వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2025 01వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)

శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా లోని అన్నవరం పట్టణంలో ఉన్న హిందూ-వైష్ణవ దేవాలయం. ఈ ఆలయం రత్నగిరి అనే కొండపై ఉంది. విష్ణువు అవతారమైన వీర వెంకట సత్యనారాయణకు ఈ ఆలయం అంకితం చేయబడింది. స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి, మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామిగా వెలసే రత్నగిరి కొండ, లేదా రత్నాచలం కొండగా మారుతాడు. తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దూరు ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు ఇతనికి, రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియ, మఖ నక్షత్రం, గురువారం నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారం ప్రతిష్టించి సేవించుం" అని చెప్పి మాయమయ్యారని కథనం.
(ఇంకా…)