సద్దామ్ హుసేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సద్దామ్ హుసేన్
Iraq, Saddam Hussein (222).jpg
సద్దామ్ హుసేన్ ముఖచిత్రం
జననంసద్దామ్ హుసేన్ అబ్ద్ అల్-మజీద్ అల్-తిక్‌రితి
28 ఏప్రిల్, 1937
అల్-అజ్వా, ఇరాక్
మరణం30 డిసెంబరు, 2006
ఖదిమియా, బాగ్దాద్, ఇరాక్
మరణ కారణంఉరి
వృత్తిప్రధాన మంత్రి
ప్రసిద్ధిఇరాక్ ప్రధాన మంత్రి
పదవీ కాలం16 జులై, 1979 నుండి 9 ఏప్రిల్, 2003
రాజకీయ పార్టీహిజ్బ్ అల్-బా'అత్ అల్-అరబీ అల్-ఇష్‌తిరాకీ
మతంసున్ని ఇస్లాం
పిల్లలుఉదయ్ హుసేన్
క్యుసే హుసేన్
రగద్ హుసేన్
రానా
హలా హుసేన్


సద్దామ్ హుసేన్ ఇరాక్ దేశ మాజీ అధ్యక్షుడు, 1979 జూలై 16 నుండి 2003 ఏప్రిల్ 9 వరకు ఇరాక్ ను అప్రతిహతంగా పాలించిన సద్దామ్, 2003 లో అమెరికా ఆధ్వర్యంలో జరిగిన ఇరాక్ ఆక్రమణలో పదవి కోల్పోయాడు. యుద్ధానంతరం అమెరికా సేనలకు బందీగా పట్టుబడి, ఇరాక్ న్యాయస్థానంలో విచారణ తరువాత 2006 డిసెంబర్ 30 న ఉరితీయబడ్డాడు.

పరిపాలన[మార్చు]

సద్దాం హుస్సేన్ పరిపాలన కాలంలో ఇరాక్ ను ఆధునీకరణ వైపు నడిపించడం జరిగింది. విదేశీ యాజమాన్యంలో ఉన్న ఇరాక్ ఆయిల్ కంపెనీ వంటి కంపెనీలని జాతీయికరించడం వల్ల సామ్రాజ్యవాదులు సద్దాం హుస్సేన్ కు వ్యతిరేకంగా పావులు కదపడం ప్రారంభించారు. సద్దాం హుస్సేన్ ఇరాక్ లో మైనారిటీ అయిన సున్నీ ముస్లిం శాఖకు చెందినవాడు కావడం వల్ల సద్దాంకు మెజారిటీ అయిన షియాల నుంచి కూడా వ్యతిరేకత ఎదురైనది. మరో వైపు ఇరాక్ కమ్యూనిస్ట్ పార్టీ, కుర్ద్ తిరుగుబాటుదారులు కూడా సద్దాంకు వ్యతిరేకంగా పనిచేశారు. ఇతన్ని వ్యతిరేకించిన వారందరినీ తీవ్రంగా అణచి వెయ్యడానికి ప్రయత్నించాడు. కానీ ఇరాక్ యుద్ధ సమయంలో మాత్రం ఇరాక్ కమ్యూనిస్ట్ పార్టీ అమెరికా సామ్రాజ్యవాదులకి వ్యతిరేకంగా సద్దాం హుస్సేన్ కు మద్దతు ఇచ్చింది. 2003 ఏప్రిల్ లో సద్దాం హుస్సేన్ తో పాటు అతని ప్రధాన అనుచరుడు మిఖాయిల్ యూహాన్నాని కూడా అమెరికా సైనికులు నిర్భందించారు.