం. (అజ్ఞాత సైనికుడు).
- అల్ షహీద్ స్మారకం. ఈ స్మారకం ఇరాన్-ఇరాక్ యుద్ధం,లో మరణించిన సైనికుల జ్ఞాపకార్థం టైగ్రిస్ నది ఒడ్డుపై నిర్మింపబడింది.
- సైనిక పటాల పెరేడ్ కొరకు సద్దామ్ హుసేన్ నిర్మించిన రోడ్డు. దీనిపై విజయ హస్తాలు గల స్మారకం ఉంది. ఈ స్మారకం ఇరాన్-ఇరాక్ యుద్ధంలో లభించిన విజయానికి ప్రతీక అని భావిస్తారు..
-
బాగ్దాద్ ట్రైన్ స్టేషను 1959 (రైల్వేస్టేషను).
-
అమెరికా సైన్యపు హెలికాప్టర్, బాగ్దాద్ లోని టవర్ పై ఎగురుతున్నది.
బాగ్దాద్ జంతుప్రదర్శన శాల
[మార్చు]బాగ్దాద్ జంతుప్రదర్శన శాల మధ్య ప్రాచ్యం లోనే అతి పెద్ద ప్రదర్శన శాల. 2003 లో జరిగిన అమెరికా దాడులలో, ఈ ప్రదర్శన శాలలోని 650 నుండి 700 వరకు గల జంతువులలో కేవలం 35 జంతువులు మాత్రమే మిగిలాయి. కొన్ని దాడులలో చనిపోతే, కొన్ని ఆకలితో అలమటించే మనుషుల బారిన పడ్డాయి, మిగతావి ఆహారపానీయాలు లేక మరణించాయి. [33] బ్రతికి బయటపడ్డ జంతువులలో ఎలుగుబంట్లు, సింహాలు, పులులు ఉన్నాయి.[33] దక్షిణ ఆఫ్రికా లారెన్స్ ఆంథోని, కొందరు ఈ ప్రదర్శనశాలలోని జంతువుల పరిరక్షణా బాధ్యతలు చేపడుతున్నారు. చుట్టు ప్రక్కలా సంచరించే గాడిదలకూ సంరక్షిస్తున్నారు.[33][34] అనంతరం, అమెరికాకు చెందిన ఇంజనీరు పాల్ బ్రెమర్ ఈ జంతువుల సంరక్షణ కొరకు ఆదేశాలిచ్చి, ఈ ప్రదర్శనశాలకు తిరిగీ తెరిపించాడు.[33]
క్రీడలు
[మార్చు]ఇరాక్ లోని విజయవంతమైన ఫుట్ బాల్ టీంలలో బాగ్దాద్ టీం ఒకటి. పెద్ద టీంలకు ఉదాహరణ; అల్ ఖువా అల్ జావియా (ఎయిర్ ఫోర్స్), అల్ జౌరా, అల్ షుర్తా (పోలీస్), అల్ తాలబా (విద్యార్థులు). బాగ్దాద్ లో పెద్ద్ స్టేడియం అల్ షాబ్ స్టేడియం దీనిని 1966లో ప్రారంభించారు. ఇంకో స్టేడియం తయారవుచున్నది. ఈ నగరంలో గుర్రపు స్వారీ కూడా ఒక ప్రముఖ క్రీడ, రెండవ ప్రపంచ యుద్ధం కాలం నుండి ఇది ప్రసిద్ధిగాంచింది. ఇంకా అనేక జూద క్రీడలు ఇరాక్ లో సాధారణంగా కానవచ్చే క్రీడలు.
పునర్నిర్మాణ కార్యక్రమాలు
[మార్చు]దాదాపు ఇరాకీ పునర్నిర్మాణం ప్రయత్నాలు, పట్టణ ప్రాంతాలలో జరిగిన తీవ్ర నష్టాలను పూడ్చుటకు తయారు చేయబడినవి. ఆర్కిటెక్ట్, పట్టణ డిజైనర్ అయిన హిషామ్ అష్కూరి యొక్క బాగ్దాద్ పునరుజ్జీవన ప్రణాళిక, సింద్‌బాద్ హోటల్ కాంప్లెక్స్, కాన్ఫరెన్స్ సెంటర్ ప్రైవేటు రంగానికి ఇవ్వబడింది.[35]
బాగ్దాద్ ప్రధాన వీధులు
[మార్చు]- మూలము: stripes.com
- హైఫా వీధి
- హిల్లా రోడ్డు—దక్షిణం నుండి బాగ్దాదులోనికి యెర్మౌక్ గుండా పోతుంది.
- ఖలీఫాల వీధి—చారిత్రక మస్జిద్‌లు, చర్చీల ప్రదేశం.
- సదౌన్ వీధి -- విమోచన కూడలి నుండిమస్బాహ్ వరకు వ్యాపించి యున్నది.
- ముహమ్మద్ అల్ ఖాసిమ్ రహదారి near అజామియా
- అబూ నువాస్ వీధి -- టైగ్రిస్ నది ప్రక్కనుండి జమ్హూరియా వంతెన గుండా (14 జూలై) వేలాడే వంతెన వరకూ గలదు.
- డెమాస్కస్ వీధి -- డెమాస్కస్ కూడలి నుండి అంతర్జాతీయ విమానాశ్రయం రోడ్డు వరకూ పోతుంది.
- ముతనబ్బి వీధి—అనేక 'బాబ్'లు గల వీధి. 10వ శతాబ్దపు ఇరాకీ కవి అల్ బాబ్ పేరున గలవు.
- రాబియా వీధి
- అర్బతాష్ తమూజ్ వీధి (మొసూల్ వీధి)
- ముతానా అల్ షైబానీ వీధి
- బోర్ సయీద్ వీధి
- తౌరా వీధి
- అల్ కనాత్ వీధి—బాగ్దాదు ఉత్తరం నుండి దక్షిణం వరకు సాగుతుంది.
- అల్ ఖత్ అల్ సారియా - ముహమ్మద్ అల్ ఖాసిమ్ (అతి వేగం గల రోడ్డు) - బాగ్దాదు ఉత్తరం నుండి దక్షిణం వరకు సాగుతుంది.
- అల్ సినా వీధి (పరిశ్రమల వీధి) - సాంకేతిక విశ్వవిద్యాలయం గుండా - బాగ్దాద్ కంప్యూటర్ వాణిజ్య కేంద్రం వరకూ సాగుతుంది.
- అల్ నిదాల్ వీధి
- అల్ రషీద్ వీధి—నగర కేంద్రం, బాగ్దాద్.
- అల్ జమ్హూరియా వీధి—నగర కేంద్రం, బాగ్దాద్.
- ఫలస్తీన్ వీధి
- తారిఖ్ అల్ ముఅస్కర్ -- (అల్ రషీద్ క్యాంప్ రోడ్)
- మతార్ బాగ్దాద్ అల్ దాలి (విమానాశ్రయ రోడ్డు)
సోదర నగరాలు
[మార్చు]ఇవీ చూడండి
[మార్చు]- మన్సూర్ ఖలీఫా
- అబూ హనీఫా
- సద్దామ్ హుసేన్
- ఇరాక్ పునర్నిర్మాణము
- బాగ్దాద్ లో చూడదగిన ప్రదేశాలు
- 2016 మే 11 బాగ్దాద్ బాంబుదాడులు
బాగ్దాద్ ను మూలంగా చేసుకొని కొన్ని రచనలు, సినిమాలూ తయారయ్యాయి అవి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Estimates of total population differ substantially. The Encyclopædia Britannica gives a 2001 population of 4,950,000, the 2006 Lancet Report states a population of 6,554,126 in 2004.
- "Baghdad." Encyclopædia Britannica. 2006. Encyclopædia Britannica Online. 13 November, 2006.
- "Mortality after the 2003 invasion of Iraq: a cross-sectional cluster sample survey" PDF (242 KiB). By Gilbert Burnham, Riyadh Lafta, Shannon Doocy, and Les Roberts. [[:en:The Lancet|]], October 11, 2006
- Baghdad from GlobalSecurity.org
- ↑ 2.0 2.1 "Cities and urban areas in Iraq with population over 100,000", Mongabay.com
- ↑ Page 563 of the First Encyclopaedia of Islam edited by M. Th. (Martijn Theodor) Houtsma
- ↑ Encyclopaedia of Islam pg. 895
- ↑ Unus, Nada “Baghdad”
- ↑ Times History of the World, Times Books, London 2000
- ↑ Wiet, Gastron. Baghdad: Metropolis of the Abbasid Caliphate. Univ. of Oklahoma Press,1971.
- ↑ Wiet, pg. 13
- ↑ Wiet, pg. 12
- ↑ “Yakut: Baghdad under the Abbasids, c. 1000CE”
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2003-03-25. Retrieved 2008-11-15.
- ↑ Wiet, pg. 14
- ↑ Wiet, pg. 15
- ↑ Atlas of the Medieval World pg. 78
- ↑ Atlas of the Medieval World pg. 79
- ↑ "Largest Cities Through History". Archived from the original on 2016-08-18. Retrieved 2008-11-15.
- ↑ Matt T. Rosenberg, Largest Cities Through History. Archived 2016-08-18 at the Wayback Machine
- ↑ Atlas of the Medieval World pg. 170
- ↑ Rajiv Chandrasekaran, in his book "Imperial Life in the Emerald City: Inside Iraq's Green Zone (Vintage Books 2006), cites the day as June 28, 2004, at 10:00 AM, with Viceroy Bremer declaring a dissolution and presenting documents to that affect to Prime Minster Ayad Allawi two days before the announced date of June 30th. (p.329)
- ↑ USATODAY.com - Poll: Iraqis out of patience
- ↑ "Afp.google.com, First snow for 100 years falls on Baghdad". Archived from the original on 2007-06-09. Retrieved 2007-06-09.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-06-05. Retrieved 2008-11-15.
- ↑ DefenseLink News Article: Soldier Helps to Form Democracy in Baghdad
- ↑ "Zafaraniya Residents Get Water Project Update - DefendAmerica News Article". Archived from the original on 2008-12-28. Retrieved 2008-11-15.
- ↑ http://www.usatoday.com/news/world/iraq/2006-03-26-councils-work_x.htm
- ↑ "DefendAmerica News - Article". Archived from the original on 2008-12-27. Retrieved 2008-11-15.
- ↑ Democracy from scratch | csmonitor.com
- ↑ "Leaders Highlight Successes of Baghdad Operation - DefendAmerica News Article". Archived from the original on 2008-12-28. Retrieved 2008-11-15.
- ↑ "NBC 6 News - 1st Cav Headlines". Archived from the original on 2007-12-12. Retrieved 2008-11-15.
- ↑ "Five women confront a new Iraq | csmonitor.com". Archived from the original on 2009-08-28. Retrieved 2008-11-15.
- ↑ "In Baghdad, Art Thrives As War Hovers". Archived from the original on 2010-06-27. Retrieved 2008-11-15.
- ↑ "Gunmen storm independent radio station in latest attack against media in Iraq - International Herald Tribune". Archived from the original on 2007-05-09. Retrieved 2007-05-09.
- ↑ 33.0 33.1 33.2 33.3 "The Choice, featuring Lawrence Anthony". BBC radio 4. 2007-09-04. Retrieved 2007-09-04.
- ↑ Anthony, Lawrence; Spence Grayham (2007-06-03). Babylon's Ark; The Incredible Wartime Rescue of the Baghdad Zoo. Thomas Dunne Books. ISBN 0312358326.
- ↑ "ARCADD". Archived from the original on 2008-12-20. Retrieved 2008-11-15.
- ↑ Iraqi capital of Baghdad twinned with North Yemen counterpart of Sanaa [Yemen news items 1989:Twinning]
- ↑ "Twinning the Cities". City of Beirut. Archived from the original on 2008-02-21. Retrieved 2008-01-13.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-08-28. Retrieved 2008-11-15.
ఇతర పఠనాలు
[మార్చు]- By Desert Ways to Baghdad Archived 2005-04-02 at the Wayback Machine, by Louisa Jebb (Mrs. Roland Wilkins), 1908 (1909 ed) (a searchable facsimile at the University of Georgia Libraries; DjVu & layered PDF PDF (11.3 MiB) format)
- A Dweller in Mesopotamia Archived 2005-05-25 at the Wayback Machine, being the adventures of an official artist in the Garden of Eden, by Donald Maxwell, 1921 (a searchable facsimile at the University of Georgia Libraries; DjVu & layered PDF PDF (7.53 MiB) format)
బయటి లింకులు
[మార్చు]- Map of Baghdad Archived 2009-09-30 at the Wayback Machine
- Iraq Image - Baghdad Satellite Observation
- Interactive map
- Iraq - Urban Society
- Envisioning Reconstruction In Iraq
- Description of the original layout of Baghdad Archived 2006-02-12 at the Wayback Machine
- Baghdad Renaissance Plan
- UAE Investors Keen On Taking Part In Baghdad Renaissance Project
- Man With A Plan: Hisham Ashkouri
- Renaissance Plan In The News
- ARCADD, Inc.
- Kabul, City of Light Development
- Kabul - City of Light, 9 Billion dollar modern urban development project
- Sindbad Hotel Complex and Conference Centre Archived 2008-09-07 at the Wayback Machine
- Song - Birds Over Baghdad
- Electronic Iraq