చంద్రయాన్-2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంద్రయాన్-2
ల్యాండరు, ఆర్బిటరును అనుసంధించాక
సంస్థఇస్రో
మిషన్ రకంఆర్బిటరు, విక్రమ్ ల్యాండరు, ప్రజ్ఞాన్ రోవరు
దీనికి ఉపగ్రహంచంద్రుడు
లాంచ్ తేదీ2019 జూలై 22
లాంచ్ వాహనంజిఎస్‌ఎల్‌వి ఎమ్‌కె3
మిషన్ వ్యవధిఆర్బిటరు: 1 సంవత్సరం; ల్యాండరు, రోవరు: 14 రోజులు
హోమ్ పేజిhttps://www.isro.gov.in/chandrayaan2-home-0
ద్రవ్యరాశిమొత్తం (ఇంధనంతో): 3,850 కి.గ్రా.[1][2][3]
మొత్తం (ఇంధనం లేకుండా): 1,308 కి.గ్రా.[4]
ఆర్బిటరు (ఇంధనంతో): 2,379 కి.గ్రా.[2][3]
ఆర్బిటరు (ఇంధనం లేకుండా): 682 కి.గ్రా.[4]
విక్రమ్ ల్యాండరు (ఇంధనంతో): 1,471 కి.గ్రా.[2][3]
విక్రమ్ ల్యాండరు (ఇంధనం లేకుండా): 626 కి.గ్రా.[4]
ప్రజ్ఞాన్ రోవరు: 27 కి.గ్రా.[2][3]
సామర్థ్యంఆర్బిటరు: 1 కి.వా.[5]

విక్రమ్ ల్యాండరు: 650 వా

ప్రజ్ఞాన్ రోవరు: 50 వా

చంద్రయాన్-2, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై పరిశోధన కోసం చేసిన రెండవ యాత్రకు ఉపయోగించిన నౌక. చంద్రుడిపై నిదానంగా, మృదువుగా దిగి (సాఫ్ట్ ల్యాండింగు), 14 రోజుల పాటు చంద్ర ఉపరితలంపై తిరుగుతూ, వివిధ ప్రయోగాలు చేసేందుకు అవసరమైన సాధన సంపత్తి ఈ నౌకలో భాగం. చంద్రయాన్-2 ను ఇస్రోకు చెందిన అత్యంత భారీ వాహనమైన జిఎస్‌ఎల్‌వి ఎమ్‌కె-3 వాహనం ద్వారా ప్రయోగించారు. చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ ఉండే ఆర్బిటరు, దాన్నుంచి విడివడి చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండిగయ్యే ల్యాండరు, ల్యాండరు నుండి బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై నడిచే రోవరు - ఈ మూడూ చంద్రయాన్-2 లో భాగాలు. భారతదేశపు చంద్రయాన్ కార్యక్రమంలో ఇది రెండవ యాత్ర.

చంద్రయాన్-2 కార్యక్రమం ద్వారా వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి, చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు చేయడానికీ[6][7] ఇస్రో తలపెట్టింది. 6 చక్రాలు కలిగిన రోవరు చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ అక్కడి మట్టి, రాళ్ల నమూనాలను సేకరించి అక్కడే రసాయనిక విశ్లేషణ చేస్తుంది. ఈ సమాచారాన్ని ల్యాండరుకు అందజేయగా అది భూమిపై ఉన్న డీప్ స్పేస్ నెట్‌వర్కుకు చేరవేస్తుంది.[8] చంద్రయాన్-1ను సాకారం చేసిన మైలస్వామి అన్నాదురై నేతృత్వంలోని బృందం చంద్రయాన్-2 పైన పనిచేస్తుంది.

ఇస్రో రూపకల్పన ప్రకారం - ఇంతవరకు ఏ దేశం కూడా కాలూనని ప్రదేశంలో, చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్-2 ల్యాండరు దిగుతుంది. దాన్నుండి రోవరు బయటకు వచ్చి చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ వివిధ పరీక్షలు చేస్తుంది. 14 భూమి రోజుల పాటు (ఒక చంద్రుడి పగలు) అది పరీక్షలు జరుపుతుంది. ఆర్బిటరు చంద్రకక్ష్యలో సంవత్సరం పాటు పనిచేస్తుంది.

మొదట 2019 జూలై 15 న జరపాలని తలపెట్టిన ప్రయోగాన్ని సాంకేతిక కారణాల వలన ప్రయోగానికి 56 నిముషాల ముందు రద్దు చేసారు.[9] క్రయోజనిక్ దశలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరిచేసిన తరువాత, 2019 జూలై 22 న మధ్యాహ్నం 2:43 గంటలకు చంద్రయాన్-2 ను జిఎస్‌ఎల్‌వి ఎమ్‌కె3 ఎమ్1 వాహనం ద్వారా ప్రయోగించి భూకక్ష్యలో ప్రవేశపెట్టారు.[10]

భూకక్ష్యలో ఉండగా కక్ష్యను పెంచడానికి, ఆ తరువాత భూకక్ష్య నుండి చంద్రుని బదిలీ కక్ష్యలోకి చేర్చేందుకు, చంద్ర కక్ష్యలో ఉండగా కక్ష్య తగ్గించేందుకూ ఇస్రో అనేక విన్యాసాలను జరిపింది. ఆర్బిటరు లోని ద్రవ ఇంధన ఇంజన్లను ఇందుకు వినియోగించారు.

చంద్రయాన్-2 విజయవంతంగా చంద్రుని కక్ష్యలో చేరాక, ప్లాను ప్రకారమే ఆర్బిటరు, ల్యాండరు విడిపోయాయి. ఆ తరువాత ల్యాండరు ఆ కక్ష్య నుండి రెండు అంచెలలో దిగువ కక్ష్య లోకి దిగి, అక్కడి నుండి చంద్రుడి ఉపరితలం పైకి ప్రయాణం సాగించింది. ల్యాండరు చంద్రుడి ఉపరితలం నుండి 2.1 కి.మీ. ఎత్తున ఉండగా, దానికి భూమితో సంపర్కం తెగిపోయింది. ఈ యాత్ర 90 నుండి 95% వరకూ విజయవంతమైందని ఇస్రో తెలిపింది.[11]

చంద్రయాన్-2 ఉద్దేశాలు

చంద్రునిపై ఒక ల్యాండరును సాఫ్ట్ ల్యాండింగు చెయ్యడం, చంద్ర ఉపరితలంపై రోవరును నడపడం చంద్రయాన్-2 కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. శాస్త్రసంబంధ లక్ష్యాలు - చంద్ర ఉపరితల శోధన, ఖనిజాల పరిశీలన, మూలకాల లభ్యతను శోధించడం, చంద్రుని వాతావరణాన్ని పరిశీలించడం, నీరు, మంచురూపంలోని నీటి లభ్యతను పరిశీలించడం.[12] చంద్ర ఉపరితలాన్ని ఫొటోలు తీసి 3డి మ్యాపులు తయారు చెయ్యడం.[13]

చరిత్ర

2008 సెప్టెంబరు 18న నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన కాబినెట్ మంత్రుల సమావేశంలో ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.[14]

2007 నవంబరు 12 న రష్యన్ అంతరిక్ష సంస్థ (రోస్‌కాస్మోస్), ఇస్రో సంయుక్తంగా చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపట్టాలి అని ఒప్పందం చేసుకున్నారు.[15] రోవరును, అర్బిటరునూ తయారు చేసే ప్రధాన బాధ్యత ఇస్రో తీసుకోగా, రోస్‌కాస్మోస్ ల్యాండర్ని తయారు చేసే బాధ్యత తీసుకుంది. అంతరిక్ష వాహనం ఆకృతిని 2009 ఆగస్టులో పూర్తి చేసారు, రెండు దేశాల శాస్త్రవేత్తలు కలిపి ఈ నమూనాను పరిశీలించారు.[16][17][18] అయితే సాంకేతిక కారణాల వలన తదనంతర కాలంలో రోస్‌కాస్మోస్ ఈ ల్యాండరును తయారు చెయ్యలేనని అశక్తత వ్యక్తం చేసింది.[19][20] దాంతో ఈ బాధ్యతను కూడా ఇస్రోయే చేపట్టింది. చంద్రయాన్-2 యావత్తూ స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రోయే రూపొందించిన కార్యక్రమం అయింది.

బృందం

చంద్రయాన్-2 ప్రాజెక్టులో అత్యంత కీలకమైన శాస్త్రవేత్తల జాబితా ఇది:[21][22][23]

 • మైలస్వామి అన్నాదురై ప్రాజెక్టు డైరెక్టరు
 • రితు కరిధాల్ - మిషన్ డైరెక్టరు
 • ముత్తయ్య వనిత - ప్రాజెక్టు డైరెక్టరు
 • చంద్రకాంత కుమార్ - డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టరు

రూపకల్పన

అంతరిక్ష వాహనం

3,850 కేజీలు బరువు గల చంద్రయాన్-2 ను శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏంకె-II ద్వారా ప్రయోగించాలని ప్రణాళిక తయారు చేసారు.[24] ఆర్బిటరు తోటి ఎనిమిది పేలోడ్లు, రోవరు తోటి రెండు పేలోడ్లూ పంపించాలని నిర్ణయించినట్టు ఇస్రో ప్రకటించింది.[25][26] నాసా, ఇఎస్‌ఏ సంస్థలు ఆర్బిటరు[27] కోసం సాంకేతిక పరికరాలు సరఫరా చేసి ఈ ప్రయోగంలో పాల్గొంటాయి అని భావించారు. కానీ బరువు పరిమితుల దృష్ట్యా అంతర్జాతీయ పేలోడ్లను ఈ ప్రయోగంలో పంపకూడదు అని నిర్ణయించారు.[28] కానీ ఆ తరువాత నాసా తయారు చేసిన 22 గ్రాముల బరువున్న లేజరు రెట్రోరిఫ్లెక్టరును ల్యాండరుతో పంపించాలని నిర్ణయించారు.

ఆర్బిటరు

చంద్రయాన్-2 యొక్క ఆర్బిటరు

ఆర్బిటరును ఇస్రో రూపొందించింది. ఇది చంద్రునికి 100 X 100 కిలోమీటర్ల వర్తుల కక్ష్యలో పరిభ్రమిస్తుంది.[28] ఆర్బిటర్లో ఎనిమిది రకాల పేలోడ్లను పొందుపరచాలని నిర్ణయించారు. వీటిలో రెండు చంద్రయాన్-1లో వాడిన పరికరాలే కానీ వాటిని నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగుపరిచారు. ప్రయోగ సమయంలో బరువు సుమారు 2,379 కేజీలు.[29][30] ఇందులో 1,697 కిలోలు ఇంధనం కగా, మిగతా 682 కిలోలు ఆర్బిటరు బరువు. 1000 వాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఆర్బిటరుకు ఉంది. ఆర్బిటరు ఇటు భూమిపై ఉన్న ఇస్రో వారి డీప్ స్పేస్ నెట్‌వర్కు తోను, చంద్రుడిపై దిగే ల్యాండరు తోనూ సంపర్కంలో ఉంటుంది.[31][32] ల్యాండరు ఆర్బిటరు నుండి విడివడే ముందు, దీనిలోని హై రిజల్యూషన్ కెమెరా ల్యాండరు దిగే ప్రదేశాన్ని హై రిజల్యూషన్ పరిశీలనలు చేస్తుంది. అర్బిటరు స్ట్రక్చరును హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసి 2015 జూన్ 22 న ఇస్రోకు అందించింది.[33][34]

ఆర్బిటరు పేలోడు

 1. విశాల క్షేత్రం కలిగిన సాఫ్ట్ ఎక్స్-రే స్పెక్త్రోమీటరు (CLASS) : దీన్ని ఇస్రో ఉపగ్రహ కేంద్రం (ISAC) సమకూర్చింది.
 2. సోలారు ఎక్స్-రే మోనిటరు (XSM) ను, భౌతిక పరిశోధన ప్రయోగశాల (PRL) అహ్మదాబాద్ సమకూర్చింది. ఈ పరికరం చంద్రుని ఉపరితలంపై ఉన్న ప్రధాన మూలకాలను గుర్తిస్తుంది.[26]
 3. అంతరిక్ష ఉపయోగ కేంద్రం (SAC), అహ్మదాబాద్ తయారు చేసిన సింథటిక్ అపర్చరు రాడార్. చంద్రుని ఉపరితలం నుండి కొన్ని పదుల మీటర్ల వరకు నీరు, ఇంకా ఇతర అంశాల కోసం శోధిస్తుంది.[26]
 4. అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటరు ఇమేజింగ్ IR స్పెక్త్రోమీటరు (IIRS) సమకూరుస్తుంది. దీని వల్ల చంద్రుని ఉపరితలం పైన పెద్ద పరిమాణంలో ఖనిజాలను, హైడ్రోక్సిల్, నీటి పరమాణువులను గుర్తించడానికి విలుపడుతుంది.[26]
 5. అంతరిక్ష భౌతిక ప్రయోగశాల (SPL), తిరువనంతపురం రూపొందించిన న్యూట్రల్ మాస్ స్పెక్త్రోమీటరు (ChACE-2) - ఈ పరికరం చంద్రుని వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది.[26]
 6. SAC తయారు చేసిన టేరైన్ మ్యాపింగ్ కెమేరా-2 (TMC-2) చంద్రుని లోని ఖనిజాలను, ఉపరితలాన్నీ త్రీ డి చిత్రాలుగా మారుస్తుంది.[26]
 7. రేడియో ఎనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపరుసెన్సిటివ్ అయనోస్ఫియరు అణ్డ్ ఎట్మాస్ఫియరు - డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రేడియో ఎక్స్పెరిమెంట్ - అంతరిక్ష భౌతిక ప్రయోగశాల
 8. అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ తయారుచేసిన ఆర్బిటరు హై రిజల్యూషన్ కెమెరా - చంద్రుడి ఉపరితలపు ఎత్తుపల్లాల మోడలును తయారు చేసేందుకు అవసరమైన చిత్రాలను పంపిస్తుంది.

ల్యాండరు

విక్రమ్ ల్యాండరు, దానిపై ప్రజ్ఞాన్ రోవరు

దీనికి భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు విక్రమ్ సారాభాయ్ పేరిట విక్రమ్ అని పేరు పెట్టారు. దీన్ని ఇస్రోయే రూపొందించింది. చంద్రయాన్-1 లోని చంద్రుని ఉపరితలాన్ని ఢీకొట్టిన చంద్ర శోధక యంత్రంలా కాకుండా ఈ ల్యాండరును మృదువుగా, నిదానంగా దిగేలా రూపొందించారు.[31] ల్యాండరు బరువు 1,471 కేజీలు. 650 వాట్ల విద్యుదుత్పాదన సామర్థ్యం దీనికి ఉంది. చంద్రునిపై కాలూనే సమయానికి ల్యాండరు వేగం సెకండుకు 2 మీటర్లు ఉండేలా ల్యాండరును రూపొందించారు. ల్యాండరు ఆర్బిటరు తోను, భూమిపై ఉన్న ఇస్రో వారి డీప్ స్పేస్ నెట్‌వర్కు తోను, చంద్రుడిపై నడిచే రోవరు తోనూ సంపర్కంలో ఉంటుంది. ఇది 14 భూమి రోజుల పాటు (ఒక చంద్రుడి పగలు) పనిచేసేలా రూపొందించారు.

ఆర్బిటరు నుండి విడిపోయాక, విక్రమ్ తన 800 న్యూటన్ల ద్రవ ఇంధన ఇంజన్లను వాడి 30 x 100 కి.మీ. చంద్ర కక్ష్యకు దిగుతుంది. అక్కడ తనలోని వ్యవస్థలన్నిటినీ పరీక్షించుకుని సాఫ్ట్ ల్యాండింగు ప్రయత్నం మొదలు పెడుతుంది. ల్యాండింగయ్యాక, రోవరును బయటికి పంపి శాస్త్ర పరీక్షలను నిర్వహిస్తుంది. 14 రోజుల పాటు ఇది పనిచేస్తుంది.

విక్రమ్‌లో 800 న్యూటన్ సామర్థ్యం గల 5 ప్రధాన ఇంజన్లు, 50 న్యూటన్ల సామర్థ్యం గల 8 యాటిట్యూడ్‌ను నియంత్రించే 8 ఇంజన్లు ఉంటాయి.[35][36] విక్రమ్ 12° కోణంలో వాలుగా ఉండే తలంపై కూడా జాగ్రత్తగా దిగగలదు.[37][38]

2016 అక్టోబరులో ల్యాండరు నమూనాలపై భూమ్మీద, గాల్లోనూ జరిపే పరీక్షలు మొదలయ్యాయి. కర్ణాటక, చిత్రదుర్గ జిల్లాలోని చల్లకెరె వద్ద ఈ పరీక్షలు జరిగాయి. భూమ్మీద 10 వరకూ గుంతలను చేసి, వాటిని పరిగణన లోకి తీసుకుని సరైన ల్యాండింగు సైటును ఎంపిక చేసుకోగల ల్యాండరు సామర్థ్యాన్ని పరీక్షించారు.[39]

ల్యాండరు పేలోడు

విక్రం ల్యాండరు లోని నాలుగు పేలోడ్లు ఇవి:[1][40]

 1. చంద్రకంప పరిశీలక పరికరం (సీస్మోమీటరు) చంద్రునిపై దిగిన చోట చంద్రకంపాలను (భూకంపం లాగా చంద్రకంపం) అధ్యయనం చేసేందుకు[41][42]
 2. చంద్ర ఉపరితల ఉష్ణ-భౌతిక ప్రయోగం - చంద్ర ఉపరితలపు ఉష్ణ లక్షణాలను పరిశోధించడం
 3. చంద్ర ఉపరితలపు సాంద్రత, ప్లాస్మా వేరియేషన్ను పరిశీలించే RAMBHA-LP లాంగ్‌ముయిర్ ప్రోబ్[41]
 4. నాసా వారు అందించిన లేజర్ రెట్రోరిఫ్లెక్టర్: చంద్ర కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉండే ఉపగ్రహాలు చంద్రుడి ఉపరితలం నుండి ఎంత దూరంలో ఉన్నాయో కచ్చితంగా కొలిచేందుకు ఉపయోగపడే దర్పణం.[43][44][45]

రోవరు

ప్రజ్ఞాన్ రోవరు

రోవరుకు ప్రజ్ఞాన్ అని పేరు పెట్టారు. దీన్ని ఇస్రో రూపొందించింది. ఇది 27 కేజీల బరువుతో, 50 వాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ రోవరుకున్న ఆరు చక్రాల సహాయంతో చంద్రుని ఉపరితలం పైన తిరుగుతుంది. సెకండుకు 1 సెంటీమీటరు వేగంతో ప్రయాణించగలదు. మొత్తం అర కిలోమీటరు దూరం ప్రయాణించే సామర్థ్యం ప్రజ్ఞాన్ కుంది. చంద్రుని ఉపరితలాన్ని పరీక్షించి, విశ్లేషణ చేసి ఆ సమాచారాన్ని ల్యాండరుకు అందిస్తుంది.[31][32]

ప్రజ్ఞాన్ ఒక చంద్ర పగలు కాలం (అంటే భూమిపై 14 రోజులు) పాటు పనిచేస్తుంది. చంద్రుని రాత్రి సమయంలో ఉండే గడ్దకట్టించే శీత స్థితిని అందులోని ఎలక్ట్రానిక్స్ తట్టుకోలేవు. అయితే, దానిలో ఆటోమాటిగ్గా నిద్రించే/మేలుకునే పవర్ వ్యవస్థ ఉంది. చంద్ర రాత్రి వేళ పవర్ వ్యవస్థ నిద్రిస్తుంది. రాత్రి ముగిసి, పగలు మొదలు కాగానే పవర్ వ్యవస్థ మేలుకుంటుంది. ఆ వ్యవస్థ పని చేస్తే, ప్రజ్ఞాన్ పని చేసే కాలాన్ని మరో రెండు చంద్ర పగళ్ళ కాలం పాటు పొడిగించవచ్చు.[46][47]

రోవరు పేలోడు

రోవరులో కింది శాస్త్ర పరికరాలు అమర్చారు.

 1. లేబొరేటరీ ఫర్ ఎలెక్ట్రో ఆప్టిక్ సిస్టమ్స్ (LEOS) తయారు చేసిన లేజరు ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్త్రోస్కోప్ (LIBS).[26]
 2. PRL అహ్మదాబాదు తయారు చేసిన ఆల్ఫా పార్టికల్ ఇండ్యూస్డ్ ఎక్స్-రే స్పెక్ట్రోస్కోప్ (APIXS)

ఉద్దేశించిన ల్యాండింగు స్థలం

ల్యాండింగు స్థలం [48] అక్షాంశ రేఖ్ంశాలు
ప్రాథమిక స్థలం 70°54′10″S 22°46′52″E / 70.90267°S 22.78110°E / -70.90267; 22.78110
ప్రత్యామ్నాయ స్థలం 67°52′27″S 18°28′10″W / 67.87406°S 18.46947°W / -67.87406; -18.46947

ల్యాండింగు కోసం రెండు స్థలాలను గుర్తించారు.[48] ప్రాథమిక ల్యాండింగు స్థలం (PLS54) 70.90267 S 22.78110 E వద్ద ఉంది. ప్రత్యామ్నాయ స్థలం (ALS01) 67.874064 S 18.46947 W వద్ద ఉంది. ల్యాండింగు ప్రాంతాలను ఎంపిక చేసేందుకు అనుసరించిన పరిస్థితులు: దక్షిణ ధ్రువ ప్రాంతం, భూమివైపు ఉండే ప్రాంతం, 15 డిగ్రీల లోపు వాలు ఉండే ప్రాంతం, 50 సెం.మీ. కంటే చిన్నవైన రాళ్ళు ఉండే చోటు, గుంతలు, రాళ్ళు ఉండే ప్రదేశం, కనీసం 14 భూమి రోజుల పాటు ఎండ ఉండే చోటు, చుట్టుపక్కల ఉండే గుట్టల వలన ఎక్కువ కాలం పాటు నీడ పడని చోటు.[48]

ప్రాజెక్టు పురోగతి

2010 ఆగస్టు 30 కల్లా ఇస్రో చంద్రయాన్-2 పేలోడ్లను ఖరారు చేసింది.[32].

చంద్రుడి దక్షిణ ధ్రువానికి ల్యాండరు, రోవరును పంపాలని తలపెట్టిన తొలి దేశం భారతే. ఈ మొత్తం ప్రాజెక్టుకు అయిన ఖర్చు రూ.978 కోట్లు కాగా ఇందులో వాహక నౌకకు రూ. 375 కోట్లు అయింది. చంద్రయాన్-2 లోని మూడు విభాగాల్లో ఆర్బిటరు చంద్రుడి కక్ష్యలో తిరుగుతూంటుంది. ల్యాండరు చంద్రునిపై మృదువుగా దిగుతుంది. రోవరు దీనినుండి విడివడి, చంద్రుడి మీద కదులుతూ ఉపరితలాన్ని పరిశీలిస్తూ, పరిశోధిస్తుంది. చంద్రయాన్-2 లో ఇస్రో తాను రూపొందించిన 13 శాస్త్ర పరిశోధన పరికరాలతో పాటు నాసా వారి లేజరు రెట్రోరిఫ్లెక్టరును కూడా అమర్చింది.

తొలి ప్రణాళిక ప్రకారం 2019 జూలై 15వ తేదీ తెల్లవారుజామున 2:51 గంటలకు చంద్రయాన్-2 ను మోసుకెళ్ళే జిఎస్‌ఎల్‌వి ఎమ్‌కె3 ఎమ్1 వాహనాన్ని ప్రయోగించాల్సి ఉంది. కానీ క్రయోజనిక్ దశలోకి ఇంధనం నింపిన తరువాత, హీలియమ్ ట్యాంకు లోని పీడనం పడిపోతూండడంతో ప్రయోగానికి సరిగ్గా 56 నిమిషాల ముందు ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది.[49] నౌకను పూర్తిగా ఏ భాగానికి ఆ భాగాన్ని విప్పదీయకుండానే సమస్యను ఇస్రో శాస్త్రవేత్తలు పరిష్కరించారు. దీంతో తక్కువ సమయంలోనే వాహకనౌకను తిరిగి ప్రయోగించగలిగే వీలు కుదిరింది.

యాత్ర

2019 జూలై 22 న జిఎస్‌ఎల్‌వి రాకెట్టును శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించడం ద్వారా భారత రెండవ చంద్ర యాత్ర మొదలైంది.

చంద్రయాన్-2 యానిమేషన్
భూకక్ష్య దశ
చంద్ర కక్ష్య దశ
చంద్రయాన్-2 మొత్తం ప్రస్థానం
       Earth ·        Moon ·        Chandrayaan-2

చంద్రయాన్-2 భూకక్ష్యను చేరింది

చంద్రయాన్-2 ను పేలోడుగా ఉంచుకుని షార్ రెజ్ండవ లాంచ్ ప్యాడు నుండి పైకెగుస్తున్న జిఎస్‌ఎల్‌వి

2019 జూలై 22 మధ్యాహ్నం 2:43 గంటలకు చంద్రయాన్-2 ను జీఎస్ఎల్వీ ఎంకే3-ఎం1 రాకెట్ ద్వారా ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ముందుగా నిర్ణయించిన సమయానికే నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో లాంచ్ ప్యాడ్‌ నుంచి జీఎస్ఎల్వీని నింగిలోకి పంపి, చంద్రయాన్-2 ను 169.7 x 45,475 కి.మీ. ల భూకక్ష్యలో (169.7 కిలోమీటర్ల పెరిజీ[a], 45,475 కిలోమీటర్ల అపోజీ[a] కలిగిన కక్ష్య) ప్రవేశపెట్టింది. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్ కె. శివన్ ప్రకటించాడు.[50] క్రయోజనిక్ దశలోని ఇంధనాన్ని సంపూర్ణంగా వాడుకోవడంతో అనుకున్నదాని కంటే ఎక్కువ అపోజీ కలిగిన కక్ష్యలో చంద్రయాన్-2 ను ప్రవేశపెట్టగలిగారు. దీనివలన, భూకక్ష్య దశలో కక్ష్య పెంచేందుకు చెయ్యవలసిన విన్యాసాల్లో ఒక దాన్ని తగ్గించ గలిగారు.[50][51][52] చంద్రయాన్-2 ఇంధనంలో 40 కిలోలు ఆదా అయింది కూడా.[53]

భూకక్ష్యలో చేపట్టిన కక్ష్యావిన్యాసాలు

చంద్రయాన్-2 లోని ద్రవ ప్రొపల్షను ఇంజన్ను ఐదు సార్లు మండించడం ద్వారా శాస్త్రవేత్తలు చంద్రయాన్-2 కక్ష్యను పెంచుకుంటూ పోయి, 276 x 1,42,975 కి.మీ. కక్ష్యకు చేర్చారు.[54] ఆరవ, చివరి విన్యాసంలో చంద్రయాన్-2 ను చంద్ర బదిలీ కక్ష్య లోకి ప్రవేశపెట్టారు.

 • మొదటి కక్ష్య పెంపుదల: 2019 జూలై 24 న నౌకలోని ద్రవ ఇంధన ఇంజను ప్రొపల్షను వ్యవస్థను 48 సెకండ్ల పాటు వాడి, కక్ష్యను 230 X 45,163 కి.మీ.కు పెంచారు.
 • రెండవ కక్ష్య పెంపుదల: జూలై 26 న ప్రొపల్షను వ్యవస్థను 883 సెకండ్ల పాటు మండించి, కక్ష్యను 251 x 54,829 కి.మీ.కు పెంచారు.
 • మూడవ పెంపుదల: జూలై 29 న ఇంజన్ను 989 సెకండ్ల పాటు వాడి, కక్ష్యను 276 x 71,792 కి.మీ.కు పెంచారు.
 • నాలుగవ పెంపుదల: ఆగస్టు 2 న ఇంజన్ను 646 సెకండ్ల పాటు మండించి, కక్ష్యను 277 x 89,472 కి.మీ.కు పెంచారు.
 • ఐదవ పెంపుదల: ఆగస్టు 6 న ప్రొపల్షను వ్యవస్థను 1041 సెకండ్ల పాటు మండించి, కక్ష్యను 276 x 1,42,975 కి.మీ.కు పెంచారు.
 • చివరి విన్యాసాన్ని 2019 ఆగస్టు 14 న జరిపారు. నౌక లోని ద్రవ ఇంధన ఇంజన్ను 1203 సెకండ్ల పాటు మండించి, చంద్రయాన్-2 ను భూకక్ష్య నుండి చంద్రుడి బదిలీ కక్ష్యలోకి నడిపారు.[55] దీనితో చంద్రయాన్-2 భూకక్ష్య నుండి విడివడింది. చంద్రుడి కక్ష్యలోకి చేరేందుకు (ట్రాన్స్ ల్యూనారు ఇన్సర్షన్) సిద్ధమైంది.

నౌక చంద్రుడి కక్ష్యలోకి చేరింది

చంద్రయాన్-2 పథం

ఆగస్టు 20 న చంద్రయాన్-2 బదిలీ కక్ష్యలో చంద్రుని సమీపానికి చేరినపుడు ఇస్రో తొలి విన్యాసాన్ని జరిపింది. ద్రవ ఇంజన్ను 1738 సెకండ్ల పాటు మండించి చంద్రయాన్-2 ను జయప్రదంగా 114 x 18,072 కి.మీ. ల చంద్ర కక్ష్య లోకి ప్రవేశపెట్టింది.[56]

చంద్ర కక్ష్యలో చంద్రయాన్-2 విన్యాసాలు

భూకక్ష్యలో ఉన్నపుడు కక్ష్య పరిమాణాన్ని పెంచుకుంటూ పోగా, చంద్ర కక్ష్యలో కక్ష్యా పరిమాణాన్ని తగ్గించుకుంటూ పోతారు. ఆగస్టు 21 న జరిపిన రెండవ తగ్గింపులో (ఆగస్టు 20 న జరిపినది మొదటిది) 1228 సెకండ్ల పాటు ఇంజన్ను మండించి కక్ష్యను 118 x 4412 కి.మీ.కు తగ్గించారు. ఈ కక్ష్యలో 2650 కి.మీ. ఎత్తు నుండి చంద్రయాన్-2 చంద్రుడి ఫోటో తీసి భూమికి పంపింది.

2019 ఆగస్టు 28 న మూడవ కక్ష్య తగ్గింపును జరిపింది. 1190 సెకండ్ల పాటు ద్రవ ఇంధన ఇంజన్ను మండించి నౌకను 179 x 1412 కి.మీ. కక్ష్యలోకి దించారు.[57][58]

2019 ఆగస్టు 30న జరిపిన నాలుగవ విన్యాసంలో కక్ష్యను మరింత తగ్గించారు. 1155 సెకండ్ల పాటు ఇంజన్ను మండించి, చంద్రయాన్-2 నౌకను 124 x 164 కి.మీ. కక్ష్య లోకి చేర్చారు.[59] సెప్టెంబరు 1 న జరిపిన ఐదవ విన్యాసంలో కక్ష్యను మరింత తగ్గించి 119 x 127 కి.మీ. కక్ష్య లోకి చేర్చారు. ఈ విన్యాసంలో నౌకలోని ఇంజన్ను 52 సెకండ్ల పాటు మండించారు. సెప్టెంబరు 2 న ల్యాండరును ఆర్బిటరు నుండి విడదీసే కార్యక్రమం ఉంటుందని, ఆ తరువాత రెండు దశల్లో ల్యాండరు కక్ష్యను తగ్గించి చంద్రుడిపై దిగేందుకు రంగం సిద్ధం చేస్తామనీ ఇస్రో తెలిపింది.[60]

2019 సెప్టెంబరు 2 న విక్రమ్‌ ల్యాండరును ఆర్బిటరు నుండి విడదీసారు.[61] ఆర్బిటరు దాని మిగతా జీవిత కాలం పాటు ఇదే కక్ష్యలో చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందని ఇస్రో తెలిపింది.[62]

చంద్రుడి కక్ష్య నుండి ల్యాండరును తప్పించే విన్యాసాలు

ల్యాండరును చంద్రునిపై దించే క్రమంలో దాన్ని కక్ష్య నుండి రెండు దశల్లో తప్పించింది. సెప్టెంబరు 3 ఉదయం 8:50 కి జరిపిన మొదటి విన్యాసంలో ల్యాండరులోని ఇంజన్ను 4 సెకండ్ల పాటు మండించి దాని కక్ష్యను 119 x 127 కి.మీ నుండి 104 x 128 కి.మీ.కు తగ్గించారు.[63] తిరిగి, సెప్టెంబరు 4 తెల్లవారుఝామున 3:42 కు చేసిన రెండవ విన్యాసంలో ల్యాండరు లోని ఇంజన్ను 9 సెకండ్ల పాటు మండించి, దాన్ని 35 x 101 కి.మీ. కక్ష లోకి దించారు. దీంతో ల్యాండరు చంద్రుని దక్షిణ ధ్రువం వైపుగా దిగే ప్రయాణం మొదలు పెట్టేందుకు సిద్ధమైంది. ఆర్బిటరు మాత్రం 96 x 125 కి.మీ. కక్ష్యలోనే పరిభ్రమిస్తూ ఉంది.[64][65]

చంద్రుడిపై ల్యాండరు దిగే దశ

2019 సెప్టెంబరు 7 రాత్రి 1:45 గంటలకు విక్రమ్ ల్యాండరు చంద్రుడి ఉపరితలం వైపుగా దిగడం మొదలైంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కి.మీ. ఎత్తులో ఉండగా, ల్యాండరుకు భూమితో సంబంధం తెగిపోయిందని ఇస్రో ఛైర్మన్, కె శివన్ ప్రకటించాడు.[66][67] తరువాత సెప్టెంబరు 7 న చేసిన ప్రకటనలో ఇస్రో, ఈ యాత్ర 90 నుండి 95% వరకూ విజయవంతమైందని ప్రకటించింది. వాహనం లాంచి లోను, యాత్ర నిర్వహణ లోనూ చూపిన కచ్చితత్వం కారణంగా ఆర్బిటరు జీవితకాలం సంవత్సరం నుండి దాదాపు 7 సంవత్సరాల వరకూ పెరిగిందని కూడా ఇస్రో తెలిపింది.[68]

సెప్టెంబరు 8 న ఇస్రో చైర్మన్ కె.శివన్ ఒక ప్రకటన చేస్తూ, చంద్రుని ఉపరితలంపై ల్యాండరును గుర్తించామని తెలిపాడు. ఆర్బిటరు థర్మల్ ఇమేజింగ్ కెమెరాతో ఫొటోలు తీసిందని, ల్యాండరుతో సంపర్కం కోసం కృషి చేస్తున్నామనీ అతను తెలిపాడు.[69]

మిషన్ 'గగన్-యాన్' 2022 నాటికి సాకారం అవుతుంది

విస్న్, న్యూఢిల్లీ భారతదేశం అంతరిక్షంలోకి మనిషిని పంపాలనే ఉద్దేశాన్ని ధ్రువీకరించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారంపై ప్రధాని నరేంద్ర మోది. year 2018

అంతరిక్షంలోకి మనిషిని పంపాలనే ఉద్దేశాన్ని భారత్ ధ్రువీకరించింది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట ప్రాకారంపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రకటన చేశారు. అతని ప్రకారం, ఈ మిషన్ 'గగన్-యాన్' 2022 నాటికి నిర్వహించబడుతుంది. అంతకుముందు, మానవులను అంతరిక్షంలోకి పంపే ఏ మిషన్‌ను ప్రభుత్వం ఆమోదించలేదు. ఈ మిషన్ ముగింపు దశకు చేరుకున్న తర్వాత, మానవులను అంతరిక్షంలోకి పంపగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న ప్రపంచంలోని నాల్గవ దేశంగా భారతదేశం అవతరిస్తుంది.

చంద్రయాన్ 1, 2 ల పోలిక

కొన్ని మౌలిక అంశాల్లో చంద్రయాన్-1, చంద్రయాన్-2 ల పోలికలు ఇలా ఉన్నాయి.

అంశం చంద్ర్రయాన్-1 చంద్రయాన్-2
యాత్ర ఉద్దేశాలు చంద్రుని పైకి ప్రోబ్‌ను పంపించడం. ప్రోబ్ చంద్రునిపై దూకుతూ చంద్రుని ఉపరితలాన్ని గుద్దుకుని నాశనమయ్యే లోపు పరీక్షలు చెయ్యడం చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో ల్యాండరును మృదువుగా, మెల్లగా దింపడం, దానిలో నుండి రోవరును బయటికి తీయడం, 15 రోజుల పాటు రోవరును నడిపించి, చంద్రుని ఉపరితలంపై పరీక్షలు చెయ్యడం
నౌక లోని భాగాలు ఆర్బిటరు, ప్రోబ్ ఆర్బిటరు, ల్యాండరు (విక్రమ్), రోవరు (ప్రజ్ఞాన్)
వాహనం పిఎస్‌ఎల్‌వి ఎక్స్‌ఎల్ సి-11 జిఎస్‌ఎల్‌వి ఎమ్‌కె-3 ఎమ్ 1
ప్రయోగానికైన ఖర్చు అంచనా రు. 386 కోట్లు[70] రూ 978 కోట్లు[71]
జీవిత కాలం అంచనా ఆర్బిటరు - రెండు సంవత్సరాలు ఆర్బిటరు - 1 సంవత్సరం

ల్యాండరు, రోవరు - ఒక చంద్ర పగలు (కనీసం 14 భూమి రోజులు). చంద్ర రాత్రి (14 భూమి రోజులు) తరువాత అవి నిద్ర నుండి మేలుకుంటే మరొక రెండు చంద్ర పగళ్ళు పని చెయ్యవచ్చు. అది బోనసు అవుతుంది.

ప్రయోగ సమయంలో నౌక ద్రవ్యరాశి 1,380 కిలోగ్రాములు 3,850 కిలోగ్రాములు
ప్రయోగించిన తేదీ 2008 అక్టోబరు 22 2019 జూలై 22
ప్రయాణ పద్ధతి నౌక భూకక్ష్యను చంద్ర కక్ష్య వరకూ పెంచుకుంటూ పోయారు (గరిష్ఠ భూకక్ష్య అపోజీ: 3,80,000 కి.మీ.)

ఈ కక్ష్యలో నౌక చంద్రునికి 500 కి.మీ. దూరాన ఉండగా, ఇంజన్ను మండించి, నౌకను భూకక్ష్య నుండి చంద్ర కక్ష్యలోకి మార్చారు

నౌకను 276 x 1,42,975 కి.మీ. భూకక్ష్యలోకి చేర్చి, అక్కడి నుండి చంద్ర బదిలీ కక్ష్య వైపు నడిపారు .
చంద్రునిపై దిగిన తేదీ 2008 నవంబరు 14 న ప్రోబ్ చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో గుద్దింది. 2019 సెప్టెంబరు 7 వ తేదీన చంద్రుని మీద నిదానంగా మృదువుగా దిగే క్రమంలో, చంద్రుని ఉపరితలం నుండి 2.1 కి.మీ. ఎత్తున ఉండగా ల్యాండరు భూమితో ఉన్న సంపర్కం తెగిపోయింది.
వాస్తవ జీవిత కాలం (ప్రయోగం ముగిసిన తేదీ) 10 నెలలు (2009 ఆగస్టు 28) (ఆర్బిటరుతో చివరి సంపర్క తేదీ).
ప్రయోగ ఫలితం 95% విజయవంతమైంది. రెండేళ్ళ కాలం పనిచేస్తుందని అనుకోగా 10 నెలలకే చంద్రయాన్-1 ఆయువు ముగిసినప్పటికీ.[72] 90-95% విజయవంతమైంది.[68]
సాధించిన విజయాలు చంద్రునిపై నీటి జాడలు కనుగొంది.[73]

వీటిని కూడా చూడండి

బయటి లింకులు

నోట్స్

 1. 1.0 1.1 పెరిజీ: భూమి చుట్టూ ఒక వస్తువు దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తూంటే ఆ కక్ష్యలో భూమికి అతి దగ్గరగా ఉండే బిందువును పెరిజీ అంటారు. అపోజీ: ఈ కక్ష్యలో భూమికి అత్యంత దూరంగా ఉండే బిందువును అపోజీ అంటారు. పెరిజీ, అపోజీలు సమానంగా ఉంటే ఆ కక్ష్య వృత్తాకార కక్ష్య అవుతుంది.

మూలాలు

 1. 1.0 1.1 "Launch Kit of GSLV Mk III M1 Chandrayaan-2" (PDF). ISRO. 19 July 2019. Archived from the original (PDF) on 19 July 2019. Retrieved 21 July 2019.
 2. 2.0 2.1 2.2 2.3 "Chandrayaan-2 to Be Launched in January 2019, Says ISRO Chief". Gadgets360. NDTV. Press Trust of India. 29 August 2018. Retrieved 29 August 2018.
 3. 3.0 3.1 3.2 3.3 "ISRO to send first Indian into Space by 2022 as announced by PM, says Dr Jitendra Singh" (Press release). Department of Space. 28 August 2018. Retrieved 29 August 2018.
 4. 4.0 4.1 4.2 "Chandrayaan-2: All you need to know about India's 2nd Moon mission". 22 July 2019. Archived from the original on 14 July 2019. Retrieved 22 July 2019.
 5. "Chandrayaan-2 – Home". Indian Space Research Organisation. Archived from the original on 2019-07-29. Retrieved June 20, 2019.
 6. "Chandrayaan-2 to be finalised in 6 months". The Hindu. 2007-09-07. Archived from the original on 2008-10-23. Retrieved 2008-10-22.
 7. "Chandrayaan-II will try out new ideas, technologies". The Week. 2010-09-07. Archived from the original on 2011-07-14. Retrieved 2010-09-07.
 8. "ISRO plans Moon rover". The Hindu. 2007-01-04. Archived from the original on 2007-09-14. Retrieved 2008-10-22.
 9. "Press Meet – Briefing by Dr. K Sivan, Chairman, ISRO". isro.gov.in. Indian Space Research Organization. 12 June 2019. Archived from the original on 13 జూన్ 2019. Retrieved 12 June 2019.
 10. "Chandrayaan2 Latest updates - ISRO". www.isro.gov.in. Archived from the original on 2019-09-04. Retrieved 2019-07-27.
 11. ఈనాడు (8 Sep 2019). "చంద్రయాన్‌ 2". www.eenadu.net. Archived from the original on 8 సెప్టెంబరు 2019. Retrieved 2019-09-08.
 12. "Chandrayaan 2". NSSDCA Master Catalog. NASA. Retrieved 3 July 2019.
 13. Banerji, Abigail (13 July 2019). "Chandrayaan 2: Everything you need to know about the orbiter's mission and design". Tech2. Retrieved 14 July 2019.
 14. "Cabinet clears Chandrayaan-2". The Hindu. 2008-09-19. Archived from the original on 2008-10-27. Retrieved 2008-10-23.
 15. "India, Russia to expand n-cooperation, defer Kudankulam deal". Earthtimes.org. 2008-11-12. Retrieved 2008-11-11.
 16. "ISRO completes Chandrayaan-2 design news". domain-b.com. 2009-08-17. Retrieved 2009-08-20.
 17. "India and Russia complete design of new lunar probe". 2009-08-17. Archived from the original on 2013-05-15. Retrieved 2009-08-20.
 18. "India and Russia Sign an Agreement on Chandrayaan-2". ISRO. 2007-11-14. Archived from the original on 2008-10-12. Retrieved 2008-10-23.
 19. Laxman, Srinivas (6 February 2012). "India's Chandrayaan-2 Moon Mission Likely Delayed After Russian Probe Failure". Asian Scientist. Retrieved 5 April 2012.
 20. Ramachandran, R. (22 January 2013). "Chandrayaan-2: India to go it alone". The Hindu.
 21. The women, and men, behind Chandrayaan 2. Madhumathi D.S., The Hindu. 15 July 2019.
 22. Chandrayaan-2: India launches second Moon mission. BBC News. 22 July 2019.
 23. "Chandrayaan-2 deputy project director taught village students to fund his education | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 30 July 2019. Retrieved 2019-08-23.
 24. ది ఎకనామిక్ టైమ్స్-చంద్రయాన్-2 చంద్రునికి చేరువలో
 25. Johnson (August 31, 2010). "Three new Indian payloads for Chandrayaan 2, decides ISRO". Indian Express. Archived from the original on 2010-11-03. Retrieved 2010-08-31.
 26. 26.0 26.1 26.2 26.3 26.4 26.5 26.6 "Payloads for Chandrayaan-2 Mission Finalised". Indian Space Research Organisation (ISRO). ISRO. August 30, 2010. Archived from the original on 2012-10-15. Retrieved 2010-09-02.
 27. Beary, Habib (4 February 2010). "NASA and ESA to partner for chandrayaan-2". Skaal Times. Archived from the original on 15 జూలై 2011. Retrieved 22 Feb 2010.
 28. 28.0 28.1 "మేము చంద్రయాన్-2ను చంద్రుని కులంకుష పరిశోధనకు ప్రయోగిస్తున్నాం". టైమ్స్ ఆఫ్ ఇండియా. 5 Sep 2010. Archived from the original on 20 మే 2019. Retrieved 7 డిసెంబరు 2010.
 29. "Payloads for Chandrayaan-2 Mission Finalised" (Press release). Indian Space Research Organisation. 30 August 2010. Archived from the original on 13 మే 2019. Retrieved 4 January 2010.
 30. "Chandrayaan-2 to get closer to moon". The Economic Times. Times News Network. 2 September 2010. Archived from the original on 12 August 2011.
 31. 31.0 31.1 31.2 ది ఎకనామిక్ టైమ్స్- చంద్రునికి చేరువ అవుతున్న చంద్రయాన్-2
 32. 32.0 32.1 32.2 "పత్రికా ప్రకటన". Archived from the original on 22 Oct 2013.
 33. "Annual Report 2015-2016" (PDF). Indian Space Research Organisation. December 2015. p. 89. Archived from the original (PDF) on 5 జూలై 2016. Retrieved 23 ఆగస్టు 2019.
 34. "HAL Delivers the Orbiter Craft Module Structure of Chandrayaan-2 to ISRO". Hindustan Aeronautics Limited. 22 June 2015. Archived from the original on 2 సెప్టెంబరు 2018. Retrieved 23 ఆగస్టు 2019.
 35. "చిన్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వాహనాలను తయారు చేస్తున్నాం". ఫ్రంట్‌లైన్ (in ఇంగ్లీష్). Retrieved 29 August 2018. 3 , 4 కిలో న్యూటన్ల త్రాటిలబుల్ ఇంజన్ను తయారు చెయ్యడం మాకు పూర్తిగా కొత్త. కానీ మేం అందుబాటులో ఉన్న సాంకేతికతలను వాడుకోవాలనుకున్నాం. మాకు 400 న్యూటన్ల సామర్థ్యం గల లిక్విడ్ అపోజీ మోటరుంది. దాన్ని మా ఉపగ్రహాల్లో వాడుతూనే ఉన్నాం. మేం దాని సామర్థ్యాన్ని 800 న్యూటన్లకు పెంచాం. అది పెద్ద దిజైను మార్పేమీ కాదు.[permanent dead link]
 36. Mondal, Chinmoy; Chakrabarti, Subrata; Venkittaraman, D.; Manimaran, A. (2015). Development of a Proportional Flow Control Valve for the 800N Engine Test. 9th National Symposium and Exhibition on Aerospace and Related Mechanisms. January 2015. Bengaluru, India.
 37. "చంద్రయాన్-2: సమీప భవిష్యత్తులో చంద్రుడిపై కాలు పెట్టేందుకు భారతీయుల తొలి అడుగు". ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్. Retrieved 2019-07-08. ఈ వ్యవస్థకు శక్తిని సమకూర్చేది సౌర విద్యుత్తు కాబట్టి, వెలుతురు పడే చోట ఉండాలి. ఆ స్థలం నుండి సమాచార సౌకర్యం ఉండాలి. దిగే చోట పెద్ద పెద్ద రాళ్ళు, గోతులూ ఉండకూడదు. ఆ స్థలం వాలు 12 డిగ్రీలకు మించి ఉండకూడదు. దక్షిణ ధ్రువం వద్ద నేల దాదాపు సమతలంగా ఉంటుంది. బాగా ఎండ పడుతూ, వెలుతురుగా ఉంటుంది.
 38. సుబ్రమణియన్, టి. ఎస్. "చంద్రయాన్ 2: ఇస్రో వేస్తున్న పెద్ద అంగ". ఫ్రంట్‌లైన్ (in ఇంగ్లీష్). Retrieved 2019-07-09.
 39. డి. ఎస్., మధుమతి (25 October 2016). "చంద్రయాన్-2 యాత్ర కోసం ఇస్రో ల్యాండింగు పరీక్షలు మొదలు పెట్టింది". ది హిందూ. Retrieved 28 October 2016.
 40. "Chandrayaan-2 Payloads". 12 June 2019. Archived from the original on 13 July 2019. Retrieved 13 July 2019.
 41. 41.0 41.1 బాగ్లా, పల్లవ (31 January 2018). "ఇండియా ప్లాన్స్ ట్రికీ అండ్ అన్‌ప్రిసిడెంటెడ్ ల్యాండింగ్ నియర్ మూన్స్ సౌత్ పోల్". Science. Retrieved 8 March 2018.
 42. Mallikarjun, Y. (29 May 2013). "India plans to send seismometer to study moonquakes". The Hindu. Retrieved 1 June 2013.
 43. చంద్రయాన్-2 లో చంద్రుడి వైపు భారత ప్రయాణం. డేవిడ్ డికెన్సన్, స్కై & టెలిస్కోప్. 22 జూలై 2019. కోట్: "విక్రమ్ ఒక సీస్మోమీటరును, ఒక థెర్మల్ ప్రోబ్‌ను, చంద్రుడి ఉపరితలంపై ఉన్న ప్లాస్మా సాంద్రతను, దానిలోని వ్యత్యాసాలనూ కొలిచే పరికరాన్నీ తీసుకుపోతుంది. వీటితో పాటు, నాసా వారి గోడార్డ్ స్పేస్‌ఫ్లైట్ సెంటర్ ఇచ్చిన రెట్రో రిఫ్లెక్టరును కూడా తీసుకుపోతుంది."
 44. బార్టెల్స్, మేఘన్ (24 March 2019). "ఇజ్రాయిలీ, భారత చంద్ర పరిశోధనల్లో తన పరిశోధనలను కూడా చేర్చేందుకు నాసా ఎలా పాకులాడింది." Retrieved 25 March 2019.
 45. సైన్స్, చెల్సీ గోడ్ 2019-07-26T16:42:31Z; ఏస్ట్రానమీ. "అపోలో యాత్ర చేసిన 50 ఏళ్ళ తరువాత, భారత్ నాసా వారి లేసర్ రిఫ్లెక్టరును చంద్రుని వద్దకు తీసుకుపోతోంది (ఇది ఆరంభం మాత్రమే)". Space.com (in ఇంగ్లీష్). Retrieved 2019-07-26.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
 46. "Dr M Annadurai, Project director, Chandrayaan 1: 'Chandrayaan 2 logical extension of what we did in first mission'". The Indian Express (in Indian English). 2019-06-29. Retrieved 2019-06-30.
 47. Payyappilly, Baiju; Muthusamy, Sankaran (17 January 2018). "Design framework of a configurable electrical power system for lunar rover". ResearchGate: 1–6. doi:10.1109/ICPCES.2017.8117660. ISBN 978-1-5090-4426-9.
 48. 48.0 48.1 48.2 Amitabh, S.; Srinivasan, T. P.; Suresh, K. (2018). Potential Landing Sites for Chandrayaan-2 Lander in Southern Hemisphere of Moon (PDF). 49th Lunar and Planetary Science Conference. 19–23 March 2018. The Woodlands, Texas. Bibcode:2018LPI....49.1975A. Archived from the original (PDF) on 22 August 2018.
 49. Subramanian, T. S. "What went wrong with the Chandrayaan-2 launch". Frontline (in ఇంగ్లీష్). Retrieved 2019-07-24.
 50. 50.0 50.1 "GSLV MkIII-M1 Successfully Launches Chandrayaan-2 spacecraft". www.isro.gov.in. ISRO. Archived from the original on 2019-12-12. Retrieved 2019-07-23.
 51. Jul 23, Chethan Kumar | TNN | Updated:; 2019; Ist, 15:00. "Chandrayaan-2 will only have 4 operations around Earth | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-07-24. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
 52. "Live coverage: India's Chandrayaan 2 moon mission blasts off". SpaceFlight Now (in ఇంగ్లీష్). Retrieved 2019-07-24.
 53. Kumar, Chethan (29 July 2019). "Chandrayaan-2 healthy after another manoeuvre | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-07-29.
 54. "చంద్రయాన్-2 అప్‌డేట్స్". ఇస్రో. Archived from the original on 4 సెప్టెంబరు 2019. Retrieved 23 Aug 2019.
 55. "చంద్రయాన్-2 సక్సెస్‌ఫుల్లీ ఎంటర్స్ ల్యూనార్ ట్రాన్స్‌ఫర్ ట్రాజెక్టరీ". ఇస్రో. 14 Aug 2019. Archived from the original on 13 ఆగస్టు 2019. Retrieved 23 Aug 2019.
 56. "ప్రెస్ మీట్ - బ్రీఫింగ్ బై డా.కె శివన్, చైర్మన్ ఇస్రో". ఇస్రో. 20 Aug 2019. Archived from the original on 23 ఆగస్టు 2019. Retrieved 23 Aug 2019.
 57. "చంద్రయాన్-2 తాజా స్థితి: చంద్ర కక్ష్యలో మూడవ విన్యాసం". ఇస్రో. 28 Aug 2019. Archived from the original on 28 Aug 2019. Retrieved 28 Aug 2019.
 58. "Chandrayaan-2 lunar orbit reduced further". The Hindu (in Indian English). Special Correspondent. 2019-08-28. ISSN 0971-751X. Retrieved 2019-08-28.{{cite news}}: CS1 maint: others (link)
 59. "చంద్రయాన్-2 తాజా వార్త: నాలుగవ చంద్ర కక్ష్యా విన్యాసం - ఇస్రో". www.isro.gov.in. 30 Aug 2019. Archived from the original on 3 Sep 2019. Retrieved 2019-09-03.
 60. "చంద్రయాన్-2 తాజా సమాచారం: ఐదవ చంద్ర కక్ష్యా విన్యాసం - ఇస్రో". www.isro.gov.in. 3 Sep 2019. Archived from the original on 3 Sep 2019. Retrieved 2019-09-03.
 61. "చంద్రయాన్-2: మరో కీలక ఘట్టం పూర్తి". www.andhrajyothy.com. 2019-09-02. Archived from the original on 4 Sep 2019. Retrieved 2019-09-04.
 62. "చంద్రయాన్-2 తాజా సమాచారం: ఆర్బిటరు నుండి విక్రమ్ ల్యాండరు విజయవంతంగా విడివడింది - ఇస్రో". www.isro.gov.in. Archived from the original on 3 Sep 2019. Retrieved 2019-09-03.
 63. "చంద్రయాన్-2 తాజా సమాచారం: కక్ష్య నుండి తప్పించే తొలి విన్యాసం - ఇస్రో". www.isro.gov.in. Archived from the original on 3 Sep 2019. Retrieved 2019-09-03.
 64. ఈనాడు. "మరోసారి ల్యాండర్‌ కక్ష్య తగ్గింపు". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 4 Sep 2019. Retrieved 2019-09-04.
 65. "చంద్రయాన్-2 తాజా సమాచారం: కక్ష్య నుండి తప్పించే రెండవ విన్యాసం - ఇస్రో". www.isro.gov.in. Archived from the original on 4 Sep 2019. Retrieved 2019-09-04.
 66. "'విక్రమ్' నుంచి నిలిచిన సందేశాలు". ఈనాడు. 7 Sep 2019. Archived from the original on 7 Sep 2019. Retrieved 7 Sep 2019. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 6 సెప్టెంబరు 2019 suggested (help)
 67. "చంద్రయాన్‌-2: విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్". ఆంధ్రజ్యోతి. Archived from the original on 7 Sep 2019. Retrieved 7 Sep 2019. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 6 సెప్టెంబరు 2019 suggested (help)
 68. 68.0 68.1 "చంద్రయాన్ - 2 తాజా సమాచారం - ఇస్రో". www.isro.gov.in. 7 Sep 2019. Archived from the original on 8 Sep 2019. Retrieved 2019-09-08.
 69. ఈనాడు (8 Sep 2019). "విక్రమ్‌ ఆచూకీ తెలిసింది: ఇస్రో". www.eenadu.net. Archived from the original on 8 సెప్టెంబరు 2019. Retrieved 2019-09-08.
 70. Acharya, Prasanna; Singh, Jitendra (3 August 2017). "Question No. 2222: Status of Chandrayaan Programme" (PDF). Rajya Sabha.
 71. Singh, Surendra (20 February 2018). "Chandrayaan-2 mission cheaper than Hollywood film Interstellar". The Times of India. Times News Network. Retrieved 3 March 2018.
 72. Chandrayaan 1 Mission Terminated Archived 13 ఆగస్టు 2011 at the Wayback Machine
 73. Water on the Moon: Direct evidence from Chandrayaan-1's Moon Impact Probe. Published on 2010/04/07.