Jump to content

భూ పరిశీలన ఉపగ్రహం

వికీపీడియా నుండి
2014 నాటికి ఆరు భూ పరిశీలన ఉపగ్రహాలతో ఉన్న ఏ-ట్రెయిన్ ఉపగ్రహ కూటమి.

భూ పరిశీలన ఉపగ్రహం (ఎర్త్‌ అబ్జర్వేషన్ శాటిలైట్) లేదా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం కక్ష్య నుండి భూమిని పరిశీలించడానికి ఉపయోగించే ఉపగ్రహం. ఇందులో సైనిక గూఢచర్య ఉపగ్రహాలతో పాటు, పర్యావరణ పర్యవేక్షణ, వాతావరణ, కార్టోగ్రఫీ వంటి సైనికేతర ఉపయోగాల కోసం ఉద్దేశించినవి ఉన్నాయి. వీటిలో అత్యంత సాధారణమైనవి భూమి చిత్రాలు తీసే ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహాలు. ఇవి తీసే చిత్రాలు వైమానిక ఛాయాచిత్రాలకు సారూప్యంగా ఉంటాయి. అయితే, అన్నీ భూ పరిశీలన ఉపగ్రహాలూ చిత్రాలు తీయవు. ఆల్టీమీటర్లు, మైక్రోవేవ్ రేడియోమీటర్ల వంటివి భూమి చిత్రాలు తీయకుండా ఎత్తునూ, వాతావరణ గుణాలనూ కొలుస్తాయి.

చరిత్ర

[మార్చు]

1957 అక్టోబరు 4న సోవియట్ యూనియన్ ప్రయోగించిన మొట్టమొదటి మానవ నిర్మిత ఉపగ్రహమైన స్పుత్నిక్ 1తో ఉపగ్రహ రిమోట్ సెన్సింగ్ మొదలైంది. స్పుత్నిక్ 1 పంపిన రేడియో సంకేతాలను శాస్త్రవేత్తలు అయనోస్ఫియర్‌ను అధ్యయనం చేయడానికి ఉపయోగించారు.[1] 1958 జనవరి 31న నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీకి చెందిన ఎక్స్‌ప్లోరర్ 1 ఉపగ్రహాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ బాలిస్టిక్ మిసైల్ ఏజెన్సీ కక్ష్యలోకి పంపింది. దానిలోని రేడియేషన్ డిటెక్టర్ పంపిన సమాచారం భూమి వాన్ ఆలెన్ రేడియేషన్ బెల్ట్‌లను కనుగొనడానికి దారితీసింది.[2] నాసాకు చెందిన టెలివిజన్ ఇన్‌ఫ్రారెడ్ అబ్జర్వేషన్ శాటిలైట్ (టిరోస్) కార్యక్రమంలో భాగంగా 1960 ఏప్రిల్ 1న ప్రయోగించిన టిరోస్-1 వ్యోమనౌక, అంతరిక్షం నుంచి తీసిన వాతావరణ నమూనాల తొలి టెలివిజన్ ఫుటేజీని పంపింది. ప్రస్తుతం అంతరిక్షంలో పనిచేస్తున్న ఉపగ్రహాలలో దాదాపు మూడింట ఒక వంతు భూ పరిశీలన ఉపగ్రహాలే ఉన్నాయి. యూనియన్ ఆఫ్ కన్సర్న్డ్ సైంటిస్ట్స్ (యుసిఎస్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, భూమి క్లక్ష్యలలో దాదాపు 7560 ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో 2023 జులై నాటికి 1157 భూ పరిశీలన ఉపగ్రహాలు ఉండగా, అత్యధికం అమెరికాకు చెందిన ప్లానెట్ ల్యాబ్స్‌కు చెందినవి.

ఉపయోగాలు

[మార్చు]

వినియోగదారుల అవసరాల మేరకు, వైవిధ్యభరితమైన ప్రాదేశిక సమాచారం, వర్ణపట చిత్రాలను అందించడానికి ఈ ఉపగ్రహాలలో వివిధ రకాల పరికరాలను అమరుస్తారు. ఈ ఉపగ్రహాల నుండి వచ్చిన సమాచారాన్ని వ్యవసాయం, నీటి వనరులు, పట్టణ ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, ఖనిజ అంచనా, పర్యావరణం, అటవీ, సముద్ర వనరులు, విపత్తు అంచనా వంటి అనేక అనువర్తనాలకు ఉపయోగిస్తారు. రాడార్, లిడార్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించే క్రియాశీల రిమోట్ సెన్సింగ్ పద్ధతుల ద్వారా భూమి ఉపరితలాన్ని ఖచ్చితంగా కొలిచే వీలు ఉంటుంది. కొన్ని సెంటీమీటర్ల పరిధిలో ఉండే ఖచ్చితత్వం వల్ల భూమి ఉపరితలంలో వచ్చే స్వల్ప స్థానభ్రంశాన్ని కూడా కొలవడం సాధ్యపడుతుంది. ఇంతే కాకుండా, రాడార్ తరంగాలు మేఘావృత పరిస్థితులలోనూ భూ ఉపరితలాన్ని చేరుకోగలవు. అందువల్ల ఈ సెన్సర్లు ఉన్న ఉపగ్రహాలు మేఘాల ప్రభావం ఉన్నప్పుడు కూడా చిత్రాలను అందిస్తాయి. రాడార్ సమాచారం ఉపయోగించి భూమి ఉపరితల 3-డి నమూనాలను రూపొందించవచ్చు

ప్రధాన వర్గాలు

[మార్చు]

వాతావరణ ఉపగ్రహం

[మార్చు]

వాతావరణ ఉపగ్రహాల ప్రధాన విధి భూమి వాతావరణాన్ని పరిశీలించడం, పర్యవేక్షించడం. ఇవి ప్రధానంగా మేఘాలను, వాటి గమనాన్ని పర్యవేక్షించినా, వాటితో పాటు నగర లైట్లు, మంటలు, వాతావరణ కాలుష్యం, అరోరా, ఇసుక తుఫానులు, మంచు, సముద్ర ప్రవాహాలు మొదలైన వాతావరణ సంబంధిత సమాచారాన్ని కూడా సేకరించగలవు.

సముద్ర ఉపగ్రహాలు

[మార్చు]

సముద్ర ఉపగ్రహాలు ప్రధానంగా తీరప్రాంత వనరుల అభివృద్ధి, సముద్ర జీవులు, వనరుల అభివృద్ధి, సముద్రంలోని వర్ణద్రవ్యాలను గుర్తించడం, సముద్ర కాలుష్య పర్యవేక్షణ, సముద్ర శాస్త్రీయ పరిశోధనలకు ప్రధానంగా ఉపయోగపడతాయి.

ఇస్రో ఉపగ్రహాలు

[మార్చు]

1988లో IRS-1ఎతో ప్రారంభించి ఇస్రో అనేక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ప్రయోగించింది. అత్యధిక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు కలిగి ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. ప్రస్తుతం, పదమూడు ఉపగ్రహాలు సూర్య-సమకాలిక కక్ష్యలో ఉన్నాయి. అవి రిసోర్స్‌శాట్ -1, 2, 2 ఎ, కార్టోశాట్ -1, 2, 2 ఎ, 2 బి, రిశాట్ -1, 2, ఓషన్‌శాట్ -2, మేఘా-ట్రాపిక్స్, సారాల్, స్క్యాట్‌శాట్ -1. జియోస్టేషనరీ కక్ష్యలో నాలుగు ఉన్నాయి. అవి ఇన్సాట్ -3 డి, కల్పన, ఇన్సాట్ 3 ఎ, ఇన్సాట్ -3 డిఆర్.

ఇస్రో భూమి పరిశీలన ఉపగ్రహాల జాబితా

[మార్చు]

ఇస్రో ప్రయోగించిన భూపరిశీలన ఉపగ్రహాల జాబితా.[3]

భూమి పరిశీలన ఉపగ్రహం పేరు ప్రయోగించిన తేదీ ప్రయోగించినప్పటి బరువు వాహకనౌక కక్ష్య అప్లికేషన్ వ్యాఖ్యలు
రిసాట్ -2 బిఆర్ 1 డిసెంబర్ 11, 2019 628 కిలోలు పిఎస్‌ఎల్‌వి-సి 48 / రిసాట్ -2 బిఆర్ 1 లియో విపత్తు నిర్వహణ వ్యవస్థ, భూమి పరిశీలన
కార్టోసాట్ -3 నవంబర్ 27, 2019 పిఎస్‌ఎల్‌వి-సి 47 / కార్టోసాట్ -3 మిషన్ SSPO భూమి పరిశీలన
రిసాట్ -2 బి మే 22, 2019 615 కిలోలు పిఎస్‌ఎల్‌వి-సి 46 మిషన్ లియో విపత్తు నిర్వహణ వ్యవస్థ, భూమి పరిశీలన
హైసిస్ నవంబర్ 29, 2018 PSLV-C43 / HysIS మిషన్ SSPO భూమి పరిశీలన
కార్టోసాట్ -2 సిరీస్ ఉపగ్రహం జనవరి 12, 2018 710 కిలోలు పిఎస్‌ఎల్‌వి-సి 40 / కార్టోసాట్ -2 సిరీస్ శాటిలైట్ మిషన్ SSPO భూమి పరిశీలన
కార్టోసాట్ -2 సిరీస్ ఉపగ్రహం జూన్ 23, 2017 712 కిలోలు పిఎస్‌ఎల్‌వి-సి 38 / కార్టోసాట్ -2 సిరీస్ ఉపగ్రహం SSPO భూమి పరిశీలన
కార్టోసాట్ -2 సిరీస్ ఉపగ్రహం ఫిబ్రవరి 15, 2017 714 కిలోలు పిఎస్‌ఎల్‌వి-సి 37 / కార్టోసాట్ -2 సిరీస్ ఉపగ్రహం SSPO భూమి పరిశీలన
రిసోర్సెసాట్ -2 ఎ డిసెంబర్ 07, 2016 1235 కిలోలు PSLV-C36 / RESOURCESAT-2A SSPO భూమి పరిశీలన
స్కాట్సాట్ -1 సెప్టెంబర్ 26, 2016 371 కిలోలు PSLV-C35 / SCATSAT-1 SSPO వాతావరణం & పర్యావరణం
INSAT-3DR సెప్టెంబర్ 08, 2016 2211 కిలోలు GSLV-F05 / INSAT-3DR GSO వాతావరణం & పర్యావరణం, విపత్తు నిర్వహణ వ్యవస్థ
కార్టోసాట్ -2 సిరీస్ ఉపగ్రహం జూన్ 22, 2016 737.5 కిలోలు పిఎస్‌ఎల్‌వి-సి 34 / కార్టోసాట్ -2 సిరీస్ ఉపగ్రహం SSPO భూమి పరిశీలన
ఇన్సాట్ -3 డి జూలై 26, 2013 2060 కిలోలు అరియానే -5 వీఏ -214 GSO వాతావరణం & పర్యావరణం, విపత్తు నిర్వహణ వ్యవస్థ
SARAL ఫిబ్రవరి 25, 2013 407 కిలోలు PSLV-C20 / SARAL SSPO క్లైమేట్ & ఎన్విరాన్మెంట్, ఎర్త్ అబ్జర్వేషన్
రిసాట్ -1 ఏప్రిల్ 26, 2012 1858 కిలోలు పిఎస్‌ఎల్‌వి-సి 19 / రిసాట్ -1 SSPO భూమి పరిశీలన
మేఘా-ట్రాపిక్స్ అక్టోబర్ 12, 2011 1000 కిలోలు పిఎస్‌ఎల్‌వి-సి 18 / మేఘా-ట్రాపిక్స్ SSPO క్లైమేట్ & ఎన్విరాన్మెంట్, ఎర్త్ అబ్జర్వేషన్
రిసోర్సెసాట్ -2 ఏప్రిల్ 20, 2011 1206 కిలోలు PSLV-C16 / RESOURCESAT-2 SSPO భూమి పరిశీలన
కార్టోసాట్ -2 బి జూలై 12, 2010 694 కిలోలు పిఎస్‌ఎల్‌వి-సి 15 / కార్టోసాట్ -2 బి SSPO భూమి పరిశీలన
ఓసియాన్సాట్ -2 సెప్టెంబర్ 23, 2009 960 కిలోలు PSLV-C14 / OCEANSAT-2 SSPO క్లైమేట్ & ఎన్విరాన్మెంట్, ఎర్త్ అబ్జర్వేషన్
రిసాట్ -2 ఏప్రిల్ 20, 2009 300 కిలోలు పిఎస్‌ఎల్‌వి-సి 12 / రిసాట్ -2 SSPO భూమి పరిశీలన
కార్టోసాట్ - 2 ఎ ఏప్రిల్ 28, 2008 690 కిలోలు PSLV-C9 / CARTOSAT - 2A SSPO భూమి పరిశీలన
IMS-1 ఏప్రిల్ 28, 2008 83 కిలోలు PSLV-C9 / CARTOSAT - 2A SSPO భూమి పరిశీలన
కార్టోసాట్ -2 జనవరి 10, 2007 650 కిలోలు PSLV-C7 / CARTOSAT-2 / SRE-1 SSPO భూమి పరిశీలన
కార్టోసాట్ -1 మే 05, 2005 1560 కిలోలు PSLV-C6 / CARTOSAT-1 / HAMSAT SSPO భూమి పరిశీలన
IRS-P6 / RESOURCESAT-1 అక్టోబర్ 17, 2003 1360 కిలోలు PSLV-C5 / RESOURCESAT-1 SSPO భూమి పరిశీలన
టెక్నాలజీ ప్రయోగం ఉపగ్రహం (TES) అక్టోబర్ 22, 2001 PSLV-C3 / TES SSPO భూమి పరిశీలన
ఓసియాన్సాట్ (IRS-P4) మే 26, 1999 1050 కిలోలు PSLV-C2 / IRS-P4 SSPO భూమి పరిశీలన
IRS-1D సెప్టెంబర్ 29, 1997 1250 కిలోలు పిఎస్‌ఎల్‌వి-సి 1 / ఐఆర్‌ఎస్ -1 డి SSPO భూమి పరిశీలన
IRS-P3 మార్చి 21, 1996 920 కిలోలు పిఎస్‌ఎల్‌వి-డి 3 / ఐఆర్‌ఎస్-పి 3 SSPO భూమి పరిశీలన
IRS-1C డిసెంబర్ 28, 1995 1250 కిలోలు మోల్నియా SSPO భూమి పరిశీలన
IRS-P2 అక్టోబర్ 15, 1994 804 కిలోలు పిఎస్‌ఎల్‌వి-డి 2 SSPO భూమి పరిశీలన
IRS-1E సెప్టెంబర్ 20, 1993 846 కిలోలు పిఎస్‌ఎల్‌వి-డి 1 లియో భూమి పరిశీలన ప్రయోగం విఫలమైంది
IRS-1B ఆగస్టు 29, 1991 975 కిలోలు వోస్టాక్ SSPO భూమి పరిశీలన
SROSS-2 జూలై 13, 1988 150 కిలోలు ASLV-D2 భూమి పరిశీలన, ప్రయోగాత్మక ప్రయోగం విఫలమైంది
IRS-1A మార్చి 17, 1988 975 కిలోలు వోస్టాక్ SSPO భూమి పరిశీలన
రోహిణి శాటిలైట్ ఆర్‌ఎస్-డి 2 ఏప్రిల్ 17, 1983 41.5 కిలోలు ఎస్‌ఎల్‌వి -3 లియో భూమి పరిశీలన
భాస్కర -2 నవంబర్ 20, 1981 444 కిలోలు సి -1 ఇంటర్‌కోస్మోస్ లియో భూమి పరిశీలన, ప్రయోగాత్మక
రోహిణి శాటిలైట్ ఆర్‌ఎస్-డి 1 మే 31, 1981 38 కిలోలు ఎస్‌ఎల్‌వి -3 డి 1 లియో భూమి పరిశీలన
భాస్కర- I. జూన్ 07, 1979 442 కిలోలు సి -1 ఇంటర్‌కోస్మోస్ లియో భూమి పరిశీలన, ప్రయోగాత్మక

మూలాలు

[మార్చు]
  1. Kuznetsov, V.D.; Sinelnikov, V.M.; Alpert, S.N. (June 2015). "Yakov Alpert: Sputnik-1 and the first satellite ionospheric experiment". Advances in Space Research. 55 (12): 2833–2839. Bibcode:2015AdSpR..55.2833K. doi:10.1016/j.asr.2015.02.033.
  2. "James A. Van Allen". nmspacemuseum.org. New Mexico Museum of Space History. Archived from the original on 15 మే 2018. Retrieved 14 May 2018.
  3. "List of Earth Observation Satellites - ISRO". www.isro.gov.in. Archived from the original on 2020-10-25. Retrieved 2020-11-06.