Jump to content

కార్ల్ విల్‌హెల్మ్ షీలే

వికీపీడియా నుండి
కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే
కార్ల్ షీలే
జననం1742 , డిసెంబరు 9
స్ట్రాల్సండ్, స్వీడిష్ పొమొరానియా,(ప్రస్తుతం జర్మనీ)
మరణం1786 , మే 21 (వయస్సు 43)
కోపింగ్, స్వీడన్.
జాతీయతజర్మన్ - స్వీడిష్
రంగములురసాయన శాస్త్రము
ప్రసిద్ధిఆక్సిజన్ ఆవిష్కరణ, మాలిబ్డనం,టంగస్టన్ , క్లోరిన్ మూలకాల ఆవిష్కరణ.

కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే ( 1742-1786) జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త. ఐజాక్ అసిమోవ్ అనే శాస్త్రవేత్త అతనిని "హార్డ్ లక్ షీలే" అని పిలిచేవాడు. ఎందువల్లనంటే, ఆయన అనేక రసాయన శాస్త్ర ఆవిష్కరణలను, ఇతర శాస్త్రవేత్తలు ప్రచురించక ముందే తెలియజేశాడు. ఉదాహరణకు ఆక్సిజన్ అనే మూలకం గూర్చి జోసెఫ్ ప్రీస్ట్‌లీ తన పరిశోధనను ప్రచురించక ముందే షీలే తెలియజేయటం. మాలిబ్డనం, టంగస్టన్, బేరియం, హైడ్రోజన్, క్లోరిన్ వంటి మూలకాలను హంఫ్రీ డేవీ, యితరులు తెలియజేయక ముందే తెలియజేయటం.

షీలే స్ట్రాల్సండ్, స్వీడిష్ పొమెరానియాలో జన్మించాడు. అతని తండ్రి జోచిమ్‌ క్రిస్టియన్ షీలే. అతని తండ్రి ఒక జర్మన్ కుటుంబానికి చెందిన వర్తకుడు. షీలే తన 14 వ సంవత్సరంలో "గూటెన్‌బర్గ్"లో గల ఔషధతయారీ పరిశ్రమలో ఒక అప్రెంటిస్ గా "మార్టిన్ ఆండ్రియాస్ బచ్"తో కలసి చేరాడు.[1] అచట 8 సంవత్సరాల వరకు ఉన్నాడు. ఆ తర్వాత ఒక వైద్యుని వద్ద సహాయకునిగా ఉన్నాడు. తర్వాత అతడు స్టాక్ హోంలో ఔషధ నిర్మాతగా ఉన్నాడు. 1770 నుండి 1775 వరకు 'ఉప్ప్సలా' లో, తరువాత కోపెన్ లో ఉన్నాడు. షీలే తన జీవితంలో ఎక్కువకాలం జర్మన్ మాట్లాడుటకు ఇష్టపడేవాడు. జర్మన్ భాషను స్వీడిష్ ఔషధ శాస్త్రవేత్తలతో కూడా మాట్లాడేవాడు.[1]

షీలే కన్నా ముందు ఉన్న సిద్ధాంతములు

[మార్చు]

1770 లలో ఆయన యుక్త వయసులో ఉన్నపుడు వాయువులపై గల ప్రఖ్యాత సిద్ధాంతమైన "ప్లోజిస్టాన్" సిద్ధాంతం గూర్చి తెలుసుకున్నాడు. ఈ సిద్ధాంతం ప్రకారం మంట వెలువడుటకు గల కారణం ఏదైనా, పదార్థంలో గల ద్రవ్యం మండినపుడు వస్తుంది. ఆ ద్రవ్యం పూర్తిగా లేనపుడు మంట ఆగి దహన ప్రక్రియ ఆగిపోతుంది. షీలే ఆక్సిజన్ కనుగొన్న తరువాత దానిని "ఫైర్ ఎయిర్"గా పిలిచాడు. ఎందువలనంటే ఆ వాయువు దహన ప్రక్రియకు సహాయపడుతుంది. కానీ ఆయన ఆక్సిజన్ గూర్చి ప్లోజిస్టాన్ సిద్ధాంతంలో పదాలను ఉపయోగించి వివరించాడు ఎందుకంటే ఆయన తన ఆవిష్కరణ ప్లోజిస్టాన్ సిద్ధాంతాన్ని ఋజువు చేస్తుందని నమ్మాడు. షీలే ఆక్సిజన్ తయారుచేయుటకు ముందుగా గాలిని గూర్చి అధ్యయనం చేశాడు. గాలి అనునది పర్యావరణంలో తయారయిన ఒక మూలకం అనీ, అది రసాయన చర్యలు జరుపుతుందని, కానీ అది రసాయన చర్యలలో పాల్గొనదని ఆలోచించసాగాడు. షీలే గాలిలో రెండు రకాల వాయువులుంటాయని అవి మండుటకు దోహదపడే గాలి, మలిన గాలి అని (ఫైర్ ఎయిర్, ఫోల్ ఎయిర్) పరిశోధన చేశాడు. ఆయన కొన్ని రసాయన పదార్థములైన పొటాషియం నైట్రేట్, మాంగనీస్ డై ఆక్సైడ్, భార లోహ నైట్రేట్లను, సిల్వర్ కార్బొనేట్, మెర్క్యురిక్ ఆక్సైడ్ లను మండించి కొన్ని ప్రయోగములు నిర్వహించాడు. పై ప్రయోగాలలో ఆయన ఒకే ధర్మములు కల వాయువును గుర్తించాడు. అతడు ఉష్ణం వెలువడే రసాయనచర్యలలో ప్లోజిస్టాన్ తో కలిసే ఒక వాయువు ఉన్నదని నమ్మాడు. అది పైర్ ఎయిర్ అని ఊహించాడు. ఆయన పరిశోధనలను 1775 లో Chemische Abhandlung von der Luft und dem Feuerగా ప్రచురించుటకు ఇచ్చాడు. కానీ అది 1777 వరకు ప్రచురితం కాలేదు. ఆ సమయంలో జోసెఫ్ ప్రీస్ట్‌లీ, లావోయిజర్లు ఆక్సిజన్, ప్లోజిస్టాన్ సిద్ధాంతం గూర్చి వారి ప్రయోగ వివరాలను ప్రచురించారు. 1780 లో మొదటి ఆంగ్ల పత్రికలో Chemical Observation and Experiments on Air and Fire అనే అంశం ప్రచురితమైనది. అందులో ఉపోద్ఘాతంగా "Chemical Treatise on Air and Fire" అని వ్రాయబడింది.[2]

ప్లోజిస్టాన్ సిద్ధాంన్ని ఋజువు పరచుట

[మార్చు]
జోసెఫ్ ప్రీస్ట్‌లీ

వైజ్ఞానిక వాదులు ప్లోజిస్టాన్ సిద్ధాంతాన్ని వివరించే కార్ల్ షీలే పాత్రను ప్రశ్నించలేదు. అనేక మంది శాస్త్రవేత్తలు జోసెఫ్ ప్రీస్ట్‌లీ, జోసెఫ్ బ్లాక్, ఆంటోనీ లావోయిజర్ ల కన్నా ముందుగా షీలే మొట్టమొదట ఆక్సిజన్ ఆవిష్కరణ చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. వాస్తవానికి షీలే ఆక్సిజన్ ను జోసెఫ్ ప్రీస్ట్‌లీ కంటే మూడు సంవత్సరాల ముందుగా కనుగొన్నాడు. కనీసం లావోయిజర్ కన్నా కొన్ని సంవత్సరాల ముందు కనుగొన్నాడు. ప్రిస్టిలీ బహుశా ఆక్సిజన్ ను స్వతహాగా తయారుచేసి యుండడు, షీలే యొక్క సిద్ధాతం పై ఆధారపడి తయారు చేసి ఉంటాడు. లావొయిజర్, షీలే లను పోల్చినపుడు, షీలే ఆసక్తిదాయకమైన ఆవిష్కరణను కనుగొనుటకు సరియైన ప్రయోగశాలను వినియోగించలేదని తెలుస్తుంది. కానీ లావోయిజర్, ప్రిస్టిలీ, షీలే, యితరుల పరిశోధనలు రసాయన శాస్త్రములో సరైన విధానాలను ప్రామాణీకరించడంలో దోహదపడ్డాయి.

"టోర్‌బెర్న్ ఓలోఫ్ బెర్జ్‌మాన్" యొక్క ఫిర్యాదు ఫలితంగా షీలే అధ్యయనం ఫలితమైన వాయువు ఆక్సిజన్ గా మొదట పరిగణింపబడలేదు. బెర్జ్‌మాన్ అనే వ్యక్తి "సాల్ట్‌ పీటర్" అనే రసాయనం ఆమ్లముతో చర్య జరుపునపుడు ఎరుపు రంగు ఆవిర్లు వచ్చుచున్నవని షీలేకు తెలియజేశాడు. షీలే వెంటనే దానికి వివరణను యిస్తూ మాంగనీస్ డై అక్సైడ్ ధర్మాలను విశ్లేషించాడు. మాంగనీస్ డై ఆక్సైడ్ పై పరిశోధన వల్ల షీలే "ఫైర్ ఎయిర్" యొక్క భావనలను విస్తృతపరచాడు. తుదకు మెర్యురిక్ ఆక్సైడ్, సిల్వర్ కార్బొనేట్, మాంగనీస్ నైట్రేట్, యితర నైట్రేట్ లవణాలను మండించినపుడు ఆక్సిజన్ వెలువడునని నిరూపించాడు. షీలే, ఆయన ప్రయోగముల ఫలితాలను లావొయిజర్ కు లేఖ ద్వారా తెలియజేశాడు.

Pyrolusite or MnO2.

కొత్త మూలకాలు , సమ్మేళనాలు

[మార్చు]

ఆక్సిజన్ ను ఆవిష్కరించడంతో పాటు షీలే, ఇతర మూలకాలైన బేరియం (1774), మాంగనీస్ (1774), మాలిబ్డనం (1778),, టంగస్టన్ (1781) ల ఆవిష్కరణలు షీలేకు ఉమ్మడి గుర్తింపునిచ్చాయి. అదేవిధంగా షీలే మరికొన్ని రసాయన పదార్థాలు అయిన సిట్రిక్ ఆమ్లము, లాక్టిక్ ఆమ్లము, హైడ్రోజన్ సైనైడ్ (ప్రూసిక్ ఆమ్లం యొక్క జలద్రావణం), హైడ్రోజన్ ప్లోరైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ లను కూడా కనుగొన్నాడు. వీటికి తోడు షీలే "పాశ్చురైజేషన్"కు సమానమైన విధానాన్ని కూడా కనుగొన్నాడు. ద్రవ్యరాశిని ఉత్పత్తిచేసే పాస్ఫరస్ ను 1769 లో కనుగొన్నాడు. ఇది అగ్గిపెట్టెల తయారీలో ఉపయోగపడే ముఖ్యమైన పదార్థము.

Chlorine gas.
Statue of Scheele in Köping.

షీలే 1774 లో అతి ముఖ్యమైన ఆవిష్కరణను చేశాడు. అది క్లోరిన్ వాయువు యొక్క ఆవిష్కరణ. ఆయన స్నేహితుడైన "జొహన్ గొటిబ్ గాన్" ఆయనకు ఒక పదార్థాన్ని యిచ్చాడు. అది "పైరోల్యూసైట్" (మలిన మాంగనీస్ డై ఆక్సైడ్). దీనిలో గల అంశములైన లైమ్‌, సిలికా, ఇనుము లను గుర్తించాడు. కానీ అదనంగా గల అంశీభూతాన్ని గుర్తించలేకపోయాడు (అది మాంగనీస్). ఆయన పైరోల్యూసైట్ ను హైడ్రోక్లోరికామ్లంలో వేడి సాండ్ బాట్ చేసినపుడు పసుపు-ఆకుపచ్చ గల ఘాటైన వాసన గల వాయువు వెలువడినట్లు గుర్తించాడు. ఆ వాయువు ఖాళీ సీసాలో అడుగుకు చేరుకుంటుందనీ, అది గాలికంటే తేలికైనదని గుర్తించాడు. ఆ వాయువు నీటిలో కరుగదని, అది బాటిల్ కార్క్ లను పసుపురంగుగా మార్చుతుందనీ, అది తడిలో రంగులను తొలగిస్తుందనీ (విరంజనకారి), నీలి లిట్మస్ ను ఎరుపుగా మార్చుతున్నదని గుర్తించాడు. ఆయన బ్లీచింగ్ ధర్మములు కలిగిన ఈ వాయువునకు "డిఫ్లోజిస్టికాటెడ్ హైడ్రోక్లోరిక్ ఆసిడ్" అని నామకరణం చేశాడు. ఆ తరువాత హంఫ్రీ డేవీ దానికి క్లోరిన్గా నామకరణం చేశాడు.

మరణం

[మార్చు]

భార లోహాలతో చర్యలు జరిగేటపుడు షీలే ప్రయోగములు చేయునపుడు వెలువడే క్రియా జన్యాలు ప్రమాదకరమైనవి,, అపాయకరమైనవి వెలువడినవి. షీలేకు ఆయన కనుగొన్న పదార్థములు, వాటి నుండి యేర్పడిన పదార్థములను వాసన, రుచి చూసే చెడు గుణం ఉంది.[3] మెర్యురీ, లెడ్, వాటి సంయోగ పదార్థములు, కొన్ని ఇతర పదార్థముల యొక్క ప్రమాదకర ఫలితాల ఫలితంగా షీలే కోపెన్ నగరంలో 1786, మే 21లో మరణించాడు. ఆయన మరణించుటకు రెండు రోజుల ముందు ఒక విధవ యైన "ఫోల్"ను వివాహమాడాడు.

సూచికలు

[మార్చు]
  1. 1.0 1.1 Fors, Hjalmar. 2008. Stepping through Science’s Door: C. W. Scheele, from Pharmacist’s Apprentice to Man of Science. Ambix 55: 29-49
  2. p101, A Source Book in Chemistry, 1400-1900, Henry Marshall Leicester, Herbert S. Klickstein - 1969
  3. Asimov, Isaac (1966). The Noble Gases. ISBN 978-0465051298

మూలాలు

[మార్చు]
  • Abbott, David. (1983). Biographical Dictionary of Scientists: Chemists. New York: Peter Bedrick Books. pp. 126–127. ISBN 0-911745-81-5.
  • Bell, Madison S. (2005). Lavoisier in the Year One. New York: W.W. Norton & Company, Inc. ISBN 0-393-05155-2.
  • Cardwell, D.S.L. (1971). From Watt to Clausius: The Rise of Thermodynamics in the Early Industrial Age. Heinemann: London. pp. 60–61. ISBN 0-435-54150-1.
  • Dobbin, L. (trans.) (1931). Collected Papers of Carl Wilhelm Scheele. G. Bell & Sons, London.
  • Farber, Eduard, ed. (1961). Great Chemists. New York: Interscience Publishers. pp. 255–261.
  • Greenberg, Arthur. (2000). A Chemical History Tour: Picturing Chemistry from Alchemy to Modern Molecular Science. Hoboken: John Wiley & Sons, Inc. pp. 135–137. ISBN 0-471-35408-2.
  • Greenberg, Arthur. (2003). The Art of Chemistry: Myths, Medicines and Materials. Hoboken: John Wiley & Sons, Inc. pp. 161–166. ISBN 0-471-07180-3.
  • Schofield, Robert E (2004). The Enlightened Joseph Priestley: A Study of His Life and Work from 1773-1804. Pennsylvania: The Pennsylvania State University Press. ISBN 0-271-02459-3.
  • Shectman (2003). Groundbreaking Scientific Experiments, Inventions, and Discoveries of the 18th Century. Connecticut: Greenwood Press. ISBN 0-313-32015-2.
  • Sootin, Harry (1960). 12 Pioneers of Science. New York: Vanguard Press.

ఇతర లంకెలు

[మార్చు]