Jump to content

నావిక్

వికీపీడియా నుండి
భారతీయ క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ
NAVIC (Navigation with Indian Constellation)
IRNSS సిరీస్ 1 ఉపగ్రహం
మూలాధారమైన దేశం భారతదేశం
ఆపరేటర్ఇస్రో
రకంసైనిక, వాణిజ్య
స్థితిఆచరణాత్మకం
కవరేజ్క్షేత్రీయ
ప్రెసిసన్10-20 metres
కూటమి పరిమాణం
మొత్తం ఉపగ్రహాలు7
కక్ష్యలోని ఉపగ్రహాలు7
ప్రయోగ ప్రారంభం2013 జూలై 1
చివరి ప్రయోగం2016 ఏప్రిల్ 28, 12:50 PM IST
మొత్తం ప్రయోగాలు7
ఆర్బిటాల్ లక్షణాలు
పాలనా వ్యవస్థలుHigh Earth
ఆర్బిటాల్ ఎత్తు36,000 కి.మీ. (22,000 మై.)[1]
ఇతర వివరములు
వ్యయం$212 మిలియన్లు

భారత సొంత ఉపగ్రహాధారిత నావిగేషన్ వ్యవస్థ పేరు నావిక్. ఇది భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్-ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్) దీని ద్వారా ప్రపంచంలో సొంత మార్గదర్శక వ్యవస్థలు గల ఐదు శక్తుల సరసన భారత నిలిచింది. నావిక్‌ ద్వారా ప్రజలకు అందించే సేవల్లో 20 మీటర్లకు అటూఇటుగా కచ్చితత్వం ఉంటే.. నియంత్రిత సేవల పేరిట సైనికులకు కేవలం 10 మీటర్ల కచ్చితత్వంతో సేవలు అందించేలా ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేసారు . 2013 నుంచి 2016 వరకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట లోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఏడు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ శ్రేణి,XLరకానికి చెందిన ఉపగ్రహవాహకనౌకలు దిగ్విజయంగా భూస్థిర బదిలీ కక్ష్య (జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టాయి. ఏడింటిలో మూడింటిని భూ స్థిర కక్ష్యలోకి బదిలీ చేయగా, మిగిలిన 4 ఉపగ్రహాలను భూ సమవర్తన కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థ 2016 ఆగస్టు 15 నుండి ఆచరణలోకి రానుంది.

నేపథ్యం

[మార్చు]

1999లో కార్గిల్ యద్ధంలో పాక్ సైనిక దళాలు ఎక్కడ కచ్ఛితంగా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవటానికి భారత సైన్యానికి నావిగేషన్ వ్యవస్థ అవసరమైంది. ఈ సాంకేతికత అందుబాటులో ఉన్న అమెరికాను భారత్ సాయం కోరింది. కానీ, భారత్ కు సాయం చేయటానికి అమెరికా నిరాకరించింది. దీన్నో గుణపాఠంగా భావించిన ఇస్రో, అప్పటి నుంచి దేశీయంగా రూపొందించే నావిగేషన్ వ్యవస్థ మీద దృష్టి పెట్టింది. దాదాపు ఒకటిన్నర దశాబ్దాలకు పైగా ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్-ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించి భారత సొంత నావిగేషన్ వ్యవస్థ, నావిక్, ఏర్పడింది.

ఉపయోగాలు

[మార్చు]

సెల్‌ఫోన్లు ఇతర పరికరాల ద్వారా నావిక్ నావిగేషన్ సౌకర్యాలు అందుబాటులోకి రావడంతోపాటు వైమానిక, నౌకాయాన రంగాలకు, రక్షణ, పౌర సేవలకూ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఎంతో ఉపయోగము.

ఉపగ్రహాల జాబితా

[మార్చు]

నావిక్ 7 ఉపగ్రహాల సమాహారం. వీటిలో మూడు భూస్థిర కక్ష్యలో ఉంచగా, మిగిలిన నాలుగింటిని భూసమవర్తన కక్ష్యలో ప్రవేశపెట్టారు. నేటి వరకూ నావిక్ శ్రేణిలో భాగంగా ప్రయోగించిన మొత్తం ఉపగ్రహాలు 9. కాగా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నవి 7 మాత్రమే. మొత్తం ఉపగ్రహాల జాబితా ఇది:

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1 శ్రేణి లోని ఉపగ్రహాలు[2]
ఉపగ్రహం ప్రయోగించిన తేదీ వాహకనౌక కక్ష్య స్థితి వివరం
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ 2013 జూలై 1 పిఎస్‌ఎల్‌వి-సి22 పాక్షికంగా విఫలమైంది అణుగడియారం చెడిపోయింది.[3][4]
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బి 2014 ఏప్రిల్ 4 పిఎస్‌ఎల్‌వి-సి24 పనిచేస్తోంది
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి 2014 అక్టోబరు 15 పిఎస్‌ఎల్‌వి-సి26 పనిచేస్తోంది
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డి 2015 మార్చి 28 పిఎస్‌ఎల్‌వి-సి27 పనిచేస్తోంది
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఇ 2016 జనవరి 20 పిఎస్‌ఎల్‌వి-సి31 పనిచేస్తోంది
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ 2016 మార్చి 10 పిఎస్‌ఎల్‌వి-సి32 పనిచేస్తోంది
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి 2016 ఏప్రిల్ 28 పిఎస్‌ఎల్‌వి-సి33 పనిచేస్తోంది
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ 2017 ఆగస్టు 31 పిఎస్‌ఎల్‌వి-సి39 వాహకనౌక ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టలేకపోయింది పేలోడ్ ఫెయిరింగు విడివడిపోవడంలో విఫలమైంది. ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి చేర్చలేకపోయారు.[5][6] 1ఎ ఉపగ్రహం స్థానంలో దీన్ని ప్రయోగించారు.[3][7]
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ 2018 ఏప్రిల్ 12 పిఎస్‌ఎల్‌వి-సి41 పనిచేస్తోంది ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ అందించవలసిన సేవలను ఇది కొనసాగిస్తుంది.

గడియారం వైఫల్యం

[మార్చు]

2017 లో, ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ లోని మూడు అణు గడియారాలు చెడిపోయాయని ప్రకటించారు. ఐరోపా వారి గెలీలియో ఉపగ్రహాల్లో క్కూడా అవి చెడిపోయాయి. మొదటి వైఫల్యం 2016 జూలైలో జరగ్గా, మిగతా రెండు కూడా ఆ తరువాత చెడిపోయాయి. దీంతో ఉపగ్రహం దాదాపు పనికిరాకుండా పోవడంతో మరొక ఉపగ్రహాన్నీ ప్రయోగించాల్సిన ఆవసరం ఏర్పడింది. ఉపగ్రహం పనిస్తూనే ఉన్నప్పటికీ, అది పంపించే డేటా కచ్చితత్వం తక్కువగా ఉంటుంది.[8] దాని స్థానంలో ఇస్రో ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ఉపగ్రహం, పిఎస్‌ఎల్‌వి-సి39 వైఫల్యం కారణంగా కక్ష్యను చేరలేదు.[7]

నావిక్ వ్యవస్థలో మరో రెండు గడియారాల పనితీరు కూడా అంతగా బాగుండలేదు.[7]

నావిక్ వ్యవస్థలోని మిగిలిన ఉపగ్రహాల జీవితకాలాన్ని పెంచేందుకుగాను, వాటిలో రెండు అణుగడియారాలకు బదులు, ఒకే గడియారాన్ని పనిచేయిస్తున్నారు.[7] ఈ అణుగడియారాలను స్పెక్ట్రాటైమ్ అనే సంస్థ సరఫరా చేసింది.[9][10] స్టాండ్‌బై ఉపగ్రహాల్లోని ఈ అణుగడియారాలను తీసివేసి, వాటి స్థానంలో వేరే గడియారాలను అమర్చింది.[7] నావిక్ వ్యవస్థ ఇంకా వాణిజ్య కార్యకక్రమాలు మొదలుపెట్టకముందే ఈ వైఫల్యం ఎదురైంది.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Orbit height and info". Archived from the original on 2016-06-02. Retrieved 2016-04-30.
  2. "IRNSS". www.isac.gov.in. Retrieved 2017-06-08.
  3. 3.0 3.1 Mukunth, Vasudevan. "3 Atomic Clocks Fail Onboard India's 'Regional GPS' Constellation". thewire.in (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2017-06-08.
  4. D.S., Madhumathi. "Atomic clocks on indigenous navigation satellite develop snag". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2017-06-08.
  5. "ISRO says launch of navigation satellite IRNSS-1H unsuccessful". The Economic Times. 2017-08-31. Retrieved 2017-08-31.
  6. "IRNSS-1H launch unsuccessful, says ISRO". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-08-31. Retrieved 2017-08-31.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 IANS (2017-06-10). "Navigation satellite clocks ticking; system to be expanded: ISRO". The Economic Times. Archived from the original on 2017-06-14. Retrieved 2017-06-11.
  8. D.S., Madhumathi. "Atomic clocks on indigenous navigation satellite develop snag". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2017-01-31.
  9. "SpectraTime to Supply Atomic Clocks to IRNSS | Inside GNSS". www.insidegnss.com (in ఇంగ్లీష్). Archived from the original on 2017-06-26. Retrieved 2017-06-21.
  10. "Spectratime Awarded Contract To Supply Rubidium Space Clocks To IRNSS". www.spacedaily.com. Retrieved 2017-06-21.

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నావిక్&oldid=3893494" నుండి వెలికితీశారు