Jump to content

సరళ్ (ఉపగ్రహం)

వికీపీడియా నుండి

 

సరళ్
దస్త్రం:SARAL.jpg
సరళ్ - చిత్రకారుని ఊహ
పేర్లుArgos, ALtiKa లతో కూడిన ఉపగ్రహం
మిషన్ రకంభూ పరిశీలన
ఆపరేటర్ఇస్రో
COSPAR ID2013-009A Edit this at Wikidata
SATCAT no.39086
వెబ్ సైట్https://isro.gov.in/
మిషన్ వ్యవధి5 సంవ్బత్సరాలు
11 సంవత్సరాలు, 10 నెలలు , 7 రోజులు (in progress)
అంతరిక్ష నౌక లక్షణాలు
అంతరిక్ష నౌకసరళ్
బస్IMS-2
తయారీదారుడుఇస్రో / CNES
లాంచ్ ద్రవ్యరాశి407 కి.గ్రా. (897 పౌ.) [1][2]
కొలతలు1 m x 1 m x 0.6 m
శక్తి850 watts
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ2013 ఫిబ్రవరి 25, 12:31 UTC[3]
రాకెట్పిఎస్‌ఎల్‌వి, పిఎస్‌ఎల్‌వి-C20
లాంచ్ సైట్సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
కాంట్రాక్టర్ఇస్రో
సేవలో ప్రవేశం2013 జూన్ 25
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric orbit
రెజిమ్సౌర సమవర్తన కక్ష్య
Perigee altitude790 కి.మీ. (490 మై.)
Apogee altitude791 కి.మీ. (492 మై.)
వాలు98.54°
వ్యవధి100.54 minutes
Instruments
Advanced Data Collection System ("Argos-3") (A-DCS)
Ka-band Altimeter (ALtiKa)
Doppler Orbitography and Radiopositioning Integrated by Satellite (DORIS)
Laser Retroreflector Array (LRA)
కార్టోశాట్-2C →
 

సరళ్, భరతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO), ఫ్రాన్సుకు చెందిన సెంటర్ నేషనల్ డి'ఇటుడ్స్ స్పేషియల్స్ (CNES) లు సంయుక్తంగా చేపట్టిన ఆల్టిమెట్రీ టెక్నాలజీ మిషన్. Satellite with ARgos and ALtiKa అనే ఇంగ్లీషు మాటల మొదటి అక్షరాల నుండి వచ్చిన మాటే SARAL (సరళ్). సముద్ర ప్రవాహాలు, సముద్ర ఉపరితల ఎత్తును అధ్యయనం చేయడానికి రూపొందించిన ఆల్మెట్రిక్ కొలతలను ఇది కొలుస్తుంది. [2] [4]

మిషన్

[మార్చు]

సరళ్ మిషన్‌పై CNES / ISRO లు 2007 ఫిబ్రవరి 23 న అవగాహనా పత్రం మీద సంతకం చేసాయి. [5] సరళ్ NASA / NOAA, CNES / EUMETSAT వారి జాసన్-2 మిషన్‌కు అనుబంధ మిషన్. ఇది ఎన్విసాట్‌కు, యూరోపియన్ కోపర్నికస్ ప్రోగ్రామ్ (గ్లోబల్ మానిటరింగ్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ సెక్యూరిటీ - GMES ప్రోగ్రామ్) వారి సెంటినెల్-3 మిషన్‌కూ మధ్య ఉన్న అంతరాన్ని పూరిస్తుంది. కక్ష్యలోని రెండు ఆల్టిమెట్రీ మిషన్ల కలయిక సముద్ర ఉపరితల ఎత్తు (SSH) గణనపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. సగటు మ్యాపింగ్ లోపాన్ని నాలుగో వంతుకు తగ్గిస్తుంది. [5]

వాయిద్యాలు

[మార్చు]

SARAL పేలోడ్ మాడ్యూల్‌ను CNES అందించింది. ఇందులో ALtiKa (Ka-band altimeter), డాప్లర్ ఆర్బిటోగ్రఫీ అండ్ రేడియోపొజిషనింగ్ ఇంటిగ్రేటెడ్ బై శాటిలైట్ (DORIS), లేజర్ రెట్రోరెఫ్లెక్టర్ అర్రే (LRA), ARGOS డేటా సేకరణ వ్యవస్థ ఉన్నాయి. ఉపగ్రహ బస్ ( ఇండియన్ మినీ శాటిలైట్-2 ), ప్రయోగం ( పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్), ఉపగ్రహ కార్యకలాపాలకు ఇస్రో బాధ్యత వహించింది.

ARGOS అడ్వాన్స్‌డ్-డేటా కలెక్షన్ సిస్టమ్ (A-DCS)

[మార్చు]

ఫ్రెంచ్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ (CNES) వారి అర్గోస్-3 ను, థేల్స్ అలెనియా స్పేస్ (TAS) తయారు చేసింది. గ్లోబల్ ARGOS అడ్వాన్స్‌డ్-డేటా కలెక్షన్ సిస్టమ్ అభివృద్ధికి, అమలుకూ ARGOS దోహదపడుతుంది. తదుపరి ప్రాసెసింగ్, పంపిణీ కోసం ARGOS గ్రౌండ్ సెగ్మెంట్‌కు ప్రసారం చేయడానికి సముద్రాల్లో ఉండే బోయ్‌ల నుండి వివిధ రకాల డేటాను సేకరిస్తుంది. [5]

Ka-బ్యాండ్ ఆల్టిమీటర్ (ALtiKa)

[మార్చు]

ALtiKa, సరళ్ లోని ఆల్టిమీటర్, ప్రధానమైన పేలోడ్. ఇది Ka-band వద్ద పనిచేసే మొదటి అంతరిక్ష స్థిత ఆల్టిమీటర్. [6] దీనిని ఫ్రెంచ్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ, CNES నిర్మించింది. సముద్ర శాస్త్ర అనువర్తనాల కోసం ఉద్దేశించిన ఈ పేలోడ్, 35.75 GHz వద్ద పనిచేస్తుంది. ALTIKA ను ఎన్విసాట్ నుండి సముద్ర పర్యవేక్షణను చేపట్టేందుకు సిద్ధం చేసారు. ఇంత అధిక పౌనఃపున్యంతో పనిచేసే పరికరాల్లో ఇదే మొదటిది. ఇది మరింత చిన్నదిగా ఉండి, మునుపటి తరం కంటే మెరుగైన పనితీరును అందిస్తుంది. [7]

ఇప్పటికే ఉన్న ఉపగ్రహ స్థిత ఆల్టిమీటర్‌లు రాడార్ సిగ్నల్‌ను ఉపరితలం నుండి ప్రతిఫలింపజేసి, రిటర్న్-ట్రిప్ సమయాన్ని కొలవడం ద్వారా సముద్ర మట్టాన్ని నిర్ణయిస్తుండగా, ALtiKa Ka-బ్యాండ్‌లో అధిక ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంది. దీని వలన రెండు విధాలుగా ప్రయోజనం ఉంటుంది. ఒకటి, భూ వాతావరణం రాడార్ సిగ్నల్‌ను నెమ్మదిస్తుంది, కాబట్టి ఆల్టిమెట్రీ కొలతలు వక్రంగా ఉంటాయి. ఈ లోపాన్ని సరిచేయడానికి అదనపు పరికరాలను అవసరం. ALTIKA వేరొక వ్యవస్థను ఉపయోగిస్తుంది కాబట్టి, ప్రస్తుత తరం ఆల్టిమీటర్‌ల వలె వాతావరణ ప్రభావాలను సరిచేయడానికి ఇది అదనపు పరికరాన్ని వాడాల్సిన అవసరం లేదు. ALtiKa Ka-bandలో అధిక ఫ్రీక్వెన్సీతో పనిచేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించింది. అధిక పౌనఃపున్యాల వద్ద పనిచేసే మరొక ప్రయోజనం ఎక్కువ కచ్చితత్వం. ALtiKa సముద్ర ఉపరితల స్థలాకృతిని 8 మి.మీ. కచ్చితత్వంతో కొలుస్తుంది. ప్రస్తుత తరం ఆల్టిమీటర్‌లు సగటున 25 మి.మీ. నుండి 20 మి.మీ. రిజల్యూషన్‌ ఇస్తాయి. అయితే ప్రతికూలత ఏమిటంటే, అధిక-ఫ్రీక్వెన్సీ తరంగాలు వర్షానికి, చినుకులకు కూడా చాలా సున్నితంగా ఉంటాయి. 10% డేటా పోతుందని అంచనా వేసారు. (అయితే అవపాతం యొక్క ముడి కొలతలను నిర్వహించడానికి దీనిని ఉపయోగించుకోవచ్చు). [7]

డోరిస్

[మార్చు]

DORIS (డాప్లర్ ఆర్బిటోగ్రఫీ అండ్ రేడియోపొజిషనింగ్ ఇంటిగ్రేటెడ్ బై శాటిలైట్) డ్యూయల్-ఫ్రీక్వెన్సీ ట్రాకింగ్ సిస్టమ్ (400 MHz, 2 GHz) ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న భూమి బీకాన్‌లను విడుదల చేసే నెట్‌వర్కుతో పనిచేస్తుంది. [5]

లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అర్రే (LRA)

[మార్చు]

LRA లక్ష్యం మిషన్ పొడుగునా కచ్చితమైన కక్ష్య నిర్ధారణ వ్యవస్థ, ఆల్టిమీటర్ వ్యవస్థను నిర్వహించడం. LRA అనేది కొన్ని మిల్లీమీటర్ల కచ్చితత్వంతో గ్రౌండ్ స్టేషన్ల నుండి లేజర్ షాట్‌లతో ఉపగ్రహాన్ని గుర్తించడానికి ఉపయోగించే వ్యవస్థ. [5]

అప్లికేషన్లు

[మార్చు]

సరళ్ డేటా ఉత్పత్తులు అనేక రంగాలలోని పరిశోధనకు, వినియోగదారులకు ఉపయోగపడతాయి:

  • సముద్ర వాతావరణ శాస్త్రం, సముద్ర స్థితి అంచనా
  • ఆపరేషనల్ ఓషనోగ్రఫీ
  • కాలానుగుణ అంచనా
  • వాతావరణ పర్యవేక్షణ
  • మహాసముద్రం, భూమి వ్యవస్థ, వాతావరణాల పరిశోధన
  • ఖండలపై ఉన్న మంచు అధ్యయనాలు
  • జీవవైవిధ్య రక్షణ
  • సముద్ర పర్యావరణ వ్యవస్థ నిర్వహణ, రక్షణ
  • పర్యావరణ పర్యవేక్షణ
  • సముద్ర భద్రతను మెరుగుపరచడం

సెకండరీ పేలోడ్‌లు

[మార్చు]

ఈ నౌక లోని ఆరు ద్వితీయ పేలోడ్‌లు: [5]

• BRITE-Austria (CanX-3b), UniBRITE (CanX-3a) రెంటినీ ఆస్ట్రియా ఇచ్చింది.

Sapphire (స్పేస్ సర్వైలెన్స్ మిషన్ ఆఫ్ కెనడా), 148 కి.గ్రా. ద్రవ్యరాశి కలిగిన చిన్న ఉపగ్రహం

• NEOSSat (నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ సర్వైలెన్స్ శాటిలైట్ ), ~74 కి.గ్రా. ద్రవ్యరాశి కలిగిన కెనడాకు చెందిన మైక్రో ఉపగ్రహం

• AAUSAT3 (Aalborg University CubeSat-3), డెన్మార్క్‌లోని ఆల్‌బోర్గ్‌లోని AAU కి చెందిన విద్యార్థులు అభివృద్ధి చేసిన నానో ఉపగ్రహం

• STRaND-1 (సర్రే ట్రైనింగ్, రీసెర్చ్ అండ్ నానోశాటిలైట్ డెమోన్‌స్ట్రేటర్), SSTL ( సర్రే శాటిలైట్ టెక్నాలజీ లిమిటెడ్), USSC (యూనివర్సిటీ ఆఫ్ సర్రే స్పేస్ సెంటర్), గిల్డ్‌ఫోర్డ్, యునైటెడ్ కింగ్‌డమ్లు తయారు చేసిన 3U క్యూబ్‌శాట్ (నానోశాటిలైట్). STRaND-1 ద్రవ్యరాశి ~4.3 కి.గ్రా.

టొరంటో విశ్వవిద్యాలయం దాని నానోశాటిలైట్ లాంచ్ సర్వీసెస్ ప్రోగ్రామ్‌లో భాగంగా విశ్వవిద్యాలయాల కోసం మూడు చిన్న ఉపగ్రహాలను తీసుకువెళ్లడానికి ఏర్పాటు చేసింది. అవి, BRITE-Austria, UniBRITE, AAUSat3.

ప్రయోగం

[మార్చు]

సరళ్ 2013 ఫిబ్రవరి 25 న 12:31 UTCకి సౌర సమవర్తన కక్ష్య (SSO)లోకి విజయవంతంగా ప్రయోగించారు. [8] [3]

మూలాలు

[మార్చు]
  1. "SARAL". ISRO. Archived from the original on 2017-07-31. Retrieved 2013-03-06.
  2. 2.0 2.1 "Proposals Sought For Studying India-French Satellite Data". Space Mart. 4 January 2010. Archived from the original on 7 January 2010. Retrieved 12 May 2021.
  3. 3.0 3.1 "Rocket PSLV-20 successfully puts seven satellites in orbit". Zee News. 25 February 2013. Retrieved 12 May 2021.
  4. "SARAL". NASA. Archived from the original on 5 July 2012. Retrieved 12 May 2021.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "SARAL". ESA Earth Observation Portal. 11 May 2021. Retrieved 12 May 2021.
  6. (2015-09-10). "AltiKa Altimeter: Instrument Description and In Flight Performance". Informa UK Limited.
  7. 7.0 7.1 "GP - ALTIKA - Call for proposals until 15 February". CNES. 2010-01-18. Retrieved 2011-04-29.
  8. "Indo-French satellite SARAL set for launch on February 25". The Economic Times. 15 February 2013. Retrieved 12 May 2021.