ఇన్శాట్-3D ఉపగ్రహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇన్శాట్-3D ఉపగ్రహం
INSAT-3D.JPG
మిషన్ రకంWeather
నిర్వహించే సంస్థISRO
COSPAR ID2013-038B
SATCAT №39216
అంతరిక్షనౌక లక్షణాలు
ఉపగ్రహ బస్I-2K
తయారీదారుడుISRO Satellite Centre
Space Applications Centre
ప్రారంభ ద్రవ్యరాశి2,000 కిలోగ్రాములు (4,400 పౌ.)
మిషన్ ప్రారంభం
ప్రారంభ తేదీ25 July 2013, 19:54:07 (2013-07-25UTC19:54:07Z) UTC
రాకెట్Ariane 5ECA
ప్రారంభించిన స్థలంKourou ELA-3
ContractorArianespace
ఆర్బిటాల్ పరామితులు
నిర్దేశ వ్యవస్థGeocentric
RegimeGeostationary
Longitude82° East
Perigee35,791 కిలోమీటర్లు (22,239 మై.)
Apogee35,795 కిలోమీటర్లు (22,242 మై.)
Inclination0.08 degrees
Period23.93 hours
Epoch7 November 2013, 23:50:57 UTC[1]
Transponders
BandC-band[citation needed]

ఇన్శాట్-3D ఉపగ్రహంను ఇండియన్ స్పేస్‌ రీసెర్చ్‌అర్గనైజేసన్ (ఇస్రో) వారు రూపొందించారు. ఈ ఉపగ్రహన్ని అంతరిక్షసంబంధ, వాతావరణపరిశీలన, డేటారిలే, శాటిలైట్ ఆధారిత అన్వేషణ, రక్షించు వంటి ప్రణాళికలతో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఈఉపగ్రహాన్ని దక్షిణ అమెరికాలోని ఫ్రెంచి గయానాలోని అంతరిక్ష పరిశోధనకేంద్రం నుండి అంతరిక్షములో ప్రవేశ పెట్టారు.ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షము లోని కక్ష్యలో ప్రవేశపెట్టుటకై ఏరియన్ 5 ECA అను ఉపగ్రహ ప్రయోగ/వాహననౌకను ఉపయోగించారు.ఇన్శాట్-3D ఉపగ్రహాన్ని 2013 జూలై 26 న విజయవంతంగా అంతరిక్షములోకి పంపి, కక్ష్యలో ప్రవేశపెట్టారు[2][3].

ఇన్శాట్-3D ఉపగ్రహ సాంకేతిక వివరాలు[మార్చు]

ఇన్శాట్-3D ఉపగ్రహంలో పలు నూతన సాంకేతికపరిజ్ఞానంతో తయారుచేసిన ఉపకరణాలను బిగించారు. స్టార్ సెన్సారులవంటి నుటన అవిష్కారలను అమర్చారు.ఉపగ్రహ ఇబ్బందులను తగ్గించుటకై సూక్ష్మసౌర అమరిక డ్రైవ్‌అసెంబ్లీని (micro stepping Solar Array Drive Assembly: (SADA, ఉపగ్రహనిర్వహణ, టెలికాం, టెలిమెట్రి నిర్వహణకు బస్‌మేనేజిమెంట్ యూనిట్ ను నెలకొల్పినారు.C-బ్యాండ్ ట్రాన్స్‌పాండరును ఉంది.

ఉపగ్రహంలోని పేలోడ్[మార్చు]

ఉపగ్రహంలో 3 పేలోడులను అమర్చారు.

  • మేటియోలాజికల్ పరికారాలు (MET)
  • డేటారిలే ట్రాన్స్‌పాండరులు (DRT)
  • శాటిలైట్ ఎయిడెడ్‌ సెర్చ్ అండ్ రెస్కు (SAS&R) సిస్టం

ఉపగ్రహ ప్రయోగం[మార్చు]

మొదట ఇన్శాట్-3D ఉపగ్రహాన్ని జీస్ఎల్‌వి శ్రేణికి చెందిన జీస్‌ఎల్‌వి Mk-II ఉపగ్రహ వాహకనౌక ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెట్టాలనుకొన్నారు. తరువాత అభిప్రాయాన్ని మార్చుకొని, ఇస్రో చైర్మన్ ఉపగ్రహాన్ని గయానా నుండి, ఏరియన్ 5 ECAవాహక నౌక ద్వారా ప్రయోగించాలని నిర్ణయించినట్లు 2010 డిసెంబరు 4 న ప్రకటించాడు. ఇన్శాట్-3D ఉపగ్రహాన్ని26, జూలై, 2013న ఫ్రెంచి గయానా నుండి అంతరిక్షములోకి పంపి, నిర్దేశించినకక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఏరియన్ 5 ECA వాహకనౌక ద్వారా ఇన్శాట్-3D ఉపగ్రహంతో పాటు అల్ఫాశాట్ అనే టెలికమ్యునికేసన్ ఉపగ్రహాన్ని కూడా ఏకకాలంలో అంతరిక్షంలో ప్రవేశపెట్టారు[4][5].

మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. Peat, Chris (7 November 2013). "INSAT 3D - Orbit". Heavens Above. Retrieved 9 November 2013.
  2. "Weather satellite INSAT-3D launched successfully". The Hindu. Retrieved 26 July 2013.
  3. "Advanced weather satellite INSAT-3D successfully launched". The Times of India. Archived from the original on 2013-07-28. Retrieved 26 July 2013.
  4. "Flawless launch of Alphasat, Europe's largest and most sophisticated telecom satellite". www.esa.in. Retrieved 25 July 2013.
  5. "Europe's Largest-Ever Telecommunications Satellite Launches With Indian Weather Probe". www.space.com. Retrieved 26 July 2013.