చంద్రయాన్-3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంద్రయాన్-3
చంద్రయాన్-3 ఇంటెగ్రేటెడ్ మాడ్యూలు
మిషన్ రకంల్యాండరు, రోవరు, ప్రొపల్షన్ మాడ్యూలు
ఆపరేటర్భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)
COSPAR ID2023-098A Edit this at Wikidata
SATCAT no.57320Edit this on Wikidata
మిషన్ వ్యవధి
 • విక్రమ్ ల్యాండరు: ≤ 14 రోజులు (ప్రణాళిక)
  * ప్రజ్ఞాన్ రోవరు: ≤ 14 రోజులు (ప్రణాళిక)
అంతరిక్ష నౌక లక్షణాలు
బస్చంద్రయాన్
తయారీదారుడుఇస్రో
పే లోడ్ ద్రవ్యరాశిప్రొపల్షన్ మాడ్యూలు: 2148 కె.జి
ల్యాండర్ మాడ్యూలు (విక్రమ్): 1752 కెజి రోవరుతో సహా (ప్రజ్ఞాన్) 26 కెజి
మొత్తం: 3900 కెజి
శక్తిప్రొపల్షన్ మాడ్యూలు: 758 W ల్యాండర్ మాడ్యూలు (విక్రమ్): 738W, WS with Bias రోవరు: 50W
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ2023-07-14 (2023-07-14) 14:35 IST, (9:05 UTC)[1]
రాకెట్LVM3 M4
లాంచ్ సైట్సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
కాంట్రాక్టర్ఇస్రో
moon ల్యాండర్
అంతరిక్ష నౌక భాగంరోవర్
ల్యాండింగ్ తేదీ23 August 2023[2]
ల్యాండింగ్ సైట్69.367621 S, 32.348126 E[3]
చంద్ర ధ్రువ పరిశోధన యాత్ర →
 
చంద్రయాన్ -3, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్ర యాత్ర. భారత చంద్రయాన్ కార్యక్రమంలో ఇది మూడవది.[4] చంద్రయాన్-2లో లాగానే ఇందులో కూడా ఒక రోవరు, ఒక ల్యాండరూ ఉన్నాయి. కానీ ఇందులో ఆర్బిటరు లేదు. దాని ప్రొపల్షను మాడ్యూలే రిలే ఉపగ్రహం లాగా పనిచేస్తుంది. ఈ ప్రొపల్షను మాడ్యూలు చంద్రుని చుట్టూ 100 కి.మీ. కక్ష్య వరకూ ల్యాండరును రోవరునూ తీసుకుపోతుంది.[5][6]
ప్రొపల్షను మాడ్యూలులో రోవరు ల్యాండర్లతో పాటు స్పెక్ట్రో పోలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (SHAPE) అనే పేలోడును కూడా పంపించారు. ఇది చంద్రుని కక్ష్య నుండి భూమిని పరిశీలిస్తుంది.
చంద్రయాన్-2 ప్రయోగంలో చంద్రుని కక్ష్య లోకి విజయవంతంగా ప్రవేశించాక, ప్రయోగాంతంలో సాఫ్ట్‌వేరు లోపం కారణంగా ల్యాండరు మృదువుగా దిగక వైఫల్యం చెందింది. ఆ తరువాత ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు.[7]
చంద్రయాన్ 3 ప్రయోగం 2023 జూలై 14 న మధ్యాహ్నం 2:35 గంటలకు జరిగింది. శ్రీహరికోట, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం లోని రెండవ ప్రయోగ వేదిక నుండి దీన్ని ఎల్‌విఎమ్-ఎమ్4 వాహక నౌక ద్వారా ప్రయోగించారు.[8] చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ 2023 ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో సురక్షితంగా సాఫ్ట్ ల్యాండ్ చేసింది.[9]
చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో 2023 ఆగష్టు 26న దేశ ప్రధాని నరేంద్రమోడి బెంగళూరుకు చేరుకుని పీణ్యలోని ఇస్రో కేంద్రంలో శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రయాన్‌ - 3 దిగిన ప్రదేశానికి శివశక్తి అని నామకరణం చేయడంతో పాటు ఇకపై ప్రతియేటా ఈ రోజు (ఆగష్టు 23)ని జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించారు.[10]

నేపథ్యం[మార్చు]

చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ను ప్రదర్శించడానికి చంద్రయాన్-2 కార్యక్రమంలో, ఇస్రో ఒక ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌తో కూడిన చంద్రయాన్ నౌకను లాంచ్ వెహికల్ మార్క్-3 (LVM 3) వాహనంపై ప్రయోగించింది. ప్రజ్ఞాన్ రోవర్‌ను మోహరించేందుకు గాను ల్యాండర్, 2019 సెప్టెంబరులో చంద్రుని ఉపరితలంపై దిగేలా ప్రణాళిక వేసారు.[11][12]
2025 లో ఇస్రో, జపాన్‌ సహకారంతో చంద్రుని దక్షిణ ధ్రువం పైకి యాత్ర చేసే ప్రతిపాదన గురించి నివేదికలు వెలువడ్డాయి. దీనిలో భారతదేశం తన వంతుగా ల్యాండర్‌ను అందజేస్తుంది. జపాన్ లాంచర్, రోవర్ రెండింటినీ అందిస్తుంది. ఆ యాత్రలో సైట్ నమూనాలను సేకరించడం, చంద్రునిపై రాత్రివేళ మనుగడ సాగించేందుకు సంబంధించిన సాంకేతికతలు ఉండవచ్చు.[13][14]
అయితే, చంద్రయాన్-2 లో విక్రమ్ ల్యాండర్ విఫలమవడంతో 2025 లో జపాన్‌ భాగస్వామ్యంతో తలపెట్టిన చంద్ర ధ్రువ యాత్ర కోసం అవసరమైన ల్యాండింగ్ సామర్థ్యాలను ప్రదర్శించడానికి మరొక చంద్రయాత్ర చేపట్టవలసి వచ్చింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) తో కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం, క్లిష్టమైన యాత్ర కార్యకలాపాలలో వారి యూరోపియన్ స్పేస్ ట్రాకింగ్ (ESTRACK) మద్దతు ఇస్తుంది.[15]

ఉద్దేశాలు[మార్చు]

చంద్రయాన్-3 మిషన్ కోసం ఇస్రో మూడు ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకుంది. అవి:

 1. చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా, మృదువుగా ల్యాండింగు చేయడం.
 2. చంద్రునిపై రోవర్ సంచరించే సామర్థ్యాలను గమనించడం, ప్రదర్శించడం
 3. చంద్రుని కూర్పును బాగా అర్థం చేసుకోవడానికి, చంద్రుని ఉపరితలంపై లభ్యమయ్యే రసాయనాలు, సహజ మూలకాలు, నేల, నీరు మొదలైన వాటిపై అక్కడే శాస్త్రీయ ప్రయోగాలు, పరిశీలనలు చేయడం. రెండు గ్రహాల మధ్య యాత్రలు చేసేందుకు అవసరమైన కొత్త టెక్నాలజీల అభివృద్ధి, ప్రదర్శన.[16]

రూపకల్పన[మార్చు]

చంద్రయాన్-3 లో 3 ముఖ్యమైన భాగాలున్నాయి

ప్రొపల్షన్ మాడ్యూలు[మార్చు]

ప్రొపల్షన్ మాడ్యూలు, ల్యాండరు, రోవరులను 100 కి.మీ చంద్ర కక్ష్య వరకు తీసుకువెళుతుంది. ఇది ఒక వైపున పెద్ద సోలార్ ప్యానెల్‌తో కూడిన పెట్టె లాంటి నిర్మాణం. పైన ఉన్న పెద్ద స్థూపం (ఇంటర్‌మోడ్యులర్ అడాప్టర్ కోన్) ల్యాండర్‌కు మౌంటు స్ట్రక్చర్‌గా పనిచేస్తుంది. చంద్ర కక్ష్య నుండి భూమి స్పెక్ట్రల్, పోలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేసే fస్పెక్ట్రో-పోలారిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్) అనే పేలోడ్‌ కూడా మాడ్యూలులో ఉంటుంది.[6][17]

ల్యాండరు[మార్చు]

చంద్రునిపై మృదువుగా దిగేది ల్యాండరే. ఇది కూడా పెట్టె ఆకారంలో ఉంటుంది, నాలుగు ల్యాండింగ్ కాళ్లు, ఒక్కొక్కటి 800 న్యూటన్‌ల థ్రస్టునిచ్చే నాలుగు ల్యాండింగ్ థ్రస్టర్‌లు ఉంటాయి. ఇది, రోవరుతో పాటు అక్కడికక్కడే విశ్లేషణ చేసే వివిధ శాస్త్రీయ పరికరాలను తీసుకువెళ్ళింది.
చంద్రయాన్-2లో లాగా కాకుండా, చంద్రయాన్-3 ల్యాండరులో నాలుగు ఇంజన్‌లు మాత్రమే ఉన్నాయి.[18] చంద్రయాన్-2 లోని విక్రమ్‌లో ఐదు 800 న్యూటన్‌ల ఇంజన్‌లు, ఐదవది కేంద్రంగా స్థిర థ్రస్ట్‌తో అమర్చబడి ఉంది. అదనంగా, చంద్రయాన్-3 ల్యాండర్‌లో లేజర్ డాప్లర్ వెలోసిమీటర్ (LDV) ఉంది.[19] చంద్రయాన్-2 తో పోలిస్తే, చంద్రయాన్-3 కాళ్లు మరింత బలిష్టంగా చేసారు.

ల్యాండరులో మూడు పేలోడ్‌లను పంపించారు:

 • చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ (ChaSTE): ఇది చంద్రుని ఉపరితలపు ఉష్ణ వాహకతను, ఉష్ణోగ్రతనూ కొలుస్తుంది.
 • లూనార్ సీస్మిక్ యాక్టివిటీ కోసం పరికరం (ILSA): ఇది ల్యాండింగ్ స్థలం చుట్టూ భూకంపనలను కొలుస్తుంది.
 • లాంగ్‌ముయిర్ ప్రోబ్ (LP): ఇది ప్లాస్మా సాంద్రతను, దాని వైవిధ్యాలనూ అంచనా వేస్తుంది.

రోవరు[మార్చు]

రోవరు, చంద్రుని ఉపరితలంపై ప్రయాణించి, నమూనాలను సేకరించి, చంద్రుని భౌగోళిక, రసాయన కూర్పును విశ్లేషించే ఒక మొబైల్ ప్రయోగశాల. ఇది ఆరు చక్రాలు (బోగీ వీల్‌లు) కలిగిన దీర్ఘచతురస్రాకార చట్రం.[20]

రోవరు విశేషాలు:

 • ఆరు చక్రాల డిజైన్
 • 26 కిలోగ్రాముల బరువు (57 పౌండ్లు)
 • 500 మీటర్ల పరిధి (1,640 అడుగులు)
 • కెమెరాలు, స్పెక్ట్రోమీటర్లు, డ్రిల్‌తో సహా శాస్త్రీయ పరికరాలు
 • ఒక చాంద్రమాన రోజు (14 భూమి రోజులు) ఆశించిన జీవితకాలం
 • భారతదేశంలోని ల్యాండర్, గ్రౌండ్ కంట్రోల్ బృందంతో కమ్యూనికేషన్

చంద్రయాన్-3 రోవర్ అనేక ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణలను చేస్తుందని భావిస్తున్నారు, వాటిలో:

 • చంద్ర ఉపరితలం యొక్క కూర్పు
 • చంద్రుని నేలలో నీటి మంచు ఉనికి
 • చంద్ర ప్రభావాల చరిత్ర
 • చంద్రుని వాతావరణం యొక్క పరిణామం
భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి చంద్రయాన్-3 రోవర్ ఒక పెద్ద ముందడుగు. దేశంలో పెరుగుతున్న సాంకేతిక సామర్థ్యాలకు నిదర్శనం. చంద్రునిపై మానవ అవగాహన పెంపొందడానికి ఇది తోడ్పడుతుంది.
చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూలు
చంద్రయాన్-3 ల్యాండరు
చంద్రయాన్-3 రోవరు

నిధులు[మార్చు]

2019 డిసెంబరులో ఇస్రో, ఈ ప్రాజెక్ట్ కోసం ₹75 కోట్ల ప్రాథమిక నిధులు అభ్యర్థించింది. ఇందులో ₹60 కోట్లు యంత్రాలు, పరికరాలు, తదితర మూలధన వ్యయం కోసం ఖర్చు అవుతుంది. మిగిలిన ₹15 కోట్లు రెవెన్యూ వ్యయం కింద కోరింది.[21]
ఈ ప్రాజెక్టు చేపట్టడాన్ని ధ్రువీకరిస్తూ ఇస్రో మాజీ ఛైర్మన్ కె. శివన్, దీనికి సుమారు ₹615 కోట్లు అవుతుందని చెప్పాడు.[22]

Chandrayan 3 == భూమి నుండి బయలుదేరి చంద్రయాన్, చంద్రుణ్ణి చేరే ప్రయాణం ఇలా ఉంటుంది:

చంద్రయాన్-3 యానిమేషను
భూమి చుట్టూ
చంద్రుని చుట్టూ
       చంద్రయాన్-3 ·        భూమి ·        చంద్రుడు

ప్రయోగం[మార్చు]

చంద్రయాన్-3 ను అంతరిక్షంలోకి తీసుకెళ్ళిన ఎల్‌విఎమ్3-ఎమ్4 రాకెట్

చంద్రయాన్-3 ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి షెడ్యూల్ ప్రకారం 2023 జూలై 14 న మధ్యాహ్నం 2:35 గంటలకు ఎల్‌విఎమ్3-ఎమ్4 రాకెట్లో అంతరిక్షం లోకి పంపించారు.[23] చంద్రుడిపైకి వెళ్లే పథంలో అంతరిక్ష నౌకను అనుకున్న కక్ష్యలో చేర్చారు. భూమి, చంద్రుని మధ్య దూరం దాదాపు 3,84,400 కిలోమీటర్లు. చంద్రయాన్-3 ఆగస్టు 23 లేదా ఆగస్టు 24న చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ సాధిస్తుందని అంచనా వేసారు.[24]

భూమి, చంద్రుల సామీప్యతను గణించి ఇస్రో, చంద్రయాన్ 3 ప్రయోగానికి జూలై నెలను ఎంచుకుంది.[25]

తదుపరి లక్ష్యం[మార్చు]

చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై 2023 ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు తాకిన చంద్రయాన్ ల్యాండర్ చంద్రుని ధూళి స్థిరపడటానికి కొన్ని గంటలు వేచి ఉంటుంది.ఆ తర్వాత, దాని ఒక వైపున ఉన్న ప్యానెల్‌లు తెరుచుకుంటాయి, ప్రగ్యాన్, మూన్ రోవర్, ఉపరితలంపైకి జారిపోయేలా ఒక ర్యాంప్ అమర్చబడుతుంది.ఇది చంద్రునిపై రాళ్ళు, క్రేటర్స్ చుట్టూ తిరుగుతూ కీలకమైన డేటా, చిత్రాలను సేకరించి విశ్లేషణ కోసం భూమికి తిరిగి పంపబడుతుంది.ల్యాండర్, రోవర్ ఐదు శాస్త్రీయ పరికరాలను కలిగి ఉన్నాయి, ఇవి "చంద్రుని ఉపరితలం యొక్క భౌతిక లక్షణాలు, ఉపరితలం దగ్గరగా ఉండే వాతావరణం , ఉపరితలం క్రింద ఏమి జరుగుతుందో అధ్యయనం చేయడానికి టెక్టోనిక్ కార్యకలాపాలను" కనుగొనడంలో సహాయపడతాయి.ల్యాండింగ్ తేదీ కూడా చంద్రుని రోజు ప్రారంభంతో సమానంగా ఎంచుకోబడింది - ఇది 28 భూమి రోజులకు సమానం - ఎందుకంటే ల్యాండర్, రోవర్ యొక్క బ్యాటరీలు ఛార్జ్ చేయడానికి, పని చేయడానికి సూర్యరశ్మి అవసరం.

కక్ష్య పెంచడం[మార్చు]

ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రక్షేపించిన తరువాత, చంద్రుని దిశగా వెళ్ళే క్రమంలో దాని కక్ష్యను పెంచుతారు. ఇందుకోసం చంద్రయాన్‌లో ఉన్న లిక్విడ్ అపోజీ మోటారును (LAM) మండించి, చంద్రప్రయాణ కక్ష్యలోకి ప్రవేశపెడతారు. కక్ష్యలో చేసే ఆ విన్యాసాల వివరాలను కింది పట్టికలో చూడవచ్చు.
# తేదీ LAM (లిక్విడ్ అపోజీ మోటార్) మండించిన వ్యవధి సాధించిన ఎత్తు వాలు కక్ష్యా వ్యవధి మూలాలు
అపోజీ పెరిజీ
1 2023 జూలై 15 41,762 km (25,950 mi) 173 km (107 mi) 21.3° [26]
2 2023 జూలై 17 41,603 km (25,851 mi) 226 km (140 mi) [27]
3 2023 జూలై 18 [28]
4
5

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "ISRO to launch moon mission Chandrayaan-3 on July 14. Check details". Hindustan Times. 2023-07-06. Retrieved 2023-07-06.
 2. "Chandrayaan-3 launch on July 14; August 23-24 preferred landing dates". THE TIMES OF INDIA. 2023-07-06. Retrieved 2023-07-07.
 3. "Mission homepage". Retrieved 29 June 2023.
 4. "Press Meet - Briefing by Dr. K. Sivan, Chairman, ISRO". isro.gov.in. 2020-01-01. Archived from the original on 5 October 2021. Retrieved 2020-01-03.
 5. "Chandrayaan-3 to cost Rs 615 crore, launch could stretch to 2021". The Times of India. 2 January 2020. Retrieved 3 January 2020.
 6. 6.0 6.1 "NASA - NSSDCA - Spacecraft - Details".
 7. Guptan, Mahesh (2019-11-16). "How did Chandrayaan 2 fail? ISRO finally has the answer". The Week. Retrieved 2020-01-03.
 8. "ఈ నెల 14న నింగిలోకి చంద్రయాన్‌-3". ఈనాడు. 2023-07-08. Archived from the original on 2023-07-08. Retrieved 2023-07-08.
 9. "Chandrayaan-3: 'మామా వచ్చేశాం'.. జాబిల్లిపై అడుగుపెట్టిన చంద్రయాన్‌-3". EENADU. Retrieved 2023-08-23.
 10. "PM Modi: చంద్రయాన్‌ - 3 దిగిన ప్రదేశానికి 'శివశక్తి' పేరు: ప్రధాని మోదీ | prime minister modi reached bangalore". web.archive.org. 2023-08-26. Archived from the original on 2023-08-26. Retrieved 2023-08-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 11. Singh, Surendra (5 August 2018). "Chandrayaan-2 launch put off: India, Israel in lunar race for 4th position". The Times of India. Retrieved 15 August 2018.
 12. Shenoy, Jaideep (28 February 2016). "ISRO chief signals India's readiness for Chandrayaan II mission". The Times of India. Retrieved 2020-01-03.
 13. "India's next Moon shot will be bigger, in pact with Japan". The Times of India. 2019-07-07. Retrieved 2020-01-03. For our next mission — Chandrayaan-3 — which will be accomplished in collaboration with JAXA (Japanese Space Agency), we will invite other countries too to participate with their payloads.
 14. "Episode 82: JAXA and International Collaboration with Professor Fujimoto Masaki". Astro talk UK. 2019-01-04. Retrieved 2020-01-03.
 15. "ESA and Indian space agency ISRO agree on future cooperation". www.esa.int (in ఇంగ్లీష్). Retrieved 2022-04-16.
 16. https://chandrayaan3.org/what-is-chandrayaan-3-mission-all-about/
 17. "Chandrayaan-3 to cost Rs 615 crore, launch could stretch to 2021". The Times of India. 2 January 2020. Retrieved 3 January 2020.
 18. Kumar, Chethan (15 September 2020). "Chandrayaan-3: No 5th engine on lander". The Times of India. Archived from the original on 15 September 2020. Retrieved 2020-09-15.
 19. Kumar, Chethan (19 November 2019). "Chandrayaan-3 plans indicate failures in Chandrayaan-2". The Times of India. Archived from the original on 21 November 2019. Retrieved 15 September 2020.
 20. "CHANDRAYAAN 3: India's Mission to the Moon". BuzzBite. 2023-07-08. Retrieved 2023-07-10.
 21. Kumar, Chethan (2019-12-08). "ISRO seeks 75 crore more from Centre for Chandrayaan-3". The Times of India. Retrieved 2019-12-08.
 22. "Chandrayaan-3 to cost Rs 615 crore, launch could stretch to 2021". The Times of India. 2020-01-02. Retrieved 2020-01-03.
 23. "Chandrayaan 3: విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చంద్రయాన్‌-3". ఈనాడు. 2023-07-14. Archived from the original on 2023-07-15. Retrieved 2023-07-15.
 24. https://scroll.in/latest/1052635/chandrayan-3-lifts-off-for-mission-to-moon
 25. "Chandrayaan 3: Know why July is important for ISRO". News9live (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-07-14. Retrieved 2023-07-14.
 26. @isro (2023-07-15). "The first orbit raising operation" (Tweet). Retrieved 2023-07-15 – via Twitter.
 27. @isro (2023-07-17). "The second orbit raising operation" (Tweet). Retrieved 2023-07-17 – via Twitter.
 28. @isro (2023-07-18). "The third orbit raising operation" (Tweet). Retrieved 2023-07-18 – via Twitter.